MyDugsiStart learning

Surah Al-Infitar in Telugu: translation and audio

Surah 82 · الإنفطار · The Cleaving · 19 verses

Surah Al-Infitar verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Al-Infitar word by word in English.

Verse 1

إِذَا ٱلسَّمَآءُ ٱنفَطَرَتْ

Transliteration idhā l-samāu infaṭarat

Telugu ఆకాశం చీల్చబడినప్పుడు!

Verse 2

وَإِذَا ٱلْكَوَاكِبُ ٱنتَثَرَتْ

Transliteration wa-idhā l-kawākibu intatharat

Telugu మరియు నక్షత్రాలు చెదిరి పోయినప్పుడు!

Verse 3

وَإِذَا ٱلْبِحَارُ فُجِّرَتْ

Transliteration wa-idhā l-biḥāru fujjirat

Telugu మరియు సముద్రాలు పొంగి పొరలి పోయినప్పుడు!

Verse 4

وَإِذَا ٱلْقُبُورُ بُعْثِرَتْ

Transliteration wa-idhā l-qubūru buʿ'thirat

Telugu మరియు సమాధులు పెళ్ళగింప (తెరువ) బడినప్పుడు!

Verse 5

عَلِمَتْ نَفْسٌ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ

Transliteration ʿalimat nafsun mā qaddamat wa-akharat

Telugu ప్రతి వ్యక్తికి తాను చేసి పంపుకున్నది మరియు వెనుక వదలి పెట్టింది అంతా తెలిసి పోతుంది.

Verse 6

يَـٰٓأَيُّهَا ٱلْإِنسَـٰنُ مَا غَرَّكَ بِرَبِّكَ ٱلْكَرِيمِ

Transliteration yāayyuhā l-insānu mā gharraka birabbika l-karīmi

Telugu ఓ మానవుడా! పరమదాత అయిన నీ ప్రభువును గురించి, ఏ విషయం నిన్ను ఏమరుపాటుకు గురి చేసింది?

Verse 7

ٱلَّذِى خَلَقَكَ فَسَوَّىٰكَ فَعَدَلَكَ

Transliteration alladhī khalaqaka fasawwāka faʿadalaka

Telugu ఆయనే నిన్ను సృష్టించాడు, తరువాత ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు మరియు నిన్ను తగిన ప్రమాణంలో రూపొందించాడు.

Verse 8

فِىٓ أَىِّ صُورَةٍ مَّا شَآءَ رَكَّبَكَ

Transliteration fī ayyi ṣūratin mā shāa rakkabaka

Telugu తాను తలచిన ఆకారంలో నిన్ను మలిచాడు.

Verse 9

كَلَّا بَلْ تُكَذِّبُونَ بِٱلدِّينِ

Transliteration kallā bal tukadhibūna bil-dīni

Telugu అలా కాదు! వాస్తవానికి మీరు (పరలోక) తీర్పును అబద్ధమని తిరస్కరిస్తున్నారు!

Verse 10

وَإِنَّ عَلَيْكُمْ لَحَـٰفِظِينَ

Transliteration wa-inna ʿalaykum laḥāfiẓīna

Telugu మరియు, నిశ్చయంగా! మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండేవారు (దేవదూతలు) ఉన్నారు.

Verse 11

كِرَامًا كَـٰتِبِينَ

Transliteration kirāman kātibīna

Telugu వారు, గౌరవనీయులైన లేఖకులు;

Verse 12

يَعْلَمُونَ مَا تَفْعَلُونَ

Transliteration yaʿlamūna mā tafʿalūna

Telugu మీరు చేసేదంతా తెలుసుకునేవారు!

Verse 13

إِنَّ ٱلْأَبْرَارَ لَفِى نَعِيمٍ

Transliteration inna l-abrāra lafī naʿīmin

Telugu నిశ్చయంగా పుణ్యాత్ములు సుఖసంతోషాలలో తేలియాడుతూ ఉంటారు.

Verse 14

وَإِنَّ ٱلْفُجَّارَ لَفِى جَحِيمٍ

Transliteration wa-inna l-fujāra lafī jaḥīmin

Telugu మరియు నిశ్చయంగా, దుష్టులు భగభగ మండే నరకాగ్నిలో ఉంటారు.

Verse 15

يَصْلَوْنَهَا يَوْمَ ٱلدِّينِ

Transliteration yaṣlawnahā yawma l-dīni

Telugu తీర్పు దినమున వారు అందులో ప్రవేశిస్తారు.

Verse 16

وَمَا هُمْ عَنْهَا بِغَآئِبِينَ

Transliteration wamā hum ʿanhā bighāibīna

Telugu మరియు వారు దాని నుండి ఎంత మాత్రం తప్పించుకోలేరు.

Verse 17

وَمَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلدِّينِ

Transliteration wamā adrāka mā yawmu l-dīni

Telugu మరియు ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది?

Verse 18

ثُمَّ مَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلدِّينِ

Transliteration thumma mā adrāka mā yawmu l-dīni

Telugu అవును మరి! ఆ తీర్పుదినం అంటే ఏమిటో నీకెలా తెలుస్తుంది?

Verse 19

يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌ لِّنَفْسٍ شَيْـًٔا ۖ وَٱلْأَمْرُ يَوْمَئِذٍ لِّلَّهِ

Transliteration yawma lā tamliku nafsun linafsin shayan wal-amru yawma-idhin lillahi

Telugu ఆ దినమున ఏ మానవునికి కూడా ఇతరునికి ఎలాంటి సహాయం చేసే అధికారం ఉండదు. మరియు ఆ రోజు నిర్ణయాధికారం కేవలం అల్లాహ్ కే ఉంటుంది.

Read Surah Al-Infitar in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.