MyDugsiStart learning

Surah An-Nahl in Telugu: translation and audio

Surah 16 · النحل · The Bee · 128 verses

Surah An-Nahl verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah An-Nahl word by word in English.

Verse 1

أَتَىٰٓ أَمْرُ ٱللَّهِ فَلَا تَسْتَعْجِلُوهُ ۚ سُبْحَـٰنَهُۥ وَتَعَـٰلَىٰ عَمَّا يُشْرِكُونَ

Transliteration atā amru l-lahi falā tastaʿjilūhu sub'ḥānahu wataʿālā ʿammā yush'rikūna

Telugu అల్లాహ్ ఆజ్ఞ (తీర్పు) వచ్చింది! కావున మీరు దాని కొరకు తొందర పెట్టకండి. ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు వారు సాటి కల్పించే భాగస్వాములకు అత్యున్నతుడు.

Verse 2

يُنَزِّلُ ٱلْمَلَـٰٓئِكَةَ بِٱلرُّوحِ مِنْ أَمْرِهِۦ عَلَىٰ مَن يَشَآءُ مِنْ عِبَادِهِۦٓ أَنْ أَنذِرُوٓا۟ أَنَّهُۥ لَآ إِلَـٰهَ إِلَّآ أَنَا۠ فَٱتَّقُونِ

Transliteration yunazzilu l-malāikata bil-rūḥi min amrihi ʿalā man yashāu min ʿibādihi an andhirū annahu lā ilāha illā anā fa-ittaqūni

Telugu ఆయనే తన ఆజ్ఞతో, దేవదూతల ద్వారా, దివ్యజ్ఞానాన్ని (రూహ్ ను) తాను కోరిన, తన దాసులపై అవతరింపజేస్తాడు, వారిని (ప్రజలను) ఇలా హెచ్చరించటానికి: "నిశ్చయంగా, నేను తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు! కావున మీరు నాయందే భయభక్తులు కలిగి ఉండండి!"

Verse 3

خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ بِٱلْحَقِّ ۚ تَعَـٰلَىٰ عَمَّا يُشْرِكُونَ

Transliteration khalaqa l-samāwāti wal-arḍa bil-ḥaqi taʿālā ʿammā yush'rikūna

Telugu ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు. వారు, ఆయనకు సాటి కల్పించే భాగస్వాముల (షరీక్ ల) కంటే ఆయన అత్యున్నతుడు.

Verse 4

خَلَقَ ٱلْإِنسَـٰنَ مِن نُّطْفَةٍ فَإِذَا هُوَ خَصِيمٌ مُّبِينٌ

Transliteration khalaqa l-insāna min nuṭ'fatin fa-idhā huwa khaṣīmun mubīnun

Telugu ఆయన మానవుణ్ణి ఇంద్రియ (వీర్య) బిందువుతో సృష్టించాడు, తరువాత ఆ వ్యక్తియే ఒక బహిరంగ వివాదిగా మారిపోతాడు.

Verse 5

وَٱلْأَنْعَـٰمَ خَلَقَهَا ۗ لَكُمْ فِيهَا دِفْءٌ وَمَنَـٰفِعُ وَمِنْهَا تَأْكُلُونَ

Transliteration wal-anʿāma khalaqahā lakum fīhā dif'on wamanāfiʿu wamin'hā takulūna

Telugu మరియు ఆయన పశువులను సృష్టించాడు. వాటిలో మీ కొరకు వెచ్చని దుస్తులు మరియు అనేక లాభాలు కూడా ఉన్నాయి. మరియు వాటిలో నుండి (కొన్నిటి మాంసం) మీరు తింటారు.

Verse 6

وَلَكُمْ فِيهَا جَمَالٌ حِينَ تُرِيحُونَ وَحِينَ تَسْرَحُونَ

Transliteration walakum fīhā jamālun ḥīna turīḥūna waḥīna tasraḥūna

Telugu మరియు వాటిని మీరు సాయంత్రం ఇండ్లకు తోలుకొని వచ్చేటప్పుడు మరియు ఉదయం మేపటానికి తోసుకొని పోయేటప్పుడు, వాటిలో మీకొక మనోహరమైన దృశ్యం ఉంది.

Verse 7

وَتَحْمِلُ أَثْقَالَكُمْ إِلَىٰ بَلَدٍ لَّمْ تَكُونُوا۟ بَـٰلِغِيهِ إِلَّا بِشِقِّ ٱلْأَنفُسِ ۚ إِنَّ رَبَّكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ

Transliteration wataḥmilu athqālakum ilā baladin lam takūnū bālighīhi illā bishiqqi l-anfusi inna rabbakum laraūfun raḥīmun

Telugu మరియు అవి మీ బరువును మోసుకొని - మీరు ఎంతో శ్రమపడనిదే చేరుకోలేని ప్రాంతాలకు - తీసుకుపోతాయి. నిశ్చంయగా, మీ ప్రభువు మహా కనికరుడు, అపార కరుణా ప్రదాత.

Verse 8

وَٱلْخَيْلَ وَٱلْبِغَالَ وَٱلْحَمِيرَ لِتَرْكَبُوهَا وَزِينَةً ۚ وَيَخْلُقُ مَا لَا تَعْلَمُونَ

Transliteration wal-khayla wal-bighāla wal-ḥamīra litarkabūhā wazīnatan wayakhluqu mā lā taʿlamūna

Telugu మరియు ఆయన గుర్రాలను, కంచర గాడిదలను మరియు గాడిదలను, మీరు స్వారీ చేయటానికి మరియు మీ శోభను పెంచటానికి సృష్టించాడు. మరియు ఆయన, మీకు తెలియనివి (అనేక ఇతర సాధనాలను) కూడా సృష్టించాడు.

Verse 9

وَعَلَى ٱللَّهِ قَصْدُ ٱلسَّبِيلِ وَمِنْهَا جَآئِرٌ ۚ وَلَوْ شَآءَ لَهَدَىٰكُمْ أَجْمَعِينَ

Transliteration waʿalā l-lahi qaṣdu l-sabīli wamin'hā jāirun walaw shāa lahadākum ajmaʿīna

Telugu మరియు సన్మార్గం చూపటమే అల్లాహ్ విధానం మరియు అందులో (లోకంలో) తప్పుడు (వక్ర) మార్గాలు కూడా ఉన్నాయి. ఆయన తలచుకొని ఉంటే మీరందరికీ సన్మార్గం చూపి ఉండేవాడు.

Verse 10

هُوَ ٱلَّذِىٓ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءً ۖ لَّكُم مِّنْهُ شَرَابٌ وَمِنْهُ شَجَرٌ فِيهِ تُسِيمُونَ

Transliteration huwa alladhī anzala mina l-samāi māan lakum min'hu sharābun wamin'hu shajarun fīhi tusīmūna

Telugu ఆయనే, ఆకాశం నుండి మీ కొరకు నీళ్ళను కురిపిస్తాడు. దాని నుండి మీకు త్రాగటానికి నీరు దొరకుతుంది మరియు మీ పశువులను మేపటానికి పచ్చిక పెరుగుతుంది.

Verse 11

يُنۢبِتُ لَكُم بِهِ ٱلزَّرْعَ وَٱلزَّيْتُونَ وَٱلنَّخِيلَ وَٱلْأَعْنَـٰبَ وَمِن كُلِّ ٱلثَّمَرَٰتِ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّقَوْمٍ يَتَفَكَّرُونَ

Transliteration yunbitu lakum bihi l-zarʿa wal-zaytūna wal-nakhīla wal-aʿnāba wamin kulli l-thamarāti inna fī dhālika laāyatan liqawmin yatafakkarūna

Telugu ఆయన దీని (నీటి) ద్వారా మీ కొరకు పంటలను, జైతూన్ మరియు ఖర్జూరపు వృక్షాలను, ద్రాక్ష మరియు ఇతర రకాల ఫలాలను పండింపజేస్తున్నాడు. నిశ్చయంగా, ఆలోచించే వారికి ఇందులో ఒక సూచన (నిదర్శనం) ఉంది.

Verse 12

وَسَخَّرَ لَكُمُ ٱلَّيْلَ وَٱلنَّهَارَ وَٱلشَّمْسَ وَٱلْقَمَرَ ۖ وَٱلنُّجُومُ مُسَخَّرَٰتٌۢ بِأَمْرِهِۦٓ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ

Transliteration wasakhara lakumu al-layla wal-nahāra wal-shamsa wal-qamara wal-nujūmu musakharātun bi-amrihi inna fī dhālika laāyātin liqawmin yaʿqilūna

Telugu మరియు ఆయనే రేయింబవళ్ళను మరియు సూర్యచంద్రులను, మీకు ఉపయుక్తమైనవిగా చేశాడు. మరియు నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞతోనే మీకు ఉపయుక్తమైనవిగా చేయబడ్డాయి. నిశ్చయంగా, బుద్ధిని ఉపయోగించే వారికి వీటిలో సూచనలు (నిదర్శనాలు) ఉన్నాయి.

Verse 13

وَمَا ذَرَأَ لَكُمْ فِى ٱلْأَرْضِ مُخْتَلِفًا أَلْوَٰنُهُۥٓ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّقَوْمٍ يَذَّكَّرُونَ

Transliteration wamā dhara-a lakum fī l-arḍi mukh'talifan alwānuhu inna fī dhālika laāyatan liqawmin yadhakkarūna

Telugu మరియు ఆయన మీ కొరకు భూమిలో వివిధ రంగుల వస్తువులను ఉత్పత్తి (వ్యాపింప) జేశాడు. నిశ్చయంగా, హితబోధ స్వీకరించే వారికి వీటిలో సూచన ఉంది.

Verse 14

وَهُوَ ٱلَّذِى سَخَّرَ ٱلْبَحْرَ لِتَأْكُلُوا۟ مِنْهُ لَحْمًا طَرِيًّا وَتَسْتَخْرِجُوا۟ مِنْهُ حِلْيَةً تَلْبَسُونَهَا وَتَرَى ٱلْفُلْكَ مَوَاخِرَ فِيهِ وَلِتَبْتَغُوا۟ مِن فَضْلِهِۦ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ

Transliteration wahuwa alladhī sakhara l-baḥra litakulū min'hu laḥman ṭariyyan watastakhrijū min'hu ḥil'yatan talbasūnahā watarā l-ful'ka mawākhira fīhi walitabtaghū min faḍlihi walaʿallakum tashkurūna

Telugu మరియు ఆయన సముద్రాన్ని - తాజా మాంసము తినటానికి మరియు మీరు ధరించే ఆభరణాలు తీయటానికి - మీకు ఉపయుక్తమైనదిగా చేశాడు. ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి (ప్రజలు), అందులో ఓడల మీద దాని నీటిని చీల్చుకొని పోవటాన్ని నీవు చూస్తున్నావు. మరియు బహుశా మీరు కృతజ్ఞులు అవుతారని ఆయన మీకు (ఇవన్నీ ప్రసాదించాడు).

Verse 15

وَأَلْقَىٰ فِى ٱلْأَرْضِ رَوَٰسِىَ أَن تَمِيدَ بِكُمْ وَأَنْهَـٰرًا وَسُبُلًا لَّعَلَّكُمْ تَهْتَدُونَ

Transliteration wa-alqā fī l-arḍi rawāsiya an tamīda bikum wa-anhāran wasubulan laʿallakum tahtadūna

Telugu మరియు భూమి మీతో పాటు చలించకుండా ఉండటానికి, ఆయన దానిలో స్థిరమైన పర్వతాలను నాటాడు. మరియు అందులో నదులను ప్రవహింపజేశాడు. మరియు రహదారులను నిర్మించాడు. బహుశా మీరు మార్గం పొందుతారని!

Verse 16

وَعَلَـٰمَـٰتٍ ۚ وَبِٱلنَّجْمِ هُمْ يَهْتَدُونَ

Transliteration waʿalāmātin wabil-najmi hum yahtadūna

Telugu మరియు (భూమిలో మార్గం చూపే) సంకేతాలను పెట్టాడు. మరియు వారు (ప్రజలు) నక్షత్రాల ద్వారా కూడా తమ మార్గాలు తెలుసుకుంటారు.

Verse 17

أَفَمَن يَخْلُقُ كَمَن لَّا يَخْلُقُ ۗ أَفَلَا تَذَكَّرُونَ

Transliteration afaman yakhluqu kaman lā yakhluqu afalā tadhakkarūna

Telugu సృష్టించేవాడూ అసలు ఏమీ సృష్టించలేని వాడూ సమానులా? ఇది మీరెందుకు గమనించరు?

Verse 18

وَإِن تَعُدُّوا۟ نِعْمَةَ ٱللَّهِ لَا تُحْصُوهَآ ۗ إِنَّ ٱللَّهَ لَغَفُورٌ رَّحِيمٌ

Transliteration wa-in taʿuddū niʿ'mata l-lahi lā tuḥ'ṣūhā inna l-laha laghafūrun raḥīmun

Telugu మరియు మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్క పెట్టదలచినా, మీరు వాటిని లెక్క పెట్టలేరు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

Verse 19

وَٱللَّهُ يَعْلَمُ مَا تُسِرُّونَ وَمَا تُعْلِنُونَ

Transliteration wal-lahu yaʿlamu mā tusirrūna wamā tuʿ'linūna

Telugu మరియు అల్లాహ్ కు మీరు దాచేవి మరియు మీరు వెలిబుచ్చేవి అన్నీ తెలుసు.

Verse 20

وَٱلَّذِينَ يَدْعُونَ مِن دُونِ ٱللَّهِ لَا يَخْلُقُونَ شَيْـًٔا وَهُمْ يُخْلَقُونَ

Transliteration wa-alladhīna yadʿūna min dūni l-lahi lā yakhluqūna shayan wahum yukh'laqūna

Telugu మరియు ఎవరినైతే వారు (ప్రజలు), అల్లాహ్ ను వదలి ప్రార్థిస్తున్నారో, వారు ఏమీ సృష్టించలేరు మరియు స్వయంగా వారే సృష్టించబడి ఉన్నారు.

Verse 21

أَمْوَٰتٌ غَيْرُ أَحْيَآءٍ ۖ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ

Transliteration amwātun ghayru aḥyāin wamā yashʿurūna ayyāna yub'ʿathūna

Telugu వారు (ఆ దైవాలు) మృతులు, ప్రాణం లేనివారు. మరియు వారికి తాము తిరిగి ఎప్పుడు లేపబడతారో కూడా తెలియదు.

Verse 22

إِلَـٰهُكُمْ إِلَـٰهٌ وَٰحِدٌ ۚ فَٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْـَٔاخِرَةِ قُلُوبُهُم مُّنكِرَةٌ وَهُم مُّسْتَكْبِرُونَ

Transliteration ilāhukum ilāhun wāḥidun fa-alladhīna lā yu'minūna bil-ākhirati qulūbuhum munkiratun wahum mus'takbirūna

Telugu మీ ఆరాధ్య దైవం కేవలం (అల్లాహ్) ఒక్కడే! పరలోక జీవితాన్ని విశ్వసించని వారి హృదయాలు (ఈ సత్యాన్ని) తిరస్కరిస్తున్నాయి మరియు వారు దురహంకారంలో పడి ఉన్నారు.

Verse 23

لَا جَرَمَ أَنَّ ٱللَّهَ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ ۚ إِنَّهُۥ لَا يُحِبُّ ٱلْمُسْتَكْبِرِينَ

Transliteration lā jarama anna l-laha yaʿlamu mā yusirrūna wamā yuʿ'linūna innahu lā yuḥibbu l-mus'takbirīna

Telugu నిస్సందేహంగా, వారి రహస్య విషయాలు మరియు వారి బహిరంగ విషయాలు అన్నీ, నిశ్చయంగా అల్లాహ్ కు తెలుసు. నిశ్చయంగా దురహంకారులంటే ఆయన ఇష్టపడడు.

Verse 24

وَإِذَا قِيلَ لَهُم مَّاذَآ أَنزَلَ رَبُّكُمْ ۙ قَالُوٓا۟ أَسَـٰطِيرُ ٱلْأَوَّلِينَ

Transliteration wa-idhā qīla lahum mādhā anzala rabbukum qālū asāṭīru l-awalīna

Telugu మరియు: "మీ ప్రభువు ఏమి అవతరింపజేశాడు?" అని వారిని అడిగినప్పుడు, వారు: "అవి పూర్వకాలపు కల్పిత గాథలు మాత్రమే!" అని జవాబిస్తారు.

Verse 25

لِيَحْمِلُوٓا۟ أَوْزَارَهُمْ كَامِلَةً يَوْمَ ٱلْقِيَـٰمَةِ ۙ وَمِنْ أَوْزَارِ ٱلَّذِينَ يُضِلُّونَهُم بِغَيْرِ عِلْمٍ ۗ أَلَا سَآءَ مَا يَزِرُونَ

Transliteration liyaḥmilū awzārahum kāmilatan yawma l-qiyāmati wamin awzāri alladhīna yuḍillūnahum bighayri ʿil'min alā sāa mā yazirūna

Telugu కావున పునరుత్థాన దినమున వారు తమ (పాపాల) భారాలను పూర్తిగా మరియు తాము మార్గం తప్పించిన అజ్ఞానుల భారాలలోని కొంతభాగాన్ని కూడా మోస్తారు. వారు మోసే భారం ఎంత దుర్భరమైనదో చూడండి!

Verse 26

قَدْ مَكَرَ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ فَأَتَى ٱللَّهُ بُنْيَـٰنَهُم مِّنَ ٱلْقَوَاعِدِ فَخَرَّ عَلَيْهِمُ ٱلسَّقْفُ مِن فَوْقِهِمْ وَأَتَىٰهُمُ ٱلْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُونَ

Transliteration qad makara alladhīna min qablihim fa-atā l-lahu bun'yānahum mina l-qawāʿidi fakharra ʿalayhimu l-saqfu min fawqihim wa-atāhumu l-ʿadhābu min ḥaythu lā yashʿurūna

Telugu వాస్తవానికి, వారి కంటే పూర్వం గతించిన వారు కూడా (అల్లాహ్ సందేశాలకు వ్యతిరేకంగా) కుట్రలు పన్నారు. కాని అల్లాహ్ వారి (పన్నాగపు) కట్టడాలను వాటి పునాదులతో సహా పెకలించాడు. దానితో వాటి కప్పులు వారి మీద పడ్డాయి మరియు వారిపై, వారు ఊహించని వైపు నుండి శిక్ష వచ్చి పడింది.

Verse 27

ثُمَّ يَوْمَ ٱلْقِيَـٰمَةِ يُخْزِيهِمْ وَيَقُولُ أَيْنَ شُرَكَآءِىَ ٱلَّذِينَ كُنتُمْ تُشَـٰٓقُّونَ فِيهِمْ ۚ قَالَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْعِلْمَ إِنَّ ٱلْخِزْىَ ٱلْيَوْمَ وَٱلسُّوٓءَ عَلَى ٱلْكَـٰفِرِينَ

Transliteration thumma yawma l-qiyāmati yukh'zīhim wayaqūlu ayna shurakāiya alladhīna kuntum tushāqqūna fīhim qāla alladhīna ūtū l-ʿil'ma inna l-khiz'ya l-yawma wal-sūa ʿalā l-kāfirīna

Telugu తరువాత పునరుత్థాన దినమున ఆయన వారిని అవమానపరుస్తాడు మరియు వారిని అడుగుతాడు: "మీరు నాకు సాటి కల్పించిన వారు - ఎవరిని గురించి అయితే మీరు (విశ్వాసులతో) వాదులాడేవారో - ఇప్పుడు ఎక్కడున్నారు?" జ్ఞానం ప్రసాదించబడిన వారు అంటారు: "నిశ్చయంగా, ఈ రోజు అవమానం మరియు దుర్దశ సత్యతిరస్కారుల కొరకే!"

Verse 28

ٱلَّذِينَ تَتَوَفَّىٰهُمُ ٱلْمَلَـٰٓئِكَةُ ظَالِمِىٓ أَنفُسِهِمْ ۖ فَأَلْقَوُا۟ ٱلسَّلَمَ مَا كُنَّا نَعْمَلُ مِن سُوٓءٍۭ ۚ بَلَىٰٓ إِنَّ ٱللَّهَ عَلِيمٌۢ بِمَا كُنتُمْ تَعْمَلُونَ

Transliteration alladhīna tatawaffāhumu l-malāikatu ẓālimī anfusihim fa-alqawū l-salama mā kunnā naʿmalu min sūin balā inna l-laha ʿalīmun bimā kuntum taʿmalūna

Telugu "వారిపై, ఎవరైతే, తమను తాము దుర్మార్గంలో ముంచుకొని ఉన్నప్పుడు, దేవదూతలు వారి ప్రాణాలు తీస్తారో!" అప్పుడు వారు (సత్యతిరస్కారులు) లొంగి పోయి: "మేము ఎలాంటి పాపం చేయలేదు." అని అంటారు. (దేవదూతలు వారితో ఇలా అంటారు): "అలా కాదు! నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు."

Verse 29

فَٱدْخُلُوٓا۟ أَبْوَٰبَ جَهَنَّمَ خَـٰلِدِينَ فِيهَا ۖ فَلَبِئْسَ مَثْوَى ٱلْمُتَكَبِّرِينَ

Transliteration fa-ud'khulū abwāba jahannama khālidīna fīhā falabi'sa mathwā l-mutakabirīna

Telugu "కావున నరక ద్వారాలలో ప్రవేశించండి. అక్కడ శాశ్వతంగా ఉండటానికి! గర్విష్ఠులకు లభించే నివాసం ఎంత చెడ్డది!"

Verse 30

۞ وَقِيلَ لِلَّذِينَ ٱتَّقَوْا۟ مَاذَآ أَنزَلَ رَبُّكُمْ ۚ قَالُوا۟ خَيْرًا ۗ لِّلَّذِينَ أَحْسَنُوا۟ فِى هَـٰذِهِ ٱلدُّنْيَا حَسَنَةٌ ۚ وَلَدَارُ ٱلْـَٔاخِرَةِ خَيْرٌ ۚ وَلَنِعْمَ دَارُ ٱلْمُتَّقِينَ

Transliteration waqīla lilladhīna ittaqaw mādhā anzala rabbukum qālū khayran lilladhīna aḥsanū fī hādhihi l-dun'yā ḥasanatun waladāru l-ākhirati khayrun walaniʿ'ma dāru l-mutaqīna

Telugu మరియు దైవభీతి గలవారితో: "మీ ప్రభువు ఏమి అవతరింపజేశాడు?" అని అడిగినప్పుడు, వారు: "అత్యుత్తమమైనది." అని జవాబిస్తారు. ఎవరైతే ఈ లోకంలో మేలు చేస్తారో వారికి మేలుంటుంది మరియు పరలోక గృహం దీని కంటే ఉత్తమమైంది. మరియు దైవభీతి గలవారి గృహం పరమానందకరమైనది.

Verse 31

جَنَّـٰتُ عَدْنٍ يَدْخُلُونَهَا تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ ۖ لَهُمْ فِيهَا مَا يَشَآءُونَ ۚ كَذَٰلِكَ يَجْزِى ٱللَّهُ ٱلْمُتَّقِينَ

Transliteration jannātu ʿadnin yadkhulūnahā tajrī min taḥtihā l-anhāru lahum fīhā mā yashāūna kadhālika yajzī l-lahu l-mutaqīna

Telugu వారు ప్రవేశించే శాశ్వత స్వర్గవనాలలో క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారికి వారు కోరేది దొరుకుతుంది. దైవభీతి గలవారికి అల్లాహ్ ఈ విధంగా ప్రతిఫలమిస్తాడు.

Verse 32

ٱلَّذِينَ تَتَوَفَّىٰهُمُ ٱلْمَلَـٰٓئِكَةُ طَيِّبِينَ ۙ يَقُولُونَ سَلَـٰمٌ عَلَيْكُمُ ٱدْخُلُوا۟ ٱلْجَنَّةَ بِمَا كُنتُمْ تَعْمَلُونَ

Transliteration alladhīna tatawaffāhumu l-malāikatu ṭayyibīna yaqūlūna salāmun ʿalaykumu ud'khulū l-janata bimā kuntum taʿmalūna

Telugu ఎవరైతే, పరిశుద్ధులుగా ఉండగా దైవదూతలు వారి ప్రాణాలు తీస్తారో, వారితో: "మీకు శాంతి కలుగు గాక (సలాం) ! మీరు చేసిన మంచిపనులకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశించండి!" అని అంటారు.

Verse 33

هَلْ يَنظُرُونَ إِلَّآ أَن تَأْتِيَهُمُ ٱلْمَلَـٰٓئِكَةُ أَوْ يَأْتِىَ أَمْرُ رَبِّكَ ۚ كَذَٰلِكَ فَعَلَ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ ۚ وَمَا ظَلَمَهُمُ ٱللَّهُ وَلَـٰكِن كَانُوٓا۟ أَنفُسَهُمْ يَظْلِمُونَ

Transliteration hal yanẓurūna illā an tatiyahumu l-malāikatu aw yatiya amru rabbika kadhālika faʿala alladhīna min qablihim wamā ẓalamahumu l-lahu walākin kānū anfusahum yaẓlimūna

Telugu ఏమీ? వారు (సత్యతిరస్కారులు) తమ వద్దకు దేవదూతల రాక కోసం ఎదురు చూస్తున్నారా? లేక నీ ప్రభువు ఆజ్ఞ (తీర్పు) కోసం ఎదురు చూస్తున్నారా? వారికి పూర్వం ఉన్నవారు కూడా ఈ విధంగానే ప్రవర్తించారు. మరియు అల్లాహ్ వారికి ఎలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.

Verse 34

فَأَصَابَهُمْ سَيِّـَٔاتُ مَا عَمِلُوا۟ وَحَاقَ بِهِم مَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ

Transliteration fa-aṣābahum sayyiātu mā ʿamilū waḥāqa bihim mā kānū bihi yastahziūna

Telugu అప్పుడు వారి దుష్కర్మల ఫలితాలు వారిపై పడ్డాయి మరియు వారు దేనిని గురించి పరిహాసమాడుతూ ఉన్నారో, అదే వారిని క్రమ్ముకుంది.

Verse 35

وَقَالَ ٱلَّذِينَ أَشْرَكُوا۟ لَوْ شَآءَ ٱللَّهُ مَا عَبَدْنَا مِن دُونِهِۦ مِن شَىْءٍ نَّحْنُ وَلَآ ءَابَآؤُنَا وَلَا حَرَّمْنَا مِن دُونِهِۦ مِن شَىْءٍ ۚ كَذَٰلِكَ فَعَلَ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ ۚ فَهَلْ عَلَى ٱلرُّسُلِ إِلَّا ٱلْبَلَـٰغُ ٱلْمُبِينُ

Transliteration waqāla alladhīna ashrakū law shāa l-lahu mā ʿabadnā min dūnihi min shayin naḥnu walā ābāunā walā ḥarramnā min dūnihi min shayin kadhālika faʿala alladhīna min qablihim fahal ʿalā l-rusuli illā l-balāghu l-mubīnu

Telugu మరియు (అల్లాహ్ కు) సాటి కల్పించే వారు అంటారు: "ఒకవేళ అల్లాహ్ కోరి ఉంటే! మేము గానీ మా తండ్రితాతలు గానీ, ఆయన్ని తప్ప మరెవ్వరినీ ఆరాధించేవారం కాదు. మరియు ఆయన ఆజ్ఞ లేనిదే మేము దేన్ని కూడా నిషేధించేవారం కాదు." వారికి పూర్వం వారు కూడా ఇలాగే చేశారు. అయితే ప్రవక్తల బాధ్యత (అల్లాహ్) సందేశాన్ని స్పష్టంగా అందజేయటం తప్ప ఇంకేమిటి?

Verse 36

وَلَقَدْ بَعَثْنَا فِى كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ ٱعْبُدُوا۟ ٱللَّهَ وَٱجْتَنِبُوا۟ ٱلطَّـٰغُوتَ ۖ فَمِنْهُم مَّنْ هَدَى ٱللَّهُ وَمِنْهُم مَّنْ حَقَّتْ عَلَيْهِ ٱلضَّلَـٰلَةُ ۚ فَسِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَٱنظُرُوا۟ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلْمُكَذِّبِينَ

Transliteration walaqad baʿathnā fī kulli ummatin rasūlan ani uʿ'budū l-laha wa-ij'tanibū l-ṭāghūta famin'hum man hadā l-lahu wamin'hum man ḥaqqat ʿalayhi l-ḍalālatu fasīrū fī l-arḍi fa-unẓurū kayfa kāna ʿāqibatu l-mukadhibīna

Telugu మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతనన్నాడు): "మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి." వారిలో కొందరికి అల్లాహ్ సన్మార్గం చూపాడు. మరికొందరి కొరకు మార్గభ్రష్టత్వం నిశ్చితమై పోయింది. కావున మీరు భూమిలో సంచారం చేసి చూడండి, ఆ సత్యతిరస్కారుల గతి ఏమయిందో!

Verse 37

إِن تَحْرِصْ عَلَىٰ هُدَىٰهُمْ فَإِنَّ ٱللَّهَ لَا يَهْدِى مَن يُضِلُّ ۖ وَمَا لَهُم مِّن نَّـٰصِرِينَ

Transliteration in taḥriṣ ʿalā hudāhum fa-inna l-laha lā yahdī man yuḍillu wamā lahum min nāṣirīna

Telugu ఇక (ఓ ముహమ్మద్!) నీవు వారిని సన్మార్గానికి తేవాలని ఎంత కోరుకున్నా! నిశ్చయంగా, అల్లాహ్ మార్గభ్రష్టతకు గురి చేసిన వానికి సన్మార్గం చూపడు. వారికి సహాయపడే వారు ఎవ్వరూ ఉండరు.

Verse 38

وَأَقْسَمُوا۟ بِٱللَّهِ جَهْدَ أَيْمَـٰنِهِمْ ۙ لَا يَبْعَثُ ٱللَّهُ مَن يَمُوتُ ۚ بَلَىٰ وَعْدًا عَلَيْهِ حَقًّا وَلَـٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ

Transliteration wa-aqsamū bil-lahi jahda aymānihim lā yabʿathu l-lahu man yamūtu balā waʿdan ʿalayhi ḥaqqan walākinna akthara l-nāsi lā yaʿlamūna

Telugu మరియు వారు అల్లాహ్ పేరుతో దృఢమైన శపథం చేసి ఇలా అంటారు: "మరణించిన వానిని అల్లాహ్ తిరిగి బ్రతికించి లేపడు!" ఎందుకు లేపడు! ఆయన చేసిన వాగ్దానం సత్యం! అయినా చాలా మంది ప్రజలకు ఇది తెలియదు (కాని అది జరిగి తీరుతుంది);

Verse 39

لِيُبَيِّنَ لَهُمُ ٱلَّذِى يَخْتَلِفُونَ فِيهِ وَلِيَعْلَمَ ٱلَّذِينَ كَفَرُوٓا۟ أَنَّهُمْ كَانُوا۟ كَـٰذِبِينَ

Transliteration liyubayyina lahumu alladhī yakhtalifūna fīhi waliyaʿlama alladhīna kafarū annahum kānū kādhibīna

Telugu వారు వాదిస్తూ ఉండిన దానిని గురించి వారికి తెలుపటానికి మరియు సత్యతిరస్కారులు తాము నిశ్చయంగా, అబద్ధమాడుతున్నారని తెలుసుకోవటానికి.

Verse 40

إِنَّمَا قَوْلُنَا لِشَىْءٍ إِذَآ أَرَدْنَـٰهُ أَن نَّقُولَ لَهُۥ كُن فَيَكُونُ

Transliteration innamā qawlunā lishayin idhā aradnāhu an naqūla lahu kun fayakūnu

Telugu నిశ్చయంగా, మేము ఏదైనా వస్తువును ఉనికిలోనికి తీసుకురాదలచి నపుడు దానిని మేము: "అయిపో!" అని ఆజ్ఞాపిస్తాము. అంతే! అది అయిపోతుంది.

Verse 41

وَٱلَّذِينَ هَاجَرُوا۟ فِى ٱللَّهِ مِنۢ بَعْدِ مَا ظُلِمُوا۟ لَنُبَوِّئَنَّهُمْ فِى ٱلدُّنْيَا حَسَنَةً ۖ وَلَأَجْرُ ٱلْـَٔاخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا۟ يَعْلَمُونَ

Transliteration wa-alladhīna hājarū fī l-lahi min baʿdi mā ẓulimū lanubawwi-annahum fī l-dun'yā ḥasanatan wala-ajru l-ākhirati akbaru law kānū yaʿlamūna

Telugu మరియు దౌర్జన్యాన్ని సహించిన తరువాత, ఎవరైతే అల్లాహ్ కొరకు వలస పోతారో; అలాంటి వారికి మేము ప్రపంచంలో తప్పకుండా మంచి స్థానాన్ని నొసంగుతాము. మరియు వారి పరలోక ప్రతిఫలం దాని కంటే గొప్పగా ఉంటుంది. ఇది వారు తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది!

Verse 42

ٱلَّذِينَ صَبَرُوا۟ وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ

Transliteration alladhīna ṣabarū waʿalā rabbihim yatawakkalūna

Telugu అలాంటి వారే సహనం వహించిన వారు మరియు తమ ప్రభువును నమ్ముకున్నవారు.

Verse 43

وَمَآ أَرْسَلْنَا مِن قَبْلِكَ إِلَّا رِجَالًا نُّوحِىٓ إِلَيْهِمْ ۚ فَسْـَٔلُوٓا۟ أَهْلَ ٱلذِّكْرِ إِن كُنتُمْ لَا تَعْلَمُونَ

Transliteration wamā arsalnā min qablika illā rijālan nūḥī ilayhim fasalū ahla l-dhik'ri in kuntum lā taʿlamūna

Telugu మరియు (ఓ ముహమ్మద్!) నీకు పూర్వం కూడా మేము పంపిన ప్రవక్తలందరూ పురుషులే (మానవులే)! మేము వారిపై దివ్యజ్ఞానాన్ని (వహీని) అవతరింపజేశాము. కావున ఇది మీకు తెలియకపోతే పూర్వ గ్రంథ ప్రజలను అడగండి.

Verse 44

بِٱلْبَيِّنَـٰتِ وَٱلزُّبُرِ ۗ وَأَنزَلْنَآ إِلَيْكَ ٱلذِّكْرَ لِتُبَيِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ إِلَيْهِمْ وَلَعَلَّهُمْ يَتَفَكَّرُونَ

Transliteration bil-bayināti wal-zuburi wa-anzalnā ilayka l-dhik'ra litubayyina lilnnāsi mā nuzzila ilayhim walaʿallahum yatafakkarūna

Telugu (పూర్వపు ప్రవక్తలను) మేము స్పష్టమైన నిదర్శనాలతో మరియు గ్రంథాలతో (జుబూర్ లతో) పంపాము. మరియు (ఓ ప్రవక్తా!) ఇప్పుడు ఈ జ్ఞాపికను (గ్రంథాన్ని) నీపై అవతరింపజేసింది, వారి వద్దకు అవతరింపజేయబడిన దానిని వారికి నీవు స్పష్టంగా వివరించటానికి మరియు బహుశా వారు ఆలోచిస్తారేమోనని!

Verse 45

أَفَأَمِنَ ٱلَّذِينَ مَكَرُوا۟ ٱلسَّيِّـَٔاتِ أَن يَخْسِفَ ٱللَّهُ بِهِمُ ٱلْأَرْضَ أَوْ يَأْتِيَهُمُ ٱلْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُونَ

Transliteration afa-amina alladhīna makarū l-sayiāti an yakhsifa l-lahu bihimu l-arḍa aw yatiyahumu l-ʿadhābu min ḥaythu lā yashʿurūna

Telugu దుష్టపన్నాగాలు చేస్తున్నవారు - అల్లాహ్ తమను భూమిలోనికి దిగి పోయినట్లు చేయకుండా, లేదా తాము ఊహించని వైపు నుండి తమపై శిక్ష అవతరింపజేయకుండా - తాము సురక్షితంగా ఉన్నారనుకొంటున్నారా ఏమిటి?

Verse 46

أَوْ يَأْخُذَهُمْ فِى تَقَلُّبِهِمْ فَمَا هُم بِمُعْجِزِينَ

Transliteration aw yakhudhahum fī taqallubihim famā hum bimuʿ'jizīna

Telugu లేదా వారు తిరుగాడుతున్నపుడు, అకస్మాత్తుగా ఆయన వారిని పట్టుకుంటే, వారు ఆయన (పట్టు) నుండి తప్పించుకోగలరా?

Verse 47

أَوْ يَأْخُذَهُمْ عَلَىٰ تَخَوُّفٍ فَإِنَّ رَبَّكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ

Transliteration aw yakhudhahum ʿalā takhawwufin fa-inna rabbakum laraūfun raḥīmun

Telugu లేదా, వారిని భయకంపితులు జేసి పట్టుకోవచ్చు కదా! కాని నిశ్చయంగా, నీ ప్రభువు మహా కనికరుడు, అపార కరుణా ప్రదాత.

Verse 48

أَوَلَمْ يَرَوْا۟ إِلَىٰ مَا خَلَقَ ٱللَّهُ مِن شَىْءٍ يَتَفَيَّؤُا۟ ظِلَـٰلُهُۥ عَنِ ٱلْيَمِينِ وَٱلشَّمَآئِلِ سُجَّدًا لِّلَّهِ وَهُمْ دَٰخِرُونَ

Transliteration awalam yaraw ilā mā khalaqa l-lahu min shayin yatafayya-u ẓilāluhu ʿani l-yamīni wal-shamāili sujjadan lillahi wahum dākhirūna

Telugu ఏమీ? వారు అల్లాహ్ సృష్టించిన ప్రతి వస్తువునూ గమనించటం (చూడటం) లేదా? వాటి నీడలు కుడివైపుకూ, ఎడమ వైపుకూ వంగుతూ ఉండి, అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ, ఎలా వినమ్రత చూపుతున్నాయో?

Verse 49

وَلِلَّهِ يَسْجُدُ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ مِن دَآبَّةٍ وَٱلْمَلَـٰٓئِكَةُ وَهُمْ لَا يَسْتَكْبِرُونَ

Transliteration walillahi yasjudu mā fī l-samāwāti wamā fī l-arḍi min dābbatin wal-malāikatu wahum lā yastakbirūna

Telugu మరియు ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న సమస్త ప్రాణులు మరియు దేవదూతలు అందరూ అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారు. వారెన్నడూ (తమ ప్రభువు సన్నిధిలో) గర్వపడరు.

Verse 50

يَخَافُونَ رَبَّهُم مِّن فَوْقِهِمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ ۩

Transliteration yakhāfūna rabbahum min fawqihim wayafʿalūna mā yu'marūna

Telugu వారు తమపై నున్న ప్రభువునకు భయపడుతూ తమకు ఆజ్ఞాపించిన విధంగా నడుచుకుంటారు.

Verse 51

۞ وَقَالَ ٱللَّهُ لَا تَتَّخِذُوٓا۟ إِلَـٰهَيْنِ ٱثْنَيْنِ ۖ إِنَّمَا هُوَ إِلَـٰهٌ وَٰحِدٌ ۖ فَإِيَّـٰىَ فَٱرْهَبُونِ

Transliteration waqāla l-lahu lā tattakhidhū ilāhayni ith'nayni innamā huwa ilāhun wāḥidun fa-iyyāya fa-ir'habūni

Telugu మరియు అల్లాహ్ ఇలా ఆజ్ఞాపించాడు: "(ఓ మానవులారా!) ఇద్దరినీ ఆరాధ్య దైవాలుగా చేసుకోకండి. నిశ్చయంగా ఆరాధ్య దైవం ఆయన (అల్లాహ్) ఒక్కడే! కావున నాకే భీతిపరులై ఉండండి."

Verse 52

وَلَهُۥ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَلَهُ ٱلدِّينُ وَاصِبًا ۚ أَفَغَيْرَ ٱللَّهِ تَتَّقُونَ

Transliteration walahu mā fī l-samāwāti wal-arḍi walahu l-dīnu wāṣiban afaghayra l-lahi tattaqūna

Telugu మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయకు చెందినదే! మరియు నిరంతర విధేయతకు కేవలం ఆయనే అర్హుడు. ఏమీ? మీరు అల్లాహ్ ను కాదని ఇతరులకు భయభక్తులు చూపుతారా?

Verse 53

وَمَا بِكُم مِّن نِّعْمَةٍ فَمِنَ ٱللَّهِ ۖ ثُمَّ إِذَا مَسَّكُمُ ٱلضُّرُّ فَإِلَيْهِ تَجْـَٔرُونَ

Transliteration wamā bikum min niʿ'matin famina l-lahi thumma idhā massakumu l-ḍuru fa-ilayhi tajarūna

Telugu మరియు మీకు లభించిన అనుగ్రహాలన్నీ కేవలం అల్లాహ్ నుండి వచ్చినవే. అంతేగాక మీకు ఆపదలు వచ్చినపుడు కూడా మీరు సహాయం కొరకు ఆయననే మొరపెట్టుకుంటారు కదా!

Verse 54

ثُمَّ إِذَا كَشَفَ ٱلضُّرَّ عَنكُمْ إِذَا فَرِيقٌ مِّنكُم بِرَبِّهِمْ يُشْرِكُونَ

Transliteration thumma idhā kashafa l-ḍura ʿankum idhā farīqun minkum birabbihim yush'rikūna

Telugu తరువాత ఆయన మీ ఆపదలు తొలగించినపుడు; మీలో కొందరు మీ ప్రభువుకు సాటి (షరీక్ లను) కల్పించ సాగుతారు -

Verse 55

لِيَكْفُرُوا۟ بِمَآ ءَاتَيْنَـٰهُمْ ۚ فَتَمَتَّعُوا۟ ۖ فَسَوْفَ تَعْلَمُونَ

Transliteration liyakfurū bimā ātaynāhum fatamattaʿū fasawfa taʿlamūna

Telugu మేము చేసిన ఉపకారానికి కృతఘ్నతగా - సరే (కొంతకాలం) సుఖాలను అనుభవించండి. తరువాత మీరు తెలుసుకుంటారు.

Verse 56

وَيَجْعَلُونَ لِمَا لَا يَعْلَمُونَ نَصِيبًا مِّمَّا رَزَقْنَـٰهُمْ ۗ تَٱللَّهِ لَتُسْـَٔلُنَّ عَمَّا كُنتُمْ تَفْتَرُونَ

Transliteration wayajʿalūna limā lā yaʿlamūna naṣīban mimmā razaqnāhum tal-lahi latus'alunna ʿammā kuntum taftarūna

Telugu మరియు మేము వారికిచ్చిన జీవనోపాధి నుండి కొంత భాగాన్ని, తాము ఏ మాత్రం ఎరుగని తమ (బూటక దైవాల) కొరకు నియమించుకుంటారు వారు. అల్లాహ్ తోడు! మీరు కల్పిస్తున్న ఈ బూటక (కల్పిత) దైవాలను గురించి మీరు తప్పక ప్రశ్నింపబడతారు.

Verse 57

وَيَجْعَلُونَ لِلَّهِ ٱلْبَنَـٰتِ سُبْحَـٰنَهُۥ ۙ وَلَهُم مَّا يَشْتَهُونَ

Transliteration wayajʿalūna lillahi l-banāti sub'ḥānahu walahum mā yashtahūna

Telugu మరియు వారు అల్లాహ్ కేమో కుమార్తెలను అంటగడుతున్నారు - ఆయన సర్వలోపాలకు అతీతుడు - మరియు తమకేమో తాము కోరేదు. (నియమించుకుంటారు).

Verse 58

وَإِذَا بُشِّرَ أَحَدُهُم بِٱلْأُنثَىٰ ظَلَّ وَجْهُهُۥ مُسْوَدًّا وَهُوَ كَظِيمٌ

Transliteration wa-idhā bushira aḥaduhum bil-unthā ẓalla wajhuhu mus'waddan wahuwa kaẓīmun

Telugu మరియు వారిలో ఎవడికైనా బాలిక (పుట్టిందనే) శుభవార్త అందజేస్తే; అతడి ముఖం నల్లబడి పోతుంది. మరియు అతడు తన క్రోధావేశాన్ని అణచుకోవటానికి ప్రయత్నిస్తాడు.

Verse 59

يَتَوَٰرَىٰ مِنَ ٱلْقَوْمِ مِن سُوٓءِ مَا بُشِّرَ بِهِۦٓ ۚ أَيُمْسِكُهُۥ عَلَىٰ هُونٍ أَمْ يَدُسُّهُۥ فِى ٱلتُّرَابِ ۗ أَلَا سَآءَ مَا يَحْكُمُونَ

Transliteration yatawārā mina l-qawmi min sūi mā bushira bihi ayum'sikuhu ʿalā hūnin am yadussuhu fī l-turābi alā sāa mā yaḥkumūna

Telugu తనకు ఇవ్వబడిన శుభవార్తను (అతడు) దుర్వార్తగా భావించి, తన జాతి వారి నుండి దాక్కుంటూ తిరుగుతాడు. అవమానాన్ని భరించి దానిని (ఆ బాలికను) ఉంచుకోవాలా? లేక, దానిని మట్టిలో పూడ్చి వేయాలా? అని ఆలోచిస్తాడు. చూడండి! వారి నిర్ణయం ఎంత దారుణమైనదో!

Verse 60

لِلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْـَٔاخِرَةِ مَثَلُ ٱلسَّوْءِ ۖ وَلِلَّهِ ٱلْمَثَلُ ٱلْأَعْلَىٰ ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

Transliteration lilladhīna lā yu'minūna bil-ākhirati mathalu l-sawi walillahi l-mathalu l-aʿlā wahuwa l-ʿazīzu l-ḥakīmu

Telugu ఎవరైతే పరలోకాన్ని విశ్వసించరో వారే దుష్టులుగా పరిగణింపబడేవారు. మరియు అల్లాహ్ మాత్రమే సర్వోన్నతుడిగా పరిగణింపబడేవాడు. మరియు ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

Verse 61

وَلَوْ يُؤَاخِذُ ٱللَّهُ ٱلنَّاسَ بِظُلْمِهِم مَّا تَرَكَ عَلَيْهَا مِن دَآبَّةٍ وَلَـٰكِن يُؤَخِّرُهُمْ إِلَىٰٓ أَجَلٍ مُّسَمًّى ۖ فَإِذَا جَآءَ أَجَلُهُمْ لَا يَسْتَـْٔخِرُونَ سَاعَةً ۖ وَلَا يَسْتَقْدِمُونَ

Transliteration walaw yuākhidhu l-lahu l-nāsa biẓul'mihim mā taraka ʿalayhā min dābbatin walākin yu-akhiruhum ilā ajalin musamman fa-idhā jāa ajaluhum lā yastakhirūna sāʿatan walā yastaqdimūna

Telugu మరియు ఒకవేళ అల్లాహ్ మానవులను - వారు చేసే దుర్మార్గానికి - పట్టుకో దలిస్తే, భూమిపై ఒక్క ప్రాణిని కూడ వదిలేవాడు కాదు. కాని, ఆయన ఒక నిర్ణీత కాలం వరకు వారికి వ్యవధినిస్తున్నాడు. ఇక, వారి కాలం వచ్చినప్పుడు వారు, ఒక ఘడియ వెనుక గానీ మరియు ముందు గానీ కాలేరు.

Verse 62

وَيَجْعَلُونَ لِلَّهِ مَا يَكْرَهُونَ وَتَصِفُ أَلْسِنَتُهُمُ ٱلْكَذِبَ أَنَّ لَهُمُ ٱلْحُسْنَىٰ ۖ لَا جَرَمَ أَنَّ لَهُمُ ٱلنَّارَ وَأَنَّهُم مُّفْرَطُونَ

Transliteration wayajʿalūna lillahi mā yakrahūna wataṣifu alsinatuhumu l-kadhiba anna lahumu l-ḥus'nā lā jarama anna lahumu l-nāra wa-annahum muf'raṭūna

Telugu మరియు వారు తమకు ఇష్టం లేని దానిని అల్లాహ్ కొరకు నియమిస్తారు. "నిశ్చయంగా, వారికి ఉన్నదంతా శుభమే (మేలైనదే)." అని వారి నాలుకలు అబద్ధం పలుకుతున్నాయి. నిస్సందేహంగా, వారు నరకాగ్ని పాలవుతారు. మరియు నిశ్చయంగా, వారందులోకి త్రోయబడి, వదలబడతారు.

Verse 63

تَٱللَّهِ لَقَدْ أَرْسَلْنَآ إِلَىٰٓ أُمَمٍ مِّن قَبْلِكَ فَزَيَّنَ لَهُمُ ٱلشَّيْطَـٰنُ أَعْمَـٰلَهُمْ فَهُوَ وَلِيُّهُمُ ٱلْيَوْمَ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ

Transliteration tal-lahi laqad arsalnā ilā umamin min qablika fazayyana lahumu l-shayṭānu aʿmālahum fahuwa waliyyuhumu l-yawma walahum ʿadhābun alīmun

Telugu అల్లాహ్ తోడు, (ఓ ప్రవక్తా!) వాస్తవానికి, నీకు పూర్వమున్న సమాజాల వారి వద్దకు, మేము ప్రవక్తలను పంపాము! కాని షైతాన్ వారి (దుష్ట) కర్మలను వారికి మంచివిగా కనిపించేటట్లు చేశాడు. అదే విధంగా ఈనాడు కూడా వాడు వారి స్నేహితుడిగా ఉన్నాడు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

Verse 64

وَمَآ أَنزَلْنَا عَلَيْكَ ٱلْكِتَـٰبَ إِلَّا لِتُبَيِّنَ لَهُمُ ٱلَّذِى ٱخْتَلَفُوا۟ فِيهِ ۙ وَهُدًى وَرَحْمَةً لِّقَوْمٍ يُؤْمِنُونَ

Transliteration wamā anzalnā ʿalayka l-kitāba illā litubayyina lahumu alladhī ikh'talafū fīhi wahudan waraḥmatan liqawmin yu'minūna

Telugu మరియు మేము ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) నీపై అవతరింపజేసింది, వారు విభేదాలకు గురి అయిన విషయాన్ని వారికి నీవు స్పష్టం చేయటానికీ మరియు విశ్వసించే జనుల కొరకు మార్గదర్శకత్వం గానూ మరియు కారుణ్యం గానూ ఉంచటానికి!

Verse 65

وَٱللَّهُ أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءً فَأَحْيَا بِهِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَآ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّقَوْمٍ يَسْمَعُونَ

Transliteration wal-lahu anzala mina l-samāi māan fa-aḥyā bihi l-arḍa baʿda mawtihā inna fī dhālika laāyatan liqawmin yasmaʿūna

Telugu మరియు అల్లాహ్ ఆకాశం నుండి నీటిని కురిపించి, దాని ద్వారా నిర్జీవంగా ఉన్న భూమిలో జీవం పోశాడు. నిశ్చయంగా ఇందులో వినేవారికి సూచన ఉంది.

Verse 66

وَإِنَّ لَكُمْ فِى ٱلْأَنْعَـٰمِ لَعِبْرَةً ۖ نُّسْقِيكُم مِّمَّا فِى بُطُونِهِۦ مِنۢ بَيْنِ فَرْثٍ وَدَمٍ لَّبَنًا خَالِصًا سَآئِغًا لِّلشَّـٰرِبِينَ

Transliteration wa-inna lakum fī l-anʿāmi laʿib'ratan nus'qīkum mimmā fī buṭūnihi min bayni farthin wadamin labanan khāliṣan sāighan lilshāribīna

Telugu మరియు నిశ్చయంగా, మీకు పశువులలో ఒక గుణపాఠం ది. వాటి కడుపులలో ఉన్న దానిని (పాలను) మేము మీకు త్రాగటానికి ఇస్తున్నాము. అది మలం మరియు రక్తముల మధ్యనున్న నిర్మలమైన (స్వచ్ఛమైన) పాలు, త్రాగేవారికి ఎంతో రుచికరమైనది.

Verse 67

وَمِن ثَمَرَٰتِ ٱلنَّخِيلِ وَٱلْأَعْنَـٰبِ تَتَّخِذُونَ مِنْهُ سَكَرًا وَرِزْقًا حَسَنًا ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّقَوْمٍ يَعْقِلُونَ

Transliteration wamin thamarāti l-nakhīli wal-aʿnābi tattakhidhūna min'hu sakaran wariz'qan ḥasanan inna fī dhālika laāyatan liqawmin yaʿqilūna

Telugu మరియు ఖర్జూరపు మరియు ద్రాక్ష ఫలాల నుండి మీరు మత్తుపానీయం మరియు మంచి ఆహారం కూడా పొందుతారు. నిశ్చయంగా, ఇందులో బుద్ధిమంతులకు సూచన ఉంది.

Verse 68

وَأَوْحَىٰ رَبُّكَ إِلَى ٱلنَّحْلِ أَنِ ٱتَّخِذِى مِنَ ٱلْجِبَالِ بُيُوتًا وَمِنَ ٱلشَّجَرِ وَمِمَّا يَعْرِشُونَ

Transliteration wa-awḥā rabbuka ilā l-naḥli ani ittakhidhī mina l-jibāli buyūtan wamina l-shajari wamimmā yaʿrishūna

Telugu మరియు నీ ప్రభువు తేనెటీగకు ఈ విధంగా ఆదేశమిచ్చాడు: "నీవు కొండలలో, చెట్లలో మరియు మానవుల కట్టడాలలో నీ తెట్టెలను కట్టుకో!

Verse 69

ثُمَّ كُلِى مِن كُلِّ ٱلثَّمَرَٰتِ فَٱسْلُكِى سُبُلَ رَبِّكِ ذُلُلًا ۚ يَخْرُجُ مِنۢ بُطُونِهَا شَرَابٌ مُّخْتَلِفٌ أَلْوَٰنُهُۥ فِيهِ شِفَآءٌ لِّلنَّاسِ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّقَوْمٍ يَتَفَكَّرُونَ

Transliteration thumma kulī min kulli l-thamarāti fa-us'lukī subula rabbiki dhululan yakhruju min buṭūnihā sharābun mukh'talifun alwānuhu fīhi shifāon lilnnāsi inna fī dhālika laāyatan liqawmin yatafakkarūna

Telugu తరువాత అన్నిరకాల ఫలాలను తిను. ఇలా నీ ప్రభువు మార్గాలపై నమ్రతతో నడువు." దాని కడుపు నుండి రంగు రంగుల పానకం (తేనే) ప్రసవిస్తుంది; అందులో మానవులకు వ్యాధి నివారణ ఉంది. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి సూచన ఉంది.

Verse 70

وَٱللَّهُ خَلَقَكُمْ ثُمَّ يَتَوَفَّىٰكُمْ ۚ وَمِنكُم مَّن يُرَدُّ إِلَىٰٓ أَرْذَلِ ٱلْعُمُرِ لِكَىْ لَا يَعْلَمَ بَعْدَ عِلْمٍ شَيْـًٔا ۚ إِنَّ ٱللَّهَ عَلِيمٌ قَدِيرٌ

Transliteration wal-lahu khalaqakum thumma yatawaffākum waminkum man yuraddu ilā ardhali l-ʿumuri likay lā yaʿlama baʿda ʿil'min shayan inna l-laha ʿalīmun qadīrun

Telugu మరియు అల్లాహ్ యే మిమ్మల్ని సృష్టించాడు, తరువాత మిమ్మల్ని మరణింపజేస్తాడు. మరియు మీలో కొందరు అతి నికృష్టమైన (ముసలి) వయస్సుకు చేరుతారు. అప్పుడు అతడు అంతా తెలిసినా, ఏమీ తెలియని వాడిగా అయి పోతాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వ సమర్ధుడు.

Verse 71

وَٱللَّهُ فَضَّلَ بَعْضَكُمْ عَلَىٰ بَعْضٍ فِى ٱلرِّزْقِ ۚ فَمَا ٱلَّذِينَ فُضِّلُوا۟ بِرَآدِّى رِزْقِهِمْ عَلَىٰ مَا مَلَكَتْ أَيْمَـٰنُهُمْ فَهُمْ فِيهِ سَوَآءٌ ۚ أَفَبِنِعْمَةِ ٱللَّهِ يَجْحَدُونَ

Transliteration wal-lahu faḍḍala baʿḍakum ʿalā baʿḍin fī l-riz'qi famā alladhīna fuḍḍilū birāddī riz'qihim ʿalā mā malakat aymānuhum fahum fīhi sawāon afabiniʿ'mati l-lahi yajḥadūna

Telugu మరియు అల్లాహ్ జీవనోపాధి విషయంలో మీలో కొందరికి మరికొందరిపై ఆధిక్యతను ప్రసాదించాడు. కాని ఈ ఆధిక్యత ఇవ్వబడిన వారు తమ జీవనోపాధిని తమ ఆధీనంలో ఉన్న వారికి (బానిసలకు) ఇవ్వటానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు తమతో సమానులు అవుతారేమోనని! ఏమీ? వారు అల్లాహ్ అనుగ్రహాన్ని తిరస్కరిస్తున్నారా?

Verse 72

وَٱللَّهُ جَعَلَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَٰجًا وَجَعَلَ لَكُم مِّنْ أَزْوَٰجِكُم بَنِينَ وَحَفَدَةً وَرَزَقَكُم مِّنَ ٱلطَّيِّبَـٰتِ ۚ أَفَبِٱلْبَـٰطِلِ يُؤْمِنُونَ وَبِنِعْمَتِ ٱللَّهِ هُمْ يَكْفُرُونَ

Transliteration wal-lahu jaʿala lakum min anfusikum azwājan wajaʿala lakum min azwājikum banīna waḥafadatan warazaqakum mina l-ṭayibāti afabil-bāṭili yu'minūna wabiniʿ'mati l-lahi hum yakfurūna

Telugu మరియు అల్లాహ్ మీ వంటి వారి నుండియే మీ సహవాసులను (అజ్వాజ్ లను) పుట్టించాడు. మరియు మీ సహవాసుల నుండి మీకు పిల్లలను మరియు మనమళ్ళను ప్రసాదించి, మీకు ఉత్తమమైన జీవనోపాధులను కూడా సమకూర్చాడు. అయినా వారు (మానవులు) అసత్యమైన వాటిని (దైవాలుగా) విశ్వసించి, అల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరిస్తారా?

Verse 73

وَيَعْبُدُونَ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَمْلِكُ لَهُمْ رِزْقًا مِّنَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ شَيْـًٔا وَلَا يَسْتَطِيعُونَ

Transliteration wayaʿbudūna min dūni l-lahi mā lā yamliku lahum riz'qan mina l-samāwāti wal-arḍi shayan walā yastaṭīʿūna

Telugu మరియు వారు అల్లాహ్ ను వదలి ఆకాశాల నుండి గానీ, భూమి నుండి గానీ వారికి ఎలాంటి జీవనోపాధిని సమకూర్చలేని మరియు కనీసం (సమకూర్చే) సామర్థ్యం కూడా లేని వారిని ఆరాధిస్తున్నారు.

Verse 74

فَلَا تَضْرِبُوا۟ لِلَّهِ ٱلْأَمْثَالَ ۚ إِنَّ ٱللَّهَ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ

Transliteration falā taḍribū lillahi l-amthāla inna l-laha yaʿlamu wa-antum lā taʿlamūna

Telugu కావున అల్లాహ్ కు పోలికలు కల్పించకండి. నిశ్చయంగా, అల్లాహ్ కు అంతా తెలుసు మరియు మీకేమీ తెలియదు.

Verse 75

۞ ضَرَبَ ٱللَّهُ مَثَلًا عَبْدًا مَّمْلُوكًا لَّا يَقْدِرُ عَلَىٰ شَىْءٍ وَمَن رَّزَقْنَـٰهُ مِنَّا رِزْقًا حَسَنًا فَهُوَ يُنفِقُ مِنْهُ سِرًّا وَجَهْرًا ۖ هَلْ يَسْتَوُۥنَ ۚ ٱلْحَمْدُ لِلَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ

Transliteration ḍaraba l-lahu mathalan ʿabdan mamlūkan lā yaqdiru ʿalā shayin waman razaqnāhu minnā riz'qan ḥasanan fahuwa yunfiqu min'hu sirran wajahran hal yastawūna l-ḥamdu lillahi bal aktharuhum lā yaʿlamūna

Telugu అల్లాహ్ ఒక ఉపమానం ఇచ్చాడు: ఒకడు బానిసగా ఇతరుని యాజమాన్యంలో ఉన్నవాడు. అతడు ఏ విధమైన అధికారం లేని వాడు, మరొకడు మా నుండి మంచి జీవనోపాధి పొందిన వాడు. అతడు దానిలో నుండి రహస్యంగాను మరియు బహిరంగంగాను ఖర్చు చేయగల వాడు. ఏమీ? వీరిద్దరు సమానులవుతారా? సర్వస్తోత్రాలకు అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే! కానీ, చాలా మందికి ఇది తెలియదు.

Verse 76

وَضَرَبَ ٱللَّهُ مَثَلًا رَّجُلَيْنِ أَحَدُهُمَآ أَبْكَمُ لَا يَقْدِرُ عَلَىٰ شَىْءٍ وَهُوَ كَلٌّ عَلَىٰ مَوْلَىٰهُ أَيْنَمَا يُوَجِّههُّ لَا يَأْتِ بِخَيْرٍ ۖ هَلْ يَسْتَوِى هُوَ وَمَن يَأْمُرُ بِٱلْعَدْلِ ۙ وَهُوَ عَلَىٰ صِرَٰطٍ مُّسْتَقِيمٍ

Transliteration waḍaraba l-lahu mathalan rajulayni aḥaduhumā abkamu lā yaqdiru ʿalā shayin wahuwa kallun ʿalā mawlāhu aynamā yuwajjihhu lā yati bikhayrin hal yastawī huwa waman yamuru bil-ʿadli wahuwa ʿalā ṣirāṭin mus'taqīmin

Telugu అల్లాహ్ ఇద్దరు పురుషుల, మరొక ఉపమానం ఇచ్చాడు: వారిలో ఒకడు మూగవాడు, అతడు ఏమీ చేయలేడు, అతడు తన యజమానికి భారమై ఉన్నాడు. అతనిని ఎక్కడికి పంపినా మేలైనపని చేయలేడు. ఏమీ? ఇటువంటి వాడు మరొకతనితో - ఎవడైతే న్యాయాన్ని పాటిస్తూ, ఋజుమార్గంపై నడుస్తున్నాడో - సమానుడు కాగలడా?

Verse 77

وَلِلَّهِ غَيْبُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَمَآ أَمْرُ ٱلسَّاعَةِ إِلَّا كَلَمْحِ ٱلْبَصَرِ أَوْ هُوَ أَقْرَبُ ۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ

Transliteration walillahi ghaybu l-samāwāti wal-arḍi wamā amru l-sāʿati illā kalamḥi l-baṣari aw huwa aqrabu inna l-laha ʿalā kulli shayin qadīrun

Telugu మరియు ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న అగోచర విషయాల జ్ఞానం కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది. అంతిమ ఘడియ కేవలం రెప్పపాటు కాలంలో లేదా అంతకు ముందే సంభవించవచ్చు! నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.

Verse 78

وَٱللَّهُ أَخْرَجَكُم مِّنۢ بُطُونِ أُمَّهَـٰتِكُمْ لَا تَعْلَمُونَ شَيْـًٔا وَجَعَلَ لَكُمُ ٱلسَّمْعَ وَٱلْأَبْصَـٰرَ وَٱلْأَفْـِٔدَةَ ۙ لَعَلَّكُمْ تَشْكُرُونَ

Transliteration wal-lahu akhrajakum min buṭūni ummahātikum lā taʿlamūna shayan wajaʿala lakumu l-samʿa wal-abṣāra wal-afidata laʿallakum tashkurūna

Telugu మరియు అల్లాహ్, మిమ్మల్ని మీ తల్లుల గర్భాల నుండి, బయటికి తీశాడు (పుట్టించాడు) అప్పుడు మీకేమీ తెలియదు. మరియు మీకు వినికిడినీ, దృష్టినీ మరియు హృదయాలను ప్రసాదించాడు. బహుశా మీరు కృతజ్ఞులై ఉంటారని.

Verse 79

أَلَمْ يَرَوْا۟ إِلَى ٱلطَّيْرِ مُسَخَّرَٰتٍ فِى جَوِّ ٱلسَّمَآءِ مَا يُمْسِكُهُنَّ إِلَّا ٱللَّهُ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ

Transliteration alam yaraw ilā l-ṭayri musakharātin fī jawwi l-samāi mā yum'sikuhunna illā l-lahu inna fī dhālika laāyātin liqawmin yu'minūna

Telugu ఏమీ? వారు పక్షులను ఆకాశం మధ్యలో తాటస్థ్య స్థితిలో (పడిపోకుండా) ఎగురుతూ ఉండేది, గమనించడం లేదా? వాటిని అల్లాహ్ తప్ప ఇతరులెవ్వరూ (ఆకాశంలో) నిలుపలేరు. నిశ్చయంగా, ఇందులో విశ్వసించేవారికి సూచనలున్నాయి.

Verse 80

وَٱللَّهُ جَعَلَ لَكُم مِّنۢ بُيُوتِكُمْ سَكَنًا وَجَعَلَ لَكُم مِّن جُلُودِ ٱلْأَنْعَـٰمِ بُيُوتًا تَسْتَخِفُّونَهَا يَوْمَ ظَعْنِكُمْ وَيَوْمَ إِقَامَتِكُمْ ۙ وَمِنْ أَصْوَافِهَا وَأَوْبَارِهَا وَأَشْعَارِهَآ أَثَـٰثًا وَمَتَـٰعًا إِلَىٰ حِينٍ

Transliteration wal-lahu jaʿala lakum min buyūtikum sakanan wajaʿala lakum min julūdi l-anʿāmi buyūtan tastakhiffūnahā yawma ẓaʿnikum wayawma iqāmatikum wamin aṣwāfihā wa-awbārihā wa-ashʿārihā athāthan wamatāʿan ilā ḥīnin

Telugu మరియు అల్లాహ్ మీకు, మీ గృహాలలో నివాసం ఏర్పరిచాడు. మరియు పశువుల చర్మాలతో మీకు ఇండ్లు (గుడారాలు) నిర్మించాడు. అవి మీకు ప్రయాణంలో ఉన్నప్పుడు మరియు మీరు బస చేసినప్పుడు, చాలా తేలికగా ఉంటాయి. వాటి ఉన్నితో, బొచ్చుగల చర్మాలతో మరియు వెంట్రుకలతో గృహోపలంకరణ సామగ్రి మరియు కొంతకాలం సుఖంగా గడుపుకునే వస్తువులను (మీ కొరకు సృష్టించాడు).

Verse 81

وَٱللَّهُ جَعَلَ لَكُم مِّمَّا خَلَقَ ظِلَـٰلًا وَجَعَلَ لَكُم مِّنَ ٱلْجِبَالِ أَكْنَـٰنًا وَجَعَلَ لَكُمْ سَرَٰبِيلَ تَقِيكُمُ ٱلْحَرَّ وَسَرَٰبِيلَ تَقِيكُم بَأْسَكُمْ ۚ كَذَٰلِكَ يُتِمُّ نِعْمَتَهُۥ عَلَيْكُمْ لَعَلَّكُمْ تُسْلِمُونَ

Transliteration wal-lahu jaʿala lakum mimmā khalaqa ẓilālan wajaʿala lakum mina l-jibāli aknānan wajaʿala lakum sarābīla taqīkumu l-ḥara wasarābīla taqīkum basakum kadhālika yutimmu niʿ'matahu ʿalaykum laʿallakum tus'limūna

Telugu మరియు అల్లాహ్ తాను సృష్టించిన వస్తువులలో కొన్నింటిని నీడ కొరకు నియమించాడు మరియు పర్వతాలలో మీకు రక్షణా స్థలాలను ఏర్పరచాడు. మరియు మీరు వేడి నుండి కాపాడుకోవటానికి వస్త్రాలను మరియు యుద్ధం నుండి కాపాడుకోవటానికి కవచాలను ఇచ్చాడు. మీరు ఆయనకు విధేయులై ఉండాలని, ఈ విధంగా ఆయన మీపై తన అనుగ్రహాలను పూర్తి చేస్తున్నాడు.

Verse 82

فَإِن تَوَلَّوْا۟ فَإِنَّمَا عَلَيْكَ ٱلْبَلَـٰغُ ٱلْمُبِينُ

Transliteration fa-in tawallaw fa-innamā ʿalayka l-balāghu l-mubīnu

Telugu (ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు వెనుదిరిగితే, నీ కర్తవ్యం కేవలం సందేశాన్ని స్పష్టంగా అందజేయటం మాత్రమే!

Verse 83

يَعْرِفُونَ نِعْمَتَ ٱللَّهِ ثُمَّ يُنكِرُونَهَا وَأَكْثَرُهُمُ ٱلْكَـٰفِرُونَ

Transliteration yaʿrifūna niʿ'mata l-lahi thumma yunkirūnahā wa-aktharuhumu l-kāfirūna

Telugu వారు అల్లాహ్ ఉపకారాన్ని గుర్తించిన తరువాత దానిని నిరాకరిస్తున్నారు మరియు వారిలో చాలా మంది సత్యతిరస్కారులే!

Verse 84

وَيَوْمَ نَبْعَثُ مِن كُلِّ أُمَّةٍ شَهِيدًا ثُمَّ لَا يُؤْذَنُ لِلَّذِينَ كَفَرُوا۟ وَلَا هُمْ يُسْتَعْتَبُونَ

Transliteration wayawma nabʿathu min kulli ummatin shahīdan thumma lā yu'dhanu lilladhīna kafarū walā hum yus'taʿtabūna

Telugu మరియు (జ్ఞాపకం ఉంచుకోండి) ఆ రోజు మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని లేపి నిలబెడ్తాము. అప్పుడు సత్యతిరస్కారులకు ఏ విధమైన (సాకులు చెప్పటానికి) అనుమతి ఇవ్వబడదు మరియు వారికి పశ్చాత్తాప పడే అవకాశం కూడా ఇవ్వబడదు.

Verse 85

وَإِذَا رَءَا ٱلَّذِينَ ظَلَمُوا۟ ٱلْعَذَابَ فَلَا يُخَفَّفُ عَنْهُمْ وَلَا هُمْ يُنظَرُونَ

Transliteration wa-idhā raā alladhīna ẓalamū l-ʿadhāba falā yukhaffafu ʿanhum walā hum yunẓarūna

Telugu మరియు దుర్మార్గులు ఆ శిక్షను చూసినప్పుడు, అది వారి కొరకు తగ్గించడం జరుగదు మరియు వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడదు.

Verse 86

وَإِذَا رَءَا ٱلَّذِينَ أَشْرَكُوا۟ شُرَكَآءَهُمْ قَالُوا۟ رَبَّنَا هَـٰٓؤُلَآءِ شُرَكَآؤُنَا ٱلَّذِينَ كُنَّا نَدْعُوا۟ مِن دُونِكَ ۖ فَأَلْقَوْا۟ إِلَيْهِمُ ٱلْقَوْلَ إِنَّكُمْ لَكَـٰذِبُونَ

Transliteration wa-idhā raā alladhīna ashrakū shurakāahum qālū rabbanā hāulāi shurakāunā alladhīna kunnā nadʿū min dūnika fa-alqaw ilayhimu l-qawla innakum lakādhibūna

Telugu మరియు (అల్లాహ్ కు) సాటి కల్పించిన వారు, తాము సాటిగా నిలిపిన వారిని చూసి అంటారు: "ఓ మా ప్రభూ! వీరే మేము నీకు సాటి కల్పించి, నీకు బదులుగా ఆరాధించిన వారు." కాని (సాటిగా నిలుపబడిన) వారు, సాటి కల్పించిన వారి మాటలను వారి వైపుకే విసురుతూ అంటారు: "నిశ్చయంగా, మీరు అసత్యవాదులు."

Verse 87

وَأَلْقَوْا۟ إِلَى ٱللَّهِ يَوْمَئِذٍ ٱلسَّلَمَ ۖ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا۟ يَفْتَرُونَ

Transliteration wa-alqaw ilā l-lahi yawma-idhin l-salama waḍalla ʿanhum mā kānū yaftarūna

Telugu మరియు ఆ రోజు (అందరూ) వినమ్రులై తమను తాము అల్లాహ్ కు అప్పగించుకుంటారు. వారు కల్పించినవి (దైవాలు) వారిని త్యజించి ఉంటాయి.

Verse 88

ٱلَّذِينَ كَفَرُوا۟ وَصَدُّوا۟ عَن سَبِيلِ ٱللَّهِ زِدْنَـٰهُمْ عَذَابًا فَوْقَ ٱلْعَذَابِ بِمَا كَانُوا۟ يُفْسِدُونَ

Transliteration alladhīna kafarū waṣaddū ʿan sabīli l-lahi zid'nāhum ʿadhāban fawqa l-ʿadhābi bimā kānū yuf'sidūna

Telugu ఎవరైతే సత్యాన్ని తిరస్కరించి (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి నిరోధించారో వారికి, మేము వారు చేస్తూ ఉండిన దౌర్జన్యాలకు శిక్ష మీద శిక్ష విధిస్తాము.

Verse 89

وَيَوْمَ نَبْعَثُ فِى كُلِّ أُمَّةٍ شَهِيدًا عَلَيْهِم مِّنْ أَنفُسِهِمْ ۖ وَجِئْنَا بِكَ شَهِيدًا عَلَىٰ هَـٰٓؤُلَآءِ ۚ وَنَزَّلْنَا عَلَيْكَ ٱلْكِتَـٰبَ تِبْيَـٰنًا لِّكُلِّ شَىْءٍ وَهُدًى وَرَحْمَةً وَبُشْرَىٰ لِلْمُسْلِمِينَ

Transliteration wayawma nabʿathu fī kulli ummatin shahīdan ʿalayhim min anfusihim waji'nā bika shahīdan ʿalā hāulāi wanazzalnā ʿalayka l-kitāba tib'yānan likulli shayin wahudan waraḥmatan wabush'rā lil'mus'limīna

Telugu మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు మేము ప్రతి సమాజంలో నుండి వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చే వానిని (ప్రవక్తను) లేపి నిలబెడ్తాము. మరియు (ఓ ప్రవక్తా!) మేము నిన్ను వీరికి వ్యతిరేకంగా సాక్ష్యమివ్వటానికి తీసుకువస్తాము. ప్రతి విషయాన్ని స్పష్టపరచటానికి నీపై ఈ దివ్యగ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు ఇందులో అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన వారికి మార్గదర్శకత్వం, కారుణ్యం మరియు శుభవార్తలూ ఉన్నాయి.

Verse 90

۞ إِنَّ ٱللَّهَ يَأْمُرُ بِٱلْعَدْلِ وَٱلْإِحْسَـٰنِ وَإِيتَآئِ ذِى ٱلْقُرْبَىٰ وَيَنْهَىٰ عَنِ ٱلْفَحْشَآءِ وَٱلْمُنكَرِ وَٱلْبَغْىِ ۚ يَعِظُكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُونَ

Transliteration inna l-laha yamuru bil-ʿadli wal-iḥ'sāni waītāi dhī l-qur'bā wayanhā ʿani l-faḥshāi wal-munkari wal-baghyi yaʿiẓukum laʿallakum tadhakkarūna

Telugu నిశ్చయంగా, అల్లాహ్ న్యాయం చేయమని మరియు (ఇతరులకు) మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం చేయమని మరియు అశ్లీలత, అధర్మం మరియు దౌర్జన్యాలకు దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఈ విధంగా మీకు బోధిస్తున్నాడు, బహుశా మీరు హితబోధ గ్రహిస్తారని.

Verse 91

وَأَوْفُوا۟ بِعَهْدِ ٱللَّهِ إِذَا عَـٰهَدتُّمْ وَلَا تَنقُضُوا۟ ٱلْأَيْمَـٰنَ بَعْدَ تَوْكِيدِهَا وَقَدْ جَعَلْتُمُ ٱللَّهَ عَلَيْكُمْ كَفِيلًا ۚ إِنَّ ٱللَّهَ يَعْلَمُ مَا تَفْعَلُونَ

Transliteration wa-awfū biʿahdi l-lahi idhā ʿāhadttum walā tanquḍū l-aymāna baʿda tawkīdihā waqad jaʿaltumu l-laha ʿalaykum kafīlan inna l-laha yaʿlamu mā tafʿalūna

Telugu మరియు మీరు అల్లాహ్ పేరుతో వాగ్దానం చేస్తే మీ వాగ్దానాలను తప్పక నెరవేర్చండి. మరియు మీరు ప్రమాణాలను దృఢపరచిన తర్వాత భంగపరచకండి. (ఎందుకంటే) వాస్తవానికి, మీరు అల్లాహ్ ను మీకు జామీనుదారుగా చేసుకున్నారు. నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.

Verse 92

وَلَا تَكُونُوا۟ كَٱلَّتِى نَقَضَتْ غَزْلَهَا مِنۢ بَعْدِ قُوَّةٍ أَنكَـٰثًا تَتَّخِذُونَ أَيْمَـٰنَكُمْ دَخَلًۢا بَيْنَكُمْ أَن تَكُونَ أُمَّةٌ هِىَ أَرْبَىٰ مِنْ أُمَّةٍ ۚ إِنَّمَا يَبْلُوكُمُ ٱللَّهُ بِهِۦ ۚ وَلَيُبَيِّنَنَّ لَكُمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ مَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ

Transliteration walā takūnū ka-allatī naqaḍat ghazlahā min baʿdi quwwatin ankāthan tattakhidhūna aymānakum dakhalan baynakum an takūna ummatun hiya arbā min ummatin innamā yablūkumu l-lahu bihi walayubayyinanna lakum yawma l-qiyāmati mā kuntum fīhi takhtalifūna

Telugu మరియు మీరు ఆ స్త్రీవలే కాకండి, ఏ స్త్రీ అయితే స్వయంగా కష్టపడి నూలు వడికి గట్టి దారాన్ని చేసిన తరువాత దాన్ని ముక్కులు ముక్కులుగా త్రెంచి వేసిందో! ఒక వర్గం వారు మరొక వర్గం వారి కంటే అధికంగా ఉన్నారని, పరస్పరం మోసగించుకోవటానికి, మీ ప్రమాణాలను ఉపయోగించుకోకండి. నిశ్చయంగా అల్లాహ్ మిమ్మల్ని వీటి (ఈ ప్రమాణాల) ద్వారా పరీక్షిస్తున్నాడు. మరియు నిశ్చయంగా, పునరుత్థాన దినమున ఆయన మీకు, మీరు వాదులాడే విషయాలను గురించి స్పష్టంగా తెలియజేస్తాడు.

Verse 93

وَلَوْ شَآءَ ٱللَّهُ لَجَعَلَكُمْ أُمَّةً وَٰحِدَةً وَلَـٰكِن يُضِلُّ مَن يَشَآءُ وَيَهْدِى مَن يَشَآءُ ۚ وَلَتُسْـَٔلُنَّ عَمَّا كُنتُمْ تَعْمَلُونَ

Transliteration walaw shāa l-lahu lajaʿalakum ummatan wāḥidatan walākin yuḍillu man yashāu wayahdī man yashāu walatus'alunna ʿammā kuntum taʿmalūna

Telugu ఒకవేళ అల్లాహ్ కోరితే మిమ్మల్ని అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. కాని ఆయన తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురి చేస్తాడు. మరియు తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. మరియు నిశ్చయంగా, మీరు చేస్తున్న కర్మలను గురించి మీరు తప్పక ప్రశ్నించబడతారు.

Verse 94

وَلَا تَتَّخِذُوٓا۟ أَيْمَـٰنَكُمْ دَخَلًۢا بَيْنَكُمْ فَتَزِلَّ قَدَمٌۢ بَعْدَ ثُبُوتِهَا وَتَذُوقُوا۟ ٱلسُّوٓءَ بِمَا صَدَدتُّمْ عَن سَبِيلِ ٱللَّهِ ۖ وَلَكُمْ عَذَابٌ عَظِيمٌ

Transliteration walā tattakhidhū aymānakum dakhalan baynakum fatazilla qadamun baʿda thubūtihā watadhūqū l-sūa bimā ṣadadttum ʿan sabīli l-lahi walakum ʿadhābun ʿaẓīmun

Telugu మరియు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకోవటానికి ఉపయోగించుకోకండి. అలా చేస్తే స్థిరపడిన పాదాలు జారిపోవచ్చు మరియు మీరు అల్లాహ్ మార్గం నుండి ప్రజలను నిరోధించిన పాప ఫలితాన్ని రుచి చూడగలరు. మరియు మీకు ఘోరమైన శిక్ష పడగలదు.

Verse 95

وَلَا تَشْتَرُوا۟ بِعَهْدِ ٱللَّهِ ثَمَنًا قَلِيلًا ۚ إِنَّمَا عِندَ ٱللَّهِ هُوَ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ

Transliteration walā tashtarū biʿahdi l-lahi thamanan qalīlan innamā ʿinda l-lahi huwa khayrun lakum in kuntum taʿlamūna

Telugu మరియు మీరు అల్లాహ్ తో చేసిన వాగ్దానాన్ని స్పల్పలాభానికి అమ్ముకోకండి. మీరు తెలుసుకోగలిగితే, నిశ్చయంగా, అల్లాహ్ వద్ద ఉన్నదే మీకు ఎంతో మేలైనది.

Verse 96

مَا عِندَكُمْ يَنفَدُ ۖ وَمَا عِندَ ٱللَّهِ بَاقٍ ۗ وَلَنَجْزِيَنَّ ٱلَّذِينَ صَبَرُوٓا۟ أَجْرَهُم بِأَحْسَنِ مَا كَانُوا۟ يَعْمَلُونَ

Transliteration mā ʿindakum yanfadu wamā ʿinda l-lahi bāqin walanajziyanna alladhīna ṣabarū ajrahum bi-aḥsani mā kānū yaʿmalūna

Telugu మీ దగ్గర ఉన్నదంతా నశించేదే. మరియు అల్లాహ్ వద్ద ఉన్నదే (శాశ్వతంగా) మిగిలేది! మరియు మేము సహనం వహించేవారికి, వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.

Verse 97

مَنْ عَمِلَ صَـٰلِحًا مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَلَنُحْيِيَنَّهُۥ حَيَوٰةً طَيِّبَةً ۖ وَلَنَجْزِيَنَّهُمْ أَجْرَهُم بِأَحْسَنِ مَا كَانُوا۟ يَعْمَلُونَ

Transliteration man ʿamila ṣāliḥan min dhakarin aw unthā wahuwa mu'minun falanuḥ'yiyannahu ḥayatan ṭayyibatan walanajziyannahum ajrahum bi-aḥsani mā kānū yaʿmalūna

Telugu ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.

Verse 98

فَإِذَا قَرَأْتَ ٱلْقُرْءَانَ فَٱسْتَعِذْ بِٱللَّهِ مِنَ ٱلشَّيْطَـٰنِ ٱلرَّجِيمِ

Transliteration fa-idhā qarata l-qur'āna fa-is'taʿidh bil-lahi mina l-shayṭāni l-rajīmi

Telugu కావున నీవు ఖుర్ఆన్ పఠించబోయేటప్పుడు శపించబడిన (బహిష్కరించబడిన) షైతాన్ నుండి (రక్షణ పొందటానికి) అల్లాహ్ శరణు వేడుకో!

Verse 99

إِنَّهُۥ لَيْسَ لَهُۥ سُلْطَـٰنٌ عَلَى ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ

Transliteration innahu laysa lahu sul'ṭānun ʿalā alladhīna āmanū waʿalā rabbihim yatawakkalūna

Telugu విశ్వసించి, తమ ప్రభువును నమ్ముకున్న వారిపై నిశ్చయంగా, వాడికి ఎలాంటి అధికారం ఉండదు.

Verse 100

إِنَّمَا سُلْطَـٰنُهُۥ عَلَى ٱلَّذِينَ يَتَوَلَّوْنَهُۥ وَٱلَّذِينَ هُم بِهِۦ مُشْرِكُونَ

Transliteration innamā sul'ṭānuhu ʿalā alladhīna yatawallawnahu wa-alladhīna hum bihi mush'rikūna

Telugu కాని! నిశ్చయంగా, వాడి (షైతాన్) వైపుకు మరలి వాడిని అనుసరించే (స్నేహం చేసుకునే) వారిపై మరియు ఆయనకు (అల్లాహ్ కు) సాటి కల్పించే వారిపై, వాడికి అధికారం ఉంటుంది.

Verse 101

وَإِذَا بَدَّلْنَآ ءَايَةً مَّكَانَ ءَايَةٍ ۙ وَٱللَّهُ أَعْلَمُ بِمَا يُنَزِّلُ قَالُوٓا۟ إِنَّمَآ أَنتَ مُفْتَرٍۭ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ

Transliteration wa-idhā baddalnā āyatan makāna āyatin wal-lahu aʿlamu bimā yunazzilu qālū innamā anta muf'tarin bal aktharuhum lā yaʿlamūna

Telugu మరియు మేము ఒక సందేశాన్ని (ఆయత్ ను) మార్చి దాని స్థానంలో మరొక సందేశాన్ని అవతరింపజేసినప్పుడు; తాను దేన్ని ఎప్పుడు అవతరింపజేశాడో అల్లాహ్ కు బాగా తెలుసు. (అయినా) వారు (సత్యతిరస్కారులు) ఇలా అంటారు: "నిశ్చయంగా నీవే (ఓ ముహమ్మద్!) దీనిని కల్పించేవాడవు." అసలు వారిలో చాలా మంది (యథార్థం) తెలుసుకోలేరు.

Verse 102

قُلْ نَزَّلَهُۥ رُوحُ ٱلْقُدُسِ مِن رَّبِّكَ بِٱلْحَقِّ لِيُثَبِّتَ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَهُدًى وَبُشْرَىٰ لِلْمُسْلِمِينَ

Transliteration qul nazzalahu rūḥu l-qudusi min rabbika bil-ḥaqi liyuthabbita alladhīna āmanū wahudan wabush'rā lil'mus'limīna

Telugu వారితో అను: "దీనిని (ఈ ఖుర్ఆన్ ను) నీ ప్రభువు వద్ద నుండి సత్యంతో, విశ్వాసులను (విశ్వాసంలో) పటిష్టం చేయటానికి మరియు (అల్లాహ్ కు) సంపూర్ణంగా విధేయులుగా ఉన్న వారికి (ముస్లింలకు) సన్మార్గం చూపటానికి మరియు శుభవార్త అందజేయటానికి, పరిశుద్ధాత్మ (జిబ్రీల్) క్రమక్రమంగా ఉన్నది ఉన్నట్లుగా తీసుకొని వచ్చాడు."

Verse 103

وَلَقَدْ نَعْلَمُ أَنَّهُمْ يَقُولُونَ إِنَّمَا يُعَلِّمُهُۥ بَشَرٌ ۗ لِّسَانُ ٱلَّذِى يُلْحِدُونَ إِلَيْهِ أَعْجَمِىٌّ وَهَـٰذَا لِسَانٌ عَرَبِىٌّ مُّبِينٌ

Transliteration walaqad naʿlamu annahum yaqūlūna innamā yuʿallimuhu basharun lisānu alladhī yul'ḥidūna ilayhi aʿjamiyyun wahādhā lisānun ʿarabiyyun mubīnun

Telugu మరియు: "నిశ్చయంగా, ఇతనికి ఒక మనిషి నేర్పుతున్నాడు." అని, వారు అనే విషయం మాకు బాగా తెలుసు. వారు సూచించే (అపార్థం చేసే) వ్యక్తి భాష పరాయి భాష. కాని ఈ (ఖుర్ఆన్) భాష స్వచ్ఛమైన అరబ్బీ భాష.

Verse 104

إِنَّ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِـَٔايَـٰتِ ٱللَّهِ لَا يَهْدِيهِمُ ٱللَّهُ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ

Transliteration inna alladhīna lā yu'minūna biāyāti l-lahi lā yahdīhimu l-lahu walahum ʿadhābun alīmun

Telugu నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ సందేశాలను (ఆయాత్ లను) విశ్వసించరో! వారికి అల్లాహ్ సన్మార్గం చూపడు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

Verse 105

إِنَّمَا يَفْتَرِى ٱلْكَذِبَ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِـَٔايَـٰتِ ٱللَّهِ ۖ وَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْكَـٰذِبُونَ

Transliteration innamā yaftarī l-kadhiba alladhīna lā yu'minūna biāyāti l-lahi wa-ulāika humu l-kādhibūna

Telugu నిశ్చయంగా, అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) విశ్వసించని వారు, అబద్ధాలను కల్పిస్తున్నారు. మరియు అలాంటివారు! వారే, అసత్యవాదులు.

Verse 106

مَن كَفَرَ بِٱللَّهِ مِنۢ بَعْدِ إِيمَـٰنِهِۦٓ إِلَّا مَنْ أُكْرِهَ وَقَلْبُهُۥ مُطْمَئِنٌّۢ بِٱلْإِيمَـٰنِ وَلَـٰكِن مَّن شَرَحَ بِٱلْكُفْرِ صَدْرًا فَعَلَيْهِمْ غَضَبٌ مِّنَ ٱللَّهِ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ

Transliteration man kafara bil-lahi min baʿdi īmānihi illā man uk'riha waqalbuhu muṭ'ma-innun bil-īmāni walākin man sharaḥa bil-kuf'ri ṣadran faʿalayhim ghaḍabun mina l-lahi walahum ʿadhābun ʿaẓīmun

Telugu ఎవడైతే విశ్వసించిన తరువాత, అల్లాహ్ ను తిరస్కరిస్తాడో - తన హృదయం సంతృప్తికరమైన విశ్వాసంతో నిండి ఉండి, బలవంతంగా తిరస్కరించేవాడు తప్ప - మరియు ఎవరైతే హృదయపూర్వకంగా సత్యతిరస్కారానికి పాల్పడతారో, అలాంటి వారిపై అల్లాహ్ ఆగ్రహం (దూషణ) విరుచుకు పడుతుంది. మరియు వారి కొరకు ఘోరమైన శిక్ష ఉంటుంది.

Verse 107

ذَٰلِكَ بِأَنَّهُمُ ٱسْتَحَبُّوا۟ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا عَلَى ٱلْـَٔاخِرَةِ وَأَنَّ ٱللَّهَ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلْكَـٰفِرِينَ

Transliteration dhālika bi-annahumu is'taḥabbū l-ḥayata l-dun'yā ʿalā l-ākhirati wa-anna l-laha lā yahdī l-qawma l-kāfirīna

Telugu ఇది ఎందుకంటే! నిశ్చయంగా, వారు పరలోక జీవితం కంటే ఇహలోక జీవితాన్నే ఎక్కువగా ప్రేమించటం మరియు నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులకు సన్మార్గం చూపడు.

Verse 108

أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ طَبَعَ ٱللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ وَسَمْعِهِمْ وَأَبْصَـٰرِهِمْ ۖ وَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْغَـٰفِلُونَ

Transliteration ulāika alladhīna ṭabaʿa l-lahu ʿalā qulūbihim wasamʿihim wa-abṣārihim wa-ulāika humu l-ghāfilūna

Telugu ఇలాంటి వారి హృదయాల మీదా. చెవుల మీదా మరియు కన్నుల మీదా అల్లాహ్ ముద్రవేసి ఉన్నాడు. మరియు ఇలాంటి వారే నిర్లక్ష్యంలో మునిగి ఉన్నవారు!

Verse 109

لَا جَرَمَ أَنَّهُمْ فِى ٱلْـَٔاخِرَةِ هُمُ ٱلْخَـٰسِرُونَ

Transliteration lā jarama annahum fī l-ākhirati humu l-khāsirūna

Telugu నిశ్చయంగా, పరలోకంలో నష్టానికి గురి కాగలవారు వీరే, అని అనటంలో ఎలాంటి సందేహం లేదు.

Verse 110

ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ هَاجَرُوا۟ مِنۢ بَعْدِ مَا فُتِنُوا۟ ثُمَّ جَـٰهَدُوا۟ وَصَبَرُوٓا۟ إِنَّ رَبَّكَ مِنۢ بَعْدِهَا لَغَفُورٌ رَّحِيمٌ

Transliteration thumma inna rabbaka lilladhīna hājarū min baʿdi mā futinū thumma jāhadū waṣabarū inna rabbaka min baʿdihā laghafūrun raḥīmun

Telugu ఇక నిశ్చయంగా, నీ ప్రభువు! వారి కొరకు, ఎవరైతే మొదట పరీక్షకు గురి చేయబడి, పిదప (తమ ఇల్లూ వాకిలి విడిచి) వలసపోయి, తరువాత ధర్మపోరాటంలో పాల్గొంటారో మరియు సహనం వహిస్తారో! దాని తరువాత నిశ్చయంగా, అలాంటి వారి కొరకు నీ ప్రభువు! ఎంతో క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

Verse 111

۞ يَوْمَ تَأْتِى كُلُّ نَفْسٍ تُجَـٰدِلُ عَن نَّفْسِهَا وَتُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ وَهُمْ لَا يُظْلَمُونَ

Transliteration yawma tatī kullu nafsin tujādilu ʿan nafsihā watuwaffā kullu nafsin mā ʿamilat wahum lā yuẓ'lamūna

Telugu ఆ దినమును (జ్ఞాపకముంచుకోండి), ఎప్పుడైతే ప్రతి ప్రాణి కేవలం తన స్వంతం కొరకే బ్రతిమాలుకుంటుందో! ప్రతి ప్రాణికి దాని కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వబడుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.

Verse 112

وَضَرَبَ ٱللَّهُ مَثَلًا قَرْيَةً كَانَتْ ءَامِنَةً مُّطْمَئِنَّةً يَأْتِيهَا رِزْقُهَا رَغَدًا مِّن كُلِّ مَكَانٍ فَكَفَرَتْ بِأَنْعُمِ ٱللَّهِ فَأَذَٰقَهَا ٱللَّهُ لِبَاسَ ٱلْجُوعِ وَٱلْخَوْفِ بِمَا كَانُوا۟ يَصْنَعُونَ

Transliteration waḍaraba l-lahu mathalan qaryatan kānat āminatan muṭ'ma-innatan yatīhā riz'quhā raghadan min kulli makānin fakafarat bi-anʿumi l-lahi fa-adhāqahā l-lahu libāsa l-jūʿi wal-khawfi bimā kānū yaṣnaʿūna

Telugu మరియు అల్లాహ్ ఒక నగరపు ఉపమానం ఇస్తున్నాడు: మొదట అది (ఆ నగరం) శాంతి భద్రతలతో నిండి ఉండేది. దానికి (దాని ప్రజలకు) ప్రతి దిక్కునుండి జీవనోపాధి పుష్కలంగా లభిస్తూ ఉండేది. తరువాత (ఆ నగరం) వారు అల్లాహ్ అనుగ్రహాలను తిరస్కరించారు (కృతఘ్నులయ్యారు), కావున అల్లాహ్ వారి చర్యలకు బదులుగా వారికి ఆకలీ, భయమూ వంటి ఆపదల రుచి చూపించాడు.

Verse 113

وَلَقَدْ جَآءَهُمْ رَسُولٌ مِّنْهُمْ فَكَذَّبُوهُ فَأَخَذَهُمُ ٱلْعَذَابُ وَهُمْ ظَـٰلِمُونَ

Transliteration walaqad jāahum rasūlun min'hum fakadhabūhu fa-akhadhahumu l-ʿadhābu wahum ẓālimūna

Telugu మరియు వాస్తవంగా వారి వద్దకు వారి (జాతి) నుండి ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు, కాని వారు అతనిని అసత్యవాదుడవని తిరస్కరించారు. కావున వారు దుర్మార్గంలో మునిగి ఉన్నప్పుడు వారిని శిక్ష పట్టుకున్నది.

Verse 114

فَكُلُوا۟ مِمَّا رَزَقَكُمُ ٱللَّهُ حَلَـٰلًا طَيِّبًا وَٱشْكُرُوا۟ نِعْمَتَ ٱللَّهِ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ

Transliteration fakulū mimmā razaqakumu l-lahu ḥalālan ṭayyiban wa-ush'kurū niʿ'mata l-lahi in kuntum iyyāhu taʿbudūna

Telugu కావున మీరు అల్లాహ్ నే ఆరాధించే వారైతే, ఆయన మీ కొరకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన, పరిశుద్ధమైన ఆహారాలనే తినండి మరియు అల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞతలు చూపండి.

Verse 115

إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ ٱلْمَيْتَةَ وَٱلدَّمَ وَلَحْمَ ٱلْخِنزِيرِ وَمَآ أُهِلَّ لِغَيْرِ ٱللَّهِ بِهِۦ ۖ فَمَنِ ٱضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَإِنَّ ٱللَّهَ غَفُورٌ رَّحِيمٌ

Transliteration innamā ḥarrama ʿalaykumu l-maytata wal-dama walaḥma l-khinzīri wamā uhilla lighayri l-lahi bihi famani uḍ'ṭurra ghayra bāghin walā ʿādin fa-inna l-laha ghafūrun raḥīmun

Telugu నిశ్చయంగా, ఆయన మీ కొరకు (దానంతట అది) చచ్చినది (పశువు/పక్షి) రక్తం, పందిమాంసం, అల్లాహ్ తప్ప ఇతరుల కొరకు (ఇతరుల పేర) జిబహ్ చేయబడినది (పశువు/పక్షి మాంసాన్ని) నిషేధించి ఉన్నాడు. కాని ఎవడైనా (అల్లాహ్) నియమాలను ఉల్లంఘించే ఉద్దేశంతో కాక, (ఆకలికి) తాళలేక, గత్యంతరం లేని పరిస్థితిలో (తింటే); నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

Verse 116

وَلَا تَقُولُوا۟ لِمَا تَصِفُ أَلْسِنَتُكُمُ ٱلْكَذِبَ هَـٰذَا حَلَـٰلٌ وَهَـٰذَا حَرَامٌ لِّتَفْتَرُوا۟ عَلَى ٱللَّهِ ٱلْكَذِبَ ۚ إِنَّ ٱلَّذِينَ يَفْتَرُونَ عَلَى ٱللَّهِ ٱلْكَذِبَ لَا يُفْلِحُونَ

Transliteration walā taqūlū limā taṣifu alsinatukumu l-kadhiba hādhā ḥalālun wahādhā ḥarāmun litaftarū ʿalā l-lahi l-kadhiba inna alladhīna yaftarūna ʿalā l-lahi l-kadhiba lā yuf'liḥūna

Telugu అల్లాహ్ మీద అబద్ధాలు కల్పిస్తూ: "ఇది ధర్మసమ్మతం, ఇది నిషిద్ధం." అని మీ నోటికొచ్చినట్లు (మనస్సులకు తోచినట్లు) అబద్ధాలు పలక కండి. నిశ్చయంగా, అల్లాహ్ పై అబద్ధాలు కల్పించేవారు ఎన్నడూ సాఫల్యం పొందరు.

Verse 117

مَتَـٰعٌ قَلِيلٌ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ

Transliteration matāʿun qalīlun walahum ʿadhābun alīmun

Telugu దీనితో కొంత వరకు సుఖసంతోషాలు కలుగవచ్చు, కాని వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

Verse 118

وَعَلَى ٱلَّذِينَ هَادُوا۟ حَرَّمْنَا مَا قَصَصْنَا عَلَيْكَ مِن قَبْلُ ۖ وَمَا ظَلَمْنَـٰهُمْ وَلَـٰكِن كَانُوٓا۟ أَنفُسَهُمْ يَظْلِمُونَ

Transliteration waʿalā alladhīna hādū ḥarramnā mā qaṣaṣnā ʿalayka min qablu wamā ẓalamnāhum walākin kānū anfusahum yaẓlimūna

Telugu మరియు మేము నీకు ప్రస్తావించిన వాటిని, ఇంతకు ముందు యూదులకు నిషేధించాము. మరియు మేము వారికి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తామే అన్యాయం చేసుకుంటూ ఉండేవారు.

Verse 119

ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ عَمِلُوا۟ ٱلسُّوٓءَ بِجَهَـٰلَةٍ ثُمَّ تَابُوا۟ مِنۢ بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوٓا۟ إِنَّ رَبَّكَ مِنۢ بَعْدِهَا لَغَفُورٌ رَّحِيمٌ

Transliteration thumma inna rabbaka lilladhīna ʿamilū l-sūa bijahālatin thumma tābū min baʿdi dhālika wa-aṣlaḥū inna rabbaka min baʿdihā laghafūrun raḥīmun

Telugu అయితే నిశ్చయంగా, నీ ప్రభువు - ఎవరైతే అజ్ఞానంలో పాపాలు చేసి, ఆ పిదప పశ్చాత్తాప పడి, సరిదిద్దుకుంటారో - దాని (ఆ పశ్చాత్తాపం) తరువాత (వారిని క్షమిస్తాడు); నిశ్చయంగా, నీ ప్రభువు క్షమించేవాడు, అపార కరుణా ప్రదాత.

Verse 120

إِنَّ إِبْرَٰهِيمَ كَانَ أُمَّةً قَانِتًا لِّلَّهِ حَنِيفًا وَلَمْ يَكُ مِنَ ٱلْمُشْرِكِينَ

Transliteration inna ib'rāhīma kāna ummatan qānitan lillahi ḥanīfan walam yaku mina l-mush'rikīna

Telugu నిశ్చయంగా, ఇబ్రాహీమ్ (ఒక్కడే) అల్లాహ్ కు భక్తిపరుడై, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) స్థాపించటంలో తనకు తానే ఒక సమాజమై ఉండెను. అతను అల్లాహ్ కు సాటి కల్పించేవారిలో ఎన్నడూ చేరలేదు.

Verse 121

شَاكِرًا لِّأَنْعُمِهِ ۚ ٱجْتَبَىٰهُ وَهَدَىٰهُ إِلَىٰ صِرَٰطٍ مُّسْتَقِيمٍ

Transliteration shākiran li-anʿumihi ij'tabāhu wahadāhu ilā ṣirāṭin mus'taqīmin

Telugu ఆయన (అల్లాహ్) యొక్క అనుగ్రహాలకు కృతజ్ఞుడై ఉండేవాడు. ఆయన (అల్లాహ్) అతనిని (తన స్నేహితునిగా) ఎన్నుకొని, అతనికి ఋజుమార్గం వైపుకు మార్గదర్శకత్వం చేశాడు.

Verse 122

وَءَاتَيْنَـٰهُ فِى ٱلدُّنْيَا حَسَنَةً ۖ وَإِنَّهُۥ فِى ٱلْـَٔاخِرَةِ لَمِنَ ٱلصَّـٰلِحِينَ

Transliteration waātaynāhu fī l-dun'yā ḥasanatan wa-innahu fī l-ākhirati lamina l-ṣāliḥīna

Telugu మేము అతనికి ఇహలోకంలో మంచి స్థితిని ప్రసాదించాము. మరియు నిశ్చయంగా, అతను పరలోకంలో సద్వర్తనులతో పాటు ఉంటాడు

Verse 123

ثُمَّ أَوْحَيْنَآ إِلَيْكَ أَنِ ٱتَّبِعْ مِلَّةَ إِبْرَٰهِيمَ حَنِيفًا ۖ وَمَا كَانَ مِنَ ٱلْمُشْرِكِينَ

Transliteration thumma awḥaynā ilayka ani ittabiʿ millata ib'rāhīma ḥanīfan wamā kāna mina l-mush'rikīna

Telugu తరువాత మేము నీకు (ఓ ముహమ్మద్!) ఈ సందేశాన్ని పంపాము: "నీవు ఇబ్రాహీమ్ అనుసరించిన, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) అనుసరించు. అతను (ఇబ్రాహీమ్) అల్లాహ్ కు సాటి కల్పించే వారిలోని వాడు కాడు."

Verse 124

إِنَّمَا جُعِلَ ٱلسَّبْتُ عَلَى ٱلَّذِينَ ٱخْتَلَفُوا۟ فِيهِ ۚ وَإِنَّ رَبَّكَ لَيَحْكُمُ بَيْنَهُمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ فِيمَا كَانُوا۟ فِيهِ يَخْتَلِفُونَ

Transliteration innamā juʿila l-sabtu ʿalā alladhīna ikh'talafū fīhi wa-inna rabbaka layaḥkumu baynahum yawma l-qiyāmati fīmā kānū fīhi yakhtalifūna

Telugu వాస్తవానికి, శనివార శాసనం (సబ్త్) విషయంలో అభిప్రాయభేదాలు కలిగి ఉన్న వారికే అది విధించబడింది. మరియు నిశ్చయంగా, నీ ప్రభువు! పునరుత్థాన దినమున వారి మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను గురించి తీర్పు చేస్తాడు.

Verse 125

ٱدْعُ إِلَىٰ سَبِيلِ رَبِّكَ بِٱلْحِكْمَةِ وَٱلْمَوْعِظَةِ ٱلْحَسَنَةِ ۖ وَجَـٰدِلْهُم بِٱلَّتِى هِىَ أَحْسَنُ ۚ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِۦ ۖ وَهُوَ أَعْلَمُ بِٱلْمُهْتَدِينَ

Transliteration ud'ʿu ilā sabīli rabbika bil-ḥik'mati wal-mawʿiẓati l-ḥasanati wajādil'hum bi-allatī hiya aḥsanu inna rabbaka huwa aʿlamu biman ḍalla ʿan sabīlihi wahuwa aʿlamu bil-muh'tadīna

Telugu (ప్రజలను) వివేకంతోనూ, మంచి ఉపదేశం (ప్రచారం) తోనూ నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు. మరియు వారితో ఉత్తమరీతిలో వాదించు. నిశ్చయంగా, నీ ప్రభువుకు తన మార్గం నుండి భ్రష్టుడైన వాడెవడో తెలుసు. మరియు మార్గదర్శకత్వం పొందిన వాడెవడో కూడా ఆయనకు బాగా తెలుసు.

Verse 126

وَإِنْ عَاقَبْتُمْ فَعَاقِبُوا۟ بِمِثْلِ مَا عُوقِبْتُم بِهِۦ ۖ وَلَئِن صَبَرْتُمْ لَهُوَ خَيْرٌ لِّلصَّـٰبِرِينَ

Transliteration wa-in ʿāqabtum faʿāqibū bimith'li mā ʿūqib'tum bihi wala-in ṣabartum lahuwa khayrun lilṣṣābirīna

Telugu మరియు మీరు (మీ ప్రత్యర్థులను) శిక్షించదలచుకుంటే, మీకు జరిగిన దానికి (అన్యాయానికి) సమానమైన శిక్ష మాత్రమే ఇవ్వండి. కాని మీరు సహనం వహిస్తే నిశ్చయంగా, సహనం వహించేవారికి ఎంతో మేలు కలుగుతుంది.

Verse 127

وَٱصْبِرْ وَمَا صَبْرُكَ إِلَّا بِٱللَّهِ ۚ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَلَا تَكُ فِى ضَيْقٍ مِّمَّا يَمْكُرُونَ

Transliteration wa-iṣ'bir wamā ṣabruka illā bil-lahi walā taḥzan ʿalayhim walā taku fī ḍayqin mimmā yamkurūna

Telugu (ఓ ముహమ్మద్!) నీవు సహనం వహించు మరియు నీకు సహనమిచ్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే. మరియు వారిని గురించి దుఃఖపడకు మరియు వారు పన్నే కుట్రలకు నీవు వ్యాకుల పడకు.

Verse 128

إِنَّ ٱللَّهَ مَعَ ٱلَّذِينَ ٱتَّقَوا۟ وَّٱلَّذِينَ هُم مُّحْسِنُونَ

Transliteration inna l-laha maʿa alladhīna ittaqaw wa-alladhīna hum muḥ'sinūna

Telugu నిశ్చయంగా, అల్లాహ్ భయభక్తులు గల వారితో మరియు సజ్జనులైన వారితో పాటు ఉంటాడు.

Read Surah An-Nahl in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.