Surah Saba in Telugu: translation and audio
Surah 34 · سبإ · Sheba · 54 verses
Surah Saba verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Saba word by word in English.
Verse 1
ٱلْحَمْدُ لِلَّهِ ٱلَّذِى لَهُۥ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ وَلَهُ ٱلْحَمْدُ فِى ٱلْـَٔاخِرَةِ ۚ وَهُوَ ٱلْحَكِيمُ ٱلْخَبِيرُ
Transliteration al-ḥamdu lillahi alladhī lahu mā fī l-samāwāti wamā fī l-arḍi walahu l-ḥamdu fī l-ākhirati wahuwa l-ḥakīmu l-khabīru
Telugu సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు పరలోకంలో కూడా సర్వస్తోత్రాలకు అర్హుడు ఆయనే! మరియు ఆయన మహా వివేకవంతుడు, సర్వం తెలిసినవాడు.
Verse 2
يَعْلَمُ مَا يَلِجُ فِى ٱلْأَرْضِ وَمَا يَخْرُجُ مِنْهَا وَمَا يَنزِلُ مِنَ ٱلسَّمَآءِ وَمَا يَعْرُجُ فِيهَا ۚ وَهُوَ ٱلرَّحِيمُ ٱلْغَفُورُ
Transliteration yaʿlamu mā yaliju fī l-arḍi wamā yakhruju min'hā wamā yanzilu mina l-samāi wamā yaʿruju fīhā wahuwa l-raḥīmu l-ghafūru
Telugu భూమిలోకి ప్రవేశించేది మరియు దాని నుండి బయటికి వచ్చేది మరియు ఆకాశం నుండి దిగేది మరియు దానిలోకి పైకి ఎక్కిపోయేది, అంతా ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన అపార కరుణా ప్రదాత, క్షమాశీలుడు.
Verse 3
وَقَالَ ٱلَّذِينَ كَفَرُوا۟ لَا تَأْتِينَا ٱلسَّاعَةُ ۖ قُلْ بَلَىٰ وَرَبِّى لَتَأْتِيَنَّكُمْ عَـٰلِمِ ٱلْغَيْبِ ۖ لَا يَعْزُبُ عَنْهُ مِثْقَالُ ذَرَّةٍ فِى ٱلسَّمَـٰوَٰتِ وَلَا فِى ٱلْأَرْضِ وَلَآ أَصْغَرُ مِن ذَٰلِكَ وَلَآ أَكْبَرُ إِلَّا فِى كِتَـٰبٍ مُّبِينٍ
Transliteration waqāla alladhīna kafarū lā tatīnā l-sāʿatu qul balā warabbī latatiyannakum ʿālimi l-ghaybi lā yaʿzubu ʿanhu mith'qālu dharratin fī l-samāwāti walā fī l-arḍi walā aṣgharu min dhālika walā akbaru illā fī kitābin mubīnin
Telugu మరియు సత్యతిరస్కారులు ఇలా అంటారు: "అంతిమ ఘడియ (పునరుత్థానం) మాపై ఎన్నడూ రాదు!" వారితో ఇలా అను: "ఎందుకు రాదు! అగోచర విషయ జ్ఞానం గల నా ప్రభువు సాక్షిగా! అది తప్పక మీ మీదకు వస్తుంది." ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న రవ్వతో (పరమాణువుతో) సమానమైన వస్తువుగానీ, లేదా దాని కంటే చిన్నది గానీ లేదా దాని కంటే పెద్దది గానీ, ఒక స్పష్టమైన గ్రంథంలో (వ్రాయబడకుండా) ఆయనకు మరుగుగా లేదు.
Verse 4
لِّيَجْزِىَ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ ۚ أُو۟لَـٰٓئِكَ لَهُم مَّغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ
Transliteration liyajziya alladhīna āmanū waʿamilū l-ṣāliḥāti ulāika lahum maghfiratun wariz'qun karīmun
Telugu అది (అంతిమ ఘడియ), విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి ప్రతిఫలము నివ్వటానికి వస్తుంది. అలాంటి వారికి క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి (స్వర్గం) ఉంటాయి.
Verse 5
وَٱلَّذِينَ سَعَوْ فِىٓ ءَايَـٰتِنَا مُعَـٰجِزِينَ أُو۟لَـٰٓئِكَ لَهُمْ عَذَابٌ مِّن رِّجْزٍ أَلِيمٌ
Transliteration wa-alladhīna saʿaw fī āyātinā muʿājizīna ulāika lahum ʿadhābun min rij'zin alīmun
Telugu మరియు ఎవరైతే మా సూచనలను (ఆయాత్ లను) విఫలం చేయటానికి ప్రయత్నిస్తారో, అలాంటి వారికి అధమమైన, బాధాకరమైన శిక్ష ఉంటుంది.
Verse 6
وَيَرَى ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْعِلْمَ ٱلَّذِىٓ أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ هُوَ ٱلْحَقَّ وَيَهْدِىٓ إِلَىٰ صِرَٰطِ ٱلْعَزِيزِ ٱلْحَمِيدِ
Transliteration wayarā alladhīna ūtū l-ʿil'ma alladhī unzila ilayka min rabbika huwa l-ḥaqa wayahdī ilā ṣirāṭi l-ʿazīzi l-ḥamīdi
Telugu మరియు ఎవరికైతే జ్ఞానం ఇవ్వబడిందో! వారు, ఇది నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింప జేయబడిన సత్యమనీ మరియు అది సర్వశక్తిమంతుడు ప్రశంసనీయుడు (అయిన అల్లాహ్) మార్గం వైపునకే మార్గదర్శకత్వం చేస్తుందనీ గ్రహిస్తారు.
Verse 7
وَقَالَ ٱلَّذِينَ كَفَرُوا۟ هَلْ نَدُلُّكُمْ عَلَىٰ رَجُلٍ يُنَبِّئُكُمْ إِذَا مُزِّقْتُمْ كُلَّ مُمَزَّقٍ إِنَّكُمْ لَفِى خَلْقٍ جَدِيدٍ
Transliteration waqāla alladhīna kafarū hal nadullukum ʿalā rajulin yunabbi-ukum idhā muzziq'tum kulla mumazzaqin innakum lafī khalqin jadīdin
Telugu మరియు సత్యతిరస్కారులు ఇలా అంటారు: "మీరు (చచ్చి) దుమ్ముగా మారి, చెల్లాచెదురైన తరువాత కూడా! నిశ్చయంగా, మళ్ళీ క్రొత్తగా సృష్టింపబడతారని తెలియజేసే వ్యక్తిని మీకు చూపమంటారా?"
Verse 8
أَفْتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا أَم بِهِۦ جِنَّةٌۢ ۗ بَلِ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْـَٔاخِرَةِ فِى ٱلْعَذَابِ وَٱلضَّلَـٰلِ ٱلْبَعِيدِ
Transliteration aftarā ʿalā l-lahi kadhiban am bihi jinnatun bali alladhīna lā yu'minūna bil-ākhirati fī l-ʿadhābi wal-ḍalāli l-baʿīdi
Telugu "అతను అల్లాహ్ పై అబద్ధం కల్పించాడో లేక! అతనికి పిచ్చిపట్టిందో తెలియటం లేదు!" అలా కాదు, ఎవరైతే పరలోకాన్ని నమ్మరో వారు శిక్షకు గురి అవుతారు. మరియు వారు మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయారు.
Verse 9
أَفَلَمْ يَرَوْا۟ إِلَىٰ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُم مِّنَ ٱلسَّمَآءِ وَٱلْأَرْضِ ۚ إِن نَّشَأْ نَخْسِفْ بِهِمُ ٱلْأَرْضَ أَوْ نُسْقِطْ عَلَيْهِمْ كِسَفًا مِّنَ ٱلسَّمَآءِ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّكُلِّ عَبْدٍ مُّنِيبٍ
Transliteration afalam yaraw ilā mā bayna aydīhim wamā khalfahum mina l-samāi wal-arḍi in nasha nakhsif bihimu l-arḍa aw nus'qiṭ ʿalayhim kisafan mina l-samāi inna fī dhālika laāyatan likulli ʿabdin munībin
Telugu ఏమిటి? వారు తమకు ముందున్న మరియు తమకు వెనుకనున్న ఆకాశాన్ని మరియు భూమిని చూడటం లేదా? మేము కోరితే, వారిని భూమిలోకి అణగ ద్రొక్కేవారం, లేదా వారిపై ఆకాశం నుండి ఒక ముక్కను పడవేసే వారం. నిశ్చయంగా, ఇందులో పశ్చాత్తాపంతో (అల్లాహ్ వైపునకు) మరలే, ప్రతి దాసుని కొరకు ఒక సూచన ఉంది.
Verse 10
۞ وَلَقَدْ ءَاتَيْنَا دَاوُۥدَ مِنَّا فَضْلًا ۖ يَـٰجِبَالُ أَوِّبِى مَعَهُۥ وَٱلطَّيْرَ ۖ وَأَلَنَّا لَهُ ٱلْحَدِيدَ
Transliteration walaqad ātaynā dāwūda minnā faḍlan yājibālu awwibī maʿahu wal-ṭayra wa-alannā lahu l-ḥadīda
Telugu మరియు వాస్తవంగా, మేము దావూద్ కు మా తరఫు నుండి గొప్ప అనుగ్రహాన్ని ప్రసాదించాము: "ఓ పర్వతాల్లారా! మరియు పక్షులారా! అతనితో కలిసి (మా స్తోత్రాన్ని) ఉచ్ఛరించండి!" (అని మేము ఆజ్ఞాపించాము). మేము అతని కొరకు ఇనుమును మెత్తదిగా చేశాము.
Verse 11
أَنِ ٱعْمَلْ سَـٰبِغَـٰتٍ وَقَدِّرْ فِى ٱلسَّرْدِ ۖ وَٱعْمَلُوا۟ صَـٰلِحًا ۖ إِنِّى بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
Transliteration ani iʿ'mal sābighātin waqaddir fī l-sardi wa-iʿ'malū ṣāliḥan innī bimā taʿmalūna baṣīrun
Telugu (అతనికి ఇలా ఆదేశమిచ్చాము): "నీవు కవచాలు తయారు చేయి మరియు వాటి వలయాలను (కడియాలను) సరిసమానంగా కూర్చు!" మరియు (ఓ మానవులారా!): "మీరు సత్కార్యాలు చేయండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా నేను చూస్తున్నాను."
Verse 12
وَلِسُلَيْمَـٰنَ ٱلرِّيحَ غُدُوُّهَا شَهْرٌ وَرَوَاحُهَا شَهْرٌ ۖ وَأَسَلْنَا لَهُۥ عَيْنَ ٱلْقِطْرِ ۖ وَمِنَ ٱلْجِنِّ مَن يَعْمَلُ بَيْنَ يَدَيْهِ بِإِذْنِ رَبِّهِۦ ۖ وَمَن يَزِغْ مِنْهُمْ عَنْ أَمْرِنَا نُذِقْهُ مِنْ عَذَابِ ٱلسَّعِيرِ
Transliteration walisulaymāna l-rīḥa ghuduwwuhā shahrun warawāḥuhā shahrun wa-asalnā lahu ʿayna l-qiṭ'ri wamina l-jini man yaʿmalu bayna yadayhi bi-idh'ni rabbihi waman yazigh min'hum ʿan amrinā nudhiq'hu min ʿadhābi l-saʿīri
Telugu మరియు మేము గాలిని సులైమాన్ కు (వశపరచాము); దాని ఉదయపు గమనం ఒక నెల రోజుల పాటి ప్రయాణాన్ని పూర్తి చేసేది మరియు దాని సాయంకాలపు గమనం ఒక నెల. మరియు మేము అతని కొరకు రాగి ఊటను ప్రవహింప జేశాము. మరియు అతని ప్రభువు ఆజ్ఞతో, అతని సన్నధిలో పని చేసే జిన్నాతులను అతనికి వశపరచాము. మరియు వారిలో మా ఆజ్ఞను ఉల్లంఘించిన వాడికి ప్రజ్వలించే నరకాగ్ని శిక్షను రుచి చూపుతూ ఉండేవారము.
Verse 13
يَعْمَلُونَ لَهُۥ مَا يَشَآءُ مِن مَّحَـٰرِيبَ وَتَمَـٰثِيلَ وَجِفَانٍ كَٱلْجَوَابِ وَقُدُورٍ رَّاسِيَـٰتٍ ۚ ٱعْمَلُوٓا۟ ءَالَ دَاوُۥدَ شُكْرًا ۚ وَقَلِيلٌ مِّنْ عِبَادِىَ ٱلشَّكُورُ
Transliteration yaʿmalūna lahu mā yashāu min maḥārība watamāthīla wajifānin kal-jawābi waqudūrin rāsiyātin iʿ'malū āla dāwūda shuk'ran waqalīlun min ʿibādiya l-shakūru
Telugu వారు (జిన్నాతులు) అతనికి అతను కోరే, పెద్ద పెద్ద కట్టడాలను, ప్రతిమలను, గుంటల వంటి పెద్ద పెద్ద గంగాళాలను, (తమ స్థానము నుండి) కదిలింపలేని కళాయీలను తయారు చేసేవారు. "ఓ దావూద్ వంశీయులారా! మీరు కృతజ్ఞులై పనులు చేస్తూ ఉండిండి." మరియు నా దాసులలో కృతజ్ఞతలు తెలిపేవారు చాలా తక్కువ.
Verse 14
فَلَمَّا قَضَيْنَا عَلَيْهِ ٱلْمَوْتَ مَا دَلَّهُمْ عَلَىٰ مَوْتِهِۦٓ إِلَّا دَآبَّةُ ٱلْأَرْضِ تَأْكُلُ مِنسَأَتَهُۥ ۖ فَلَمَّا خَرَّ تَبَيَّنَتِ ٱلْجِنُّ أَن لَّوْ كَانُوا۟ يَعْلَمُونَ ٱلْغَيْبَ مَا لَبِثُوا۟ فِى ٱلْعَذَابِ ٱلْمُهِينِ
Transliteration falammā qaḍaynā ʿalayhi l-mawta mā dallahum ʿalā mawtihi illā dābbatu l-arḍi takulu minsa-atahu falammā kharra tabayyanati l-jinu an law kānū yaʿlamūna l-ghayba mā labithū fī l-ʿadhābi l-muhīni
Telugu మేము అతని (సులైమాన్)పై మృత్యువును విధించినప్పుడు, అతని చేతికర్రను తింటూ ఉన్న పురుగు తప్ప, మరెవ్వరూ అతని మరణం విషయం, వారికి (జిన్నాతులకు) తెలుపలేదు. ఆ తరువాత అతను పడిపోగా జిన్నాతులు తమకు అగోచర విషయాలు తెలిసి ఉంటే, తాము అవమాన కరమైన ఈ బాధలో పడి ఉండే వారం కాము కదా అని తెలుసుకున్నారు.
Verse 15
لَقَدْ كَانَ لِسَبَإٍ فِى مَسْكَنِهِمْ ءَايَةٌ ۖ جَنَّتَانِ عَن يَمِينٍ وَشِمَالٍ ۖ كُلُوا۟ مِن رِّزْقِ رَبِّكُمْ وَٱشْكُرُوا۟ لَهُۥ ۚ بَلْدَةٌ طَيِّبَةٌ وَرَبٌّ غَفُورٌ
Transliteration laqad kāna lisaba-in fī maskanihim āyatun jannatāni ʿan yamīnin washimālin kulū min riz'qi rabbikum wa-ush'kurū lahu baldatun ṭayyibatun warabbun ghafūrun
Telugu వాస్తవంగా, సబా వారి కొరకు, వారి నివాస స్థలంలో ఒక సూచన ఉంది. దాని కుడి మరియు ఎడమ ప్రక్కలలో రెండు తోటలు ఉండేవి (వారితో): "మీ ప్రభువు ప్రసాదించిన ఆహారం తిని ఆయనకు కృతజ్ఞతలు తెలుపండి!" (అని అనబడింది). ఇది చాలా మంచి దేశం మరియు మీ ప్రభువు క్షమాశీలుడు.
Verse 16
فَأَعْرَضُوا۟ فَأَرْسَلْنَا عَلَيْهِمْ سَيْلَ ٱلْعَرِمِ وَبَدَّلْنَـٰهُم بِجَنَّتَيْهِمْ جَنَّتَيْنِ ذَوَاتَىْ أُكُلٍ خَمْطٍ وَأَثْلٍ وَشَىْءٍ مِّن سِدْرٍ قَلِيلٍ
Transliteration fa-aʿraḍū fa-arsalnā ʿalayhim sayla l-ʿarimi wabaddalnāhum bijannatayhim jannatayni dhawātay ukulin khamṭin wa-athlin washayin min sid'rin qalīlin
Telugu అయినా వారు విముఖులయ్యారు. కాబట్టి మేము వారి పైకి, కట్టను తెంచి వరదను పంపాము. మరియు వారి రెండు తోటలను చేదైనా ఫలాలిచ్చే చెట్లు, ఝావుక చెట్లు మరియు కొన్ని మాత్రమే రేగు చెట్లు ఉన్న తోటలుగా మార్చాము.
Verse 17
ذَٰلِكَ جَزَيْنَـٰهُم بِمَا كَفَرُوا۟ ۖ وَهَلْ نُجَـٰزِىٓ إِلَّا ٱلْكَفُورَ
Transliteration dhālika jazaynāhum bimā kafarū wahal nujāzī illā l-kafūra
Telugu ఇది వారి కృతఘ్నతకు (సత్యతిరస్కారానికి) బదులుగా వారికిచ్చిన ప్రతిఫలం. మరియు ఇలాంటి ప్రతిఫలం మేము కృతఘ్నులకు తప్ప, ఇతరులకు ఇవ్వము.
Verse 18
وَجَعَلْنَا بَيْنَهُمْ وَبَيْنَ ٱلْقُرَى ٱلَّتِى بَـٰرَكْنَا فِيهَا قُرًى ظَـٰهِرَةً وَقَدَّرْنَا فِيهَا ٱلسَّيْرَ ۖ سِيرُوا۟ فِيهَا لَيَالِىَ وَأَيَّامًا ءَامِنِينَ
Transliteration wajaʿalnā baynahum wabayna l-qurā allatī bāraknā fīhā quran ẓāhiratan waqaddarnā fīhā l-sayra sīrū fīhā layāliya wa-ayyāman āminīna
Telugu మరియు మేము వారి మధ్య మరియు మేము శుభాలు ప్రసాదించిన నగరాల మధ్య, స్పష్టంగా కనిపించే నగరాలను స్థాపించి: "వాటి మధ్య సురక్షితంగా రేయింబవళ్ళు ప్రయాణిస్తూ ఉండండి." (అని అన్నాము).
Verse 19
فَقَالُوا۟ رَبَّنَا بَـٰعِدْ بَيْنَ أَسْفَارِنَا وَظَلَمُوٓا۟ أَنفُسَهُمْ فَجَعَلْنَـٰهُمْ أَحَادِيثَ وَمَزَّقْنَـٰهُمْ كُلَّ مُمَزَّقٍ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُورٍ
Transliteration faqālū rabbanā bāʿid bayna asfārinā waẓalamū anfusahum fajaʿalnāhum aḥādītha wamazzaqnāhum kulla mumazzaqin inna fī dhālika laāyātin likulli ṣabbārin shakūrin
Telugu కాని వారు: "ఓ మా ప్రభూ! మా ప్రయాణ దూరాలను పొడిగించు." అని వేడుకొని, తమకు తామే అన్యాయం చేసుకున్నారు. కావున మేము వారిని కథలుగా మిగిల్చి, వారిని పూర్తిగా చెల్లా చెదురు చేశాము. నిశ్చయంగా, ఇందులో సహనశీలుడు, కృతజ్ఞుడు అయిన ప్రతీ వ్యక్తికి సూచనలున్నాయి.
Verse 20
وَلَقَدْ صَدَّقَ عَلَيْهِمْ إِبْلِيسُ ظَنَّهُۥ فَٱتَّبَعُوهُ إِلَّا فَرِيقًا مِّنَ ٱلْمُؤْمِنِينَ
Transliteration walaqad ṣaddaqa ʿalayhim ib'līsu ẓannahu fa-ittabaʿūhu illā farīqan mina l-mu'minīna
Telugu వాస్తవానికి ఇబ్లీస్ (షైతాన్) వారి విషయంలో తాను ఊహించింది సత్యమయిందని నిరూపించాడు. ఎందుకంటే! విశ్వాసులలోని ఒక వర్గం వారు తప్ప, అందరూ వాడిని అనుసరించారు.
Verse 21
وَمَا كَانَ لَهُۥ عَلَيْهِم مِّن سُلْطَـٰنٍ إِلَّا لِنَعْلَمَ مَن يُؤْمِنُ بِٱلْـَٔاخِرَةِ مِمَّنْ هُوَ مِنْهَا فِى شَكٍّ ۗ وَرَبُّكَ عَلَىٰ كُلِّ شَىْءٍ حَفِيظٌ
Transliteration wamā kāna lahu ʿalayhim min sul'ṭānin illā linaʿlama man yu'minu bil-ākhirati mimman huwa min'hā fī shakkin warabbuka ʿalā kulli shayin ḥafīẓun
Telugu మరియు వాడికి (షైతాన్ కు) వారిపై ఎలాంటి అధికారం లేదు. కాని, పరలోకాన్ని విశ్వసించేవాడెవడో (మరియు) దానిని గురించి సంశయంలో పడ్డ వాడెవడో, తెలుసుకోవటానికి మాత్రమే (మేమిలా చేశాము) మరియు నీ ప్రభువు ప్రతి విషయాన్ని కనిపెట్టుకొని ఉంటాడు.
Verse 22
قُلِ ٱدْعُوا۟ ٱلَّذِينَ زَعَمْتُم مِّن دُونِ ٱللَّهِ ۖ لَا يَمْلِكُونَ مِثْقَالَ ذَرَّةٍ فِى ٱلسَّمَـٰوَٰتِ وَلَا فِى ٱلْأَرْضِ وَمَا لَهُمْ فِيهِمَا مِن شِرْكٍ وَمَا لَهُۥ مِنْهُم مِّن ظَهِيرٍ
Transliteration quli id'ʿū alladhīna zaʿamtum min dūni l-lahi lā yamlikūna mith'qāla dharratin fī l-samāwāti walā fī l-arḍi wamā lahum fīhimā min shir'kin wamā lahu min'hum min ẓahīrin
Telugu వారితో ఇలా అను: "అల్లాహ్ ను వదలి మీరు ఎవరినైతే, (ఆరాధ్యదైవాలుగా) భావిస్తున్నారో, వారిని పిలిచి చూడండి!" ఆకాశాలలో గానీ మరియు భూమిలో గానీ రవ్వ (పరమాణువు) అంత వస్తువుపై కూడా వారికి అధికారం లేదు. మరియు వారికి ఆ రెండింటిలో ఎలాంటి భాగస్వామ్యమూ లేదు. మరియు ఆయనకు వారిలో నుండి ఎవ్వడూ సహాయకుడునూ కాడు.
Verse 23
وَلَا تَنفَعُ ٱلشَّفَـٰعَةُ عِندَهُۥٓ إِلَّا لِمَنْ أَذِنَ لَهُۥ ۚ حَتَّىٰٓ إِذَا فُزِّعَ عَن قُلُوبِهِمْ قَالُوا۟ مَاذَا قَالَ رَبُّكُمْ ۖ قَالُوا۟ ٱلْحَقَّ ۖ وَهُوَ ٱلْعَلِىُّ ٱلْكَبِيرُ
Transliteration walā tanfaʿu l-shafāʿatu ʿindahu illā liman adhina lahu ḥattā idhā fuzziʿa ʿan qulūbihim qālū mādhā qāla rabbukum qālū l-ḥaqa wahuwa l-ʿaliyu l-kabīru
Telugu మరియు ఆయన దగ్గర ఏ విధమైన సిఫారసు పలికిరాదు, ఆయన అనుమతించింన వాడి (సిఫారసు తప్ప)! చివరకు వారి హృదయాల నుండి భయం తొలగిపోయినప్పుడు వారు (దేవతలు): "మీ ప్రభువు మీతో చెప్పిందేమిటీ?" అని అడుగుతారు. దానికి వారంటారు: "సత్యం మాత్రమే!" మరియు ఆయన మహోన్నతుడు, మహనీయుడు.
Verse 24
۞ قُلْ مَن يَرْزُقُكُم مِّنَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۖ قُلِ ٱللَّهُ ۖ وَإِنَّآ أَوْ إِيَّاكُمْ لَعَلَىٰ هُدًى أَوْ فِى ضَلَـٰلٍ مُّبِينٍ
Transliteration qul man yarzuqukum mina l-samāwāti wal-arḍi quli l-lahu wa-innā aw iyyākum laʿalā hudan aw fī ḍalālin mubīnin
Telugu వారిని ఇలా అడుగు: "మీకు ఆకాశాల నుండి మరియు భూమి నుండి జీవనోపాధిని సమకూర్చేవాడెవడు?" వారికి తెలుపు: "అల్లాహ్!" అయితే నిశ్చయంగా మేమో లేక మీరో ఎవరో ఒకరు మాత్రమే సన్మార్గంలో ఉన్నాము లేదా స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో ఉన్నాము.
Verse 25
قُل لَّا تُسْـَٔلُونَ عَمَّآ أَجْرَمْنَا وَلَا نُسْـَٔلُ عَمَّا تَعْمَلُونَ
Transliteration qul lā tus'alūna ʿammā ajramnā walā nus'alu ʿammā taʿmalūna
Telugu ఇంకా ఇలా అను: "మేము చేసిన పాపాలకు మీరు ప్రశ్నించబడరు మరియు మీ కర్మలను గురించి మేమూ ప్రశ్నించబడము."
Verse 26
قُلْ يَجْمَعُ بَيْنَنَا رَبُّنَا ثُمَّ يَفْتَحُ بَيْنَنَا بِٱلْحَقِّ وَهُوَ ٱلْفَتَّاحُ ٱلْعَلِيمُ
Transliteration qul yajmaʿu baynanā rabbunā thumma yaftaḥu baynanā bil-ḥaqi wahuwa l-fatāḥu l-ʿalīmu
Telugu వారితో ఇలా అను: "మన ప్రభువు మనందరినీ (పునరుత్థాన దినమున) ఒకే చోట సమకూర్చుతాడు. తరువాత న్యాయంగా మన మధ్య తీర్పు చేస్తాడు. ఆయనే (సర్వోత్తమమైన) తీర్పు చేసేవాడు, సర్వజ్ఞుడు."
Verse 27
قُلْ أَرُونِىَ ٱلَّذِينَ أَلْحَقْتُم بِهِۦ شُرَكَآءَ ۖ كَلَّا ۚ بَلْ هُوَ ٱللَّهُ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ
Transliteration qul arūniya alladhīna alḥaqtum bihi shurakāa kallā bal huwa l-lahu l-ʿazīzu l-ḥakīmu
Telugu వారితో ఇలా అను: "మీరు ఆయనకు సాటిగా నిలబెట్టిన భాగస్వాములను నాకు చూపించండి. ఎవరూ లేరు! వాస్తవానికి ఆయన, అల్లాహ్ యే సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు."
Verse 28
وَمَآ أَرْسَلْنَـٰكَ إِلَّا كَآفَّةً لِّلنَّاسِ بَشِيرًا وَنَذِيرًا وَلَـٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ
Transliteration wamā arsalnāka illā kāffatan lilnnāsi bashīran wanadhīran walākinna akthara l-nāsi lā yaʿlamūna
Telugu మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను సర్వమానవులకు శుభవార్తనిచ్చే వానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము. కాని వాస్తవానికి చాలా మంది ప్రజలకు ఇది తెలియదు.
Verse 29
وَيَقُولُونَ مَتَىٰ هَـٰذَا ٱلْوَعْدُ إِن كُنتُمْ صَـٰدِقِينَ
Transliteration wayaqūlūna matā hādhā l-waʿdu in kuntum ṣādiqīna
Telugu మరియు వారు: "మీరు సత్యవంతులే అయితే, ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరనున్నది?" అని అడుగుతున్నారు.
Verse 30
قُل لَّكُم مِّيعَادُ يَوْمٍ لَّا تَسْتَـْٔخِرُونَ عَنْهُ سَاعَةً وَلَا تَسْتَقْدِمُونَ
Transliteration qul lakum mīʿādu yawmin lā tastakhirūna ʿanhu sāʿatan walā tastaqdimūna
Telugu వారితో ఇలా అను: "మీ కొరకు ఒక రోజు వ్యవధి నిర్ణయించబడి ఉంది; మీరు దాని రాకను ఒక్క ఘడియ వెనుకకూ చేయలేరు లేదా (ఒక్క ఘడియ) ముందుకునూ చేయలేరు."
Verse 31
وَقَالَ ٱلَّذِينَ كَفَرُوا۟ لَن نُّؤْمِنَ بِهَـٰذَا ٱلْقُرْءَانِ وَلَا بِٱلَّذِى بَيْنَ يَدَيْهِ ۗ وَلَوْ تَرَىٰٓ إِذِ ٱلظَّـٰلِمُونَ مَوْقُوفُونَ عِندَ رَبِّهِمْ يَرْجِعُ بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ ٱلْقَوْلَ يَقُولُ ٱلَّذِينَ ٱسْتُضْعِفُوا۟ لِلَّذِينَ ٱسْتَكْبَرُوا۟ لَوْلَآ أَنتُمْ لَكُنَّا مُؤْمِنِينَ
Transliteration waqāla alladhīna kafarū lan nu'mina bihādhā l-qur'āni walā bi-alladhī bayna yadayhi walaw tarā idhi l-ẓālimūna mawqūfūna ʿinda rabbihim yarjiʿu baʿḍuhum ilā baʿḍin l-qawla yaqūlu alladhīna us'tuḍ'ʿifū lilladhīna is'takbarū lawlā antum lakunnā mu'minīna
Telugu మరియు సత్యతిరస్కారులైన వారు ఇలా అంటారు: "మేము ఈ ఖుర్ఆన్ ను మరియు దీనికి ముందు వచ్చిన ఏ గ్రంథాన్ని కూడా నమ్మము." ఒకవేళ ఈ దుర్మార్గులను తమ ప్రభువు ఎదుట నిలబెట్టబడినప్పుడు, వారు ఒకరి నొకరు, ఆరోపణలు చేసుకోవటం నీవు చూస్తే (ఎంత బాగుండును)! బలహీన వర్గం వారు దురహంకారులైన తమ నాయకులతో: "మీరే లేకుంటే మేము తప్పక విశ్వాసుల మయ్యేవారం!" అని అంటారు.
Verse 32
قَالَ ٱلَّذِينَ ٱسْتَكْبَرُوا۟ لِلَّذِينَ ٱسْتُضْعِفُوٓا۟ أَنَحْنُ صَدَدْنَـٰكُمْ عَنِ ٱلْهُدَىٰ بَعْدَ إِذْ جَآءَكُم ۖ بَلْ كُنتُم مُّجْرِمِينَ
Transliteration qāla alladhīna is'takbarū lilladhīna us'tuḍ'ʿifū anaḥnu ṣadadnākum ʿani l-hudā baʿda idh jāakum bal kuntum muj'rimīna
Telugu దురహంకారులైన నాయకులు బలహీనులైన వారితో ఇలా అంటారు: "ఏమీ? మీ వద్దకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు మేము మిమ్మల్ని దాని నుండి నిరోధించామా? అలా కాదు, మీరే అపరాధానికి పాల్పడ్డారు!"
Verse 33
وَقَالَ ٱلَّذِينَ ٱسْتُضْعِفُوا۟ لِلَّذِينَ ٱسْتَكْبَرُوا۟ بَلْ مَكْرُ ٱلَّيْلِ وَٱلنَّهَارِ إِذْ تَأْمُرُونَنَآ أَن نَّكْفُرَ بِٱللَّهِ وَنَجْعَلَ لَهُۥٓ أَندَادًا ۚ وَأَسَرُّوا۟ ٱلنَّدَامَةَ لَمَّا رَأَوُا۟ ٱلْعَذَابَ وَجَعَلْنَا ٱلْأَغْلَـٰلَ فِىٓ أَعْنَاقِ ٱلَّذِينَ كَفَرُوا۟ ۚ هَلْ يُجْزَوْنَ إِلَّا مَا كَانُوا۟ يَعْمَلُونَ
Transliteration waqāla alladhīna us'tuḍ'ʿifū lilladhīna is'takbarū bal makru al-layli wal-nahāri idh tamurūnanā an nakfura bil-lahi wanajʿala lahu andādan wa-asarrū l-nadāmata lammā ra-awū l-ʿadhāba wajaʿalnā l-aghlāla fī aʿnāqi alladhīna kafarū hal yuj'zawna illā mā kānū yaʿmalūna
Telugu మరియు బలహీనులైన వారు దురహంకారులైన నాయకులతో ఇలా అంటారు: "అలా కాదు! ఇది మీరు రాత్రింబవళ్ళు పన్నిన కుట్ర. మీరు మమ్మల్ని - అల్లాహ్ ను తిరస్కరించి - ఇతరులను ఆయనకు సాటి కల్పించమని ఆజ్ఞాపిస్తూ ఉండేవారు." మరియు వారు శిక్షను చూసినప్పుడు, తమ పశ్చాత్తాపాన్ని దాస్తారు. మరియు మేము సత్యతిరస్కారుల మెడలలో సంకెళ్ళు వేస్తాము. వారు తమ కర్మలకు తగిన ప్రతిఫలం తప్ప మరేదైనా పొందగలరా?
Verse 34
وَمَآ أَرْسَلْنَا فِى قَرْيَةٍ مِّن نَّذِيرٍ إِلَّا قَالَ مُتْرَفُوهَآ إِنَّا بِمَآ أُرْسِلْتُم بِهِۦ كَـٰفِرُونَ
Transliteration wamā arsalnā fī qaryatin min nadhīrin illā qāla mut'rafūhā innā bimā ur'sil'tum bihi kāfirūna
Telugu మరియు మేము హెచ్చరిక చేసే అతనిని (ప్రవక్తను) ఏ నగరానికి పంపినా, దానిలోని ఐశ్యర్యవంతులు: "నిశ్చయంగా, మేము మీ వెంట పంపబడిన సందేశాన్ని తిరస్కరిస్తున్నాము." అని అనకుండా ఉండలేదు.
Verse 35
وَقَالُوا۟ نَحْنُ أَكْثَرُ أَمْوَٰلًا وَأَوْلَـٰدًا وَمَا نَحْنُ بِمُعَذَّبِينَ
Transliteration waqālū naḥnu aktharu amwālan wa-awlādan wamā naḥnu bimuʿadhabīna
Telugu వారు ఇంకా ఇలా అన్నారు: "మేము (నీకంటే) ఎక్కువ సంపద మరియు సంతానం కలిగి ఉన్నాము. మరియు మేము ఏ మాత్రం శిక్షింపబడము."
Verse 36
قُلْ إِنَّ رَبِّى يَبْسُطُ ٱلرِّزْقَ لِمَن يَشَآءُ وَيَقْدِرُ وَلَـٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ
Transliteration qul inna rabbī yabsuṭu l-riz'qa liman yashāu wayaqdiru walākinna akthara l-nāsi lā yaʿlamūna
Telugu వారితో అను: "నిశ్చయంగా, నా ప్రభువు తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు, మరియు (తాను కోరిన వారికి) మితంగా ఇస్తాడు. కాని చాలా మందికి ఇది తెలియదు."
Verse 37
وَمَآ أَمْوَٰلُكُمْ وَلَآ أَوْلَـٰدُكُم بِٱلَّتِى تُقَرِّبُكُمْ عِندَنَا زُلْفَىٰٓ إِلَّا مَنْ ءَامَنَ وَعَمِلَ صَـٰلِحًا فَأُو۟لَـٰٓئِكَ لَهُمْ جَزَآءُ ٱلضِّعْفِ بِمَا عَمِلُوا۟ وَهُمْ فِى ٱلْغُرُفَـٰتِ ءَامِنُونَ
Transliteration wamā amwālukum walā awlādukum bi-allatī tuqarribukum ʿindanā zul'fā illā man āmana waʿamila ṣāliḥan fa-ulāika lahum jazāu l-ḍiʿ'fi bimā ʿamilū wahum fī l-ghurufāti āminūna
Telugu మరియు మీ సంపద గానీ మరియు మీ సంతానం గానీ మిమ్మల్ని మా దగ్గరికి తేలేవు; కాని విశ్వసించి సత్కార్యాలు చేసేవారు తప్ప! కావున అలాంటి వారికి తాము చేసిన దానికి రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది. మరియు వారు భవనాలలో సురక్షితంగా ఉంటారు.
Verse 38
وَٱلَّذِينَ يَسْعَوْنَ فِىٓ ءَايَـٰتِنَا مُعَـٰجِزِينَ أُو۟لَـٰٓئِكَ فِى ٱلْعَذَابِ مُحْضَرُونَ
Transliteration wa-alladhīna yasʿawna fī āyātinā muʿājizīna ulāika fī l-ʿadhābi muḥ'ḍarūna
Telugu మరియు ఎవరైతే మా సూచనలను భంగపరచటానికి ప్రయత్నిస్తారో, అలాంటి వారు కఠినశిక్షకు హాజరు చేయబడతారు.
Verse 39
قُلْ إِنَّ رَبِّى يَبْسُطُ ٱلرِّزْقَ لِمَن يَشَآءُ مِنْ عِبَادِهِۦ وَيَقْدِرُ لَهُۥ ۚ وَمَآ أَنفَقْتُم مِّن شَىْءٍ فَهُوَ يُخْلِفُهُۥ ۖ وَهُوَ خَيْرُ ٱلرَّٰزِقِينَ
Transliteration qul inna rabbī yabsuṭu l-riz'qa liman yashāu min ʿibādihi wayaqdiru lahu wamā anfaqtum min shayin fahuwa yukh'lifuhu wahuwa khayru l-rāziqīna
Telugu వారితో అను: "నిశ్చయంగా, నా ప్రభువు తన దాసులలో తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు (తాను కోరిన) వారికి మితంగా ఇస్తాడు. మరియు మీరు (ఆయన మార్గంలో) ఖర్చు పెట్టేదంతా ఆయన మీకు తిరిగి ఇస్తాడు. మరియు ఆయనే సర్వశ్రేష్ఠుడైన జీవనోపాధి ప్రదాత."
Verse 40
وَيَوْمَ يَحْشُرُهُمْ جَمِيعًا ثُمَّ يَقُولُ لِلْمَلَـٰٓئِكَةِ أَهَـٰٓؤُلَآءِ إِيَّاكُمْ كَانُوا۟ يَعْبُدُونَ
Transliteration wayawma yaḥshuruhum jamīʿan thumma yaqūlu lil'malāikati ahāulāi iyyākum kānū yaʿbudūna
Telugu మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు ఆయన వారందరినీ సమీకరించిన తరువాత దేవదూతలతో ఇలా అడుగుతాడు: "ఏమీ? వీరేనా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండేవారు?"
Verse 41
قَالُوا۟ سُبْحَـٰنَكَ أَنتَ وَلِيُّنَا مِن دُونِهِم ۖ بَلْ كَانُوا۟ يَعْبُدُونَ ٱلْجِنَّ ۖ أَكْثَرُهُم بِهِم مُّؤْمِنُونَ
Transliteration qālū sub'ḥānaka anta waliyyunā min dūnihim bal kānū yaʿbudūna l-jina aktharuhum bihim mu'minūna
Telugu వారు (దేవదూతలు) జవాబిస్తారు: "నీవు సర్వలోపాలకు అతీతుడవు! నీవే మా సంరక్షకుడవు, వీరు కారు. వాస్తవానికి, వీరు జిన్నాతులను ఆరాధించేవారు, వీరిలో చాలా మంది, వారిని (జిన్నాతులను) విశ్వసించే వారు."
Verse 42
فَٱلْيَوْمَ لَا يَمْلِكُ بَعْضُكُمْ لِبَعْضٍ نَّفْعًا وَلَا ضَرًّا وَنَقُولُ لِلَّذِينَ ظَلَمُوا۟ ذُوقُوا۟ عَذَابَ ٱلنَّارِ ٱلَّتِى كُنتُم بِهَا تُكَذِّبُونَ
Transliteration fal-yawma lā yamliku baʿḍukum libaʿḍin nafʿan walā ḍarran wanaqūlu lilladhīna ẓalamū dhūqū ʿadhāba l-nāri allatī kuntum bihā tukadhibūna
Telugu (అప్పుడు వారితో ఇట్లనబడుతుంది): "అయితే ఈ రోజు మీరు ఒకరికొకరు లాభం గానీ, నష్టం గానీ చేకూర్చుకోలేరు." మరియు మేము దుర్మార్గులతో: "మీరు తిరస్కరిస్తూ ఉండిన నరకబాధను రుచి చూడండి!" అని పలుకుతాము.
Verse 43
وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ ءَايَـٰتُنَا بَيِّنَـٰتٍ قَالُوا۟ مَا هَـٰذَآ إِلَّا رَجُلٌ يُرِيدُ أَن يَصُدَّكُمْ عَمَّا كَانَ يَعْبُدُ ءَابَآؤُكُمْ وَقَالُوا۟ مَا هَـٰذَآ إِلَّآ إِفْكٌ مُّفْتَرًى ۚ وَقَالَ ٱلَّذِينَ كَفَرُوا۟ لِلْحَقِّ لَمَّا جَآءَهُمْ إِنْ هَـٰذَآ إِلَّا سِحْرٌ مُّبِينٌ
Transliteration wa-idhā tut'lā ʿalayhim āyātunā bayyinātin qālū mā hādhā illā rajulun yurīdu an yaṣuddakum ʿammā kāna yaʿbudu ābāukum waqālū mā hādhā illā if'kun muf'taran waqāla alladhīna kafarū lil'ḥaqqi lammā jāahum in hādhā illā siḥ'run mubīnun
Telugu మరియు వారికి మా స్పష్టమైన సూచన (ఆయాత్) లను వినిపింప జేసినప్పుడు వారు: "ఈ వ్యక్తి కేవలం మీ తండ్రి తాతలు ఆరాధించే వాటి నుండి మిమ్మల్ని నిరోధిస్తున్నాడు." అని అంటారు. వారింకా ఇలా అంటారు: "ఇది (ఈ ఖుర్ఆన్) కేవలం కల్పించబడిన బూటకం మాత్రమే." మరియు సత్యతిరస్కారులు, సత్యం వారి ముందుకు వచ్చినప్పుడు: "ఇది కేవలం స్పష్టమైన మంత్రజాలం మాత్రమే!" అని అంటారు.
Verse 44
وَمَآ ءَاتَيْنَـٰهُم مِّن كُتُبٍ يَدْرُسُونَهَا ۖ وَمَآ أَرْسَلْنَآ إِلَيْهِمْ قَبْلَكَ مِن نَّذِيرٍ
Transliteration wamā ātaynāhum min kutubin yadrusūnahā wamā arsalnā ilayhim qablaka min nadhīrin
Telugu (ఓ ముహమ్మద్!) మేము, వారికి చదవటానికి ఎలాంటి గ్రంథాలు ఇవ్వలేదు. మరియు మేము వారి వద్దకు నీకు పూర్వం హెచ్చరించే (సందేశహరుణ్ణి) కూడా పంపలేదు.
Verse 45
وَكَذَّبَ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ وَمَا بَلَغُوا۟ مِعْشَارَ مَآ ءَاتَيْنَـٰهُمْ فَكَذَّبُوا۟ رُسُلِى ۖ فَكَيْفَ كَانَ نَكِيرِ
Transliteration wakadhaba alladhīna min qablihim wamā balaghū miʿ'shāra mā ātaynāhum fakadhabū rusulī fakayfa kāna nakīri
Telugu మరియు వారికి పూర్వం గతించిన వారు కూడా (ఇదే విధంగా) తిరస్కరించారు. మేము (పూర్వం) వారికిచ్చిన దానిలో వీరు పదోవంతు కూడా పొందలేదు. అయినా వారు నా సందేశహరులను తిరస్కరించారు. చూశారా! నా శిక్ష ఎంత ఘోరంగా ఉండిందో!
Verse 46
۞ قُلْ إِنَّمَآ أَعِظُكُم بِوَٰحِدَةٍ ۖ أَن تَقُومُوا۟ لِلَّهِ مَثْنَىٰ وَفُرَٰدَىٰ ثُمَّ تَتَفَكَّرُوا۟ ۚ مَا بِصَاحِبِكُم مِّن جِنَّةٍ ۚ إِنْ هُوَ إِلَّا نَذِيرٌ لَّكُم بَيْنَ يَدَىْ عَذَابٍ شَدِيدٍ
Transliteration qul innamā aʿiẓukum biwāḥidatin an taqūmū lillahi mathnā wafurādā thumma tatafakkarū mā biṣāḥibikum min jinnatin in huwa illā nadhīrun lakum bayna yaday ʿadhābin shadīdin
Telugu (ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "వాస్తవానికి, నేను మీకు ఒక విషయం బోధిస్తాను: 'మీరు అల్లాహ్ కొరకు ఇద్దరిద్దరిగా, ఒక్కొక్కరిగా నిలవండి. తరువాత బాగా ఆలోచించండి!' మీతోపాటు ఉన్న ఈ వ్యక్తికి (ప్రవక్తకు) పిచ్చి పట్టలేదు. అతను కేవలం, మీపై ఒక ఘోరశిక్ష రాకముందే, దానిని గురించి మిమ్మల్ని హెచ్చరించేవాడు మాత్రమే!"
Verse 47
قُلْ مَا سَأَلْتُكُم مِّنْ أَجْرٍ فَهُوَ لَكُمْ ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَى ٱللَّهِ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَىْءٍ شَهِيدٌ
Transliteration qul mā sa-altukum min ajrin fahuwa lakum in ajriya illā ʿalā l-lahi wahuwa ʿalā kulli shayin shahīdun
Telugu ఇలా అను: "నేను మిమ్మల్ని ఏదైనా ప్రతిఫలం అడిగి ఉన్నట్లైతే, దానిని మీరే ఉంచుకోండి. వాస్తవానికి, నా ప్రతిఫలం కేవలం అల్లాహ్ వద్దనే ఉంది. మరియు ఆయనే ప్రతి దానికి సాక్షి!"
Verse 48
قُلْ إِنَّ رَبِّى يَقْذِفُ بِٱلْحَقِّ عَلَّـٰمُ ٱلْغُيُوبِ
Transliteration qul inna rabbī yaqdhifu bil-ḥaqi ʿallāmu l-ghuyūbi
Telugu ఇలా అను: "నిశ్చయంగా, నా ప్రభువే సత్యాన్ని (అసత్యానికి విరుద్ధంగా) పంపేవాడు. ఆయనే అగోచర యథార్థాలన్నీ తెలిసి ఉన్నవాడు."
Verse 49
قُلْ جَآءَ ٱلْحَقُّ وَمَا يُبْدِئُ ٱلْبَـٰطِلُ وَمَا يُعِيدُ
Transliteration qul jāa l-ḥaqu wamā yub'di-u l-bāṭilu wamā yuʿīdu
Telugu ఇలా అను: "సత్యం వచ్చేసింది! మరియు అసత్యం (మిథ్యం దేనినీ ఆరంభం చేయజాలదు మరియు దానిని తిరిగి ఉనికిలోకి తేజాలదు."
Verse 50
قُلْ إِن ضَلَلْتُ فَإِنَّمَآ أَضِلُّ عَلَىٰ نَفْسِى ۖ وَإِنِ ٱهْتَدَيْتُ فَبِمَا يُوحِىٓ إِلَىَّ رَبِّىٓ ۚ إِنَّهُۥ سَمِيعٌ قَرِيبٌ
Transliteration qul in ḍalaltu fa-innamā aḍillu ʿalā nafsī wa-ini ih'tadaytu fabimā yūḥī ilayya rabbī innahu samīʿun qarībun
Telugu ఇలా అను: "ఒకవేళ నేను మార్గభ్రష్టుడనైతే! నిశ్చయంగా, అది నా స్వంత నాశనానికే! మరియు ఒకవేళ మార్గదర్శకత్వం పొందితే, అది కేవలం నా ప్రభువు నాపై అవతరింపజేసిన దివ్యజ్ఞానం (వహీ) వల్లనే! నిశ్చయంగా, ఆయన సర్వం వినేవాడు, దగ్గరలోనే ఉంటాడు (అతి సన్నిహితుడు)!"
Verse 51
وَلَوْ تَرَىٰٓ إِذْ فَزِعُوا۟ فَلَا فَوْتَ وَأُخِذُوا۟ مِن مَّكَانٍ قَرِيبٍ
Transliteration walaw tarā idh faziʿū falā fawta wa-ukhidhū min makānin qarībin
Telugu మరియు వారు భయకంపితులై ఉండటాన్ని, నీవు చూడగలిగితే (ఎంత బాగుండేది), కాని వారికి తప్పించుకోవటానికి వీలుండదు. మరియు వారు చాలా సమీపం నుండి పట్టుకోబడతారు.
Verse 52
وَقَالُوٓا۟ ءَامَنَّا بِهِۦ وَأَنَّىٰ لَهُمُ ٱلتَّنَاوُشُ مِن مَّكَانٍۭ بَعِيدٍ
Transliteration waqālū āmannā bihi wa-annā lahumu l-tanāwushu min makānin baʿīdin
Telugu అప్పుడు (పరలోకంలో) వారంటారు: "మేము (ఇప్పుడు) దానిని (సత్యాన్ని) విశ్వసించాము!" వాస్తవానికి వారు చాలా దూరం నుండి దానిని (విశ్వాసాన్ని) ఎలా పొందగలరు?
Verse 53
وَقَدْ كَفَرُوا۟ بِهِۦ مِن قَبْلُ ۖ وَيَقْذِفُونَ بِٱلْغَيْبِ مِن مَّكَانٍۭ بَعِيدٍ
Transliteration waqad kafarū bihi min qablu wayaqdhifūna bil-ghaybi min makānin baʿīdin
Telugu మరియు వాస్తవానికి వారు దానిని (సత్యాన్ని) ఇంతకు ముందు తిరస్కరించి ఉన్నారు. మరియు వారు తమకు అగోచరమైన విషయానికి దూరం నుండియే నిరసన చూపుతూ ఉండేవారు.
Verse 54
وَحِيلَ بَيْنَهُمْ وَبَيْنَ مَا يَشْتَهُونَ كَمَا فُعِلَ بِأَشْيَاعِهِم مِّن قَبْلُ ۚ إِنَّهُمْ كَانُوا۟ فِى شَكٍّ مُّرِيبٍۭ
Transliteration waḥīla baynahum wabayna mā yashtahūna kamā fuʿila bi-ashyāʿihim min qablu innahum kānū fī shakkin murībin
Telugu మరియు వారికి పూర్వం గడిచిన వారి విధంగానే, వారి మధ్య మరియు వారి కోరికల మధ్య అడ్డు వేయబడుతుంది. నిశ్చయంగా, వారు సంశయంలో పడవేసే గొప్ప సందేహంలో పడి ఉండేవారు.
Read Surah Saba in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Gujarati
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Telugu: the Qur’an in Telugu.
Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.