MyDugsiStart learning

Surah Al-Mutaffifin in Telugu: translation and audio

Surah 83 · المطففين · The Defrauding · 36 verses

Surah Al-Mutaffifin verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Al-Mutaffifin word by word in English.

Verse 1

وَيْلٌ لِّلْمُطَفِّفِينَ

Transliteration waylun lil'muṭaffifīna

Telugu కొలతలలో, తూనికలలో తగ్గించి ఇచ్చే వారికి వినాశముంది.

Verse 2

ٱلَّذِينَ إِذَا ٱكْتَالُوا۟ عَلَى ٱلنَّاسِ يَسْتَوْفُونَ

Transliteration alladhīna idhā ik'tālū ʿalā l-nāsi yastawfūna

Telugu వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు.

Verse 3

وَإِذَا كَالُوهُمْ أَو وَّزَنُوهُمْ يُخْسِرُونَ

Transliteration wa-idhā kālūhum aw wazanūhum yukh'sirūna

Telugu మరియు తాము ప్రజలకు కొలిచి గానీ లేక తూచి గానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు.

Verse 4

أَلَا يَظُنُّ أُو۟لَـٰٓئِكَ أَنَّهُم مَّبْعُوثُونَ

Transliteration alā yaẓunnu ulāika annahum mabʿūthūna

Telugu ఏమీ? ఇలాంటి వారు తిరిగి బ్రతికించి లేపబడరని భావిస్తున్నారా?

Verse 5

لِيَوْمٍ عَظِيمٍ

Transliteration liyawmin ʿaẓīmin

Telugu ఒక గొప్ప దినమున!

Verse 6

يَوْمَ يَقُومُ ٱلنَّاسُ لِرَبِّ ٱلْعَـٰلَمِينَ

Transliteration yawma yaqūmu l-nāsu lirabbi l-ʿālamīna

Telugu సర్వ లోకాల ప్రభువు సమక్షంలో ప్రజలు అందరూ నిలబడే రోజు.

Verse 7

كَلَّآ إِنَّ كِتَـٰبَ ٱلْفُجَّارِ لَفِى سِجِّينٍ

Transliteration kallā inna kitāba l-fujāri lafī sijjīnin

Telugu అలా కాదు! నిశ్చయంగా, దుష్టుల కర్మపత్రం సిజ్జీనులో ఉంది.

Verse 8

وَمَآ أَدْرَىٰكَ مَا سِجِّينٌ

Transliteration wamā adrāka mā sijjīnun

Telugu ఆ సిజ్జీన్ అంటే నీవు ఏమనుకుంటున్నావు?

Verse 9

كِتَـٰبٌ مَّرْقُومٌ

Transliteration kitābun marqūmun

Telugu వ్రాసి పెట్టబడిన (చెరగని) గ్రంథం.

Verse 10

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Transliteration waylun yawma-idhin lil'mukadhibīna

Telugu సత్యాన్ని తిరస్కరించే వారికి ఆ రోజు వినాశముంది.

Verse 11

ٱلَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ ٱلدِّينِ

Transliteration alladhīna yukadhibūna biyawmi l-dīni

Telugu వారికే! ఎవరైతే తీర్పుదినాన్ని తిరస్కరిస్తారో!

Verse 12

وَمَا يُكَذِّبُ بِهِۦٓ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ

Transliteration wamā yukadhibu bihi illā kullu muʿ'tadin athīmin

Telugu మరియు మితిమీరి ప్రవర్తించే పాపిష్ఠుడు తప్ప, మరెవ్వడూ దానిని (తీర్పు దినాన్ని) తిరస్కరించడు.

Verse 13

إِذَا تُتْلَىٰ عَلَيْهِ ءَايَـٰتُنَا قَالَ أَسَـٰطِيرُ ٱلْأَوَّلِينَ

Transliteration idhā tut'lā ʿalayhi āyātunā qāla asāṭīru l-awalīna

Telugu మా సూచనలు (ఆయాత్ లు) అతడికి వినిపించ బడినప్పుడు అతడు: "ఇవి పూర్వకాలపు కట్టుకథలే!" అని అంటాడు.

Verse 14

كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِم مَّا كَانُوا۟ يَكْسِبُونَ

Transliteration kallā bal rāna ʿalā qulūbihim mā kānū yaksibūna

Telugu అలా కాదు! వాస్తవానికి వారి హృదయాలకు వారి (దుష్ట) కార్యాల త్రుప్పు పట్టింది.

Verse 15

كَلَّآ إِنَّهُمْ عَن رَّبِّهِمْ يَوْمَئِذٍ لَّمَحْجُوبُونَ

Transliteration kallā innahum ʿan rabbihim yawma-idhin lamaḥjūbūna

Telugu అంతేకాదు, ఆ రోజు నిశ్చయంగా, వారు తమ ప్రభువు కారుణ్యం నుండి నిరోధింప బడతారు.

Verse 16

ثُمَّ إِنَّهُمْ لَصَالُوا۟ ٱلْجَحِيمِ

Transliteration thumma innahum laṣālū l-jaḥīmi

Telugu తరువాత వారు నిశ్చయంగా, భగభగ మండే నరకాగ్నిలోకి పోతారు.

Verse 17

ثُمَّ يُقَالُ هَـٰذَا ٱلَّذِى كُنتُم بِهِۦ تُكَذِّبُونَ

Transliteration thumma yuqālu hādhā alladhī kuntum bihi tukadhibūna

Telugu అప్పుడు వారితో: "దేనినైతే మీరు అసత్యమని తిరస్కరిస్తూ వచ్చారో, అది ఇదే!" అని చెప్పబడుతుంది.

Verse 18

كَلَّآ إِنَّ كِتَـٰبَ ٱلْأَبْرَارِ لَفِى عِلِّيِّينَ

Transliteration kallā inna kitāba l-abrāri lafī ʿilliyyīna

Telugu అలా కాదు! నిశ్చయంగా, ధర్మనిష్ఠాపరుల (పుణ్యాత్ముల) కర్మపత్రం మహోన్నత గ్రంథం (ఇల్లియ్యూన్)లో ఉంది.

Verse 19

وَمَآ أَدْرَىٰكَ مَا عِلِّيُّونَ

Transliteration wamā adrāka mā ʿilliyyūna

Telugu మరి ఆ ఇల్లియ్యూన్ అంటే నీవు ఏమనుకుంటున్నావు?

Verse 20

كِتَـٰبٌ مَّرْقُومٌ

Transliteration kitābun marqūmun

Telugu అది వ్రాసిపెట్టబడిన ఒక గ్రంథం.

Verse 21

يَشْهَدُهُ ٱلْمُقَرَّبُونَ

Transliteration yashhaduhu l-muqarabūna

Telugu దానికి, (అల్లాహ్ కు) సన్నిహితులైన వారు (దేవదూతలు) సాక్ష్యంగా ఉంటారు.

Verse 22

إِنَّ ٱلْأَبْرَارَ لَفِى نَعِيمٍ

Transliteration inna l-abrāra lafī naʿīmin

Telugu నిశ్చయంగా, పుణ్యాత్ములు సుఖసంతోషాలలో ఉంటారు.

Verse 23

عَلَى ٱلْأَرَآئِكِ يَنظُرُونَ

Transliteration ʿalā l-arāiki yanẓurūna

Telugu ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ.

Verse 24

تَعْرِفُ فِى وُجُوهِهِمْ نَضْرَةَ ٱلنَّعِيمِ

Transliteration taʿrifu fī wujūhihim naḍrata l-naʿīmi

Telugu వారి ముఖాలు సుఖసంతోషాలతో కళకళలాడుతూ ఉండటం నీవు చూస్తావు.

Verse 25

يُسْقَوْنَ مِن رَّحِيقٍ مَّخْتُومٍ

Transliteration yus'qawna min raḥīqin makhtūmin

Telugu సీలు చేయబడిన నాణ్యమైన మధువు వారికి త్రాగటానికి ఇవ్వబడుతుంది.

Verse 26

خِتَـٰمُهُۥ مِسْكٌ ۚ وَفِى ذَٰلِكَ فَلْيَتَنَافَسِ ٱلْمُتَنَـٰفِسُونَ

Transliteration khitāmuhu mis'kun wafī dhālika falyatanāfasi l-mutanāfisūna

Telugu దాని చివరి చుక్కలోనూ కస్తూరి సువాసన ఉంటుంది. కాబట్టి దానిని పొందటానికి అపేక్షించే వారంతా ప్రయాస పడాలి.

Verse 27

وَمِزَاجُهُۥ مِن تَسْنِيمٍ

Transliteration wamizājuhu min tasnīmin

Telugu మరియు దానిలో (ఆ మధువులో) తస్నీమ్ కలుపబడి ఉంటుంది.

Verse 28

عَيْنًا يَشْرَبُ بِهَا ٱلْمُقَرَّبُونَ

Transliteration ʿaynan yashrabu bihā l-muqarabūna

Telugu అదొక చెలమ, (అల్లాహ్) సాన్నిధ్యం పొందినవారే దాని నుండి త్రాగుతారు.

Verse 29

إِنَّ ٱلَّذِينَ أَجْرَمُوا۟ كَانُوا۟ مِنَ ٱلَّذِينَ ءَامَنُوا۟ يَضْحَكُونَ

Transliteration inna alladhīna ajramū kānū mina alladhīna āmanū yaḍḥakūna

Telugu వాస్తవానికి (ప్రపంచంలో) అపరాధులు విశ్వసించిన వారిని హేళన చేసేవారు.

Verse 30

وَإِذَا مَرُّوا۟ بِهِمْ يَتَغَامَزُونَ

Transliteration wa-idhā marrū bihim yataghāmazūna

Telugu మరియు వీరు (విశ్వాసులు), వారి (అవిశ్వాసుల) యెదుట నుండి పోయి నప్పుడు, వారు (అవిశ్వాసులు) పరస్పరం కనుసైగలు చేసుకునేవారు.

Verse 31

وَإِذَا ٱنقَلَبُوٓا۟ إِلَىٰٓ أَهْلِهِمُ ٱنقَلَبُوا۟ فَكِهِينَ

Transliteration wa-idhā inqalabū ilā ahlihimu inqalabū fakihīna

Telugu మరియు (అవిశ్వాసులు) తమ ఇంటి వారి దగ్గరికి పోయినప్పుడు (విశ్వాసులను గురించి) పరిహసిస్తూ మరలేవారు.

Verse 32

وَإِذَا رَأَوْهُمْ قَالُوٓا۟ إِنَّ هَـٰٓؤُلَآءِ لَضَآلُّونَ

Transliteration wa-idhā ra-awhum qālū inna hāulāi laḍāllūna

Telugu మరియు (విశ్వాసులను) చూసినపుడల్లా: "నిశ్చయంగా, వీరు దారి తప్పినవారు!" అని అనేవారు.

Verse 33

وَمَآ أُرْسِلُوا۟ عَلَيْهِمْ حَـٰفِظِينَ

Transliteration wamā ur'silū ʿalayhim ḥāfiẓīna

Telugu మరియు వారు (అవిశ్వాసులు) వీరి (విశ్వాసుల) మీద కాపలాదారులుగా పంపబడలేదు!

Verse 34

فَٱلْيَوْمَ ٱلَّذِينَ ءَامَنُوا۟ مِنَ ٱلْكُفَّارِ يَضْحَكُونَ

Transliteration fal-yawma alladhīna āmanū mina l-kufāri yaḍḥakūna

Telugu కాని ఈ రోజు (పునరుత్థాన దినం నాడు) విశ్వసించినవారు, సత్యతిరస్కారులను చూసి నవ్వుతారు.

Verse 35

عَلَى ٱلْأَرَآئِكِ يَنظُرُونَ

Transliteration ʿalā l-arāiki yanẓurūna

Telugu ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ (ఇలా అంటారు):

Verse 36

هَلْ ثُوِّبَ ٱلْكُفَّارُ مَا كَانُوا۟ يَفْعَلُونَ

Transliteration hal thuwwiba l-kufāru mā kānū yafʿalūna

Telugu "ఇక! ఈ సత్యతిరస్కారులకు, వారి చేష్టలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా దొరుకునా?"

Read Surah Al-Mutaffifin in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.