Surah Az-Zukhruf in Telugu: translation and audio
Surah 43 · الزخرف · The Ornaments of Gold · 89 verses
Surah Az-Zukhruf verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Az-Zukhruf word by word in English.
Verse 1
حمٓ
Transliteration hha-meem
Telugu హా - మీమ్.
Verse 2
وَٱلْكِتَـٰبِ ٱلْمُبِينِ
Transliteration wal-kitābi l-mubīni
Telugu స్పష్టమైన ఈ గ్రంథం (ఖుర్ఆన్) సాక్షిగా!
Verse 3
إِنَّا جَعَلْنَـٰهُ قُرْءَٰنًا عَرَبِيًّا لَّعَلَّكُمْ تَعْقِلُونَ
Transliteration innā jaʿalnāhu qur'ānan ʿarabiyyan laʿallakum taʿqilūna
Telugu నిశ్చయంగా, మీరు అర్థం చేసుకోగలగటానికి, మేము దీనిని అరబ్బీ భాషలో ఖుర్ఆన్ గా అవతరింపజేశాము.
Verse 4
وَإِنَّهُۥ فِىٓ أُمِّ ٱلْكِتَـٰبِ لَدَيْنَا لَعَلِىٌّ حَكِيمٌ
Transliteration wa-innahu fī ummi l-kitābi ladaynā laʿaliyyun ḥakīmun
Telugu మరియు నిశ్చయంగా, ఇది మా వద్ద నున్న మాతృ గ్రంథంలోనిదే! అది మహోన్నతమైనది, వివేకంతో నిండి ఉన్నది.
Verse 5
أَفَنَضْرِبُ عَنكُمُ ٱلذِّكْرَ صَفْحًا أَن كُنتُمْ قَوْمًا مُّسْرِفِينَ
Transliteration afanaḍribu ʿankumu l-dhik'ra ṣafḥan an kuntum qawman mus'rifīna
Telugu ఏమిటి? మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారని, మేము ఈ హితోపదేశాన్ని (ఖుర్ఆన్ ను) మీ నుండి తొలగించాలా?
Verse 6
وَكَمْ أَرْسَلْنَا مِن نَّبِىٍّ فِى ٱلْأَوَّلِينَ
Transliteration wakam arsalnā min nabiyyin fī l-awalīna
Telugu మరియు మేము పూర్వం గతించిన వారి వద్దకు ఎంతో మంది ప్రవక్తలను పంపాము.
Verse 7
وَمَا يَأْتِيهِم مِّن نَّبِىٍّ إِلَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ
Transliteration wamā yatīhim min nabiyyin illā kānū bihi yastahziūna
Telugu మరియు వారు, తమ వద్దకు వచ్చిన ప్రవక్తలలో ఏ ఒక్కరిని కూడా ఎగతాళి చేయకుండా వదల లేదు.
Verse 8
فَأَهْلَكْنَآ أَشَدَّ مِنْهُم بَطْشًا وَمَضَىٰ مَثَلُ ٱلْأَوَّلِينَ
Transliteration fa-ahlaknā ashadda min'hum baṭshan wamaḍā mathalu l-awalīna
Telugu కావున వీరి కంటే ఎంతో బలిష్ఠులైన వారిని మేము పట్టుకొని నాశనం చేశాము. మరియు పూర్వ జాతుల వారి దృష్టాంతాలు ఈ విధంగా గడిచాయి.
Verse 9
وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ لَيَقُولُنَّ خَلَقَهُنَّ ٱلْعَزِيزُ ٱلْعَلِيمُ
Transliteration wala-in sa-altahum man khalaqa l-samāwāti wal-arḍa layaqūlunna khalaqahunna l-ʿazīzu l-ʿalīmu
Telugu ఒకవేళ, నీవు వారితో: "భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారు?" అని అడిగితే! వారు తప్పక: "వాటిని సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు సృష్టించాడు." అని అంటారు.
Verse 10
ٱلَّذِى جَعَلَ لَكُمُ ٱلْأَرْضَ مَهْدًا وَجَعَلَ لَكُمْ فِيهَا سُبُلًا لَّعَلَّكُمْ تَهْتَدُونَ
Transliteration alladhī jaʿala lakumu l-arḍa mahdan wajaʿala lakum fīhā subulan laʿallakum tahtadūna
Telugu ఆయనే మీ కొరకు ఈ భూమిని పరుపుగా చేశాడు; మరియు మీరు మీ గమ్యస్థానాలకు చేరుకోవడానికి, అందులో మీ కొరకు త్రోవలు ఏర్పరచాడు.
Verse 11
وَٱلَّذِى نَزَّلَ مِنَ ٱلسَّمَآءِ مَآءًۢ بِقَدَرٍ فَأَنشَرْنَا بِهِۦ بَلْدَةً مَّيْتًا ۚ كَذَٰلِكَ تُخْرَجُونَ
Transliteration wa-alladhī nazzala mina l-samāi māan biqadarin fa-ansharnā bihi baldatan maytan kadhālika tukh'rajūna
Telugu మరియు ఆయనే ఆకాశం నుండి తగినంత నీటిని (వర్షాన్ని) కురిపించాడు. తరువాత దాని ద్వారా మేము చచ్చిన నేలను బ్రతికిస్తాము. ఇదే విధంగా మీరు కూడా (బ్రతికింపబడి) బయటికి తీయబడతారు.
Verse 12
وَٱلَّذِى خَلَقَ ٱلْأَزْوَٰجَ كُلَّهَا وَجَعَلَ لَكُم مِّنَ ٱلْفُلْكِ وَٱلْأَنْعَـٰمِ مَا تَرْكَبُونَ
Transliteration wa-alladhī khalaqa l-azwāja kullahā wajaʿala lakum mina l-ful'ki wal-anʿāmi mā tarkabūna
Telugu మరియు ఆయనే అన్ని రకాల జతలను పుట్టించాడు! మరియు ఓడలను మరియు పశువులను మీకు వాహనాలుగా చేశాడు;
Verse 13
لِتَسْتَوُۥا۟ عَلَىٰ ظُهُورِهِۦ ثُمَّ تَذْكُرُوا۟ نِعْمَةَ رَبِّكُمْ إِذَا ٱسْتَوَيْتُمْ عَلَيْهِ وَتَقُولُوا۟ سُبْحَـٰنَ ٱلَّذِى سَخَّرَ لَنَا هَـٰذَا وَمَا كُنَّا لَهُۥ مُقْرِنِينَ
Transliteration litastawū ʿalā ẓuhūrihi thumma tadhkurū niʿ'mata rabbikum idhā is'tawaytum ʿalayhi wataqūlū sub'ḥāna alladhī sakhara lanā hādhā wamā kunnā lahu muq'rinīna
Telugu మీరు వాటి వీపుల మీద ఎక్కటానికి; తరువాత మీరు వాటి మీద కూర్చున్నప్పుడు, మీ ప్రభువు అనుగ్రహాన్ని తలచుకొని ఇలా ప్రార్థించటానికి: "ఆ సర్వలోపాలకు అతీతుడైన ఆయన (అల్లాహ్) వీటిని మాకు వశపరచాడు, లేకపోతే ఆ (వశపరచుకునే) సామర్థ్యం మాకు లేదు.
Verse 14
وَإِنَّآ إِلَىٰ رَبِّنَا لَمُنقَلِبُونَ
Transliteration wa-innā ilā rabbinā lamunqalibūna
Telugu మరియు నిశ్చయంగా, మేము మా ప్రభువు వైపునకే మరలిపోవలసి ఉన్నది!"
Verse 15
وَجَعَلُوا۟ لَهُۥ مِنْ عِبَادِهِۦ جُزْءًا ۚ إِنَّ ٱلْإِنسَـٰنَ لَكَفُورٌ مُّبِينٌ
Transliteration wajaʿalū lahu min ʿibādihi juz'an inna l-insāna lakafūrun mubīnun
Telugu మరియు వారు ఆయన దాసులలో కొందరిని ఆయనలో భాగంగా (భాగస్వాములుగా / సంతానంగా) చేశారు. నిశ్చయంగా, మానవుడు పరమ కృతఘ్నుడు!
Verse 16
أَمِ ٱتَّخَذَ مِمَّا يَخْلُقُ بَنَاتٍ وَأَصْفَىٰكُم بِٱلْبَنِينَ
Transliteration ami ittakhadha mimmā yakhluqu banātin wa-aṣfākum bil-banīna
Telugu ఏమిటి? ఆయన తాను సృష్టించిన వాటిలో నుండి తన కొరకు కుమార్తెలను తీసుకొని మీ కొరకు ప్రత్యేకంగా కుమారులను ఉంచాడా?
Verse 17
وَإِذَا بُشِّرَ أَحَدُهُم بِمَا ضَرَبَ لِلرَّحْمَـٰنِ مَثَلًا ظَلَّ وَجْهُهُۥ مُسْوَدًّا وَهُوَ كَظِيمٌ
Transliteration wa-idhā bushira aḥaduhum bimā ḍaraba lilrraḥmāni mathalan ẓalla wajhuhu mus'waddan wahuwa kaẓīmun
Telugu మరియు వారు, కరుణామయునికి అంటగట్టేది (ఆడ సంతానమే గనక) వారిలో ఎవడికైనా కలిగిందనే వార్త అంద జేయబడి నప్పుడు, అతని ముఖం నల్లబడిపోతుంది మరియు అతడు దుఃఖంలో మునిగి పోతాడు!
Verse 18
أَوَمَن يُنَشَّؤُا۟ فِى ٱلْحِلْيَةِ وَهُوَ فِى ٱلْخِصَامِ غَيْرُ مُبِينٍ
Transliteration awaman yunasha-u fī l-ḥil'yati wahuwa fī l-khiṣāmi ghayru mubīnin
Telugu ఏమీ? ఆభరణాల అలంకారంలో పెంచబడి మరియు వివాదంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించలేని (స్త్రీ సంతానాన్ని అల్లాహ్ కు అంటగట్టుతున్నారా)?
Verse 19
وَجَعَلُوا۟ ٱلْمَلَـٰٓئِكَةَ ٱلَّذِينَ هُمْ عِبَـٰدُ ٱلرَّحْمَـٰنِ إِنَـٰثًا ۚ أَشَهِدُوا۟ خَلْقَهُمْ ۚ سَتُكْتَبُ شَهَـٰدَتُهُمْ وَيُسْـَٔلُونَ
Transliteration wajaʿalū l-malāikata alladhīna hum ʿibādu l-raḥmāni ināthan ashahidū khalqahum satuk'tabu shahādatuhum wayus'alūna
Telugu మరియు వీరు కరుణామయునికి దాసులైన దేవదూతలను స్త్రీలుగా పరిగణిస్తున్నారా? వీరు! వారు (దేవదూతలు) సృష్టించబడినప్పుడు చూశారా ఏమిటి? వీరి ఆరోపణలు వ్రాసి వుంచబడతాయి. మరియు వీరు దానిని గురించి ప్రశ్నింపబడతారు.
Verse 20
وَقَالُوا۟ لَوْ شَآءَ ٱلرَّحْمَـٰنُ مَا عَبَدْنَـٰهُم ۗ مَّا لَهُم بِذَٰلِكَ مِنْ عِلْمٍ ۖ إِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ
Transliteration waqālū law shāa l-raḥmānu mā ʿabadnāhum mā lahum bidhālika min ʿil'min in hum illā yakhruṣūna
Telugu మరియు వారు ఇలా అంటారు: "ఒకవేళ ఆ కరుణామయుడు తలచుకుంటే మేము వారిని ఆరాధించేవారం కాదు." దాని వాస్తవ జ్ఞానం వారికి లేదు. వారు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు!
Verse 21
أَمْ ءَاتَيْنَـٰهُمْ كِتَـٰبًا مِّن قَبْلِهِۦ فَهُم بِهِۦ مُسْتَمْسِكُونَ
Transliteration am ātaynāhum kitāban min qablihi fahum bihi mus'tamsikūna
Telugu మేము వారికి ఇంతకు ముందు ఏదైనా గ్రంథాన్ని ఇచ్చి ఉన్నామా ఏమిటి? వారు దానిని ఖచ్చితంగా అనుసరించటానికి?
Verse 22
بَلْ قَالُوٓا۟ إِنَّا وَجَدْنَآ ءَابَآءَنَا عَلَىٰٓ أُمَّةٍ وَإِنَّا عَلَىٰٓ ءَاثَـٰرِهِم مُّهْتَدُونَ
Transliteration bal qālū innā wajadnā ābāanā ʿalā ummatin wa-innā ʿalā āthārihim muh'tadūna
Telugu అలా కాదు! వారిలా అంటారు: "వాస్తవానికి మేము, మా తండ్రితాతలను ఇలాంటి సమాజాన్నే (మతాన్నే) అనుసరిస్తుండగా చూశాము. మరియు నిశ్చయంగా మేము కూడా వారి అడుగుజాడల్లోనే వారి మార్గదర్శకత్వంపై ఉన్నాము."
Verse 23
وَكَذَٰلِكَ مَآ أَرْسَلْنَا مِن قَبْلِكَ فِى قَرْيَةٍ مِّن نَّذِيرٍ إِلَّا قَالَ مُتْرَفُوهَآ إِنَّا وَجَدْنَآ ءَابَآءَنَا عَلَىٰٓ أُمَّةٍ وَإِنَّا عَلَىٰٓ ءَاثَـٰرِهِم مُّقْتَدُونَ
Transliteration wakadhālika mā arsalnā min qablika fī qaryatin min nadhīrin illā qāla mut'rafūhā innā wajadnā ābāanā ʿalā ummatin wa-innā ʿalā āthārihim muq'tadūna
Telugu మరియు ఇదే విధంగా, నీకు ముందు (ఓ ముహమ్మద్!) మేము హెచ్చరించే వాడిని ఏ పట్టణానికి పంపినా దానిలోని ఐశ్వర్యవంతులు అనేవారు: "వాస్తవానికి మేము మా తండ్రితాతలను ఇలాంటి సమాజాన్నే (మతాన్నే) అనుసరిస్తూ ఉండగా చూశాము. మరియు నిశ్చయంగా, మేము కూడా వారి అడుగు జాడలనే అనుసరిస్తాము."
Verse 24
۞ قَـٰلَ أَوَلَوْ جِئْتُكُم بِأَهْدَىٰ مِمَّا وَجَدتُّمْ عَلَيْهِ ءَابَآءَكُمْ ۖ قَالُوٓا۟ إِنَّا بِمَآ أُرْسِلْتُم بِهِۦ كَـٰفِرُونَ
Transliteration qāla awalaw ji'tukum bi-ahdā mimmā wajadttum ʿalayhi ābāakum qālū innā bimā ur'sil'tum bihi kāfirūna
Telugu (వారి ప్రవక్త) ఇలా అనేవాడు: "ఒకవేళ నేను మీ తండ్రితాతలు అనుసరిస్తూ వచ్చిన దాని కంటే ఉత్తమమైన మార్గదర్శకత్వాన్ని మీ కోసం తెచ్చినా (మీరు వారినే అనుసరిస్తారా)?" వారిలా జవాబిచ్చే వారు: "నిశ్చయంగా, మీరు దేనితో పంపబడ్డారో దానిని మేము తిరస్కరిస్తున్నాము."
Verse 25
فَٱنتَقَمْنَا مِنْهُمْ ۖ فَٱنظُرْ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلْمُكَذِّبِينَ
Transliteration fa-intaqamnā min'hum fa-unẓur kayfa kāna ʿāqibatu l-mukadhibīna
Telugu కావున మేము వారిపై మా ప్రతీకారాన్ని (శిక్షను) పంపాము. చూశారా! సత్యాన్ని తిరస్కరించిన వారి గతి ఏమయిందో!
Verse 26
وَإِذْ قَالَ إِبْرَٰهِيمُ لِأَبِيهِ وَقَوْمِهِۦٓ إِنَّنِى بَرَآءٌ مِّمَّا تَعْبُدُونَ
Transliteration wa-idh qāla ib'rāhīmu li-abīhi waqawmihi innanī barāon mimmā taʿbudūna
Telugu మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్ తన తండ్రి మరియు తన జాతివారితో ఇలా అన్నప్పుడు: "నిశ్చయంగా, మీరు పూజించే వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు.
Verse 27
إِلَّا ٱلَّذِى فَطَرَنِى فَإِنَّهُۥ سَيَهْدِينِ
Transliteration illā alladhī faṭaranī fa-innahu sayahdīni
Telugu (నేనైతే) నన్ను సృజించిన ఆయన (అల్లాహ్ నే ఆరాధిస్తాను). ఎందుకంటే! నిశ్చయంగా, ఆయనే నాకు మార్గదర్శకత్వం చేయగలడు."
Verse 28
وَجَعَلَهَا كَلِمَةًۢ بَاقِيَةً فِى عَقِبِهِۦ لَعَلَّهُمْ يَرْجِعُونَ
Transliteration wajaʿalahā kalimatan bāqiyatan fī ʿaqibihi laʿallahum yarjiʿūna
Telugu మరియు అతను (ఇబ్రాహీమ్) ఈ వచనాన్నే తన తర్వాత తన సంతానం కొరకు విడిచి వెళ్ళాడు. వారు దాని వైపుకు మరలుతారని!
Verse 29
بَلْ مَتَّعْتُ هَـٰٓؤُلَآءِ وَءَابَآءَهُمْ حَتَّىٰ جَآءَهُمُ ٱلْحَقُّ وَرَسُولٌ مُّبِينٌ
Transliteration bal mattaʿtu hāulāi waābāahum ḥattā jāahumu l-ḥaqu warasūlun mubīnun
Telugu వాస్తవానికి, నేను వారికి మరియు వారి తండ్రితాతలకు ప్రాపంచిక సుఖసంతోషాలను ఇస్తూనే వచ్చాను. చివరకు వారి వద్దకు సత్యం మరియు (దానిని) స్పష్టంగా వివరించే దైవప్రవక్త కూడా వచ్చాడు.
Verse 30
وَلَمَّا جَآءَهُمُ ٱلْحَقُّ قَالُوا۟ هَـٰذَا سِحْرٌ وَإِنَّا بِهِۦ كَـٰفِرُونَ
Transliteration walammā jāahumu l-ḥaqu qālū hādhā siḥ'run wa-innā bihi kāfirūna
Telugu కాని వారి వద్దకు సత్యం (ఈ ఖుర్ఆన్) వచ్చినప్పుడు వారన్నారు: "ఇది కేవలం మంత్రజాలమే. మరియు నిశ్చయంగా, మేము దీనిని తిరస్కరిస్తున్నాము."
Verse 31
وَقَالُوا۟ لَوْلَا نُزِّلَ هَـٰذَا ٱلْقُرْءَانُ عَلَىٰ رَجُلٍ مِّنَ ٱلْقَرْيَتَيْنِ عَظِيمٍ
Transliteration waqālū lawlā nuzzila hādhā l-qur'ānu ʿalā rajulin mina l-qaryatayni ʿaẓīmin
Telugu వారు ఇంకా ఇలా అన్నారు: "ఈ ఖుర్ఆన్ ఈ రెండు నగరాలలోని ఒక గొప్ప వ్యక్తిపై ఎందుకు అవతరింప జేయబడలేదు?"
Verse 32
أَهُمْ يَقْسِمُونَ رَحْمَتَ رَبِّكَ ۚ نَحْنُ قَسَمْنَا بَيْنَهُم مَّعِيشَتَهُمْ فِى ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا ۚ وَرَفَعْنَا بَعْضَهُمْ فَوْقَ بَعْضٍ دَرَجَـٰتٍ لِّيَتَّخِذَ بَعْضُهُم بَعْضًا سُخْرِيًّا ۗ وَرَحْمَتُ رَبِّكَ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ
Transliteration ahum yaqsimūna raḥmata rabbika naḥnu qasamnā baynahum maʿīshatahum fī l-ḥayati l-dun'yā warafaʿnā baʿḍahum fawqa baʿḍin darajātin liyattakhidha baʿḍuhum baʿḍan sukh'riyyan waraḥmatu rabbika khayrun mimmā yajmaʿūna
Telugu నీ ప్రభువు కారుణ్యాన్ని పంచి పెట్టే వారు వారేనా ఏమిటి? మేమే వారి జీవనోపాయాలను, ఈ ప్రాపంచిక జీవితంలో వారి మధ్య పంచి పెట్టాము. వారు ఒకరితో నొకరు పని తీసుకోవటానికి, వారిలో కొందరికి మరి కొందరిపై స్థానాలను పెంచాము. మరియు వారు కూడబెట్టే దాని (సంపద) కంటే నీ ప్రభువు కారుణ్యమే ఎంతో ఉత్తమమైనది.
Verse 33
وَلَوْلَآ أَن يَكُونَ ٱلنَّاسُ أُمَّةً وَٰحِدَةً لَّجَعَلْنَا لِمَن يَكْفُرُ بِٱلرَّحْمَـٰنِ لِبُيُوتِهِمْ سُقُفًا مِّن فِضَّةٍ وَمَعَارِجَ عَلَيْهَا يَظْهَرُونَ
Transliteration walawlā an yakūna l-nāsu ummatan wāḥidatan lajaʿalnā liman yakfuru bil-raḥmāni libuyūtihim suqufan min fiḍḍatin wamaʿārija ʿalayhā yaẓharūna
Telugu మరియు మానవులందరూ ఒక (దుష్ట) సమాజంగా మారి పోతారన్న భయమే గనక మాకు లేకున్నట్లయితే, మేము ఆ కరుణామయుణ్ణి తిరస్కరించేవారి ఇళ్ళ కప్పులనూ మరియు వాటి పైకి ఎక్కే మెట్లను వెండితో నిర్మించేవారము.
Verse 34
وَلِبُيُوتِهِمْ أَبْوَٰبًا وَسُرُرًا عَلَيْهَا يَتَّكِـُٔونَ
Transliteration walibuyūtihim abwāban wasururan ʿalayhā yattakiūna
Telugu మరియు వారి ఇండ్ల తలుపులను మరియు వారు ఆనుకొని కూర్చునే పీఠాలను కూడా;
Verse 35
وَزُخْرُفًا ۚ وَإِن كُلُّ ذَٰلِكَ لَمَّا مَتَـٰعُ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا ۚ وَٱلْـَٔاخِرَةُ عِندَ رَبِّكَ لِلْمُتَّقِينَ
Transliteration wazukh'rufan wa-in kullu dhālika lammā matāʿu l-ḥayati l-dun'yā wal-ākhiratu ʿinda rabbika lil'muttaqīna
Telugu మరియు బంగారంతో కూడా! మరియు ఇవన్నీ ప్రాపంచిక జీవిత సుఖసంతోషాలు మాత్రమే. మరియు దైవభీతి గలవారికి నీ ప్రభువు వద్ద పరలోక జీవిత (సుఖం) ఉంటుంది.
Verse 36
وَمَن يَعْشُ عَن ذِكْرِ ٱلرَّحْمَـٰنِ نُقَيِّضْ لَهُۥ شَيْطَـٰنًا فَهُوَ لَهُۥ قَرِينٌ
Transliteration waman yaʿshu ʿan dhik'ri l-raḥmāni nuqayyiḍ lahu shayṭānan fahuwa lahu qarīnun
Telugu మరియు ఎవడైతే కరుణామయుని స్మరణ విషయంలో అంధుడిగా ప్రవర్తిస్తాడో అతనిపై మేము ఒక షైతాన్ ను నియమిస్తాము. ఇక వాడు (ఆ షైతాన్) వాని సహచరుడు (ఖరీనున్) అవుతాడు.
Verse 37
وَإِنَّهُمْ لَيَصُدُّونَهُمْ عَنِ ٱلسَّبِيلِ وَيَحْسَبُونَ أَنَّهُم مُّهْتَدُونَ
Transliteration wa-innahum layaṣuddūnahum ʿani l-sabīli wayaḥsabūna annahum muh'tadūna
Telugu మరియు నిశ్చయంగా, వారు (షైతాన్ లు) వారిని (అల్లాహ్) మార్గం నుండి ఆటంక పరుస్తారు. మరియు వారేమో నిశ్చయంగా, తాము సరైన మార్గదర్శకత్వంలోనే ఉన్నామని భావిస్తారు!
Verse 38
حَتَّىٰٓ إِذَا جَآءَنَا قَالَ يَـٰلَيْتَ بَيْنِى وَبَيْنَكَ بُعْدَ ٱلْمَشْرِقَيْنِ فَبِئْسَ ٱلْقَرِينُ
Transliteration ḥattā idhā jāanā qāla yālayta baynī wabaynaka buʿ'da l-mashriqayni fabi'sa l-qarīnu
Telugu చివరకు అతడు మా వద్దకు వచ్చినపుడు (తన వెంట ఉన్న షైతాన్ తో) ఇలా అంటాడు: "అయ్యో! నా దౌర్భాగ్యం! నీకూ నాకూ మధ్య తూర్పుపడమరల మధ్య ఉన్నంత దూరం ఉండి వుంటే ఎంత బాగుండేది! ఎందుకంటే నీవు అతి చెడ్డ సహచరుడివి!"
Verse 39
وَلَن يَنفَعَكُمُ ٱلْيَوْمَ إِذ ظَّلَمْتُمْ أَنَّكُمْ فِى ٱلْعَذَابِ مُشْتَرِكُونَ
Transliteration walan yanfaʿakumu l-yawma idh ẓalamtum annakum fī l-ʿadhābi mush'tarikūna
Telugu మరియు మీరు దుర్మార్గం చేశారు! కావున, ఈరోజు మీరంతా ఈ శిక్షలో కలిసి ఉండటం మీకు ఏ మాత్రం లాభదాయకం కాదు.
Verse 40
أَفَأَنتَ تُسْمِعُ ٱلصُّمَّ أَوْ تَهْدِى ٱلْعُمْىَ وَمَن كَانَ فِى ضَلَـٰلٍ مُّبِينٍ
Transliteration afa-anta tus'miʿu l-ṣuma aw tahdī l-ʿum'ya waman kāna fī ḍalālin mubīnin
Telugu (ఓ ముహమ్మద్!) నీవు చెవిటి వాడికి వినిపింప జేయగలవా? లేదా గ్రుడ్డివాడికి మార్గం చూపించ గలవా? లేక, స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో ఉన్నవాడికి (మార్గదర్శకత్వం చేయగలవా)?
Verse 41
فَإِمَّا نَذْهَبَنَّ بِكَ فَإِنَّا مِنْهُم مُّنتَقِمُونَ
Transliteration fa-immā nadhhabanna bika fa-innā min'hum muntaqimūna
Telugu ఒకవేళ వాస్తవానికి, మేము నిన్ను తీసుకొని పోయినా, వారికి మాత్రం తప్పకుండా ప్రతీకారం చేస్తాము.
Verse 42
أَوْ نُرِيَنَّكَ ٱلَّذِى وَعَدْنَـٰهُمْ فَإِنَّا عَلَيْهِم مُّقْتَدِرُونَ
Transliteration aw nuriyannaka alladhī waʿadnāhum fa-innā ʿalayhim muq'tadirūna
Telugu లేదా మేము వారికి వాగ్దానం చేసిన దానిని (శిక్షను) నీకు తప్పక చూపగలము. ఎందుకంటే మాకు వారిపై పూర్తి అధికారముంది.
Verse 43
فَٱسْتَمْسِكْ بِٱلَّذِىٓ أُوحِىَ إِلَيْكَ ۖ إِنَّكَ عَلَىٰ صِرَٰطٍ مُّسْتَقِيمٍ
Transliteration fa-is'tamsik bi-alladhī ūḥiya ilayka innaka ʿalā ṣirāṭin mus'taqīmin
Telugu కావున నీవు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా వచ్చిన సందేశం మీద స్థిరంగా ఉండు. నిశ్చయంగా, నీవు ఋజుమార్గం మీద ఉన్నావు.
Verse 44
وَإِنَّهُۥ لَذِكْرٌ لَّكَ وَلِقَوْمِكَ ۖ وَسَوْفَ تُسْـَٔلُونَ
Transliteration wa-innahu ladhik'run laka waliqawmika wasawfa tus'alūna
Telugu మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) నీకు మరియు నీ జాతి వారికి ఒక హితబోధ. మరియు (దీనిని గురించి) మీరు ప్రశ్నింప బడగలరు.
Verse 45
وَسْـَٔلْ مَنْ أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رُّسُلِنَآ أَجَعَلْنَا مِن دُونِ ٱلرَّحْمَـٰنِ ءَالِهَةً يُعْبَدُونَ
Transliteration wasal man arsalnā min qablika min rusulinā ajaʿalnā min dūni l-raḥmāni ālihatan yuʿ'badūna
Telugu మరియు (ఓ ముహమ్మద్!) నీకు పూర్వం మేము పంపిన మా ప్రవక్తలను అడుగు: "మేము, ఆ కరుణామయుడు తప్ప ఇతర దైవాలను ఆరాధింపబడటానికి నియమించామేమో?"
Verse 46
وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِـَٔايَـٰتِنَآ إِلَىٰ فِرْعَوْنَ وَمَلَإِي۟هِۦ فَقَالَ إِنِّى رَسُولُ رَبِّ ٱلْعَـٰلَمِينَ
Transliteration walaqad arsalnā mūsā biāyātinā ilā fir'ʿawna wamala-ihi faqāla innī rasūlu rabbi l-ʿālamīna
Telugu మరియు వాస్తవంగా, మేము మూసాను, మా సూచనలతో (ఆయాత్ లతో) ఫిర్ఔన్ మరియు అతని నాయకుల వద్దకు పంపాము. అతను వారితో ఇలా అన్నాడు: "నిశ్చయంగా, నేను సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుణ్ణి."
Verse 47
فَلَمَّا جَآءَهُم بِـَٔايَـٰتِنَآ إِذَا هُم مِّنْهَا يَضْحَكُونَ
Transliteration falammā jāahum biāyātinā idhā hum min'hā yaḍḥakūna
Telugu కాని, అతను వారి వద్దకు మా సూచన (ఆయాత్) లను తీసుకొని వచ్చినప్పుడు, వారు వాటిని గురించి పరిహాసాలాడేవారు.
Verse 48
وَمَا نُرِيهِم مِّنْ ءَايَةٍ إِلَّا هِىَ أَكْبَرُ مِنْ أُخْتِهَا ۖ وَأَخَذْنَـٰهُم بِٱلْعَذَابِ لَعَلَّهُمْ يَرْجِعُونَ
Transliteration wamā nurīhim min āyatin illā hiya akbaru min ukh'tihā wa-akhadhnāhum bil-ʿadhābi laʿallahum yarjiʿūna
Telugu మరియు మేము వారికి చూపిన ప్రతి అద్భుత సూచన (ఆయాత్), దానికి ముందు చూపినటువంటి దాని (అద్భుత సూచన) కంటే మించినదిగా ఉండేది. మరియు మేము వారిని శిక్షకు గురి చేశాము. బహుశా, ఇలాగైనా వారు మరలి వస్తారేమోనని!
Verse 49
وَقَالُوا۟ يَـٰٓأَيُّهَ ٱلسَّاحِرُ ٱدْعُ لَنَا رَبَّكَ بِمَا عَهِدَ عِندَكَ إِنَّنَا لَمُهْتَدُونَ
Transliteration waqālū yāayyuha l-sāḥiru ud'ʿu lanā rabbaka bimā ʿahida ʿindaka innanā lamuh'tadūna
Telugu మరియు వారు (మూసాతో) ఇలా అన్నారు: "ఓ మాంత్రికుడా! (నీ ప్రభువు) నీతో చేసిన ఒప్పందం ప్రకారం నీ ప్రభువును ప్రార్థించు, మేము తప్పక సన్మార్గులమవుతాము."
Verse 50
فَلَمَّا كَشَفْنَا عَنْهُمُ ٱلْعَذَابَ إِذَا هُمْ يَنكُثُونَ
Transliteration falammā kashafnā ʿanhumu l-ʿadhāba idhā hum yankuthūna
Telugu కాని మేము వారి పై నుండి ఆ శిక్షను తొలగించిన వెంటనే వారు తమ వాగ్దానాన్ని భంగపరచే వారు.
Verse 51
وَنَادَىٰ فِرْعَوْنُ فِى قَوْمِهِۦ قَالَ يَـٰقَوْمِ أَلَيْسَ لِى مُلْكُ مِصْرَ وَهَـٰذِهِ ٱلْأَنْهَـٰرُ تَجْرِى مِن تَحْتِىٓ ۖ أَفَلَا تُبْصِرُونَ
Transliteration wanādā fir'ʿawnu fī qawmihi qāla yāqawmi alaysa lī mul'ku miṣ'ra wahādhihi l-anhāru tajrī min taḥtī afalā tub'ṣirūna
Telugu మరియు, ఫిర్ఔన్ తన జాతి ప్రజలలో ప్రకటిస్తూ ఇలా అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఈజిప్టు (మిస్ర్) యొక్క సామ్రాజ్యాధిపత్యం నాది కాదా? మరియు ఈ సెలయేళ్ళు నా క్రింద ప్రవహించటం లేదా? ఇది మీకు కనిపించటం లేదా?
Verse 52
أَمْ أَنَا۠ خَيْرٌ مِّنْ هَـٰذَا ٱلَّذِى هُوَ مَهِينٌ وَلَا يَكَادُ يُبِينُ
Transliteration am anā khayrun min hādhā alladhī huwa mahīnun walā yakādu yubīnu
Telugu ఈ తుచ్ఛమైన వాడు మరియు (తన మాటను) స్పష్టంగా వివరించలేని వాడి (మూసా) కంటే నేను శ్రేష్ఠుడిని కానా?
Verse 53
فَلَوْلَآ أُلْقِىَ عَلَيْهِ أَسْوِرَةٌ مِّن ذَهَبٍ أَوْ جَآءَ مَعَهُ ٱلْمَلَـٰٓئِكَةُ مُقْتَرِنِينَ
Transliteration falawlā ul'qiya ʿalayhi aswiratun min dhahabin aw jāa maʿahu l-malāikatu muq'tarinīna
Telugu అయితే ఇతనికి బంగారు కంకణాలు ఎందుకు వేయబడలేదు? లేదా, ఇతనికి తోడుగా ఇతనితో పాటు దేవదూతలు ఎందుకు రాలేదు?"
Verse 54
فَٱسْتَخَفَّ قَوْمَهُۥ فَأَطَاعُوهُ ۚ إِنَّهُمْ كَانُوا۟ قَوْمًا فَـٰسِقِينَ
Transliteration fa-is'takhaffa qawmahu fa-aṭāʿūhu innahum kānū qawman fāsiqīna
Telugu ఈ విధంగా, అతడు (ఫిర్ఔన్) తన జాతి వారిని ప్రేరేపింప జేయటం వలన వారు అతనిని అనుసరించారు. నిశ్చయంగా వారు దుర్జనులు (ఫాసిఖీన్).
Verse 55
فَلَمَّآ ءَاسَفُونَا ٱنتَقَمْنَا مِنْهُمْ فَأَغْرَقْنَـٰهُمْ أَجْمَعِينَ
Transliteration falammā āsafūnā intaqamnā min'hum fa-aghraqnāhum ajmaʿīna
Telugu ఈ విధంగా, వారు మమ్మల్ని కోపానికి గురి చేయటం వల్ల మేము వారికి ప్రతీకారం చేశాము. మరియు వారందరినీ ముంచి వేశాము.
Verse 56
فَجَعَلْنَـٰهُمْ سَلَفًا وَمَثَلًا لِّلْـَٔاخِرِينَ
Transliteration fajaʿalnāhum salafan wamathalan lil'ākhirīna
Telugu ఇక మేము, వారిని తర్వాత వచ్చే వారి కొరకు ఒక గడిచిన నిదర్శనంగా మరియు ఒక ఉదాహరణగా చేశాము.
Verse 57
۞ وَلَمَّا ضُرِبَ ٱبْنُ مَرْيَمَ مَثَلًا إِذَا قَوْمُكَ مِنْهُ يَصِدُّونَ
Transliteration walammā ḍuriba ub'nu maryama mathalan idhā qawmuka min'hu yaṣiddūna
Telugu మరియు మర్యమ్ కుమారుడు ఒక ఉదాహరణగా పేర్కొనబడినప్పుడు (ఓ ముహమ్మద్!) నీ జాతి ప్రజలు అతనిని గురించి కేకలు వేస్తారు.
Verse 58
وَقَالُوٓا۟ ءَأَـٰلِهَتُنَا خَيْرٌ أَمْ هُوَ ۚ مَا ضَرَبُوهُ لَكَ إِلَّا جَدَلًۢا ۚ بَلْ هُمْ قَوْمٌ خَصِمُونَ
Transliteration waqālū aālihatunā khayrun am huwa mā ḍarabūhu laka illā jadalan bal hum qawmun khaṣimūna
Telugu మరియు అంటారు: "మా దేవుళ్ళు మంచివా లేక అతడా (ఈసానా)?" వారు ఈ విషయం నీ ముందు పెట్టేది కేవలం జగడమాడటానికే. వాస్తవానికి వారు కలహ ప్రియులైన జనులు.
Verse 59
إِنْ هُوَ إِلَّا عَبْدٌ أَنْعَمْنَا عَلَيْهِ وَجَعَلْنَـٰهُ مَثَلًا لِّبَنِىٓ إِسْرَٰٓءِيلَ
Transliteration in huwa illā ʿabdun anʿamnā ʿalayhi wajaʿalnāhu mathalan libanī is'rāīla
Telugu అతను (ఈసా) కేవలం ఒక దాసుడు మాత్రమే. మేము అతనిని అనుగ్రహిచాము. మరియు మేము అతనిని ఇస్రాయీల్ సంతతి వారికి ఒక నిదర్శనంగా చేశాము.
Verse 60
وَلَوْ نَشَآءُ لَجَعَلْنَا مِنكُم مَّلَـٰٓئِكَةً فِى ٱلْأَرْضِ يَخْلُفُونَ
Transliteration walaw nashāu lajaʿalnā minkum malāikatan fī l-arḍi yakhlufūna
Telugu మరియు మేము కోరితే మీకు బదులుగా, దేవదూతలను భూమిపై ఉత్తరాధికారులుగా చేసే వారము.
Verse 61
وَإِنَّهُۥ لَعِلْمٌ لِّلسَّاعَةِ فَلَا تَمْتَرُنَّ بِهَا وَٱتَّبِعُونِ ۚ هَـٰذَا صِرَٰطٌ مُّسْتَقِيمٌ
Transliteration wa-innahu laʿil'mun lilssāʿati falā tamtarunna bihā wa-ittabiʿūni hādhā ṣirāṭun mus'taqīmun
Telugu మరియు నిశ్చయంగా, అతని (ఈసా పునరాగమనం) అంతిమ ఘడియ రావటానికి సూచన. కావున మీరు దానిని (ఆ ఘడియను) గురించి సంశయంలో పడకండి. మరియు నన్నే (అల్లాహ్ నే) అనుసరించండి, ఇదే ఋజుమార్గం.
Verse 62
وَلَا يَصُدَّنَّكُمُ ٱلشَّيْطَـٰنُ ۖ إِنَّهُۥ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ
Transliteration walā yaṣuddannakumu l-shayṭānu innahu lakum ʿaduwwun mubīnun
Telugu మరియు షైతాన్ ను, మిమ్మల్ని ఆటంక పరచనివ్వకండి. నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు.
Verse 63
وَلَمَّا جَآءَ عِيسَىٰ بِٱلْبَيِّنَـٰتِ قَالَ قَدْ جِئْتُكُم بِٱلْحِكْمَةِ وَلِأُبَيِّنَ لَكُم بَعْضَ ٱلَّذِى تَخْتَلِفُونَ فِيهِ ۖ فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ
Transliteration walammā jāa ʿīsā bil-bayināti qāla qad ji'tukum bil-ḥik'mati wali-ubayyina lakum baʿḍa alladhī takhtalifūna fīhi fa-ittaqū l-laha wa-aṭīʿūni
Telugu మరియు ఈసా స్పష్టమైన (మా) సూచనలు తీసుకొని వచ్చినప్పుడు ఇలా అన్నాడు: "వాస్తవంగా, నేను మీ వద్దకు వివేకాన్ని తీసుకొని వచ్చాను; మరియు మీరు విభేదాలకు లోనైన కొన్ని విషయాల వాస్తవాన్ని మీకు స్పష్టంగా వివరించటానికి వచ్చాను. కావున మీరు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. మరియు నన్ను అనుసరించండి.
Verse 64
إِنَّ ٱللَّهَ هُوَ رَبِّى وَرَبُّكُمْ فَٱعْبُدُوهُ ۚ هَـٰذَا صِرَٰطٌ مُّسْتَقِيمٌ
Transliteration inna l-laha huwa rabbī warabbukum fa-uʿ'budūhu hādhā ṣirāṭun mus'taqīmun
Telugu నిశ్చయంగా, అల్లాహ్ యే నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను. కావున మీరు ఆయననే ఆరాధించండి. ఇదే ఋజుమార్గం."
Verse 65
فَٱخْتَلَفَ ٱلْأَحْزَابُ مِنۢ بَيْنِهِمْ ۖ فَوَيْلٌ لِّلَّذِينَ ظَلَمُوا۟ مِنْ عَذَابِ يَوْمٍ أَلِيمٍ
Transliteration fa-ikh'talafa l-aḥzābu min baynihim fawaylun lilladhīna ẓalamū min ʿadhābi yawmin alīmin
Telugu అయినా, తరువాత వచ్చిన వర్గాల వారు పరస్పర వర్గ భేదాలకు లోనయ్యారు. కావున దుర్మర్గానికి పాల్పడిన వారికి బాధాకరమైన ఆ దినమున శిక్ష పడుతుంది!
Verse 66
هَلْ يَنظُرُونَ إِلَّا ٱلسَّاعَةَ أَن تَأْتِيَهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ
Transliteration hal yanẓurūna illā l-sāʿata an tatiyahum baghtatan wahum lā yashʿurūna
Telugu వారు కేవలం ఆ అంతిమ ఘడియ అకస్మాత్తుగా - తమకు తెలియకుండానే - తమపై వచ్చి పడాలని నిరీక్షిస్తున్నారా ఏమిటి?
Verse 67
ٱلْأَخِلَّآءُ يَوْمَئِذٍۭ بَعْضُهُمْ لِبَعْضٍ عَدُوٌّ إِلَّا ٱلْمُتَّقِينَ
Transliteration al-akhilāu yawma-idhin baʿḍuhum libaʿḍin ʿaduwwun illā l-mutaqīna
Telugu ఆ దినమున దైవభీతి గలవారు తప్ప ఇతర స్నేహితులంతా ఒకరి కొకరు శత్రువులవుతారు.
Verse 68
يَـٰعِبَادِ لَا خَوْفٌ عَلَيْكُمُ ٱلْيَوْمَ وَلَآ أَنتُمْ تَحْزَنُونَ
Transliteration yāʿibādi lā khawfun ʿalaykumu l-yawma walā antum taḥzanūna
Telugu (విశ్వాసులతో ఇలా అనబడుతుంది): "ఓ నా దాసులారా! ఈనాడు మీకు ఏ భయమూ లేదు మరియు మీరు దుఃఖ పడరు కూడా!
Verse 69
ٱلَّذِينَ ءَامَنُوا۟ بِـَٔايَـٰتِنَا وَكَانُوا۟ مُسْلِمِينَ
Transliteration alladhīna āmanū biāyātinā wakānū mus'limīna
Telugu అలాంటి వారు, ఎవరైతే మా సూచనలను విశ్వసించారో మరియు ముస్లింలు అయి ఉన్నారో!
Verse 70
ٱدْخُلُوا۟ ٱلْجَنَّةَ أَنتُمْ وَأَزْوَٰجُكُمْ تُحْبَرُونَ
Transliteration ud'khulū l-janata antum wa-azwājukum tuḥ'barūna
Telugu మీరు మరియు మీ సహవాసులు (అజ్వాజ్) సంతోషంగా స్వర్గంలో ప్రవేశించండి."
Verse 71
يُطَافُ عَلَيْهِم بِصِحَافٍ مِّن ذَهَبٍ وَأَكْوَابٍ ۖ وَفِيهَا مَا تَشْتَهِيهِ ٱلْأَنفُسُ وَتَلَذُّ ٱلْأَعْيُنُ ۖ وَأَنتُمْ فِيهَا خَـٰلِدُونَ
Transliteration yuṭāfu ʿalayhim biṣiḥāfin min dhahabin wa-akwābin wafīhā mā tashtahīhi l-anfusu wataladhu l-aʿyunu wa-antum fīhā khālidūna
Telugu వారి మధ్య, బంగారు పళ్ళాలు మరియు కప్పులు త్రిప్పబడతాయి మరియు అందులో మనస్సులు కోరేవి మరియు కళ్ళకు ఇంపుగా ఉండేవి, అన్నీ ఉంటాయి. మరియు మీరందులో శాశ్వతంగా ఉంటారు.
Verse 72
وَتِلْكَ ٱلْجَنَّةُ ٱلَّتِىٓ أُورِثْتُمُوهَا بِمَا كُنتُمْ تَعْمَلُونَ
Transliteration watil'ka l-janatu allatī ūrith'tumūhā bimā kuntum taʿmalūna
Telugu మరియు మీరు చేస్తూ వున్న కర్మల ఫలితానికి బదులుగా, మీరు ఈ స్వర్గానికి వారసులయ్యారు.
Verse 73
لَكُمْ فِيهَا فَـٰكِهَةٌ كَثِيرَةٌ مِّنْهَا تَأْكُلُونَ
Transliteration lakum fīhā fākihatun kathīratun min'hā takulūna
Telugu మీకు అందులో పండ్లూ ఫలాలు పుష్కలంగా ఉంటాయి, వాటిని మీరు తింటారు.
Verse 74
إِنَّ ٱلْمُجْرِمِينَ فِى عَذَابِ جَهَنَّمَ خَـٰلِدُونَ
Transliteration inna l-muj'rimīna fī ʿadhābi jahannama khālidūna
Telugu నిశ్చయంగా, అపరాధులు నరకశిక్షలో శాశ్వతంగా ఉంటారు.
Verse 75
لَا يُفَتَّرُ عَنْهُمْ وَهُمْ فِيهِ مُبْلِسُونَ
Transliteration lā yufattaru ʿanhum wahum fīhi mub'lisūna
Telugu వారి (శిక్ష) ఏ మాత్రం తగ్గించబడదు మరియు వారందులో హతాశులై పడి ఉంటారు.
Verse 76
وَمَا ظَلَمْنَـٰهُمْ وَلَـٰكِن كَانُوا۟ هُمُ ٱلظَّـٰلِمِينَ
Transliteration wamā ẓalamnāhum walākin kānū humu l-ẓālimīna
Telugu మేము వారికి ఎలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే దుర్మార్గులై ఉండిరి.
Verse 77
وَنَادَوْا۟ يَـٰمَـٰلِكُ لِيَقْضِ عَلَيْنَا رَبُّكَ ۖ قَالَ إِنَّكُم مَّـٰكِثُونَ
Transliteration wanādaw yāmāliku liyaqḍi ʿalaynā rabbuka qāla innakum mākithūna
Telugu మరియు వారిలా మొరపెట్టుకుంటారు: "ఓ నరక పాలకుడా (మాలిక్)! నీ ప్రభువును మమ్మల్ని అంతం చేయమను." అతను అంటాడు: "నిశ్చయంగా మీరిక్కడే (ఇదే విధంగా) పడి ఉంటారు."
Verse 78
لَقَدْ جِئْنَـٰكُم بِٱلْحَقِّ وَلَـٰكِنَّ أَكْثَرَكُمْ لِلْحَقِّ كَـٰرِهُونَ
Transliteration laqad ji'nākum bil-ḥaqi walākinna aktharakum lil'ḥaqqi kārihūna
Telugu వాస్తవానికి మేము మీ వద్దకు సత్యాన్ని తీసుకొని వచ్చాము, కాని మీలో చాలా మంది సత్యమంటేనే అసహ్యించుకునే వారు.
Verse 79
أَمْ أَبْرَمُوٓا۟ أَمْرًا فَإِنَّا مُبْرِمُونَ
Transliteration am abramū amran fa-innā mub'rimūna
Telugu వారు ఏదైనా నిర్ణయం (పన్నాగం) చేస్తున్నారా ఏమిటి? అయితే నిశ్చయంగా మేము కూడా ఒక గట్టి నిర్ణయం (పన్నాగం) చేస్తున్నాము.
Verse 80
أَمْ يَحْسَبُونَ أَنَّا لَا نَسْمَعُ سِرَّهُمْ وَنَجْوَىٰهُم ۚ بَلَىٰ وَرُسُلُنَا لَدَيْهِمْ يَكْتُبُونَ
Transliteration am yaḥsabūna annā lā nasmaʿu sirrahum wanajwāhum balā warusulunā ladayhim yaktubūna
Telugu లేదా! మేము వారి రహస్య విషయాలను మరియు వారి గుసగుసలను వినటం లేదని వారనుకుంటున్నారా? అలా కాదు, (వాస్తవానికి) మా దూతలు వారి దగ్గర ఉండి, అంతా వ్రాస్తున్నారు.
Verse 81
قُلْ إِن كَانَ لِلرَّحْمَـٰنِ وَلَدٌ فَأَنَا۠ أَوَّلُ ٱلْعَـٰبِدِينَ
Transliteration qul in kāna lilrraḥmāni waladun fa-anā awwalu l-ʿābidīna
Telugu వారితో ఇలా అను: "ఒకవేళ ఆ కరుణామయునికి కుమారుడే ఉంటే, అందరి కంటే ముందు నేనే అతనిని ఆరాధించేవాడిని."
Verse 82
سُبْحَـٰنَ رَبِّ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ رَبِّ ٱلْعَرْشِ عَمَّا يَصِفُونَ
Transliteration sub'ḥāna rabbi l-samāwāti wal-arḍi rabbi l-ʿarshi ʿammā yaṣifūna
Telugu భూమ్యాకాశాలకు ప్రభువు మరియు సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు అయిన ఆయన (అల్లాహ్) వారి కల్పనలకు అతీతుడు.
Verse 83
فَذَرْهُمْ يَخُوضُوا۟ وَيَلْعَبُوا۟ حَتَّىٰ يُلَـٰقُوا۟ يَوْمَهُمُ ٱلَّذِى يُوعَدُونَ
Transliteration fadharhum yakhūḍū wayalʿabū ḥattā yulāqū yawmahumu alladhī yūʿadūna
Telugu వారికి వాగ్దానం చేయబడిన ఆ దినాన్ని వారు దర్శించే వరకు, వారిని వారి వాదోపవాదాలలో మరియు వారి క్రీడలలో మునిగి ఉండనీ!
Verse 84
وَهُوَ ٱلَّذِى فِى ٱلسَّمَآءِ إِلَـٰهٌ وَفِى ٱلْأَرْضِ إِلَـٰهٌ ۚ وَهُوَ ٱلْحَكِيمُ ٱلْعَلِيمُ
Transliteration wahuwa alladhī fī l-samāi ilāhun wafī l-arḍi ilāhun wahuwa l-ḥakīmu l-ʿalīmu
Telugu మరియు ఆయన (అల్లాహ్) మాత్రమే ఆకాశాలలో ఆరాధ్యుడు మరియు భూమిలో కూడా ఆరాధ్యుడు. మరియు ఆయన మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు.
Verse 85
وَتَبَارَكَ ٱلَّذِى لَهُۥ مُلْكُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَعِندَهُۥ عِلْمُ ٱلسَّاعَةِ وَإِلَيْهِ تُرْجَعُونَ
Transliteration watabāraka alladhī lahu mul'ku l-samāwāti wal-arḍi wamā baynahumā waʿindahu ʿil'mu l-sāʿati wa-ilayhi tur'jaʿūna
Telugu మరియు ఆకాశాలలోను మరియు భూమిలోను మరియు ఆ రెండింటి మధ్యను ఉన్న సమస్తానికీ సామ్రాజ్యాధికారి అయిన ఆయన (అల్లాహ్) శుభదాయకుడు; మరియు అంతిమ ఘడియ జ్ఞానం కేవలం ఆయనకే ఉంది; మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు.
Verse 86
وَلَا يَمْلِكُ ٱلَّذِينَ يَدْعُونَ مِن دُونِهِ ٱلشَّفَـٰعَةَ إِلَّا مَن شَهِدَ بِٱلْحَقِّ وَهُمْ يَعْلَمُونَ
Transliteration walā yamliku alladhīna yadʿūna min dūnihi l-shafāʿata illā man shahida bil-ḥaqi wahum yaʿlamūna
Telugu మరియు వారు ఆయనను వదలి, ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, వారికి సిఫారసు చేసే అధికారం లేదు. కేవలం సత్యానికి సాక్ష్యమిచ్చేవారు మరియు (అల్లాహ్ ఒక్కడే! అని) తెలిసి ఉన్నవారు తప్ప!
Verse 87
وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَهُمْ لَيَقُولُنَّ ٱللَّهُ ۖ فَأَنَّىٰ يُؤْفَكُونَ
Transliteration wala-in sa-altahum man khalaqahum layaqūlunna l-lahu fa-annā yu'fakūna
Telugu మరియు నీవు: "మిమ్మల్ని ఎవరు సృష్టించారు?" అని వారితో అడిగినప్పుడు, వారు నిశ్చయంగా: "అల్లాహ్!" అని అంటారు. అయితే వారు ఎందుకు మోసగింప బడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)?
Verse 88
وَقِيلِهِۦ يَـٰرَبِّ إِنَّ هَـٰٓؤُلَآءِ قَوْمٌ لَّا يُؤْمِنُونَ
Transliteration waqīlihi yārabbi inna hāulāi qawmun lā yu'minūna
Telugu "మరియు ఓ నా ప్రభూ! నిశ్చయంగా, ఈ ప్రజలు విశ్వసించరు!" అని పలికే (ప్రవక్త యొక్క) మాట (అల్లాహ్ కు బాగా తెలుసు).
Verse 89
فَٱصْفَحْ عَنْهُمْ وَقُلْ سَلَـٰمٌ ۚ فَسَوْفَ يَعْلَمُونَ
Transliteration fa-iṣ'faḥ ʿanhum waqul salāmun fasawfa yaʿlamūna
Telugu కావున నీవు (ఓ ముహమ్మద్!) వారిని ఉపేక్షించు. మరియు ఇలా అను: "మీకు సలాం!" మున్ముందు వారు తెలుసుకుంటారు.
Read Surah Az-Zukhruf in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Gujarati
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Telugu: the Qur’an in Telugu.
Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.