MyDugsiStart learning

Surah Al-Anbya in Telugu: translation and audio

Surah 21 · الأنبياء · The Prophets · 112 verses

Surah Al-Anbya verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Al-Anbya word by word in English.

Verse 1

ٱقْتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمْ وَهُمْ فِى غَفْلَةٍ مُّعْرِضُونَ

Transliteration iq'taraba lilnnāsi ḥisābuhum wahum fī ghaflatin muʿ'riḍūna

Telugu మానవులతో లెక్క (తీసుకునే) సమయం సమీపించింది, అయినా వారు ఏమరుపాటులో పడి విముఖులై ఉన్నారు.

Verse 2

مَا يَأْتِيهِم مِّن ذِكْرٍ مِّن رَّبِّهِم مُّحْدَثٍ إِلَّا ٱسْتَمَعُوهُ وَهُمْ يَلْعَبُونَ

Transliteration mā yatīhim min dhik'rin min rabbihim muḥ'dathin illā is'tamaʿūhu wahum yalʿabūna

Telugu (కావున) వారి ప్రభువు తరఫు నుండి వారి వద్దకు ఏ క్రొత్త సందేశం వచ్చినా, వారు దానిని పరిహసించకుండా వినలేరు.

Verse 3

لَاهِيَةً قُلُوبُهُمْ ۗ وَأَسَرُّوا۟ ٱلنَّجْوَى ٱلَّذِينَ ظَلَمُوا۟ هَلْ هَـٰذَآ إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ ۖ أَفَتَأْتُونَ ٱلسِّحْرَ وَأَنتُمْ تُبْصِرُونَ

Transliteration lāhiyatan qulūbuhum wa-asarrū l-najwā alladhīna ẓalamū hal hādhā illā basharun mith'lukum afatatūna l-siḥ'ra wa-antum tub'ṣirūna

Telugu వారి హృదయాలు వినోద క్రీడలలో (అశ్రద్ధలో) మునిగి ఉన్నాయి. మరియు వారిలో దుర్మార్గానికి పాల్పడిన వారు రహస్య సంప్రదింపులు చేసుకొని (ఇలా అంటారు): "ఏమీ? ఇతను (ముహమ్మద్) మీలాంటి ఒక సాధారణ మానవుడు కాడా? అయినా మీరు చూస్తూ వుండి కూడా, ఇతని మంత్రజాలంలో చిక్కుకుపోయారా?"

Verse 4

قَالَ رَبِّى يَعْلَمُ ٱلْقَوْلَ فِى ٱلسَّمَآءِ وَٱلْأَرْضِ ۖ وَهُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ

Transliteration qāla rabbī yaʿlamu l-qawla fī l-samāi wal-arḍi wahuwa l-samīʿu l-ʿalīmu

Telugu (ముహమ్మద్) ఇలా అన్నాడు: "నా ప్రభువుకు ఆకాశంలోను మరియు భూమిలోను పలుకబడే ప్రతి మాట తెలుసు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

Verse 5

بَلْ قَالُوٓا۟ أَضْغَـٰثُ أَحْلَـٰمٍۭ بَلِ ٱفْتَرَىٰهُ بَلْ هُوَ شَاعِرٌ فَلْيَأْتِنَا بِـَٔايَةٍ كَمَآ أُرْسِلَ ٱلْأَوَّلُونَ

Transliteration bal qālū aḍghāthu aḥlāmin bali if'tarāhu bal huwa shāʿirun falyatinā biāyatin kamā ur'sila l-awalūna

Telugu అలా కాదు! వారన్నారు: "ఇవి (ఈ సందేశాలు) కేవలం పీడకలలు మాత్రమే; కాదు కాదు! ఇతడే దీనిని కల్పించాడు; అలా కాదు! ఇతడొక కవి! (ఇతడు ప్రవక్తయే అయితే) పూర్వం పంపబడిన సందేశహరుల మాదిరిగా, ఇతనిని కూడా మా కొరకు ఒక అద్భుత సూచన (ఆయత్) ను తెమ్మను!"

Verse 6

مَآ ءَامَنَتْ قَبْلَهُم مِّن قَرْيَةٍ أَهْلَكْنَـٰهَآ ۖ أَفَهُمْ يُؤْمِنُونَ

Transliteration mā āmanat qablahum min qaryatin ahlaknāhā afahum yu'minūna

Telugu మరియు వీరికి పూర్వం మేము నాశనం చేసిన ఏ పురవాసులు కూడా విశ్వసించి ఉండలేదు. అయితే! వీరు మాత్రం విశ్వసిస్తారా?

Verse 7

وَمَآ أَرْسَلْنَا قَبْلَكَ إِلَّا رِجَالًا نُّوحِىٓ إِلَيْهِمْ ۖ فَسْـَٔلُوٓا۟ أَهْلَ ٱلذِّكْرِ إِن كُنتُمْ لَا تَعْلَمُونَ

Transliteration wamā arsalnā qablaka illā rijālan nūḥī ilayhim fasalū ahla l-dhik'ri in kuntum lā taʿlamūna

Telugu మరియు నీకు పూర్వం కూడా (ఓ ముహమ్మద్!) మేము పురుషులను మాత్రమే ప్రవక్తలుగా చేసి పంపి, వారిపై దివ్యజ్ఞానాన్ని (వహీని) అవతరింపజేశాము. కావున మీకిది తెలియకుంటే హితబోధ గలవారిని (గ్రంథప్రజలను) అడగండి.

Verse 8

وَمَا جَعَلْنَـٰهُمْ جَسَدًا لَّا يَأْكُلُونَ ٱلطَّعَامَ وَمَا كَانُوا۟ خَـٰلِدِينَ

Transliteration wamā jaʿalnāhum jasadan lā yakulūna l-ṭaʿāma wamā kānū khālidīna

Telugu మరియు మేము వారికి (ఆ ప్రవక్తలకు) ఆహారం తినే అవసరం లేని శరీరాలను ఇవ్వలేదు. మరియు వారు చిరంజీవులు కూడా కాలేదు.

Verse 9

ثُمَّ صَدَقْنَـٰهُمُ ٱلْوَعْدَ فَأَنجَيْنَـٰهُمْ وَمَن نَّشَآءُ وَأَهْلَكْنَا ٱلْمُسْرِفِينَ

Transliteration thumma ṣadaqnāhumu l-waʿda fa-anjaynāhum waman nashāu wa-ahlaknā l-mus'rifīna

Telugu ఆ పిదప మేము వారికి చేసిన వాగ్దానాలు పూర్తి చేశాము. కావున వారిని మరియు మేము కోరిన వారిని రక్షించాము మరియు మితిమీరి ప్రవర్తించిన వారిని నాశనం చేశాము.

Verse 10

لَقَدْ أَنزَلْنَآ إِلَيْكُمْ كِتَـٰبًا فِيهِ ذِكْرُكُمْ ۖ أَفَلَا تَعْقِلُونَ

Transliteration laqad anzalnā ilaykum kitāban fīhi dhik'rukum afalā taʿqilūna

Telugu (ఓ మానవులారా!) వాస్తవంగా, మేము మీ కొరకు ఒక గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము. అందులో మీ కొరకు ఉపదేశముంది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా?

Verse 11

وَكَمْ قَصَمْنَا مِن قَرْيَةٍ كَانَتْ ظَالِمَةً وَأَنشَأْنَا بَعْدَهَا قَوْمًا ءَاخَرِينَ

Transliteration wakam qaṣamnā min qaryatin kānat ẓālimatan wa-anshanā baʿdahā qawman ākharīna

Telugu మరియు దుర్మార్గానికి పాల్పడిన ఎన్ని నగరాలను మేము నిర్మూలించలేదు! మరియు వారి తరువాత మరొక జాతి వారిని పుట్టించాము!

Verse 12

فَلَمَّآ أَحَسُّوا۟ بَأْسَنَآ إِذَا هُم مِّنْهَا يَرْكُضُونَ

Transliteration falammā aḥassū basanā idhā hum min'hā yarkuḍūna

Telugu మా శిక్ష (రావటం) తెలుసుకున్నప్పుడు వారు దాని నుండి పారిపోవటానికి ప్రయత్నంచేవారు.

Verse 13

لَا تَرْكُضُوا۟ وَٱرْجِعُوٓا۟ إِلَىٰ مَآ أُتْرِفْتُمْ فِيهِ وَمَسَـٰكِنِكُمْ لَعَلَّكُمْ تُسْـَٔلُونَ

Transliteration lā tarkuḍū wa-ir'jiʿū ilā mā ut'rif'tum fīhi wamasākinikum laʿallakum tus'alūna

Telugu (అప్పుడు వారితో ఇలా చెప్పబడింది): "పారిపోకండి! మరలిరండి - మీరు అనుభవిస్తున్న, మీ సుఖసంపదల వైపుకు మరియు మీ ఇళ్ళ వైపుకు - ఎందుకంటే! మిమ్మల్ని ప్రశ్నించవలసి ఉంది!"

Verse 14

قَالُوا۟ يَـٰوَيْلَنَآ إِنَّا كُنَّا ظَـٰلِمِينَ

Transliteration qālū yāwaylanā innā kunnā ẓālimīna

Telugu వారన్నారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! నిస్సందేహంగా మేము దుర్మార్గులము."

Verse 15

فَمَا زَالَت تِّلْكَ دَعْوَىٰهُمْ حَتَّىٰ جَعَلْنَـٰهُمْ حَصِيدًا خَـٰمِدِينَ

Transliteration famā zālat til'ka daʿwāhum ḥattā jaʿalnāhum ḥaṣīdan khāmidīna

Telugu ఆ పిదప మేము వారిని కోయబడిన పైరువలే, చల్లారిన అగ్ని వలే, చేసినంత వరకు వారి అరపు ఆగలేదు.

Verse 16

وَمَا خَلَقْنَا ٱلسَّمَآءَ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَـٰعِبِينَ

Transliteration wamā khalaqnā l-samāa wal-arḍa wamā baynahumā lāʿibīna

Telugu మరియు మేము ఈ ఆకాశాన్ని, భూమిని మరియు వాటి మధ్య ఉన్నదంతా కేవలం వినోదం కొరకు సృష్టించలేదు.

Verse 17

لَوْ أَرَدْنَآ أَن نَّتَّخِذَ لَهْوًا لَّٱتَّخَذْنَـٰهُ مِن لَّدُنَّآ إِن كُنَّا فَـٰعِلِينَ

Transliteration law aradnā an nattakhidha lahwan la-ittakhadhnāhu min ladunnā in kunnā fāʿilīna

Telugu ఒకవేళ మేము కాలక్షేపమే చేయదలచుకుంటే, మేము మా వద్ద ఉన్న దానితోనే చేసుకునే వారం; వాస్తవానికి, ఇలా చేయడమే, మా ఉద్దేశ్యమై ఉంటే!

Verse 18

بَلْ نَقْذِفُ بِٱلْحَقِّ عَلَى ٱلْبَـٰطِلِ فَيَدْمَغُهُۥ فَإِذَا هُوَ زَاهِقٌ ۚ وَلَكُمُ ٱلْوَيْلُ مِمَّا تَصِفُونَ

Transliteration bal naqdhifu bil-ḥaqi ʿalā l-bāṭili fayadmaghuhu fa-idhā huwa zāhiqun walakumu l-waylu mimmā taṣifūna

Telugu అలా కాదు! మేము సత్యాన్ని అసత్యంపై విసురుతాము. అది దాని తలను పగుల గొడుతుంది, అప్పుడు అది (అసత్యం) నశించి పోతుంది మరియు మీరు కల్పించే కల్పనలకు, మీకు వినాశం తప్పదు.

Verse 19

وَلَهُۥ مَن فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَمَنْ عِندَهُۥ لَا يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِهِۦ وَلَا يَسْتَحْسِرُونَ

Transliteration walahu man fī l-samāwāti wal-arḍi waman ʿindahu lā yastakbirūna ʿan ʿibādatihi walā yastaḥsirūna

Telugu మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. మరియు ఆయనకు దగ్గరగా ఉన్నవారు, ఆయనను ఆరాధిస్తూ ఉన్నామని గర్వించరు మరియు (ఆయన ఆరాధనలో) అలసట కూడా చూపరు.

Verse 20

يُسَبِّحُونَ ٱلَّيْلَ وَٱلنَّهَارَ لَا يَفْتُرُونَ

Transliteration yusabbiḥūna al-layla wal-nahāra lā yafturūna

Telugu వారు రేయింబవళ్ళు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు, వారు ఎన్నడూ బలహీనత చూపరు.

Verse 21

أَمِ ٱتَّخَذُوٓا۟ ءَالِهَةً مِّنَ ٱلْأَرْضِ هُمْ يُنشِرُونَ

Transliteration ami ittakhadhū ālihatan mina l-arḍi hum yunshirūna

Telugu ఏమీ? వారు భూలోకం నుండి ఆరాధ్య దైవాలను నియమించుకున్నారా? అవి (చనిపోయిన వారిని) మరల బ్రతికించి లేపగలవా?

Verse 22

لَوْ كَانَ فِيهِمَآ ءَالِهَةٌ إِلَّا ٱللَّهُ لَفَسَدَتَا ۚ فَسُبْحَـٰنَ ٱللَّهِ رَبِّ ٱلْعَرْشِ عَمَّا يَصِفُونَ

Transliteration law kāna fīhimā ālihatun illā l-lahu lafasadatā fasub'ḥāna l-lahi rabbi l-ʿarshi ʿammā yaṣifūna

Telugu వాటిలో (భూమ్యాకాశాలలో) అల్లాహ్ తప్ప ఇతర ఆరాధ్య దైవాలు ఉంటే అవి రెండూ నాశనమైపోయేవే కదా! కావున సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువైన అల్లాహ్! వారు కల్పించే కల్పనలకు అతీతుడు.

Verse 23

لَا يُسْـَٔلُ عَمَّا يَفْعَلُ وَهُمْ يُسْـَٔلُونَ

Transliteration lā yus'alu ʿammā yafʿalu wahum yus'alūna

Telugu తాను చేసే దానిని గురించి ఆయన (అల్లాహ్) ప్రశ్నించబడడు, కాని వారు ప్రశ్నించబడతారు.

Verse 24

أَمِ ٱتَّخَذُوا۟ مِن دُونِهِۦٓ ءَالِهَةً ۖ قُلْ هَاتُوا۟ بُرْهَـٰنَكُمْ ۖ هَـٰذَا ذِكْرُ مَن مَّعِىَ وَذِكْرُ مَن قَبْلِى ۗ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ ٱلْحَقَّ ۖ فَهُم مُّعْرِضُونَ

Transliteration ami ittakhadhū min dūnihi ālihatan qul hātū bur'hānakum hādhā dhik'ru man maʿiya wadhik'ru man qablī bal aktharuhum lā yaʿlamūna l-ḥaqa fahum muʿ'riḍūna

Telugu ఏమీ? వారు ఆయనను వదలి ఇతర ఆరాధ్య దైవాలను నియమించుకున్నారా? వారితో అను: "మీ నిదర్శనాన్ని తీసుకురండి." ఇది (ఈ ఖుర్ఆన్) నాతో పాటు ఉన్నవారికి హితబోధ; మరియు నా పూర్వీకులకు కూడా (ఇలాంటి) హితబోధలు (వచ్చాయి). కాని వారిలో చాలా మంది సత్యాన్ని గ్రహించలేదు, కావున వారు విముఖులై పోతున్నారు.

Verse 25

وَمَآ أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِىٓ إِلَيْهِ أَنَّهُۥ لَآ إِلَـٰهَ إِلَّآ أَنَا۠ فَٱعْبُدُونِ

Transliteration wamā arsalnā min qablika min rasūlin illā nūḥī ilayhi annahu lā ilāha illā anā fa-uʿ'budūni

Telugu మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా: "నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి." అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చిపంపాము.

Verse 26

وَقَالُوا۟ ٱتَّخَذَ ٱلرَّحْمَـٰنُ وَلَدًا ۗ سُبْحَـٰنَهُۥ ۚ بَلْ عِبَادٌ مُّكْرَمُونَ

Transliteration waqālū ittakhadha l-raḥmānu waladan sub'ḥānahu bal ʿibādun muk'ramūna

Telugu వారంటున్నారు: "అనంత కరుణామయునికి సంతానముంది!" అని. ఆయన సర్వలోపాలకు అతీతుడు, (అల్లాహ్ సంతానంగా పరిగణించబడే) వారు కేవలం గౌరవనీయులైన (ఆయన) దాసులు మాత్రమే!"

Verse 27

لَا يَسْبِقُونَهُۥ بِٱلْقَوْلِ وَهُم بِأَمْرِهِۦ يَعْمَلُونَ

Transliteration lā yasbiqūnahu bil-qawli wahum bi-amrihi yaʿmalūna

Telugu వారు ఆయన (అనుమతించక) ముందు మాట్లాడలేరు. మరియు వారు (దైవదూతలు) ఆయన ఆజ్ఞలనే పాటిస్తూ ఉంటారు.

Verse 28

يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يَشْفَعُونَ إِلَّا لِمَنِ ٱرْتَضَىٰ وَهُم مِّنْ خَشْيَتِهِۦ مُشْفِقُونَ

Transliteration yaʿlamu mā bayna aydīhim wamā khalfahum walā yashfaʿūna illā limani ir'taḍā wahum min khashyatihi mush'fiqūna

Telugu ఆయనకు, వారికి ప్రత్యక్షంగా (ముందు) ఉన్నదీ, అంతా తెలుసు. వారు, ఆయన సమ్మతించిన వారికి తప్ప ఇతరుల కొరకు సిఫారసు చేయలేరు. వారు, ఆయన భీతి వలన భయకంపితులై ఉంటారు.

Verse 29

۞ وَمَن يَقُلْ مِنْهُمْ إِنِّىٓ إِلَـٰهٌ مِّن دُونِهِۦ فَذَٰلِكَ نَجْزِيهِ جَهَنَّمَ ۚ كَذَٰلِكَ نَجْزِى ٱلظَّـٰلِمِينَ

Transliteration waman yaqul min'hum innī ilāhun min dūnihi fadhālika najzīhi jahannama kadhālika najzī l-ẓālimīna

Telugu వారిలో (దైవదూతలలో) ఎవరైనా: "నిశ్చయంగా, ఆయనే కాక, నేను కూడా ఒక ఆరాధ్య దైవాన్ని" అని అంటే, అలాంటి వానికి మేము నరకశిక్ష విధిస్తాము. మేము దుర్మార్గులను ఇదే విధంగా శిక్షిస్తాము.

Verse 30

أَوَلَمْ يَرَ ٱلَّذِينَ كَفَرُوٓا۟ أَنَّ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ كَانَتَا رَتْقًا فَفَتَقْنَـٰهُمَا ۖ وَجَعَلْنَا مِنَ ٱلْمَآءِ كُلَّ شَىْءٍ حَىٍّ ۖ أَفَلَا يُؤْمِنُونَ

Transliteration awalam yara alladhīna kafarū anna l-samāwāti wal-arḍa kānatā ratqan fafataqnāhumā wajaʿalnā mina l-māi kulla shayin ḥayyin afalā yu'minūna

Telugu ఏమి? ఈ సత్యతిరస్కారులకు తెలియదా (చూడలేదా)? వాస్తవానికి భూమ్యాకాశాలు (ఒకే ఒక్క భౌతికాంశంగా) కలుసుకొని ఉండేవని, అయితే మేమే వాటిని పగుల గొట్టి వేరు చేశామని? మరియు మేమే ప్రతి ప్రాణిని నీటి నుండి పుట్టించాము. ఇకనైన వారు విశ్వసించరా?

Verse 31

وَجَعَلْنَا فِى ٱلْأَرْضِ رَوَٰسِىَ أَن تَمِيدَ بِهِمْ وَجَعَلْنَا فِيهَا فِجَاجًا سُبُلًا لَّعَلَّهُمْ يَهْتَدُونَ

Transliteration wajaʿalnā fī l-arḍi rawāsiya an tamīda bihim wajaʿalnā fīhā fijājan subulan laʿallahum yahtadūna

Telugu మరియు భూమి వారితో పాటు కదలకుండా ఉండాలని మేము దానిలో స్థిరమైన పర్వతాలను (మేకుల వలే) నాటాము. మరియు వారు (ప్రజలు) మార్గదర్శకత్వం పొందాలని మేము దానిలో విశాలమైన మార్గాలను కూడా ఏర్పాటు చేశాము.

Verse 32

وَجَعَلْنَا ٱلسَّمَآءَ سَقْفًا مَّحْفُوظًا ۖ وَهُمْ عَنْ ءَايَـٰتِهَا مُعْرِضُونَ

Transliteration wajaʿalnā l-samāa saqfan maḥfūẓan wahum ʿan āyātihā muʿ'riḍūna

Telugu మరియు మేము ఆకాశాన్ని సురక్షితమైన కప్పుగా చేశాము. అయినా వారు అందులోని సూచనల (ఆయాత్ ల) నుండి విముఖులవుతున్నారు.

Verse 33

وَهُوَ ٱلَّذِى خَلَقَ ٱلَّيْلَ وَٱلنَّهَارَ وَٱلشَّمْسَ وَٱلْقَمَرَ ۖ كُلٌّ فِى فَلَكٍ يَسْبَحُونَ

Transliteration wahuwa alladhī khalaqa al-layla wal-nahāra wal-shamsa wal-qamara kullun fī falakin yasbaḥūna

Telugu మరియు రేయింబవళ్ళను మరియు సూర్యచంద్రులను సృష్టించినవాడు ఆయనే. అవి తమ తమ కక్ష్యలలో తేలియాడుతూ (తిరుగుతూ) ఉన్నాయి.

Verse 34

وَمَا جَعَلْنَا لِبَشَرٍ مِّن قَبْلِكَ ٱلْخُلْدَ ۖ أَفَإِي۟ن مِّتَّ فَهُمُ ٱلْخَـٰلِدُونَ

Transliteration wamā jaʿalnā libasharin min qablika l-khul'da afa-in mitta fahumu l-khālidūna

Telugu మరియు (ఓ ప్రవక్తా!) నీకు పూర్వం మేము ఏ మానవునికి కూడా శాశ్వత జీవితాన్ని ప్రసాదించలేదు. ఏమీ? ఒకవేళ నీవు మరణిస్తే! వారు మాత్రం శాశ్వతంగా సజీవులుగా (చిరంజీవులుగా) ఉంటారా?

Verse 35

كُلُّ نَفْسٍ ذَآئِقَةُ ٱلْمَوْتِ ۗ وَنَبْلُوكُم بِٱلشَّرِّ وَٱلْخَيْرِ فِتْنَةً ۖ وَإِلَيْنَا تُرْجَعُونَ

Transliteration kullu nafsin dhāiqatu l-mawti wanablūkum bil-shari wal-khayri fit'natan wa-ilaynā tur'jaʿūna

Telugu ప్రతి ప్రాణి మృత్యువును చవి చూస్తుంది. మరియు మేము మీ అందరినీ, మంచి మరియు చెడు స్థితులకు గురి చేసి, పరీక్షిస్తాము. మరియు మీరందరూ మా వైపునకే మరలింపబడతారు.

Verse 36

وَإِذَا رَءَاكَ ٱلَّذِينَ كَفَرُوٓا۟ إِن يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَـٰذَا ٱلَّذِى يَذْكُرُ ءَالِهَتَكُمْ وَهُم بِذِكْرِ ٱلرَّحْمَـٰنِ هُمْ كَـٰفِرُونَ

Transliteration wa-idhā raāka alladhīna kafarū in yattakhidhūnaka illā huzuwan ahādhā alladhī yadhkuru ālihatakum wahum bidhik'ri l-raḥmāni hum kāfirūna

Telugu మరియు ఈ సత్యతిరస్కారులు నిన్ను చూసినప్పుడల్లా మీతో పరహాసమాడే వైఖరిని మాత్రమే అవలంబిస్తూ (అంటారు): "ఏమీ? మీ ఆరాధ్యదైవాలను గురించి (నిర్లక్ష్యంగా) మాట్లాడే వ్యక్తి ఇతనేనా?" ఇక వారేమో అనంత కరుణామయుని ప్రస్తావన వచ్చినప్పుడు! వారే సత్యాన్ని తిరస్కరిస్తున్నారు.

Verse 37

خُلِقَ ٱلْإِنسَـٰنُ مِنْ عَجَلٍ ۚ سَأُو۟رِيكُمْ ءَايَـٰتِى فَلَا تَسْتَعْجِلُونِ

Transliteration khuliqa l-insānu min ʿajalin sa-urīkum āyātī falā tastaʿjilūni

Telugu మానవుడు ఆత్రగాడుగా (తొందర పాటు జీవిగా) పుట్టించబడ్డాడు. త్వరలోనే నేను మీకు నా సూచనలు చూపుతాను, కావున నన్ను తొందరపెట్టకండి.

Verse 38

وَيَقُولُونَ مَتَىٰ هَـٰذَا ٱلْوَعْدُ إِن كُنتُمْ صَـٰدِقِينَ

Transliteration wayaqūlūna matā hādhā l-waʿdu in kuntum ṣādiqīna

Telugu మరియు వారంటున్నారు: "మీరు సత్యవంతులే అయితే ఈ వాగ్దానం (బెదిరింపు) ఎప్పుడు నెరవేరనున్నది.

Verse 39

لَوْ يَعْلَمُ ٱلَّذِينَ كَفَرُوا۟ حِينَ لَا يَكُفُّونَ عَن وُجُوهِهِمُ ٱلنَّارَ وَلَا عَن ظُهُورِهِمْ وَلَا هُمْ يُنصَرُونَ

Transliteration law yaʿlamu alladhīna kafarū ḥīna lā yakuffūna ʿan wujūhihimu l-nāra walā ʿan ẓuhūrihim walā hum yunṣarūna

Telugu ఒకవేళ, ఈ సత్యతిరస్కారులు, ఆ సమయాన్ని గురించి తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది! అప్పుడు వారు ఆ అగ్ని నుండి తమ ముఖాలను గానీ, తమ వీపులను గానీ కాపాడుకోలేరు. మరియు వారికెలాంటి సహాయం కూడా లభించదు.

Verse 40

بَلْ تَأْتِيهِم بَغْتَةً فَتَبْهَتُهُمْ فَلَا يَسْتَطِيعُونَ رَدَّهَا وَلَا هُمْ يُنظَرُونَ

Transliteration bal tatīhim baghtatan fatabhatuhum falā yastaṭīʿūna raddahā walā hum yunẓarūna

Telugu వాస్తవంగా, అది వారిపై అకస్మాత్తుగా వచ్చిపడి వారిని కలవర పెడుతుంది. వారు దానిని నివారించనూ లేరు మరియు వారికెలాంటి వ్యవధి కూడా ఇవ్వబడదు.

Verse 41

وَلَقَدِ ٱسْتُهْزِئَ بِرُسُلٍ مِّن قَبْلِكَ فَحَاقَ بِٱلَّذِينَ سَخِرُوا۟ مِنْهُم مَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ

Transliteration walaqadi us'tuh'zi-a birusulin min qablika faḥāqa bi-alladhīna sakhirū min'hum mā kānū bihi yastahziūna

Telugu మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి, నీకు పూర్వం కూడా ప్రవక్తలు ఎగతాళి చేయబడ్డారు, కానీ ఆ వెక్కిరించిన వారిని, వారి ఎగతాళియే చుట్టుకున్నది.

Verse 42

قُلْ مَن يَكْلَؤُكُم بِٱلَّيْلِ وَٱلنَّهَارِ مِنَ ٱلرَّحْمَـٰنِ ۗ بَلْ هُمْ عَن ذِكْرِ رَبِّهِم مُّعْرِضُونَ

Transliteration qul man yakla-ukum bi-al-layli wal-nahāri mina l-raḥmāni bal hum ʿan dhik'ri rabbihim muʿ'riḍūna

Telugu ఇలా అను: "రేయింబవళ్ళు మిమ్మల్ని అనంత కరుణామయుని (శిక్ష) నుండి ఎవడు కాపాడగలడు?" అయినా వారు తమ ప్రభువు స్మరణ నుండి విముఖులవుతున్నారు.

Verse 43

أَمْ لَهُمْ ءَالِهَةٌ تَمْنَعُهُم مِّن دُونِنَا ۚ لَا يَسْتَطِيعُونَ نَصْرَ أَنفُسِهِمْ وَلَا هُم مِّنَّا يُصْحَبُونَ

Transliteration am lahum ālihatun tamnaʿuhum min dūninā lā yastaṭīʿūna naṣra anfusihim walā hum minnā yuṣ'ḥabūna

Telugu లేక! వారిని మా (శిక్ష) నుండి కాపాడటానికి మేము తప్ప వేరే దైవాలు ఎవరైనా ఉన్నారా? వారు (ఆ దైవాలు) తమకు తామే సహాయం చేసుకోలేరు మరియు వారు మా నుండి కాపాడుకోనూ లేరు.

Verse 44

بَلْ مَتَّعْنَا هَـٰٓؤُلَآءِ وَءَابَآءَهُمْ حَتَّىٰ طَالَ عَلَيْهِمُ ٱلْعُمُرُ ۗ أَفَلَا يَرَوْنَ أَنَّا نَأْتِى ٱلْأَرْضَ نَنقُصُهَا مِنْ أَطْرَافِهَآ ۚ أَفَهُمُ ٱلْغَـٰلِبُونَ

Transliteration bal mattaʿnā hāulāi waābāahum ḥattā ṭāla ʿalayhimu l-ʿumuru afalā yarawna annā natī l-arḍa nanquṣuhā min aṭrāfihā afahumu l-ghālibūna

Telugu అయినా! మేము వారికి మరియు వారి తండ్రితాతలకు చాలా కాలం వరకు సుఖసంతోషాలను ఇస్తూ వచ్చాము. అయితే! వారు చూడటం లేదా! వాస్తవానికి, మేము భూమిని , దాని అన్ని వైపుల నుండి తగ్గిస్తున్నామని? అయినా! వారు ఆధిక్యత వహించగలరని భావిస్తున్నారా?

Verse 45

قُلْ إِنَّمَآ أُنذِرُكُم بِٱلْوَحْىِ ۚ وَلَا يَسْمَعُ ٱلصُّمُّ ٱلدُّعَآءَ إِذَا مَا يُنذَرُونَ

Transliteration qul innamā undhirukum bil-waḥyi walā yasmaʿu l-ṣumu l-duʿāa idhā mā yundharūna

Telugu (ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "నేను కేవలం దివ్యజ్ఞానం (వహీ) ఆధారంగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను." కాని చెవిటి వారిని, ఎంత హెచ్చరించినా, వారు పిలుపును వినలేరు కదా!

Verse 46

وَلَئِن مَّسَّتْهُمْ نَفْحَةٌ مِّنْ عَذَابِ رَبِّكَ لَيَقُولُنَّ يَـٰوَيْلَنَآ إِنَّا كُنَّا ظَـٰلِمِينَ

Transliteration wala-in massathum nafḥatun min ʿadhābi rabbika layaqūlunna yāwaylanā innā kunnā ẓālimīna

Telugu మరియు ఒకవేళ నీ ప్రభువు శిక్ష, కొంత వారికి పడితే వారు: "అయ్యో! మా పాడుగాను! వాస్తవానికి, మేము దుర్మార్గులముగా ఉండేవారం." అని అంటారు.

Verse 47

وَنَضَعُ ٱلْمَوَٰزِينَ ٱلْقِسْطَ لِيَوْمِ ٱلْقِيَـٰمَةِ فَلَا تُظْلَمُ نَفْسٌ شَيْـًٔا ۖ وَإِن كَانَ مِثْقَالَ حَبَّةٍ مِّنْ خَرْدَلٍ أَتَيْنَا بِهَا ۗ وَكَفَىٰ بِنَا حَـٰسِبِينَ

Transliteration wanaḍaʿu l-mawāzīna l-qis'ṭa liyawmi l-qiyāmati falā tuẓ'lamu nafsun shayan wa-in kāna mith'qāla ḥabbatin min khardalin ataynā bihā wakafā binā ḥāsibīna

Telugu మరియు పునరుత్థాన దినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటు చేస్తాము. కావున ఏ వ్యక్తికి కూడా ఏ మాత్రం అన్యాయం జరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మ ఉన్నా మేము దానిని ముందుకు తెస్తాము. మరియు లెక్క చూడటానికి మేమే చాలు!

Verse 48

وَلَقَدْ ءَاتَيْنَا مُوسَىٰ وَهَـٰرُونَ ٱلْفُرْقَانَ وَضِيَآءً وَذِكْرًا لِّلْمُتَّقِينَ

Transliteration walaqad ātaynā mūsā wahārūna l-fur'qāna waḍiyāan wadhik'ran lil'muttaqīna

Telugu మరియు వాస్తవానికి మేము, మూసా మరియు హారూన్ లకు ఒక గీటురాయిని మరియు దివ్యజ్యోతిని (తౌరాత్ ను) ప్రసాదించి ఉన్నాము మరియు దైవభీతి గల వారికి ఒక హితబోధను.

Verse 49

ٱلَّذِينَ يَخْشَوْنَ رَبَّهُم بِٱلْغَيْبِ وَهُم مِّنَ ٱلسَّاعَةِ مُشْفِقُونَ

Transliteration alladhīna yakhshawna rabbahum bil-ghaybi wahum mina l-sāʿati mush'fiqūna

Telugu వారి కొరకు ఎవరైతే అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో! మరియు అంతిమ ఘడియను గురించి భీతిపరులై ఉంటారో!

Verse 50

وَهَـٰذَا ذِكْرٌ مُّبَارَكٌ أَنزَلْنَـٰهُ ۚ أَفَأَنتُمْ لَهُۥ مُنكِرُونَ

Transliteration wahādhā dhik'run mubārakun anzalnāhu afa-antum lahu munkirūna

Telugu మరియు ఈ శుభప్రదమైన జ్ఞాపిక (ఖుర్ఆన్ ను) మేము అవతరింపజేశాము. ఏమీ? మీరు దీనిని నిరాకరిస్తారా?

Verse 51

۞ وَلَقَدْ ءَاتَيْنَآ إِبْرَٰهِيمَ رُشْدَهُۥ مِن قَبْلُ وَكُنَّا بِهِۦ عَـٰلِمِينَ

Transliteration walaqad ātaynā ib'rāhīma rush'dahu min qablu wakunnā bihi ʿālimīna

Telugu మరియు వాస్తవానికి, మేము ఇంతకు పూర్వం ఇబ్రాహీమ్ కు కూడా మార్గదర్శకత్వం చేశాము మరియు అతనిని గురించి మాకు బాగా తెలుసు.

Verse 52

إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِۦ مَا هَـٰذِهِ ٱلتَّمَاثِيلُ ٱلَّتِىٓ أَنتُمْ لَهَا عَـٰكِفُونَ

Transliteration idh qāla li-abīhi waqawmihi mā hādhihi l-tamāthīlu allatī antum lahā ʿākifūna

Telugu అతను తన తండ్రి మరియు తన జాతి ప్రజలతో ఇలా అన్నప్పుడు: "మీరు భక్తితో ఆరాధిస్తున్న ఈ విగ్రహాలు ఏమిటి?"

Verse 53

قَالُوا۟ وَجَدْنَآ ءَابَآءَنَا لَهَا عَـٰبِدِينَ

Transliteration qālū wajadnā ābāanā lahā ʿābidīna

Telugu వారన్నారు: "మేము మా తండ్రి తాతలను, వీటినే ఆరాధిస్తూ ఉండగా చూశాము."

Verse 54

قَالَ لَقَدْ كُنتُمْ أَنتُمْ وَءَابَآؤُكُمْ فِى ضَلَـٰلٍ مُّبِينٍ

Transliteration qāla laqad kuntum antum waābāukum fī ḍalālin mubīnin

Telugu (ఇబ్రాహీమ్) అన్నాడు: "వాస్తవానికి, మీరు మరియు మీ తండ్రితాతలు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు."

Verse 55

قَالُوٓا۟ أَجِئْتَنَا بِٱلْحَقِّ أَمْ أَنتَ مِنَ ٱللَّـٰعِبِينَ

Transliteration qālū aji'tanā bil-ḥaqi am anta mina l-lāʿibīna

Telugu వారన్నారు: "ఏమీ? నీవు మా వద్దకు ఏదైనా సత్యాన్ని తెచ్చావా? లేదా నీవు మాతో పరిహాసమాడుతున్నావా?"

Verse 56

قَالَ بَل رَّبُّكُمْ رَبُّ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ٱلَّذِى فَطَرَهُنَّ وَأَنَا۠ عَلَىٰ ذَٰلِكُم مِّنَ ٱلشَّـٰهِدِينَ

Transliteration qāla bal rabbukum rabbu l-samāwāti wal-arḍi alladhī faṭarahunna wa-anā ʿalā dhālikum mina l-shāhidīna

Telugu (ఇబ్రాహీమ్) అన్నాడు: "అలా కాదు! భూమ్యాకాశాల ప్రభువే మీ ప్రభువు! ఆయనే వాటన్నింటినీ సృజించాడు. మరియు నేను ఈ విషయం గురించి మీ ముందు సాక్ష్యమిస్తున్నాను.

Verse 57

وَتَٱللَّهِ لَأَكِيدَنَّ أَصْنَـٰمَكُم بَعْدَ أَن تُوَلُّوا۟ مُدْبِرِينَ

Transliteration watal-lahi la-akīdanna aṣnāmakum baʿda an tuwallū mud'birīna

Telugu "మరియు నేను అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను. మీరు వెళ్ళిపోయిన తరువాత మీ విగ్రహాలకు విరుద్ధంగా తప్పక యుక్తి పన్నుతాను."

Verse 58

فَجَعَلَهُمْ جُذَٰذًا إِلَّا كَبِيرًا لَّهُمْ لَعَلَّهُمْ إِلَيْهِ يَرْجِعُونَ

Transliteration fajaʿalahum judhādhan illā kabīran lahum laʿallahum ilayhi yarjiʿūna

Telugu తరువాత అతను ఒక పెద్ద దానిని (విగ్రహాన్ని) తప్ప అన్నింటినీ ముక్కలు ముక్కలుగా చేశాడు; బహుశా వారు దాని వైపునకు మరలుతారని!

Verse 59

قَالُوا۟ مَن فَعَلَ هَـٰذَا بِـَٔالِهَتِنَآ إِنَّهُۥ لَمِنَ ٱلظَّـٰلِمِينَ

Transliteration qālū man faʿala hādhā biālihatinā innahu lamina l-ẓālimīna

Telugu వారన్నారు: "మా ఆరాధ్య దైవాలతో ఈ విధంగా ప్రవర్తించినవాడెవడు? నిశ్చయంగా వాడు దుర్మార్గుడు."

Verse 60

قَالُوا۟ سَمِعْنَا فَتًى يَذْكُرُهُمْ يُقَالُ لَهُۥٓ إِبْرَٰهِيمُ

Transliteration qālū samiʿ'nā fatan yadhkuruhum yuqālu lahu ib'rāhīmu

Telugu (కొందరు) ఇలా అన్నారు; "ఇబ్రాహీమ్ అనే యువకుడు, వీటిని గురించి ప్రస్తావిస్తూ ఉండగా మేము విన్నాము."

Verse 61

قَالُوا۟ فَأْتُوا۟ بِهِۦ عَلَىٰٓ أَعْيُنِ ٱلنَّاسِ لَعَلَّهُمْ يَشْهَدُونَ

Transliteration qālū fatū bihi ʿalā aʿyuni l-nāsi laʿallahum yashhadūna

Telugu (ఇతరులు) అన్నారు: "అయితే, అతనిని ప్రజల కళ్ళ ముందుకు తీసుకురండి; బహుశా వారు సాక్ష్యమిస్తారేమో!"

Verse 62

قَالُوٓا۟ ءَأَنتَ فَعَلْتَ هَـٰذَا بِـَٔالِهَتِنَا يَـٰٓإِبْرَٰهِيمُ

Transliteration qālū a-anta faʿalta hādhā biālihatinā yāib'rāhīmu

Telugu (అతనిని తెచ్చిన తరువాత) వారు అడిగారు: "ఓ ఇబ్రాహీమ్! ఏమీ? నీవేనా మా ఆరాధ్య దైవాలతో ఇలా వ్యవహరించిన వాడవు?"

Verse 63

قَالَ بَلْ فَعَلَهُۥ كَبِيرُهُمْ هَـٰذَا فَسْـَٔلُوهُمْ إِن كَانُوا۟ يَنطِقُونَ

Transliteration qāla bal faʿalahu kabīruhum hādhā fasalūhum in kānū yanṭiqūna

Telugu (ఇబ్రాహీమ్) జవాబిచ్చాడు: "కాదు కాదు! వారిలోని ఈ పెద్దవాడే ఇలా చేశాడు! అవి మాట్లాడగలిగితే వాటినే అడగండి!"

Verse 64

فَرَجَعُوٓا۟ إِلَىٰٓ أَنفُسِهِمْ فَقَالُوٓا۟ إِنَّكُمْ أَنتُمُ ٱلظَّـٰلِمُونَ

Transliteration farajaʿū ilā anfusihim faqālū innakum antumu l-ẓālimūna

Telugu వారు తమలో తాము సమాలోచనలు చేసుకుంటూ ఇలా అనుకున్నారు: "నిశ్చయంగా స్వయంగా మీరే దుర్మార్గులు!"

Verse 65

ثُمَّ نُكِسُوا۟ عَلَىٰ رُءُوسِهِمْ لَقَدْ عَلِمْتَ مَا هَـٰٓؤُلَآءِ يَنطِقُونَ

Transliteration thumma nukisū ʿalā ruūsihim laqad ʿalim'ta mā hāulāi yanṭiqūna

Telugu కాని, తరువాత వారి బుద్ధి తలక్రిందులై వారు ఇలా అన్నారు: "వాస్తవానికి, నీకు తెలుసు కదా, ఇవి మాట్లాడలేవని!"

Verse 66

قَالَ أَفَتَعْبُدُونَ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَنفَعُكُمْ شَيْـًٔا وَلَا يَضُرُّكُمْ

Transliteration qāla afataʿbudūna min dūni l-lahi mā lā yanfaʿukum shayan walā yaḍurrukum

Telugu (ఇబ్రాహీమ్) ఇలా అన్నాడు: "అలా అయితే! మీరు అల్లాహ్ ను వదలి, మీకెలాంటి లాభం కానీ నష్టం కానీ చేకూర్చలేని వాటిని ఆరాధిస్తారా?

Verse 67

أُفٍّ لَّكُمْ وَلِمَا تَعْبُدُونَ مِن دُونِ ٱللَّهِ ۖ أَفَلَا تَعْقِلُونَ

Transliteration uffin lakum walimā taʿbudūna min dūni l-lahi afalā taʿqilūna

Telugu "ధిక్కారం! మీపై మరియు అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే వాటిపై (దైవాలపై)! ఏమీ? మీరు ఏ మాత్రమూ తెలివిని ఉపయోగించరా?"

Verse 68

قَالُوا۟ حَرِّقُوهُ وَٱنصُرُوٓا۟ ءَالِهَتَكُمْ إِن كُنتُمْ فَـٰعِلِينَ

Transliteration qālū ḥarriqūhu wa-unṣurū ālihatakum in kuntum fāʿilīna

Telugu వారన్నారు: "మీరేమైనా చేయ దలుచుకుంటే! ఇతనిని కాల్చి వేయండి, మీ ఆరాధ్యదైవాలకు తోడ్పడండి."

Verse 69

قُلْنَا يَـٰنَارُ كُونِى بَرْدًا وَسَلَـٰمًا عَلَىٰٓ إِبْرَٰهِيمَ

Transliteration qul'nā yānāru kūnī bardan wasalāman ʿalā ib'rāhīma

Telugu మేము (అల్లాహ్) ఆజ్ఞాపించాము: "ఓ అగ్నీ! నీవు ఇబ్రాహీమ్ కొరకు చల్లగా సురక్షితంగా అయిపో!"

Verse 70

وَأَرَادُوا۟ بِهِۦ كَيْدًا فَجَعَلْنَـٰهُمُ ٱلْأَخْسَرِينَ

Transliteration wa-arādū bihi kaydan fajaʿalnāhumu l-akhsarīna

Telugu మరియు వారు ఇబ్రాహీమ్ కు కీడు తల పెట్టగోరారు, కాని మేము వారినే నష్టంలో పడవేశాము.

Verse 71

وَنَجَّيْنَـٰهُ وَلُوطًا إِلَى ٱلْأَرْضِ ٱلَّتِى بَـٰرَكْنَا فِيهَا لِلْعَـٰلَمِينَ

Transliteration wanajjaynāhu walūṭan ilā l-arḍi allatī bāraknā fīhā lil'ʿālamīna

Telugu మరియు మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) మరియు లూత్ ను రక్షించి, సర్వజనుల కొరకు శుభప్రదం చేసిన భూమి వైపునకు పంపాము.

Verse 72

وَوَهَبْنَا لَهُۥٓ إِسْحَـٰقَ وَيَعْقُوبَ نَافِلَةً ۖ وَكُلًّا جَعَلْنَا صَـٰلِحِينَ

Transliteration wawahabnā lahu is'ḥāqa wayaʿqūba nāfilatan wakullan jaʿalnā ṣāliḥīna

Telugu మరియు అతనికి (ఇబ్రాహీమ్) కు ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను అదనపు కానుకగా ప్రసాదించాము. మరియు మేము ప్రతి ఒక్కరినీ సద్వర్తనులుగా చేశాము.

Verse 73

وَجَعَلْنَـٰهُمْ أَئِمَّةً يَهْدُونَ بِأَمْرِنَا وَأَوْحَيْنَآ إِلَيْهِمْ فِعْلَ ٱلْخَيْرَٰتِ وَإِقَامَ ٱلصَّلَوٰةِ وَإِيتَآءَ ٱلزَّكَوٰةِ ۖ وَكَانُوا۟ لَنَا عَـٰبِدِينَ

Transliteration wajaʿalnāhum a-immatan yahdūna bi-amrinā wa-awḥaynā ilayhim fiʿ'la l-khayrāti wa-iqāma l-ṣalati waītāa l-zakati wakānū lanā ʿābidīna

Telugu మరియు మేము వారిని నాయకులుగా చేశాము. వారు ప్రజలకు మా ఆజ్ఞ ప్రకారం మార్గదర్శకత్వం చేస్తూ ఉండేవారు. మరియు మేము వారిపై - సత్కార్యాలు చేయాలని, నమాజ్ స్థాపించాలని, విధిదానం (జకాత్) ఇవ్వాలని - దివ్యజ్ఞానం (వహీ) పంపాము. మరియు వారు (కేవలం) మమ్మల్నే ఆరాధించేవారు.

Verse 74

وَلُوطًا ءَاتَيْنَـٰهُ حُكْمًا وَعِلْمًا وَنَجَّيْنَـٰهُ مِنَ ٱلْقَرْيَةِ ٱلَّتِى كَانَت تَّعْمَلُ ٱلْخَبَـٰٓئِثَ ۗ إِنَّهُمْ كَانُوا۟ قَوْمَ سَوْءٍ فَـٰسِقِينَ

Transliteration walūṭan ātaynāhu ḥuk'man waʿil'man wanajjaynāhu mina l-qaryati allatī kānat taʿmalu l-khabāitha innahum kānū qawma sawin fāsiqīna

Telugu మరియు (జ్ఞాపకం చేసుకోండి) మేము లూత్ కు వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము మరియు మేము అతనిని అసహ్యకరమైన పనులు చేస్తున్న వారి నగరం నుండి కాపాడాము. నిశ్చయంగా వారు నీచులు, అవిధేయులు (ఫాసిఖీన్) అయిన ప్రజలు.

Verse 75

وَأَدْخَلْنَـٰهُ فِى رَحْمَتِنَآ ۖ إِنَّهُۥ مِنَ ٱلصَّـٰلِحِينَ

Transliteration wa-adkhalnāhu fī raḥmatinā innahu mina l-ṣāliḥīna

Telugu మరియు మేము అతనిని మా కారుణ్యంలోకి ప్రవేశింప జేసుకున్నాము. నిశ్చయంగా, అతను సద్వర్తనులలోని వాడు.

Verse 76

وَنُوحًا إِذْ نَادَىٰ مِن قَبْلُ فَٱسْتَجَبْنَا لَهُۥ فَنَجَّيْنَـٰهُ وَأَهْلَهُۥ مِنَ ٱلْكَرْبِ ٱلْعَظِيمِ

Transliteration wanūḥan idh nādā min qablu fa-is'tajabnā lahu fanajjaynāhu wa-ahlahu mina l-karbi l-ʿaẓīmi

Telugu మరియు (జ్ఞాపకం చేసుకోండి) నూహ్ అంతకు ముందు, మమ్మల్ని వేడుకొనగా మేము అతని (ప్రార్థనను) అంగీకరించాము. కావున అతనికి మరియు అతనితో బాటు ఉన్నవారికి ఆ మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము.

Verse 77

وَنَصَرْنَـٰهُ مِنَ ٱلْقَوْمِ ٱلَّذِينَ كَذَّبُوا۟ بِـَٔايَـٰتِنَآ ۚ إِنَّهُمْ كَانُوا۟ قَوْمَ سَوْءٍ فَأَغْرَقْنَـٰهُمْ أَجْمَعِينَ

Transliteration wanaṣarnāhu mina l-qawmi alladhīna kadhabū biāyātinā innahum kānū qawma sawin fa-aghraqnāhum ajmaʿīna

Telugu మరియు మా సూచనలను అబద్ధాలని నిరాకరించిన వారికి వ్యతిరేకంగా మేము అతనికి సహాయం చేశాము. నిశ్చయంగా, వారు దుష్ట ప్రజలు. కావున వారినందరినీ ముంచి వేశాము.

Verse 78

وَدَاوُۥدَ وَسُلَيْمَـٰنَ إِذْ يَحْكُمَانِ فِى ٱلْحَرْثِ إِذْ نَفَشَتْ فِيهِ غَنَمُ ٱلْقَوْمِ وَكُنَّا لِحُكْمِهِمْ شَـٰهِدِينَ

Transliteration wadāwūda wasulaymāna idh yaḥkumāni fī l-ḥarthi idh nafashat fīhi ghanamu l-qawmi wakunnā liḥuk'mihim shāhidīna

Telugu మరియు దావూద్ మరియు సులైమాన్ ఇద్దరు ఒక చేను గురించి తీర్పు చేసిన విషయం (జ్ఞాపకం చేసుకోండి): "ఒక తెగవారి మేకలు (మరొక తెగవారి చేను) మేశాయి. అప్పుడు వాస్తవానికి, మేము వారి తీర్పునకు సాక్షులుగా ఉన్నాము.

Verse 79

فَفَهَّمْنَـٰهَا سُلَيْمَـٰنَ ۚ وَكُلًّا ءَاتَيْنَا حُكْمًا وَعِلْمًا ۚ وَسَخَّرْنَا مَعَ دَاوُۥدَ ٱلْجِبَالَ يُسَبِّحْنَ وَٱلطَّيْرَ ۚ وَكُنَّا فَـٰعِلِينَ

Transliteration fafahhamnāhā sulaymāna wakullan ātaynā ḥuk'man waʿil'man wasakharnā maʿa dāwūda l-jibāla yusabbiḥ'na wal-ṭayra wakunnā fāʿilīna

Telugu అసలు సులైమాన్ కు మేము (వాస్తవ విషయం) తెలియజేశాము. మరియు వారిద్దరికీ మేము వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము. మరియు మేము పర్వతాలను మరియు పక్షులను దావూద్ తో బాటు మా స్తోత్రం చేయటానికి లోబరిచాము. మరియు నిశ్చయంగా, మేమే (ప్రతిదీ) చేయగలవారము.

Verse 80

وَعَلَّمْنَـٰهُ صَنْعَةَ لَبُوسٍ لَّكُمْ لِتُحْصِنَكُم مِّنۢ بَأْسِكُمْ ۖ فَهَلْ أَنتُمْ شَـٰكِرُونَ

Transliteration waʿallamnāhu ṣanʿata labūsin lakum lituḥ'ṣinakum min basikum fahal antum shākirūna

Telugu మరియు మేము అతనికి, మీ యుద్ధాలలో, మీ రక్షణ కొరకు కవచాలు తయారు చేయడం నేర్పాము. అయితే! (ఇప్పుడైనా) మీరు కృతజ్ఞులవుతారా?

Verse 81

وَلِسُلَيْمَـٰنَ ٱلرِّيحَ عَاصِفَةً تَجْرِى بِأَمْرِهِۦٓ إِلَى ٱلْأَرْضِ ٱلَّتِى بَـٰرَكْنَا فِيهَا ۚ وَكُنَّا بِكُلِّ شَىْءٍ عَـٰلِمِينَ

Transliteration walisulaymāna l-rīḥa ʿāṣifatan tajrī bi-amrihi ilā l-arḍi allatī bāraknā fīhā wakunnā bikulli shayin ʿālimīna

Telugu మరియు మేము తీవ్రంగా వీచే గాలిని సులైమాన్ కు (వశపరిచాము). అది అతని ఆజ్ఞతో మేము శుభాలను ప్రసాదించిన (అనుగ్రహించిన) భూమి మీద వీచేది. మరియు నిశ్చయంగా, మాకు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.

Verse 82

وَمِنَ ٱلشَّيَـٰطِينِ مَن يَغُوصُونَ لَهُۥ وَيَعْمَلُونَ عَمَلًا دُونَ ذَٰلِكَ ۖ وَكُنَّا لَهُمْ حَـٰفِظِينَ

Transliteration wamina l-shayāṭīni man yaghūṣūna lahu wayaʿmalūna ʿamalan dūna dhālika wakunnā lahum ḥāfiẓīna

Telugu మరియు షైతానులలో కొందరు అతని (సులైమాన్) కొరకు (సముద్రంలో) మునిగే వారు మరియు ఇతర పనులు కూడా చేసేవారు. మరియు నిశ్చయంగా, మేమే వారిని కనిపెట్టుకొని ఉండేవారము.

Verse 83

۞ وَأَيُّوبَ إِذْ نَادَىٰ رَبَّهُۥٓ أَنِّى مَسَّنِىَ ٱلضُّرُّ وَأَنتَ أَرْحَمُ ٱلرَّٰحِمِينَ

Transliteration wa-ayyūba idh nādā rabbahu annī massaniya l-ḍuru wa-anta arḥamu l-rāḥimīna

Telugu మరియు (జ్ఞాపకం చేసుకోండి) అయ్యూబ్ తన ప్రభువును వేడుకున్నప్పుడు (ఇలా అన్నాడు): "నిశ్చయంగా, నన్ను బాధ (వ్యాధి) చుట్టుకున్నది. మరియు నీవే కరుణామయులలో కెల్లా గొప్ప కరుణామయుడవు.!"

Verse 84

فَٱسْتَجَبْنَا لَهُۥ فَكَشَفْنَا مَا بِهِۦ مِن ضُرٍّ ۖ وَءَاتَيْنَـٰهُ أَهْلَهُۥ وَمِثْلَهُم مَّعَهُمْ رَحْمَةً مِّنْ عِندِنَا وَذِكْرَىٰ لِلْعَـٰبِدِينَ

Transliteration fa-is'tajabnā lahu fakashafnā mā bihi min ḍurrin waātaynāhu ahlahu wamith'lahum maʿahum raḥmatan min ʿindinā wadhik'rā lil'ʿābidīna

Telugu అప్పుడు మేము అతని (ప్రార్థనలు) అంగీకరించి, అతని బాధ నుండి అతనికి విముక్తి కలిగించాము. మరియు అతనికి, అతని కుటుంబ వాసులను తిరిగి ఇవ్వటమే గాక వారితో బాటు ఇంకా అంతమందిని ఎక్కువగా ఇచ్చి, దానిని మా నుండి ఒక ప్రత్యేక కరుణగా మరియు మమ్మల్ని ఆరాధించే వారికి ఒక జ్ఞాపికగా చేశాము.

Verse 85

وَإِسْمَـٰعِيلَ وَإِدْرِيسَ وَذَا ٱلْكِفْلِ ۖ كُلٌّ مِّنَ ٱلصَّـٰبِرِينَ

Transliteration wa-is'māʿīla wa-id'rīsa wadhā l-kif'li kullun mina l-ṣābirīna

Telugu మరియు (జ్ఞాపకం చేసుకోండి), ఇస్మాయీల్, ఇద్రీస్ మరియు జుల్కిప్ల్, వీరందరు కూడా సహన శీలురైన వారే!

Verse 86

وَأَدْخَلْنَـٰهُمْ فِى رَحْمَتِنَآ ۖ إِنَّهُم مِّنَ ٱلصَّـٰلِحِينَ

Transliteration wa-adkhalnāhum fī raḥmatinā innahum mina l-ṣāliḥīna

Telugu మరియు మేము వారందరినీ మా కారుణ్యంలోకి తీసుకున్నాము. నిశ్చయంగా, వారందరూ సద్వర్తనులు.

Verse 87

وَذَا ٱلنُّونِ إِذ ذَّهَبَ مُغَـٰضِبًا فَظَنَّ أَن لَّن نَّقْدِرَ عَلَيْهِ فَنَادَىٰ فِى ٱلظُّلُمَـٰتِ أَن لَّآ إِلَـٰهَ إِلَّآ أَنتَ سُبْحَـٰنَكَ إِنِّى كُنتُ مِنَ ٱلظَّـٰلِمِينَ

Transliteration wadhā l-nūni idh dhahaba mughāḍiban faẓanna an lan naqdira ʿalayhi fanādā fī l-ẓulumāti an lā ilāha illā anta sub'ḥānaka innī kuntu mina l-ẓālimīna

Telugu మరియు (జ్ఞాపకం చేసుకోండి) చేపవాడు (యూసుస్) - ఉద్రేకంతో వెళ్ళిపోతూ - మేము అతనిని పట్టుకోలేమని అనుకున్నాడు! కాని ఆ తరువాత, అంధకారాలలో చిక్కుకొని పోయినప్పుడు, ఇలా మొరపెట్టుకున్నాడు: "వాస్తవానికి నీవు (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, నీవు సర్వలోపాలకు అతీతుడవు, నిశ్చయంగా, నేనే అపరాధులలోని వాడను."

Verse 88

فَٱسْتَجَبْنَا لَهُۥ وَنَجَّيْنَـٰهُ مِنَ ٱلْغَمِّ ۚ وَكَذَٰلِكَ نُـۨجِى ٱلْمُؤْمِنِينَ

Transliteration fa-is'tajabnā lahu wanajjaynāhu mina l-ghami wakadhālika nunjī l-mu'minīna

Telugu అప్పుడు మేము అతని (ప్రార్థనను) అంగీకరించి, అతనిని ఆ దుఃఖము నుండి విముక్తి కలిగించాము మరియు విశ్వసించిన వారిని మేము ఇదే విధంగా కాపాడుతూ ఉంటాము.

Verse 89

وَزَكَرِيَّآ إِذْ نَادَىٰ رَبَّهُۥ رَبِّ لَا تَذَرْنِى فَرْدًا وَأَنتَ خَيْرُ ٱلْوَٰرِثِينَ

Transliteration wazakariyyā idh nādā rabbahu rabbi lā tadharnī fardan wa-anta khayru l-wārithīna

Telugu మరియు (జ్ఞాపకం చేసుకోండి), జకరియ్యా తన ప్రభువును వేడుకున్నప్పుడు ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నన్ను ఒంటరివానిగా (సంతానహీనునిగా) వదలకు. నీవే సర్వశ్రేష్ఠమైన వారసుడవు!"

Verse 90

فَٱسْتَجَبْنَا لَهُۥ وَوَهَبْنَا لَهُۥ يَحْيَىٰ وَأَصْلَحْنَا لَهُۥ زَوْجَهُۥٓ ۚ إِنَّهُمْ كَانُوا۟ يُسَـٰرِعُونَ فِى ٱلْخَيْرَٰتِ وَيَدْعُونَنَا رَغَبًا وَرَهَبًا ۖ وَكَانُوا۟ لَنَا خَـٰشِعِينَ

Transliteration fa-is'tajabnā lahu wawahabnā lahu yaḥyā wa-aṣlaḥnā lahu zawjahu innahum kānū yusāriʿūna fī l-khayrāti wayadʿūnanā raghaban warahaban wakānū lanā khāshiʿīna

Telugu అప్పుడు మేము అతని ప్రార్థనను అంగీకరించి అతని కొరకు అతని భార్యను (సంతానానికి) యోగ్యురాలుగా చేసి, అతనికి యహ్యాను ప్రసాదించాము. వాస్తవానికి వారు సత్కార్యాలు చేయటానికి పోటీ పడే వారు. మరియు శ్రద్ధతో మరియు భీతితో మమ్మల్ని ఆరాధించేవారు. మరియు మా సమక్షంలో వినమ్రులై ఉండేవారు.

Verse 91

وَٱلَّتِىٓ أَحْصَنَتْ فَرْجَهَا فَنَفَخْنَا فِيهَا مِن رُّوحِنَا وَجَعَلْنَـٰهَا وَٱبْنَهَآ ءَايَةً لِّلْعَـٰلَمِينَ

Transliteration wa-allatī aḥṣanat farjahā fanafakhnā fīhā min rūḥinā wajaʿalnāhā wa-ib'nahā āyatan lil'ʿālamīna

Telugu మరియు (జ్ఞాపకం చేసుకోండి), తన శీలాన్ని కాపాడుకున్న ఆ మహిళ (మర్యమ్) లో మా నుండి ప్రాణం (రూహ్) ఊది, ఆమెను మరియు ఆమె కొడుకును, సర్వలోకాల వారికి ఒక సూచనగా చేశాము.

Verse 92

إِنَّ هَـٰذِهِۦٓ أُمَّتُكُمْ أُمَّةً وَٰحِدَةً وَأَنَا۠ رَبُّكُمْ فَٱعْبُدُونِ

Transliteration inna hādhihi ummatukum ummatan wāḥidatan wa-anā rabbukum fa-uʿ'budūni

Telugu నిశ్చయంగా,మీ ఈ సమాజం ఒకే ఒక్క సమాజం మరియు కేవలం నేనే మీ ప్రభువును, కావున మీరు నన్ను మాత్రమే ఆరాధించండి.

Verse 93

وَتَقَطَّعُوٓا۟ أَمْرَهُم بَيْنَهُمْ ۖ كُلٌّ إِلَيْنَا رَٰجِعُونَ

Transliteration wataqaṭṭaʿū amrahum baynahum kullun ilaynā rājiʿūna

Telugu కాని వారు (ప్రజలు) తమ ధర్మ విషయంలో తెగలు తెగలుగా చీలిపోయారు. వారందరికీ మా వైపునకే మరలి రావలసి వున్నది.

Verse 94

فَمَن يَعْمَلْ مِنَ ٱلصَّـٰلِحَـٰتِ وَهُوَ مُؤْمِنٌ فَلَا كُفْرَانَ لِسَعْيِهِۦ وَإِنَّا لَهُۥ كَـٰتِبُونَ

Transliteration faman yaʿmal mina l-ṣāliḥāti wahuwa mu'minun falā kuf'rāna lisaʿyihi wa-innā lahu kātibūna

Telugu సత్కార్యాలు చేసేవాడు విశ్వసించేవాడై ఉంటే, అతని శ్రమ నిరాదరించబడదు మరియు నిశ్చయంగా, మేము దానిని వ్రాసి పెడతాము.

Verse 95

وَحَرَٰمٌ عَلَىٰ قَرْيَةٍ أَهْلَكْنَـٰهَآ أَنَّهُمْ لَا يَرْجِعُونَ

Transliteration waḥarāmun ʿalā qaryatin ahlaknāhā annahum lā yarjiʿūna

Telugu మరియు మేము నాశనం చేసిన ప్రతి నగరం (వారి)పై, వారు (ఆ నగరవాసులు) మరలి రావటం నిషేధించబడింది.

Verse 96

حَتَّىٰٓ إِذَا فُتِحَتْ يَأْجُوجُ وَمَأْجُوجُ وَهُم مِّن كُلِّ حَدَبٍ يَنسِلُونَ

Transliteration ḥattā idhā futiḥat yajūju wamajūju wahum min kulli ḥadabin yansilūna

Telugu ఎంత వరకైతే యాజూజ్ మరియు మాజూజ్ లు వదలి పెట్టబడి ప్రతి మిట్టనుండి పరుగెడుతూరారో!

Verse 97

وَٱقْتَرَبَ ٱلْوَعْدُ ٱلْحَقُّ فَإِذَا هِىَ شَـٰخِصَةٌ أَبْصَـٰرُ ٱلَّذِينَ كَفَرُوا۟ يَـٰوَيْلَنَا قَدْ كُنَّا فِى غَفْلَةٍ مِّنْ هَـٰذَا بَلْ كُنَّا ظَـٰلِمِينَ

Transliteration wa-iq'taraba l-waʿdu l-ḥaqu fa-idhā hiya shākhiṣatun abṣāru alladhīna kafarū yāwaylanā qad kunnā fī ghaflatin min hādhā bal kunnā ẓālimīna

Telugu మరియు సత్యవాగ్దానం నెరవేరే సమయం దగ్గర పడినప్పుడు సత్యతిరస్కారుల కళ్ళు విచ్చుకుపోయి: "అయ్యో! మా దౌర్భాగ్యం! వాస్తవానికి మేము దీని నుండి అశ్రద్ధకు గురి అయ్యాము. కాదు కాదు! మేము దుర్మార్గులముగా ఉండేవారము." అని అంటారు.

Verse 98

إِنَّكُمْ وَمَا تَعْبُدُونَ مِن دُونِ ٱللَّهِ حَصَبُ جَهَنَّمَ أَنتُمْ لَهَا وَٰرِدُونَ

Transliteration innakum wamā taʿbudūna min dūni l-lahi ḥaṣabu jahannama antum lahā wāridūna

Telugu (వారితో ఇంకా ఇలా అనబడుతుంది): "నిశ్చయంగా, మీరు మరియు అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించేవారూ, నరకాగ్నికి ఇంధనమవుతారు! (ఎందుకంటే) మీకు అక్కడికే పోవలసి ఉన్నది.

Verse 99

لَوْ كَانَ هَـٰٓؤُلَآءِ ءَالِهَةً مَّا وَرَدُوهَا ۖ وَكُلٌّ فِيهَا خَـٰلِدُونَ

Transliteration law kāna hāulāi ālihatan mā waradūhā wakullun fīhā khālidūna

Telugu ఒకవేళ ఇవన్నీ ఆరాధ్య దైవాలే అయి వుంటే, ఇవి అందులో (నరకంలో) ప్రవేశించి ఉండేవి కావు కదా! ఇక మీరంతా అందులోనే శాశ్వతంగా ఉంటారు!"

Verse 100

لَهُمْ فِيهَا زَفِيرٌ وَهُمْ فِيهَا لَا يَسْمَعُونَ

Transliteration lahum fīhā zafīrun wahum fīhā lā yasmaʿūna

Telugu అందులో వారు (దుఃఖం చేత) మూలుగుతూ ఉంటారు. అందులో వారేమి వినలేరు.

Verse 101

إِنَّ ٱلَّذِينَ سَبَقَتْ لَهُم مِّنَّا ٱلْحُسْنَىٰٓ أُو۟لَـٰٓئِكَ عَنْهَا مُبْعَدُونَ

Transliteration inna alladhīna sabaqat lahum minnā l-ḥus'nā ulāika ʿanhā mub'ʿadūna

Telugu నిశ్చయంగా, ఎవరి కొరకైతే మా తరఫు నుండి మేలు (స్వర్గం) నిర్ణయింపబడివుందో, అలాంటి వారు దాని (నరకం) నుండి దూరంగా ఉంచబడతారు.

Verse 102

لَا يَسْمَعُونَ حَسِيسَهَا ۖ وَهُمْ فِى مَا ٱشْتَهَتْ أَنفُسُهُمْ خَـٰلِدُونَ

Transliteration lā yasmaʿūna ḥasīsahā wahum fī mā ish'tahat anfusuhum khālidūna

Telugu వారు దాని మెల్లని శబ్దం కూడా వినరు. వారు తాము కోరిన వాటిలో శాశ్వతంగా ఉంటారు.

Verse 103

لَا يَحْزُنُهُمُ ٱلْفَزَعُ ٱلْأَكْبَرُ وَتَتَلَقَّىٰهُمُ ٱلْمَلَـٰٓئِكَةُ هَـٰذَا يَوْمُكُمُ ٱلَّذِى كُنتُمْ تُوعَدُونَ

Transliteration lā yaḥzunuhumu l-fazaʿu l-akbaru watatalaqqāhumu l-malāikatu hādhā yawmukumu alladhī kuntum tūʿadūna

Telugu ఆ గొప్ప భీతి కూడా వారికి దుఃఖం కలిగించదు మరియు దైవదూతలు వారిని ఆహ్వానిస్తూ వచ్చి: "మీకు వాగ్దానం చేయబడిన మీ దినం ఇదే!" అని అంటారు.

Verse 104

يَوْمَ نَطْوِى ٱلسَّمَآءَ كَطَىِّ ٱلسِّجِلِّ لِلْكُتُبِ ۚ كَمَا بَدَأْنَآ أَوَّلَ خَلْقٍ نُّعِيدُهُۥ ۚ وَعْدًا عَلَيْنَآ ۚ إِنَّا كُنَّا فَـٰعِلِينَ

Transliteration yawma naṭwī l-samāa kaṭayyi l-sijili lil'kutubi kamā badanā awwala khalqin nuʿīduhu waʿdan ʿalaynā innā kunnā fāʿilīna

Telugu (జ్ఞాపకముంచుకోండి)! ఆ రోజు మేము ఆకాశాన్ని, చిట్టాకాగితాలను (ఖాతా గ్రంథాలను) చుట్టినట్టు చుట్టివేస్తాము. మేము ఏ విధంగా సృష్టిని మొదట ఆరంభించామో! అదే విధంగా దానిని మరల ఉనికిలోకి తెస్తాము. ఇది (మాపై బాధ్యతగా) ఉన్న మా వాగ్దానం మేము దానిని తప్పక పూర్తి చేస్తాము.

Verse 105

وَلَقَدْ كَتَبْنَا فِى ٱلزَّبُورِ مِنۢ بَعْدِ ٱلذِّكْرِ أَنَّ ٱلْأَرْضَ يَرِثُهَا عِبَادِىَ ٱلصَّـٰلِحُونَ

Transliteration walaqad katabnā fī l-zabūri min baʿdi l-dhik'ri anna l-arḍa yarithuhā ʿibādiya l-ṣāliḥūna

Telugu వాస్తవానికి మేము జబూర్ లో- మా హితబోధ తరువాత - నిశ్చయంగా, ఈ భూమికి సద్వర్తునులైన నా దాసులు వారసులవుతారని వ్రాసి ఉన్నాము.

Verse 106

إِنَّ فِى هَـٰذَا لَبَلَـٰغًا لِّقَوْمٍ عَـٰبِدِينَ

Transliteration inna fī hādhā labalāghan liqawmin ʿābidīna

Telugu నిశ్చయంగా ఇందులో భక్తిపరులైన ప్రజలకు సందేశం ఉంది.

Verse 107

وَمَآ أَرْسَلْنَـٰكَ إِلَّا رَحْمَةً لِّلْعَـٰلَمِينَ

Transliteration wamā arsalnāka illā raḥmatan lil'ʿālamīna

Telugu మరియు మేము నిన్ను (ఓ ప్రవక్తా!) సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము.

Verse 108

قُلْ إِنَّمَا يُوحَىٰٓ إِلَىَّ أَنَّمَآ إِلَـٰهُكُمْ إِلَـٰهٌ وَٰحِدٌ ۖ فَهَلْ أَنتُم مُّسْلِمُونَ

Transliteration qul innamā yūḥā ilayya annamā ilāhukum ilāhun wāḥidun fahal antum mus'limūna

Telugu (ఓ ముహమ్మద్!) ఇలా అను: "నిశ్చయంగా, నాపై దివ్యజ్ఞానం (వహీ) అవతరింప జేయబడింది. వాస్తవంగా మీ ఆరాధ్య దైవం ఆ అద్వితీయ ఆరాధ్యుడే (అల్లాహ్ యే)! ఇకనైన మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అవుతారా?

Verse 109

فَإِن تَوَلَّوْا۟ فَقُلْ ءَاذَنتُكُمْ عَلَىٰ سَوَآءٍ ۖ وَإِنْ أَدْرِىٓ أَقَرِيبٌ أَم بَعِيدٌ مَّا تُوعَدُونَ

Transliteration fa-in tawallaw faqul ādhantukum ʿalā sawāin wa-in adrī aqarībun am baʿīdun mā tūʿadūna

Telugu ఒకవేళ వారు వెనుదిరిగితే వారితో ఇలా అను: "నేను మీకు అందరికి బహిరంగంగా ప్రకటిస్తున్నాను. మరియు మీతో చేయబడిన వాగ్దానం సమీపంలో ఉందో లేదా బహుదూరం ఉందో నాకు తెలియదు."

Verse 110

إِنَّهُۥ يَعْلَمُ ٱلْجَهْرَ مِنَ ٱلْقَوْلِ وَيَعْلَمُ مَا تَكْتُمُونَ

Transliteration innahu yaʿlamu l-jahra mina l-qawli wayaʿlamu mā taktumūna

Telugu నిశ్చయంగా, ఆయన (అల్లాహ్)కు మీరు బహిరంగంగా వ్యక్త పరిచేది మరియు దాచేది అంతా తెలుసు.

Verse 111

وَإِنْ أَدْرِى لَعَلَّهُۥ فِتْنَةٌ لَّكُمْ وَمَتَـٰعٌ إِلَىٰ حِينٍ

Transliteration wa-in adrī laʿallahu fit'natun lakum wamatāʿun ilā ḥīnin

Telugu మరియు బహుశా ఇది (ఈ ఆలస్యం) మీకు పరీక్ష కావచ్చు, లేదా మీకు కొంతకాలం సుఖసంతోషాలు అనుభవించటానికి ఇవ్వబడిన వ్యవధి కావచ్చు, అది నాకు తెలియదు!

Verse 112

قَـٰلَ رَبِّ ٱحْكُم بِٱلْحَقِّ ۗ وَرَبُّنَا ٱلرَّحْمَـٰنُ ٱلْمُسْتَعَانُ عَلَىٰ مَا تَصِفُونَ

Transliteration qāla rabbi uḥ'kum bil-ḥaqi warabbunā l-raḥmānu l-mus'taʿānu ʿalā mā taṣifūna

Telugu అతను (ముహమ్మద్) ఇలా అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు సత్యంతో తీర్పు చేయి! మరియు మీరు కల్పించే వాటికి (ఆరోపణలకు), ఆ అపార కరుణామయుడైన మా ప్రభువు సహాయమే కోరబడుతుంది.!"

Read Surah Al-Anbya in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.