MyDugsiStart learning

Surah Hud in Telugu: translation and audio

Surah 11 · هود · Hud · 123 verses

Surah Hud verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Hud word by word in English.

Verse 1

الٓر ۚ كِتَـٰبٌ أُحْكِمَتْ ءَايَـٰتُهُۥ ثُمَّ فُصِّلَتْ مِن لَّدُنْ حَكِيمٍ خَبِيرٍ

Transliteration alif-lam-ra kitābun uḥ'kimat āyātuhu thumma fuṣṣilat min ladun ḥakīmin khabīrin

Telugu అలిఫ్ - లామ్ - రా. (ఇది) ఒక దివ్యగ్రంథం. దీని సూక్తులు (ఆయాత్) నిర్దుష్టమైనవి మరియు మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు అయిన (అల్లాహ్) తరఫు నుండి వివరించబడ్డాయి;

Verse 2

أَلَّا تَعْبُدُوٓا۟ إِلَّا ٱللَّهَ ۚ إِنَّنِى لَكُم مِّنْهُ نَذِيرٌ وَبَشِيرٌ

Transliteration allā taʿbudū illā l-laha innanī lakum min'hu nadhīrun wabashīrun

Telugu మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఆరాధించ కూడదని (ఓ ముహమ్మద్) ఇలా అను: "నిశ్చయంగా నేను, ఆయన (అల్లాహ్) తరఫు నుండి మీకు హెచ్చరిక చేసేవాడిని మరియు శుభవార్తలు ఇచ్చేవాడిని మాత్రమే!

Verse 3

وَأَنِ ٱسْتَغْفِرُوا۟ رَبَّكُمْ ثُمَّ تُوبُوٓا۟ إِلَيْهِ يُمَتِّعْكُم مَّتَـٰعًا حَسَنًا إِلَىٰٓ أَجَلٍ مُّسَمًّى وَيُؤْتِ كُلَّ ذِى فَضْلٍ فَضْلَهُۥ ۖ وَإِن تَوَلَّوْا۟ فَإِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ كَبِيرٍ

Transliteration wa-ani is'taghfirū rabbakum thumma tūbū ilayhi yumattiʿ'kum matāʿan ḥasanan ilā ajalin musamman wayu'ti kulla dhī faḍlin faḍlahu wa-in tawallaw fa-innī akhāfu ʿalaykum ʿadhāba yawmin kabīrin

Telugu మరియు మీరు మీ ప్రభువును క్షమాభిక్ష వేడుకుంటే, తరువాత ఆయన వైపుకు పశ్చాత్తాపంతో మరలితే, ఆయన మీకు నిర్ణయించిన గడువు వరకు మంచి సుఖసంతోషాలను ప్రసాదిస్తాడు. మరియు అనుగ్రహాలకు అర్హుడైన ప్రతి ఒక్కనికీ ఆయన తన అనుగ్రహాలను ప్రసాదిస్తాడు కానీ, మీరు వెనుదిరిగితే! నిశ్చయంగా, ఆ గొప్ప దినమున మీపై రాబోయే శిక్షకు నేను భయపడుతున్నాను!

Verse 4

إِلَى ٱللَّهِ مَرْجِعُكُمْ ۖ وَهُوَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ

Transliteration ilā l-lahi marjiʿukum wahuwa ʿalā kulli shayin qadīrun

Telugu అల్లాహ్ వైపునకే మీ మరలింపు ఉంది. మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు."

Verse 5

أَلَآ إِنَّهُمْ يَثْنُونَ صُدُورَهُمْ لِيَسْتَخْفُوا۟ مِنْهُ ۚ أَلَا حِينَ يَسْتَغْشُونَ ثِيَابَهُمْ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ ۚ إِنَّهُۥ عَلِيمٌۢ بِذَاتِ ٱلصُّدُورِ

Transliteration alā innahum yathnūna ṣudūrahum liyastakhfū min'hu alā ḥīna yastaghshūna thiyābahum yaʿlamu mā yusirrūna wamā yuʿ'linūna innahu ʿalīmun bidhāti l-ṣudūri

Telugu వినండి! వాస్తవానికి వారు ఆయన నుండి దాక్కోవటానికి తమ వక్షాలను త్రిప్పుకుంటున్నారు. జాగ్రత్త! వారు తమ వస్త్రాలలో తమను తాము కప్పుకున్నప్పటికీ, ఆయన (అల్లాహ్) కు వారు దాచే విషయాలు మరియు వెలిబుచ్చే విషయాలూ అన్నీ బాగా తెలుసు. నిశ్చయంగా, ఆయనకు హృదయాలలో ఉన్నవి (రహస్యాలు) కూడా బాగా తెలుసు.

Verse 6

۞ وَمَا مِن دَآبَّةٍ فِى ٱلْأَرْضِ إِلَّا عَلَى ٱللَّهِ رِزْقُهَا وَيَعْلَمُ مُسْتَقَرَّهَا وَمُسْتَوْدَعَهَا ۚ كُلٌّ فِى كِتَـٰبٍ مُّبِينٍ

Transliteration wamā min dābbatin fī l-arḍi illā ʿalā l-lahi riz'quhā wayaʿlamu mus'taqarrahā wamus'tawdaʿahā kullun fī kitābin mubīnin

Telugu మరియు భూమిపై సంచరించే ప్రతి ప్రాణి జీవనోపాధి (బాధ్యత) అల్లాహ్ పైననే ఉంది. ఆయనకు దాని నివాసం, నివాసకాలం మరియు దాని అంతిమ నివాసస్థలమూ తెలుసు. అంతా ఒక స్పష్టమైన గ్రంథంలో (వ్రాయబడి) ఉంది.

Verse 7

وَهُوَ ٱلَّذِى خَلَقَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ فِى سِتَّةِ أَيَّامٍ وَكَانَ عَرْشُهُۥ عَلَى ٱلْمَآءِ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا ۗ وَلَئِن قُلْتَ إِنَّكُم مَّبْعُوثُونَ مِنۢ بَعْدِ ٱلْمَوْتِ لَيَقُولَنَّ ٱلَّذِينَ كَفَرُوٓا۟ إِنْ هَـٰذَآ إِلَّا سِحْرٌ مُّبِينٌ

Transliteration wahuwa alladhī khalaqa l-samāwāti wal-arḍa fī sittati ayyāmin wakāna ʿarshuhu ʿalā l-māi liyabluwakum ayyukum aḥsanu ʿamalan wala-in qul'ta innakum mabʿūthūna min baʿdi l-mawti layaqūlanna alladhīna kafarū in hādhā illā siḥ'run mubīnun

Telugu మరియు ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాడు. మరియు ఆయన సింహాసనం (అర్ష్) నీటి మీద ఉండెను. మీలో మంచిపనులు చేసేవాడు ఎవడో పరీక్షించటానికి (ఆయన ఇదంతా సృష్టించాడు). నీవు వారితో: "నిశ్చయంగా, మీరు మరణించిన తరువాత మరల లేపబడతారు." అని అన్నప్పుడు, సత్యతిరస్కారులు తప్పక అంటారు: "ఇది ఒక స్పష్టమైన మాయాజాలం మాత్రమే."

Verse 8

وَلَئِنْ أَخَّرْنَا عَنْهُمُ ٱلْعَذَابَ إِلَىٰٓ أُمَّةٍ مَّعْدُودَةٍ لَّيَقُولُنَّ مَا يَحْبِسُهُۥٓ ۗ أَلَا يَوْمَ يَأْتِيهِمْ لَيْسَ مَصْرُوفًا عَنْهُمْ وَحَاقَ بِهِم مَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ

Transliteration wala-in akharnā ʿanhumu l-ʿadhāba ilā ummatin maʿdūdatin layaqūlunna mā yaḥbisuhu alā yawma yatīhim laysa maṣrūfan ʿanhum waḥāqa bihim mā kānū bihi yastahziūna

Telugu మరియు ఒకవేళ మేము వారి శిక్షను ఒక నిర్ణీత కాలం వరకు ఆపి ఉంచితే, వారు తప్పకుండా అంటారు: "దానిని ఆపుతున్నది ఏమిటీ?" వాస్తవానికి అది వచ్చిన రోజు, దానిని వారి నుండి తొలగించగల వారెవ్వరూ ఉండరు. మరియు వారు ఎగతాళి చేస్తూ ఉన్నదే, వారిని క్రమ్ముకుంటుంది.

Verse 9

وَلَئِنْ أَذَقْنَا ٱلْإِنسَـٰنَ مِنَّا رَحْمَةً ثُمَّ نَزَعْنَـٰهَا مِنْهُ إِنَّهُۥ لَيَـُٔوسٌ كَفُورٌ

Transliteration wala-in adhaqnā l-insāna minnā raḥmatan thumma nazaʿnāhā min'hu innahu layaūsun kafūrun

Telugu మరియు ఒకవేళ మేము మానవునికి మా కారుణ్యాన్ని రుచి చూపించి, తరువాత అతని నుండి దానిని లాక్కుంటే! నిశ్చయంగా, అతడు నిరాశ చెంది, కృతఘ్నుడవుతాడు.

Verse 10

وَلَئِنْ أَذَقْنَـٰهُ نَعْمَآءَ بَعْدَ ضَرَّآءَ مَسَّتْهُ لَيَقُولَنَّ ذَهَبَ ٱلسَّيِّـَٔاتُ عَنِّىٓ ۚ إِنَّهُۥ لَفَرِحٌ فَخُورٌ

Transliteration wala-in adhaqnāhu naʿmāa baʿda ḍarrāa massathu layaqūlanna dhahaba l-sayiātu ʿannī innahu lafariḥun fakhūrun

Telugu కాని ఒకవేళ మేము అతనికి ఆపద తరువాత, అనుగ్రహాన్ని రుచి చూపిస్తే: "నా ఆపదలన్నీ నా నుండి తొలగిపోయాయి!" అని అంటాడు. నిశ్చయంగా అతడు ఆనందంతో, విర్రవీగుతాడు.

Verse 11

إِلَّا ٱلَّذِينَ صَبَرُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ أُو۟لَـٰٓئِكَ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ

Transliteration illā alladhīna ṣabarū waʿamilū l-ṣāliḥāti ulāika lahum maghfiratun wa-ajrun kabīrun

Telugu కాని ఎవరైతే సహనం వహించి, సత్కార్యాలు చేస్తూ ఉంటారో, అలాంటి వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి.

Verse 12

فَلَعَلَّكَ تَارِكٌۢ بَعْضَ مَا يُوحَىٰٓ إِلَيْكَ وَضَآئِقٌۢ بِهِۦ صَدْرُكَ أَن يَقُولُوا۟ لَوْلَآ أُنزِلَ عَلَيْهِ كَنزٌ أَوْ جَآءَ مَعَهُۥ مَلَكٌ ۚ إِنَّمَآ أَنتَ نَذِيرٌ ۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍ وَكِيلٌ

Transliteration falaʿallaka tārikun baʿḍa mā yūḥā ilayka waḍāiqun bihi ṣadruka an yaqūlū lawlā unzila ʿalayhi kanzun aw jāa maʿahu malakun innamā anta nadhīrun wal-lahu ʿalā kulli shayin wakīlun

Telugu (ఓ ప్రవక్తా!) బహశా నీవు, నీపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానం (వహీ) లోని కొంత భాగాన్ని విడిచి పెట్టనున్నావేమో! మరియు దానితో నీ హృదయానికి ఇబ్బంది కలుగుతుందేమో! ఎందుకంటే, (సత్యతిరస్కారులు): "ఇతనిపై ఒక నిధి ఎందుకు దింప బడలేదు? లేదా ఇతనితో బాటు ఒక దేవదూత ఎందుకు రాలేదు?" అని అంటున్నారని. నిశ్చయంగా, నీవైతే కేవలం హెచ్చరిక చేసే వాడవు మాత్రమే. మరియు అల్లాహ్ యే ప్రతిదాని కార్యసాధకుడు.

Verse 13

أَمْ يَقُولُونَ ٱفْتَرَىٰهُ ۖ قُلْ فَأْتُوا۟ بِعَشْرِ سُوَرٍ مِّثْلِهِۦ مُفْتَرَيَـٰتٍ وَٱدْعُوا۟ مَنِ ٱسْتَطَعْتُم مِّن دُونِ ٱللَّهِ إِن كُنتُمْ صَـٰدِقِينَ

Transliteration am yaqūlūna if'tarāhu qul fatū biʿashri suwarin mith'lihi muf'tarayātin wa-id'ʿū mani is'taṭaʿtum min dūni l-lahi in kuntum ṣādiqīna

Telugu లేదా వారు: "అతనే (ప్రవక్తయే) దీనిని (ఈ ఖుర్ఆన్ ను) కల్పించాడు." అని అంటున్నారా? వారితో అను: "మీరు సత్యవంతులే అయితే - అల్లాహ్ తప్ప, మీరు పిలుచుకోగల వారినందరినీ పిలుచుకొని - దీని వంటి పది సూరాహ్ లను కల్పించి తీసుకురండి!"

Verse 14

فَإِلَّمْ يَسْتَجِيبُوا۟ لَكُمْ فَٱعْلَمُوٓا۟ أَنَّمَآ أُنزِلَ بِعِلْمِ ٱللَّهِ وَأَن لَّآ إِلَـٰهَ إِلَّا هُوَ ۖ فَهَلْ أَنتُم مُّسْلِمُونَ

Transliteration fa-illam yastajībū lakum fa-iʿ'lamū annamā unzila biʿil'mi l-lahi wa-an lā ilāha illā huwa fahal antum mus'limūna

Telugu ఒకవేళ (మీరు సాటి కల్పించిన) వారు మీకు సహాయం చేయలేక పోతే (సమాధాన మివ్వకపోతే) నిశ్చయంగా ఇది అల్లాహ్ జ్ఞానంతోనే అవతరింప జేయబడిందని తెలుసుకోండి. మరియు ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. అయితే ఇప్పుడైనా మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అవుతారా?

Verse 15

مَن كَانَ يُرِيدُ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا وَزِينَتَهَا نُوَفِّ إِلَيْهِمْ أَعْمَـٰلَهُمْ فِيهَا وَهُمْ فِيهَا لَا يُبْخَسُونَ

Transliteration man kāna yurīdu l-ḥayata l-dun'yā wazīnatahā nuwaffi ilayhim aʿmālahum fīhā wahum fīhā lā yub'khasūna

Telugu ఎవరు ప్రాపంచిక జీవిత సౌకర్యాలు మరియు దాని అలంకరణ కోరుకుంటారో మేము వారి కర్మల ఫలితాన్ని, ఈ జీవితంలోనే పూర్తిగా చెల్లిస్తాము. మరియు అందులో వారి కెలాంటి లోపం జరుగదు.

Verse 16

أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ لَيْسَ لَهُمْ فِى ٱلْـَٔاخِرَةِ إِلَّا ٱلنَّارُ ۖ وَحَبِطَ مَا صَنَعُوا۟ فِيهَا وَبَـٰطِلٌ مَّا كَانُوا۟ يَعْمَلُونَ

Transliteration ulāika alladhīna laysa lahum fī l-ākhirati illā l-nāru waḥabiṭa mā ṣanaʿū fīhā wabāṭilun mā kānū yaʿmalūna

Telugu అలాంటి వారికి పరలోకంలో నరకాగ్ని తప్ప మరేమీ ఉండదు. వారు ఇందులో (ఈ లోకంలో) పాటు పడినదంతా వ్యర్థమయి పోతుంది మరియు వారు చేసిన కర్మలన్నీ విఫలమవుతాయి.

Verse 17

أَفَمَن كَانَ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّهِۦ وَيَتْلُوهُ شَاهِدٌ مِّنْهُ وَمِن قَبْلِهِۦ كِتَـٰبُ مُوسَىٰٓ إِمَامًا وَرَحْمَةً ۚ أُو۟لَـٰٓئِكَ يُؤْمِنُونَ بِهِۦ ۚ وَمَن يَكْفُرْ بِهِۦ مِنَ ٱلْأَحْزَابِ فَٱلنَّارُ مَوْعِدُهُۥ ۚ فَلَا تَكُ فِى مِرْيَةٍ مِّنْهُ ۚ إِنَّهُ ٱلْحَقُّ مِن رَّبِّكَ وَلَـٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يُؤْمِنُونَ

Transliteration afaman kāna ʿalā bayyinatin min rabbihi wayatlūhu shāhidun min'hu wamin qablihi kitābu mūsā imāman waraḥmatan ulāika yu'minūna bihi waman yakfur bihi mina l-aḥzābi fal-nāru mawʿiduhu falā taku fī mir'yatin min'hu innahu l-ḥaqu min rabbika walākinna akthara l-nāsi lā yu'minūna

Telugu ఏ వ్యక్తి అయితే తన ప్రభువు తరఫు నుండి వచ్చిన స్పష్టమైన నిదర్శనం పై ఉన్నాడో! మరియు దానికి తోడుగా ఆయన (అల్లాహ్) సాక్ష్యం ఉందో! మరియు దీనికి ముందు మార్గదర్శిని మరియు కారుణ్యంగా వచ్చిన, మూసా గ్రంథం కూడా సాక్షిగా ఉందో! (అలాంటి వాడు సత్యతిరస్కారులతో సమానుడా?) అలాంటి వారు దీనిని (ఖుర్ఆన్ ను) విశ్వసిస్తారు. మరియు దీనిని (ఖుర్ఆన్ ను) తిరస్కరించే తెగల వారి వాగ్దాన స్థలం నరకాగ్నియే! కావున దీనిని గురించి నీవు ఎలాంటి సందేహంలో పడకు. నిశ్చయంగా, ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కాని చాలా మంది ప్రజలు విశ్వసించరు.

Verse 18

وَمَنْ أَظْلَمُ مِمَّنِ ٱفْتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا ۚ أُو۟لَـٰٓئِكَ يُعْرَضُونَ عَلَىٰ رَبِّهِمْ وَيَقُولُ ٱلْأَشْهَـٰدُ هَـٰٓؤُلَآءِ ٱلَّذِينَ كَذَبُوا۟ عَلَىٰ رَبِّهِمْ ۚ أَلَا لَعْنَةُ ٱللَّهِ عَلَى ٱلظَّـٰلِمِينَ

Transliteration waman aẓlamu mimmani if'tarā ʿalā l-lahi kadhiban ulāika yuʿ'raḍūna ʿalā rabbihim wayaqūlu l-ashhādu hāulāi alladhīna kadhabū ʿalā rabbihim alā laʿnatu l-lahi ʿalā l-ẓālimīna

Telugu మరియు అల్లాహ్ కు అబద్ధం అంటగట్టే వాడి కంటే ఎక్కువ దుర్మార్గుడు ఎవడు? అలాంటి వారు తమ ప్రభువు ముందు ప్రవేశ పెట్టబడతారు. అప్పుడు: "వీరే, తమ ప్రభువుకు అబద్ధాన్ని అంటగట్టిన వారు." అని సాక్షులు పలుకుతారు. నిస్సందేహంగా, అల్లాహ్ శాపం (బహిష్కారం) దుర్మార్గులపై ఉంటుంది.

Verse 19

ٱلَّذِينَ يَصُدُّونَ عَن سَبِيلِ ٱللَّهِ وَيَبْغُونَهَا عِوَجًا وَهُم بِٱلْـَٔاخِرَةِ هُمْ كَـٰفِرُونَ

Transliteration alladhīna yaṣuddūna ʿan sabīli l-lahi wayabghūnahā ʿiwajan wahum bil-ākhirati hum kāfirūna

Telugu ఎవరు అల్లాహ్ మార్గం నుండి (ప్రజలను) అడ్డగిస్తారో మరియు దానిని వక్రమైనదిగా చూపుతారో అలాంటి వారు, వారే! పరలోక జీవితం ఉన్నదనే సత్యాన్ని తిరస్కరించేవారు.

Verse 20

أُو۟لَـٰٓئِكَ لَمْ يَكُونُوا۟ مُعْجِزِينَ فِى ٱلْأَرْضِ وَمَا كَانَ لَهُم مِّن دُونِ ٱللَّهِ مِنْ أَوْلِيَآءَ ۘ يُضَـٰعَفُ لَهُمُ ٱلْعَذَابُ ۚ مَا كَانُوا۟ يَسْتَطِيعُونَ ٱلسَّمْعَ وَمَا كَانُوا۟ يُبْصِرُونَ

Transliteration ulāika lam yakūnū muʿ'jizīna fī l-arḍi wamā kāna lahum min dūni l-lahi min awliyāa yuḍāʿafu lahumu l-ʿadhābu mā kānū yastaṭīʿūna l-samʿa wamā kānū yub'ṣirūna

Telugu అలాంటి వారు భూమిలో (అల్లాహ్ శిక్ష నుండి) తప్పించు కోలేరు. మరియు వారికి అల్లాహ్ తప్ప ఇతర సంరక్షకులు లేరు. వారి శిక్ష రెట్టింపు చేయబడుతుంది. (ఇహలోకంలో వారు సత్యాన్ని) విన లేక పోయేవారు మరియు చూడలేక పోయేవారు.

Verse 21

أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ خَسِرُوٓا۟ أَنفُسَهُمْ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا۟ يَفْتَرُونَ

Transliteration ulāika alladhīna khasirū anfusahum waḍalla ʿanhum mā kānū yaftarūna

Telugu అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేసుకున్నవారు మరియు వారు కల్పించుకున్న (దైవాలన్నీ) వారిని వీడి పోతాయి.

Verse 22

لَا جَرَمَ أَنَّهُمْ فِى ٱلْـَٔاخِرَةِ هُمُ ٱلْأَخْسَرُونَ

Transliteration lā jarama annahum fī l-ākhirati humu l-akhsarūna

Telugu నిస్సందేహంగా పరలోక జీవితంలో వీరే అత్యధికంగా నష్టపోయేవారు.

Verse 23

إِنَّ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ وَأَخْبَتُوٓا۟ إِلَىٰ رَبِّهِمْ أُو۟لَـٰٓئِكَ أَصْحَـٰبُ ٱلْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَـٰلِدُونَ

Transliteration inna alladhīna āmanū waʿamilū l-ṣāliḥāti wa-akhbatū ilā rabbihim ulāika aṣḥābu l-janati hum fīhā khālidūna

Telugu నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసి తమ ప్రభువుకే అంకితమై పోయేటటువంటి వారే స్వర్గవాసులవుతారు. వారు దానిలోనే శాశ్వతంగా ఉంటారు.

Verse 24

۞ مَثَلُ ٱلْفَرِيقَيْنِ كَٱلْأَعْمَىٰ وَٱلْأَصَمِّ وَٱلْبَصِيرِ وَٱلسَّمِيعِ ۚ هَلْ يَسْتَوِيَانِ مَثَلًا ۚ أَفَلَا تَذَكَّرُونَ

Transliteration mathalu l-farīqayni kal-aʿmā wal-aṣami wal-baṣīri wal-samīʿi hal yastawiyāni mathalan afalā tadhakkarūna

Telugu ఈ ఉభయ పక్షాల వారిని, ఒక గ్రుడ్డి మరియు చెవిటి, మరొక చూడగల మరియు వినగల వారితో పోల్చవచ్చు! ఏమీ? పోలికలో వీరిరువురూ సమానులా? మీరు ఇకనైనా గుణపాఠం నేర్చుకోరా?

Verse 25

وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦٓ إِنِّى لَكُمْ نَذِيرٌ مُّبِينٌ

Transliteration walaqad arsalnā nūḥan ilā qawmihi innī lakum nadhīrun mubīnun

Telugu మరియు వాస్తవానికి మేము నూహ్ ను అతని జాతి వారి వద్దకు పంపాము. (అతను వారితో అన్నాడు): "నిశ్చయంగా, నేను మీకు స్పష్టమైన హెచ్చరిక చేసేవాడిని మాత్రమే -

Verse 26

أَن لَّا تَعْبُدُوٓا۟ إِلَّا ٱللَّهَ ۖ إِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ أَلِيمٍ

Transliteration an lā taʿbudū illā l-laha innī akhāfu ʿalaykum ʿadhāba yawmin alīmin

Telugu మీరు అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించ కూడదని. అలా చేస్తే నిశ్చయంగా ఆ బాధాకరమైన దినమున మీకు పడబోయే శిక్షకు నేను భయపడుతున్నాను."

Verse 27

فَقَالَ ٱلْمَلَأُ ٱلَّذِينَ كَفَرُوا۟ مِن قَوْمِهِۦ مَا نَرَىٰكَ إِلَّا بَشَرًا مِّثْلَنَا وَمَا نَرَىٰكَ ٱتَّبَعَكَ إِلَّا ٱلَّذِينَ هُمْ أَرَاذِلُنَا بَادِىَ ٱلرَّأْىِ وَمَا نَرَىٰ لَكُمْ عَلَيْنَا مِن فَضْلٍۭ بَلْ نَظُنُّكُمْ كَـٰذِبِينَ

Transliteration faqāla l-mala-u alladhīna kafarū min qawmihi mā narāka illā basharan mith'lanā wamā narāka ittabaʿaka illā alladhīna hum arādhilunā bādiya l-rayi wamā narā lakum ʿalaynā min faḍlin bal naẓunnukum kādhibīna

Telugu అప్పుడు అతని జాతివారిలో సత్యతిరస్కారులైన నాయకులు: "నీవు కూడా మా మాదిరిగా ఒక సాధారణ మానవుడవే తప్ప, నీలో మరే ప్రత్యేకతను మేము చూడటం లేదు. మరియు వివేకం లేని నీచమైన వారు తప్ప ఇతరులు నిన్ను అనుసరిస్తున్నట్లు కూడా మేము చూడటం లేదు. మరియు మీలో మా కంటే ఎక్కువ ఘనత కూడా మాకు కనబడటం లేదు. అంతేగాక మీరు అసత్యవాదులని మేము భావిస్తున్నాము." అని అన్నారు.

Verse 28

قَالَ يَـٰقَوْمِ أَرَءَيْتُمْ إِن كُنتُ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّى وَءَاتَىٰنِى رَحْمَةً مِّنْ عِندِهِۦ فَعُمِّيَتْ عَلَيْكُمْ أَنُلْزِمُكُمُوهَا وَأَنتُمْ لَهَا كَـٰرِهُونَ

Transliteration qāla yāqawmi ara-aytum in kuntu ʿalā bayyinatin min rabbī waātānī raḥmatan min ʿindihi faʿummiyat ʿalaykum anul'zimukumūhā wa-antum lahā kārihūna

Telugu అతను (నూహ్) అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! మీరు చూస్తున్నారు కదా? నేను నా ప్రభువు తరఫు నుండి వచ్చిన స్పష్టమైన సూచనను (నిదర్శనాన్ని) అనుసరిస్తున్నాను. ఆయన తన కారుణ్యాన్ని నాపై ప్రసాదించాడు, కాని అది మీకు కనబడటం లేదు. అలాంటప్పుడు మీరు దానిని అసహ్యించుకుంటున్నా, దానిని స్వీకరించమని మేము మిమ్మల్ని బలవంతం చేయగలమా?

Verse 29

وَيَـٰقَوْمِ لَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مَالًا ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَى ٱللَّهِ ۚ وَمَآ أَنَا۠ بِطَارِدِ ٱلَّذِينَ ءَامَنُوٓا۟ ۚ إِنَّهُم مُّلَـٰقُوا۟ رَبِّهِمْ وَلَـٰكِنِّىٓ أَرَىٰكُمْ قَوْمًا تَجْهَلُونَ

Transliteration wayāqawmi lā asalukum ʿalayhi mālan in ajriya illā ʿalā l-lahi wamā anā biṭāridi alladhīna āmanū innahum mulāqū rabbihim walākinnī arākum qawman tajhalūna

Telugu "మరియు ఓ నా జాతి ప్రజలారా! నేను దాని కోసం మీ నుండి ధనాన్ని అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం అల్లాహ్ దగ్గరనే ఉంది. మరియు నేను విశ్వసించిన వారిని త్రోసి వేయలేను. నిశ్చయంగా, వారైతే తమ ప్రభువును కలుసుకుంటారు, కాని నిశ్చయంగా నేను మిమ్మల్ని మూఢ జనులుగా చూస్తున్నాను.

Verse 30

وَيَـٰقَوْمِ مَن يَنصُرُنِى مِنَ ٱللَّهِ إِن طَرَدتُّهُمْ ۚ أَفَلَا تَذَكَّرُونَ

Transliteration wayāqawmi man yanṣurunī mina l-lahi in ṭaradttuhum afalā tadhakkarūna

Telugu "మరియు ఓ నాజాతి ప్రజలారా! ఒకవేళ నేను వారిని (విశ్వాసులను) గెంటి వేస్తే నన్ను అల్లాహ్ (శిక్ష) నుండి, ఎవడు కాపాడ గలడు? ఏమీ? మీరిది గ్రహించలేరా?

Verse 31

وَلَآ أَقُولُ لَكُمْ عِندِى خَزَآئِنُ ٱللَّهِ وَلَآ أَعْلَمُ ٱلْغَيْبَ وَلَآ أَقُولُ إِنِّى مَلَكٌ وَلَآ أَقُولُ لِلَّذِينَ تَزْدَرِىٓ أَعْيُنُكُمْ لَن يُؤْتِيَهُمُ ٱللَّهُ خَيْرًا ۖ ٱللَّهُ أَعْلَمُ بِمَا فِىٓ أَنفُسِهِمْ ۖ إِنِّىٓ إِذًا لَّمِنَ ٱلظَّـٰلِمِينَ

Transliteration walā aqūlu lakum ʿindī khazāinu l-lahi walā aʿlamu l-ghayba walā aqūlu innī malakun walā aqūlu lilladhīna tazdarī aʿyunukum lan yu'tiyahumu l-lahu khayran l-lahu aʿlamu bimā fī anfusihim innī idhan lamina l-ẓālimīna

Telugu "మరియు నా వద్ద నిధులు ఉన్నాయని గానీ మరియు నాకు అగోచర జ్ఞానమున్నదని గానీ నేను మీతో అనటం లేదు; మరియు నేను దైవదూతనని కూడా అనటం లేదు మరియు మీరు హీనంగా చూసే వారికి అల్లాహ్ మేలు చేయలేడని కూడా అనటం లేదు. వారి మనస్సులలో ఉన్నది అల్లాహ్ కు బాగా తెలుసు. అలా అయితే! నిశ్చయంగా, నేను దుర్మార్గులలో చేరిన వాడనే!"

Verse 32

قَالُوا۟ يَـٰنُوحُ قَدْ جَـٰدَلْتَنَا فَأَكْثَرْتَ جِدَٰلَنَا فَأْتِنَا بِمَا تَعِدُنَآ إِن كُنتَ مِنَ ٱلصَّـٰدِقِينَ

Transliteration qālū yānūḥu qad jādaltanā fa-aktharta jidālanā fatinā bimā taʿidunā in kunta mina l-ṣādiqīna

Telugu వారు అన్నారు: "ఓ నూహ్! నీవు మాతో వాదించావు, చాలా వాదించావు, ఇక నీవు సత్యవంతుడవే అయితే నీవు భయపెట్టే దానిని (ఆ శిక్షను) మాపై దింపు!"

Verse 33

قَالَ إِنَّمَا يَأْتِيكُم بِهِ ٱللَّهُ إِن شَآءَ وَمَآ أَنتُم بِمُعْجِزِينَ

Transliteration qāla innamā yatīkum bihi l-lahu in shāa wamā antum bimuʿ'jizīna

Telugu అతను (నూహ్) అన్నాడు: "అల్లాహ్ కోరితే నిశ్చయంగా, దానిని (ఆ శిక్షను) మీ పైకి తెస్తాడు మరియు మీరు దాని నుండి తప్పించుకోలేరు!

Verse 34

وَلَا يَنفَعُكُمْ نُصْحِىٓ إِنْ أَرَدتُّ أَنْ أَنصَحَ لَكُمْ إِن كَانَ ٱللَّهُ يُرِيدُ أَن يُغْوِيَكُمْ ۚ هُوَ رَبُّكُمْ وَإِلَيْهِ تُرْجَعُونَ

Transliteration walā yanfaʿukum nuṣ'ḥī in aradttu an anṣaḥa lakum in kāna l-lahu yurīdu an yugh'wiyakum huwa rabbukum wa-ilayhi tur'jaʿūna

Telugu ఒకవేళ అల్లాహ్ మిమ్మల్ని తప్పు దారిలో విడిచి పెట్టాలని కోరితే, నేను మీకు మంచి సలహా ఇవ్వాలని ఎంత కోరినా, నా సలహా మీకు లాభదాయకం కాజాలదు. ఆయనే మీ ప్రభువు మరియు ఆయన వైపునకే మీరంతా మరలి పోవలసి ఉన్నది."

Verse 35

أَمْ يَقُولُونَ ٱفْتَرَىٰهُ ۖ قُلْ إِنِ ٱفْتَرَيْتُهُۥ فَعَلَىَّ إِجْرَامِى وَأَنَا۠ بَرِىٓءٌ مِّمَّا تُجْرِمُونَ

Transliteration am yaqūlūna if'tarāhu qul ini if'taraytuhu faʿalayya ij'rāmī wa-anā barīon mimmā tuj'rimūna

Telugu ఏమీ? వారు: "అతనే (ముహమ్మదే) దీనిని కల్పించాడు" అని అంటున్నారా? వారితో ఇలా అను: "నేను దీనిని కల్పిస్తే దాని పాపం నాపై ఉంటుంది మరియు మీరు చేసే పాపాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు."

Verse 36

وَأُوحِىَ إِلَىٰ نُوحٍ أَنَّهُۥ لَن يُؤْمِنَ مِن قَوْمِكَ إِلَّا مَن قَدْ ءَامَنَ فَلَا تَبْتَئِسْ بِمَا كَانُوا۟ يَفْعَلُونَ

Transliteration waūḥiya ilā nūḥin annahu lan yu'mina min qawmika illā man qad āmana falā tabta-is bimā kānū yafʿalūna

Telugu మరియు నూహ్ కు ఇలా సందేశం (వహీ) పంపబడింది: " నిశ్చయంగా, నీ జాతి వారిలో ఇంత వరకు విశ్వసించిన వారు తప్ప ఇతరులెవ్వరూ విశ్వసించరు, కావున వారు చేసే కార్యాలకు నీవు చింతించకు!

Verse 37

وَٱصْنَعِ ٱلْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا وَلَا تُخَـٰطِبْنِى فِى ٱلَّذِينَ ظَلَمُوٓا۟ ۚ إِنَّهُم مُّغْرَقُونَ

Transliteration wa-iṣ'naʿi l-ful'ka bi-aʿyuninā wawaḥyinā walā tukhāṭib'nī fī alladhīna ẓalamū innahum mugh'raqūna

Telugu మరియు నీవు మా సమక్షంలో, మా సందేశానుసారంగా, ఒక ఓడను నిర్మించు మరియు దుర్మార్గులను గురించి నన్ను అడుగకు. నిశ్చయంగా, వారు ముంచి వేయ బడతారు."

Verse 38

وَيَصْنَعُ ٱلْفُلْكَ وَكُلَّمَا مَرَّ عَلَيْهِ مَلَأٌ مِّن قَوْمِهِۦ سَخِرُوا۟ مِنْهُ ۚ قَالَ إِن تَسْخَرُوا۟ مِنَّا فَإِنَّا نَسْخَرُ مِنكُمْ كَمَا تَسْخَرُونَ

Transliteration wayaṣnaʿu l-ful'ka wakullamā marra ʿalayhi mala-on min qawmihi sakhirū min'hu qāla in taskharū minnā fa-innā naskharu minkum kamā taskharūna

Telugu మరియు నూహ్ ఓడ నిర్మిస్తూ ఉన్నప్పుడు, ప్రతిసారి అతని జాతి నాయకులు అతని ఎదుట నుండి పోయేటప్పుడు అతనితో పరిహాసాలాడేవారు. అతను (నూహ్) వారితో అనేవాడు: "ఇప్పుడు మీరు మాతో పరిహాసాలాడుతున్నారు, నిశ్చయంగా, మీరు పరిహాసాలాడినట్లే, మేము కూడా మీతో పరిహాసాలాడుతాము.

Verse 39

فَسَوْفَ تَعْلَمُونَ مَن يَأْتِيهِ عَذَابٌ يُخْزِيهِ وَيَحِلُّ عَلَيْهِ عَذَابٌ مُّقِيمٌ

Transliteration fasawfa taʿlamūna man yatīhi ʿadhābun yukh'zīhi wayaḥillu ʿalayhi ʿadhābun muqīmun

Telugu అవమానకరమైన శిక్ష ఎవరి పైకి వస్తుందో మరియు శాశ్వతమైన శిక్ష ఎవరిపై పడుతుందో త్వరలోనే మీరు తెలుసుకుంటారు."

Verse 40

حَتَّىٰٓ إِذَا جَآءَ أَمْرُنَا وَفَارَ ٱلتَّنُّورُ قُلْنَا ٱحْمِلْ فِيهَا مِن كُلٍّ زَوْجَيْنِ ٱثْنَيْنِ وَأَهْلَكَ إِلَّا مَن سَبَقَ عَلَيْهِ ٱلْقَوْلُ وَمَنْ ءَامَنَ ۚ وَمَآ ءَامَنَ مَعَهُۥٓ إِلَّا قَلِيلٌ

Transliteration ḥattā idhā jāa amrunā wafāra l-tanūru qul'nā iḥ'mil fīhā min kullin zawjayni ith'nayni wa-ahlaka illā man sabaqa ʿalayhi l-qawlu waman āmana wamā āmana maʿahu illā qalīlun

Telugu చివరకు మా ఆజ్ఞ వచ్చింది మరియు పొయ్యి పొంగింది (జల ప్రవాహాలు భూమిని చీల్చుకొని రాసాగాయి). అప్పుడు మేము (నూహ్ తో) అన్నాము: "ప్రతి జాతి (పశువుల) నుండి రెండు (ఆడ మగ) జంటలను మరియు నీ కుటుంబం వారిని - ఇది వరకే సూచించబడిన వాడు తప్ప - మరియు విశ్వసించిన వారిని, అందరినీ దానిలోకి (నావలోకి) ఎక్కించుకో!" అతనిని విశ్వసించిన వారు కొందరు మాత్రమే.

Verse 41

۞ وَقَالَ ٱرْكَبُوا۟ فِيهَا بِسْمِ ٱللَّهِ مَجْر۪ىٰهَا وَمُرْسَىٰهَآ ۚ إِنَّ رَبِّى لَغَفُورٌ رَّحِيمٌ

Transliteration waqāla ir'kabū fīhā bis'mi l-lahi majrahā wamur'sāhā inna rabbī laghafūrun raḥīmun

Telugu మరియు (నూహ్) అన్నాడు: "ఇందులోకి ఎక్కండి, అల్లాహ్ పేరుతో దీని పయనం మరియు దీని ఆగటం. నిశ్చయంగా నా ప్రభువు క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత."

Verse 42

وَهِىَ تَجْرِى بِهِمْ فِى مَوْجٍ كَٱلْجِبَالِ وَنَادَىٰ نُوحٌ ٱبْنَهُۥ وَكَانَ فِى مَعْزِلٍ يَـٰبُنَىَّ ٱرْكَب مَّعَنَا وَلَا تَكُن مَّعَ ٱلْكَـٰفِرِينَ

Transliteration wahiya tajrī bihim fī mawjin kal-jibāli wanādā nūḥun ib'nahu wakāna fī maʿzilin yābunayya ir'kab maʿanā walā takun maʿa l-kāfirīna

Telugu మరియు అది వారిని పర్వతాల వలే ఎత్తైన అలలలోనికి తీసుకొని పోసాగింది. అప్పుడు నూహ్ (పడవ నుండి) దూరంగా ఉన్న తన కుమారుణ్ణి పిలుస్తూ (అన్నాడు): "ఓ నా కుమారా! మాతో పాటు (ఓడలోకి) ఎక్కు అవిశ్వాసులలో కలిసిపోకు!"

Verse 43

قَالَ سَـَٔاوِىٓ إِلَىٰ جَبَلٍ يَعْصِمُنِى مِنَ ٱلْمَآءِ ۚ قَالَ لَا عَاصِمَ ٱلْيَوْمَ مِنْ أَمْرِ ٱللَّهِ إِلَّا مَن رَّحِمَ ۚ وَحَالَ بَيْنَهُمَا ٱلْمَوْجُ فَكَانَ مِنَ ٱلْمُغْرَقِينَ

Transliteration qāla saāwī ilā jabalin yaʿṣimunī mina l-māi qāla lā ʿāṣima l-yawma min amri l-lahi illā man raḥima waḥāla baynahumā l-mawju fakāna mina l-mugh'raqīna

Telugu మరియు అతడు (కుమారుడు) అన్నాడు: "నేను ఒక కొండ పైకి ఎక్కి శరణు పొందుతాను, అది నన్ను నీళ్ల నుండి కాపాడుతుంది." (నూహ్) అన్నాడు: "ఈ రోజు అల్లాహ్ తీర్పుకు విరుద్ధంగా కాపాడేవాడు ఎవ్వడూ లేడు, ఆయన (అల్లాహ్) యే కరుణిస్తే తప్ప!" అప్పుడే వారి మధ్య ఒక కెరటం రాగా అతడు కూడా మునిగిపోయే వారిలో కలిసి పోయాడు.

Verse 44

وَقِيلَ يَـٰٓأَرْضُ ٱبْلَعِى مَآءَكِ وَيَـٰسَمَآءُ أَقْلِعِى وَغِيضَ ٱلْمَآءُ وَقُضِىَ ٱلْأَمْرُ وَٱسْتَوَتْ عَلَى ٱلْجُودِىِّ ۖ وَقِيلَ بُعْدًا لِّلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ

Transliteration waqīla yāarḍu ib'laʿī māaki wayāsamāu aqliʿī waghīḍa l-māu waquḍiya l-amru wa-is'tawat ʿalā l-jūdiyi waqīla buʿ'dan lil'qawmi l-ẓālimīna

Telugu ఆ తరువాత ఆజ్ఞ వచ్చింది: "ఓ భూమీ! నీ నీళ్ళను మ్రింగివేయి. ఓ ఆకాశమా! (కురవటం) ఆపి వేయి!" అప్పుడు నీరు (భూమిలోకి) ఇంకి పోయింది. (అల్లాహ్) తీర్పు నెరవేరింది. ఓడ జూదీ కొండ మీద ఆగింది. మరియు అప్పుడు: "దుర్మార్గుల జాతివారు దూరమై (నాశనమై) పోయారు!" అని అనబడింది.

Verse 45

وَنَادَىٰ نُوحٌ رَّبَّهُۥ فَقَالَ رَبِّ إِنَّ ٱبْنِى مِنْ أَهْلِى وَإِنَّ وَعْدَكَ ٱلْحَقُّ وَأَنتَ أَحْكَمُ ٱلْحَـٰكِمِينَ

Transliteration wanādā nūḥun rabbahu faqāla rabbi inna ib'nī min ahlī wa-inna waʿdaka l-ḥaqu wa-anta aḥkamu l-ḥākimīna

Telugu మరియు నూహ్ తన ప్రభువును వేడుకుంటూ అన్నాడు: "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నా కుమారుడు నా కుటుంబంలోని వాడు! నీ వాగ్దానం సత్యమైనది మరియు నీవే సర్వోత్తమ న్యాయాధికారివి."

Verse 46

قَالَ يَـٰنُوحُ إِنَّهُۥ لَيْسَ مِنْ أَهْلِكَ ۖ إِنَّهُۥ عَمَلٌ غَيْرُ صَـٰلِحٍ ۖ فَلَا تَسْـَٔلْنِ مَا لَيْسَ لَكَ بِهِۦ عِلْمٌ ۖ إِنِّىٓ أَعِظُكَ أَن تَكُونَ مِنَ ٱلْجَـٰهِلِينَ

Transliteration qāla yānūḥu innahu laysa min ahlika innahu ʿamalun ghayru ṣāliḥin falā tasalni mā laysa laka bihi ʿil'mun innī aʿiẓuka an takūna mina l-jāhilīna

Telugu ఆయన (అల్లాహ్) జవాబిచ్చాడు: "ఓ నూహ్! అతడు నిశ్చయంగా, నీ కుటుంబంలోని వాడు కాడు. నిశ్చయంగా, అతడి పనులు మంచివి కావు. కావున నీకు తెలియని విషయం గురించి నన్ను అడగకు. నీవు కూడా మూఢులలో చేరిన వాడవు కావద్దు. అని నేను నిన్ను ఉపదేశిస్తున్నాను."

Verse 47

قَالَ رَبِّ إِنِّىٓ أَعُوذُ بِكَ أَنْ أَسْـَٔلَكَ مَا لَيْسَ لِى بِهِۦ عِلْمٌ ۖ وَإِلَّا تَغْفِرْ لِى وَتَرْحَمْنِىٓ أَكُن مِّنَ ٱلْخَـٰسِرِينَ

Transliteration qāla rabbi innī aʿūdhu bika an asalaka mā laysa lī bihi ʿil'mun wa-illā taghfir lī watarḥamnī akun mina l-khāsirīna

Telugu నూహ్ ఇలా విన్నవించుకున్నాడు: "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నాకు తెలియని విషయాన్ని గురించి నిన్ను అడిగినందుకు, నేను నీ శరణు వేడుకుంటున్నాను. మరియు నీవు నన్ను క్షమించక పోతే, నన్ను కరణించక పోతే, నేను నష్టపోయిన వారిలో చేరుతాను."

Verse 48

قِيلَ يَـٰنُوحُ ٱهْبِطْ بِسَلَـٰمٍ مِّنَّا وَبَرَكَـٰتٍ عَلَيْكَ وَعَلَىٰٓ أُمَمٍ مِّمَّن مَّعَكَ ۚ وَأُمَمٌ سَنُمَتِّعُهُمْ ثُمَّ يَمَسُّهُم مِّنَّا عَذَابٌ أَلِيمٌ

Transliteration qīla yānūḥu ih'biṭ bisalāmin minnā wabarakātin ʿalayka waʿalā umamin mimman maʿaka wa-umamun sanumattiʿuhum thumma yamassuhum minnā ʿadhābun alīmun

Telugu ఇలా ఆజ్ఞ ఇవ్వబడింది: "ఓ నూహ్! నీవు మరియు నీతో ఉన్న నీ జాతివారు శాంతి మరియు మా ఆశీర్వాదాలతో (ఓడ /జూదీ పర్వతం నుండి) దిగండి. వారిలోని కొన్ని సంఘాలకు మేము కొంతకాలం వరకు సుఖసంతోషాలను ప్రసాదించగలము. ఆ తరువాత మా వద్ద నుండి బాధాకరమైన శిక్ష వారిపై పడుతుంది."

Verse 49

تِلْكَ مِنْ أَنۢبَآءِ ٱلْغَيْبِ نُوحِيهَآ إِلَيْكَ ۖ مَا كُنتَ تَعْلَمُهَآ أَنتَ وَلَا قَوْمُكَ مِن قَبْلِ هَـٰذَا ۖ فَٱصْبِرْ ۖ إِنَّ ٱلْعَـٰقِبَةَ لِلْمُتَّقِينَ

Transliteration til'ka min anbāi l-ghaybi nūḥīhā ilayka mā kunta taʿlamuhā anta walā qawmuka min qabli hādhā fa-iṣ'bir inna l-ʿāqibata lil'muttaqīna

Telugu (ఓ ప్రవక్తా!) ఇవి అగోచర విషయాలు. వాటిని మేము నీకు మా సందేశం (వహీ) ద్వారా తెలుపు తున్నాము. వాటిని నీవు గానీ, నీ జాతి వారు గానీ ఇంతకు పూర్వం ఎరుగరు. కనుక సహనం వహించు! నిశ్చయంగా, మంచి ఫలితం దైవభీతి గల వారికే లభిస్తుంది.

Verse 50

وَإِلَىٰ عَادٍ أَخَاهُمْ هُودًا ۚ قَالَ يَـٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُۥٓ ۖ إِنْ أَنتُمْ إِلَّا مُفْتَرُونَ

Transliteration wa-ilā ʿādin akhāhum hūdan qāla yāqawmi uʿ'budū l-laha mā lakum min ilāhin ghayruhu in antum illā muf'tarūna

Telugu మరియు ఆద్ జాతివారి దగ్గరికి వారి సహోదరుడు హూద్ ను పంపాము. అతను ఇలా అన్నాడు: "నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. మీరు కేవలం అబద్ధాలు కల్పిస్తున్నారు!

Verse 51

يَـٰقَوْمِ لَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ أَجْرًا ۖ إِنْ أَجْرِىَ إِلَّا عَلَى ٱلَّذِى فَطَرَنِىٓ ۚ أَفَلَا تَعْقِلُونَ

Transliteration yāqawmi lā asalukum ʿalayhi ajran in ajriya illā ʿalā alladhī faṭaranī afalā taʿqilūna

Telugu ఓ నా జాతి ప్రజలారా! (ఈ పనికి) నేను మీ నుంచి ఎలాంటి ప్రతిఫలం అడగటం లేదు. నా ప్రతిఫలం కేవలం నన్ను సృజించిన ఆయన వద్దనే ఉంది. ఏమీ? మీరు బుద్దిని ఉపయోగించరా (అర్థం చేసుకోలేరా)?

Verse 52

وَيَـٰقَوْمِ ٱسْتَغْفِرُوا۟ رَبَّكُمْ ثُمَّ تُوبُوٓا۟ إِلَيْهِ يُرْسِلِ ٱلسَّمَآءَ عَلَيْكُم مِّدْرَارًا وَيَزِدْكُمْ قُوَّةً إِلَىٰ قُوَّتِكُمْ وَلَا تَتَوَلَّوْا۟ مُجْرِمِينَ

Transliteration wayāqawmi is'taghfirū rabbakum thumma tūbū ilayhi yur'sili l-samāa ʿalaykum mid'rāran wayazid'kum quwwatan ilā quwwatikum walā tatawallaw muj'rimīna

Telugu మరియు ఓ నా జాతి ప్రజలారా! మీ ప్రభువు క్షమాభిక్షను వేడుకోండి, తరువాత ఆయన వైపుకు పశ్చాత్తాపంతో మరలండి, ఆయన మీ కొరకు ఆకాశం నుండి భారీ వర్షాలు కురిపిస్తాడు మరియు మీకు, మీ శక్తిపై మరింత శక్తిని ఇస్తాడు, కావున మీరు నేరస్థులై వెనుదిరగకండి!"

Verse 53

قَالُوا۟ يَـٰهُودُ مَا جِئْتَنَا بِبَيِّنَةٍ وَمَا نَحْنُ بِتَارِكِىٓ ءَالِهَتِنَا عَن قَوْلِكَ وَمَا نَحْنُ لَكَ بِمُؤْمِنِينَ

Transliteration qālū yāhūdu mā ji'tanā bibayyinatin wamā naḥnu bitārikī ālihatinā ʿan qawlika wamā naḥnu laka bimu'minīna

Telugu వారు అన్నారు: "ఓ హూద్! నీవు మా వద్దకు స్పష్టమైన సూచనను తీసుకొని రాలేదు మరియు మేము కేవలం నీ మాటలు విని మా దేవతలను వదలిపెట్టలేము మరియు మేము నిన్ను విశ్వసించలేము.

Verse 54

إِن نَّقُولُ إِلَّا ٱعْتَرَىٰكَ بَعْضُ ءَالِهَتِنَا بِسُوٓءٍ ۗ قَالَ إِنِّىٓ أُشْهِدُ ٱللَّهَ وَٱشْهَدُوٓا۟ أَنِّى بَرِىٓءٌ مِّمَّا تُشْرِكُونَ

Transliteration in naqūlu illā iʿ'tarāka baʿḍu ālihatinā bisūin qāla innī ush'hidu l-laha wa-ish'hadū annī barīon mimmā tush'rikūna

Telugu "మా దైవాలలో నుండి కొందరు నీకు కీడు కలిగించారు (నిన్ను పిచ్చికి గురి చేశారు) అని మాత్రమే మేము అనగలము!" అతను (హూద్) జవాబిచ్చాడు: "ఆయన (అల్లాహ్) తప్ప! మీరు ఆయనకు సాటి కల్పించే వాటితో నిశ్చయంగా, నాకు ఎలాంటి సంబంధం లేదని, నేను అల్లాహ్ ను సాక్షిగా పెడుతున్నాను మరియు మీరు కూడా సాక్షులుగా ఉండండి;

Verse 55

مِن دُونِهِۦ ۖ فَكِيدُونِى جَمِيعًا ثُمَّ لَا تُنظِرُونِ

Transliteration min dūnihi fakīdūnī jamīʿan thumma lā tunẓirūni

Telugu ఇక మీరంతా కలసి నాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నండి. నాకెలాంటి వ్యవధి ఇవ్వకండి.

Verse 56

إِنِّى تَوَكَّلْتُ عَلَى ٱللَّهِ رَبِّى وَرَبِّكُم ۚ مَّا مِن دَآبَّةٍ إِلَّا هُوَ ءَاخِذٌۢ بِنَاصِيَتِهَآ ۚ إِنَّ رَبِّى عَلَىٰ صِرَٰطٍ مُّسْتَقِيمٍ

Transliteration innī tawakkaltu ʿalā l-lahi rabbī warabbikum mā min dābbatin illā huwa ākhidhun bināṣiyatihā inna rabbī ʿalā ṣirāṭin mus'taqīmin

Telugu నిశ్చయంగా నాకూ మరియు మీకూ ప్రభువైన అల్లాహ్ నే నేను నమ్ముకున్నాను! ఏ ప్రాణి జుట్టు కూడా ఆయన చేతిలో లేకుండా లేదు. నిశ్చయంగా, నా ప్రభువే ఋజుమార్గంపై (సత్యంపై) ఉన్నాడు.

Verse 57

فَإِن تَوَلَّوْا۟ فَقَدْ أَبْلَغْتُكُم مَّآ أُرْسِلْتُ بِهِۦٓ إِلَيْكُمْ ۚ وَيَسْتَخْلِفُ رَبِّى قَوْمًا غَيْرَكُمْ وَلَا تَضُرُّونَهُۥ شَيْـًٔا ۚ إِنَّ رَبِّى عَلَىٰ كُلِّ شَىْءٍ حَفِيظٌ

Transliteration fa-in tawallaw faqad ablaghtukum mā ur'sil'tu bihi ilaykum wayastakhlifu rabbī qawman ghayrakum walā taḍurrūnahu shayan inna rabbī ʿalā kulli shayin ḥafīẓun

Telugu "ఒకవేళ మీరు వెనుదిరిగితే (మీ ఇష్టం), వాస్తవానికి నేనైతే, నాకివ్వబడిన సందేశాన్ని మీకు అంద జేశాను. మరియు నా ప్రభువు మీ స్థానంలో మరొక జాతిని మీకు వారసులుగా చేయగలడు మరియు మీరు ఆయనకు ఏ మాత్రం హాని చేయలేరు. నిశ్చయంగా, నా ప్రభువే ప్రతిదానికీ రక్షకుడు.

Verse 58

وَلَمَّا جَآءَ أَمْرُنَا نَجَّيْنَا هُودًا وَٱلَّذِينَ ءَامَنُوا۟ مَعَهُۥ بِرَحْمَةٍ مِّنَّا وَنَجَّيْنَـٰهُم مِّنْ عَذَابٍ غَلِيظٍ

Transliteration walammā jāa amrunā najjaynā hūdan wa-alladhīna āmanū maʿahu biraḥmatin minnā wanajjaynāhum min ʿadhābin ghalīẓin

Telugu మరియు మా ఆదేశం జారీ అయినప్పుడు, మా కారుణ్యంతో హూద్ ను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని రక్షించాము మరియు వారిని ఘోరశిక్ష నుండి కాపాడాము!

Verse 59

وَتِلْكَ عَادٌ ۖ جَحَدُوا۟ بِـَٔايَـٰتِ رَبِّهِمْ وَعَصَوْا۟ رُسُلَهُۥ وَٱتَّبَعُوٓا۟ أَمْرَ كُلِّ جَبَّارٍ عَنِيدٍ

Transliteration watil'ka ʿādun jaḥadū biāyāti rabbihim waʿaṣaw rusulahu wa-ittabaʿū amra kulli jabbārin ʿanīdin

Telugu మరియు వీరే ఆద్ జాతివారు! వారు తమ ప్రభువు సూచనలను (ఆయాత్ లను) తిరస్కరించారు మరియు ఆయన ప్రవక్తలకు అవిధేయులయ్యారు మరియు క్రూరుడైన ప్రతి (సత్య) విరోధి ఆజ్ఞలను అనుసరించారు!

Verse 60

وَأُتْبِعُوا۟ فِى هَـٰذِهِ ٱلدُّنْيَا لَعْنَةً وَيَوْمَ ٱلْقِيَـٰمَةِ ۗ أَلَآ إِنَّ عَادًا كَفَرُوا۟ رَبَّهُمْ ۗ أَلَا بُعْدًا لِّعَادٍ قَوْمِ هُودٍ

Transliteration wa-ut'biʿū fī hādhihi l-dun'yā laʿnatan wayawma l-qiyāmati alā inna ʿādan kafarū rabbahum alā buʿ'dan liʿādin qawmi hūdin

Telugu మరియు ఇహలోకంలో (అల్లాహ్) శాపం (బహిష్కారం) వారిని వెంబడింప జేయబడింది మరియు పునరుత్థాన దినమున కూడా (అల్లాహ్ శాపం వారిని వెంబడించగలదు). వినండి! నిస్సందేహంగా, ఆద్ జాతివారు తమ ప్రభువును తిరస్కరించారు. కావున చూశారా! హూద్ జాతి వారైన ఆద్ లు ఎలా (అల్లాహ్ కారుణ్యానికి) దూరమై పోయారో!

Verse 61

۞ وَإِلَىٰ ثَمُودَ أَخَاهُمْ صَـٰلِحًا ۚ قَالَ يَـٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُۥ ۖ هُوَ أَنشَأَكُم مِّنَ ٱلْأَرْضِ وَٱسْتَعْمَرَكُمْ فِيهَا فَٱسْتَغْفِرُوهُ ثُمَّ تُوبُوٓا۟ إِلَيْهِ ۚ إِنَّ رَبِّى قَرِيبٌ مُّجِيبٌ

Transliteration wa-ilā thamūda akhāhum ṣāliḥan qāla yāqawmi uʿ'budū l-laha mā lakum min ilāhin ghayruhu huwa ansha-akum mina l-arḍi wa-is'taʿmarakum fīhā fa-is'taghfirūhu thumma tūbū ilayhi inna rabbī qarībun mujībun

Telugu ఇక సమూద్ వారి వద్దకు వారి సహోదరుడు సాలిహ్ ను పంపాము. అతను అన్నాడు: "నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుండి పుట్టించి, దానిలో మిమ్మల్ని నివసింప జేశాడు. కనుక మీరు ఆయన క్షమాభిక్ష వేడుకోండి, తరువాత ఆయన వైపునకే పశ్చాత్తాపంతో మరలండి. నిశ్చయంగా, నా ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. (మీ ప్రార్థనలకు) జవాబిస్తాడు."

Verse 62

قَالُوا۟ يَـٰصَـٰلِحُ قَدْ كُنتَ فِينَا مَرْجُوًّا قَبْلَ هَـٰذَآ ۖ أَتَنْهَىٰنَآ أَن نَّعْبُدَ مَا يَعْبُدُ ءَابَآؤُنَا وَإِنَّنَا لَفِى شَكٍّ مِّمَّا تَدْعُونَآ إِلَيْهِ مُرِيبٍ

Transliteration qālū yāṣāliḥu qad kunta fīnā marjuwwan qabla hādhā atanhānā an naʿbuda mā yaʿbudu ābāunā wa-innanā lafī shakkin mimmā tadʿūnā ilayhi murībin

Telugu వారన్నారు: "ఓ సాలిహ్! ఇంతకు ముందు మేము నీపై ఆశలు పెట్టుకొని ఉన్నాము. ఏమీ? మా తండ్రి తాతలు ఆరాధిస్తూ వచ్చిన వాటిని (దైవాలను) ఆరాధించకుండా, మమ్మల్ని ఆపదలచుకున్నావా? నీవు మాకు బోధించే (ధర్మం) విషయం గురించి వాస్తవంగా మాకు చాలా సందేహం ఉంది."

Verse 63

قَالَ يَـٰقَوْمِ أَرَءَيْتُمْ إِن كُنتُ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّى وَءَاتَىٰنِى مِنْهُ رَحْمَةً فَمَن يَنصُرُنِى مِنَ ٱللَّهِ إِنْ عَصَيْتُهُۥ ۖ فَمَا تَزِيدُونَنِى غَيْرَ تَخْسِيرٍ

Transliteration qāla yāqawmi ara-aytum in kuntu ʿalā bayyinatin min rabbī waātānī min'hu raḥmatan faman yanṣurunī mina l-lahi in ʿaṣaytuhu famā tazīdūnanī ghayra takhsīrin

Telugu (సాలిహ్) అన్నాడు: "ఓ నా జాతి సోదరులారా! ఏమీ? మీరు చూడరా (ఆలోచించరా)? నేను నా ప్రభువు యొక్క స్పష్టమైన (నిదర్శనంపై) ఉన్నాను. మరియు ఆయన నాకు తన కారణ్యాన్ని ప్రసాదించాడు. ఇక నేను ఆయన (అల్లాహ్) ఆజ్ఞను ఉల్లంఘిస్తే, అల్లాహ్ కు విరుద్ధంగా నాకు ఎవడు సహాయ పడగలడు? మీరు నాకు నష్టం తప్ప మరేమీ అధికం చేయటం లేదు.

Verse 64

وَيَـٰقَوْمِ هَـٰذِهِۦ نَاقَةُ ٱللَّهِ لَكُمْ ءَايَةً فَذَرُوهَا تَأْكُلْ فِىٓ أَرْضِ ٱللَّهِ وَلَا تَمَسُّوهَا بِسُوٓءٍ فَيَأْخُذَكُمْ عَذَابٌ قَرِيبٌ

Transliteration wayāqawmi hādhihi nāqatu l-lahi lakum āyatan fadharūhā takul fī arḍi l-lahi walā tamassūhā bisūin fayakhudhakum ʿadhābun qarībun

Telugu "మరియు నా జాతి ప్రజలారా! అల్లాహ్ యొక్క ఈ ఆడ ఒంటె మీ కొరకు ఒక అద్భుత సూచన! కావున దీనిని అల్లాహ్ భూమిలో స్వేచ్ఛగా మేయటానికి వదలి పెట్టండి. దానికి ఎలాంటి కీడు కలిగించకండి, లేదా త్వరలోనే మిమ్మల్ని శిక్ష పట్టుకోగలదు."

Verse 65

فَعَقَرُوهَا فَقَالَ تَمَتَّعُوا۟ فِى دَارِكُمْ ثَلَـٰثَةَ أَيَّامٍ ۖ ذَٰلِكَ وَعْدٌ غَيْرُ مَكْذُوبٍ

Transliteration faʿaqarūhā faqāla tamattaʿū fī dārikum thalāthata ayyāmin dhālika waʿdun ghayru makdhūbin

Telugu అయినా వారు దానిని, వెనుక కాలి మోకాలి నరం కోసి చంపారు. అప్పుడు అతను (సాలిహ్) వారితో అన్నాడు: "మీరు మీ ఇండ్లలో మూడు రోజులు మాత్రమే హాయిగా గడపండి. ఇదొక వాగ్దానం, ఇది అబద్ధం కాబోదు."

Verse 66

فَلَمَّا جَآءَ أَمْرُنَا نَجَّيْنَا صَـٰلِحًا وَٱلَّذِينَ ءَامَنُوا۟ مَعَهُۥ بِرَحْمَةٍ مِّنَّا وَمِنْ خِزْىِ يَوْمِئِذٍ ۗ إِنَّ رَبَّكَ هُوَ ٱلْقَوِىُّ ٱلْعَزِيزُ

Transliteration falammā jāa amrunā najjaynā ṣāliḥan wa-alladhīna āmanū maʿahu biraḥmatin minnā wamin khiz'yi yawmi-idhin inna rabbaka huwa l-qawiyu l-ʿazīzu

Telugu ఆ తరువాత మా ఆదేశం జారీ అయినప్పుడు, మేము సాలిహ్ ను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని మా కారుణ్యంతో రక్షించాము. వారిని ఆ దినపు అవమానం నుండి కాపాడాము. నిశ్చయంగా నీ ప్రభువు! ఆయన మాత్రమే, మహా బలవంతుడు, సర్వ శక్తి సంపన్నుడు.

Verse 67

وَأَخَذَ ٱلَّذِينَ ظَلَمُوا۟ ٱلصَّيْحَةُ فَأَصْبَحُوا۟ فِى دِيَـٰرِهِمْ جَـٰثِمِينَ

Transliteration wa-akhadha alladhīna ẓalamū l-ṣayḥatu fa-aṣbaḥū fī diyārihim jāthimīna

Telugu మరియు దుర్మార్గానికి పాల్పబడిన వారిపై ఒక పెద్ద అరుపు (ప్రేలుడు) పడి, వారు తమ ఇండ్లలోనే చలనం లేకుండా (చచ్చి) పడి పోయారు;

Verse 68

كَأَن لَّمْ يَغْنَوْا۟ فِيهَآ ۗ أَلَآ إِنَّ ثَمُودَا۟ كَفَرُوا۟ رَبَّهُمْ ۗ أَلَا بُعْدًا لِّثَمُودَ

Transliteration ka-an lam yaghnaw fīhā alā inna thamūdā kafarū rabbahum alā buʿ'dan lithamūda

Telugu వారెన్నడూ అక్కడ నివసించనే లేదన్నట్లుగా. చూడండి! వాస్తవానికి, సమూద్ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. కాబట్టి చూశారా! సమూద్ వారెలా దూరమై పోయారో (నశించి పోయారో)!

Verse 69

وَلَقَدْ جَآءَتْ رُسُلُنَآ إِبْرَٰهِيمَ بِٱلْبُشْرَىٰ قَالُوا۟ سَلَـٰمًا ۖ قَالَ سَلَـٰمٌ ۖ فَمَا لَبِثَ أَن جَآءَ بِعِجْلٍ حَنِيذٍ

Transliteration walaqad jāat rusulunā ib'rāhīma bil-bush'rā qālū salāman qāla salāmun famā labitha an jāa biʿij'lin ḥanīdhin

Telugu మరియు వాస్తవానికి మా దూతలు శుభవార్త తీసుకొని ఇబ్రాహీమ్ వద్దకు వచ్చారు. వారు అన్నారు: "నీకు శాంతి కలుగు గాక (సలాం)!" అతను: "మీకూ శాంతి కలుగు గాక (సలాం)!" అని జవాబిచ్చాడు. తరువాత అతను అతి త్వరగా, వేపిన దూడను (వారి ఆతిథ్యానికి) తీసుకొని వచ్చాడు.

Verse 70

فَلَمَّا رَءَآ أَيْدِيَهُمْ لَا تَصِلُ إِلَيْهِ نَكِرَهُمْ وَأَوْجَسَ مِنْهُمْ خِيفَةً ۚ قَالُوا۟ لَا تَخَفْ إِنَّآ أُرْسِلْنَآ إِلَىٰ قَوْمِ لُوطٍ

Transliteration falammā raā aydiyahum lā taṣilu ilayhi nakirahum wa-awjasa min'hum khīfatan qālū lā takhaf innā ur'sil'nā ilā qawmi lūṭin

Telugu కానీ వారి చేతులు దాని వైపు పోక పోవటం చూసి వారిని గురించి అనుమానంలో పడ్డాడు మరియు వారి నుండి అపాయం కలుగు తుందేమోనని భయపడ్డాడు! వారన్నారు: "భయపడకు! వాస్తవానికి మేము లూత్ జాతి వైపునకు పంపబడినవారము (దూతలము)."

Verse 71

وَٱمْرَأَتُهُۥ قَآئِمَةٌ فَضَحِكَتْ فَبَشَّرْنَـٰهَا بِإِسْحَـٰقَ وَمِن وَرَآءِ إِسْحَـٰقَ يَعْقُوبَ

Transliteration wa-im'ra-atuhu qāimatun faḍaḥikat fabasharnāhā bi-is'ḥāqa wamin warāi is'ḥāqa yaʿqūba

Telugu అతని (ఇబ్రాహీమ్) భార్య (అక్కడే) నిలబడి ఉండెను; అప్పుడామె నవ్వింది; పిదప మేము ఆమెకు ఇస్ హాఖ్ యొక్క మరియు ఇస్ హాఖ్ తరువాత యఅఖూబ్ యొక్క శుభవార్తను ఇచ్చాము.

Verse 72

قَالَتْ يَـٰوَيْلَتَىٰٓ ءَأَلِدُ وَأَنَا۠ عَجُوزٌ وَهَـٰذَا بَعْلِى شَيْخًا ۖ إِنَّ هَـٰذَا لَشَىْءٌ عَجِيبٌ

Transliteration qālat yāwaylatā a-alidu wa-anā ʿajūzun wahādhā baʿlī shaykhan inna hādhā lashayon ʿajībun

Telugu ఆమె (ఆశ్చర్యంతో) అన్నది: "నా దౌర్భాగ్యం! నాకిప్పుడు బిడ్డ పుడతాడా? నేను ముసలిదానిని మరియు నా ఈ భర్త కూడా వృద్ధుడు. (అలా అయితే) నిశ్చయంగా, ఇది చాలా విచిత్రమైన విషయమే!"

Verse 73

قَالُوٓا۟ أَتَعْجَبِينَ مِنْ أَمْرِ ٱللَّهِ ۖ رَحْمَتُ ٱللَّهِ وَبَرَكَـٰتُهُۥ عَلَيْكُمْ أَهْلَ ٱلْبَيْتِ ۚ إِنَّهُۥ حَمِيدٌ مَّجِيدٌ

Transliteration qālū ataʿjabīna min amri l-lahi raḥmatu l-lahi wabarakātuhu ʿalaykum ahla l-bayti innahu ḥamīdun majīdun

Telugu వారన్నారు: "అల్లాహ్ ఉత్తరువు విషయంలో మీరు ఆశ్చర్యపడుతున్నారా? ఓ (ఇబ్రాహీమ్) గృహస్థులారా! మీపై అల్లాహ్ కారుణ్యం మరియు ఆయన శుభాశీస్సులు ఉన్నాయి! నిశ్చయంగా, ఆయనే సర్వ స్తోత్రాలకు అర్హుడు, మహత్వపూర్ణుడు.

Verse 74

فَلَمَّا ذَهَبَ عَنْ إِبْرَٰهِيمَ ٱلرَّوْعُ وَجَآءَتْهُ ٱلْبُشْرَىٰ يُجَـٰدِلُنَا فِى قَوْمِ لُوطٍ

Transliteration falammā dhahaba ʿan ib'rāhīma l-rawʿu wajāathu l-bush'rā yujādilunā fī qawmi lūṭin

Telugu అప్పుడు ఇబ్రాహీమ్ భయం దూరమై, అతనికి (సంతానపు) శుభవార్త అందిన తరువాత, అతను లూత్ జాతి వారి కొరకు మాతో వాదించసాగాడు.

Verse 75

إِنَّ إِبْرَٰهِيمَ لَحَلِيمٌ أَوَّٰهٌ مُّنِيبٌ

Transliteration inna ib'rāhīma laḥalīmun awwāhun munībun

Telugu (ఎందుకంటే) వాస్తవానికి ఇబ్రాహీమ్ సహనశీలుడు, మృదు హృదయుడు (నమ్రతతో అల్లాహ్ ను అర్థించేవాడు) మరియు పశ్చాత్తాపంతో (అల్లాహ్ వైపుకు) మరలేవాడు!

Verse 76

يَـٰٓإِبْرَٰهِيمُ أَعْرِضْ عَنْ هَـٰذَآ ۖ إِنَّهُۥ قَدْ جَآءَ أَمْرُ رَبِّكَ ۖ وَإِنَّهُمْ ءَاتِيهِمْ عَذَابٌ غَيْرُ مَرْدُودٍ

Transliteration yāib'rāhīmu aʿriḍ ʿan hādhā innahu qad jāa amru rabbika wa-innahum ātīhim ʿadhābun ghayru mardūdin

Telugu (వారన్నారు): "ఓ ఇబ్రాహీమ్! దీనిని (నీ మధ్యవర్తిత్వాన్ని) మానుకో! నిశ్చయంగా, నీ ప్రభువు ఆజ్ఞ వచ్చి వున్నది. మరియు నిశ్చయంగా, వారిపై ఆ శిక్ష పడటం తప్పదు; అది నివారించబడదు."

Verse 77

وَلَمَّا جَآءَتْ رُسُلُنَا لُوطًا سِىٓءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًا وَقَالَ هَـٰذَا يَوْمٌ عَصِيبٌ

Transliteration walammā jāat rusulunā lūṭan sīa bihim waḍāqa bihim dharʿan waqāla hādhā yawmun ʿaṣībun

Telugu మరియు మా దూతలు లూత్ వద్దకు వచ్చినపుడు, వారి రాకకు అతను, (వారిని కాపాడలేనని) దుఃఖితుడయ్యాడు. అతని హృదయం కృంగిపోయింది. అతను: "ఈ దినం చాలా ఆందోళనకరమైనది." అని వాపోయాడు.

Verse 78

وَجَآءَهُۥ قَوْمُهُۥ يُهْرَعُونَ إِلَيْهِ وَمِن قَبْلُ كَانُوا۟ يَعْمَلُونَ ٱلسَّيِّـَٔاتِ ۚ قَالَ يَـٰقَوْمِ هَـٰٓؤُلَآءِ بَنَاتِى هُنَّ أَطْهَرُ لَكُمْ ۖ فَٱتَّقُوا۟ ٱللَّهَ وَلَا تُخْزُونِ فِى ضَيْفِىٓ ۖ أَلَيْسَ مِنكُمْ رَجُلٌ رَّشِيدٌ

Transliteration wajāahu qawmuhu yuh'raʿūna ilayhi wamin qablu kānū yaʿmalūna l-sayiāti qāla yāqawmi hāulāi banātī hunna aṭharu lakum fa-ittaqū l-laha walā tukh'zūni fī ḍayfī alaysa minkum rajulun rashīdun

Telugu మరియు అతని జాతి ప్రజలు అతని వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారు మొదటి నుండి నీచపు పనులు చేస్తూ ఉండేవారు. అతను (లూత్) అన్నాడు: "నా జాతి ప్రజలారా! ఇదిగో నా ఈ కుమార్తెలు (నా జాతి స్త్రీలు) ఉన్నారు. వీరు మీ కొరకు చాలా శ్రేష్ఠమైన వారు. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నా అతిథుల విషయంలో నన్ను అవమానం పాలు చేయకండి. ఏమీ? మీలో ఒక్కడైనా నీతిపరుడు లేడా?"

Verse 79

قَالُوا۟ لَقَدْ عَلِمْتَ مَا لَنَا فِى بَنَاتِكَ مِنْ حَقٍّ وَإِنَّكَ لَتَعْلَمُ مَا نُرِيدُ

Transliteration qālū laqad ʿalim'ta mā lanā fī banātika min ḥaqqin wa-innaka lataʿlamu mā nurīdu

Telugu వారన్నారు: "నీ కూతుళ్ళు మాకు అవసరం లేదని నీకు బాగా తెలుసు కదా! మరియు నిశ్చయంగా, మేము కోరేది ఏమిటో కూడా నీకు బాగా తెలుసు!"

Verse 80

قَالَ لَوْ أَنَّ لِى بِكُمْ قُوَّةً أَوْ ءَاوِىٓ إِلَىٰ رُكْنٍ شَدِيدٍ

Transliteration qāla law anna lī bikum quwwatan aw āwī ilā ruk'nin shadīdin

Telugu అతను (లూత్) అన్నాడు: "మిమ్మల్ని ఎదుర్కొనే బలం నాకుంటే, లేక శరణు పొందటానికి పటిష్ఠమైన ఆధారమైనా ఉండి ఉంటే ఎంత బాగుండేది?"

Verse 81

قَالُوا۟ يَـٰلُوطُ إِنَّا رُسُلُ رَبِّكَ لَن يَصِلُوٓا۟ إِلَيْكَ ۖ فَأَسْرِ بِأَهْلِكَ بِقِطْعٍ مِّنَ ٱلَّيْلِ وَلَا يَلْتَفِتْ مِنكُمْ أَحَدٌ إِلَّا ٱمْرَأَتَكَ ۖ إِنَّهُۥ مُصِيبُهَا مَآ أَصَابَهُمْ ۚ إِنَّ مَوْعِدَهُمُ ٱلصُّبْحُ ۚ أَلَيْسَ ٱلصُّبْحُ بِقَرِيبٍ

Transliteration qālū yālūṭu innā rusulu rabbika lan yaṣilū ilayka fa-asri bi-ahlika biqiṭ'ʿin mina al-layli walā yaltafit minkum aḥadun illā im'ra-ataka innahu muṣībuhā mā aṣābahum inna mawʿidahumu l-ṣub'ḥu alaysa l-ṣub'ḥu biqarībin

Telugu వారు (దైవదూతలు) అన్నారు: "ఓ లూత్! నిశ్చయంగా మేము నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన దూతలము! వారు ఏ మాత్రం నీ వద్దకు చేరలేరు. కావున కొంత రాత్రి మిగిలి ఉండగానే నీవు నీ ఇంటి వారిని తీసుకొని బయలుదేరు - నీ భార్య తప్ప - మీలో ఎవ్వరూ వెనుకకు తిరిగి చూడగూడదు. నిశ్చయంగా, వారికి ఏ ఆపద సంభవించనున్నదో అదే ఆమె (నీ భార్య) కూ సంభవిస్తుంది. నిశ్చయంగా, వారి నిర్ణీత కాలం ఉదయపు సమయం. ఏమీ? ఉదయం సమీపంలోనే లేదా?

Verse 82

فَلَمَّا جَآءَ أَمْرُنَا جَعَلْنَا عَـٰلِيَهَا سَافِلَهَا وَأَمْطَرْنَا عَلَيْهَا حِجَارَةً مِّن سِجِّيلٍ مَّنضُودٍ

Transliteration falammā jāa amrunā jaʿalnā ʿāliyahā sāfilahā wa-amṭarnā ʿalayhā ḥijāratan min sijjīlin manḍūdin

Telugu మా తీర్పు సమయం వచ్చినపుడు మేము దానిని (సోడోంను) తలక్రిందులుగా జేసి, దాని మీద మట్టితో చేసి కాల్చిన గులకరాళ్ళను ఎడతెగకుండా కురిపించాము.

Verse 83

مُّسَوَّمَةً عِندَ رَبِّكَ ۖ وَمَا هِىَ مِنَ ٱلظَّـٰلِمِينَ بِبَعِيدٍ

Transliteration musawwamatan ʿinda rabbika wamā hiya mina l-ẓālimīna bibaʿīdin

Telugu అవి నీ ప్రభువు తరఫు నుండి గుర్తు వేయబడినవి. అది (ఆ శిక్ష) ఈ దుర్మార్గులకు ఎంతో దూరంలో లేదు.

Verse 84

۞ وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا ۚ قَالَ يَـٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُۥ ۖ وَلَا تَنقُصُوا۟ ٱلْمِكْيَالَ وَٱلْمِيزَانَ ۚ إِنِّىٓ أَرَىٰكُم بِخَيْرٍ وَإِنِّىٓ أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ مُّحِيطٍ

Transliteration wa-ilā madyana akhāhum shuʿayban qāla yāqawmi uʿ'budū l-laha mā lakum min ilāhin ghayruhu walā tanquṣū l-mik'yāla wal-mīzāna innī arākum bikhayrin wa-innī akhāfu ʿalaykum ʿadhāba yawmin muḥīṭin

Telugu ఇక మద్ యన్ వారి వద్దకు వారి సహోదరుడైన షుఐబ్ ను పంపాము. అతను అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! మీరు అల్లాహ్ నే ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక ఆరాధ్యదైవం లేడు. కొలతల్లో మరియు తూనికల్లో తగ్గించి ఇవ్వకండి. నేను నిశ్చయంగా, మిమ్మల్ని (ఇప్పుడు) మంచి స్థితిలో చూస్తున్నాను; కాని వాస్తవానికి మీపై ఆరోజు చుట్టు ముట్టబోయే శిక్షను గురించి నేను భయపడుతున్నాను.

Verse 85

وَيَـٰقَوْمِ أَوْفُوا۟ ٱلْمِكْيَالَ وَٱلْمِيزَانَ بِٱلْقِسْطِ ۖ وَلَا تَبْخَسُوا۟ ٱلنَّاسَ أَشْيَآءَهُمْ وَلَا تَعْثَوْا۟ فِى ٱلْأَرْضِ مُفْسِدِينَ

Transliteration wayāqawmi awfū l-mik'yāla wal-mīzāna bil-qis'ṭi walā tabkhasū l-nāsa ashyāahum walā taʿthaw fī l-arḍi muf'sidīna

Telugu "మరియు ఓ నా జాతి ప్రజలారా! మీరు న్యాయంగా మరియు సరిగ్గా కొలవండి మరియు తూకం చేయండి. మరియు ప్రజలకు వారి వస్తువులను తక్కువ జేసి ఇవ్వకండి. మరియు భూమిలో అనర్థాన్ని, కల్లోల్లాన్ని వ్యాపింపజేయకండి.

Verse 86

بَقِيَّتُ ٱللَّهِ خَيْرٌ لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ ۚ وَمَآ أَنَا۠ عَلَيْكُم بِحَفِيظٍ

Transliteration baqiyyatu l-lahi khayrun lakum in kuntum mu'minīna wamā anā ʿalaykum biḥafīẓin

Telugu "మీరు విశ్వాసులే అయితే, (ప్రజలకు వారి హక్కు ఇచ్చిన తరువాత) అల్లాహ్ మీ కొరకు మిగిల్చినదే మీకు మేలైనది. మరియు నేను మీ రక్షకుడను కాను."

Verse 87

قَالُوا۟ يَـٰشُعَيْبُ أَصَلَوٰتُكَ تَأْمُرُكَ أَن نَّتْرُكَ مَا يَعْبُدُ ءَابَآؤُنَآ أَوْ أَن نَّفْعَلَ فِىٓ أَمْوَٰلِنَا مَا نَشَـٰٓؤُا۟ ۖ إِنَّكَ لَأَنتَ ٱلْحَلِيمُ ٱلرَّشِيدُ

Transliteration qālū yāshuʿaybu aṣalatuka tamuruka an natruka mā yaʿbudu ābāunā aw an nafʿala fī amwālinā mā nashāu innaka la-anta l-ḥalīmu l-rashīdu

Telugu వారు (వ్యంగంగా) అన్నారు: "ఓ షుఐబ్! ఏమీ? మా తండ్రి తాతలు ఆరాధించే దేవతలను మేము వదలిపెట్టాలని, లేదా మా ధనాన్ని నీ ఇష్ట ప్రకారం ఖర్చు చేయాలని, నీకు నీ నమాజ్ నేర్పుతుందా? (అయితే) నిశ్చయంగా, ఇక నీవే చాలా సహనశీలుడవు, ఉదాత్తుడవు!"

Verse 88

قَالَ يَـٰقَوْمِ أَرَءَيْتُمْ إِن كُنتُ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّى وَرَزَقَنِى مِنْهُ رِزْقًا حَسَنًا ۚ وَمَآ أُرِيدُ أَنْ أُخَالِفَكُمْ إِلَىٰ مَآ أَنْهَىٰكُمْ عَنْهُ ۚ إِنْ أُرِيدُ إِلَّا ٱلْإِصْلَـٰحَ مَا ٱسْتَطَعْتُ ۚ وَمَا تَوْفِيقِىٓ إِلَّا بِٱللَّهِ ۚ عَلَيْهِ تَوَكَّلْتُ وَإِلَيْهِ أُنِيبُ

Transliteration qāla yāqawmi ara-aytum in kuntu ʿalā bayyinatin min rabbī warazaqanī min'hu riz'qan ḥasanan wamā urīdu an ukhālifakum ilā mā anhākum ʿanhu in urīdu illā l-iṣ'lāḥa mā is'taṭaʿtu wamā tawfīqī illā bil-lahi ʿalayhi tawakkaltu wa-ilayhi unību

Telugu అప్పుడు అతను (షుఐబ్) అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఏమీ? మీరు చూశారా (ఆలోచించారా) ? ఒకవేళ నేను నా ప్రభువు తరపు నుండి స్పష్టమైన నిదర్శనాన్ని కలిగి ఉండి మరియు ఆయన నాకు తన తరఫు నుండి మంచి జీవనోపాధిని కూడా ప్రసాదించినపుడు (నేను ఇలా కాకుండా మరేమి అనగలను)? నేను మిమ్మల్ని నిషేధించిన దానికి వ్యతిరేకంగా చేయ దలచుకోలేదు. నేను మాత్రం మిమ్మల్ని నా శక్తి మేరకు సంస్కరించ దలచుకున్నాను. నా కార్యసిద్ధి కేవలం అల్లాహ్ పైననే ఆధారపడి వుంది. నేను ఆయననే నమ్ముకున్నాను మరియు నేను ఆయన వైపునకే పశ్చాత్తాపంతో మరలుతాను.

Verse 89

وَيَـٰقَوْمِ لَا يَجْرِمَنَّكُمْ شِقَاقِىٓ أَن يُصِيبَكُم مِّثْلُ مَآ أَصَابَ قَوْمَ نُوحٍ أَوْ قَوْمَ هُودٍ أَوْ قَوْمَ صَـٰلِحٍ ۚ وَمَا قَوْمُ لُوطٍ مِّنكُم بِبَعِيدٍ

Transliteration wayāqawmi lā yajrimannakum shiqāqī an yuṣībakum mith'lu mā aṣāba qawma nūḥin aw qawma hūdin aw qawma ṣāliḥin wamā qawmu lūṭin minkum bibaʿīdin

Telugu "మరియు ఓ నా జాతి ప్రజలారా! నాతో ఉన్న భేదాభిప్రాయం మిమ్మల్ని నూహ్ జాతి వారిపై, హూద్ జాతి వారిపై లేక సాలిహ్ జాతి వారిపై పడినటువంటి శిక్షకు గురి చేయకూడదు సుమా! మరియు లూత్ జాతివారు మీకు ఎంతో దూరం వారు కారు కదా!

Verse 90

وَٱسْتَغْفِرُوا۟ رَبَّكُمْ ثُمَّ تُوبُوٓا۟ إِلَيْهِ ۚ إِنَّ رَبِّى رَحِيمٌ وَدُودٌ

Transliteration wa-is'taghfirū rabbakum thumma tūbū ilayhi inna rabbī raḥīmun wadūdun

Telugu "మరియు మీరు మీ ప్రభువు క్షమాభిక్షను కోరుకోండి. మరియు ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. నిశ్చయంగా, నా ప్రభువు అపార కరుణా ప్రదాత, వాత్సల్యుడు."

Verse 91

قَالُوا۟ يَـٰشُعَيْبُ مَا نَفْقَهُ كَثِيرًا مِّمَّا تَقُولُ وَإِنَّا لَنَرَىٰكَ فِينَا ضَعِيفًا ۖ وَلَوْلَا رَهْطُكَ لَرَجَمْنَـٰكَ ۖ وَمَآ أَنتَ عَلَيْنَا بِعَزِيزٍ

Transliteration qālū yāshuʿaybu mā nafqahu kathīran mimmā taqūlu wa-innā lanarāka fīnā ḍaʿīfan walawlā rahṭuka larajamnāka wamā anta ʿalaynā biʿazīzin

Telugu వారన్నారు: "ఓ షుఐబ్! నీవు చెప్పే మాటలు చాలా వరకు మేము గ్రహించ లేక పోతున్నాము. మరియు నిశ్చయంగా, నీవు మాలో బలహీనుడివిగా పరిగణించ బడుతున్నావు. మరియు నీ కుటుంబం వారే గనక లేకుంటే! మేము నిశ్చయంగా, నిన్ను రాళ్ళు రువ్వి చంపేవారం. మరియు నీవు మా కంటే శక్తి శాలివి కావు."

Verse 92

قَالَ يَـٰقَوْمِ أَرَهْطِىٓ أَعَزُّ عَلَيْكُم مِّنَ ٱللَّهِ وَٱتَّخَذْتُمُوهُ وَرَآءَكُمْ ظِهْرِيًّا ۖ إِنَّ رَبِّى بِمَا تَعْمَلُونَ مُحِيطٌ

Transliteration qāla yāqawmi arahṭī aʿazzu ʿalaykum mina l-lahi wa-ittakhadhtumūhu warāakum ẓih'riyyan inna rabbī bimā taʿmalūna muḥīṭun

Telugu అతను అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఏమీ? నా కుటుంబం మీకు అల్లాహ్ కంటే ఎక్కువ గౌరవనీయమైనదా? మరియు మీరు ఆయన (అల్లాహ్) ను మీ వీపుల వెనుకకు నెట్టుతారా? నిశ్చయంగా, నా ప్రభువు మీరు చేసే పనులను ఆవరించి ఉన్నాడు.

Verse 93

وَيَـٰقَوْمِ ٱعْمَلُوا۟ عَلَىٰ مَكَانَتِكُمْ إِنِّى عَـٰمِلٌ ۖ سَوْفَ تَعْلَمُونَ مَن يَأْتِيهِ عَذَابٌ يُخْزِيهِ وَمَنْ هُوَ كَـٰذِبٌ ۖ وَٱرْتَقِبُوٓا۟ إِنِّى مَعَكُمْ رَقِيبٌ

Transliteration wayāqawmi iʿ'malū ʿalā makānatikum innī ʿāmilun sawfa taʿlamūna man yatīhi ʿadhābun yukh'zīhi waman huwa kādhibun wa-ir'taqibū innī maʿakum raqībun

Telugu "మరియు ఓ నా జాతి ప్రజలారా! మీ శక్తి మేరకు మీరు చేసేది చేయండి, నిశ్చయంగా, (నా శక్తి మేరకు) నేను కూడా చేస్తాను. అవమాన కరమైన శిక్ష ఎవరికి పడుతుందో అసత్యవాది ఎవడో మీరు మున్ముందు తెలుసుకోగలరు. మరియు మీరు నిరీక్షించండి, నిశ్చయంగా, మీతో బాటు నేను కూడా నిరీక్షిస్తాను."

Verse 94

وَلَمَّا جَآءَ أَمْرُنَا نَجَّيْنَا شُعَيْبًا وَٱلَّذِينَ ءَامَنُوا۟ مَعَهُۥ بِرَحْمَةٍ مِّنَّا وَأَخَذَتِ ٱلَّذِينَ ظَلَمُوا۟ ٱلصَّيْحَةُ فَأَصْبَحُوا۟ فِى دِيَـٰرِهِمْ جَـٰثِمِينَ

Transliteration walammā jāa amrunā najjaynā shuʿayban wa-alladhīna āmanū maʿahu biraḥmatin minnā wa-akhadhati alladhīna ẓalamū l-ṣayḥatu fa-aṣbaḥū fī diyārihim jāthimīna

Telugu చివరకు మా ఆదేశం వచ్చినప్పుడు, మేము షుఐబ్ ను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని మా కారుణ్యంతో రక్షించాము. మరియు దుర్మార్గులైన వారిపై ఒక తీవ్రమైన అరుపు (ధ్వని) విరుచుకు పడింది. కాబట్టి వారు తమ ఇండ్లలోనే చలనం లేకుండా (చచ్చి) పడిపోయారు -

Verse 95

كَأَن لَّمْ يَغْنَوْا۟ فِيهَآ ۗ أَلَا بُعْدًا لِّمَدْيَنَ كَمَا بَعِدَتْ ثَمُودُ

Transliteration ka-an lam yaghnaw fīhā alā buʿ'dan limadyana kamā baʿidat thamūdu

Telugu వారక్కడ ఎన్నడూ నివసించనే లేదన్నట్లుగా! ఈ విధంగా సమూద్ జాతివారు లేకుండా పోయినట్లు, మద్ యన్ జాతివారు కూడా లేకుండా (నశించి) పోయారు!

Verse 96

وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِـَٔايَـٰتِنَا وَسُلْطَـٰنٍ مُّبِينٍ

Transliteration walaqad arsalnā mūsā biāyātinā wasul'ṭānin mubīnin

Telugu మరియు నిశ్చయంగా, మేము మూసాను కూడా మా సూచనలతో మరియు స్పష్టమైన ప్రమాణంతో పంపాము -

Verse 97

إِلَىٰ فِرْعَوْنَ وَمَلَإِي۟هِۦ فَٱتَّبَعُوٓا۟ أَمْرَ فِرْعَوْنَ ۖ وَمَآ أَمْرُ فِرْعَوْنَ بِرَشِيدٍ

Transliteration ilā fir'ʿawna wamala-ihi fa-ittabaʿū amra fir'ʿawna wamā amru fir'ʿawna birashīdin

Telugu ఫిర్ఔన్ మరియు అతని నాయకుల వద్దకు! కానీ వారు ఫిర్ఔన్ ఆజ్ఞలనే అనుసరించారు. మరియు ఫిర్ఔన్ ఆజ్ఞ సరైనది కాదు.

Verse 98

يَقْدُمُ قَوْمَهُۥ يَوْمَ ٱلْقِيَـٰمَةِ فَأَوْرَدَهُمُ ٱلنَّارَ ۖ وَبِئْسَ ٱلْوِرْدُ ٱلْمَوْرُودُ

Transliteration yaqdumu qawmahu yawma l-qiyāmati fa-awradahumu l-nāra wabi'sa l-wir'du l-mawrūdu

Telugu పునరుత్థాన దినమున అతడు (ఫిర్ఔన్) తన జాతి వారికి మున్ముందుగా ఉండి, వారిని నరకాగ్నిలోకి తీసుకొని పోతాడు మరియు అది ప్రవేశించే వారికి ఎంత చెడ్డ గమ్యస్థానం.

Verse 99

وَأُتْبِعُوا۟ فِى هَـٰذِهِۦ لَعْنَةً وَيَوْمَ ٱلْقِيَـٰمَةِ ۚ بِئْسَ ٱلرِّفْدُ ٱلْمَرْفُودُ

Transliteration wa-ut'biʿū fī hādhihi laʿnatan wayawma l-qiyāmati bi'sa l-rif'du l-marfūdu

Telugu మరియు వారు ఈ లోకంలో శాపంతో వెంబడించబడ్డారు మరియు పునరుత్థాన దినమున కూడా (బహిష్కరించబడతారు). ఎంత చెడ్డ బహుమానం (వారికి) బహూకరించ బడుతుంది.

Verse 100

ذَٰلِكَ مِنْ أَنۢبَآءِ ٱلْقُرَىٰ نَقُصُّهُۥ عَلَيْكَ ۖ مِنْهَا قَآئِمٌ وَحَصِيدٌ

Transliteration dhālika min anbāi l-qurā naquṣṣuhu ʿalayka min'hā qāimun waḥaṣīdun

Telugu ఇవి కొన్ని (ప్రాచీన) పట్టణాల గాథలు వీటిని మేము నీకు వినిపిస్తున్నాము. వాటిలో కొన్ని నిలిచి (మిగిలి) ఉన్నాయి. మరికొన్ని పంటపొలాల మాదిరిగా కోయబడ్డాయి (నిర్మూలించబడ్డాయి).

Verse 101

وَمَا ظَلَمْنَـٰهُمْ وَلَـٰكِن ظَلَمُوٓا۟ أَنفُسَهُمْ ۖ فَمَآ أَغْنَتْ عَنْهُمْ ءَالِهَتُهُمُ ٱلَّتِى يَدْعُونَ مِن دُونِ ٱللَّهِ مِن شَىْءٍ لَّمَّا جَآءَ أَمْرُ رَبِّكَ ۖ وَمَا زَادُوهُمْ غَيْرَ تَتْبِيبٍ

Transliteration wamā ẓalamnāhum walākin ẓalamū anfusahum famā aghnat ʿanhum ālihatuhumu allatī yadʿūna min dūni l-lahi min shayin lammā jāa amru rabbika wamā zādūhum ghayra tatbībin

Telugu మరియు మేము వారి కెలాంటి అన్యాయం చేయలేదు. కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. నీ ప్రభువు ఆజ్ఞ వచ్చినప్పుడు - అల్లాహ్ ను వదలి - వారు ఏ దేవతలనైతే ప్రార్థించేవారో! వారు, వారికి ఏ విధంగానూ సహాయపడ లేక పోయారు. మరియు వారు, వారి వినాశం తప్ప మరేమీ అధికం చేయలేదు.

Verse 102

وَكَذَٰلِكَ أَخْذُ رَبِّكَ إِذَآ أَخَذَ ٱلْقُرَىٰ وَهِىَ ظَـٰلِمَةٌ ۚ إِنَّ أَخْذَهُۥٓ أَلِيمٌ شَدِيدٌ

Transliteration wakadhālika akhdhu rabbika idhā akhadha l-qurā wahiya ẓālimatun inna akhdhahu alīmun shadīdun

Telugu మరియు ఈ విధంగా నీ ప్రభువు దుర్మార్గులైన నగర (వాసులను) పట్టుకొన (శిక్షించ) దలచితే, ఇలాగే పట్టుకుంటాడు (శిక్షిస్తాడు). నిశ్చయంగా, ఆయన పట్టు చాలా బాధారకమైనది, ఎంతో తీవ్రమైనది.

Verse 103

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّمَنْ خَافَ عَذَابَ ٱلْـَٔاخِرَةِ ۚ ذَٰلِكَ يَوْمٌ مَّجْمُوعٌ لَّهُ ٱلنَّاسُ وَذَٰلِكَ يَوْمٌ مَّشْهُودٌ

Transliteration inna fī dhālika laāyatan liman khāfa ʿadhāba l-ākhirati dhālika yawmun majmūʿun lahu l-nāsu wadhālika yawmun mashhūdun

Telugu నిశ్చయంగా, ఇందులో పరలోక శిక్షకు భయపడే వారికి ఒక సూచన ఉంది. అది సర్వ మానవులను సమావేశ పరిచే రోజు! ఆ దినమున అందరూ హాజరవుతారు.

Verse 104

وَمَا نُؤَخِّرُهُۥٓ إِلَّا لِأَجَلٍ مَّعْدُودٍ

Transliteration wamā nu-akhiruhu illā li-ajalin maʿdūdin

Telugu మరియు మేము దానిని కేవలం ఒక నియమిత కాలం వరకు మాత్రమే ఆపి ఉన్నాము.

Verse 105

يَوْمَ يَأْتِ لَا تَكَلَّمُ نَفْسٌ إِلَّا بِإِذْنِهِۦ ۚ فَمِنْهُمْ شَقِىٌّ وَسَعِيدٌ

Transliteration yawma yati lā takallamu nafsun illā bi-idh'nihi famin'hum shaqiyyun wasaʿīdun

Telugu ఆ దినం వచ్చినప్పుడు, ఆయన (అల్లాహ్) సెలవు లేనిదే, ఏ ప్రాణి కూడా మాట్లాడజాలదు. వారిలో కొందరు దౌర్భాగ్యులుంటారు మరికొందరు భాగ్యవంతులుంటారు.

Verse 106

فَأَمَّا ٱلَّذِينَ شَقُوا۟ فَفِى ٱلنَّارِ لَهُمْ فِيهَا زَفِيرٌ وَشَهِيقٌ

Transliteration fa-ammā alladhīna shaqū fafī l-nāri lahum fīhā zafīrun washahīqun

Telugu దౌర్భాగ్యులైన వారు నరకాగ్నిలో చేరుతారు, అక్కడ వారు దుఃఖం వల్ల మూలుగుతూ ఉంటారు మరియు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు.

Verse 107

خَـٰلِدِينَ فِيهَا مَا دَامَتِ ٱلسَّمَـٰوَٰتُ وَٱلْأَرْضُ إِلَّا مَا شَآءَ رَبُّكَ ۚ إِنَّ رَبَّكَ فَعَّالٌ لِّمَا يُرِيدُ

Transliteration khālidīna fīhā mā dāmati l-samāwātu wal-arḍu illā mā shāa rabbuka inna rabbaka faʿʿālun limā yurīdu

Telugu వారందులో శాశ్వతంగా, భూమ్యాకాశాలు ఉన్నంత వరకు ఉంటారు. నీ ప్రభువు (మరొకటి) కోరితే తప్ప! నిశ్చయంగా, నీ ప్రభువు తాను కోరిందే చేసేవాడు.

Verse 108

۞ وَأَمَّا ٱلَّذِينَ سُعِدُوا۟ فَفِى ٱلْجَنَّةِ خَـٰلِدِينَ فِيهَا مَا دَامَتِ ٱلسَّمَـٰوَٰتُ وَٱلْأَرْضُ إِلَّا مَا شَآءَ رَبُّكَ ۖ عَطَآءً غَيْرَ مَجْذُوذٍ

Transliteration wa-ammā alladhīna suʿidū fafī l-janati khālidīna fīhā mā dāmati l-samāwātu wal-arḍu illā mā shāa rabbuka ʿaṭāan ghayra majdhūdhin

Telugu ఇక భాగ్యవంతులైన వారు, భూమ్యాకాశాలు ఉన్నంత వరకు స్వర్గంలో శాశ్వతంగా ఉంటారు. నీ ప్రభువు (మరొకటి) కోరితే తప్ప! ఇదొక ఎడతెగని బహుమానం.

Verse 109

فَلَا تَكُ فِى مِرْيَةٍ مِّمَّا يَعْبُدُ هَـٰٓؤُلَآءِ ۚ مَا يَعْبُدُونَ إِلَّا كَمَا يَعْبُدُ ءَابَآؤُهُم مِّن قَبْلُ ۚ وَإِنَّا لَمُوَفُّوهُمْ نَصِيبَهُمْ غَيْرَ مَنقُوصٍ

Transliteration falā taku fī mir'yatin mimmā yaʿbudu hāulāi mā yaʿbudūna illā kamā yaʿbudu ābāuhum min qablu wa-innā lamuwaffūhum naṣībahum ghayra manqūṣin

Telugu కావున (ఓ ప్రవక్తా!) వారు ఆరాధించే వాటిని గురించి నీవు సందేహంలో పడకు. పూర్వం నుండి వారి తాతముత్తాతలు ఆరాధించినట్లుగానే వారు కూడా (అంధులై) ఆరాధిస్తున్నారు. మరియు మేము నిశ్చయంగా, వారి భాగపు (శిక్షను) ఏ మాత్రం తగ్గించకుండా వారికి పూర్తిగా నొసంగుతాము.

Verse 110

وَلَقَدْ ءَاتَيْنَا مُوسَى ٱلْكِتَـٰبَ فَٱخْتُلِفَ فِيهِ ۚ وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِن رَّبِّكَ لَقُضِىَ بَيْنَهُمْ ۚ وَإِنَّهُمْ لَفِى شَكٍّ مِّنْهُ مُرِيبٍ

Transliteration walaqad ātaynā mūsā l-kitāba fa-ukh'tulifa fīhi walawlā kalimatun sabaqat min rabbika laquḍiya baynahum wa-innahum lafī shakkin min'hu murībin

Telugu మరియు వాస్తవంగా, మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము. పిదప అందులో అభిప్రాయభేదాలు వచ్చాయి. నీ ప్రభువు మాట (ఆజ్ఞ) ముందుగానే నిర్ణయించబడి ఉండకుంటే, వారి తీర్పు ఎప్పుడో జరిగి ఉండేది. మరియు నిశ్చయంగా, వారు దీనిని గురించి సంశయంలో, సందేహంలో పడి వున్నారు.

Verse 111

وَإِنَّ كُلًّا لَّمَّا لَيُوَفِّيَنَّهُمْ رَبُّكَ أَعْمَـٰلَهُمْ ۚ إِنَّهُۥ بِمَا يَعْمَلُونَ خَبِيرٌ

Transliteration wa-inna kullan lammā layuwaffiyannahum rabbuka aʿmālahum innahu bimā yaʿmalūna khabīrun

Telugu మరియు నిశ్చయంగా, నీ ప్రభువు ప్రతి ఒక్కరి కర్మల ప్రతిఫలాన్ని వారికి తప్పకుండా పూర్తిగా ఇచ్చి వేస్తాడు. నిశ్చయంగా ఆయన వారి కర్మలను బాగా ఎరుగును.

Verse 112

فَٱسْتَقِمْ كَمَآ أُمِرْتَ وَمَن تَابَ مَعَكَ وَلَا تَطْغَوْا۟ ۚ إِنَّهُۥ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ

Transliteration fa-is'taqim kamā umir'ta waman tāba maʿaka walā taṭghaw innahu bimā taʿmalūna baṣīrun

Telugu కనుక (ఓ ప్రవక్తా!) నీవూ మరియు పశ్చాత్తాప పడి (ఆయన వైపుకు మరలిన) నీ సహచరులూ, నీకు ఆజ్ఞ ఇవ్వబడిన విధంగా ఋజుమార్గంపై స్థిరంగా ఉండండి, హద్దు మీరకండి. నిశ్చయంగా, ఆయన మీ కర్మలన్నీ చూస్తున్నాడు.

Verse 113

وَلَا تَرْكَنُوٓا۟ إِلَى ٱلَّذِينَ ظَلَمُوا۟ فَتَمَسَّكُمُ ٱلنَّارُ وَمَا لَكُم مِّن دُونِ ٱللَّهِ مِنْ أَوْلِيَآءَ ثُمَّ لَا تُنصَرُونَ

Transliteration walā tarkanū ilā alladhīna ẓalamū fatamassakumu l-nāru wamā lakum min dūni l-lahi min awliyāa thumma lā tunṣarūna

Telugu దుర్మార్గుల వైపునకు మీరు మొగ్గకండి. నరకాగ్నిలో చిక్కుకుంటారు. ఆ తరువాత అల్లాహ్ తప్ప మరెవ్వరూ మీకు సంరక్షకులూ ఉండరు. అప్పుడు మీకెవ్వరి సహాయమూ లభించదు.

Verse 114

وَأَقِمِ ٱلصَّلَوٰةَ طَرَفَىِ ٱلنَّهَارِ وَزُلَفًا مِّنَ ٱلَّيْلِ ۚ إِنَّ ٱلْحَسَنَـٰتِ يُذْهِبْنَ ٱلسَّيِّـَٔاتِ ۚ ذَٰلِكَ ذِكْرَىٰ لِلذَّٰكِرِينَ

Transliteration wa-aqimi l-ṣalata ṭarafayi l-nahāri wazulafan mina al-layli inna l-ḥasanāti yudh'hib'na l-sayiāti dhālika dhik'rā lildhākirīna

Telugu మరియు దినపు చివరి రెండు భాగాల్లోనూ మరియు రాత్రిపూట కొంత భాగంలో కూడా నమాజ్ సలపండి. నిశ్చయంగా, సత్కార్యాలు దుష్కార్యాలను దూరం చేస్తాయి. జ్ఞాపకం ఉంచుకునే వారికి ఇది ఒక ఉపదేశం (జ్ఞాపిక).

Verse 115

وَٱصْبِرْ فَإِنَّ ٱللَّهَ لَا يُضِيعُ أَجْرَ ٱلْمُحْسِنِينَ

Transliteration wa-iṣ'bir fa-inna l-laha lā yuḍīʿu ajra l-muḥ'sinīna

Telugu మరియు సహనం వహించు; నిశ్చయంగా, అల్లాహ్ సజ్జనుల ప్రతిఫలాన్ని వ్యర్థం చేయడు.

Verse 116

فَلَوْلَا كَانَ مِنَ ٱلْقُرُونِ مِن قَبْلِكُمْ أُو۟لُوا۟ بَقِيَّةٍ يَنْهَوْنَ عَنِ ٱلْفَسَادِ فِى ٱلْأَرْضِ إِلَّا قَلِيلًا مِّمَّنْ أَنجَيْنَا مِنْهُمْ ۗ وَٱتَّبَعَ ٱلَّذِينَ ظَلَمُوا۟ مَآ أُتْرِفُوا۟ فِيهِ وَكَانُوا۟ مُجْرِمِينَ

Transliteration falawlā kāna mina l-qurūni min qablikum ulū baqiyyatin yanhawna ʿani l-fasādi fī l-arḍi illā qalīlan mimman anjaynā min'hum wa-ittabaʿa alladhīna ẓalamū mā ut'rifū fīhi wakānū muj'rimīna

Telugu మీకు పూర్వం గతించిన తరాల వారిలో, భూమిలో కల్లోలం రేకెత్తించకుండా నిషేధించే సజ్జనులు ఎందుకు లేరు? కాని అలాంటి వారు కొందరు మాత్రమే ఉండేవారు! వారిని మేము అలాంటి వారి (దుర్మార్గుల) నుండి కాపాడాము. మరియు దుర్మార్గులైన వారు ఐహిక సుఖాలకు లోనయ్యారు మరియు వారు అపరాధులు.

Verse 117

وَمَا كَانَ رَبُّكَ لِيُهْلِكَ ٱلْقُرَىٰ بِظُلْمٍ وَأَهْلُهَا مُصْلِحُونَ

Transliteration wamā kāna rabbuka liyuh'lika l-qurā biẓul'min wa-ahluhā muṣ'liḥūna

Telugu మరియు వాటిలో నివసించే ప్రజలు సద్వర్తనులై ఉన్నంత వరకు, అలాంటి నగరాలను నీ ప్రభువు అన్యాయంగా నాశనం చేసేవాడు కాడు.

Verse 118

وَلَوْ شَآءَ رَبُّكَ لَجَعَلَ ٱلنَّاسَ أُمَّةً وَٰحِدَةً ۖ وَلَا يَزَالُونَ مُخْتَلِفِينَ

Transliteration walaw shāa rabbuka lajaʿala l-nāsa ummatan wāḥidatan walā yazālūna mukh'talifīna

Telugu మరియు నీ ప్రభువు సంకల్పిస్తే, సర్వ మానవులను (ఒకే ధర్మాన్ని అవలంబించే) ఒకే ఒక్క సంఘంగా చేసేవాడు. అయినా వారు అభిప్రాయ భేదాలు లేకుండా ఉండ లేక పోయేవారు -

Verse 119

إِلَّا مَن رَّحِمَ رَبُّكَ ۚ وَلِذَٰلِكَ خَلَقَهُمْ ۗ وَتَمَّتْ كَلِمَةُ رَبِّكَ لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنَ ٱلْجِنَّةِ وَٱلنَّاسِ أَجْمَعِينَ

Transliteration illā man raḥima rabbuka walidhālika khalaqahum watammat kalimatu rabbika la-amla-anna jahannama mina l-jinati wal-nāsi ajmaʿīna

Telugu నీ ప్రభువు కరుణించినవాడు తప్ప! మరియు దాని కొరకే ఆయన వారిని సృష్టించాడు. మరియు నీ ప్రభువు: "నేను జిన్నాతులు మరియు మానవులు అందరితో నరకాన్ని నింపుతాను!" అని అన్నమాట నెరవేరుతుంది.

Verse 120

وَكُلًّا نَّقُصُّ عَلَيْكَ مِنْ أَنۢبَآءِ ٱلرُّسُلِ مَا نُثَبِّتُ بِهِۦ فُؤَادَكَ ۚ وَجَآءَكَ فِى هَـٰذِهِ ٱلْحَقُّ وَمَوْعِظَةٌ وَذِكْرَىٰ لِلْمُؤْمِنِينَ

Transliteration wakullan naquṣṣu ʿalayka min anbāi l-rusuli mā nuthabbitu bihi fuādaka wajāaka fī hādhihi l-ḥaqu wamawʿiẓatun wadhik'rā lil'mu'minīna

Telugu మరియు (ఓ ప్రవక్తా!) నీ హృదయాన్ని స్థిరపరచటానికి, మేము ప్రవక్తల గాథలను నీకు వినిపిస్తున్నాను. మరియు ఇందు (ఈ సూరహ్) లో నీకు సత్యం వచ్చింది మరియు విశ్వాసులకు హితబోధ మరియు జ్ఞాపిక.

Verse 121

وَقُل لِّلَّذِينَ لَا يُؤْمِنُونَ ٱعْمَلُوا۟ عَلَىٰ مَكَانَتِكُمْ إِنَّا عَـٰمِلُونَ

Transliteration waqul lilladhīna lā yu'minūna iʿ'malū ʿalā makānatikum innā ʿāmilūna

Telugu మరియు విశ్వసించని వారితో ఇలా అను: "మీరు మీ శక్తి మేరకు మీ పనులు చేయండి. నిశ్చయంగా, మేము కూడా మా శక్తి మేరకు మా పనులు చేస్తాము.

Verse 122

وَٱنتَظِرُوٓا۟ إِنَّا مُنتَظِرُونَ

Transliteration wa-intaẓirū innā muntaẓirūna

Telugu మరియు మీరు వేచి చూడండి; మేము కూడా వేచి ఉంటాము."

Verse 123

وَلِلَّهِ غَيْبُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَإِلَيْهِ يُرْجَعُ ٱلْأَمْرُ كُلُّهُۥ فَٱعْبُدْهُ وَتَوَكَّلْ عَلَيْهِ ۚ وَمَا رَبُّكَ بِغَـٰفِلٍ عَمَّا تَعْمَلُونَ

Transliteration walillahi ghaybu l-samāwāti wal-arḍi wa-ilayhi yur'jaʿu l-amru kulluhu fa-uʿ'bud'hu watawakkal ʿalayhi wamā rabbuka bighāfilin ʿammā taʿmalūna

Telugu మరియు ఆకాశాల యొక్క మరియు భూమి యొక్క సర్వ అగోచర విషయాలు కేవలం అల్లాహ్ కే తెలుసు. మరియు సర్వ విషయాలు ఆయన వద్దకే మరలింపబడతాయి కావున మీరు ఆయననే ఆరాధించండి మరియు ఆయననే నమ్ముకోండి. మరియు మీరు చేసే కర్మలు నీ ప్రభువు ఎరుగకుండా లేడు.

Read Surah Hud in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.