Surah 'Abasa in Telugu: translation and audio
Surah 80 · عبس · He Frowned · 42 verses
Surah 'Abasa verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah 'Abasa word by word in English.
Verse 1
عَبَسَ وَتَوَلَّىٰٓ
Transliteration ʿabasa watawallā
Telugu అతను (ప్రవక్త) భృకుటి ముడి వేసుకున్నాడు మరియు ముఖం త్రిప్పుకున్నాడు;
Verse 2
أَن جَآءَهُ ٱلْأَعْمَىٰ
Transliteration an jāahu l-aʿmā
Telugu ఆ గ్రుడ్డివాడు తన వద్దకు వచ్చాడని!
Verse 3
وَمَا يُدْرِيكَ لَعَلَّهُۥ يَزَّكَّىٰٓ
Transliteration wamā yud'rīka laʿallahu yazzakkā
Telugu కాని నీకేం తెలుసు? బహుశా అతడు తనను తాను సంస్కరించుకోవచ్చు!
Verse 4
أَوْ يَذَّكَّرُ فَتَنفَعَهُ ٱلذِّكْرَىٰٓ
Transliteration aw yadhakkaru fatanfaʿahu l-dhik'rā
Telugu లేదా అతడు హితబోధ పొందవచ్చు మరియు ఆ హితబోధ అతనికి ప్రయోజనకరం కావచ్చు!
Verse 5
أَمَّا مَنِ ٱسْتَغْنَىٰ
Transliteration ammā mani is'taghnā
Telugu కాని అతడు, ఎవడైతే తనను తాను స్వయం సమృద్ధుడు, అనుకుంటున్నాడో!
Verse 6
فَأَنتَ لَهُۥ تَصَدَّىٰ
Transliteration fa-anta lahu taṣaddā
Telugu అతని పట్ల నీవు ఆసక్తి చూపుతున్నావు.
Verse 7
وَمَا عَلَيْكَ أَلَّا يَزَّكَّىٰ
Transliteration wamā ʿalayka allā yazzakkā
Telugu ఒకవేళ అతడు సంస్కరించుకోక పోతే నీపై బాధ్యత ఏముంది?
Verse 8
وَأَمَّا مَن جَآءَكَ يَسْعَىٰ
Transliteration wa-ammā man jāaka yasʿā
Telugu కాని, ఎవడైతే తనంతట తాను, నీ వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడో!
Verse 9
وَهُوَ يَخْشَىٰ
Transliteration wahuwa yakhshā
Telugu మరియు (అల్లాహ్ యెడల) భీతిపరుడై ఉన్నాడో!
Verse 10
فَأَنتَ عَنْهُ تَلَهَّىٰ
Transliteration fa-anta ʿanhu talahhā
Telugu అతనిని నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు.
Verse 11
كَلَّآ إِنَّهَا تَذْكِرَةٌ
Transliteration kallā innahā tadhkiratun
Telugu అలా కాదు! నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) ఒక హితోపదేశం.
Verse 12
فَمَن شَآءَ ذَكَرَهُۥ
Transliteration faman shāa dhakarahu
Telugu కావున ఇష్టమున్నవారు దీనిని స్వీకరించవచ్చు!
Verse 13
فِى صُحُفٍ مُّكَرَّمَةٍ
Transliteration fī ṣuḥufin mukarramatin
Telugu ఇది ప్రతిష్ఠాకరమైన పుటలలో (వ్రాయబడి ఉన్నది);
Verse 14
مَّرْفُوعَةٍ مُّطَهَّرَةٍۭ
Transliteration marfūʿatin muṭahharatin
Telugu మహోన్నతమైనది, పవిత్రమైనది;
Verse 15
بِأَيْدِى سَفَرَةٍ
Transliteration bi-aydī safaratin
Telugu లేఖకుల (దేవదూతల) చేతులలో;
Verse 16
كِرَامٍۭ بَرَرَةٍ
Transliteration kirāmin bararatin
Telugu వారు గౌరవనీయులైన సత్పురుషులు (ఆజ్ఞానువర్తనులు).
Verse 17
قُتِلَ ٱلْإِنسَـٰنُ مَآ أَكْفَرَهُۥ
Transliteration qutila l-insānu mā akfarahu
Telugu మానవుడు నాశనం గాను! అతడు ఎంత కృతఘ్నుడు!
Verse 18
مِنْ أَىِّ شَىْءٍ خَلَقَهُۥ
Transliteration min ayyi shayin khalaqahu
Telugu ఆయన (అల్లాహ్) దేనితో అతనిని సృష్టించాడు?
Verse 19
مِن نُّطْفَةٍ خَلَقَهُۥ فَقَدَّرَهُۥ
Transliteration min nuṭ'fatin khalaqahu faqaddarahu
Telugu అతనిని వీర్యబిందువుతో సృష్టించాడు తరువాత అతనిని తగిన విధంగా తీర్చిదిద్దాడు.
Verse 20
ثُمَّ ٱلسَّبِيلَ يَسَّرَهُۥ
Transliteration thumma l-sabīla yassarahu
Telugu ఆ తరువాత, అతని మార్గాన్ని అతనికి సులభతరం చేశాడు;
Verse 21
ثُمَّ أَمَاتَهُۥ فَأَقْبَرَهُۥ
Transliteration thumma amātahu fa-aqbarahu
Telugu ఆపైన అతనిని మరణింపజేసి గోరీ లోకి చేర్చాడు;
Verse 22
ثُمَّ إِذَا شَآءَ أَنشَرَهُۥ
Transliteration thumma idhā shāa ansharahu
Telugu మళ్ళీ ఆయన (అల్లాహ్) కోరినప్పుడు అతనిని తిరిగి బ్రతికించి లేపాడు.
Verse 23
كَلَّا لَمَّا يَقْضِ مَآ أَمَرَهُۥ
Transliteration kallā lammā yaqḍi mā amarahu
Telugu అలా కాదు, ఆయన (అల్లాహ్) ఆదేశించిన దానిని (మానవుడు) నెరవేర్చలేదు.
Verse 24
فَلْيَنظُرِ ٱلْإِنسَـٰنُ إِلَىٰ طَعَامِهِۦٓ
Transliteration falyanẓuri l-insānu ilā ṭaʿāmihi
Telugu ఇక, మానవుడు తన ఆహారాన్ని గమనించాలి!
Verse 25
أَنَّا صَبَبْنَا ٱلْمَآءَ صَبًّا
Transliteration annā ṣababnā l-māa ṣabban
Telugu నిశ్చయంగా మేము నీటిని (వర్షాన్ని) ఎంత పుష్కలంగా కురిపించాము.
Verse 26
ثُمَّ شَقَقْنَا ٱلْأَرْضَ شَقًّا
Transliteration thumma shaqaqnā l-arḍa shaqqan
Telugu ఆ తరువాత భూమిని (మొలిచే మొక్కలతో) చీల్చాము, ఒక అద్భుతమైన చీల్పుతో!
Verse 27
فَأَنۢبَتْنَا فِيهَا حَبًّا
Transliteration fa-anbatnā fīhā ḥabban
Telugu తరువాత దానిలో ధాన్యాన్ని పెంచాము;
Verse 28
وَعِنَبًا وَقَضْبًا
Transliteration waʿinaban waqaḍban
Telugu మరియు ద్రాక్షలను మరియు కూరగాయలను;
Verse 29
وَزَيْتُونًا وَنَخْلًا
Transliteration wazaytūnan wanakhlan
Telugu మరియు ఆలివ్ (జైతూన్) మరియు ఖర్జూరపు చెట్లను;
Verse 30
وَحَدَآئِقَ غُلْبًا
Transliteration waḥadāiqa ghul'ban
Telugu మరియు దట్టమైన తోటలను;
Verse 31
وَفَـٰكِهَةً وَأَبًّا
Transliteration wafākihatan wa-abban
Telugu మరియు (రకరకాల) పండ్లను మరియు పచ్చికలను;
Verse 32
مَّتَـٰعًا لَّكُمْ وَلِأَنْعَـٰمِكُمْ
Transliteration matāʿan lakum wali-anʿāmikum
Telugu మీకు మరియు మీ పశువులకు జీవన సామగ్రిగా!
Verse 33
فَإِذَا جَآءَتِ ٱلصَّآخَّةُ
Transliteration fa-idhā jāati l-ṣākhatu
Telugu ఎప్పుడైతే, చెవులను చెవిటిగా చేసే ఆ గొప్ప ధ్వని వస్తుందో!
Verse 34
يَوْمَ يَفِرُّ ٱلْمَرْءُ مِنْ أَخِيهِ
Transliteration yawma yafirru l-maru min akhīhi
Telugu ఆ రోజు, మానవుడు తన సోదరుని నుండి దూరంగా పారిపోతాడు;
Verse 35
وَأُمِّهِۦ وَأَبِيهِ
Transliteration wa-ummihi wa-abīhi
Telugu మరియు తన తల్లి నుండి మరియు తండ్రి నుండి;
Verse 36
وَصَـٰحِبَتِهِۦ وَبَنِيهِ
Transliteration waṣāḥibatihi wabanīhi
Telugu మరియు తన భార్య (సాహిబతి) నుండి మరియు తన సంతానం నుండి;
Verse 37
لِكُلِّ ٱمْرِئٍ مِّنْهُمْ يَوْمَئِذٍ شَأْنٌ يُغْنِيهِ
Transliteration likulli im'ri-in min'hum yawma-idhin shanun yugh'nīhi
Telugu ఆ రోజు వారిలో ప్రతి మానవునికి తనను గురించి మాత్రమే చాలినంత చింత ఉంటుంది.
Verse 38
وُجُوهٌ يَوْمَئِذٍ مُّسْفِرَةٌ
Transliteration wujūhun yawma-idhin mus'firatun
Telugu ఆ రోజు కొన్ని ముఖాలు ఆనందంతో ప్రకాశిస్తూ ఉంటాయి;
Verse 39
ضَاحِكَةٌ مُّسْتَبْشِرَةٌ
Transliteration ḍāḥikatun mus'tabshiratun
Telugu అవి చిరునవ్వులతో ఆనందోత్సాహాలతో కళకళలాడుతుంటాయి.
Verse 40
وَوُجُوهٌ يَوْمَئِذٍ عَلَيْهَا غَبَرَةٌ
Transliteration wawujūhun yawma-idhin ʿalayhā ghabaratun
Telugu మరికొన్ని ముఖాలు ఆ రోజు, దుమ్ము కొట్టుకొని (ఎంతో వ్యాకులంతో) నిండి ఉంటాయి.
Verse 41
تَرْهَقُهَا قَتَرَةٌ
Transliteration tarhaquhā qataratun
Telugu అవి నల్లగా మాడిపోయి ఉంటాయి;
Verse 42
أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْكَفَرَةُ ٱلْفَجَرَةُ
Transliteration ulāika humu l-kafaratu l-fajaratu
Telugu అలాంటి వారు, వారే! సత్యతిరస్కారులైన దుష్టులు.
Read Surah 'Abasa in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Gujarati
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Telugu: the Qur’an in Telugu.
Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.