MyDugsiStart learning

Surah Al-Jathiyah in Telugu: translation and audio

Surah 45 · الجاثية · The Crouching · 37 verses

Surah Al-Jathiyah verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Al-Jathiyah word by word in English.

Verse 1

حمٓ

Transliteration hha-meem

Telugu హా - మీమ్.

Verse 2

تَنزِيلُ ٱلْكِتَـٰبِ مِنَ ٱللَّهِ ٱلْعَزِيزِ ٱلْحَكِيمِ

Transliteration tanzīlu l-kitābi mina l-lahi l-ʿazīzi l-ḥakīmi

Telugu ఈ గ్రంథం (ఖుర్ఆన్) అవతరణ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్ తరఫు నుండి జరిగింది.

Verse 3

إِنَّ فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ لَـَٔايَـٰتٍ لِّلْمُؤْمِنِينَ

Transliteration inna fī l-samāwāti wal-arḍi laāyātin lil'mu'minīna

Telugu నిశ్చయంగా, విశ్వసించేవారి కొరకు, ఆకాశాలలో మరియు భూమిలో అనేక సూచనలు (ఆయాత్) ఉన్నాయి.

Verse 4

وَفِى خَلْقِكُمْ وَمَا يَبُثُّ مِن دَآبَّةٍ ءَايَـٰتٌ لِّقَوْمٍ يُوقِنُونَ

Transliteration wafī khalqikum wamā yabuthu min dābbatin āyātun liqawmin yūqinūna

Telugu మరియు మీ సృష్టిలోనూ మరియు (భూమిలో) ఆయన వ్యాపింపజేసిన జీవరాసులలోనూ, దృఢవిశ్వాసమున్న వారి కొరకు ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి.

Verse 5

وَٱخْتِلَـٰفِ ٱلَّيْلِ وَٱلنَّهَارِ وَمَآ أَنزَلَ ٱللَّهُ مِنَ ٱلسَّمَآءِ مِن رِّزْقٍ فَأَحْيَا بِهِ ٱلْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَتَصْرِيفِ ٱلرِّيَـٰحِ ءَايَـٰتٌ لِّقَوْمٍ يَعْقِلُونَ

Transliteration wa-ikh'tilāfi al-layli wal-nahāri wamā anzala l-lahu mina l-samāi min riz'qin fa-aḥyā bihi l-arḍa baʿda mawtihā wataṣrīfi l-riyāḥi āyātun liqawmin yaʿqilūna

Telugu మరియు రేయింబవళ్ళ అనుక్రమంలో మరియు అల్లాహ్ ఆకాశం నుండి జీవనోపాధిని (వర్షాన్ని) పంపి, దాని ద్వారా భూమికి దాని మరణం తర్వాత, తిరిగి జీవం పోయటంలో మరియు వాయువుల మారటంలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి.

Verse 6

تِلْكَ ءَايَـٰتُ ٱللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِٱلْحَقِّ ۖ فَبِأَىِّ حَدِيثٍۭ بَعْدَ ٱللَّهِ وَءَايَـٰتِهِۦ يُؤْمِنُونَ

Transliteration til'ka āyātu l-lahi natlūhā ʿalayka bil-ḥaqi fabi-ayyi ḥadīthin baʿda l-lahi waāyātihi yu'minūna

Telugu ఇవి అల్లాహ్ సూచనలు (ఆయాత్), మేము వీటిని నీకు యథాతథంగా వినిపిస్తున్నాము. ఇక వారు అల్లాహ్ ను మరియు ఆయన సూచనలను (ఆయాత్ లను) కాక మరే సమాచారాన్ని విశ్వసిస్తారు?

Verse 7

وَيْلٌ لِّكُلِّ أَفَّاكٍ أَثِيمٍ

Transliteration waylun likulli affākin athīmin

Telugu అపవాదుడు, పాపిష్ఠుడు అయిన ప్రతి వ్యక్తికి తీవ్రమైన వ్యధ గలదు.

Verse 8

يَسْمَعُ ءَايَـٰتِ ٱللَّهِ تُتْلَىٰ عَلَيْهِ ثُمَّ يُصِرُّ مُسْتَكْبِرًا كَأَن لَّمْ يَسْمَعْهَا ۖ فَبَشِّرْهُ بِعَذَابٍ أَلِيمٍ

Transliteration yasmaʿu āyāti l-lahi tut'lā ʿalayhi thumma yuṣirru mus'takbiran ka-an lam yasmaʿhā fabashir'hu biʿadhābin alīmin

Telugu అతడు తన ముందు పఠించబడే అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) వింటున్నాడు ఆ తరువాత మూర్ఖపు పట్టుతో దురహంకారంతో వాటిని విననట్లు వ్యవహరిస్తున్నాడు. కావున అతనికి బాధాకరమైన శిక్ష పడనున్నదనే వార్తను వినిపించు.

Verse 9

وَإِذَا عَلِمَ مِنْ ءَايَـٰتِنَا شَيْـًٔا ٱتَّخَذَهَا هُزُوًا ۚ أُو۟لَـٰٓئِكَ لَهُمْ عَذَابٌ مُّهِينٌ

Transliteration wa-idhā ʿalima min āyātinā shayan ittakhadhahā huzuwan ulāika lahum ʿadhābun muhīnun

Telugu మరియు మా సూచన (ఆయాత్) లకు సంబంధించిన విషయం అతనికి తెలిసినప్పుడు, వాటిని గురించి ఎగతాళి చేస్తాడు. అటువంటి వారందరికీ అవమానకరమైన శిక్ష ఉంది.

Verse 10

مِّن وَرَآئِهِمْ جَهَنَّمُ ۖ وَلَا يُغْنِى عَنْهُم مَّا كَسَبُوا۟ شَيْـًٔا وَلَا مَا ٱتَّخَذُوا۟ مِن دُونِ ٱللَّهِ أَوْلِيَآءَ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ

Transliteration min warāihim jahannamu walā yugh'nī ʿanhum mā kasabū shayan walā mā ittakhadhū min dūni l-lahi awliyāa walahum ʿadhābun ʿaẓīmun

Telugu వారి ముందు నరకముంటుంది. మరియు వారి సంపాదన వారికి ఏ మాత్రం పనికిరాదు మరియు అల్లాహ్ ను వదలి వారు సంరక్షకులుగా చేసుకున్నవారు కూడా వారికి ఏ విధంగానూ ఉపయోగపడరు. మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది.

Verse 11

هَـٰذَا هُدًى ۖ وَٱلَّذِينَ كَفَرُوا۟ بِـَٔايَـٰتِ رَبِّهِمْ لَهُمْ عَذَابٌ مِّن رِّجْزٍ أَلِيمٌ

Transliteration hādhā hudan wa-alladhīna kafarū biāyāti rabbihim lahum ʿadhābun min rij'zin alīmun

Telugu ఇది (ఈ ఖుర్ఆన్) మార్గదర్శకత్వం. మరియు ఎవరైతే తమ ప్రభువు సూచనలను (ఆయాత్ లను) తిరస్కరిస్తారో, వారికి అధమమైన, బాధాకరమైన శిక్ష ఉంది.

Verse 12

۞ ٱللَّهُ ٱلَّذِى سَخَّرَ لَكُمُ ٱلْبَحْرَ لِتَجْرِىَ ٱلْفُلْكُ فِيهِ بِأَمْرِهِۦ وَلِتَبْتَغُوا۟ مِن فَضْلِهِۦ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ

Transliteration al-lahu alladhī sakhara lakumu l-baḥra litajriya l-ful'ku fīhi bi-amrihi walitabtaghū min faḍlihi walaʿallakum tashkurūna

Telugu అల్లాహ్! ఆయనే, సముద్రాన్ని మీకు ఉపయుక్తంగా చేశాడు; దానిలో తన ఆజ్ఞతో ఓడలు పయనించటానికి మరియు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు బహుశా మీరు కృతజ్ఞులవుతారని.

Verse 13

وَسَخَّرَ لَكُم مَّا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ جَمِيعًا مِّنْهُ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ لِّقَوْمٍ يَتَفَكَّرُونَ

Transliteration wasakhara lakum mā fī l-samāwāti wamā fī l-arḍi jamīʿan min'hu inna fī dhālika laāyātin liqawmin yatafakkarūna

Telugu మరియు ఆయన ఆకాశాలలో మరియు భూమిలోనున్న సమస్తాన్ని, తన అనుగ్రహంతో మీకు ఉపయుక్తంగా చేశాడు. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి.

Verse 14

قُل لِّلَّذِينَ ءَامَنُوا۟ يَغْفِرُوا۟ لِلَّذِينَ لَا يَرْجُونَ أَيَّامَ ٱللَّهِ لِيَجْزِىَ قَوْمًۢا بِمَا كَانُوا۟ يَكْسِبُونَ

Transliteration qul lilladhīna āmanū yaghfirū lilladhīna lā yarjūna ayyāma l-lahi liyajziya qawman bimā kānū yaksibūna

Telugu (ఓ ప్రవక్తా!) విశ్వసించిన వారితో: "ఒక జాతి వారికి తమ కర్మలకు తగిన ప్రతిఫలమిచ్చే అల్లాహ్ దినాలు వస్తాయని నమ్మనివారిని క్షమించండి." అని చెప్పు.

Verse 15

مَنْ عَمِلَ صَـٰلِحًا فَلِنَفْسِهِۦ ۖ وَمَنْ أَسَآءَ فَعَلَيْهَا ۖ ثُمَّ إِلَىٰ رَبِّكُمْ تُرْجَعُونَ

Transliteration man ʿamila ṣāliḥan falinafsihi waman asāa faʿalayhā thumma ilā rabbikum tur'jaʿūna

Telugu సత్కార్యం చేసేవాడు తన మేలుకే చేస్తాడు. మరియు దుష్కార్యం చేసేవాడు దాని (ఫలితాన్ని) అనుభవిస్తాడు. చివరకు మీరంతా మీ ప్రభువు వైపునకే మరలింప బడతారు.

Verse 16

وَلَقَدْ ءَاتَيْنَا بَنِىٓ إِسْرَٰٓءِيلَ ٱلْكِتَـٰبَ وَٱلْحُكْمَ وَٱلنُّبُوَّةَ وَرَزَقْنَـٰهُم مِّنَ ٱلطَّيِّبَـٰتِ وَفَضَّلْنَـٰهُمْ عَلَى ٱلْعَـٰلَمِينَ

Transliteration walaqad ātaynā banī is'rāīla l-kitāba wal-ḥuk'ma wal-nubuwata warazaqnāhum mina l-ṭayibāti wafaḍḍalnāhum ʿalā l-ʿālamīna

Telugu మరియు వాస్తవంగా, మేము ఇస్రాయీల్ సంతతి వారికి గ్రంథాన్ని (తౌరాత్ ను), వివేకాన్ని మరియు ప్రవక్త పదవులను ప్రసాదించి ఉన్నాము మరియు వారికి మంచి జీవనోపాధిని ప్రసాదించి ఉన్నాము మరియు వారిని (వారి కాలపు) ప్రజలపై ప్రత్యేకంగా ఆదరించి ఉన్నాము.

Verse 17

وَءَاتَيْنَـٰهُم بَيِّنَـٰتٍ مِّنَ ٱلْأَمْرِ ۖ فَمَا ٱخْتَلَفُوٓا۟ إِلَّا مِنۢ بَعْدِ مَا جَآءَهُمُ ٱلْعِلْمُ بَغْيًۢا بَيْنَهُمْ ۚ إِنَّ رَبَّكَ يَقْضِى بَيْنَهُمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ فِيمَا كَانُوا۟ فِيهِ يَخْتَلِفُونَ

Transliteration waātaynāhum bayyinātin mina l-amri famā ikh'talafū illā min baʿdi mā jāahumu l-ʿil'mu baghyan baynahum inna rabbaka yaqḍī baynahum yawma l-qiyāmati fīmā kānū fīhi yakhtalifūna

Telugu మరియు వారికి ధర్మ విషయంలో స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చి ఉన్నాము. వారు తమ పరస్పర ద్వేషాల వల్ల వారికి జ్ఞానం వచ్చిన పిదపనే విభేదాలకు లోనయ్యారు. నిశ్చయంగా, నీ ప్రభువు వారి మధ్య ఉన్న విభేదాలను గురించి పునరుత్థాన దినమున, వారి మధ్య తీర్పు చేస్తాడు.

Verse 18

ثُمَّ جَعَلْنَـٰكَ عَلَىٰ شَرِيعَةٍ مِّنَ ٱلْأَمْرِ فَٱتَّبِعْهَا وَلَا تَتَّبِعْ أَهْوَآءَ ٱلَّذِينَ لَا يَعْلَمُونَ

Transliteration thumma jaʿalnāka ʿalā sharīʿatin mina l-amri fa-ittabiʿ'hā walā tattabiʿ ahwāa alladhīna lā yaʿlamūna

Telugu తరువాత (ఓ ముహమ్మద్!) మేము, నిన్ను (మేము) నియమించిన ధర్మ విధానం మీద ఉంటాము. కావున నీవు దానినే అనుసరించు మరియు నీవు జ్ఞానం లేని వారి కోరికలను అనుసరించకు.

Verse 19

إِنَّهُمْ لَن يُغْنُوا۟ عَنكَ مِنَ ٱللَّهِ شَيْـًٔا ۚ وَإِنَّ ٱلظَّـٰلِمِينَ بَعْضُهُمْ أَوْلِيَآءُ بَعْضٍ ۖ وَٱللَّهُ وَلِىُّ ٱلْمُتَّقِينَ

Transliteration innahum lan yugh'nū ʿanka mina l-lahi shayan wa-inna l-ẓālimīna baʿḍuhum awliyāu baʿḍin wal-lahu waliyyu l-mutaqīna

Telugu నిశ్చయంగా వారు, నీకు - అల్లాహ్ కు ప్రతిగా - ఏ మాత్రం ఉపయోగపడలేరు. మరియు నిశ్చయంగా, దుర్మార్గులు ఒకరికొకరు రక్షకులు. మరియు అల్లాహ్ యే దైవభీతి గలవారి సంరక్షకుడు.

Verse 20

هَـٰذَا بَصَـٰٓئِرُ لِلنَّاسِ وَهُدًى وَرَحْمَةٌ لِّقَوْمٍ يُوقِنُونَ

Transliteration hādhā baṣāiru lilnnāsi wahudan waraḥmatun liqawmin yūqinūna

Telugu ఇది (ఈ ఖుర్ఆన్) మానవులకు అంతర్దృష్టి (పరిజ్ఞానం) ఇచ్చేదిగానూ మరియు విశ్వసించే జనులకు మార్గదర్శకత్వంగానూ మరియు కారుణ్యంగానూ ఉంది.

Verse 21

أَمْ حَسِبَ ٱلَّذِينَ ٱجْتَرَحُوا۟ ٱلسَّيِّـَٔاتِ أَن نَّجْعَلَهُمْ كَٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ سَوَآءً مَّحْيَاهُمْ وَمَمَاتُهُمْ ۚ سَآءَ مَا يَحْكُمُونَ

Transliteration am ḥasiba alladhīna ij'taraḥū l-sayiāti an najʿalahum ka-alladhīna āmanū waʿamilū l-ṣāliḥāti sawāan maḥyāhum wamamātuhum sāa mā yaḥkumūna

Telugu దుష్కార్యాలకు పాల్పడిన వారు, వారి ఇహలోక జీవితంలోనూ మరియు వారి మరణానంతర జీవితంలోనూ - వారినీ మరియు విశ్వసించి సత్కార్యాలు చేసే వారినీ - మేము ఒకే విధంగా పరిగణిస్తామని భావిస్తున్నారా ఏమిటి? వారి నిర్ణయాలు ఎంత చెడ్డవి!

Verse 22

وَخَلَقَ ٱللَّهُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ بِٱلْحَقِّ وَلِتُجْزَىٰ كُلُّ نَفْسٍۭ بِمَا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ

Transliteration wakhalaqa l-lahu l-samāwāti wal-arḍa bil-ḥaqi walituj'zā kullu nafsin bimā kasabat wahum lā yuẓ'lamūna

Telugu మరియు అల్లాహ్ ఆకాశాలనూ మరియు భూమినీ సత్యంతో సృష్టించాడు మరియు ప్రతి వ్యక్తికి తన కర్మలకు తగిన ప్రతిఫల మివ్వటానికి మరియు వారికి ఎలాంటి అన్యాయం జరుగదు.

Verse 23

أَفَرَءَيْتَ مَنِ ٱتَّخَذَ إِلَـٰهَهُۥ هَوَىٰهُ وَأَضَلَّهُ ٱللَّهُ عَلَىٰ عِلْمٍ وَخَتَمَ عَلَىٰ سَمْعِهِۦ وَقَلْبِهِۦ وَجَعَلَ عَلَىٰ بَصَرِهِۦ غِشَـٰوَةً فَمَن يَهْدِيهِ مِنۢ بَعْدِ ٱللَّهِ ۚ أَفَلَا تَذَكَّرُونَ

Transliteration afara-ayta mani ittakhadha ilāhahu hawāhu wa-aḍallahu l-lahu ʿalā ʿil'min wakhatama ʿalā samʿihi waqalbihi wajaʿala ʿalā baṣarihi ghishāwatan faman yahdīhi min baʿdi l-lahi afalā tadhakkarūna

Telugu తన మనోవాంఛలను తన దైవంగా చేసుకున్న వానిని నీవు చూశావా? మరియు అతడు జ్ఞానవంతుడు అయినప్పటికీ, అల్లాహ్! అతనిని మార్గభ్రష్టత్వంలో వదిలాడు మరియు అతని చెవుల మీద మరియు అతని హృదయం మీద ముద్ర వేశాడు మరియు అతని కళ్ళ మీద తెరవేశాడు; ఇక అల్లాహ్ తప్ప అతనికి మార్గదర్శకత్వం చేసే వాడెవడున్నాడు? ఇది మీరు గ్రహించలేరా?

Verse 24

وَقَالُوا۟ مَا هِىَ إِلَّا حَيَاتُنَا ٱلدُّنْيَا نَمُوتُ وَنَحْيَا وَمَا يُهْلِكُنَآ إِلَّا ٱلدَّهْرُ ۚ وَمَا لَهُم بِذَٰلِكَ مِنْ عِلْمٍ ۖ إِنْ هُمْ إِلَّا يَظُنُّونَ

Transliteration waqālū mā hiya illā ḥayātunā l-dun'yā namūtu wanaḥyā wamā yuh'likunā illā l-dahru wamā lahum bidhālika min ʿil'min in hum illā yaẓunnūna

Telugu మరియు వారిలా అంటారు: "మా (జీవితం) కేవలం ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే! మేము మరణించేది మరియు జీవించేది ఇక్కడే మరియు మమ్మల్ని నశింపజేసేది ఈ కాలచక్రం మాత్రమే!" మరియు వాస్తవానికి, దానిని గురించి వారికి ఎలాంటి జ్ఞానం లేదు. వారు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు.

Verse 25

وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ ءَايَـٰتُنَا بَيِّنَـٰتٍ مَّا كَانَ حُجَّتَهُمْ إِلَّآ أَن قَالُوا۟ ٱئْتُوا۟ بِـَٔابَآئِنَآ إِن كُنتُمْ صَـٰدِقِينَ

Transliteration wa-idhā tut'lā ʿalayhim āyātunā bayyinātin mā kāna ḥujjatahum illā an qālū i'tū biābāinā in kuntum ṣādiqīna

Telugu మరియు వారి ముందు స్పష్టమైన మా సూచనలు (ఆయాత్) వినిపించబడి నప్పుడు: "మీరు సత్యవంతులే అయితే మా తాతముత్తాతలను (బ్రతికించి) తీసుకురండి!" అని మాత్రమే వాదిస్తారు.

Verse 26

قُلِ ٱللَّهُ يُحْيِيكُمْ ثُمَّ يُمِيتُكُمْ ثُمَّ يَجْمَعُكُمْ إِلَىٰ يَوْمِ ٱلْقِيَـٰمَةِ لَا رَيْبَ فِيهِ وَلَـٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ

Transliteration quli l-lahu yuḥ'yīkum thumma yumītukum thumma yajmaʿukum ilā yawmi l-qiyāmati lā rayba fīhi walākinna akthara l-nāsi lā yaʿlamūna

Telugu వారిలో ఇలా అను: "అల్లాహ్ యే మీకు జీవితమిచ్చేవాడు తరువాత మరణింప జేసేవాడు, ఆ పిదప పునరుత్థాన దినమున సమావేశ పరిచేవాడూను! ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయినా చాలా మంది జనులకు ఇది తెలియదు."

Verse 27

وَلِلَّهِ مُلْكُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَيَوْمَ تَقُومُ ٱلسَّاعَةُ يَوْمَئِذٍ يَخْسَرُ ٱلْمُبْطِلُونَ

Transliteration walillahi mul'ku l-samāwāti wal-arḍi wayawma taqūmu l-sāʿatu yawma-idhin yakhsaru l-mub'ṭilūna

Telugu మరియు ఆకాశాల మరియు భూమి యొక్క సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్ కే చెందినది. మరియు ఆ ఘడియ ఆసన్నమైననాడు, ఆ దినమున అసత్యవాదులు నష్టానికి గురి అవుతారు.

Verse 28

وَتَرَىٰ كُلَّ أُمَّةٍ جَاثِيَةً ۚ كُلُّ أُمَّةٍ تُدْعَىٰٓ إِلَىٰ كِتَـٰبِهَا ٱلْيَوْمَ تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ

Transliteration watarā kulla ummatin jāthiyatan kullu ummatin tud'ʿā ilā kitābihā l-yawma tuj'zawna mā kuntum taʿmalūna

Telugu మరియు ప్రతి సమాజం వారిని నీవు మోకరిల్లి ఉండటాన్ని చూస్తావు. ప్రతి జాతి వారిని తమ కర్మపత్రం వైపునకు పిలవడం జరుగుతుంది. (వారితో ఇలా అనబడుతుంది): "ఈ రోజు మీరు చేస్తూ ఉండిన కర్మలకు తగిన ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది.

Verse 29

هَـٰذَا كِتَـٰبُنَا يَنطِقُ عَلَيْكُم بِٱلْحَقِّ ۚ إِنَّا كُنَّا نَسْتَنسِخُ مَا كُنتُمْ تَعْمَلُونَ

Transliteration hādhā kitābunā yanṭiqu ʿalaykum bil-ḥaqi innā kunnā nastansikhu mā kuntum taʿmalūna

Telugu ఇది మేము వ్రాసి పెట్టిన (మీ కర్మ) పత్రం, ఇది మీ గురించి సత్యమే పలుకుతుంది. నిశ్చయంగా, మేము మీరు చేస్తున్న కర్మలన్నింటినీ వ్రాస్తూ ఉండేవారము."

Verse 30

فَأَمَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ فَيُدْخِلُهُمْ رَبُّهُمْ فِى رَحْمَتِهِۦ ۚ ذَٰلِكَ هُوَ ٱلْفَوْزُ ٱلْمُبِينُ

Transliteration fa-ammā alladhīna āmanū waʿamilū l-ṣāliḥāti fayud'khiluhum rabbuhum fī raḥmatihi dhālika huwa l-fawzu l-mubīnu

Telugu కావున విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండిన వారిని, వారి ప్రభువు తన కారుణ్యంలోకి ప్రవేశింప జేసుకుంటాడు. ఇదే ఆ స్పష్టమైన విజయం.

Verse 31

وَأَمَّا ٱلَّذِينَ كَفَرُوٓا۟ أَفَلَمْ تَكُنْ ءَايَـٰتِى تُتْلَىٰ عَلَيْكُمْ فَٱسْتَكْبَرْتُمْ وَكُنتُمْ قَوْمًا مُّجْرِمِينَ

Transliteration wa-ammā alladhīna kafarū afalam takun āyātī tut'lā ʿalaykum fa-is'takbartum wakuntum qawman muj'rimīna

Telugu మరియు సత్యాన్ని తిరస్కరించిన వారితో (ఇలా అనబడుతుంది): "మీకు మా సూచనలు వినిపించబడలేదా? కాని మీరు దురహంకారంలో పడి పోయారు మరియు అపరాధులై పోయారు."

Verse 32

وَإِذَا قِيلَ إِنَّ وَعْدَ ٱللَّهِ حَقٌّ وَٱلسَّاعَةُ لَا رَيْبَ فِيهَا قُلْتُم مَّا نَدْرِى مَا ٱلسَّاعَةُ إِن نَّظُنُّ إِلَّا ظَنًّا وَمَا نَحْنُ بِمُسْتَيْقِنِينَ

Transliteration wa-idhā qīla inna waʿda l-lahi ḥaqqun wal-sāʿatu lā rayba fīhā qul'tum mā nadrī mā l-sāʿatu in naẓunnu illā ẓannan wamā naḥnu bimus'tayqinīna

Telugu మరియు: "నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం మరియు అంతిమ ఘడియను గురించి ఎలాంటి సందేహం లేదు." అని అన్నప్పుడు మీరన్నారు: "ఆ అంతిమ ఘడియ ఏమిటో మాకు తెలియదు. అది కేవలం ఒక ఊహాగానం తప్ప మరేమీ కాదని మేము భావిస్తున్నాము. మేము దానిని ఏ మాత్రం నమ్మే వారము కాము."

Verse 33

وَبَدَا لَهُمْ سَيِّـَٔاتُ مَا عَمِلُوا۟ وَحَاقَ بِهِم مَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ

Transliteration wabadā lahum sayyiātu mā ʿamilū waḥāqa bihim mā kānū bihi yastahziūna

Telugu అప్పుడు వారి ముందు వారు చేస్తూ ఉండిన దుష్కార్యాలు, ప్రత్యక్షమవుతాయి. మరియు వారు దేనిని గురించి పరిహాసమాడుతూ ఉన్నారో, అదే వారిని క్రమ్ముకుంటుంది.

Verse 34

وَقِيلَ ٱلْيَوْمَ نَنسَىٰكُمْ كَمَا نَسِيتُمْ لِقَآءَ يَوْمِكُمْ هَـٰذَا وَمَأْوَىٰكُمُ ٱلنَّارُ وَمَا لَكُم مِّن نَّـٰصِرِينَ

Transliteration waqīla l-yawma nansākum kamā nasītum liqāa yawmikum hādhā wamawākumu l-nāru wamā lakum min nāṣirīna

Telugu మరియు వారితో ఇలా అనబడుతుంది: "ఈ రోజు మేము మిమ్మల్ని మరచి పోతాము, ఏ విధంగానైతే మీరు మీ సమావేశపు ఈ దినాన్ని మరచిపోయారో! మరియు మీ నివాసం నరకాగ్నియే మరియు మీకు సహాయపడేవారు ఎవ్వరూ ఉండరు."

Verse 35

ذَٰلِكُم بِأَنَّكُمُ ٱتَّخَذْتُمْ ءَايَـٰتِ ٱللَّهِ هُزُوًا وَغَرَّتْكُمُ ٱلْحَيَوٰةُ ٱلدُّنْيَا ۚ فَٱلْيَوْمَ لَا يُخْرَجُونَ مِنْهَا وَلَا هُمْ يُسْتَعْتَبُونَ

Transliteration dhālikum bi-annakumu ittakhadhtum āyāti l-lahi huzuwan wagharratkumu l-ḥayatu l-dun'yā fal-yawma lā yukh'rajūna min'hā walā hum yus'taʿtabūna

Telugu ఇది ఎందుకంటే, వాస్తవానికి మీరు అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) పరిహాసంగా తీసుకున్నారు. మరియు ఇహలోక జీవితం మిమ్మల్ని మోసపుచ్చింది. కావున ఈ రోజు వారిని దాని (నరకం) నుండి బయటికి తీయడం జరగదు. మరియు వారికి తమ తప్పులను సరిదిద్దుకునే అవకాశమూ దొరకదు.

Verse 36

فَلِلَّهِ ٱلْحَمْدُ رَبِّ ٱلسَّمَـٰوَٰتِ وَرَبِّ ٱلْأَرْضِ رَبِّ ٱلْعَـٰلَمِينَ

Transliteration falillahi l-ḥamdu rabbi l-samāwāti warabbi l-arḍi rabbi l-ʿālamīna

Telugu ఇక సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆయనే ఆకాశాలకూ ప్రభువు మరియు భూమికీ ప్రభువు; ఆయనే సర్వలోకాలకు కూడా ప్రభువు!

Verse 37

وَلَهُ ٱلْكِبْرِيَآءُ فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۖ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

Transliteration walahu l-kib'riyāu fī l-samāwāti wal-arḍi wahuwa l-ʿazīzu l-ḥakīmu

Telugu ఆకాశాలలో మరియు భూమిలో ఘనత (మహనీయత) ఆయనకే చెందుతుంది. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

Read Surah Al-Jathiyah in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.