MyDugsiStart learning

Surah Al-Muddaththir in Telugu: translation and audio

Surah 74 · المدثر · The Cloaked One · 56 verses

Surah Al-Muddaththir verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Al-Muddaththir word by word in English.

Verse 1

يَـٰٓأَيُّهَا ٱلْمُدَّثِّرُ

Transliteration yāayyuhā l-mudathiru

Telugu ఓ దుప్పటిలో చుట్టుకున్నవాడా!

Verse 2

قُمْ فَأَنذِرْ

Transliteration qum fa-andhir

Telugu లే! ఇక హెచ్చరించు!

Verse 3

وَرَبَّكَ فَكَبِّرْ

Transliteration warabbaka fakabbir

Telugu మరియు మీ ప్రభువు గొప్పతనాన్ని (ఘనతను) కొనియాడు (చాటి చెప్పు)!

Verse 4

وَثِيَابَكَ فَطَهِّرْ

Transliteration wathiyābaka faṭahhir

Telugu మరియు నీ వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకో!

Verse 5

وَٱلرُّجْزَ فَٱهْجُرْ

Transliteration wal-ruj'za fa-uh'jur

Telugu మరియు మాలిన్యానికి దూరంగా ఉండు!

Verse 6

وَلَا تَمْنُن تَسْتَكْثِرُ

Transliteration walā tamnun tastakthiru

Telugu మరియు ఎక్కువ పొందాలనే ఆశతో ఇవ్వకు (ఉపకారం చేయకు)!

Verse 7

وَلِرَبِّكَ فَٱصْبِرْ

Transliteration walirabbika fa-iṣ'bir

Telugu మరియు నీ ప్రభువు కొరకు సహనం వహించు!

Verse 8

فَإِذَا نُقِرَ فِى ٱلنَّاقُورِ

Transliteration fa-idhā nuqira fī l-nāqūri

Telugu మరియు బాకా (నాఖూర్) ఊదబడినప్పుడు;

Verse 9

فَذَٰلِكَ يَوْمَئِذٍ يَوْمٌ عَسِيرٌ

Transliteration fadhālika yawma-idhin yawmun ʿasīrun

Telugu ఆ దినం చాలా కఠినమైన దినమై ఉంటుంది;

Verse 10

عَلَى ٱلْكَـٰفِرِينَ غَيْرُ يَسِيرٍ

Transliteration ʿalā l-kāfirīna ghayru yasīrin

Telugu సత్యతిరస్కారులకు అది సులభమైన (దినం) కాదు.

Verse 11

ذَرْنِى وَمَنْ خَلَقْتُ وَحِيدًا

Transliteration dharnī waman khalaqtu waḥīdan

Telugu వదలండి! నన్నూ మరియు నేను ఒంటరిగా పుట్టించిన వానినీ!

Verse 12

وَجَعَلْتُ لَهُۥ مَالًا مَّمْدُودًا

Transliteration wajaʿaltu lahu mālan mamdūdan

Telugu మరియు నేను అతనికి పుష్కలంగా సంపదనిచ్చాను.

Verse 13

وَبَنِينَ شُهُودًا

Transliteration wabanīna shuhūdan

Telugu మరియు అతనికి తోడుగా ఉండే కుమారులను!

Verse 14

وَمَهَّدتُّ لَهُۥ تَمْهِيدًا

Transliteration wamahhadttu lahu tamhīdan

Telugu మరియు అతను కొరకు అతని జీవన సౌకర్యాలను సులభం చేశాను.

Verse 15

ثُمَّ يَطْمَعُ أَنْ أَزِيدَ

Transliteration thumma yaṭmaʿu an azīda

Telugu అయినా నేను అతనికి ఇంకా ఇవ్వాలని అతడు ఆశిస్తూ ఉంటాడు.

Verse 16

كَلَّآ ۖ إِنَّهُۥ كَانَ لِـَٔايَـٰتِنَا عَنِيدًا

Transliteration kallā innahu kāna liāyātinā ʿanīdan

Telugu అలా కాదు! వాస్తవానికి అతడు మా (అల్లాహ్) సూచనల (ఆయాత్ ల) పట్ల విరోధం కలిగి వున్నాడు.

Verse 17

سَأُرْهِقُهُۥ صَعُودًا

Transliteration sa-ur'hiquhu ṣaʿūdan

Telugu నేను త్వరలోనే అతనిని దుర్గమమైన స్థానానికి (శిక్షకు) నెట్టుతాను!

Verse 18

إِنَّهُۥ فَكَّرَ وَقَدَّرَ

Transliteration innahu fakkara waqaddara

Telugu వాస్తవానికి, అతడు ఆలోచించాడు మరియు మనస్సులో ప్రణాళిక చేసుకున్నాడు.

Verse 19

فَقُتِلَ كَيْفَ قَدَّرَ

Transliteration faqutila kayfa qaddara

Telugu కావున (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు నాశనానికి గురి కానివ్వండి!

Verse 20

ثُمَّ قُتِلَ كَيْفَ قَدَّرَ

Transliteration thumma qutila kayfa qaddara

Telugu అవును (అతనిని) తాను ప్రణాళిక చేసుకున్నట్లు, నాశనానికి గురి కానివ్వండి!

Verse 21

ثُمَّ نَظَرَ

Transliteration thumma naẓara

Telugu అప్పుడు అతడు ఆలోచించాడు.

Verse 22

ثُمَّ عَبَسَ وَبَسَرَ

Transliteration thumma ʿabasa wabasara

Telugu తరువాత అతడు నుదరు చిట్లించుకున్నాడు మరియు కోపంతో చూశాడు (ముఖం మాడ్చుకున్నాడు);

Verse 23

ثُمَّ أَدْبَرَ وَٱسْتَكْبَرَ

Transliteration thumma adbara wa-is'takbara

Telugu తరువాత అతడు వెనుకకు మరలి దురహంకారం చూపాడు.

Verse 24

فَقَالَ إِنْ هَـٰذَآ إِلَّا سِحْرٌ يُؤْثَرُ

Transliteration faqāla in hādhā illā siḥ'run yu'tharu

Telugu అప్పుడు అతడు ఇలా అన్నాడు: "ఇది పూర్వ నుండి వస్తూ వున్న ఒక మంత్రజాలం మాత్రమే!

Verse 25

إِنْ هَـٰذَآ إِلَّا قَوْلُ ٱلْبَشَرِ

Transliteration in hādhā illā qawlu l-bashari

Telugu ఇది కేవలం ఒక మానవ హక్కు మాత్రమే

Verse 26

سَأُصْلِيهِ سَقَرَ

Transliteration sa-uṣ'līhi saqara

Telugu త్వరలోనే నేను అతనిని నరకాగ్నిలో కాల్చుతాను.

Verse 27

وَمَآ أَدْرَىٰكَ مَا سَقَرُ

Transliteration wamā adrāka mā saqaru

Telugu మరియు ఆ నరకాగ్ని అంటే నీవు ఏమనుకుంటున్నావు?

Verse 28

لَا تُبْقِى وَلَا تَذَرُ

Transliteration lā tub'qī walā tadharu

Telugu అది (ఎవరినీ) మిగల్చదు మరియు వదలి పెట్టదు.

Verse 29

لَوَّاحَةٌ لِّلْبَشَرِ

Transliteration lawwāḥatun lil'bashari

Telugu అది మానవుణ్ణి (అతడి చర్మాన్నిదహించి వేస్తుంది.

Verse 30

عَلَيْهَا تِسْعَةَ عَشَرَ

Transliteration ʿalayhā tis'ʿata ʿashara

Telugu దానిపై పందొమ్మిది (దేవదూతలు నియమించబడి) ఉన్నారు.

Verse 31

وَمَا جَعَلْنَآ أَصْحَـٰبَ ٱلنَّارِ إِلَّا مَلَـٰٓئِكَةً ۙ وَمَا جَعَلْنَا عِدَّتَهُمْ إِلَّا فِتْنَةً لِّلَّذِينَ كَفَرُوا۟ لِيَسْتَيْقِنَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَـٰبَ وَيَزْدَادَ ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِيمَـٰنًا ۙ وَلَا يَرْتَابَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَـٰبَ وَٱلْمُؤْمِنُونَ ۙ وَلِيَقُولَ ٱلَّذِينَ فِى قُلُوبِهِم مَّرَضٌ وَٱلْكَـٰفِرُونَ مَاذَآ أَرَادَ ٱللَّهُ بِهَـٰذَا مَثَلًا ۚ كَذَٰلِكَ يُضِلُّ ٱللَّهُ مَن يَشَآءُ وَيَهْدِى مَن يَشَآءُ ۚ وَمَا يَعْلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَ ۚ وَمَا هِىَ إِلَّا ذِكْرَىٰ لِلْبَشَرِ

Transliteration wamā jaʿalnā aṣḥāba l-nāri illā malāikatan wamā jaʿalnā ʿiddatahum illā fit'natan lilladhīna kafarū liyastayqina alladhīna ūtū l-kitāba wayazdāda alladhīna āmanū īmānan walā yartāba alladhīna ūtū l-kitāba wal-mu'minūna waliyaqūla alladhīna fī qulūbihim maraḍun wal-kāfirūna mādhā arāda l-lahu bihādhā mathalan kadhālika yuḍillu l-lahu man yashāu wayahdī man yashāu wamā yaʿlamu junūda rabbika illā huwa wamā hiya illā dhik'rā lil'bashari

Telugu మరియు మేము దేవదూతలను మాత్రమే నరకానికి రక్షకులుగా నియమించాము. మరియు మేము వారి సంఖ్యను (పందొమ్మిదిని), సత్యతిరస్కారులకు ఒక పరీక్షగా, గ్రంథ ప్రజలకు నమ్మకం కలగటానికి, విశ్వాసుల విశ్వాసాన్ని అధికం చేయటానికి మరియు గ్రంథ ప్రజలు మరియు విశ్వాసులు సందేహంలో పడకుండా ఉండటానికి మరియు తమ హృదయాలలో రోగమున్న వారు మరియు సత్యతిరస్కారులు: "ఈ ఉపమానం ఇవ్వటంలో అల్లాహ్ ఉద్దేశమేమిటి?" అని పలుకటానికి! ఈ విధంగా అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదలుతాడు. మరియు తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు నీ ప్రభూవు సైన్యాలను ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు ఇదంతా మానవునికి ఒక జ్ఞాపిక మాత్రమే.

Verse 32

كَلَّا وَٱلْقَمَرِ

Transliteration kallā wal-qamari

Telugu అలా కాదు! చంద్రుని సాక్షిగా!

Verse 33

وَٱلَّيْلِ إِذْ أَدْبَرَ

Transliteration wa-al-layli idh adbara

Telugu గడిచిపోయే రాత్రి సాక్షిగా!

Verse 34

وَٱلصُّبْحِ إِذَآ أَسْفَرَ

Transliteration wal-ṣub'ḥi idhā asfara

Telugu ప్రకాశించే, ఉదయం సాక్షిగా!

Verse 35

إِنَّهَا لَإِحْدَى ٱلْكُبَرِ

Transliteration innahā la-iḥ'dā l-kubari

Telugu నిశ్చయంగా, ఇది (ఈ నరకాగ్ని ప్రస్తావన) ఒక గొప్ప విషయం.

Verse 36

نَذِيرًا لِّلْبَشَرِ

Transliteration nadhīran lil'bashari

Telugu మానవునికి ఒక హెచ్చరిక;

Verse 37

لِمَن شَآءَ مِنكُمْ أَن يَتَقَدَّمَ أَوْ يَتَأَخَّرَ

Transliteration liman shāa minkum an yataqaddama aw yata-akhara

Telugu మీలో ముందుకు రావాలని కోరుకునే వానికి లేదా వెనుక ఉండి పోయేవానికి;

Verse 38

كُلُّ نَفْسٍۭ بِمَا كَسَبَتْ رَهِينَةٌ

Transliteration kullu nafsin bimā kasabat rahīnatun

Telugu ప్రతి మానవుడు తాను చేసిన కర్మలకు తాకట్టుగా ఉంటాడు.

Verse 39

إِلَّآ أَصْحَـٰبَ ٱلْيَمِينِ

Transliteration illā aṣḥāba l-yamīni

Telugu కుడిపక్షం వారు తప్ప!

Verse 40

فِى جَنَّـٰتٍ يَتَسَآءَلُونَ

Transliteration fī jannātin yatasāalūna

Telugu వారు స్వర్గాలలో ఉంటూ ఒకరినొకరు ఇలా ప్రశ్నించుకుంటారు!

Verse 41

عَنِ ٱلْمُجْرِمِينَ

Transliteration ʿani l-muj'rimīna

Telugu అపరాధులను గురించి (మరియు వారితో అంటారు):

Verse 42

مَا سَلَكَكُمْ فِى سَقَرَ

Transliteration mā salakakum fī saqara

Telugu "మిమ్మల్ని ఏ విషయం నరకంలోకి ప్రవేశింపజేసింది?"

Verse 43

قَالُوا۟ لَمْ نَكُ مِنَ ٱلْمُصَلِّينَ

Transliteration qālū lam naku mina l-muṣalīna

Telugu వారు (నరకవాసులు) ఇలా జవాబిస్తారు: "మేము నమాజ్ చేసే వాళ్ళం కాము.

Verse 44

وَلَمْ نَكُ نُطْعِمُ ٱلْمِسْكِينَ

Transliteration walam naku nuṭ'ʿimu l-mis'kīna

Telugu మరియు నిరుపేదలకు ఆహారం పెట్టేవాళ్ళం కాము;

Verse 45

وَكُنَّا نَخُوضُ مَعَ ٱلْخَآئِضِينَ

Transliteration wakunnā nakhūḍu maʿa l-khāiḍīna

Telugu మరియు వృథా కాలక్షేపం చేసే వారితో కలిసి వ్యర్థ ప్రలాపాలు (ప్రసంగాలు) చేస్తూ ఉండే వాళ్ళము;

Verse 46

وَكُنَّا نُكَذِّبُ بِيَوْمِ ٱلدِّينِ

Transliteration wakunnā nukadhibu biyawmi l-dīni

Telugu మరియు తీర్పుదినాన్ని అబద్ధమని నిరాకరిస్తూ ఉండేవాళ్ళము;

Verse 47

حَتَّىٰٓ أَتَىٰنَا ٱلْيَقِينُ

Transliteration ḥattā atānā l-yaqīnu

Telugu చివరకు ఆ అనివార్యమైన ఘడియ మాపై వచ్చి పడింది.

Verse 48

فَمَا تَنفَعُهُمْ شَفَـٰعَةُ ٱلشَّـٰفِعِينَ

Transliteration famā tanfaʿuhum shafāʿatu l-shāfiʿīna

Telugu అప్పుడు సిఫారసు చేసేవారి సిఫారసు వారికి ఏ మాత్రం ఉపయోగపడదు.

Verse 49

فَمَا لَهُمْ عَنِ ٱلتَّذْكِرَةِ مُعْرِضِينَ

Transliteration famā lahum ʿani l-tadhkirati muʿ'riḍīna

Telugu అయితే, వారికేమయింది? ఈ హితోపదేశం నుండి వారెందుకు ముఖం త్రిప్పుకుంటున్నారు.

Verse 50

كَأَنَّهُمْ حُمُرٌ مُّسْتَنفِرَةٌ

Transliteration ka-annahum ḥumurun mus'tanfiratun

Telugu వారి స్థితి బెదిరిన అడవి గాడిదల మాదిరిగా ఉంది;

Verse 51

فَرَّتْ مِن قَسْوَرَةٍۭ

Transliteration farrat min qaswaratin

Telugu సింహం నుండి పారిపోయే (గాడిదల మాదిరిగా)!

Verse 52

بَلْ يُرِيدُ كُلُّ ٱمْرِئٍ مِّنْهُمْ أَن يُؤْتَىٰ صُحُفًا مُّنَشَّرَةً

Transliteration bal yurīdu kullu im'ri-in min'hum an yu'tā ṣuḥufan munasharatan

Telugu అలా కాదు! వారిలో ప్రతి ఒక్క వ్యక్తి తనకు విప్పబడిన గ్రంథాలు ఇవ్వబడాలని కోరుతున్నాడు.

Verse 53

كَلَّا ۖ بَل لَّا يَخَافُونَ ٱلْـَٔاخِرَةَ

Transliteration kallā bal lā yakhāfūna l-ākhirata

Telugu కాదు! కాదు! అసలు వారు పరలోక జీవితం గురించి భయపడటం లేదు.

Verse 54

كَلَّآ إِنَّهُۥ تَذْكِرَةٌ

Transliteration kallā innahu tadhkiratun

Telugu అలా కాదు! నిశ్చయంగా, ఇది ఒక హితోపదేశం.

Verse 55

فَمَن شَآءَ ذَكَرَهُۥ

Transliteration faman shāa dhakarahu

Telugu కావున కోరినవాడు దీని నుండి హితబోధ గ్రహించవచ్చు.

Verse 56

وَمَا يَذْكُرُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ ۚ هُوَ أَهْلُ ٱلتَّقْوَىٰ وَأَهْلُ ٱلْمَغْفِرَةِ

Transliteration wamā yadhkurūna illā an yashāa l-lahu huwa ahlu l-taqwā wa-ahlu l-maghfirati

Telugu కాని అల్లాహ్ కోరితే తప్ప! వీరు దీని నుండి హితబోధ గ్రహించలేరు. ఆయనే (అల్లాహ్ యే) భయభక్తులకు అర్హుడు మరియు ఆయనే క్షమించే అర్హత గలవాడు.

Read Surah Al-Muddaththir in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.