MyDugsiStart learning

Surah Al-Fajr in Telugu: translation and audio

Surah 89 · الفجر · The Dawn · 30 verses

Surah Al-Fajr verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Al-Fajr word by word in English.

Verse 1

وَٱلْفَجْرِ

Transliteration wal-fajri

Telugu ప్రాంతః కాలం సాక్షిగా!

Verse 2

وَلَيَالٍ عَشْرٍ

Transliteration walayālin ʿashrin

Telugu పది రాత్రుల సాక్షిగా!

Verse 3

وَٱلشَّفْعِ وَٱلْوَتْرِ

Transliteration wal-shafʿi wal-watri

Telugu సరి బేసీల సాక్షిగా!

Verse 4

وَٱلَّيْلِ إِذَا يَسْرِ

Transliteration wa-al-layli idhā yasri

Telugu గడచిపోయే రాత్రి సాక్షిగా!

Verse 5

هَلْ فِى ذَٰلِكَ قَسَمٌ لِّذِى حِجْرٍ

Transliteration hal fī dhālika qasamun lidhī ḥij'rin

Telugu వీటిలో బుద్ధిగల వాని కొరకు ఏ ప్రమాణమూ లేదా ఏమిటి?

Verse 6

أَلَمْ تَرَ كَيْفَ فَعَلَ رَبُّكَ بِعَادٍ

Transliteration alam tara kayfa faʿala rabbuka biʿādin

Telugu నీ ప్రభువు ఆద్ (జాతి) వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?

Verse 7

إِرَمَ ذَاتِ ٱلْعِمَادِ

Transliteration irama dhāti l-ʿimādi

Telugu ఎత్తైన స్థంభాల (భవనాలు గల) ఇరమ్ ప్రజల పట్ల?

Verse 8

ٱلَّتِى لَمْ يُخْلَقْ مِثْلُهَا فِى ٱلْبِلَـٰدِ

Transliteration allatī lam yukh'laq mith'luhā fī l-bilādi

Telugu వారిలాంటి జాతి భూమిలో ఎన్నడూ సృష్టించబడలేదు.

Verse 9

وَثَمُودَ ٱلَّذِينَ جَابُوا۟ ٱلصَّخْرَ بِٱلْوَادِ

Transliteration wathamūda alladhīna jābū l-ṣakhra bil-wādi

Telugu మరియు లోయలలోని కొండరాళ్ళలో (భవనాలను) తొలిచిన సమూద్ జాతి పట్ల?

Verse 10

وَفِرْعَوْنَ ذِى ٱلْأَوْتَادِ

Transliteration wafir'ʿawna dhī l-awtādi

Telugu మరియు మేకులవాడైన ఫిర్ఔన్ పట్ల?

Verse 11

ٱلَّذِينَ طَغَوْا۟ فِى ٱلْبِلَـٰدِ

Transliteration alladhīna ṭaghaw fī l-bilādi

Telugu వారంతా ఆయా దేశాలలో తలబిరుసుతనంతో ప్రవర్తించారు;

Verse 12

فَأَكْثَرُوا۟ فِيهَا ٱلْفَسَادَ

Transliteration fa-aktharū fīhā l-fasāda

Telugu మరియు వాటిలో దౌర్జన్యాన్ని రేకెత్తించారు.

Verse 13

فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ

Transliteration faṣabba ʿalayhim rabbuka sawṭa ʿadhābin

Telugu కాబట్టి నీ ప్రభువు వారిపైకి అనేక రకాల బాధాకరమైన శిక్షలను పంపాడు.

Verse 14

إِنَّ رَبَّكَ لَبِٱلْمِرْصَادِ

Transliteration inna rabbaka labil-mir'ṣādi

Telugu వాస్తవానికి, నీ ప్రభువు మాటు వేసి ఉన్నాడు (అంతా కనిపెడ్తూ ఉంటాడు)!

Verse 15

فَأَمَّا ٱلْإِنسَـٰنُ إِذَا مَا ٱبْتَلَىٰهُ رَبُّهُۥ فَأَكْرَمَهُۥ وَنَعَّمَهُۥ فَيَقُولُ رَبِّىٓ أَكْرَمَنِ

Transliteration fa-ammā l-insānu idhā mā ib'talāhu rabbuhu fa-akramahu wanaʿʿamahu fayaqūlu rabbī akramani

Telugu అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టల నిచ్చి అనుగ్రహించి నప్పుడు: "నా ప్రభువు నన్ను గౌరవించాడు." అని అంటాడు;

Verse 16

وَأَمَّآ إِذَا مَا ٱبْتَلَىٰهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهُۥ فَيَقُولُ رَبِّىٓ أَهَـٰنَنِ

Transliteration wa-ammā idhā mā ib'talāhu faqadara ʿalayhi riz'qahu fayaqūlu rabbī ahānani

Telugu కాని, అతన్ని పరీక్షించటానికి, అతని ఉపాధిని తగ్గించినప్పుడు: "నా ప్రభువు నన్ను అవమానించాడు." అని అంటాడు.

Verse 17

كَلَّا ۖ بَل لَّا تُكْرِمُونَ ٱلْيَتِيمَ

Transliteration kallā bal lā tuk'rimūna l-yatīma

Telugu అలా కాదు, వాస్తవానికి మీరు అనాథులను ఆదరించరు;

Verse 18

وَلَا تَحَـٰٓضُّونَ عَلَىٰ طَعَامِ ٱلْمِسْكِينِ

Transliteration walā taḥāḍḍūna ʿalā ṭaʿāmi l-mis'kīni

Telugu మరియు మీరు పేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు;

Verse 19

وَتَأْكُلُونَ ٱلتُّرَاثَ أَكْلًا لَّمًّا

Transliteration watakulūna l-turātha aklan lamman

Telugu మరియు వారసత్వపు ఆస్తిని పేరాశతో అంతా మీరే తినేస్తారు.

Verse 20

وَتُحِبُّونَ ٱلْمَالَ حُبًّا جَمًّا

Transliteration watuḥibbūna l-māla ḥubban jamman

Telugu మరియు మీరు ధనవ్యామోహంలో దారుణంగా చిక్కుకు పోయారు!

Verse 21

كَلَّآ إِذَا دُكَّتِ ٱلْأَرْضُ دَكًّا دَكًّا

Transliteration kallā idhā dukkati l-arḍu dakkan dakkan

Telugu అలా కాదు, భూమి, దంచి పిండిపిండిగా చేయబడినపుడు;

Verse 22

وَجَآءَ رَبُّكَ وَٱلْمَلَكُ صَفًّا صَفًّا

Transliteration wajāa rabbuka wal-malaku ṣaffan ṣaffan

Telugu మరియు నీ ప్రభువు (స్వయంగా) వస్తాడు మరియు దేవదూతలు వరుసలలో వస్తారు.

Verse 23

وَجِا۟ىٓءَ يَوْمَئِذٍۭ بِجَهَنَّمَ ۚ يَوْمَئِذٍ يَتَذَكَّرُ ٱلْإِنسَـٰنُ وَأَنَّىٰ لَهُ ٱلذِّكْرَىٰ

Transliteration wajīa yawma-idhin bijahannama yawma-idhin yatadhakkaru l-insānu wa-annā lahu l-dhik'rā

Telugu ఆ రోజు నరకం (ముందుకు) తీసుకు రాబడుతుంది. ఆ రోజు మానవుడు (తన కర్మలన్నీ) జ్ఞప్తికి తెచ్చుకుంటాడు; కాని ఆ రోజు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల అతనికి కలిగే ప్రయోజనమేమిటీ?

Verse 24

يَقُولُ يَـٰلَيْتَنِى قَدَّمْتُ لِحَيَاتِى

Transliteration yaqūlu yālaytanī qaddamtu liḥayātī

Telugu అతడు: "అయ్యో! నా పాడుగానూ! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు.

Verse 25

فَيَوْمَئِذٍ لَّا يُعَذِّبُ عَذَابَهُۥٓ أَحَدٌ

Transliteration fayawma-idhin lā yuʿadhibu ʿadhābahu aḥadun

Telugu అయితే, ఆ రోజు, ఆయన (అల్లాహ్) శిక్షించినట్లు, మరెవ్వడూ శిక్షించలేడు!

Verse 26

وَلَا يُوثِقُ وَثَاقَهُۥٓ أَحَدٌ

Transliteration walā yūthiqu wathāqahu aḥadun

Telugu మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు.

Verse 27

يَـٰٓأَيَّتُهَا ٱلنَّفْسُ ٱلْمُطْمَئِنَّةُ

Transliteration yāayyatuhā l-nafsu l-muṭ'ma-inatu

Telugu (సన్మార్గునితో ఇలా అనబడుతుంది): "ఓ తృప్తి పొందిన ఆత్మా!

Verse 28

ٱرْجِعِىٓ إِلَىٰ رَبِّكِ رَاضِيَةً مَّرْضِيَّةً

Transliteration ir'jiʿī ilā rabbiki rāḍiyatan marḍiyyatan

Telugu నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై!

Verse 29

فَٱدْخُلِى فِى عِبَـٰدِى

Transliteration fa-ud'khulī fī ʿibādī

Telugu నీవు (పుణ్యాత్ములైన) నా దాసులలో చేరిపో!

Verse 30

وَٱدْخُلِى جَنَّتِى

Transliteration wa-ud'khulī jannatī

Telugu మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు!"

Read Surah Al-Fajr in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.