MyDugsiStart learning

Surah At-Tariq in Telugu: translation and audio

Surah 86 · الطارق · The Nightcommer · 17 verses

Surah At-Tariq verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah At-Tariq word by word in English.

Verse 1

وَٱلسَّمَآءِ وَٱلطَّارِقِ

Transliteration wal-samāi wal-ṭāriqi

Telugu ఆకాశం మరియు రాత్రివేళ వచ్చే నక్షత్రం (అత్ తారిఖ్) సాక్షిగా!

Verse 2

وَمَآ أَدْرَىٰكَ مَا ٱلطَّارِقُ

Transliteration wamā adrāka mā l-ṭāriqu

Telugu రాత్రి వేళ వచ్చేది (అత్ తారిఖ్) అంటే ఏమిటో నీకు ఎలా తెలుస్తుంది?

Verse 3

ٱلنَّجْمُ ٱلثَّاقِبُ

Transliteration al-najmu l-thāqibu

Telugu అదొక అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం.

Verse 4

إِن كُلُّ نَفْسٍ لَّمَّا عَلَيْهَا حَافِظٌ

Transliteration in kullu nafsin lammā ʿalayhā ḥāfiẓun

Telugu కనిపెట్టుకొని ఉండేవాడు (దేవదూత) లేకుండా ఏ వ్యక్తి కూడా లేడు.

Verse 5

فَلْيَنظُرِ ٱلْإِنسَـٰنُ مِمَّ خُلِقَ

Transliteration falyanẓuri l-insānu mimma khuliqa

Telugu కావున మానవుడు తాను దేనితో సృష్టించబడ్డాడో గమనించాలి!

Verse 6

خُلِقَ مِن مَّآءٍ دَافِقٍ

Transliteration khuliqa min māin dāfiqin

Telugu అతడు విసర్జించబడే (చిమ్ముకుంటూ వెలువడే) ద్రవపదార్థంతో సృష్టించబడ్డాడు.

Verse 7

يَخْرُجُ مِنۢ بَيْنِ ٱلصُّلْبِ وَٱلتَّرَآئِبِ

Transliteration yakhruju min bayni l-ṣul'bi wal-tarāibi

Telugu అది వెన్ను మరియు రొమ్ము ఎముకల మధ్యభాగం నుండి బయటికి వస్తుంది.

Verse 8

إِنَّهُۥ عَلَىٰ رَجْعِهِۦ لَقَادِرٌ

Transliteration innahu ʿalā rajʿihi laqādirun

Telugu నిశ్చయంగా, ఆయన (సృష్టికర్త), అతనిని మరల బ్రతికించి తేగల సామర్థ్యం గలవాడు!

Verse 9

يَوْمَ تُبْلَى ٱلسَّرَآئِرُ

Transliteration yawma tub'lā l-sarāiru

Telugu ఏ రోజయితే రహస్య విషయాల విచారణ జరుగుతుందో!

Verse 10

فَمَا لَهُۥ مِن قُوَّةٍ وَلَا نَاصِرٍ

Transliteration famā lahu min quwwatin walā nāṣirin

Telugu అప్పుడు అతనికి (మానవునికి) ఎలాంటి శక్తి ఉండదు మరియు ఏ సహాయకుడునూ ఉండడు.

Verse 11

وَٱلسَّمَآءِ ذَاتِ ٱلرَّجْعِ

Transliteration wal-samāi dhāti l-rajʿi

Telugu వర్షం కురిపించే ఆకాశం సాక్షిగా!

Verse 12

وَٱلْأَرْضِ ذَاتِ ٱلصَّدْعِ

Transliteration wal-arḍi dhāti l-ṣadʿi

Telugu (చెట్లు మొలకెత్తేటప్పుడు) చీలి పోయే భూమి సాక్షిగా!

Verse 13

إِنَّهُۥ لَقَوْلٌ فَصْلٌ

Transliteration innahu laqawlun faṣlun

Telugu నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్, సత్యాసత్యాలను) వేరు పరచే వాక్కు (గీటురాయి).

Verse 14

وَمَا هُوَ بِٱلْهَزْلِ

Transliteration wamā huwa bil-hazli

Telugu మరియు ఇది వృథా కాలక్షేపానికి వచ్చినది కాదు.

Verse 15

إِنَّهُمْ يَكِيدُونَ كَيْدًا

Transliteration innahum yakīdūna kaydan

Telugu (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, వారు (నీకు విరుద్ధంగా) కుట్రపన్నుతున్నారు.

Verse 16

وَأَكِيدُ كَيْدًا

Transliteration wa-akīdu kaydan

Telugu మరియు నేను కూడా పన్నాగం పన్నుతున్నాను.

Verse 17

فَمَهِّلِ ٱلْكَـٰفِرِينَ أَمْهِلْهُمْ رُوَيْدًۢا

Transliteration famahhili l-kāfirīna amhil'hum ruwaydan

Telugu కనుక నీవు సత్యతిరస్కారులకు కొంత వ్యవధి నివ్వు! వారి పట్ల మృదువుగా వ్యవహరించు.

Read Surah At-Tariq in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.