Surah As-Saffat in Telugu: translation and audio
Surah 37 · الصافات · Those who set the Ranks · 182 verses
Surah As-Saffat verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah As-Saffat word by word in English.
Verse 1
وَٱلصَّـٰٓفَّـٰتِ صَفًّا
Transliteration wal-ṣāfāti ṣaffan
Telugu వరుసగా బారులు తీరి నిలుచున్న వారి (దైవదూతల) సాక్షిగా!
Verse 2
فَٱلزَّٰجِرَٰتِ زَجْرًا
Transliteration fal-zājirāti zajran
Telugu మేఘాలను నడిపించే వారి (దైవదూతల) సాక్షిగా!
Verse 3
فَٱلتَّـٰلِيَـٰتِ ذِكْرًا
Transliteration fal-tāliyāti dhik'ran
Telugu ఈ ఉపదేశాన్ని (ఖుర్ఆన్ ను, అల్లాహ్ దగ్గరి నుండి మానవులకు) తెచ్చే వారి (దైవదూతల) సాక్షిగా!
Verse 4
إِنَّ إِلَـٰهَكُمْ لَوَٰحِدٌ
Transliteration inna ilāhakum lawāḥidun
Telugu నిశ్చయంగా, మీ ఆరాధ్య దైవం కేవలం ఆయన (అల్లాహ్) ఒక్కడే!
Verse 5
رَّبُّ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَرَبُّ ٱلْمَشَـٰرِقِ
Transliteration rabbu l-samāwāti wal-arḍi wamā baynahumā warabbu l-mashāriqi
Telugu ఆకాశాలు మరియు భూమి మరియు వాటి మధ్యనున్న వాటి ప్రభువు మరియు సూర్యోదయ (తూర్పు) స్థలాలకు ప్రభువు.
Verse 6
إِنَّا زَيَّنَّا ٱلسَّمَآءَ ٱلدُّنْيَا بِزِينَةٍ ٱلْكَوَاكِبِ
Transliteration innā zayyannā l-samāa l-dun'yā bizīnatin l-kawākibi
Telugu నిశ్చయంగా, మేము భూలోకానికి దగ్గరి ఆకాశాన్ని నక్షత్ర సముదాయాలతో అలంకరించాము;
Verse 7
وَحِفْظًا مِّن كُلِّ شَيْطَـٰنٍ مَّارِدٍ
Transliteration waḥif'ẓan min kulli shayṭānin māridin
Telugu మరియు ధిక్కారి అయిన ప్రతి షైతాన్ నుండి కాపాడటానికి;
Verse 8
لَّا يَسَّمَّعُونَ إِلَى ٱلْمَلَإِ ٱلْأَعْلَىٰ وَيُقْذَفُونَ مِن كُلِّ جَانِبٍ
Transliteration lā yassammaʿūna ilā l-mala-i l-aʿlā wayuq'dhafūna min kulli jānibin
Telugu ఇక వారు (షైతాన్ లు), ఉన్నత స్థానాలలో ఉన్న నాయకుల (దైవదూతల) మాటలు వినలేరు మరియు వారు ప్రతి దిక్కు నుండి తరుమబడుతూ ఉంటారు.
Verse 9
دُحُورًا ۖ وَلَهُمْ عَذَابٌ وَاصِبٌ
Transliteration duḥūran walahum ʿadhābun wāṣibun
Telugu (ఎందుకంటే) వారు (షైతాన్ లు) బహిష్కరించ బడ్డారు. మరియు వారికి నిరంతరమైన శిక్ష ఉంది.
Verse 10
إِلَّا مَنْ خَطِفَ ٱلْخَطْفَةَ فَأَتْبَعَهُۥ شِهَابٌ ثَاقِبٌ
Transliteration illā man khaṭifa l-khaṭfata fa-atbaʿahu shihābun thāqibun
Telugu కాని, ఎవడైనా (ఏ షైతానైనా), దేనినైనా ఎగురవేసుకొని పోతున్నట్లైతే, మండే అగ్నిజ్వాల అతనిని వెంబడిస్తుంది.
Verse 11
فَٱسْتَفْتِهِمْ أَهُمْ أَشَدُّ خَلْقًا أَم مَّنْ خَلَقْنَآ ۚ إِنَّا خَلَقْنَـٰهُم مِّن طِينٍ لَّازِبٍۭ
Transliteration fa-is'taftihim ahum ashaddu khalqan am man khalaqnā innā khalaqnāhum min ṭīnin lāzibin
Telugu అయితే వారిని అడగిండి: "ఏమీ? వారు (మానవులు) దృఢమైన సృష్టా! లేక, మేము సృష్టించింది (ఈ సృష్టి దృఢమైనదా?" నిశ్చయంగా, మేము వారిని జిగట మట్టి (తీనిల్లాజిబ్) తో సృష్టించాము.
Verse 12
بَلْ عَجِبْتَ وَيَسْخَرُونَ
Transliteration bal ʿajib'ta wayaskharūna
Telugu వాస్తవానికి, నీవైతే ఆశ్చర్యపడుతున్నావు, కాని వారు ఎగతాళి చేస్తున్నారు.
Verse 13
وَإِذَا ذُكِّرُوا۟ لَا يَذْكُرُونَ
Transliteration wa-idhā dhukkirū lā yadhkurūna
Telugu మరియు వారికి ఉపదేశమిచ్చినపుడు, వారు దానిని స్వీకరించరు.
Verse 14
وَإِذَا رَأَوْا۟ ءَايَةً يَسْتَسْخِرُونَ
Transliteration wa-idhā ra-aw āyatan yastaskhirūna
Telugu మరియు వారొక సంకేతాన్ని చూసినప్పుడు, దానిని ఎగతాళి చేస్తారు.
Verse 15
وَقَالُوٓا۟ إِنْ هَـٰذَآ إِلَّا سِحْرٌ مُّبِينٌ
Transliteration waqālū in hādhā illā siḥ'run mubīnun
Telugu మరియు వారిలా అంటారు: "ఇది స్పష్టమైన మంత్రజాలం మాత్రమే!"
Verse 16
أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَـٰمًا أَءِنَّا لَمَبْعُوثُونَ
Transliteration a-idhā mit'nā wakunnā turāban waʿiẓāman a-innā lamabʿūthūna
Telugu "ఏమిటి? మేము మరణించి మట్టిగా, ఎముకలుగా (అస్తిపంజరంగా) మారిపోయిన తరువాత కూడా మరల సజీవులుగా లేపబడతామా?"
Verse 17
أَوَءَابَآؤُنَا ٱلْأَوَّلُونَ
Transliteration awaābāunā l-awalūna
Telugu "ఏమిటి? మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా?"
Verse 18
قُلْ نَعَمْ وَأَنتُمْ دَٰخِرُونَ
Transliteration qul naʿam wa-antum dākhirūna
Telugu వారితో ఇలా అను: "అవును! అప్పుడు మీరు అధమమైన వారు అవుతారు."
Verse 19
فَإِنَّمَا هِىَ زَجْرَةٌ وَٰحِدَةٌ فَإِذَا هُمْ يَنظُرُونَ
Transliteration fa-innamā hiya zajratun wāḥidatun fa-idhā hum yanẓurūna
Telugu నిశ్చయంగా, అది ఒక పెద్ద ధ్వని మాత్రమే (రెండవ బాకా), అప్పుడు వారు (లేచి) చూస్తూ ఉండిపోతారు.
Verse 20
وَقَالُوا۟ يَـٰوَيْلَنَا هَـٰذَا يَوْمُ ٱلدِّينِ
Transliteration waqālū yāwaylanā hādhā yawmu l-dīni
Telugu మరియు వారు ఇలా అంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదే ఆ తీర్పుదినం."
Verse 21
هَـٰذَا يَوْمُ ٱلْفَصْلِ ٱلَّذِى كُنتُم بِهِۦ تُكَذِّبُونَ
Transliteration hādhā yawmu l-faṣli alladhī kuntum bihi tukadhibūna
Telugu (అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): "మీరు అబద్ధమని తిరస్కరిస్తూ ఉండే న్యాయవిచారణ దినం ఇదే!"
Verse 22
۞ ٱحْشُرُوا۟ ٱلَّذِينَ ظَلَمُوا۟ وَأَزْوَٰجَهُمْ وَمَا كَانُوا۟ يَعْبُدُونَ
Transliteration uḥ'shurū alladhīna ẓalamū wa-azwājahum wamā kānū yaʿbudūna
Telugu (దైవదూతలతో ఇలా అనబడుతుంది): "ఆ దుర్మార్గులను సమావేశపరచండి! మరియు వారి సహవాసులను మరియు వారు ఆరాధిస్తూ ఉన్న వారిని -
Verse 23
مِن دُونِ ٱللَّهِ فَٱهْدُوهُمْ إِلَىٰ صِرَٰطِ ٱلْجَحِيمِ
Transliteration min dūni l-lahi fa-ih'dūhum ilā ṣirāṭi l-jaḥīmi
Telugu అల్లాహ్ ను కాదని - తరువాత వారందరికీ ప్రజ్వలించే నరకాగ్ని మార్గాన్ని చూపండి;
Verse 24
وَقِفُوهُمْ ۖ إِنَّهُم مَّسْـُٔولُونَ
Transliteration waqifūhum innahum masūlūna
Telugu మరియు వారిని అక్కడ నిలబెట్టండి. వాస్తవానికి వారిని ప్రశ్నించవలసి ఉంది.
Verse 25
مَا لَكُمْ لَا تَنَاصَرُونَ
Transliteration mā lakum lā tanāṣarūna
Telugu మీకేమైంది? మీరు పరస్పరం ఎందుకు సహాయం చేసుకోవటం లేదు?'"
Verse 26
بَلْ هُمُ ٱلْيَوْمَ مُسْتَسْلِمُونَ
Transliteration bal humu l-yawma mus'taslimūna
Telugu అలా కాదు! ఆ రోజు వారు తమను తాము అల్లాహ్ కు అప్పగించుకుంటారు.
Verse 27
وَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَآءَلُونَ
Transliteration wa-aqbala baʿḍuhum ʿalā baʿḍin yatasāalūna
Telugu మరియు వారు ఒకరి వైపునకు మరొకరు మరలి ఇలా ప్రశ్నించుకుంటారు.
Verse 28
قَالُوٓا۟ إِنَّكُمْ كُنتُمْ تَأْتُونَنَا عَنِ ٱلْيَمِينِ
Transliteration qālū innakum kuntum tatūnanā ʿani l-yamīni
Telugu కొందరు అంటారు: "మీరు మా వద్దకు (మమ్మల్ని మోసగించటానికి) మా కుడివైపు నుండి వచ్చేవారు!"
Verse 29
قَالُوا۟ بَل لَّمْ تَكُونُوا۟ مُؤْمِنِينَ
Transliteration qālū bal lam takūnū mu'minīna
Telugu ఇతరులు ఇలా జవాబిస్తారు: "అలా కాదు, మీ అంతట మీరే విశ్వసించేవారు కాదు."
Verse 30
وَمَا كَانَ لَنَا عَلَيْكُم مِّن سُلْطَـٰنٍۭ ۖ بَلْ كُنتُمْ قَوْمًا طَـٰغِينَ
Transliteration wamā kāna lanā ʿalaykum min sul'ṭānin bal kuntum qawman ṭāghīna
Telugu "మాకు మీపై ఎలాంటి అధికారం ఉండేది కాదు. అలా కాదు! మీరే తలబిరుసుతనం చూపేవారు."
Verse 31
فَحَقَّ عَلَيْنَا قَوْلُ رَبِّنَآ ۖ إِنَّا لَذَآئِقُونَ
Transliteration faḥaqqa ʿalaynā qawlu rabbinā innā ladhāiqūna
Telugu "కావున, ఇప్పుడు మన ప్రభువు వాక్కు మనపై పూర్తి అయ్యింది. నిశ్చయంగా మనమంతా (శిక్షను) రుచి చూడగలము."
Verse 32
فَأَغْوَيْنَـٰكُمْ إِنَّا كُنَّا غَـٰوِينَ
Transliteration fa-aghwaynākum innā kunnā ghāwīna
Telugu "కావున మేము మిమ్మల్ని తప్పు దారిలో పడవేశాము, నిశ్చయంగా మేము కూడా మార్గభ్రష్టులమై ఉంటిమి!"
Verse 33
فَإِنَّهُمْ يَوْمَئِذٍ فِى ٱلْعَذَابِ مُشْتَرِكُونَ
Transliteration fa-innahum yawma-idhin fī l-ʿadhābi mush'tarikūna
Telugu అప్పుడు నిశ్చయంగా, వారందరూ ఆ రోజు శిక్షలో భాగస్వాములవుతారు.
Verse 34
إِنَّا كَذَٰلِكَ نَفْعَلُ بِٱلْمُجْرِمِينَ
Transliteration innā kadhālika nafʿalu bil-muj'rimīna
Telugu నిశ్చయంగా, మేము అపరాధులతో ఇదే విధంగా ప్రవర్తిస్తాము.
Verse 35
إِنَّهُمْ كَانُوٓا۟ إِذَا قِيلَ لَهُمْ لَآ إِلَـٰهَ إِلَّا ٱللَّهُ يَسْتَكْبِرُونَ
Transliteration innahum kānū idhā qīla lahum lā ilāha illā l-lahu yastakbirūna
Telugu వాస్తవానికి, వారితో: "అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదైవం లేడు." అని అన్నప్పుడు, వారు దరహంకారం చూపేవారు.
Verse 36
وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُوٓا۟ ءَالِهَتِنَا لِشَاعِرٍ مَّجْنُونٍۭ
Transliteration wayaqūlūna a-innā latārikū ālihatinā lishāʿirin majnūnin
Telugu మరియు వారు ఇలా అనేవారు: "ఏమిటి? మేము ఒక పిచ్చికవి కొరకు మా ఆరాధ్య దైవాలను త్యజించాలా?"
Verse 37
بَلْ جَآءَ بِٱلْحَقِّ وَصَدَّقَ ٱلْمُرْسَلِينَ
Transliteration bal jāa bil-ḥaqi waṣaddaqa l-mur'salīna
Telugu వాస్తవానికి, అతను (ముహమ్మద్) సత్యాన్ని తీసుకొని వచ్చాడు. మరియు అతను (తనకు పూర్వం వచ్చిన) ప్రవక్తలను సత్యవంతులని ధృవపరచాడు.
Verse 38
إِنَّكُمْ لَذَآئِقُوا۟ ٱلْعَذَابِ ٱلْأَلِيمِ
Transliteration innakum ladhāiqū l-ʿadhābi l-alīmi
Telugu నిశ్చయంగా, మీరు బాధాకరమైన శిక్షను రుచి చూడగలరు;
Verse 39
وَمَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ
Transliteration wamā tuj'zawna illā mā kuntum taʿmalūna
Telugu మరియు మీకు, మీరు చేస్తూ ఉండిన కర్మలకు తగిన ఫలితం తప్ప, మరేమీ ఇవ్వబడదు -
Verse 40
إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
Transliteration illā ʿibāda l-lahi l-mukh'laṣīna
Telugu ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులకు తప్ప.
Verse 41
أُو۟لَـٰٓئِكَ لَهُمْ رِزْقٌ مَّعْلُومٌ
Transliteration ulāika lahum riz'qun maʿlūmun
Telugu అలాంటి వారి కొరకు వారికి తెలిసి ఉన్న జీవనోపాధి ఉంది;
Verse 42
فَوَٰكِهُ ۖ وَهُم مُّكْرَمُونَ
Transliteration fawākihu wahum muk'ramūna
Telugu అన్ని రకాల ఫలాలు. మరియు వారు ఆదరించబడతారు;
Verse 43
فِى جَنَّـٰتِ ٱلنَّعِيمِ
Transliteration fī jannāti l-naʿīmi
Telugu పరమ సుఖాలు గల స్వర్గవనాలలో;
Verse 44
عَلَىٰ سُرُرٍ مُّتَقَـٰبِلِينَ
Transliteration ʿalā sururin mutaqābilīna
Telugu ఆసనాల మీద ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు,
Verse 45
يُطَافُ عَلَيْهِم بِكَأْسٍ مِّن مَّعِينٍۭ
Transliteration yuṭāfu ʿalayhim bikasin min maʿīnin
Telugu వారి మధ్య ప్రవహించే చెలమల నుండి, పానీయపు (మధు) పాత్రలు త్రిప్పబడుతుంటాయి;
Verse 46
بَيْضَآءَ لَذَّةٍ لِّلشَّـٰرِبِينَ
Transliteration bayḍāa ladhatin lilshāribīna
Telugu అది తెల్లగా (మెరిసిపోతూ) త్రాగే వారికి ఎంతో రుచికరమైనదిగా ఉంటుంది;
Verse 47
لَا فِيهَا غَوْلٌ وَلَا هُمْ عَنْهَا يُنزَفُونَ
Transliteration lā fīhā ghawlun walā hum ʿanhā yunzafūna
Telugu దాని వల్ల వారికి ఎలాంటి బాధా కలుగదు మరియు వారు తమ తెలివినీ పోగొట్టుకోరు.
Verse 48
وَعِندَهُمْ قَـٰصِرَٰتُ ٱلطَّرْفِ عِينٌ
Transliteration waʿindahum qāṣirātu l-ṭarfi ʿīnun
Telugu మరియు వారి దగ్గర, శీలవతులైన తమ చూపులను నిగ్రహించుకునే, అందమైన కళ్ళు గల స్త్రీలు ఉంటారు.
Verse 49
كَأَنَّهُنَّ بَيْضٌ مَّكْنُونٌ
Transliteration ka-annahunna bayḍun maknūnun
Telugu వారు దాచబడిన గ్రుడ్లవలే (కోమలంగా) ఉంటారు.
Verse 50
فَأَقْبَلَ بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ يَتَسَآءَلُونَ
Transliteration fa-aqbala baʿḍuhum ʿalā baʿḍin yatasāalūna
Telugu అప్పుడు వారు ఒకరి వైపు కొకరు మరలి, పరస్పరం ఇలా ప్రశ్నించుకుంటారు.
Verse 51
قَالَ قَآئِلٌ مِّنْهُمْ إِنِّى كَانَ لِى قَرِينٌ
Transliteration qāla qāilun min'hum innī kāna lī qarīnun
Telugu వారిలో ఒకడంటాడు: "వాస్తవానికి (భూలోకంలో) నాకొక స్నేహితుడు (ఖరీనున్) ఉండేవాడు;
Verse 52
يَقُولُ أَءِنَّكَ لَمِنَ ٱلْمُصَدِّقِينَ
Transliteration yaqūlu a-innaka lamina l-muṣadiqīna
Telugu అతడు నన్ను ఇలా అడిగేవాడు: ఏమీ? నీవు కూడా (పునరుత్థానం) నిజమేనని నమ్మేవారిలో ఒకడివా?
Verse 53
أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَـٰمًا أَءِنَّا لَمَدِينُونَ
Transliteration a-idhā mit'nā wakunnā turāban waʿiẓāman a-innā lamadīnūna
Telugu ఏమీ? మనం చనిపోయి మట్టిగా ఎముకలుగా మారి పోయిన తరువాత కూడా నిశ్చయంగా మనకు ప్రతిఫలమనేది ఉంటుందా?"
Verse 54
قَالَ هَلْ أَنتُم مُّطَّلِعُونَ
Transliteration qāla hal antum muṭṭaliʿūna
Telugu అతడు ఇంకా ఇలా అంటాడు: "ఏమీ? మీరు అతడిని చూడదలచుకున్నారా?"
Verse 55
فَٱطَّلَعَ فَرَءَاهُ فِى سَوَآءِ ٱلْجَحِيمِ
Transliteration fa-iṭṭalaʿa faraāhu fī sawāi l-jaḥīmi
Telugu తరువాత అతడు తొంగి చూసి, అతడిని (తన పూర్వ స్నేహితుణ్ణి) భగభగ మండే నరకాగ్ని మధ్యలో చూస్తాడు.
Verse 56
قَالَ تَٱللَّهِ إِن كِدتَّ لَتُرْدِينِ
Transliteration qāla tal-lahi in kidtta latur'dīni
Telugu అతడితో (ఆ స్నేహితునితో), అతడు అంటాడు: "అల్లాహ్ సాక్షిగా! నీవు నన్ను నాశనం చేసి ఉండేవాడివే!
Verse 57
وَلَوْلَا نِعْمَةُ رَبِّى لَكُنتُ مِنَ ٱلْمُحْضَرِينَ
Transliteration walawlā niʿ'matu rabbī lakuntu mina l-muḥ'ḍarīna
Telugu ఒకవేళ నా ప్రభువు అనుగ్రహమే లేకున్నట్లయితే! నేను కూడా (నరకానికి) హాజరు చేయబడిన వారిలో చేరి పోయేవాడిని."
Verse 58
أَفَمَا نَحْنُ بِمَيِّتِينَ
Transliteration afamā naḥnu bimayyitīna
Telugu (తరువాత ఆ స్వర్గవాసి తన సహచరులతో అంటాడు): "ఏమీ? ఇక మనం మరల చనిపోము కదా?
Verse 59
إِلَّا مَوْتَتَنَا ٱلْأُولَىٰ وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
Transliteration illā mawtatanā l-ūlā wamā naḥnu bimuʿadhabīna
Telugu మన మొదటి (భూలోక) మరణం తప్ప! మనకు ఇక ఎలాంటి శిక్ష పడదు కదా?"
Verse 60
إِنَّ هَـٰذَا لَهُوَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ
Transliteration inna hādhā lahuwa l-fawzu l-ʿaẓīmu
Telugu నిశ్చయంగా, ఇదే ఆ గొప్ప సాఫల్యం (విజయం).
Verse 61
لِمِثْلِ هَـٰذَا فَلْيَعْمَلِ ٱلْعَـٰمِلُونَ
Transliteration limith'li hādhā falyaʿmali l-ʿāmilūna
Telugu ఇలాంటి (స్థానం) పొందటానికి పాటుపడే వారు పాటు పడాలి.
Verse 62
أَذَٰلِكَ خَيْرٌ نُّزُلًا أَمْ شَجَرَةُ ٱلزَّقُّومِ
Transliteration adhālika khayrun nuzulan am shajaratu l-zaqūmi
Telugu ఏమీ? ఇలాంటి ఆతిథ్యం మేలైనదా? లేక జముడు ఫలపు ఆతిథ్యమా?
Verse 63
إِنَّا جَعَلْنَـٰهَا فِتْنَةً لِّلظَّـٰلِمِينَ
Transliteration innā jaʿalnāhā fit'natan lilẓẓālimīna
Telugu నిశ్చయంగా, మేము దానిని, దుర్మార్గుల కొరకు ఒక పరీక్షగా చేశాము.
Verse 64
إِنَّهَا شَجَرَةٌ تَخْرُجُ فِىٓ أَصْلِ ٱلْجَحِيمِ
Transliteration innahā shajaratun takhruju fī aṣli l-jaḥīmi
Telugu నిశ్చయంగా, అది నరకపు అడుగు భాగం నుండి మొలిచే ఒక చెట్టు;
Verse 65
طَلْعُهَا كَأَنَّهُۥ رُءُوسُ ٱلشَّيَـٰطِينِ
Transliteration ṭalʿuhā ka-annahu ruūsu l-shayāṭīni
Telugu దాని మొగ్గలు షైతానుల తలల వలే ఉంటాయి.
Verse 66
فَإِنَّهُمْ لَـَٔاكِلُونَ مِنْهَا فَمَالِـُٔونَ مِنْهَا ٱلْبُطُونَ
Transliteration fa-innahum laākilūna min'hā famāliūna min'hā l-buṭūna
Telugu నిశ్చయంగా, వారు దాని నుంచే తింటారు మరియు దానితోనే తమ కడుపులు నింపుకుంటారు.
Verse 67
ثُمَّ إِنَّ لَهُمْ عَلَيْهَا لَشَوْبًا مِّنْ حَمِيمٍ
Transliteration thumma inna lahum ʿalayhā lashawban min ḥamīmin
Telugu తరువాత నిశ్చయంగా, దాని మీద వారికి త్రాగటానికి సలసల కాగే పానీయం మాత్రమే ఉంటుంది.
Verse 68
ثُمَّ إِنَّ مَرْجِعَهُمْ لَإِلَى ٱلْجَحِيمِ
Transliteration thumma inna marjiʿahum la-ilā l-jaḥīmi
Telugu ఆ తరువాత నిశ్చయంగా, వారి మరలింపు కేవలం భగభగ మండే నరకాగ్ని వైపునకే అవుతుంది.
Verse 69
إِنَّهُمْ أَلْفَوْا۟ ءَابَآءَهُمْ ضَآلِّينَ
Transliteration innahum alfaw ābāahum ḍāllīna
Telugu నిశ్చయంగా, అప్పుడు వారు తమ తండ్రితాతలు, మార్గభ్రష్టత్వంలో ఉండేవారని కనుగొంటారు!
Verse 70
فَهُمْ عَلَىٰٓ ءَاثَـٰرِهِمْ يُهْرَعُونَ
Transliteration fahum ʿalā āthārihim yuh'raʿūna
Telugu మరియు తాము కూడా వారి అడుగు జాడలను అనుసరించటానికి త్వరపడుతూ ఉండేవారమని!
Verse 71
وَلَقَدْ ضَلَّ قَبْلَهُمْ أَكْثَرُ ٱلْأَوَّلِينَ
Transliteration walaqad ḍalla qablahum aktharu l-awalīna
Telugu మరియు వాస్తవానికి వారి పూర్వీకులు కూడా చాలా మంది మార్గభ్రష్టులుగానే ఉండేవారు.
Verse 72
وَلَقَدْ أَرْسَلْنَا فِيهِم مُّنذِرِينَ
Transliteration walaqad arsalnā fīhim mundhirīna
Telugu మరియు వాస్తవానికి మేము వారి వద్దకు హెచ్చరిక చేయటానికి (సందేశహరులను) పంపి ఉన్నాము.
Verse 73
فَٱنظُرْ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلْمُنذَرِينَ
Transliteration fa-unẓur kayfa kāna ʿāqibatu l-mundharīna
Telugu ఇక చూడు! హెచ్చరిక చేయబడిన వారి పర్యవసానం ఎలా ఉండిందో!
Verse 74
إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
Transliteration illā ʿibāda l-lahi l-mukh'laṣīna
Telugu ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులకు తప్ప!
Verse 75
وَلَقَدْ نَادَىٰنَا نُوحٌ فَلَنِعْمَ ٱلْمُجِيبُونَ
Transliteration walaqad nādānā nūḥun falaniʿ'ma l-mujībūna
Telugu మరియు వాస్తవంగా, నూహ్ మమ్మల్ని వేడుకున్నాడు. ఎందుకంటే, మేము (ప్రార్థనలకు) ప్రత్యుత్తరమిచ్చే వారిలో సర్వోత్తములము.
Verse 76
وَنَجَّيْنَـٰهُ وَأَهْلَهُۥ مِنَ ٱلْكَرْبِ ٱلْعَظِيمِ
Transliteration wanajjaynāhu wa-ahlahu mina l-karbi l-ʿaẓīmi
Telugu మరియు మేము అతనిని మరియు అతని కుటుంబం వారిని మహా విపత్తు (జలప్రళయం) నుండి కాపాడాము.
Verse 77
وَجَعَلْنَا ذُرِّيَّتَهُۥ هُمُ ٱلْبَاقِينَ
Transliteration wajaʿalnā dhurriyyatahu humu l-bāqīna
Telugu మరియు అతని సంతతి వారిని మాత్రమే మిగిలి ఉండేటట్లు చేశాము.
Verse 78
وَتَرَكْنَا عَلَيْهِ فِى ٱلْـَٔاخِرِينَ
Transliteration wataraknā ʿalayhi fī l-ākhirīna
Telugu మరియు తరువాత వచ్చే వారిలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము.
Verse 79
سَلَـٰمٌ عَلَىٰ نُوحٍ فِى ٱلْعَـٰلَمِينَ
Transliteration salāmun ʿalā nūḥin fī l-ʿālamīna
Telugu సర్వలోకాలలో నూహ్ కు శాంతి కలుగు గాక (సలాం)!
Verse 80
إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
Transliteration innā kadhālika najzī l-muḥ'sinīna
Telugu నిశ్చయంగా, మేము సజ్జనులకు ఈ విధంగా ప్రతిఫలం ఇస్తూ ఉంటాము.
Verse 81
إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ
Transliteration innahu min ʿibādinā l-mu'minīna
Telugu నిశ్చయంగా, అతను మా విశ్వాసులైన దాసులలోని వాడు.
Verse 82
ثُمَّ أَغْرَقْنَا ٱلْـَٔاخَرِينَ
Transliteration thumma aghraqnā l-ākharīna
Telugu తరువాత మేము ఇతరులను ముంచి వేశాము.
Verse 83
۞ وَإِنَّ مِن شِيعَتِهِۦ لَإِبْرَٰهِيمَ
Transliteration wa-inna min shīʿatihi la-ib'rāhīma
Telugu మరియు నిశ్చయంగా, అతనిని అనుసరించిన వారిలో ఇబ్రాహీమ్ ఒకడు.
Verse 84
إِذْ جَآءَ رَبَّهُۥ بِقَلْبٍ سَلِيمٍ
Transliteration idh jāa rabbahu biqalbin salīmin
Telugu అతను తన ప్రభువు సాన్నిధ్యానికి నిర్మల హృదయంతో వచ్చి;
Verse 85
إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِۦ مَاذَا تَعْبُدُونَ
Transliteration idh qāla li-abīhi waqawmihi mādhā taʿbudūna
Telugu అతను తన తండ్రి మరియు తన జాతి వారితో ఇలా అన్నాడు: "మీరు దేనిని ఆరాధిస్తున్నారు?
Verse 86
أَئِفْكًا ءَالِهَةً دُونَ ٱللَّهِ تُرِيدُونَ
Transliteration a-if'kan ālihatan dūna l-lahi turīdūna
Telugu ఏమీ? మీరు అల్లాహ్ ను వదలి మిథ్యా (బూటక) దైవాలను (ఆరాధించ) గోరుతున్నారా?
Verse 87
فَمَا ظَنُّكُم بِرَبِّ ٱلْعَـٰلَمِينَ
Transliteration famā ẓannukum birabbi l-ʿālamīna
Telugu అయితే సర్వలోకాల ప్రభువును గురించి మీ అభిప్రాయమేమిటి?"
Verse 88
فَنَظَرَ نَظْرَةً فِى ٱلنُّجُومِ
Transliteration fanaẓara naẓratan fī l-nujūmi
Telugu ఆ తరువాత, అతను నక్షత్రాల వైపుకు తన దృష్టి సారించాడు;
Verse 89
فَقَالَ إِنِّى سَقِيمٌ
Transliteration faqāla innī saqīmun
Telugu అప్పుడు అతను ఇలా అన్నాడు: "నిశ్చయంగా, నా ఆరోగ్యం బాగులేదు."
Verse 90
فَتَوَلَّوْا۟ عَنْهُ مُدْبِرِينَ
Transliteration fatawallaw ʿanhu mud'birīna
Telugu కావున వారు అతనిని వదలి పెట్టి వెళ్ళిపోయారు.
Verse 91
فَرَاغَ إِلَىٰٓ ءَالِهَتِهِمْ فَقَالَ أَلَا تَأْكُلُونَ
Transliteration farāgha ilā ālihatihim faqāla alā takulūna
Telugu తరువాత అతను మెల్లగా వారి దేవతల (విగ్రహాల) దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: "మీరు తినటం లేదేమిటి?"
Verse 92
مَا لَكُمْ لَا تَنطِقُونَ
Transliteration mā lakum lā tanṭiqūna
Telugu "మీకేమైంది? మీరెందుకు మాట్లాడరు?"
Verse 93
فَرَاغَ عَلَيْهِمْ ضَرْبًۢا بِٱلْيَمِينِ
Transliteration farāgha ʿalayhim ḍarban bil-yamīni
Telugu తరువాత అతను వాటి వద్దకు వెళ్ళి తన కుడిచేతితో వాటిని పగుల గొట్టాడు.
Verse 94
فَأَقْبَلُوٓا۟ إِلَيْهِ يَزِفُّونَ
Transliteration fa-aqbalū ilayhi yaziffūna
Telugu అప్పుడు, వారు (ప్రజలు) అతని దగ్గరకు త్వరత్వరగా వచ్చారు.
Verse 95
قَالَ أَتَعْبُدُونَ مَا تَنْحِتُونَ
Transliteration qāla ataʿbudūna mā tanḥitūna
Telugu అప్పుడు (ఇబ్రాహీమ్) వారితో అన్నాడు: "ఏమీ? మీరు చెక్కిన వాటినే మీరు ఆరాధిస్తారా?"
Verse 96
وَٱللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ
Transliteration wal-lahu khalaqakum wamā taʿmalūna
Telugu "వాస్తవానికి, మిమ్మల్ని మరియు మీరు (చెక్కి) చేసిన వాటిని సృష్టించింది అల్లాహ్ యే కదా!"
Verse 97
قَالُوا۟ ٱبْنُوا۟ لَهُۥ بُنْيَـٰنًا فَأَلْقُوهُ فِى ٱلْجَحِيمِ
Transliteration qālū ib'nū lahu bun'yānan fa-alqūhu fī l-jaḥīmi
Telugu వారు (పరస్పరం ఇలా చెప్పుకున్నారు): "ఇతని కొరకు ఒక (అగ్ని) గుండం నిర్మించి, తరువాత ఇతనిని ఆ భగభగ మండే అగ్నిలో పడవేయండి!"
Verse 98
فَأَرَادُوا۟ بِهِۦ كَيْدًا فَجَعَلْنَـٰهُمُ ٱلْأَسْفَلِينَ
Transliteration fa-arādū bihi kaydan fajaʿalnāhumu l-asfalīna
Telugu కావున, వారు అతనికి విరుద్ధంగా పన్నాగాలు పన్నారు, కాని మేము వారిని కించపరచాము.
Verse 99
وَقَالَ إِنِّى ذَاهِبٌ إِلَىٰ رَبِّى سَيَهْدِينِ
Transliteration waqāla innī dhāhibun ilā rabbī sayahdīni
Telugu మరియు అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: "నిశ్చయంగా, నేను నా ప్రభువు (తీసుకొని వెళ్ళే) వైపునకు వెళ్ళిపోతాను. ఆయనే నాకు మార్గదర్శకత్వం చేస్తాడు."
Verse 100
رَبِّ هَبْ لِى مِنَ ٱلصَّـٰلِحِينَ
Transliteration rabbi hab lī mina l-ṣāliḥīna
Telugu (అతను ఇలా ప్రార్థించాడు): "ఓ నా ప్రభూ! నాకు సద్వర్తనుడైన (కుమారుణ్ణి) ప్రసాదించు!"
Verse 101
فَبَشَّرْنَـٰهُ بِغُلَـٰمٍ حَلِيمٍ
Transliteration fabasharnāhu bighulāmin ḥalīmin
Telugu కావున మేము అతనికి సహనశీలుడైన కుమారుని శుభవార్త నిచ్చాము.
Verse 102
فَلَمَّا بَلَغَ مَعَهُ ٱلسَّعْىَ قَالَ يَـٰبُنَىَّ إِنِّىٓ أَرَىٰ فِى ٱلْمَنَامِ أَنِّىٓ أَذْبَحُكَ فَٱنظُرْ مَاذَا تَرَىٰ ۚ قَالَ يَـٰٓأَبَتِ ٱفْعَلْ مَا تُؤْمَرُ ۖ سَتَجِدُنِىٓ إِن شَآءَ ٱللَّهُ مِنَ ٱلصَّـٰبِرِينَ
Transliteration falammā balagha maʿahu l-saʿya qāla yābunayya innī arā fī l-manāmi annī adhbaḥuka fa-unẓur mādhā tarā qāla yāabati if'ʿal mā tu'maru satajidunī in shāa l-lahu mina l-ṣābirīna
Telugu ఆ బాలుడు అతనికి తోడుగా శ్రమ చేయగల వయస్సుకు చేరుకున్నప్పుడు, అతను (ఇబ్రాహీమ్) అన్నాడు: "ఓ నా కుమారా! వాస్తవానికి నేను నిన్ను బలి (జిబహ్) చేస్తున్నట్లుగా కలలో చూశాను, ఇక నీ సలహా ఏమిటో చెప్పు!" అతను (ఇస్మాయీల్) అన్నాడు: "ఓ నాన్నా! నీకు ఇవ్వబడిన ఆజ్ఞను నెరవేర్చు, అల్లాహ్ కోరితే నీవు నన్ను సహనశీలునిగా పొందగలవు!"
Verse 103
فَلَمَّآ أَسْلَمَا وَتَلَّهُۥ لِلْجَبِينِ
Transliteration falammā aslamā watallahu lil'jabīni
Telugu ఆ తరువాత వారిద్దరూ ఆయన (అల్లాహ్) ఆజ్ఞను నెరవేర్చటానికి సిద్ధ పడ్డారు. మరియు అతను (ఇబ్రాహీమ్) అతనిని (ఇస్మాయీల్ ను) నుదుటిపై బోర్లా పరుండబెట్టాడు.
Verse 104
وَنَـٰدَيْنَـٰهُ أَن يَـٰٓإِبْرَٰهِيمُ
Transliteration wanādaynāhu an yāib'rāhīmu
Telugu మరియు మేము అతనిని పిలుస్తూ ఇలా అన్నాము: "ఓ ఇబ్రాహీమ్!
Verse 105
قَدْ صَدَّقْتَ ٱلرُّءْيَآ ۚ إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
Transliteration qad ṣaddaqta l-ru'yā innā kadhālika najzī l-muḥ'sinīna
Telugu వాస్తవంగా, నీవు కలన నిజం చేసి చూపించావు!" నిశ్చయంగా, మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలమిస్తాము.
Verse 106
إِنَّ هَـٰذَا لَهُوَ ٱلْبَلَـٰٓؤُا۟ ٱلْمُبِينُ
Transliteration inna hādhā lahuwa l-balāu l-mubīnu
Telugu నిశ్చయంగా, ఇదొక స్పష్టమైన (కఠిన) పరీక్ష.
Verse 107
وَفَدَيْنَـٰهُ بِذِبْحٍ عَظِيمٍ
Transliteration wafadaynāhu bidhib'ḥin ʿaẓīmin
Telugu మరియు మేము అతనికి (ఇస్మాయీల్ కు) బదులుగా ఒక గొప్ప బలిని పరిహారంగా ఇచ్చాము.
Verse 108
وَتَرَكْنَا عَلَيْهِ فِى ٱلْـَٔاخِرِينَ
Transliteration wataraknā ʿalayhi fī l-ākhirīna
Telugu మరియు తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని నిలిపాము.
Verse 109
سَلَـٰمٌ عَلَىٰٓ إِبْرَٰهِيمَ
Transliteration salāmun ʿalā ib'rāhīma
Telugu "ఇబ్రాహీమ్ కు శాంతి కలుగు గాక (సలాం)!"
Verse 110
كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
Transliteration kadhālika najzī l-muḥ'sinīna
Telugu ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము.
Verse 111
إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ
Transliteration innahu min ʿibādinā l-mu'minīna
Telugu నిశ్చయంగా, అతను (ఇబ్రాహీమ్) విశ్వసించిన మా దాసులలోని వాడు!
Verse 112
وَبَشَّرْنَـٰهُ بِإِسْحَـٰقَ نَبِيًّا مِّنَ ٱلصَّـٰلِحِينَ
Transliteration wabasharnāhu bi-is'ḥāqa nabiyyan mina l-ṣāliḥīna
Telugu మరియు మేము అతనికి ఇస్ హాఖ్ యొక్క శుభవార్తను ఇచ్చాము, అతను ఒక సద్వర్తనుడైన ప్రవక్త.
Verse 113
وَبَـٰرَكْنَا عَلَيْهِ وَعَلَىٰٓ إِسْحَـٰقَ ۚ وَمِن ذُرِّيَّتِهِمَا مُحْسِنٌ وَظَالِمٌ لِّنَفْسِهِۦ مُبِينٌ
Transliteration wabāraknā ʿalayhi waʿalā is'ḥāqa wamin dhurriyyatihimā muḥ'sinun waẓālimun linafsihi mubīnun
Telugu మరియు మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) మరియు ఇస్ హాఖ్ ను అనుగ్రహించాము. మరియు వారి సంతతిలో కొందరు సజ్జనులుండే వారు. మరికొందరు తమకు తాము స్పష్టంగా అన్యాయం చేసుకున్నవారు కూడా ఉన్నారు.
Verse 114
وَلَقَدْ مَنَنَّا عَلَىٰ مُوسَىٰ وَهَـٰرُونَ
Transliteration walaqad manannā ʿalā mūsā wahārūna
Telugu మరియు వాస్తవానికి, మేము మూసా మరియు హారూన్ లను అనుగ్రహించాము.
Verse 115
وَنَجَّيْنَـٰهُمَا وَقَوْمَهُمَا مِنَ ٱلْكَرْبِ ٱلْعَظِيمِ
Transliteration wanajjaynāhumā waqawmahumā mina l-karbi l-ʿaẓīmi
Telugu మరియు మేము వారిద్దరిని మరియు వారి జాతి వారిని మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము.
Verse 116
وَنَصَرْنَـٰهُمْ فَكَانُوا۟ هُمُ ٱلْغَـٰلِبِينَ
Transliteration wanaṣarnāhum fakānū humu l-ghālibīna
Telugu మరియు మేము వారికి సహాయం చేశాము, కాబట్టి వారు విజయం పొందిన వారయ్యారు.
Verse 117
وَءَاتَيْنَـٰهُمَا ٱلْكِتَـٰبَ ٱلْمُسْتَبِينَ
Transliteration waātaynāhumā l-kitāba l-mus'tabīna
Telugu మరియు వారిద్దరికి (మంచి చెడులను) స్పష్టపరిచే గ్రంథాన్ని ప్రసాదించాము.
Verse 118
وَهَدَيْنَـٰهُمَا ٱلصِّرَٰطَ ٱلْمُسْتَقِيمَ
Transliteration wahadaynāhumā l-ṣirāṭa l-mus'taqīma
Telugu మరియు వారిద్దరికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాము.
Verse 119
وَتَرَكْنَا عَلَيْهِمَا فِى ٱلْـَٔاخِرِينَ
Transliteration wataraknā ʿalayhimā fī l-ākhirīna
Telugu మరియు ఆ తరువాత తరాల వారిలో వారిద్దరి గురించి మంచి కీర్తిని నిలిపాము.
Verse 120
سَلَـٰمٌ عَلَىٰ مُوسَىٰ وَهَـٰرُونَ
Transliteration salāmun ʿalā mūsā wahārūna
Telugu "మూసా మరియు హారూన్ లకు శాంతి కలుగు గాక (సలాం)!"
Verse 121
إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
Transliteration innā kadhālika najzī l-muḥ'sinīna
Telugu నిశ్చయంగా, ఈ విధంగా మేము సజ్జనులకు ప్రతిఫలమిస్తాము.
Verse 122
إِنَّهُمَا مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ
Transliteration innahumā min ʿibādinā l-mu'minīna
Telugu నిశ్చయంగా వారిద్దరూ, విశ్వాసులైన మా దాసులలోని వారు.
Verse 123
وَإِنَّ إِلْيَاسَ لَمِنَ ٱلْمُرْسَلِينَ
Transliteration wa-inna il'yāsa lamina l-mur'salīna
Telugu మరియు నిశ్చయంగా, ఇల్యాస్ కూడా మా సందేశహరులలో ఒకడు.
Verse 124
إِذْ قَالَ لِقَوْمِهِۦٓ أَلَا تَتَّقُونَ
Transliteration idh qāla liqawmihi alā tattaqūna
Telugu అతను తన జాతి వారితో ఇలా అన్నప్పుడు: "ఏమీ? మీకు దైవభీతి లేదా?
Verse 125
أَتَدْعُونَ بَعْلًا وَتَذَرُونَ أَحْسَنَ ٱلْخَـٰلِقِينَ
Transliteration atadʿūna baʿlan watadharūna aḥsana l-khāliqīna
Telugu ఏమీ? మీరు బఅల్ (అనే విగ్రహాన్ని) ఆరాధిస్తూ సర్వోత్తముడైన సృష్టికర్తను వదలి పెడుతున్నారా?
Verse 126
ٱللَّهَ رَبَّكُمْ وَرَبَّ ءَابَآئِكُمُ ٱلْأَوَّلِينَ
Transliteration al-laha rabbakum warabba ābāikumu l-awalīna
Telugu అల్లాహ్ యే మీ ప్రభువు! మరియు మీ పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు కదా?"
Verse 127
فَكَذَّبُوهُ فَإِنَّهُمْ لَمُحْضَرُونَ
Transliteration fakadhabūhu fa-innahum lamuḥ'ḍarūna
Telugu కాని వారు అతనిని (ఇల్యాస్ ను) అసత్యవాదుడని తిరస్కరించారు, కాబట్టి వారు తప్పకుండా (శిక్ష కొరకు) హాజరు చేయబడతారు.
Verse 128
إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
Transliteration illā ʿibāda l-lahi l-mukh'laṣīna
Telugu ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులు తప్ప!
Verse 129
وَتَرَكْنَا عَلَيْهِ فِى ٱلْـَٔاخِرِينَ
Transliteration wataraknā ʿalayhi fī l-ākhirīna
Telugu తరువాత వచ్చే తరాలలో అతని కీర్తిని (పేరు ప్రతిష్ఠను) నిలిపాము.
Verse 130
سَلَـٰمٌ عَلَىٰٓ إِلْ يَاسِينَ
Transliteration salāmun ʿalā il yāsīna
Telugu "ఇల్ యాసీన్ కు శాంతి కలుగు గాక (సలాం)!"
Verse 131
إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ
Transliteration innā kadhālika najzī l-muḥ'sinīna
Telugu నిశ్చయంగా, సజ్జనులకు మేము ఈ విధంగా ప్రతిఫలమిస్తాము.
Verse 132
إِنَّهُۥ مِنْ عِبَادِنَا ٱلْمُؤْمِنِينَ
Transliteration innahu min ʿibādinā l-mu'minīna
Telugu నిశ్చయంగా, అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు.
Verse 133
وَإِنَّ لُوطًا لَّمِنَ ٱلْمُرْسَلِينَ
Transliteration wa-inna lūṭan lamina l-mur'salīna
Telugu మరియు నిశ్చయంగా లూత్ కూడా మేము పంపిన సందేశహరులలో ఒకడు.
Verse 134
إِذْ نَجَّيْنَـٰهُ وَأَهْلَهُۥٓ أَجْمَعِينَ
Transliteration idh najjaynāhu wa-ahlahu ajmaʿīna
Telugu ఎప్పుడైతే మేము అతనిని మరియు అతని కుటుంబం వారినందరిని రక్షించామో -
Verse 135
إِلَّا عَجُوزًا فِى ٱلْغَـٰبِرِينَ
Transliteration illā ʿajūzan fī l-ghābirīna
Telugu ముసలామె (అతని భార్య) తప్ప - ఆమె వెనుక ఉండిపోయే వారిలో చేరిపోయింది.
Verse 136
ثُمَّ دَمَّرْنَا ٱلْـَٔاخَرِينَ
Transliteration thumma dammarnā l-ākharīna
Telugu ఆ తరువాత మిగతా వారినందరినీ నిర్మూలించాము.
Verse 137
وَإِنَّكُمْ لَتَمُرُّونَ عَلَيْهِم مُّصْبِحِينَ
Transliteration wa-innakum latamurrūna ʿalayhim muṣ'biḥīna
Telugu మరియు వాస్తవానికి, మీరిప్పుడు వారి (శిథిల) ప్రాంతాల మీదుగా ఉదయపు వేళల్లో ప్రయాణిస్తూ ఉంటారు;
Verse 138
وَبِٱلَّيْلِ ۗ أَفَلَا تَعْقِلُونَ
Transliteration wabi-al-layli afalā taʿqilūna
Telugu మరియు రాత్రులలో కూడా! అయినా మీరు అర్థం చేసుకోలేరా?
Verse 139
وَإِنَّ يُونُسَ لَمِنَ ٱلْمُرْسَلِينَ
Transliteration wa-inna yūnusa lamina l-mur'salīna
Telugu మరియు నిశ్చయంగా, యూనుస్ కూడా మేము పంపిన సందేశహరులలోని వాడు.
Verse 140
إِذْ أَبَقَ إِلَى ٱلْفُلْكِ ٱلْمَشْحُونِ
Transliteration idh abaqa ilā l-ful'ki l-mashḥūni
Telugu అతను నిండు పడవ వైపుకు పరిగెత్తినప్పుడు;
Verse 141
فَسَاهَمَ فَكَانَ مِنَ ٱلْمُدْحَضِينَ
Transliteration fasāhama fakāna mina l-mud'ḥaḍīna
Telugu అక్కడ చీటీలలో పాల్గొన్నాడు, కాని ఓడిపోయాడు.
Verse 142
فَٱلْتَقَمَهُ ٱلْحُوتُ وَهُوَ مُلِيمٌ
Transliteration fal-taqamahu l-ḥūtu wahuwa mulīmun
Telugu ఆ పిదప అతనిని ఒక పెద్ద చేప మ్రింగింది; ఎందుకంటే అతను నిందార్హుడు.
Verse 143
فَلَوْلَآ أَنَّهُۥ كَانَ مِنَ ٱلْمُسَبِّحِينَ
Transliteration falawlā annahu kāna mina l-musabiḥīna
Telugu అప్పుడతను, (అల్లాహ్) పవిత్రతను కొనియాడే వారిలోని వాడు కాకపోయినట్లైతే!
Verse 144
لَلَبِثَ فِى بَطْنِهِۦٓ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
Transliteration lalabitha fī baṭnihi ilā yawmi yub'ʿathūna
Telugu దాని (చేప) కడుపులో పునరుత్థాన దినం వరకు ఉండి పోయేవాడు.
Verse 145
۞ فَنَبَذْنَـٰهُ بِٱلْعَرَآءِ وَهُوَ سَقِيمٌ
Transliteration fanabadhnāhu bil-ʿarāi wahuwa saqīmun
Telugu ఆ పిదప మేము అతనిని అనారోగ్య స్థితిలో, ఒక దిగంబర మైదానంలో పడవేశాము.
Verse 146
وَأَنۢبَتْنَا عَلَيْهِ شَجَرَةً مِّن يَقْطِينٍ
Transliteration wa-anbatnā ʿalayhi shajaratan min yaqṭīnin
Telugu మరియు అతనిపై ఒక ఆనప జాతి తీగను మొలిపించాము.
Verse 147
وَأَرْسَلْنَـٰهُ إِلَىٰ مِا۟ئَةِ أَلْفٍ أَوْ يَزِيدُونَ
Transliteration wa-arsalnāhu ilā mi-ati alfin aw yazīdūna
Telugu మరియు అతనిని ఒక లక్ష లేదా అంతకంటే ఎక్కువ మంది (ప్రజల) వద్దకు పంపాము.
Verse 148
فَـَٔامَنُوا۟ فَمَتَّعْنَـٰهُمْ إِلَىٰ حِينٍ
Transliteration faāmanū famattaʿnāhum ilā ḥīnin
Telugu వారు విశ్వసించారు, కావున మేము ఒక నిర్ణీత కాలం వరకు వారిని సుఖసంతోషాలు అనుభవించనిచ్చాము.
Verse 149
فَٱسْتَفْتِهِمْ أَلِرَبِّكَ ٱلْبَنَاتُ وَلَهُمُ ٱلْبَنُونَ
Transliteration fa-is'taftihim alirabbika l-banātu walahumu l-banūna
Telugu అయితే వారిని ఇలా అడుగు: "ఏమీ? నీ ప్రభువుకైతే కుమార్తెలు మరియు వారి కొరకు కుమారులా?
Verse 150
أَمْ خَلَقْنَا ٱلْمَلَـٰٓئِكَةَ إِنَـٰثًا وَهُمْ شَـٰهِدُونَ
Transliteration am khalaqnā l-malāikata ināthan wahum shāhidūna
Telugu లేక మేము దేవదూతలను స్త్రీలుగా పుట్టించామా? మరియు వారు దానికి సాక్షులా?"
Verse 151
أَلَآ إِنَّهُم مِّنْ إِفْكِهِمْ لَيَقُولُونَ
Transliteration alā innahum min if'kihim layaqūlūna
Telugu అలా కాదు! నిశ్చయంగా, వారు (ఖురైషులు) తమ బూటకపు నమ్మకాల ఆధారంగా అంటున్నారు:
Verse 152
وَلَدَ ٱللَّهُ وَإِنَّهُمْ لَكَـٰذِبُونَ
Transliteration walada l-lahu wa-innahum lakādhibūna
Telugu "అల్లాహ్ కు సంతానముంది!"అని మరియు వారు నిశ్చయంగా, అబద్ధాలాడుతున్నారు!
Verse 153
أَصْطَفَى ٱلْبَنَاتِ عَلَى ٱلْبَنِينَ
Transliteration aṣṭafā l-banāti ʿalā l-banīna
Telugu ఆయన (అల్లాహ్) కుమార్తెలను - కుమారులకు బదులుగా -ఎన్నుకున్నాడా?
Verse 154
مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ
Transliteration mā lakum kayfa taḥkumūna
Telugu మీకేమయింది? మీరెలాంటి నిర్ణయాలు చేస్తున్నారు?
Verse 155
أَفَلَا تَذَكَّرُونَ
Transliteration afalā tadhakkarūna
Telugu ఏమీ? మీరు గ్రహించలేరా?
Verse 156
أَمْ لَكُمْ سُلْطَـٰنٌ مُّبِينٌ
Transliteration am lakum sul'ṭānun mubīnun
Telugu లేక! మీ వద్ద ఏదైనా స్పష్టమైన ప్రమాణం ఉందా?
Verse 157
فَأْتُوا۟ بِكِتَـٰبِكُمْ إِن كُنتُمْ صَـٰدِقِينَ
Transliteration fatū bikitābikum in kuntum ṣādiqīna
Telugu మీరు సత్యవంతులే అయితే మీ గ్రంథాన్ని తీసుకురండి!
Verse 158
وَجَعَلُوا۟ بَيْنَهُۥ وَبَيْنَ ٱلْجِنَّةِ نَسَبًا ۚ وَلَقَدْ عَلِمَتِ ٱلْجِنَّةُ إِنَّهُمْ لَمُحْضَرُونَ
Transliteration wajaʿalū baynahu wabayna l-jinati nasaban walaqad ʿalimati l-jinatu innahum lamuḥ'ḍarūna
Telugu మరియు వారు, ఆయన (అల్లాహ్) మరియు జిన్నాతుల మధ్య బంధుత్వం కల్పించారు. కాని వాస్తవానికి జిన్నాతులకు తెలుసు, తాము ఆయన (అల్లాహ్) ముందు (లెక్క కొరకు) హాజరు చేయబడతామని!
Verse 159
سُبْحَـٰنَ ٱللَّهِ عَمَّا يَصِفُونَ
Transliteration sub'ḥāna l-lahi ʿammā yaṣifūna
Telugu వారు కల్పించే విషయాలకు అల్లాహ్ అతీతుడు (పరమ పవిత్రుడు)!
Verse 160
إِلَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
Transliteration illā ʿibāda l-lahi l-mukh'laṣīna
Telugu ఎన్నుకోబడిన అల్లాహ్ దాసులు తప్ప!
Verse 161
فَإِنَّكُمْ وَمَا تَعْبُدُونَ
Transliteration fa-innakum wamā taʿbudūna
Telugu ఇక నిశ్చయంగా, మీరు మరియు మీ ఆరాధ్యదైవాలు (కలిసి);
Verse 162
مَآ أَنتُمْ عَلَيْهِ بِفَـٰتِنِينَ
Transliteration mā antum ʿalayhi bifātinīna
Telugu ఎవ్వడిని కూడా, దుష్టకార్యాలు చేయటానికి పురి కొలుపలేరు;
Verse 163
إِلَّا مَنْ هُوَ صَالِ ٱلْجَحِيمِ
Transliteration illā man huwa ṣāli l-jaḥīmi
Telugu భగభగ మండే నరకాగ్నిలో కాలి పోనున్న వాడిని తప్ప!
Verse 164
وَمَا مِنَّآ إِلَّا لَهُۥ مَقَامٌ مَّعْلُومٌ
Transliteration wamā minnā illā lahu maqāmun maʿlūmun
Telugu (దైవదూతలు ఇలా అంటారు): "మరియు మాలో ఒక్కడు కూడా తన స్థానం నియమింప బడకుండా లేడు.
Verse 165
وَإِنَّا لَنَحْنُ ٱلصَّآفُّونَ
Transliteration wa-innā lanaḥnu l-ṣāfūna
Telugu మరియు నిశ్చయంగా, మేము కూడా (ఆయనను ప్రార్థించటానికి) వరుసలు దీరి నిలుచుంటాము.
Verse 166
وَإِنَّا لَنَحْنُ ٱلْمُسَبِّحُونَ
Transliteration wa-innā lanaḥnu l-musabiḥūna
Telugu మరియు నిశ్చయంగా, మేము కూడా ఆయన పవిత్రతను కొనియాడే వారమే!
Verse 167
وَإِن كَانُوا۟ لَيَقُولُونَ
Transliteration wa-in kānū layaqūlūna
Telugu మరియు (సత్యతిరస్కారులు) ఇలా అంటూ ఉండేవారు:
Verse 168
لَوْ أَنَّ عِندَنَا ذِكْرًا مِّنَ ٱلْأَوَّلِينَ
Transliteration law anna ʿindanā dhik'ran mina l-awalīna
Telugu "ఒకవేళ మా పూర్వీకుల నుండి మాకు ఇలాంటి బోధన లభించి ఉంటే!"
Verse 169
لَكُنَّا عِبَادَ ٱللَّهِ ٱلْمُخْلَصِينَ
Transliteration lakunnā ʿibāda l-lahi l-mukh'laṣīna
Telugu "మేము కూడా, అల్లాహ్ యొక్క ఎన్నుకున్న, భక్తులమై ఉండేవారము!"
Verse 170
فَكَفَرُوا۟ بِهِۦ ۖ فَسَوْفَ يَعْلَمُونَ
Transliteration fakafarū bihi fasawfa yaʿlamūna
Telugu కాని, వారిప్పుడు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) తిరస్కరిస్తున్నారు. ఇక త్వరలోనే వారు తెలుసు కుంటారు!
Verse 171
وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا ٱلْمُرْسَلِينَ
Transliteration walaqad sabaqat kalimatunā liʿibādinā l-mur'salīna
Telugu మరియు వాస్తవానికి మా దాసులైన, మేము పంపిన సందేశహరుల విషయంలో మా నిర్ణయం జరిగింది;
Verse 172
إِنَّهُمْ لَهُمُ ٱلْمَنصُورُونَ
Transliteration innahum lahumu l-manṣūrūna
Telugu నిశ్చయంగా, వారు సహాయం (విజయం) పొందుతారని!
Verse 173
وَإِنَّ جُندَنَا لَهُمُ ٱلْغَـٰلِبُونَ
Transliteration wa-inna jundanā lahumu l-ghālibūna
Telugu మరియు నిశ్చయంగా, మా సైనికులే తప్పక విజయం పొందుతారని!
Verse 174
فَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
Transliteration fatawalla ʿanhum ḥattā ḥīnin
Telugu కావున నీవు వారిని (సత్యతిరస్కారులను) కొంతకాలం వదలిపెట్టు.
Verse 175
وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ
Transliteration wa-abṣir'hum fasawfa yub'ṣirūna
Telugu మరియు వారిని చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు!
Verse 176
أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ
Transliteration afabiʿadhābinā yastaʿjilūna
Telugu ఏమీ? వారు మా శిక్ష కొరకు తొందర పెడుతున్నారా?
Verse 177
فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَآءَ صَبَاحُ ٱلْمُنذَرِينَ
Transliteration fa-idhā nazala bisāḥatihim fasāa ṣabāḥu l-mundharīna
Telugu కాని, అది వారి ఇంటి ప్రాంగణంలో దిగినప్పుడు, హెచ్చరించబడిన వారికి అది దుర్భరమైన ఉదయం కాగలదు!
Verse 178
وَتَوَلَّ عَنْهُمْ حَتَّىٰ حِينٍ
Transliteration watawalla ʿanhum ḥattā ḥīnin
Telugu కావున నీవు ప్రస్తుతానికి వారిని వదలి పెట్టు;
Verse 179
وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ
Transliteration wa-abṣir fasawfa yub'ṣirūna
Telugu మరియు చూస్తూ ఉండు. ఇక త్వరలోనే వారు కూడా (తమ పర్యవసానాన్ని) చూడగలరు!
Verse 180
سُبْحَـٰنَ رَبِّكَ رَبِّ ٱلْعِزَّةِ عَمَّا يَصِفُونَ
Transliteration sub'ḥāna rabbika rabbi l-ʿizati ʿammā yaṣifūna
Telugu నీ ప్రభువు సర్వలోపాలకు అతీతుడు; సర్వశక్తిమంతుడైన ప్రభువు, వారి కల్పనలకు అతీతుడు.
Verse 181
وَسَلَـٰمٌ عَلَى ٱلْمُرْسَلِينَ
Transliteration wasalāmun ʿalā l-mur'salīna
Telugu మరియు సందేశహరులందరికీ శాంతి కలుగుగాక (సలాం)!
Verse 182
وَٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَـٰلَمِينَ
Transliteration wal-ḥamdu lillahi rabbi l-ʿālamīna
Telugu మరియు సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ యే సమస్త లోకాలకు ప్రభువు!
Read Surah As-Saffat in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Gujarati
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Telugu: the Qur’an in Telugu.
Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.