MyDugsiStart learning

Surah Az-Zumar in Telugu: translation and audio

Surah 39 · الزمر · The Troops · 75 verses

Surah Az-Zumar verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Az-Zumar word by word in English.

Verse 1

تَنزِيلُ ٱلْكِتَـٰبِ مِنَ ٱللَّهِ ٱلْعَزِيزِ ٱلْحَكِيمِ

Transliteration tanzīlu l-kitābi mina l-lahi l-ʿazīzi l-ḥakīmi

Telugu ఈ గ్రంథ (ఖుర్ఆన్) అవతరణ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్ తరఫు నుండి జరిగింది.

Verse 2

إِنَّآ أَنزَلْنَآ إِلَيْكَ ٱلْكِتَـٰبَ بِٱلْحَقِّ فَٱعْبُدِ ٱللَّهَ مُخْلِصًا لَّهُ ٱلدِّينَ

Transliteration innā anzalnā ilayka l-kitāba bil-ḥaqi fa-uʿ'budi l-laha mukh'liṣan lahu l-dīna

Telugu (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా మేము ఈ గ్రంథాన్ని, సత్యంతో నీపై అవతరింపజేశాము. కావున నీవు అల్లాహ్ నే ఆరాధిస్తూ నీ భక్తిని కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకో!

Verse 3

أَلَا لِلَّهِ ٱلدِّينُ ٱلْخَالِصُ ۚ وَٱلَّذِينَ ٱتَّخَذُوا۟ مِن دُونِهِۦٓ أَوْلِيَآءَ مَا نَعْبُدُهُمْ إِلَّا لِيُقَرِّبُونَآ إِلَى ٱللَّهِ زُلْفَىٰٓ إِنَّ ٱللَّهَ يَحْكُمُ بَيْنَهُمْ فِى مَا هُمْ فِيهِ يَخْتَلِفُونَ ۗ إِنَّ ٱللَّهَ لَا يَهْدِى مَنْ هُوَ كَـٰذِبٌ كَفَّارٌ

Transliteration alā lillahi l-dīnu l-khāliṣu wa-alladhīna ittakhadhū min dūnihi awliyāa mā naʿbuduhum illā liyuqarribūnā ilā l-lahi zul'fā inna l-laha yaḥkumu baynahum fī mā hum fīhi yakhtalifūna inna l-laha lā yahdī man huwa kādhibun kaffārun

Telugu వినండి! భక్తి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది! ఇక ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకునే వారు (ఇలా అంటారు): "వారు మమ్మల్ని అల్లాహ్ సాన్నిధ్యానికి చేర్చుతారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము!" నిశ్చయంగా అల్లాహ్ వారిలో ఉన్న భేదాభిప్రాయాలకు తగినట్లుగా వారి మధ్య తీర్పు చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ అసత్యవాదికి, కృతఘ్నునికి మార్గదర్శకత్వం చేయడు.

Verse 4

لَّوْ أَرَادَ ٱللَّهُ أَن يَتَّخِذَ وَلَدًا لَّٱصْطَفَىٰ مِمَّا يَخْلُقُ مَا يَشَآءُ ۚ سُبْحَـٰنَهُۥ ۖ هُوَ ٱللَّهُ ٱلْوَٰحِدُ ٱلْقَهَّارُ

Transliteration law arāda l-lahu an yattakhidha waladan la-iṣ'ṭafā mimmā yakhluqu mā yashāu sub'ḥānahu huwa l-lahu l-wāḥidu l-qahāru

Telugu ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా కుమారునిగా చేసుకోదలిస్తే, తన సృష్టిలో తాను కోరిన వానిని ఎన్నుకొని ఉండేవాడు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయన అల్లాహ్! అద్వితీయుడు, తన సృష్టి మీద సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు.

Verse 5

خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ بِٱلْحَقِّ ۖ يُكَوِّرُ ٱلَّيْلَ عَلَى ٱلنَّهَارِ وَيُكَوِّرُ ٱلنَّهَارَ عَلَى ٱلَّيْلِ ۖ وَسَخَّرَ ٱلشَّمْسَ وَٱلْقَمَرَ ۖ كُلٌّ يَجْرِى لِأَجَلٍ مُّسَمًّى ۗ أَلَا هُوَ ٱلْعَزِيزُ ٱلْغَفَّـٰرُ

Transliteration khalaqa l-samāwāti wal-arḍa bil-ḥaqi yukawwiru al-layla ʿalā l-nahāri wayukawwiru l-nahāra ʿalā al-layli wasakhara l-shamsa wal-qamara kullun yajrī li-ajalin musamman alā huwa l-ʿazīzu l-ghafāru

Telugu ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు. ఆయన రాత్రిని పగటి మీద చుట్టుతున్నాడు. మరియు పగటిని రాత్రి మీద చుట్టుతున్నాడు. సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి నియమబద్ధులుగా చేసి ఉంచాడు. వాటిలో ప్రతి ఒక్కటీ ఒక నిర్ణీత కాలంలో (నిర్ణీత పరిధిలో) పయనిస్తూ ఉన్నాయి. వినండి! ఆయన, సర్వశక్తిమంతుడు, క్షమించేవాడు.

Verse 6

خَلَقَكُم مِّن نَّفْسٍ وَٰحِدَةٍ ثُمَّ جَعَلَ مِنْهَا زَوْجَهَا وَأَنزَلَ لَكُم مِّنَ ٱلْأَنْعَـٰمِ ثَمَـٰنِيَةَ أَزْوَٰجٍ ۚ يَخْلُقُكُمْ فِى بُطُونِ أُمَّهَـٰتِكُمْ خَلْقًا مِّنۢ بَعْدِ خَلْقٍ فِى ظُلُمَـٰتٍ ثَلَـٰثٍ ۚ ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمْ لَهُ ٱلْمُلْكُ ۖ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُصْرَفُونَ

Transliteration khalaqakum min nafsin wāḥidatin thumma jaʿala min'hā zawjahā wa-anzala lakum mina l-anʿāmi thamāniyata azwājin yakhluqukum fī buṭūni ummahātikum khalqan min baʿdi khalqin fī ẓulumātin thalāthin dhālikumu l-lahu rabbukum lahu l-mul'ku lā ilāha illā huwa fa-annā tuṣ'rafūna

Telugu ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు. తరువాత అతని నుండి అతని జంట (జౌజ్) ను పుట్టించాడు. మరియు మీ కొరకు ఎనిమిది జతల (ఆడ మగ) శిశువులను పుట్టించాడు. ఆయన మిమ్మల్ని మీ తల్లుల గర్భాలలో మూడు చీకటి తెరలలో ఒక రూపం తరువాత మరొక రూపాన్ని ఇచ్చాడు. ఆయనే అల్లాహ్! మీ ప్రభువు. విశ్వాధిపత్యం ఆయనదే. ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. అలాంటప్పుడు మీరు ఎలా (సత్యం నుండి) తప్పించబడుతున్నారు?

Verse 7

إِن تَكْفُرُوا۟ فَإِنَّ ٱللَّهَ غَنِىٌّ عَنكُمْ ۖ وَلَا يَرْضَىٰ لِعِبَادِهِ ٱلْكُفْرَ ۖ وَإِن تَشْكُرُوا۟ يَرْضَهُ لَكُمْ ۗ وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۗ ثُمَّ إِلَىٰ رَبِّكُم مَّرْجِعُكُمْ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ ۚ إِنَّهُۥ عَلِيمٌۢ بِذَاتِ ٱلصُّدُورِ

Transliteration in takfurū fa-inna l-laha ghaniyyun ʿankum walā yarḍā liʿibādihi l-kuf'ra wa-in tashkurū yarḍahu lakum walā taziru wāziratun wiz'ra ukh'rā thumma ilā rabbikum marjiʿukum fayunabbi-ukum bimā kuntum taʿmalūna innahu ʿalīmun bidhāti l-ṣudūri

Telugu ఒకవేళ మీరు సత్యాన్ని తిరస్కరిస్తే, నిశ్చయంగా, అల్లాహ్ మీ అక్కరలేని వాడు. మరియు ఆయన తన దాసులు సత్యతిరస్కార వైఖరిని అవలంబించడాన్ని ఇష్ట పడడు. మరియు మీరు కృతజ్ఞులైనట్లయితే ఆయన మీ పట్ల ఎంతో సంతోషపడతాడు. మరియు బరువు మోసేవాడు ఎవ్వడూ ఇతరుల బరువును మోయడు. చివరకు మీరందరికీ, మీ ప్రభువు వైపునకే మరల వలసి ఉంది! అప్పుడు ఆయన, మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో మీకు తెలియజేస్తాడు. నిశ్చయంగా ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలన్నీ బాగా తెలుసు.

Verse 8

۞ وَإِذَا مَسَّ ٱلْإِنسَـٰنَ ضُرٌّ دَعَا رَبَّهُۥ مُنِيبًا إِلَيْهِ ثُمَّ إِذَا خَوَّلَهُۥ نِعْمَةً مِّنْهُ نَسِىَ مَا كَانَ يَدْعُوٓا۟ إِلَيْهِ مِن قَبْلُ وَجَعَلَ لِلَّهِ أَندَادًا لِّيُضِلَّ عَن سَبِيلِهِۦ ۚ قُلْ تَمَتَّعْ بِكُفْرِكَ قَلِيلًا ۖ إِنَّكَ مِنْ أَصْحَـٰبِ ٱلنَّارِ

Transliteration wa-idhā massa l-insāna ḍurrun daʿā rabbahu munīban ilayhi thumma idhā khawwalahu niʿ'matan min'hu nasiya mā kāna yadʿū ilayhi min qablu wajaʿala lillahi andādan liyuḍilla ʿan sabīlihi qul tamattaʿ bikuf'rika qalīlan innaka min aṣḥābi l-nāri

Telugu మానవునికి ఏదైనా కష్టం కలిగినప్పుడు అతడు పశ్చాత్తాపంలో తన ప్రభువు వైపునకు మరలి ఆయనను వేడుకుంటాడు. తరువాత ఆయన (అల్లాహ్) అతనికి తన అనుగ్రహాన్ని ప్రసాదించి నప్పుడు, అతడు పూర్వం దేనిని గురించి వేడుకుంటూ ఉండేవాడో దానిని మరచిపోతాడు. మరియు అల్లాహ్ కు సాటి కల్పించి, (ఇతరులను) ఆయన మార్గం నుండి తప్పిస్తాడు. (అలాంటి వానితో) ఇలా అను: "నీవు, నీ సత్యతిరస్కార వైఖరితో కొంత కాలం సంతోషపడు. నిశ్చయంగా, నీవు నరకవాసుల్లోని వాడవవుతావు!"

Verse 9

أَمَّنْ هُوَ قَـٰنِتٌ ءَانَآءَ ٱلَّيْلِ سَاجِدًا وَقَآئِمًا يَحْذَرُ ٱلْـَٔاخِرَةَ وَيَرْجُوا۟ رَحْمَةَ رَبِّهِۦ ۗ قُلْ هَلْ يَسْتَوِى ٱلَّذِينَ يَعْلَمُونَ وَٱلَّذِينَ لَا يَعْلَمُونَ ۗ إِنَّمَا يَتَذَكَّرُ أُو۟لُوا۟ ٱلْأَلْبَـٰبِ

Transliteration amman huwa qānitun ānāa al-layli sājidan waqāiman yaḥdharu l-ākhirata wayarjū raḥmata rabbihi qul hal yastawī alladhīna yaʿlamūna wa-alladhīna lā yaʿlamūna innamā yatadhakkaru ulū l-albābi

Telugu ఏమీ? ఎవడైతే శ్రద్ధతో రాత్రి ఘడియలలో సాష్టాంగం (సజ్దా) చేస్తూ మరియు నిలిచి (నమాజ్) చేస్తూ, పరలోక (జీవిత)మును గురించి భయపడుతూ, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తూ ఉంటాడో! (అలాంటి వాడు, అలా చేయని వాడితో సమానుడా)? వారి నడుగు: "ఏమీ? విజ్ఞానులు మరియు అజ్ఞానులు సరిసమానులు కాగలరా? వాస్తవానికి బుద్ధిమంతులే హితబోధ స్వీకరిస్తారు."

Verse 10

قُلْ يَـٰعِبَادِ ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ رَبَّكُمْ ۚ لِلَّذِينَ أَحْسَنُوا۟ فِى هَـٰذِهِ ٱلدُّنْيَا حَسَنَةٌ ۗ وَأَرْضُ ٱللَّهِ وَٰسِعَةٌ ۗ إِنَّمَا يُوَفَّى ٱلصَّـٰبِرُونَ أَجْرَهُم بِغَيْرِ حِسَابٍ

Transliteration qul yāʿibādi alladhīna āmanū ittaqū rabbakum lilladhīna aḥsanū fī hādhihi l-dun'yā ḥasanatun wa-arḍu l-lahi wāsiʿatun innamā yuwaffā l-ṣābirūna ajrahum bighayri ḥisābin

Telugu (ఓ ముహమ్మద్!) అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడని) అను: "ఓ విశ్వసించిన నా దాసులారా! మీ ప్రభువు నందు భయభక్తులు కలిగి ఉండండి. ఎవరైతే ఈ లోకంలో సత్పురుషులై ఉంటారో (వారికి పరలోకంలో) మేలు జరుగుతుంది. మరియు అల్లాహ్ భూమి చాలా విశాలమైనది. నిశ్చయంగా, సహనం వహించిన వారికి లెక్క లేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది."

Verse 11

قُلْ إِنِّىٓ أُمِرْتُ أَنْ أَعْبُدَ ٱللَّهَ مُخْلِصًا لَّهُ ٱلدِّينَ

Transliteration qul innī umir'tu an aʿbuda l-laha mukh'liṣan lahu l-dīna

Telugu (ఓ ముహమ్మద్! ఇంకా) ఇలా అను: "నిశ్చయంగా, నేను అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తూ, నా భక్తిని కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని ఆజ్ఞాపించబడ్డాను.

Verse 12

وَأُمِرْتُ لِأَنْ أَكُونَ أَوَّلَ ٱلْمُسْلِمِينَ

Transliteration wa-umir'tu li-an akūna awwala l-mus'limīna

Telugu మరియు నేను అందరి కంటే ముందు (అల్లాహ్ కు) విధేయుడను (ముస్లిం) అయి ఉండాలి" అని కూడా ఆజ్ఞాపించబడ్డాను.

Verse 13

قُلْ إِنِّىٓ أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّى عَذَابَ يَوْمٍ عَظِيمٍ

Transliteration qul innī akhāfu in ʿaṣaytu rabbī ʿadhāba yawmin ʿaẓīmin

Telugu (ఇంకా) ఇలా అను: "ఒకవేళ నేను నా ప్రభువుకు అవిధేయుడనైతే ఆ మహా దినవు శిక్షకు గురి అవుతానని భయపడుతున్నాను."

Verse 14

قُلِ ٱللَّهَ أَعْبُدُ مُخْلِصًا لَّهُۥ دِينِى

Transliteration quli l-laha aʿbudu mukh'liṣan lahu dīnī

Telugu (ఇంకా) ఇలా అను: "నేను కేవలం అల్లాహ్ నే ఆరాధిస్తూ నా భక్తిని (ఆరాధనను) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకుంటాను;

Verse 15

فَٱعْبُدُوا۟ مَا شِئْتُم مِّن دُونِهِۦ ۗ قُلْ إِنَّ ٱلْخَـٰسِرِينَ ٱلَّذِينَ خَسِرُوٓا۟ أَنفُسَهُمْ وَأَهْلِيهِمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ ۗ أَلَا ذَٰلِكَ هُوَ ٱلْخُسْرَانُ ٱلْمُبِينُ

Transliteration fa-uʿ'budū mā shi'tum min dūnihi qul inna l-khāsirīna alladhīna khasirū anfusahum wa-ahlīhim yawma l-qiyāmati alā dhālika huwa l-khus'rānu l-mubīnu

Telugu కావున మీరు ఆయనను వదలి మీకు ఇష్టమైన వారిని ఆరాధించండి!" ఇంకా ఇలా అను: "పునరుత్థాన దినమున తమకు తాము మరియు తమ కుటుంబం వారికి నష్టం కలిగించుకున్న వారే నిశ్చయంగా నష్టపడ్డ వారు. వాస్తవానికి అదే స్పష్టమైన నష్టం!"

Verse 16

لَهُم مِّن فَوْقِهِمْ ظُلَلٌ مِّنَ ٱلنَّارِ وَمِن تَحْتِهِمْ ظُلَلٌ ۚ ذَٰلِكَ يُخَوِّفُ ٱللَّهُ بِهِۦ عِبَادَهُۥ ۚ يَـٰعِبَادِ فَٱتَّقُونِ

Transliteration lahum min fawqihim ẓulalun mina l-nāri wamin taḥtihim ẓulalun dhālika yukhawwifu l-lahu bihi ʿibādahu yāʿibādi fa-ittaqūni

Telugu వారిని, వారిపై నుండి అగ్ని జ్వాలలు క్రమ్ముకుంటాయి మరియు వారి క్రింది నుండి (అగ్ని జ్వాలలు) క్రమ్ముకుంటాయి. ఈ విధంగా, అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు: "ఓ నా దాసులారా! నా పట్ల మాత్రమే భయభక్తులు కలిగి ఉండండి."

Verse 17

وَٱلَّذِينَ ٱجْتَنَبُوا۟ ٱلطَّـٰغُوتَ أَن يَعْبُدُوهَا وَأَنَابُوٓا۟ إِلَى ٱللَّهِ لَهُمُ ٱلْبُشْرَىٰ ۚ فَبَشِّرْ عِبَادِ

Transliteration wa-alladhīna ij'tanabū l-ṭāghūta an yaʿbudūhā wa-anābū ilā l-lahi lahumu l-bush'rā fabashir ʿibādi

Telugu మరియు ఎవరైతే కల్పిత దైవాలను (తాగూత్ లను) త్యజించి, వాటిని ఆరాధించకుండా, పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలుతారో! వారికి శుభవార్త ఉంది. కావున నా దాసులకు ఈ శుభవార్తను ఇవ్వు.

Verse 18

ٱلَّذِينَ يَسْتَمِعُونَ ٱلْقَوْلَ فَيَتَّبِعُونَ أَحْسَنَهُۥٓ ۚ أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ هَدَىٰهُمُ ٱللَّهُ ۖ وَأُو۟لَـٰٓئِكَ هُمْ أُو۟لُوا۟ ٱلْأَلْبَـٰبِ

Transliteration alladhīna yastamiʿūna l-qawla fayattabiʿūna aḥsanahu ulāika alladhīna hadāhumu l-lahu wa-ulāika hum ulū l-albābi

Telugu ఎవరైతే మాటను శ్రద్ధగా విని, అందులోని ఉత్తమమైన దానిని అనుసరిస్తారో! అలాంటి వారే, అల్లాహ్ మార్గదర్శకత్వం పొందిన వారు మరియు అలాంటి వారే బుద్ధిమంతులు.

Verse 19

أَفَمَنْ حَقَّ عَلَيْهِ كَلِمَةُ ٱلْعَذَابِ أَفَأَنتَ تُنقِذُ مَن فِى ٱلنَّارِ

Transliteration afaman ḥaqqa ʿalayhi kalimatu l-ʿadhābi afa-anta tunqidhu man fī l-nāri

Telugu ఏమీ? ఎవడిని గురించి అయితే ఆయన (అల్లాహ్ తరఫు నుండి) శిక్ష నిర్ణయించబడి ఉందో, వానిని నీవు నరకాగ్నిలో నుండి బయటికి తీయగలవా?

Verse 20

لَـٰكِنِ ٱلَّذِينَ ٱتَّقَوْا۟ رَبَّهُمْ لَهُمْ غُرَفٌ مِّن فَوْقِهَا غُرَفٌ مَّبْنِيَّةٌ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ ۖ وَعْدَ ٱللَّهِ ۖ لَا يُخْلِفُ ٱللَّهُ ٱلْمِيعَادَ

Transliteration lākini alladhīna ittaqaw rabbahum lahum ghurafun min fawqihā ghurafun mabniyyatun tajrī min taḥtihā l-anhāru waʿda l-lahi lā yukh'lifu l-lahu l-mīʿāda

Telugu కాని ఎవరైతే తమ ప్రభువు యెడల భయభక్తులు కలిగి ఉన్నారో! వారి కొరకు అంతస్తుపై అంతస్తుగా, కట్టబడిన ఎత్తైన భవనాలు ఉంటాయి. వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. ఇది అల్లాహ్ వాగ్దానం. అల్లాహ్ తన వాగ్దానాన్ని ఎన్నడూ భంగపరచడు.

Verse 21

أَلَمْ تَرَ أَنَّ ٱللَّهَ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءً فَسَلَكَهُۥ يَنَـٰبِيعَ فِى ٱلْأَرْضِ ثُمَّ يُخْرِجُ بِهِۦ زَرْعًا مُّخْتَلِفًا أَلْوَٰنُهُۥ ثُمَّ يَهِيجُ فَتَرَىٰهُ مُصْفَرًّا ثُمَّ يَجْعَلُهُۥ حُطَـٰمًا ۚ إِنَّ فِى ذَٰلِكَ لَذِكْرَىٰ لِأُو۟لِى ٱلْأَلْبَـٰبِ

Transliteration alam tara anna l-laha anzala mina l-samāi māan fasalakahu yanābīʿa fī l-arḍi thumma yukh'riju bihi zarʿan mukh'talifan alwānuhu thumma yahīju fatarāhu muṣ'farran thumma yajʿaluhu ḥuṭāman inna fī dhālika ladhik'rā li-ulī l-albābi

Telugu ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా, అల్లాహ్ ఆకాశం నుండి నీటిని కురిపించి, తరువాత దానిని భూమిలో ఊటలుగా ప్రవహింప జేస్తున్నాడని? ఆ తరువాత దాని వల్ల వివిధ రంగుల వృక్షకోటిని ఉత్పత్తి చేస్తాడు. ఆ తరువాత అది ఎండిపోయి నపుడు, నీవు దానిని పసుపు రంగుగా మారిపోవటాన్ని చూస్తావు. చివరకు ఆయన దానిని పొట్టుగా మార్చి వేస్తాడు. నిశ్చయంగా ఇందులో బుద్ధిమంతులకు హితబోధ ఉంది.

Verse 22

أَفَمَن شَرَحَ ٱللَّهُ صَدْرَهُۥ لِلْإِسْلَـٰمِ فَهُوَ عَلَىٰ نُورٍ مِّن رَّبِّهِۦ ۚ فَوَيْلٌ لِّلْقَـٰسِيَةِ قُلُوبُهُم مِّن ذِكْرِ ٱللَّهِ ۚ أُو۟لَـٰٓئِكَ فِى ضَلَـٰلٍ مُّبِينٍ

Transliteration afaman sharaḥa l-lahu ṣadrahu lil'is'lāmi fahuwa ʿalā nūrin min rabbihi fawaylun lil'qāsiyati qulūbuhum min dhik'ri l-lahi ulāika fī ḍalālin mubīnin

Telugu ఏమీ? ఏ వ్యక్తి హృదయాన్నైతే అల్లాహ్ విధేయత (ఇస్లాం) కొరకు తెరుస్తాడో, అతడు తన ప్రభువు చూపిన వెలుగులో నడుస్తూ ఉంటాడో (అలాంటి వాడు సత్యతిరస్కారితో సమానుడు కాగలడా?) ఎవరి హృదయాలైతే అల్లాహ్ హితోపదేశం పట్ల కఠినమై పోయాయో, అలాంటి వారికి వినాశం ఉంది. అలాంటి వారు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు!

Verse 23

ٱللَّهُ نَزَّلَ أَحْسَنَ ٱلْحَدِيثِ كِتَـٰبًا مُّتَشَـٰبِهًا مَّثَانِىَ تَقْشَعِرُّ مِنْهُ جُلُودُ ٱلَّذِينَ يَخْشَوْنَ رَبَّهُمْ ثُمَّ تَلِينُ جُلُودُهُمْ وَقُلُوبُهُمْ إِلَىٰ ذِكْرِ ٱللَّهِ ۚ ذَٰلِكَ هُدَى ٱللَّهِ يَهْدِى بِهِۦ مَن يَشَآءُ ۚ وَمَن يُضْلِلِ ٱللَّهُ فَمَا لَهُۥ مِنْ هَادٍ

Transliteration al-lahu nazzala aḥsana l-ḥadīthi kitāban mutashābihan mathāniya taqshaʿirru min'hu julūdu alladhīna yakhshawna rabbahum thumma talīnu julūduhum waqulūbuhum ilā dhik'ri l-lahi dhālika hudā l-lahi yahdī bihi man yashāu waman yuḍ'lili l-lahu famā lahu min hādin

Telugu అల్లాహ్ సర్వశ్రేష్ఠమైన బోధనలను ఒక గ్రంథ రూపంలో అవతరింపజేశాడు. దానిలో ఒకే రకమైన వాటిని (వచనాలను) మాటిమాటికీ ఎన్నో విధాలుగా (విశదీకరించాడు). తమ ప్రభువుకు భయపడే వారి శరీరాలు (చర్మాలు) దానితో (ఆ పఠనంతో) గజగజ వణుకుతాయి. కాని తరువాత వారి చర్మాలు మరియు వారి హృదయాలు అల్లాహ్ ధ్యానం వలన మెత్తబడతాయి. ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. ఆయన దీనితో తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఏ వ్యక్తిని అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదలుతాడో, అతనికి మార్గదర్శకుడు ఎవ్వడూ ఉండడు.

Verse 24

أَفَمَن يَتَّقِى بِوَجْهِهِۦ سُوٓءَ ٱلْعَذَابِ يَوْمَ ٱلْقِيَـٰمَةِ ۚ وَقِيلَ لِلظَّـٰلِمِينَ ذُوقُوا۟ مَا كُنتُمْ تَكْسِبُونَ

Transliteration afaman yattaqī biwajhihi sūa l-ʿadhābi yawma l-qiyāmati waqīla lilẓẓālimīna dhūqū mā kuntum taksibūna

Telugu ఏమీ? పునరుత్థాన దినవు కఠినమైన శిక్షను తన ముఖంతో కాపాడు కోవలసిన వాడు (స్వర్గంలో ప్రవేశించేవానితో సమానుడా)? మరియు (ఆ రోజు) దుర్మార్గులతో ఇలా అనబడుతుంది: "మీరు సంపాదించిన దానిని రుచి చూడండి."

Verse 25

كَذَّبَ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ فَأَتَىٰهُمُ ٱلْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُونَ

Transliteration kadhaba alladhīna min qablihim fa-atāhumu l-ʿadhābu min ḥaythu lā yashʿurūna

Telugu వీరికి పూర్వమున్న వారు కూడా (అల్లాహ్ సందేశాలను) అబద్ధాలని తిరస్కరించారు, కాబట్టి వారు ఊహించలేని దిశ నుండి వారిపై శిక్ష వచ్చి పడింది.

Verse 26

فَأَذَاقَهُمُ ٱللَّهُ ٱلْخِزْىَ فِى ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا ۖ وَلَعَذَابُ ٱلْـَٔاخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا۟ يَعْلَمُونَ

Transliteration fa-adhāqahumu l-lahu l-khiz'ya fī l-ḥayati l-dun'yā walaʿadhābu l-ākhirati akbaru law kānū yaʿlamūna

Telugu ఈ విధంగా, అల్లాహ్ వారికి ఇహలోక జీవితంలో కూడా అవమానాన్ని రుచి చూపాడు. మరియు వారి పరలోక శిక్ష దీని కంటే ఎంతో ఘోరమైనదిగా ఉంటుంది. వారు ఇది గ్రహిస్తే ఎంత బాగుండేది!

Verse 27

وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِى هَـٰذَا ٱلْقُرْءَانِ مِن كُلِّ مَثَلٍ لَّعَلَّهُمْ يَتَذَكَّرُونَ

Transliteration walaqad ḍarabnā lilnnāsi fī hādhā l-qur'āni min kulli mathalin laʿallahum yatadhakkarūna

Telugu మరియు వాస్తవానికి మేము ఈ ఖుర్ఆన్ లో ప్రజల కొరకు అనేక రకాల దృష్టాంతాలు పేర్కొన్నాము, బహుశా వారు గుణపాఠం నేర్చుకుంటారని;

Verse 28

قُرْءَانًا عَرَبِيًّا غَيْرَ ذِى عِوَجٍ لَّعَلَّهُمْ يَتَّقُونَ

Transliteration qur'ānan ʿarabiyyan ghayra dhī ʿiwajin laʿallahum yattaqūna

Telugu అరబ్బీ భాషలో ఉన్న ఈ ఖుర్ఆన్ ను, ఏ విధమైన వక్రత లేకుండా అవతరింప జేశాము; బహుశా వారు దైవభీతి కలిగి వుంటారని.

Verse 29

ضَرَبَ ٱللَّهُ مَثَلًا رَّجُلًا فِيهِ شُرَكَآءُ مُتَشَـٰكِسُونَ وَرَجُلًا سَلَمًا لِّرَجُلٍ هَلْ يَسْتَوِيَانِ مَثَلًا ۚ ٱلْحَمْدُ لِلَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ

Transliteration ḍaraba l-lahu mathalan rajulan fīhi shurakāu mutashākisūna warajulan salaman lirajulin hal yastawiyāni mathalan l-ḥamdu lillahi bal aktharuhum lā yaʿlamūna

Telugu అల్లాహ్ ఒక దృష్టాంతం ఇస్తున్నాడు: ఒక మానవుడు (బానిస) పరస్పరం విరోధమున్న ఎంతో మంది యజమానులకు చెదినవాడు. మరొక మానవుడు (బానిస) పూర్తిగా ఒకే ఒక్క యజమానికి చెందిన వాడు, వారిద్దరి పరిస్థితి సమానంగా ఉంటుందా? సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! కాని వారిలో చాలా మందికి ఇది తెలియదు.

Verse 30

إِنَّكَ مَيِّتٌ وَإِنَّهُم مَّيِّتُونَ

Transliteration innaka mayyitun wa-innahum mayyitūna

Telugu (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, (ఒక రోజు) నీవు మరణిస్తావు మరియు నిశ్చయంగా వారు కూడా మరణిస్తారు.

Verse 31

ثُمَّ إِنَّكُمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ عِندَ رَبِّكُمْ تَخْتَصِمُونَ

Transliteration thumma innakum yawma l-qiyāmati ʿinda rabbikum takhtaṣimūna

Telugu ఆ తరువాత నిశ్చయంగా, పునరుత్థాన దినమున మీరంతా మీ ప్రభువు సమక్షంలో మీ వివాదాలను విన్నవించుకుంటారు.

Verse 32

۞ فَمَنْ أَظْلَمُ مِمَّن كَذَبَ عَلَى ٱللَّهِ وَكَذَّبَ بِٱلصِّدْقِ إِذْ جَآءَهُۥٓ ۚ أَلَيْسَ فِى جَهَنَّمَ مَثْوًى لِّلْكَـٰفِرِينَ

Transliteration faman aẓlamu mimman kadhaba ʿalā l-lahi wakadhaba bil-ṣid'qi idh jāahu alaysa fī jahannama mathwan lil'kāfirīna

Telugu ఇక అల్లాహ్ ను గురించి అసత్యం కల్పించి, సత్యం తన ముందుకు వచ్చినప్పుడు దానిని తిరస్కరించే వాని కంటే పరమ దుర్మార్గుడెవడు? అందుకే! సత్యతిరస్కారులకు కేవలం నరకంలోనే కదా నివాసం ఉండేది?

Verse 33

وَٱلَّذِى جَآءَ بِٱلصِّدْقِ وَصَدَّقَ بِهِۦٓ ۙ أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْمُتَّقُونَ

Transliteration wa-alladhī jāa bil-ṣid'qi waṣaddaqa bihi ulāika humu l-mutaqūna

Telugu మరియు సత్యాన్ని తెచ్చినవాడూ మరియు దానిని హృదయపూర్వకంగా నమ్మిన వాడూ, ఇలాంటి వారే దైవభీతి గలవారు.

Verse 34

لَهُم مَّا يَشَآءُونَ عِندَ رَبِّهِمْ ۚ ذَٰلِكَ جَزَآءُ ٱلْمُحْسِنِينَ

Transliteration lahum mā yashāūna ʿinda rabbihim dhālika jazāu l-muḥ'sinīna

Telugu వారికి తమ ప్రభువు వద్ద వారు కోరిందంతా లభిస్తుంది. ఇదే సజ్జనులకు దొరికే ప్రతిఫలం.

Verse 35

لِيُكَفِّرَ ٱللَّهُ عَنْهُمْ أَسْوَأَ ٱلَّذِى عَمِلُوا۟ وَيَجْزِيَهُمْ أَجْرَهُم بِأَحْسَنِ ٱلَّذِى كَانُوا۟ يَعْمَلُونَ

Transliteration liyukaffira l-lahu ʿanhum aswa-a alladhī ʿamilū wayajziyahum ajrahum bi-aḥsani alladhī kānū yaʿmalūna

Telugu దానికి బదులుగా అల్లాహ్, వారు చేసిన ఘోర పాపకార్యాలను రద్దు చేయటానికి మరియు వారు చేస్తూ వచ్చిన మంచి పనులకు అత్యుత్తమ ప్రతిఫలం ఇవ్వటానికి!

Verse 36

أَلَيْسَ ٱللَّهُ بِكَافٍ عَبْدَهُۥ ۖ وَيُخَوِّفُونَكَ بِٱلَّذِينَ مِن دُونِهِۦ ۚ وَمَن يُضْلِلِ ٱللَّهُ فَمَا لَهُۥ مِنْ هَادٍ

Transliteration alaysa l-lahu bikāfin ʿabdahu wayukhawwifūnaka bi-alladhīna min dūnihi waman yuḍ'lili l-lahu famā lahu min hādin

Telugu ఏమిటి? అల్లాహ్ తన దాసునికి చాలడా? అయినా వారు ఆయన (అల్లాహ్) ను విడిచి, ఇతరులను గురించి నిన్ను భయపెడు తున్నారు. మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడనిచ్చిన వానికి మార్గదర్శకుడు ఎవ్వడూ ఉండడు.

Verse 37

وَمَن يَهْدِ ٱللَّهُ فَمَا لَهُۥ مِن مُّضِلٍّ ۗ أَلَيْسَ ٱللَّهُ بِعَزِيزٍ ذِى ٱنتِقَامٍ

Transliteration waman yahdi l-lahu famā lahu min muḍillin alaysa l-lahu biʿazīzin dhī intiqāmin

Telugu మరియు అల్లాహ్ మార్గదర్శకత్వం చేసిన వానిని, మార్గభ్రష్టుడు చేయగల వాడెవ్వడూ లేడు! ఏమీ? అల్లాహ్ సర్వశక్తిమంతుడు, ప్రతీకారం చేయగలవాడు కాడా?

Verse 38

وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ لَيَقُولُنَّ ٱللَّهُ ۚ قُلْ أَفَرَءَيْتُم مَّا تَدْعُونَ مِن دُونِ ٱللَّهِ إِنْ أَرَادَنِىَ ٱللَّهُ بِضُرٍّ هَلْ هُنَّ كَـٰشِفَـٰتُ ضُرِّهِۦٓ أَوْ أَرَادَنِى بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكَـٰتُ رَحْمَتِهِۦ ۚ قُلْ حَسْبِىَ ٱللَّهُ ۖ عَلَيْهِ يَتَوَكَّلُ ٱلْمُتَوَكِّلُونَ

Transliteration wala-in sa-altahum man khalaqa l-samāwāti wal-arḍa layaqūlunna l-lahu qul afara-aytum mā tadʿūna min dūni l-lahi in arādaniya l-lahu biḍurrin hal hunna kāshifātu ḍurrihi aw arādanī biraḥmatin hal hunna mum'sikātu raḥmatihi qul ḥasbiya l-lahu ʿalayhi yatawakkalu l-mutawakilūna

Telugu మరియు ఒకవేళ నీవు వారితో: "భూమ్యాకాశాలను సృష్టించింది ఎవరు?" అని అడిగితే, వారు నిశ్చయంగా: "అల్లాహ్!" అని అంటారు. వారిని ఇలా అడుగు: "ఏమీ? మీరు ఆలోచించరా? అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించేవి - అల్లాహ్ నాకు కీడు చేయదలచుకుంటే - ఆయన కీడు నుండి, నన్ను తప్పించగలవా? లేక, ఆయన (అల్లాహ్) నన్ను కరుణించగోరితే ఇవి ఆయన కారుణ్యాన్ని ఆపగలవా?" వారితో ఇంకా ఇలా అను: "నాకు కేవలం అల్లాహ్ చాలు! ఆయన (అల్లాహ్) ను నమ్మేవారు (విశ్వాసులు), కేవలం ఆయన మీదే నమ్మక ముంచుకుంటారు."

Verse 39

قُلْ يَـٰقَوْمِ ٱعْمَلُوا۟ عَلَىٰ مَكَانَتِكُمْ إِنِّى عَـٰمِلٌ ۖ فَسَوْفَ تَعْلَمُونَ

Transliteration qul yāqawmi iʿ'malū ʿalā makānatikum innī ʿāmilun fasawfa taʿlamūna

Telugu (ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "ఓ నా జాతి ప్రజలారా! మీరు మీ ఇష్టప్రకారం మీ పని చేస్తూ ఉండండి; నిశ్చయంగా, నేనూ నా పని చేస్తూ ఉంటాను. తరువాత మీరు తెలుసుకోగలరు;

Verse 40

مَن يَأْتِيهِ عَذَابٌ يُخْزِيهِ وَيَحِلُّ عَلَيْهِ عَذَابٌ مُّقِيمٌ

Transliteration man yatīhi ʿadhābun yukh'zīhi wayaḥillu ʿalayhi ʿadhābun muqīmun

Telugu (ఇహలోకంలో) ఎవరి మీద అవమానకరమైన శిక్ష వచ్చిపడుతుందో మరియు (పరలోక జీవితంలో) ఎవరి మీద శాశ్వతమైన శిక్ష పడనున్నదో!"

Verse 41

إِنَّآ أَنزَلْنَا عَلَيْكَ ٱلْكِتَـٰبَ لِلنَّاسِ بِٱلْحَقِّ ۖ فَمَنِ ٱهْتَدَىٰ فَلِنَفْسِهِۦ ۖ وَمَن ضَلَّ فَإِنَّمَا يَضِلُّ عَلَيْهَا ۖ وَمَآ أَنتَ عَلَيْهِم بِوَكِيلٍ

Transliteration innā anzalnā ʿalayka l-kitāba lilnnāsi bil-ḥaqi famani ih'tadā falinafsihi waman ḍalla fa-innamā yaḍillu ʿalayhā wamā anta ʿalayhim biwakīlin

Telugu నిశ్చయంగా, మేము మానవులందరి కొరకు, ఈ గ్రంథాన్ని, సత్యంతో నీపై అవతరింప జేశాము. కావున సన్మార్గంపై నడిచేవాడు తన మేలు కొరకే అలా చేస్తాడు. మరియు నిశ్చయంగా, మార్గభ్రష్టుడైన వాడు తన కీడు కొరకే మార్గభ్రష్టుడవుతాడు. మరియు నీవు వారి కొరకు బాధ్యుడవు కావు.

Verse 42

ٱللَّهُ يَتَوَفَّى ٱلْأَنفُسَ حِينَ مَوْتِهَا وَٱلَّتِى لَمْ تَمُتْ فِى مَنَامِهَا ۖ فَيُمْسِكُ ٱلَّتِى قَضَىٰ عَلَيْهَا ٱلْمَوْتَ وَيُرْسِلُ ٱلْأُخْرَىٰٓ إِلَىٰٓ أَجَلٍ مُّسَمًّى ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ

Transliteration al-lahu yatawaffā l-anfusa ḥīna mawtihā wa-allatī lam tamut fī manāmihā fayum'siku allatī qaḍā ʿalayhā l-mawta wayur'silu l-ukh'rā ilā ajalin musamman inna fī dhālika laāyātin liqawmin yatafakkarūna

Telugu అల్లాహ్ యే ఆత్మలను (ప్రాణాలను) మరణ కాలమున వశపరచుకునేవాడు మరియు మరణించని వాడి (ఆత్మలను) నిద్రావస్థలో (వశపరచుకునే వాడునూ). తరువాత దేనికైతే మరణం నిర్ణయింప బడుతుందో దానిని ఆపుకొని, మిగతా వారి (ఆత్మలను) ఒక నియమిత కాలం వరకు తిరిగి పంపుతాడు. నిశ్చయంగా ఇందులో ఆలోచించే వారికి గొప్ప సూచనలు (ఆయాత్) ఉన్నాయి.

Verse 43

أَمِ ٱتَّخَذُوا۟ مِن دُونِ ٱللَّهِ شُفَعَآءَ ۚ قُلْ أَوَلَوْ كَانُوا۟ لَا يَمْلِكُونَ شَيْـًٔا وَلَا يَعْقِلُونَ

Transliteration ami ittakhadhū min dūni l-lahi shufaʿāa qul awalaw kānū lā yamlikūna shayan walā yaʿqilūna

Telugu ఏమీ? వారు అల్లాహ్ ను వదలి ఇతరులను సిఫారసుదారులుగా చేసుకున్నారా? వారిని ఇలా అడుగు: "ఏమీ? వారికెలాంటి అధికారం లేకున్నా మరియు వారికి బుద్ధి లేకున్నానా?"

Verse 44

قُل لِّلَّهِ ٱلشَّفَـٰعَةُ جَمِيعًا ۖ لَّهُۥ مُلْكُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۖ ثُمَّ إِلَيْهِ تُرْجَعُونَ

Transliteration qul lillahi l-shafāʿatu jamīʿan lahu mul'ku l-samāwāti wal-arḍi thumma ilayhi tur'jaʿūna

Telugu ఇలా అను: "సిఫారసు కేవలం అల్లాహ్ అధీనంలోనే ఉంది. భూమ్యాకాశాల సామ్రాజ్యాధి పత్యం కేవలం ఆయనకే చెందుతుంది. తరువాత ఆయన వైపునకే మీరంతా మరలింప బడతారు."

Verse 45

وَإِذَا ذُكِرَ ٱللَّهُ وَحْدَهُ ٱشْمَأَزَّتْ قُلُوبُ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْـَٔاخِرَةِ ۖ وَإِذَا ذُكِرَ ٱلَّذِينَ مِن دُونِهِۦٓ إِذَا هُمْ يَسْتَبْشِرُونَ

Transliteration wa-idhā dhukira l-lahu waḥdahu ish'ma-azzat qulūbu alladhīna lā yu'minūna bil-ākhirati wa-idhā dhukira alladhīna min dūnihi idhā hum yastabshirūna

Telugu మరియు ఒకవేళ అద్వితీయుడైన అల్లాహ్ ను గురించి ప్రస్తావన జరిగినపుడు, పరలోకాన్ని విశ్వసించని వారి హృదయాలు క్రుంగిపోతాయి. మరియు ఒకవేళ ఆయన తప్ప ఇతరుల ప్రస్తావన జరిగినపుడు వారు సంతోషంతో పొంగిపోతారు!

Verse 46

قُلِ ٱللَّهُمَّ فَاطِرَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ عَـٰلِمَ ٱلْغَيْبِ وَٱلشَّهَـٰدَةِ أَنتَ تَحْكُمُ بَيْنَ عِبَادِكَ فِى مَا كَانُوا۟ فِيهِ يَخْتَلِفُونَ

Transliteration quli l-lahuma fāṭira l-samāwāti wal-arḍi ʿālima l-ghaybi wal-shahādati anta taḥkumu bayna ʿibādika fī mā kānū fīhi yakhtalifūna

Telugu ఇలా అను: "ఓ అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికి మాలాధారుడా! అగోచర గోచరాలను ఎరిగినవాడా! నీవే నీ దాసుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను గురించి తీర్పు చేసేవాడవు."

Verse 47

وَلَوْ أَنَّ لِلَّذِينَ ظَلَمُوا۟ مَا فِى ٱلْأَرْضِ جَمِيعًا وَمِثْلَهُۥ مَعَهُۥ لَٱفْتَدَوْا۟ بِهِۦ مِن سُوٓءِ ٱلْعَذَابِ يَوْمَ ٱلْقِيَـٰمَةِ ۚ وَبَدَا لَهُم مِّنَ ٱللَّهِ مَا لَمْ يَكُونُوا۟ يَحْتَسِبُونَ

Transliteration walaw anna lilladhīna ẓalamū mā fī l-arḍi jamīʿan wamith'lahu maʿahu la-if'tadaw bihi min sūi l-ʿadhābi yawma l-qiyāmati wabadā lahum mina l-lahi mā lam yakūnū yaḥtasibūna

Telugu మరియు ఒకవేళ వాస్తవానికి ఈ దుర్మార్గుల వద్ద భూమిలో ఉన్న సమస్తమూ మరియు దానితో పాటు దానంత (రెట్టింపు) సంపద ఉన్నా పునరుత్థాన దినపు ఘోరశిక్ష నుండి తప్పించుకోవటానికి, వారు దానిని పరిహారంగా ఇవ్వగోరుతారు. ఎందుకంటే! అల్లాహ్ తరఫు నుండి వారి ముందు, వారు ఎన్నడూ లెక్కించనిదంతా ప్రత్యక్షమవుతుంది.

Verse 48

وَبَدَا لَهُمْ سَيِّـَٔاتُ مَا كَسَبُوا۟ وَحَاقَ بِهِم مَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ

Transliteration wabadā lahum sayyiātu mā kasabū waḥāqa bihim mā kānū bihi yastahziūna

Telugu మరియు వారు చేసి వున్న దుష్టకార్యాలన్నీ స్పష్టంగా వారి ముందుకు వస్తాయి. మరియు వారు ఎగతాళి చేస్తూ వచ్చిందే వారిని చుట్టుకుంటుంది.

Verse 49

فَإِذَا مَسَّ ٱلْإِنسَـٰنَ ضُرٌّ دَعَانَا ثُمَّ إِذَا خَوَّلْنَـٰهُ نِعْمَةً مِّنَّا قَالَ إِنَّمَآ أُوتِيتُهُۥ عَلَىٰ عِلْمٍۭ ۚ بَلْ هِىَ فِتْنَةٌ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ

Transliteration fa-idhā massa l-insāna ḍurrun daʿānā thumma idhā khawwalnāhu niʿ'matan minnā qāla innamā ūtītuhu ʿalā ʿil'min bal hiya fit'natun walākinna aktharahum lā yaʿlamūna

Telugu ఒకవేళ మానవునికి ఆపద వస్తే అతడు మమ్మల్ని వేడుకుంటాడు. ఆ తరువాత మేము మా దిక్కు నుండి అతనికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తే అతడు: "నిశ్చయంగా, ఇది నాకున్న తెలివి వల్ల నాకు ఇవ్వబడింది!" అని అంటాడు. వాస్తవానికి, అది ఒక పరీక్ష, కాని చాలా మంది ఇది తెలుసుకోలేరు.

Verse 50

قَدْ قَالَهَا ٱلَّذِينَ مِن قَبْلِهِمْ فَمَآ أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا۟ يَكْسِبُونَ

Transliteration qad qālahā alladhīna min qablihim famā aghnā ʿanhum mā kānū yaksibūna

Telugu వాస్తవానికి, వీరికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే అన్నారు, కాని వారు సంపాదించినదంతా వారికి ఏ విధంగానూ పనికి రాలేదు.

Verse 51

فَأَصَابَهُمْ سَيِّـَٔاتُ مَا كَسَبُوا۟ ۚ وَٱلَّذِينَ ظَلَمُوا۟ مِنْ هَـٰٓؤُلَآءِ سَيُصِيبُهُمْ سَيِّـَٔاتُ مَا كَسَبُوا۟ وَمَا هُم بِمُعْجِزِينَ

Transliteration fa-aṣābahum sayyiātu mā kasabū wa-alladhīna ẓalamū min hāulāi sayuṣībuhum sayyiātu mā kasabū wamā hum bimuʿ'jizīna

Telugu కావున, వారు చేసిన దుష్కార్యాల ఫలితాలు వారిపై పడ్డాయి. మరియు వారిలోని దుర్మార్గులు తాము చేసిన దుష్కార్యాల ఫలితాలను త్వరలోనే అనుభవించగలరు. మరియు వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు.

Verse 52

أَوَلَمْ يَعْلَمُوٓا۟ أَنَّ ٱللَّهَ يَبْسُطُ ٱلرِّزْقَ لِمَن يَشَآءُ وَيَقْدِرُ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ

Transliteration awalam yaʿlamū anna l-laha yabsuṭu l-riz'qa liman yashāu wayaqdiru inna fī dhālika laāyātin liqawmin yu'minūna

Telugu ఏమీ? వారికి తెలియదా? నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడని మరియు (తాను కోరిన వారికి) మితంగా ఇస్తాడని? నిశ్చయంగా, ఇందులో విశ్వసించేవారికి ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి.

Verse 53

۞ قُلْ يَـٰعِبَادِىَ ٱلَّذِينَ أَسْرَفُوا۟ عَلَىٰٓ أَنفُسِهِمْ لَا تَقْنَطُوا۟ مِن رَّحْمَةِ ٱللَّهِ ۚ إِنَّ ٱللَّهَ يَغْفِرُ ٱلذُّنُوبَ جَمِيعًا ۚ إِنَّهُۥ هُوَ ٱلْغَفُورُ ٱلرَّحِيمُ

Transliteration qul yāʿibādiya alladhīna asrafū ʿalā anfusihim lā taqnaṭū min raḥmati l-lahi inna l-laha yaghfiru l-dhunūba jamīʿan innahu huwa l-ghafūru l-raḥīmu

Telugu ఇలా అను: "స్వయంగా మీకు (మీ ఆత్మలకు) మీరే అన్యాయం చేసుకున్న నా దాసులారా! అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిశ్చయంగా ఆయన! కేవలం ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత."

Verse 54

وَأَنِيبُوٓا۟ إِلَىٰ رَبِّكُمْ وَأَسْلِمُوا۟ لَهُۥ مِن قَبْلِ أَن يَأْتِيَكُمُ ٱلْعَذَابُ ثُمَّ لَا تُنصَرُونَ

Transliteration wa-anībū ilā rabbikum wa-aslimū lahu min qabli an yatiyakumu l-ʿadhābu thumma lā tunṣarūna

Telugu మరియు మీరు పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపునకు మరలండి మరియు మీ పైకి శిక్ష రాకముందే, మీరు ఆయనకు విధేయులు (ముస్లింలు) అయి ఉండండి, తరువాత మీకు ఎలాంటి సహాయం లభించదు.

Verse 55

وَٱتَّبِعُوٓا۟ أَحْسَنَ مَآ أُنزِلَ إِلَيْكُم مِّن رَّبِّكُم مِّن قَبْلِ أَن يَأْتِيَكُمُ ٱلْعَذَابُ بَغْتَةً وَأَنتُمْ لَا تَشْعُرُونَ

Transliteration wa-ittabiʿū aḥsana mā unzila ilaykum min rabbikum min qabli an yatiyakumu l-ʿadhābu baghtatan wa-antum lā tashʿurūna

Telugu మరియు మీకు తెలియకుండానే అకస్మాత్తుగా, మీపైకి శిక్ష రాకముందే మీ ప్రభువు తరఫు నుండి మీ కొరకు అవతరింప జేయబడిన శ్రేష్ఠమైన దానిని (ఈ ఖుర్ఆన్ ను) అనుసరించండి.

Verse 56

أَن تَقُولَ نَفْسٌ يَـٰحَسْرَتَىٰ عَلَىٰ مَا فَرَّطتُ فِى جَنۢبِ ٱللَّهِ وَإِن كُنتُ لَمِنَ ٱلسَّـٰخِرِينَ

Transliteration an taqūla nafsun yāḥasratā ʿalā mā farraṭtu fī janbi l-lahi wa-in kuntu lamina l-sākhirīna

Telugu లేకపోతే మానవుడు: "నా పాడుగానూ! నేను అల్లాహ్ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండకపోతే మరియు ఎగతాళి చేసేవారిలో చేరి ఉండకపోతే ఎంత బాగుండేది!" అని పశ్చాత్తాప పడవచ్చు!

Verse 57

أَوْ تَقُولَ لَوْ أَنَّ ٱللَّهَ هَدَىٰنِى لَكُنتُ مِنَ ٱلْمُتَّقِينَ

Transliteration aw taqūla law anna l-laha hadānī lakuntu mina l-mutaqīna

Telugu లేక, ఇలా అనవచ్చు: "ఒకవేళ అల్లాహ్ నాకు సన్మార్గం చూపి వుంటే, నేను కూడా దైవభీతి గలవారిలో చేరిపోయేవాడిని కదా!"

Verse 58

أَوْ تَقُولَ حِينَ تَرَى ٱلْعَذَابَ لَوْ أَنَّ لِى كَرَّةً فَأَكُونَ مِنَ ٱلْمُحْسِنِينَ

Transliteration aw taqūla ḥīna tarā l-ʿadhāba law anna lī karratan fa-akūna mina l-muḥ'sinīna

Telugu లేక శిక్షను చూసి ఇలా అనవచ్చు: "ఒకవేళ నాకు మరల (ఇహలోకానికి) పోయే అవకాశం దొరికి ఉంటే నేను తప్పక సజ్జనులలో చేరి పోయేవాడిని కదా!"

Verse 59

بَلَىٰ قَدْ جَآءَتْكَ ءَايَـٰتِى فَكَذَّبْتَ بِهَا وَٱسْتَكْبَرْتَ وَكُنتَ مِنَ ٱلْكَـٰفِرِينَ

Transliteration balā qad jāatka āyātī fakadhabta bihā wa-is'takbarta wakunta mina l-kāfirīna

Telugu (అప్పుడు అతనికి అల్లాహ్ ఇలా సెలవిస్తాడు): "అలా కాదు! వాస్తవానికి నా సూచనలు (ఆయాత్) నీ వద్దకు వచ్చాయి. కాని నీవు వాటిని అబద్ధాలని తిరస్కరించావు మరియు గర్వానికి లోనయ్యావు మరియు నీవు సత్యతిరస్కారులలో చేరిపోయావు."

Verse 60

وَيَوْمَ ٱلْقِيَـٰمَةِ تَرَى ٱلَّذِينَ كَذَبُوا۟ عَلَى ٱللَّهِ وُجُوهُهُم مُّسْوَدَّةٌ ۚ أَلَيْسَ فِى جَهَنَّمَ مَثْوًى لِّلْمُتَكَبِّرِينَ

Transliteration wayawma l-qiyāmati tarā alladhīna kadhabū ʿalā l-lahi wujūhuhum mus'waddatun alaysa fī jahannama mathwan lil'mutakabbirīna

Telugu మరియు పునరుత్థాన దినమున అల్లాహ్ పై అబద్ధాలు పలికిన వారి ముఖాలను నల్లగా మారిపోవటాన్ని నీవు గమనిస్తావు. ఏమీ? ఈ గర్విష్టుల నివాసం నరకంలోనే ఉండదా?

Verse 61

وَيُنَجِّى ٱللَّهُ ٱلَّذِينَ ٱتَّقَوْا۟ بِمَفَازَتِهِمْ لَا يَمَسُّهُمُ ٱلسُّوٓءُ وَلَا هُمْ يَحْزَنُونَ

Transliteration wayunajjī l-lahu alladhīna ittaqaw bimafāzatihim lā yamassuhumu l-sūu walā hum yaḥzanūna

Telugu మరియు అల్లాహ్, భయభక్తులు గలవారిని వారి సాఫల్యానికి బదులుగా వారికి ముక్తిని ప్రసాదిస్తాడు. ఎలాంటి బాధ వారిని ముట్టుకోదు మరియు వారు దుఃఖపడరు కూడా!

Verse 62

ٱللَّهُ خَـٰلِقُ كُلِّ شَىْءٍ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَىْءٍ وَكِيلٌ

Transliteration al-lahu khāliqu kulli shayin wahuwa ʿalā kulli shayin wakīlun

Telugu అల్లాహ్ యే ప్రతి దాని సృష్టికర్త మరియు ఆయనే ప్రతి దానికి కార్యకర్త.

Verse 63

لَّهُۥ مَقَالِيدُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۗ وَٱلَّذِينَ كَفَرُوا۟ بِـَٔايَـٰتِ ٱللَّهِ أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْخَـٰسِرُونَ

Transliteration lahu maqālīdu l-samāwāti wal-arḍi wa-alladhīna kafarū biāyāti l-lahi ulāika humu l-khāsirūna

Telugu ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న నిక్షేపాల తాళపు చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. మరియు ఎవరైతే అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) తిరస్కరిస్తారో అలాంటి వారు. వారే! నష్టానికి గురి అయ్యే వారు.

Verse 64

قُلْ أَفَغَيْرَ ٱللَّهِ تَأْمُرُوٓنِّىٓ أَعْبُدُ أَيُّهَا ٱلْجَـٰهِلُونَ

Transliteration qul afaghayra l-lahi tamurūnnī aʿbudu ayyuhā l-jāhilūna

Telugu (ఓ ప్రవక్తా!) ఇలా అను: "ఓ మూర్ఖులారా! ఏమీ? అల్లాహ్ ను వదలి, ఇతరులను ఆరాధించమని, మీరు నన్ను ఆజ్ఞాపిస్తున్నారా?"

Verse 65

وَلَقَدْ أُوحِىَ إِلَيْكَ وَإِلَى ٱلَّذِينَ مِن قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ ٱلْخَـٰسِرِينَ

Transliteration walaqad ūḥiya ilayka wa-ilā alladhīna min qablika la-in ashrakta layaḥbaṭanna ʿamaluka walatakūnanna mina l-khāsirīna

Telugu మరియు వాస్తవానికి! నీకూ మరియు నీకంటే ముందు వచ్చిన (ప్రతి ప్రవక్తకూ) దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలుపబడింది: "ఒకవేళ నీవు బహుదైవారాధన (షిర్కు) చేసినట్లైతే నీ కర్మలన్నీ వ్యర్థమై పోతాయి మరియు నిశ్చయంగా, నీవు నష్టానికి గురి అయిన వారిలో చేరిపోతావు."

Verse 66

بَلِ ٱللَّهَ فَٱعْبُدْ وَكُن مِّنَ ٱلشَّـٰكِرِينَ

Transliteration bali l-laha fa-uʿ'bud wakun mina l-shākirīna

Telugu అలా కాదు! నీవు కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించు మరియు కృతజ్ఞులలో చేరిపో!

Verse 67

وَمَا قَدَرُوا۟ ٱللَّهَ حَقَّ قَدْرِهِۦ وَٱلْأَرْضُ جَمِيعًا قَبْضَتُهُۥ يَوْمَ ٱلْقِيَـٰمَةِ وَٱلسَّمَـٰوَٰتُ مَطْوِيَّـٰتٌۢ بِيَمِينِهِۦ ۚ سُبْحَـٰنَهُۥ وَتَعَـٰلَىٰ عَمَّا يُشْرِكُونَ

Transliteration wamā qadarū l-laha ḥaqqa qadrihi wal-arḍu jamīʿan qabḍatuhu yawma l-qiyāmati wal-samāwātu maṭwiyyātun biyamīnihi sub'ḥānahu wataʿālā ʿammā yush'rikūna

Telugu వారు అల్లాహ్ సామర్ధ్యాన్ని గుర్తించ వలసిన విధంగా గుర్తించలేదు; పునరుత్థాన దినమున భూమి అంతా ఆయన పిడికిలిలో ఉంటుంది; మరియు ఆకాశాలన్నీ చుట్టబడి ఆయన కుడిచేతిలో ఉంటాయి. ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు వారు కల్పించే భాగస్వాముల కంటే అత్యున్నతుడు.

Verse 68

وَنُفِخَ فِى ٱلصُّورِ فَصَعِقَ مَن فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَن فِى ٱلْأَرْضِ إِلَّا مَن شَآءَ ٱللَّهُ ۖ ثُمَّ نُفِخَ فِيهِ أُخْرَىٰ فَإِذَا هُمْ قِيَامٌ يَنظُرُونَ

Transliteration wanufikha fī l-ṣūri faṣaʿiqa man fī l-samāwāti waman fī l-arḍi illā man shāa l-lahu thumma nufikha fīhi ukh'rā fa-idhā hum qiyāmun yanẓurūna

Telugu మరియు బాకా (సూర్) ఊదబడినప్పుడు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న వారందరూ మూర్ఛిల్లి పడిపోతారు అల్లాహ్ కోరిన వారు తప్ప. ఆ తరువాత రెండవసారి (బాకా) ఊదబడుతుంది అప్పుడు వారందరూ లేచి చూడటం ప్రారంభిస్తారు.

Verse 69

وَأَشْرَقَتِ ٱلْأَرْضُ بِنُورِ رَبِّهَا وَوُضِعَ ٱلْكِتَـٰبُ وَجِا۟ىٓءَ بِٱلنَّبِيِّـۧنَ وَٱلشُّهَدَآءِ وَقُضِىَ بَيْنَهُم بِٱلْحَقِّ وَهُمْ لَا يُظْلَمُونَ

Transliteration wa-ashraqati l-arḍu binūri rabbihā wawuḍiʿa l-kitābu wajīa bil-nabiyīna wal-shuhadāi waquḍiya baynahum bil-ḥaqi wahum lā yuẓ'lamūna

Telugu మరియు భూమి తన ప్రభువు తేజస్సుతో వెలిగి పోతుంది మరియు కర్మపత్రం వారి యెదుట ఉంచబడుతుంది, ప్రవక్తలు మరియు (ఇతర) సాక్షులు రప్పింపబడతారు. మరియు వారి మధ్య న్యాయంగా తీర్పు చేయబడుతుంది మరియు వారికెట్టి అన్యాయం జరుగదు.

Verse 70

وَوُفِّيَتْ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ وَهُوَ أَعْلَمُ بِمَا يَفْعَلُونَ

Transliteration wawuffiyat kullu nafsin mā ʿamilat wahuwa aʿlamu bimā yafʿalūna

Telugu మరియు ప్రతి వ్యక్తి (ఆత్మ) తాను చేసిన కర్మలకు పూర్తి ప్రతిఫలం పొందుతాడు. ఎందుకంటే వారు చేస్తున్న దంతా ఆయనకు బాగా తెలుసు.

Verse 71

وَسِيقَ ٱلَّذِينَ كَفَرُوٓا۟ إِلَىٰ جَهَنَّمَ زُمَرًا ۖ حَتَّىٰٓ إِذَا جَآءُوهَا فُتِحَتْ أَبْوَٰبُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَآ أَلَمْ يَأْتِكُمْ رُسُلٌ مِّنكُمْ يَتْلُونَ عَلَيْكُمْ ءَايَـٰتِ رَبِّكُمْ وَيُنذِرُونَكُمْ لِقَآءَ يَوْمِكُمْ هَـٰذَا ۚ قَالُوا۟ بَلَىٰ وَلَـٰكِنْ حَقَّتْ كَلِمَةُ ٱلْعَذَابِ عَلَى ٱلْكَـٰفِرِينَ

Transliteration wasīqa alladhīna kafarū ilā jahannama zumaran ḥattā idhā jāūhā futiḥat abwābuhā waqāla lahum khazanatuhā alam yatikum rusulun minkum yatlūna ʿalaykum āyāti rabbikum wayundhirūnakum liqāa yawmikum hādhā qālū balā walākin ḥaqqat kalimatu l-ʿadhābi ʿalā l-kāfirīna

Telugu సత్యాన్ని తిరస్కరించిన వారు గుంపులు గుంపులుగా నరకం వైపునకు తోలబడతారు. చివరకు వారు దాని వద్దకు వచ్చినపుడు, దాని ద్వారాలు తెరువబడతాయి మరియు వారితో దాని రక్షకులు ఇలా అంటారు: "ఏమీ? మీలో నుండి, మీ ప్రభువు సూచనలను వినిపించే సందేశహరులు మీ వద్దకు రాలేదా? మరియు వారు మిమ్మల్ని ఈనాటి మీ సమావేశాన్ని గురించి హెచ్చరించలేదా?" వారంటారు: "అవును (హెచ్చరించారు)!" కాని (అప్పటికే) సత్యతిరస్కారులపై శిక్షా నిర్ణయం తీసుకోబడి ఉంటుంది.

Verse 72

قِيلَ ٱدْخُلُوٓا۟ أَبْوَٰبَ جَهَنَّمَ خَـٰلِدِينَ فِيهَا ۖ فَبِئْسَ مَثْوَى ٱلْمُتَكَبِّرِينَ

Transliteration qīla ud'khulū abwāba jahannama khālidīna fīhā fabi'sa mathwā l-mutakabirīna

Telugu వారితో ఇలా అనబడుతుంది: "నరక ద్వారాలలోనికి ప్రవేశించండి, ఇక్కడ మీరు శాశ్వతంగా ఉంటారు. గర్విష్ఠుల నివాస స్థలం ఎంత చెడ్డది!"

Verse 73

وَسِيقَ ٱلَّذِينَ ٱتَّقَوْا۟ رَبَّهُمْ إِلَى ٱلْجَنَّةِ زُمَرًا ۖ حَتَّىٰٓ إِذَا جَآءُوهَا وَفُتِحَتْ أَبْوَٰبُهَا وَقَالَ لَهُمْ خَزَنَتُهَا سَلَـٰمٌ عَلَيْكُمْ طِبْتُمْ فَٱدْخُلُوهَا خَـٰلِدِينَ

Transliteration wasīqa alladhīna ittaqaw rabbahum ilā l-janati zumaran ḥattā idhā jāūhā wafutiḥat abwābuhā waqāla lahum khazanatuhā salāmun ʿalaykum ṭib'tum fa-ud'khulūhā khālidīna

Telugu మరియు తమ ప్రభువు పట్ల భయభక్తులు గలవారు గుంపులు గుంపులుగా స్వర్గం వైపునకు తీసుకొని పోబడతారు. చివరకు వారు దాని దగ్గరికి వచ్చినప్పుడు, దాని ద్వారాలు తెరువ బడతాయి మరియు దాని రక్షకులు వారితో అంటారు: "మీకు శాంతి కలుగు గాక (సలాం)! మీరు మంచిగా ప్రవర్తించారు, కావున ఇందులో శాశ్వతంగా ఉండటానికి ప్రవేశించండి!"

Verse 74

وَقَالُوا۟ ٱلْحَمْدُ لِلَّهِ ٱلَّذِى صَدَقَنَا وَعْدَهُۥ وَأَوْرَثَنَا ٱلْأَرْضَ نَتَبَوَّأُ مِنَ ٱلْجَنَّةِ حَيْثُ نَشَآءُ ۖ فَنِعْمَ أَجْرُ ٱلْعَـٰمِلِينَ

Transliteration waqālū l-ḥamdu lillahi alladhī ṣadaqanā waʿdahu wa-awrathanā l-arḍa natabawwa-u mina l-janati ḥaythu nashāu faniʿ'ma ajru l-ʿāmilīna

Telugu మరియు వారంటారు: "మాకు చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు మరియు ఆయనే మమ్మల్ని ఈ నేలకు వారసులుగా చేశాడు. స్వర్గంలో మేము కోరిన చోట స్థిరనివాసం ఏర్పరచుకోగలము! సత్కార్యాలు చేసేవారి ప్రతిఫలం ఎంత ఉత్తమమైనది!"

Verse 75

وَتَرَى ٱلْمَلَـٰٓئِكَةَ حَآفِّينَ مِنْ حَوْلِ ٱلْعَرْشِ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ ۖ وَقُضِىَ بَيْنَهُم بِٱلْحَقِّ وَقِيلَ ٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَـٰلَمِينَ

Transliteration watarā l-malāikata ḥāffīna min ḥawli l-ʿarshi yusabbiḥūna biḥamdi rabbihim waquḍiya baynahum bil-ḥaqi waqīla l-ḥamdu lillahi rabbi l-ʿālamīna

Telugu మరియు దైవదూతలను తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన సింహాసనాన్ని (అర్ష్ ను) అన్ని వైపుల నుండి చుట్టుకొని ఉండటాన్ని నీవు చూస్తావు. మరియు వారి (సర్వ ప్రాణుల) మధ్య న్యాయంగా తీర్పు చేయబడుతుంది మరియు : "సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ యే సమస్త లోకాలకు ప్రభువు." అని పలుకబడుతుంది.

Read Surah Az-Zumar in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.