MyDugsiStart learning

Surah Al-Mursalat in Telugu: translation and audio

Surah 77 · المرسلات · The Emissaries · 50 verses

Surah Al-Mursalat verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Al-Mursalat word by word in English.

Verse 1

وَٱلْمُرْسَلَـٰتِ عُرْفًا

Transliteration wal-mur'salāti ʿur'fan

Telugu ఒకదాని తరువాత ఒకటి, వరుసగా పంపబడే వాయువుల సాక్షిగా!

Verse 2

فَٱلْعَـٰصِفَـٰتِ عَصْفًا

Transliteration fal-ʿāṣifāti ʿaṣfan

Telugu మరియు తీవ్రమైన వేగతో వీచే వాయువుల సాక్షిగా!

Verse 3

وَٱلنَّـٰشِرَٰتِ نَشْرًا

Transliteration wal-nāshirāti nashran

Telugu మరియు మేఘాలను దూరదూరంగా వ్యాపింపజేసే వాయువుల సాక్షిగా!

Verse 4

فَٱلْفَـٰرِقَـٰتِ فَرْقًا

Transliteration fal-fāriqāti farqan

Telugu మరియు మంచి చెడులను విశదపరచే (దైవదూతల) సాక్షిగా!

Verse 5

فَٱلْمُلْقِيَـٰتِ ذِكْرًا

Transliteration fal-mul'qiyāti dhik'ran

Telugu సందేశాలను ప్రవక్తల వద్దకు తెచ్చే (దైవదూత) సాక్షిగా!

Verse 6

عُذْرًا أَوْ نُذْرًا

Transliteration ʿudh'ran aw nudh'ran

Telugu సాకుగా లేక హెచ్చరికగా!

Verse 7

إِنَّمَا تُوعَدُونَ لَوَٰقِعٌ

Transliteration innamā tūʿadūna lawāqiʿun

Telugu నిశ్చయంగా, మీకు వాగ్దానం చేయబడినది, జరగవలసి ఉంది.

Verse 8

فَإِذَا ٱلنُّجُومُ طُمِسَتْ

Transliteration fa-idhā l-nujūmu ṭumisat

Telugu అప్పుడు ఎప్పడైతే నక్షత్రాలు కాంతి హీనమై పోతాయో!

Verse 9

وَإِذَا ٱلسَّمَآءُ فُرِجَتْ

Transliteration wa-idhā l-samāu furijat

Telugu మరియు ఆకాశం చీలిపోతుందో!

Verse 10

وَإِذَا ٱلْجِبَالُ نُسِفَتْ

Transliteration wa-idhā l-jibālu nusifat

Telugu మరియు పర్వతాలు పొడిగా మారి, చెల్లాచెదురుగా చేయబడతాయో!

Verse 11

وَإِذَا ٱلرُّسُلُ أُقِّتَتْ

Transliteration wa-idhā l-rusulu uqqitat

Telugu మరియు ప్రవక్తలు తమ నిర్ణీత సమయంలో సమావేశపరచబడతారో!

Verse 12

لِأَىِّ يَوْمٍ أُجِّلَتْ

Transliteration li-ayyi yawmin ujjilat

Telugu ఏ దినానికి గాను, (ఇవన్నీ) వాయిదా వేయబడ్డాయి?

Verse 13

لِيَوْمِ ٱلْفَصْلِ

Transliteration liyawmi l-faṣli

Telugu ఆ తీర్పుదినం కొరకా!

Verse 14

وَمَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلْفَصْلِ

Transliteration wamā adrāka mā yawmu l-faṣli

Telugu మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా అర్థం కాగలదు?

Verse 15

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Transliteration waylun yawma-idhin lil'mukadhibīna

Telugu ఆ రోజు (పునరుత్థాన దినాన్ని) తిరస్కరించే వారికి వినాశమంది!

Verse 16

أَلَمْ نُهْلِكِ ٱلْأَوَّلِينَ

Transliteration alam nuh'liki l-awalīna

Telugu ఏమీ? మేము పూర్వీకులను నాశనం చేయలేదా?

Verse 17

ثُمَّ نُتْبِعُهُمُ ٱلْـَٔاخِرِينَ

Transliteration thumma nut'biʿuhumu l-ākhirīna

Telugu తరువాత రాబోయే వారిని కూడా, మేము వారి వెనక పంపుతాము.

Verse 18

كَذَٰلِكَ نَفْعَلُ بِٱلْمُجْرِمِينَ

Transliteration kadhālika nafʿalu bil-muj'rimīna

Telugu ఈ విధంగా మేము నేరస్థుల పట్ల వ్యవహరిస్తాము.

Verse 19

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Transliteration waylun yawma-idhin lil'mukadhibīna

Telugu ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!

Verse 20

أَلَمْ نَخْلُقكُّم مِّن مَّآءٍ مَّهِينٍ

Transliteration alam nakhluqkkum min māin mahīnin

Telugu ఏమీ? మేము మిమ్మల్ని తుచ్ఛమైన నీటితో (వీర్యబిందువుతో) సృష్టించలేదా?

Verse 21

فَجَعَلْنَـٰهُ فِى قَرَارٍ مَّكِينٍ

Transliteration fajaʿalnāhu fī qarārin makīnin

Telugu తరువాత మేము దానిని ఒక భద్రమైన స్థానంలో ఉంచాము.

Verse 22

إِلَىٰ قَدَرٍ مَّعْلُومٍ

Transliteration ilā qadarin maʿlūmin

Telugu ఒక నిర్ణీత కాలం వరకు.

Verse 23

فَقَدَرْنَا فَنِعْمَ ٱلْقَـٰدِرُونَ

Transliteration faqadarnā faniʿ'ma l-qādirūna

Telugu ఈ విధంగా మేము నిర్ణయించాము, ఎందుకంటే మేమే ఉత్తమమైన నిర్ణయాలు తీసుకునే వారము.

Verse 24

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Transliteration waylun yawma-idhin lil'mukadhibīna

Telugu ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!

Verse 25

أَلَمْ نَجْعَلِ ٱلْأَرْضَ كِفَاتًا

Transliteration alam najʿali l-arḍa kifātan

Telugu ఏమీ? మేము భూమిని ఒక సమీకరించే స్థానంగా చేయలేదా?

Verse 26

أَحْيَآءً وَأَمْوَٰتًا

Transliteration aḥyāan wa-amwātan

Telugu జీవులకూ మరియు మృతులకూను?

Verse 27

وَجَعَلْنَا فِيهَا رَوَٰسِىَ شَـٰمِخَـٰتٍ وَأَسْقَيْنَـٰكُم مَّآءً فُرَاتًا

Transliteration wajaʿalnā fīhā rawāsiya shāmikhātin wa-asqaynākum māan furātan

Telugu మరియు దానిలో ఎత్తైన పర్వతాలను స్థిరంగా నిలుపలేదా? మరియు మీకు త్రాగటానికి మంచి నీటిని ప్రసాదించలేదా?

Verse 28

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Transliteration waylun yawma-idhin lil'mukadhibīna

Telugu ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!

Verse 29

ٱنطَلِقُوٓا۟ إِلَىٰ مَا كُنتُم بِهِۦ تُكَذِّبُونَ

Transliteration inṭaliqū ilā mā kuntum bihi tukadhibūna

Telugu (సత్యతిరస్కారులతో ఇలా అనబడుతుంది): "మీరు తిరస్కరిస్తూ వచ్చిన దాని వైపునకు పొండి!"

Verse 30

ٱنطَلِقُوٓا۟ إِلَىٰ ظِلٍّ ذِى ثَلَـٰثِ شُعَبٍ

Transliteration inṭaliqū ilā ẓillin dhī thalāthi shuʿabin

Telugu (దాని పొగ) మూడు శాఖలుగా చీలిపోయే నీడ వైపునకు పొండి;

Verse 31

لَّا ظَلِيلٍ وَلَا يُغْنِى مِنَ ٱللَّهَبِ

Transliteration lā ẓalīlin walā yugh'nī mina l-lahabi

Telugu కాని అది ఏ విధమైన (చల్ల) నీడనూ ఇవ్వదూ మరియు (నరక) జ్వాలల నుండి కూడా కాపాడదు!

Verse 32

إِنَّهَا تَرْمِى بِشَرَرٍ كَٱلْقَصْرِ

Transliteration innahā tarmī bishararin kal-qaṣri

Telugu వాస్తవానికి అది పెద్ద పెద్ద మొద్దు వంటి అగ్నికణాలను విసురుతుంది.

Verse 33

كَأَنَّهُۥ جِمَـٰلَتٌ صُفْرٌ

Transliteration ka-annahu jimālatun ṣuf'run

Telugu వాస్తవానికి ఆ అగ్నికణాలు పసుపు పచ్చని ఒంటెల వలే కనిపిస్తాయి.

Verse 34

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Transliteration waylun yawma-idhin lil'mukadhibīna

Telugu ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!

Verse 35

هَـٰذَا يَوْمُ لَا يَنطِقُونَ

Transliteration hādhā yawmu lā yanṭiqūna

Telugu ఆ దినాన వారు మాట్లాడలేరు.

Verse 36

وَلَا يُؤْذَنُ لَهُمْ فَيَعْتَذِرُونَ

Transliteration walā yu'dhanu lahum fayaʿtadhirūna

Telugu మరియు వారికి సాకులు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వబడదు.

Verse 37

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Transliteration waylun yawma-idhin lil'mukadhibīna

Telugu ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!

Verse 38

هَـٰذَا يَوْمُ ٱلْفَصْلِ ۖ جَمَعْنَـٰكُمْ وَٱلْأَوَّلِينَ

Transliteration hādhā yawmu l-faṣli jamaʿnākum wal-awalīna

Telugu అది తీర్పుదినమై ఉంటుంది! మేము మిమ్మల్ని మరియు మీ పూర్వీకులను సమావేశపరచి ఉంటాము!

Verse 39

فَإِن كَانَ لَكُمْ كَيْدٌ فَكِيدُونِ

Transliteration fa-in kāna lakum kaydun fakīdūni

Telugu కావున మీ వద్ద ఏదైనా పన్నాగముంటే దానిని పన్నండి.

Verse 40

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Transliteration waylun yawma-idhin lil'mukadhibīna

Telugu ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!

Verse 41

إِنَّ ٱلْمُتَّقِينَ فِى ظِلَـٰلٍ وَعُيُونٍ

Transliteration inna l-mutaqīna fī ẓilālin waʿuyūnin

Telugu నిశ్చయంగా భయభక్తులు గలవారు (ఆ రోజు చల్లని) నీడలలో చెలమల దగ్గర ఉంటారు.

Verse 42

وَفَوَٰكِهَ مِمَّا يَشْتَهُونَ

Transliteration wafawākiha mimmā yashtahūna

Telugu మరియు వారికి వారు కోరే ఫలాలు లభిస్తాయి.

Verse 43

كُلُوا۟ وَٱشْرَبُوا۟ هَنِيٓـًٔۢا بِمَا كُنتُمْ تَعْمَلُونَ

Transliteration kulū wa-ish'rabū hanīan bimā kuntum taʿmalūna

Telugu (వారితో ఇలా అనబడుతుంది): "మీరు చేస్తూ ఉండిన కర్మలను ఫలితంగా హాయిగా తినండి, త్రాగండి!"

Verse 44

إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ

Transliteration innā kadhālika najzī l-muḥ'sinīna

Telugu నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము.

Verse 45

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Transliteration waylun yawma-idhin lil'mukadhibīna

Telugu ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!

Verse 46

كُلُوا۟ وَتَمَتَّعُوا۟ قَلِيلًا إِنَّكُم مُّجْرِمُونَ

Transliteration kulū watamattaʿū qalīlan innakum muj'rimūna

Telugu (ఓ సత్యతిరస్కారులారా!) మీరు కొంతకాలం తినండి, సుఖాలు అనుభవించండి. నిశ్చయంగా, మీరు నేరస్థులు!

Verse 47

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Transliteration waylun yawma-idhin lil'mukadhibīna

Telugu ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!

Verse 48

وَإِذَا قِيلَ لَهُمُ ٱرْكَعُوا۟ لَا يَرْكَعُونَ

Transliteration wa-idhā qīla lahumu ir'kaʿū lā yarkaʿūna

Telugu మరియు వారితో: "(అల్లాహ్ ముందు) వంగండి (రుకూఉ చేయండి)." అని అన్నప్పుడు, వారు వంగలేదు.

Verse 49

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Transliteration waylun yawma-idhin lil'mukadhibīna

Telugu ఆ రోజు (పునరుత్థానాన్ని) తిరస్కరించే వారికి వినాశముంది!

Verse 50

فَبِأَىِّ حَدِيثٍۭ بَعْدَهُۥ يُؤْمِنُونَ

Transliteration fabi-ayyi ḥadīthin baʿdahu yu'minūna

Telugu దీని (ఈ ఖుర్ఆన్) తరువాత ఇక వారు మరెలాంటి సందేశాన్నివిశ్వసిస్తారు?

Read Surah Al-Mursalat in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.