Surah Ash-Shuraa in Telugu: translation and audio
Surah 42 · الشورى · The Consultation · 53 verses
Surah Ash-Shuraa verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Ash-Shuraa word by word in English.
Verse 1
حمٓ
Transliteration hha-meem
Telugu హా - మీమ్.
Verse 2
عٓسٓقٓ
Transliteration ain-seen-qaf
Telugu ఐన్ - సీన్ - ఖాఫ్,
Verse 3
كَذَٰلِكَ يُوحِىٓ إِلَيْكَ وَإِلَى ٱلَّذِينَ مِن قَبْلِكَ ٱللَّهُ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ
Transliteration kadhālika yūḥī ilayka wa-ilā alladhīna min qablika l-lahu l-ʿazīzu l-ḥakīmu
Telugu (ఓ ముహమ్మద్!) సర్వశక్తిమంతుడూ, మహావివేకవంతుడూ అయిన అల్లాహ్, ఇదే విధంగా నీకూ మరియు నీ కంటే ముందు వచ్చిన వారికి కూడా దివ్యజ్ఞానం (వహీ) అవతరింపజేశాడు.
Verse 4
لَهُۥ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۖ وَهُوَ ٱلْعَلِىُّ ٱلْعَظِيمُ
Transliteration lahu mā fī l-samāwāti wamā fī l-arḍi wahuwa l-ʿaliyu l-ʿaẓīmu
Telugu ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకు చెందినదే. ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు.
Verse 5
تَكَادُ ٱلسَّمَـٰوَٰتُ يَتَفَطَّرْنَ مِن فَوْقِهِنَّ ۚ وَٱلْمَلَـٰٓئِكَةُ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ وَيَسْتَغْفِرُونَ لِمَن فِى ٱلْأَرْضِ ۗ أَلَآ إِنَّ ٱللَّهَ هُوَ ٱلْغَفُورُ ٱلرَّحِيمُ
Transliteration takādu l-samāwātu yatafaṭṭarna min fawqihinna wal-malāikatu yusabbiḥūna biḥamdi rabbihim wayastaghfirūna liman fī l-arḍi alā inna l-laha huwa l-ghafūru l-raḥīmu
Telugu ఆకాశాలు, పై నుండి దాదాపు ప్రేలి పోనున్నాయి. మరియు దేవదూతలు తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ ఉన్నారు మరియు భూమిలో ఉన్నవారి కొరకు క్షమాపణ కోరుతున్నారు. చూడండి, నిశ్చయంగా అల్లాహ్! ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
Verse 6
وَٱلَّذِينَ ٱتَّخَذُوا۟ مِن دُونِهِۦٓ أَوْلِيَآءَ ٱللَّهُ حَفِيظٌ عَلَيْهِمْ وَمَآ أَنتَ عَلَيْهِم بِوَكِيلٍ
Transliteration wa-alladhīna ittakhadhū min dūnihi awliyāa l-lahu ḥafīẓun ʿalayhim wamā anta ʿalayhim biwakīlin
Telugu మరియు ఎవరైతే ఆయనను వదలి ఇతరులను తమ సంరక్షకులుగా చేసుకుంటారో, వారిని అల్లాహ్ కనిపెట్టుకొని ఉన్నాడు. మరియు నీవు వారికి బాధ్యుడవు కావు.
Verse 7
وَكَذَٰلِكَ أَوْحَيْنَآ إِلَيْكَ قُرْءَانًا عَرَبِيًّا لِّتُنذِرَ أُمَّ ٱلْقُرَىٰ وَمَنْ حَوْلَهَا وَتُنذِرَ يَوْمَ ٱلْجَمْعِ لَا رَيْبَ فِيهِ ۚ فَرِيقٌ فِى ٱلْجَنَّةِ وَفَرِيقٌ فِى ٱلسَّعِيرِ
Transliteration wakadhālika awḥaynā ilayka qur'ānan ʿarabiyyan litundhira umma l-qurā waman ḥawlahā watundhira yawma l-jamʿi lā rayba fīhi farīqun fī l-janati wafarīqun fī l-saʿīri
Telugu మరియు ఈ విధంగా మేము నీపై ఈ ఖుర్ఆన్ ను, అరబ్బీ భాషలో, దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము. దానితో నీవు ఉమ్ముల్ ఖురా (మక్కా) మరియు దాని చుట్టుప్రక్కల వారిని హెచ్చరించటానికి మరియు - దానిని గురించి ఎలాంటి సందేహం లేని - ఆ సమావేశ దినాన్ని గురించి హెచ్చరించేందుకు కూడా. (ఆ రోజు) ఒక వర్గం వారు స్వర్గానికి పోతారు, మరొక వర్గం వారు మండే నరకాగ్నిలోకి పోతారు.
Verse 8
وَلَوْ شَآءَ ٱللَّهُ لَجَعَلَهُمْ أُمَّةً وَٰحِدَةً وَلَـٰكِن يُدْخِلُ مَن يَشَآءُ فِى رَحْمَتِهِۦ ۚ وَٱلظَّـٰلِمُونَ مَا لَهُم مِّن وَلِىٍّ وَلَا نَصِيرٍ
Transliteration walaw shāa l-lahu lajaʿalahum ummatan wāḥidatan walākin yud'khilu man yashāu fī raḥmatihi wal-ẓālimūna mā lahum min waliyyin walā naṣīrin
Telugu మరియు ఒకవేళ అల్లాహ్ కోరితే వారందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు! కాని ఆయన తాను కోరిన వారిని తన కరుణకు పాత్రులుగా చేసుకుంటాడు. మరియు దుర్మార్గుల కొరకు, రక్షించేవాడు గానీ సహాయపడేవాడు గానీ ఎవ్వడూ ఉండడు.
Verse 9
أَمِ ٱتَّخَذُوا۟ مِن دُونِهِۦٓ أَوْلِيَآءَ ۖ فَٱللَّهُ هُوَ ٱلْوَلِىُّ وَهُوَ يُحْىِ ٱلْمَوْتَىٰ وَهُوَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ
Transliteration ami ittakhadhū min dūnihi awliyāa fal-lahu huwa l-waliyu wahuwa yuḥ'yī l-mawtā wahuwa ʿalā kulli shayin qadīrun
Telugu లేక వారు ఆయనను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్నారా? కానీ అల్లాహ్! కేవలం ఆయనే సంరక్షకుడు మరియు ఆయనే మృతులను బ్రతికించేవాడు మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు.
Verse 10
وَمَا ٱخْتَلَفْتُمْ فِيهِ مِن شَىْءٍ فَحُكْمُهُۥٓ إِلَى ٱللَّهِ ۚ ذَٰلِكُمُ ٱللَّهُ رَبِّى عَلَيْهِ تَوَكَّلْتُ وَإِلَيْهِ أُنِيبُ
Transliteration wamā ikh'talaftum fīhi min shayin faḥuk'muhu ilā l-lahi dhālikumu l-lahu rabbī ʿalayhi tawakkaltu wa-ilayhi unību
Telugu మరియు మీరు ఏ విషయాన్ని గురించి భేదాభిప్రాయాలు కలిగి వున్నారో, దాని తీర్పు అల్లాహ్ వద్దనే ఉంది. ఆయనే అల్లాహ్! నా ప్రభువు, నేను ఆయననే నమ్ముకున్నాను మరియు నేను పశ్చాత్తాపంతో ఆయన వైపునకే మరలుతాను.
Verse 11
فَاطِرُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ جَعَلَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَٰجًا وَمِنَ ٱلْأَنْعَـٰمِ أَزْوَٰجًا ۖ يَذْرَؤُكُمْ فِيهِ ۚ لَيْسَ كَمِثْلِهِۦ شَىْءٌ ۖ وَهُوَ ٱلسَّمِيعُ ٱلْبَصِيرُ
Transliteration fāṭiru l-samāwāti wal-arḍi jaʿala lakum min anfusikum azwājan wamina l-anʿāmi azwājan yadhra-ukum fīhi laysa kamith'lihi shayon wahuwa l-samīʿu l-baṣīru
Telugu ఆయనే ఆకాశాలు మరియు భూమి యొక్క సృష్టికి మూలాధారి. ఆయన మీలో నుండే మీ కొరకు జంటల్ని మరియు పశువులలో కూడా జంటల్ని చేశాడు. ఈ విధంగా, ఆయన మిమ్మల్ని వ్యాపింప జేస్తున్నాడు. ఆయనకు పోలింది ఏదీ లేదు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.
Verse 12
لَهُۥ مَقَالِيدُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۖ يَبْسُطُ ٱلرِّزْقَ لِمَن يَشَآءُ وَيَقْدِرُ ۚ إِنَّهُۥ بِكُلِّ شَىْءٍ عَلِيمٌ
Transliteration lahu maqālīdu l-samāwāti wal-arḍi yabsuṭu l-riz'qa liman yashāu wayaqdiru innahu bikulli shayin ʿalīmun
Telugu ఆకాశాల యొక్క మరియు భూమి యొక్క తాళపు చెవులు ఆయన వద్దనే వున్నాయి. ఆయన తాను కోరిన వానికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు (తాను కోరిన వానికి) దానిని మితంగా ఇస్తాడు. నిశ్చయంగా, ఆయనకు ప్రతిదానిని గురించి బాగా తెలుసు.
Verse 13
۞ شَرَعَ لَكُم مِّنَ ٱلدِّينِ مَا وَصَّىٰ بِهِۦ نُوحًا وَٱلَّذِىٓ أَوْحَيْنَآ إِلَيْكَ وَمَا وَصَّيْنَا بِهِۦٓ إِبْرَٰهِيمَ وَمُوسَىٰ وَعِيسَىٰٓ ۖ أَنْ أَقِيمُوا۟ ٱلدِّينَ وَلَا تَتَفَرَّقُوا۟ فِيهِ ۚ كَبُرَ عَلَى ٱلْمُشْرِكِينَ مَا تَدْعُوهُمْ إِلَيْهِ ۚ ٱللَّهُ يَجْتَبِىٓ إِلَيْهِ مَن يَشَآءُ وَيَهْدِىٓ إِلَيْهِ مَن يُنِيبُ
Transliteration sharaʿa lakum mina l-dīni mā waṣṣā bihi nūḥan wa-alladhī awḥaynā ilayka wamā waṣṣaynā bihi ib'rāhīma wamūsā waʿīsā an aqīmū l-dīna walā tatafarraqū fīhi kabura ʿalā l-mush'rikīna mā tadʿūhum ilayhi l-lahu yajtabī ilayhi man yashāu wayahdī ilayhi man yunību
Telugu ఆయన, నూహ్ కు విధించిన (ఇస్లాం) ధర్మాన్నే, మీ కొరకు శాసించాడు; మరియు దానినే (ఓ ముహమ్మద్!) మేము నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము; మరియు మేము దానినే ఇబ్రాహీమ్, మూసా మరియు ఈసాలకు కూడా విధిగా చేశాము. ఈ ధర్మాన్నే స్థాపించాలని మరియు దానిని గురించి భేదాభిప్రాయాలకు గురి కాకుండా ఉండాలని. నీవు దాని వైపునకు పిలిచేది బహుదైవారాధకులకు ఎంతో సహింపలేనిదిగా ఉంది. అల్లాహ్ తాను కోరిన వానిని తన వైపునకు ఆకర్షిస్తాడు మరియు పశ్చాత్తాపంతో తన వైపునకు మరలేవానికి మార్గదర్శకత్వం చేస్తాడు.
Verse 14
وَمَا تَفَرَّقُوٓا۟ إِلَّا مِنۢ بَعْدِ مَا جَآءَهُمُ ٱلْعِلْمُ بَغْيًۢا بَيْنَهُمْ ۚ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِن رَّبِّكَ إِلَىٰٓ أَجَلٍ مُّسَمًّى لَّقُضِىَ بَيْنَهُمْ ۚ وَإِنَّ ٱلَّذِينَ أُورِثُوا۟ ٱلْكِتَـٰبَ مِنۢ بَعْدِهِمْ لَفِى شَكٍّ مِّنْهُ مُرِيبٍ
Transliteration wamā tafarraqū illā min baʿdi mā jāahumu l-ʿil'mu baghyan baynahum walawlā kalimatun sabaqat min rabbika ilā ajalin musamman laquḍiya baynahum wa-inna alladhīna ūrithū l-kitāba min baʿdihim lafī shakkin min'hu murībin
Telugu మరియు వారి వద్దకు (సత్య) జ్ఞానం వచ్చిన తరువాతనే - వారి పరస్పర ద్వేషం వల్ల - వారి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. మరియు ఒక నిర్ణీత కాలపు వాగ్దానం నీ ప్రభువు తరపు నుండి చేయబడి ఉండకపోతే, వారి మధ్య తీర్పు ఎప్పుడో జరిగి ఉండేది. మరియు నిశ్చయంగా, వారి తర్వాత గ్రంథాన్ని వారసత్వంలో పొందిన వారు దానిని (ఇస్లాంను) గురించి గొప్ప సంశయంలో పడి ఉన్నారు.
Verse 15
فَلِذَٰلِكَ فَٱدْعُ ۖ وَٱسْتَقِمْ كَمَآ أُمِرْتَ ۖ وَلَا تَتَّبِعْ أَهْوَآءَهُمْ ۖ وَقُلْ ءَامَنتُ بِمَآ أَنزَلَ ٱللَّهُ مِن كِتَـٰبٍ ۖ وَأُمِرْتُ لِأَعْدِلَ بَيْنَكُمُ ۖ ٱللَّهُ رَبُّنَا وَرَبُّكُمْ ۖ لَنَآ أَعْمَـٰلُنَا وَلَكُمْ أَعْمَـٰلُكُمْ ۖ لَا حُجَّةَ بَيْنَنَا وَبَيْنَكُمُ ۖ ٱللَّهُ يَجْمَعُ بَيْنَنَا ۖ وَإِلَيْهِ ٱلْمَصِيرُ
Transliteration falidhālika fa-ud'ʿu wa-is'taqim kamā umir'ta walā tattabiʿ ahwāahum waqul āmantu bimā anzala l-lahu min kitābin wa-umir'tu li-aʿdila baynakumu l-lahu rabbunā warabbukum lanā aʿmālunā walakum aʿmālukum lā ḥujjata baynanā wabaynakumu l-lahu yajmaʿu baynanā wa-ilayhi l-maṣīru
Telugu కావున నీవు (ఓ ముహమ్మద్!) దీని (ఈ సత్యధర్మం) వైపునకే వారిని పిలువు. మరియు నీకు ఆజ్ఞాపించబడిన విధంగా దానిపై స్థిరంగా ఉండు. మరియు వారి కోరికలను అనుసరించకు. మరియు వారితో ఇలా అను: "అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్నే నేను విశ్వసించాను. మరియు మీ మధ్య న్యాయం చేయమని నేను ఆజ్ఞాపించబడ్డాను. అల్లాహ్ యే మా ప్రభువు! మరియు మీ ప్రభువు కూడాను, మా కర్మలు మాకూ మరియు మీ కర్మలు మీకూ, మా మధ్య మరియు మీ మధ్య ఎలాంటి వివాదం ఉండనవసరం లేదు. అల్లాహ్ మనందరినీ సమావేశపరుస్తాడు. మరియు ఆయన వైపే (మనందరి) గమ్యస్థానముంది."
Verse 16
وَٱلَّذِينَ يُحَآجُّونَ فِى ٱللَّهِ مِنۢ بَعْدِ مَا ٱسْتُجِيبَ لَهُۥ حُجَّتُهُمْ دَاحِضَةٌ عِندَ رَبِّهِمْ وَعَلَيْهِمْ غَضَبٌ وَلَهُمْ عَذَابٌ شَدِيدٌ
Transliteration wa-alladhīna yuḥājjūna fī l-lahi min baʿdi mā us'tujība lahu ḥujjatuhum dāḥiḍatun ʿinda rabbihim waʿalayhim ghaḍabun walahum ʿadhābun shadīdun
Telugu మరియు అల్లాహ్ సందేశం స్వీకరించిన తర్వాత, (స్వీకరించిన వారితో) ఆయనను గురించి ఎవరు వాదిస్తారో, వారి వాదం వారి ప్రభువు సన్నిధిలో నిరర్థకమైనది; మరియు వారిపై ఆయన (అల్లాహ్) ఆగ్రహం విరుచుకు పడుతుంది మరియు వారికి కఠిన శిక్ష పడుతుంది.
Verse 17
ٱللَّهُ ٱلَّذِىٓ أَنزَلَ ٱلْكِتَـٰبَ بِٱلْحَقِّ وَٱلْمِيزَانَ ۗ وَمَا يُدْرِيكَ لَعَلَّ ٱلسَّاعَةَ قَرِيبٌ
Transliteration al-lahu alladhī anzala l-kitāba bil-ḥaqi wal-mīzāna wamā yud'rīka laʿalla l-sāʿata qarībun
Telugu అల్లాహ్ యే సత్యంతో గ్రంథాన్ని మరియు (న్యాయానికి) త్రాసును అవతరింపజేశాడు. మరి నీవు ఏ విధంగా గ్రహించగలవు. బహుశా తీర్పు ఘడియ సమీపంలోనే ఉండవచ్చు!
Verse 18
يَسْتَعْجِلُ بِهَا ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِهَا ۖ وَٱلَّذِينَ ءَامَنُوا۟ مُشْفِقُونَ مِنْهَا وَيَعْلَمُونَ أَنَّهَا ٱلْحَقُّ ۗ أَلَآ إِنَّ ٱلَّذِينَ يُمَارُونَ فِى ٱلسَّاعَةِ لَفِى ضَلَـٰلٍۭ بَعِيدٍ
Transliteration yastaʿjilu bihā alladhīna lā yu'minūna bihā wa-alladhīna āmanū mush'fiqūna min'hā wayaʿlamūna annahā l-ḥaqu alā inna alladhīna yumārūna fī l-sāʿati lafī ḍalālin baʿīdin
Telugu దానిని నమ్మని వారే దాని కొరకు తొందర పెడతారు. మరియు విశ్వసించిన వారు, దానిని గురించి భయపడతారు మరియు అది రావటం నిశ్చయంగా, సత్యమేనని తెలుసుకుంటారు. వినండి! నిశ్చయంగా ఎవరైతే తీర్పు ఘడియను గురించి వాదులాడుతారో, వారు మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయిన వారే!
Verse 19
ٱللَّهُ لَطِيفٌۢ بِعِبَادِهِۦ يَرْزُقُ مَن يَشَآءُ ۖ وَهُوَ ٱلْقَوِىُّ ٱلْعَزِيزُ
Transliteration al-lahu laṭīfun biʿibādihi yarzuqu man yashāu wahuwa l-qawiyu l-ʿazīzu
Telugu అల్లాహ్ తన దాసుల పట్ల ఎంతో మృదుహృదయుడు; ఆయన తాను కోరిన వారికి జీవనోపాధిని ప్రసాదిస్తాడు. మరియు ఆయన మహా బలవంతుడు, సర్వశక్తి సంపన్నుడు.
Verse 20
مَن كَانَ يُرِيدُ حَرْثَ ٱلْـَٔاخِرَةِ نَزِدْ لَهُۥ فِى حَرْثِهِۦ ۖ وَمَن كَانَ يُرِيدُ حَرْثَ ٱلدُّنْيَا نُؤْتِهِۦ مِنْهَا وَمَا لَهُۥ فِى ٱلْـَٔاخِرَةِ مِن نَّصِيبٍ
Transliteration man kāna yurīdu ḥartha l-ākhirati nazid lahu fī ḥarthihi waman kāna yurīdu ḥartha l-dun'yā nu'tihi min'hā wamā lahu fī l-ākhirati min naṣībin
Telugu ఎవడు పరలోక ఫలాన్ని కోరుకుంటాడో మేము అతనికి అతని ఫలంలో వృద్ధి కలిగిస్తాము. మరియు ఎవడైతే ఇహలోక ఫలాన్ని కోరుకుంటాడో, మేము అతనికి దాని నొసంగుతాము మరియు అతనికి పరలోక (ప్రతిఫలంలో) ఎలాంటి భాగముండదు.
Verse 21
أَمْ لَهُمْ شُرَكَـٰٓؤُا۟ شَرَعُوا۟ لَهُم مِّنَ ٱلدِّينِ مَا لَمْ يَأْذَنۢ بِهِ ٱللَّهُ ۚ وَلَوْلَا كَلِمَةُ ٱلْفَصْلِ لَقُضِىَ بَيْنَهُمْ ۗ وَإِنَّ ٱلظَّـٰلِمِينَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ
Transliteration am lahum shurakāu sharaʿū lahum mina l-dīni mā lam yadhan bihi l-lahu walawlā kalimatu l-faṣli laquḍiya baynahum wa-inna l-ẓālimīna lahum ʿadhābun alīmun
Telugu ఏమీ? అల్లాహ్ అనుమతించని ధర్మాన్ని వారి కొరకు విధించగల, ఆయన భాగస్వాములు ఎవరైనా వారి దగ్గర ఉన్నారా? ఒకవేళ తీర్పుదినపు వాగ్దానం ముందే చేయబడి ఉండకపోతే, వారి మధ్య తీర్పు ఎప్పుడో జరిగి వుండేదే. మరియు నిశ్చయంగా, ఈ దుర్మార్గులకు బాధాకరమైన శిక్ష పడుతుంది.
Verse 22
تَرَى ٱلظَّـٰلِمِينَ مُشْفِقِينَ مِمَّا كَسَبُوا۟ وَهُوَ وَاقِعٌۢ بِهِمْ ۗ وَٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ فِى رَوْضَاتِ ٱلْجَنَّاتِ ۖ لَهُم مَّا يَشَآءُونَ عِندَ رَبِّهِمْ ۚ ذَٰلِكَ هُوَ ٱلْفَضْلُ ٱلْكَبِيرُ
Transliteration tarā l-ẓālimīna mush'fiqīna mimmā kasabū wahuwa wāqiʿun bihim wa-alladhīna āmanū waʿamilū l-ṣāliḥāti fī rawḍāti l-janāti lahum mā yashāūna ʿinda rabbihim dhālika huwa l-faḍlu l-kabīru
Telugu ఈ దుర్మార్గులు (పునరుత్థాన దినాన) తాము చేసిన కర్మల ఫలితాన్ని చూసి భయపడటాన్ని, నీవు చూస్తావు మరియు అది వారిపై తప్పక పడుతుంది. మరియు ఎవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేస్తారో, వారు స్వర్గపు పచ్చిక మైదానాలలో ఉంటారు. వారికి తాము కోరేదంతా తమ ప్రభువు తరఫు నుండి లభిస్తుంది అదే ఆ గొప్ప అనుగ్రహం.
Verse 23
ذَٰلِكَ ٱلَّذِى يُبَشِّرُ ٱللَّهُ عِبَادَهُ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ ۗ قُل لَّآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ أَجْرًا إِلَّا ٱلْمَوَدَّةَ فِى ٱلْقُرْبَىٰ ۗ وَمَن يَقْتَرِفْ حَسَنَةً نَّزِدْ لَهُۥ فِيهَا حُسْنًا ۚ إِنَّ ٱللَّهَ غَفُورٌ شَكُورٌ
Transliteration dhālika alladhī yubashiru l-lahu ʿibādahu alladhīna āmanū waʿamilū l-ṣāliḥāti qul lā asalukum ʿalayhi ajran illā l-mawadata fī l-qur'bā waman yaqtarif ḥasanatan nazid lahu fīhā ḥus'nan inna l-laha ghafūrun shakūrun
Telugu ఆ (స్వర్గపు) శుభవార్తనే, అల్లాహ్ విశ్వసించి సత్కార్యాలు చేసే తన దాసులకు తెలియజేస్తున్నాడు. (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "నేను దీనికి బదులుగా మీ నుండి బంధుత్వ ప్రేమ తప్ప వేరే ప్రతిఫలాన్ని కోరడం లేదు!" మరియు ఎవడు మంచిని సంపాదించుకుంటాడో, అతనికి దానిలో మేము మరింత మంచిని పెంచుతాము. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, కృతజ్ఞతలను ఆమోదించేవాడు.
Verse 24
أَمْ يَقُولُونَ ٱفْتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا ۖ فَإِن يَشَإِ ٱللَّهُ يَخْتِمْ عَلَىٰ قَلْبِكَ ۗ وَيَمْحُ ٱللَّهُ ٱلْبَـٰطِلَ وَيُحِقُّ ٱلْحَقَّ بِكَلِمَـٰتِهِۦٓ ۚ إِنَّهُۥ عَلِيمٌۢ بِذَاتِ ٱلصُّدُورِ
Transliteration am yaqūlūna if'tarā ʿalā l-lahi kadhiban fa-in yasha-i l-lahu yakhtim ʿalā qalbika wayamḥu l-lahu l-bāṭila wayuḥiqqu l-ḥaqa bikalimātihi innahu ʿalīmun bidhāti l-ṣudūri
Telugu ఏమీ? వారు: "అతను (ముహమ్మద్!) అల్లాహ్ పేరుతో అసత్యాలు కల్పిస్తున్నాడు" అని అంటున్నారా? కాని ఒకవేళ అల్లాహ్ తలచుకుంటే, నీ హృదయం మీద ముద్రవేసే వాడు. మరియు అల్లాహ్ అసత్యాన్ని రూపుమాపి, తన ఆజ్ఞతో సత్యాన్ని స్థాపిస్తాడు. నిశ్చయంగా ఆయనకు హృదయాలలో ఉన్నదంతా బాగా తెలుసు.
Verse 25
وَهُوَ ٱلَّذِى يَقْبَلُ ٱلتَّوْبَةَ عَنْ عِبَادِهِۦ وَيَعْفُوا۟ عَنِ ٱلسَّيِّـَٔاتِ وَيَعْلَمُ مَا تَفْعَلُونَ
Transliteration wahuwa alladhī yaqbalu l-tawbata ʿan ʿibādihi wayaʿfū ʿani l-sayiāti wayaʿlamu mā tafʿalūna
Telugu ఆయనే తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు. మరియు పాపాలను మన్నించేవాడు. మరియు మీరు చేసేదంతా ఆయనకు బాగా తెలుసు.
Verse 26
وَيَسْتَجِيبُ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ وَيَزِيدُهُم مِّن فَضْلِهِۦ ۚ وَٱلْكَـٰفِرُونَ لَهُمْ عَذَابٌ شَدِيدٌ
Transliteration wayastajību alladhīna āmanū waʿamilū l-ṣāliḥāti wayazīduhum min faḍlihi wal-kāfirūna lahum ʿadhābun shadīdun
Telugu మరియు ఆయన విశ్వసించి, సత్కార్యాలు చేసేవారి ప్రార్థనలను అంగీకరిస్తాడు మరియు వారిపై తన అనుగ్రహాన్ని మరింత అధికం చేస్తాడు. ఇక సత్యతిరస్కారులు! వారికి కఠిన శిక్ష పడుతుంది.
Verse 27
۞ وَلَوْ بَسَطَ ٱللَّهُ ٱلرِّزْقَ لِعِبَادِهِۦ لَبَغَوْا۟ فِى ٱلْأَرْضِ وَلَـٰكِن يُنَزِّلُ بِقَدَرٍ مَّا يَشَآءُ ۚ إِنَّهُۥ بِعِبَادِهِۦ خَبِيرٌۢ بَصِيرٌ
Transliteration walaw basaṭa l-lahu l-riz'qa liʿibādihi labaghaw fī l-arḍi walākin yunazzilu biqadarin mā yashāu innahu biʿibādihi khabīrun baṣīrun
Telugu మరియు ఒకవేళ అల్లాహ్ తన దాసులందరికీ పుష్కలంగా జీవనోపాధిని ప్రసాదించి ఉంటే, వారు భూమిలో తిరుగుబాటుకు పాల్పడేవారు. కావున ఆయన తన ఇష్టప్రకారం, మితంగా ఇస్తాడు. నిశ్చయంగా, ఆయన తన దాసులను గురించి బాగా ఎరుగును, ఆయన అంతా చూస్తున్నాడు!
Verse 28
وَهُوَ ٱلَّذِى يُنَزِّلُ ٱلْغَيْثَ مِنۢ بَعْدِ مَا قَنَطُوا۟ وَيَنشُرُ رَحْمَتَهُۥ ۚ وَهُوَ ٱلْوَلِىُّ ٱلْحَمِيدُ
Transliteration wahuwa alladhī yunazzilu l-ghaytha min baʿdi mā qanaṭū wayanshuru raḥmatahu wahuwa l-waliyu l-ḥamīdu
Telugu మరియు ఆయనే, వారు నిరాశకులోనై ఉన్నప్పుడు వర్షాన్ని కురిపిస్తాడు మరియు తన కారుణ్యాన్ని వ్యాపింపజేస్తాడు. మరియు ఆయనే సంరక్షకుడు, ప్రశంసనీయుడు.
Verse 29
وَمِنْ ءَايَـٰتِهِۦ خَلْقُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَثَّ فِيهِمَا مِن دَآبَّةٍ ۚ وَهُوَ عَلَىٰ جَمْعِهِمْ إِذَا يَشَآءُ قَدِيرٌ
Transliteration wamin āyātihi khalqu l-samāwāti wal-arḍi wamā batha fīhimā min dābbatin wahuwa ʿalā jamʿihim idhā yashāu qadīrun
Telugu మరియు ఆయన సూచనలలో (ఆయాత్ లలో), ఆకాశాలను మరియు భూమిని మరియు వాటిలో వ్యాపింపజేసిన జీవరాసులను సృష్టించటం కూడా ఉంది. మరియు ఆయన తాను కోరినప్పుడు వాటినన్నింటినీ సమీకరించగల సమర్ధుడు.
Verse 30
وَمَآ أَصَـٰبَكُم مِّن مُّصِيبَةٍ فَبِمَا كَسَبَتْ أَيْدِيكُمْ وَيَعْفُوا۟ عَن كَثِيرٍ
Transliteration wamā aṣābakum min muṣībatin fabimā kasabat aydīkum wayaʿfū ʿan kathīrin
Telugu మీపై ఏ ఆపద వచ్చినా, అది మీ చేతులారా మీరు సంపాదించుకున్నదే! మరియు ఆయన (మీ తప్పులను) ఎన్నింటినో క్షమిస్తాడు.
Verse 31
وَمَآ أَنتُم بِمُعْجِزِينَ فِى ٱلْأَرْضِ ۖ وَمَا لَكُم مِّن دُونِ ٱللَّهِ مِن وَلِىٍّ وَلَا نَصِيرٍ
Transliteration wamā antum bimuʿ'jizīna fī l-arḍi wamā lakum min dūni l-lahi min waliyyin walā naṣīrin
Telugu మరియు మీరు భూమిలో ఆయన నుంచి తప్పించుకోలేరు. మరియు మీకు అల్లాహ్ తప్ప మరొక సంరక్షకుడు గానీ, సహాయకుడు గానీ లేడు!
Verse 32
وَمِنْ ءَايَـٰتِهِ ٱلْجَوَارِ فِى ٱلْبَحْرِ كَٱلْأَعْلَـٰمِ
Transliteration wamin āyātihi l-jawāri fī l-baḥri kal-aʿlāmi
Telugu మరియు ఆయన సూచనలలో (ఆయాత్ లలో) సముద్రంలో, కొండల మాదిరిగా పయనించే ఓడలు కూడా వున్నాయి.
Verse 33
إِن يَشَأْ يُسْكِنِ ٱلرِّيحَ فَيَظْلَلْنَ رَوَاكِدَ عَلَىٰ ظَهْرِهِۦٓ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُورٍ
Transliteration in yasha yus'kini l-rīḥa fayaẓlalna rawākida ʿalā ẓahrihi inna fī dhālika laāyātin likulli ṣabbārin shakūrin
Telugu ఒకవేళ ఆయన కోరితే గాలిని ఆపగలడు. అప్పుడవి దాని (సముద్రపు) వీపు మీద నిలిచిపోతాయి. నిశ్చయంగా, ఇందులో సహనం గలవానికి, కృతజ్ఞునికి ఎన్నో సూచనలున్నాయి.
Verse 34
أَوْ يُوبِقْهُنَّ بِمَا كَسَبُوا۟ وَيَعْفُ عَن كَثِيرٍ
Transliteration aw yūbiq'hunna bimā kasabū wayaʿfu ʿan kathīrin
Telugu లేదా ఆయన వారి కర్మల ఫలితంగా వారిని (ముంచి) నాశనం చేయవచ్చు, కాని ఆయన ఎన్నింటినో క్షమిస్తాడు కూడాను.
Verse 35
وَيَعْلَمَ ٱلَّذِينَ يُجَـٰدِلُونَ فِىٓ ءَايَـٰتِنَا مَا لَهُم مِّن مَّحِيصٍ
Transliteration wayaʿlama alladhīna yujādilūna fī āyātinā mā lahum min maḥīṣin
Telugu మరియు మా సూచన (ఆయాత్) లను గురించి వాదులాడేవారు, తమకు తప్పించుకునే చోటు లేదని తెలుసుకుంటారు.
Verse 36
فَمَآ أُوتِيتُم مِّن شَىْءٍ فَمَتَـٰعُ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا ۖ وَمَا عِندَ ٱللَّهِ خَيْرٌ وَأَبْقَىٰ لِلَّذِينَ ءَامَنُوا۟ وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
Transliteration famā ūtītum min shayin famatāʿu l-ḥayati l-dun'yā wamā ʿinda l-lahi khayrun wa-abqā lilladhīna āmanū waʿalā rabbihim yatawakkalūna
Telugu కావున మీకు ఇవ్వబడిందంతా ప్రాపంచిక జీవితపు సుఖసంతోషమే. కనుక అల్లాహ్ వద్దనున్నదే - విశ్వసించి తమ ప్రభువునే నమ్ముకున్న వారి కొరకు - ఉత్తమమైనదీ మరియు శాశ్వతమైనదీను.
Verse 37
وَٱلَّذِينَ يَجْتَنِبُونَ كَبَـٰٓئِرَ ٱلْإِثْمِ وَٱلْفَوَٰحِشَ وَإِذَا مَا غَضِبُوا۟ هُمْ يَغْفِرُونَ
Transliteration wa-alladhīna yajtanibūna kabāira l-ith'mi wal-fawāḥisha wa-idhā mā ghaḍibū hum yaghfirūna
Telugu మరియు అలాంటి వారు పెద్ద పాపాలు మరియు అశ్లీలమైన పనులకు దూరంగా ఉంటారు మరియు కోపం వచ్చినా క్షమిస్తారు,
Verse 38
وَٱلَّذِينَ ٱسْتَجَابُوا۟ لِرَبِّهِمْ وَأَقَامُوا۟ ٱلصَّلَوٰةَ وَأَمْرُهُمْ شُورَىٰ بَيْنَهُمْ وَمِمَّا رَزَقْنَـٰهُمْ يُنفِقُونَ
Transliteration wa-alladhīna is'tajābū lirabbihim wa-aqāmū l-ṣalata wa-amruhum shūrā baynahum wamimmā razaqnāhum yunfiqūna
Telugu మరియు అలాంటి వారు తమ ప్రభువు ఆజ్ఞాపాలన చేస్తారు మరియు నమాజ్ ను స్థాపిస్తారు మరియు తమ వ్యవహారాలను పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించు కుంటారు మరియు మేము వారికి ప్రసాదించిన జీనవోపాధి నుండి ఇతరుల మీద ఖర్చు చేస్తారు;
Verse 39
وَٱلَّذِينَ إِذَآ أَصَابَهُمُ ٱلْبَغْىُ هُمْ يَنتَصِرُونَ
Transliteration wa-alladhīna idhā aṣābahumu l-baghyu hum yantaṣirūna
Telugu మరియు అలాంటి వారు తమపై దౌర్జన్యం జరిగినపుడు దానికి న్యాయప్రతీకారం మాత్రమే చేస్తారు.
Verse 40
وَجَزَٰٓؤُا۟ سَيِّئَةٍ سَيِّئَةٌ مِّثْلُهَا ۖ فَمَنْ عَفَا وَأَصْلَحَ فَأَجْرُهُۥ عَلَى ٱللَّهِ ۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلظَّـٰلِمِينَ
Transliteration wajazāu sayyi-atin sayyi-atun mith'luhā faman ʿafā wa-aṣlaḥa fa-ajruhu ʿalā l-lahi innahu lā yuḥibbu l-ẓālimīna
Telugu మరియు కీడుకు ప్రతీకారం దానంతటి కీడు మాత్రమే. కాని ఎవడైనా క్షమించి సంధి చేసుకుంటే అతని ప్రతిఫలం అల్లాహ్ దగ్గర ఉంది. నిశ్చయంగా, ఆయన దుర్మార్గులంటే ఇష్టపడడు.
Verse 41
وَلَمَنِ ٱنتَصَرَ بَعْدَ ظُلْمِهِۦ فَأُو۟لَـٰٓئِكَ مَا عَلَيْهِم مِّن سَبِيلٍ
Transliteration walamani intaṣara baʿda ẓul'mihi fa-ulāika mā ʿalayhim min sabīlin
Telugu కాని ఎవరైనా తమకు అన్యాయం జరిగినప్పుడు దానికి తగినంత న్యాయప్రతీకారం మాత్రమే తీసుకుంటే అలాంటి వారు నిందార్హులు కారు.
Verse 42
إِنَّمَا ٱلسَّبِيلُ عَلَى ٱلَّذِينَ يَظْلِمُونَ ٱلنَّاسَ وَيَبْغُونَ فِى ٱلْأَرْضِ بِغَيْرِ ٱلْحَقِّ ۚ أُو۟لَـٰٓئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ
Transliteration innamā l-sabīlu ʿalā alladhīna yaẓlimūna l-nāsa wayabghūna fī l-arḍi bighayri l-ḥaqi ulāika lahum ʿadhābun alīmun
Telugu కాని, వాస్తవానికి ఎవరైతే ప్రజలపై దౌర్జన్యాలు చేస్తారో మరియు భూమిలో అన్యాయంగా ఉపద్రవాలు రేకెత్తిస్తారో అలాంటి వారు నిందార్హులు. అలాంటి వారు, వారికే! బాధాకరమైన శిక్ష గలదు.
Verse 43
وَلَمَن صَبَرَ وَغَفَرَ إِنَّ ذَٰلِكَ لَمِنْ عَزْمِ ٱلْأُمُورِ
Transliteration walaman ṣabara waghafara inna dhālika lamin ʿazmi l-umūri
Telugu మరియు ఎవడైతే సహనం వహించి క్షమిస్తాడో! నిశ్చయంగా, అది (అల్లాహ్ దృష్టిలో) ఎంతో సహృదయంతో (సాహసంతో) కూడిన పని!
Verse 44
وَمَن يُضْلِلِ ٱللَّهُ فَمَا لَهُۥ مِن وَلِىٍّ مِّنۢ بَعْدِهِۦ ۗ وَتَرَى ٱلظَّـٰلِمِينَ لَمَّا رَأَوُا۟ ٱلْعَذَابَ يَقُولُونَ هَلْ إِلَىٰ مَرَدٍّ مِّن سَبِيلٍ
Transliteration waman yuḍ'lili l-lahu famā lahu min waliyyin min baʿdihi watarā l-ẓālimīna lammā ra-awū l-ʿadhāba yaqūlūna hal ilā maraddin min sabīlin
Telugu మరియు, ఎవడినైతే అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడనిస్తాడో! దాని తరువాత వాడికి సంరక్షకుడు, ఎవ్వడూ ఉండడు. మరియు ఈ దుర్మార్గులు శిక్షను చూసినపుడు: "మేము తిరిగి (భూలోకంలోకి) పోయే మార్గమేదైనా ఉందా?" అని అడగటం నీవు చూస్తావు.
Verse 45
وَتَرَىٰهُمْ يُعْرَضُونَ عَلَيْهَا خَـٰشِعِينَ مِنَ ٱلذُّلِّ يَنظُرُونَ مِن طَرْفٍ خَفِىٍّ ۗ وَقَالَ ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِنَّ ٱلْخَـٰسِرِينَ ٱلَّذِينَ خَسِرُوٓا۟ أَنفُسَهُمْ وَأَهْلِيهِمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ ۗ أَلَآ إِنَّ ٱلظَّـٰلِمِينَ فِى عَذَابٍ مُّقِيمٍ
Transliteration watarāhum yuʿ'raḍūna ʿalayhā khāshiʿīna mina l-dhuli yanẓurūna min ṭarfin khafiyyin waqāla alladhīna āmanū inna l-khāsirīna alladhīna khasirū anfusahum wa-ahlīhim yawma l-qiyāmati alā inna l-ẓālimīna fī ʿadhābin muqīmin
Telugu మరియు వారిని, దాని (నరకం) ముందుకు తీసుకొని వచ్చినప్పుడు, వారు అవమానంతో కృంగిపోతూ, దొంగచూపులతో దానిని చూడటం నీవు గమనిస్తావు. మరియు విశ్వసించిన వారు ఇలా అంటారు: "నిశ్చయంగా, తమను తాము మరియు తమ సంబంధీకులను (అనుచరులను) నష్టానికి గురి చేసుకున్నవారే, ఈ పునరుత్థాన దినమున నష్టపోయే వారు. జాగ్రత్త! నిశ్చయంగా, దుర్మార్గులే శాశ్వతమైన శిక్షకు గురి అవుతారు."
Verse 46
وَمَا كَانَ لَهُم مِّنْ أَوْلِيَآءَ يَنصُرُونَهُم مِّن دُونِ ٱللَّهِ ۗ وَمَن يُضْلِلِ ٱللَّهُ فَمَا لَهُۥ مِن سَبِيلٍ
Transliteration wamā kāna lahum min awliyāa yanṣurūnahum min dūni l-lahi waman yuḍ'lili l-lahu famā lahu min sabīlin
Telugu మరియు అల్లాహ్ తప్ప, ఇతరులెవ్వరూ వారికి రక్షకులుగా గానీ, సహాయకులుగా గానీ ఉండరు. మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదిలిన వారికి (దాని నుండి బయటపడే) మార్గమేదీ వుండదు.
Verse 47
ٱسْتَجِيبُوا۟ لِرَبِّكُم مِّن قَبْلِ أَن يَأْتِىَ يَوْمٌ لَّا مَرَدَّ لَهُۥ مِنَ ٱللَّهِ ۚ مَا لَكُم مِّن مَّلْجَإٍ يَوْمَئِذٍ وَمَا لَكُم مِّن نَّكِيرٍ
Transliteration is'tajībū lirabbikum min qabli an yatiya yawmun lā maradda lahu mina l-lahi mā lakum min malja-in yawma-idhin wamā lakum min nakīrin
Telugu (కావున ఓ మానవులారా మరియు జిన్నాతులారా!) మీరు, తొలగింపబడే అవకాశం లేనటువంటి ఆ దినం అల్లాహ్ తరఫు నుండి రాకముందే, మీ ప్రభువు ఆజ్ఞను శిరసావహించండి. ఆ రోజున మీకు ఎక్కడా ఆశ్రయం లభించదు. మరియు మీకు (మీ పాపాలను) నిరాకరించటానికి కూడా వీలుండదు.
Verse 48
فَإِنْ أَعْرَضُوا۟ فَمَآ أَرْسَلْنَـٰكَ عَلَيْهِمْ حَفِيظًا ۖ إِنْ عَلَيْكَ إِلَّا ٱلْبَلَـٰغُ ۗ وَإِنَّآ إِذَآ أَذَقْنَا ٱلْإِنسَـٰنَ مِنَّا رَحْمَةً فَرِحَ بِهَا ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌۢ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ فَإِنَّ ٱلْإِنسَـٰنَ كَفُورٌ
Transliteration fa-in aʿraḍū famā arsalnāka ʿalayhim ḥafīẓan in ʿalayka illā l-balāghu wa-innā idhā adhaqnā l-insāna minnā raḥmatan fariḥa bihā wa-in tuṣib'hum sayyi-atun bimā qaddamat aydīhim fa-inna l-insāna kafūrun
Telugu (ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు విముఖులైతే మేము నిన్ను వారిపై రక్షకునిగా చేసి పంపలేదు. నీ పని కేవలం (సందేశాన్ని) అందజేయటం మాత్రమే. మరియు మేము మానవునికి మా కారుణ్యాన్ని రుచి చూపిస్తే, దానికి అతడు సంతోషంతో పొంగిపోతాడు. కాని ఒకవేళ వారికి తమ చేతులారా చేసుకున్న దానికి ఫలితంగా, కీడు కలిగినట్లయితే! నిశ్చయంగా, అప్పుడు మానవుడు కృతఘ్ను డవుతాడు!
Verse 49
لِّلَّهِ مُلْكُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ يَخْلُقُ مَا يَشَآءُ ۚ يَهَبُ لِمَن يَشَآءُ إِنَـٰثًا وَيَهَبُ لِمَن يَشَآءُ ٱلذُّكُورَ
Transliteration lillahi mul'ku l-samāwāti wal-arḍi yakhluqu mā yashāu yahabu liman yashāu ināthan wayahabu liman yashāu l-dhukūra
Telugu భూమ్యాకాశాల సామ్రాజ్యాధికారం అల్లాహ్ దే! ఆయన తాను కోరింది సృష్టిస్తాడు. ఆయన తాను కోరిన వారికి కుమార్తెలను ప్రసాదిస్తాడు మరియు తాను కోరిన వారికి కుమారులను ప్రసాదిస్తుడు.
Verse 50
أَوْ يُزَوِّجُهُمْ ذُكْرَانًا وَإِنَـٰثًا ۖ وَيَجْعَلُ مَن يَشَآءُ عَقِيمًا ۚ إِنَّهُۥ عَلِيمٌ قَدِيرٌ
Transliteration aw yuzawwijuhum dhuk'rānan wa-ināthan wayajʿalu man yashāu ʿaqīman innahu ʿalīmun qadīrun
Telugu లేదా! వారికి కుమారులను మరియు కుమార్తెలను కలిపి ప్రసాదిస్తాడు. మరియు తాను కోరిన వారికి అసలు సంతానమే ఇవ్వడు. నిశ్చయంగా, ఆయన సర్వజ్ఞుడు, అంతా చేయగల సమర్ధుడు.
Verse 51
۞ وَمَا كَانَ لِبَشَرٍ أَن يُكَلِّمَهُ ٱللَّهُ إِلَّا وَحْيًا أَوْ مِن وَرَآئِ حِجَابٍ أَوْ يُرْسِلَ رَسُولًا فَيُوحِىَ بِإِذْنِهِۦ مَا يَشَآءُ ۚ إِنَّهُۥ عَلِىٌّ حَكِيمٌ
Transliteration wamā kāna libasharin an yukallimahu l-lahu illā waḥyan aw min warāi ḥijābin aw yur'sila rasūlan fayūḥiya bi-idh'nihi mā yashāu innahu ʿaliyyun ḥakīmun
Telugu మరియు అల్లాహ్ తో మాట్లాడగలిగే శక్తి ఏ మానవునికీ లేదు; కేవలం దివ్యజ్ఞానం (వహీ) ద్వారా లేదా తెర వెనుక నుండి, లేదా ఆయన పంపిన సందేశహరుని ద్వారా, ఆయన అనుమతితో, ఆయన కోరిన (వహీ) అవతరింప జేయబడటం తప్ప! నిశ్చయంగా, ఆయన మహోన్నతుడు, మహా వివేకవంతుడు.
Verse 52
وَكَذَٰلِكَ أَوْحَيْنَآ إِلَيْكَ رُوحًا مِّنْ أَمْرِنَا ۚ مَا كُنتَ تَدْرِى مَا ٱلْكِتَـٰبُ وَلَا ٱلْإِيمَـٰنُ وَلَـٰكِن جَعَلْنَـٰهُ نُورًا نَّهْدِى بِهِۦ مَن نَّشَآءُ مِنْ عِبَادِنَا ۚ وَإِنَّكَ لَتَهْدِىٓ إِلَىٰ صِرَٰطٍ مُّسْتَقِيمٍ
Transliteration wakadhālika awḥaynā ilayka rūḥan min amrinā mā kunta tadrī mā l-kitābu walā l-īmānu walākin jaʿalnāhu nūran nahdī bihi man nashāu min ʿibādinā wa-innaka latahdī ilā ṣirāṭin mus'taqīmin
Telugu మరియు ఇదే విధంగా (ఓ ముహమ్మద్!) మేము మా ఆజ్ఞతో నీ వద్దకు దివ్యజ్ఞానం (రూహ్) అవతరింపజేశాము. (దీనికి ముందు) నీకు గ్రంథమేమిటో మరియు విశ్వాసమేమిటో తెలియదు. కాని మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) జ్యోతిగా జేసి, దీని ద్వారా మా దాసులలో మేము కోరిన వారికి, మార్గదర్శకత్వం చేస్తాము. మరియు నిశ్చయంగా, నీవు (ప్రజలకు) ఋజుమార్గం వైపునకు దారి చూపుతున్నావు.
Verse 53
صِرَٰطِ ٱللَّهِ ٱلَّذِى لَهُۥ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۗ أَلَآ إِلَى ٱللَّهِ تَصِيرُ ٱلْأُمُورُ
Transliteration ṣirāṭi l-lahi alladhī lahu mā fī l-samāwāti wamā fī l-arḍi alā ilā l-lahi taṣīru l-umūru
Telugu అల్లాహ్ మార్గం! భూమ్యాకాశాలలో నున్న ప్రతిదీ ఆయనకే చెందుతుంది. వాస్తవానికి, వ్యవహారాలన్నీ చివరకు (తీర్పు కొరకు) అల్లాహ్ వద్దకే చేరుతాయి.
Read Surah Ash-Shuraa in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Gujarati
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Telugu: the Qur’an in Telugu.
Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.