MyDugsiStart learning

Surah Al-Layl in Telugu: translation and audio

Surah 92 · الليل · The Night · 21 verses

Surah Al-Layl verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Al-Layl word by word in English.

Verse 1

وَٱلَّيْلِ إِذَا يَغْشَىٰ

Transliteration wa-al-layli idhā yaghshā

Telugu క్రమ్ముకునే రాత్రి సాక్షిగా!

Verse 2

وَٱلنَّهَارِ إِذَا تَجَلَّىٰ

Transliteration wal-nahāri idhā tajallā

Telugu ప్రకాశించే పగటి సాక్షిగా!

Verse 3

وَمَا خَلَقَ ٱلذَّكَرَ وَٱلْأُنثَىٰٓ

Transliteration wamā khalaqa l-dhakara wal-unthā

Telugu మరియు, మగ మరియు ఆడ (జాతులను) సృష్టించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా!

Verse 4

إِنَّ سَعْيَكُمْ لَشَتَّىٰ

Transliteration inna saʿyakum lashattā

Telugu వాస్తవానికి, మీ ప్రయత్నాలు నానా విధాలుగా ఉన్నాయి;

Verse 5

فَأَمَّا مَنْ أَعْطَىٰ وَٱتَّقَىٰ

Transliteration fa-ammā man aʿṭā wa-ittaqā

Telugu కాని ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో!

Verse 6

وَصَدَّقَ بِٱلْحُسْنَىٰ

Transliteration waṣaddaqa bil-ḥus'nā

Telugu మరియు మంచిని నమ్ముతాడో!

Verse 7

فَسَنُيَسِّرُهُۥ لِلْيُسْرَىٰ

Transliteration fasanuyassiruhu lil'yus'rā

Telugu అతనికి మేము మేలు కొరకు దారిని సులభం చేస్తాము.

Verse 8

وَأَمَّا مَنۢ بَخِلَ وَٱسْتَغْنَىٰ

Transliteration wa-ammā man bakhila wa-is'taghnā

Telugu కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తాడో!

Verse 9

وَكَذَّبَ بِٱلْحُسْنَىٰ

Transliteration wakadhaba bil-ḥus'nā

Telugu మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో!

Verse 10

فَسَنُيَسِّرُهُۥ لِلْعُسْرَىٰ

Transliteration fasanuyassiruhu lil'ʿus'rā

Telugu అతనికి మేము చెడు కొరకు దారిని సులభం చేస్తాము.

Verse 11

وَمَا يُغْنِى عَنْهُ مَالُهُۥٓ إِذَا تَرَدَّىٰٓ

Transliteration wamā yugh'nī ʿanhu māluhu idhā taraddā

Telugu మరియు అతడు నశించి పోయినప్పుడు, అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది?

Verse 12

إِنَّ عَلَيْنَا لَلْهُدَىٰ

Transliteration inna ʿalaynā lalhudā

Telugu నిశ్చయంగా, సన్మార్గం చూపడం మా పని!

Verse 13

وَإِنَّ لَنَا لَلْـَٔاخِرَةَ وَٱلْأُولَىٰ

Transliteration wa-inna lanā lalākhirata wal-ūlā

Telugu మరియు నిశ్చయంగా, ఇహపరలోకాల (ఆధిపత్యం) మాకే చెందినది.

Verse 14

فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ

Transliteration fa-andhartukum nāran talaẓẓā

Telugu కాబట్టి నేను మిమ్మల్ని ప్రజ్వలించే నరకాగ్నిని గురించి హెచ్చరించాను.

Verse 15

لَا يَصْلَىٰهَآ إِلَّا ٱلْأَشْقَى

Transliteration lā yaṣlāhā illā l-ashqā

Telugu పరమ దౌర్భాగ్యుడు తప్ప, మరెవ్వడూ అందులో కాలడు!

Verse 16

ٱلَّذِى كَذَّبَ وَتَوَلَّىٰ

Transliteration alladhī kadhaba watawallā

Telugu ఎవడైతే (సత్యాన్ని) తిరస్కరించి (దాని నుండి) విముఖుడవుతాడో!

Verse 17

وَسَيُجَنَّبُهَا ٱلْأَتْقَى

Transliteration wasayujannabuhā l-atqā

Telugu కాని దైవభీతి గలవాడు దాని నుండి (ఆ నరకాగ్ని నుండి) దూరంగా ఉంచబడతాడు!

Verse 18

ٱلَّذِى يُؤْتِى مَالَهُۥ يَتَزَكَّىٰ

Transliteration alladhī yu'tī mālahu yatazakkā

Telugu అతడే! ఎవడైతే, పవిత్రుడవటానికి తన ధనం నుండి (ఇతరులకు) ఇస్తాడో!

Verse 19

وَمَا لِأَحَدٍ عِندَهُۥ مِن نِّعْمَةٍ تُجْزَىٰٓ

Transliteration wamā li-aḥadin ʿindahu min niʿ'matin tuj'zā

Telugu కాని అది, వారు అతనికి చేసిన ఏ ఉపకారానికి బదులుగా గాక;

Verse 20

إِلَّا ٱبْتِغَآءَ وَجْهِ رَبِّهِ ٱلْأَعْلَىٰ

Transliteration illā ib'tighāa wajhi rabbihi l-aʿlā

Telugu కేవలం మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అయితే!

Verse 21

وَلَسَوْفَ يَرْضَىٰ

Transliteration walasawfa yarḍā

Telugu మరియు అలాంటి వాడే తప్పక సంతోషిస్తాడు.

Read Surah Al-Layl in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.