MyDugsiStart learning

Surah Ar-Rahman in Telugu: translation and audio

Surah 55 · الرحمن · The Beneficent · 78 verses

Surah Ar-Rahman verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Ar-Rahman word by word in English.

Verse 1

ٱلرَّحْمَـٰنُ

Transliteration al-raḥmānu

Telugu అనంత కరుణామయుడు (అల్లాహ్)!

Verse 2

عَلَّمَ ٱلْقُرْءَانَ

Transliteration ʿallama l-qur'āna

Telugu ఆయనే ఈ ఖుర్ఆన్ ను నేర్పాడు.

Verse 3

خَلَقَ ٱلْإِنسَـٰنَ

Transliteration khalaqa l-insāna

Telugu ఆయనే మానవుణ్ణి సృష్టించాడు.

Verse 4

عَلَّمَهُ ٱلْبَيَانَ

Transliteration ʿallamahu l-bayāna

Telugu ఆయనే అతనికి మాట్లాడటం నేర్పాడు.

Verse 5

ٱلشَّمْسُ وَٱلْقَمَرُ بِحُسْبَانٍ

Transliteration al-shamsu wal-qamaru biḥus'bānin

Telugu సూర్యుడు మరియు చంద్రుడు ఒక నియమిత గమనాన్ని (నియమిత పరిధిలో) అనుసరిస్తున్నారు.

Verse 6

وَٱلنَّجْمُ وَٱلشَّجَرُ يَسْجُدَانِ

Transliteration wal-najmu wal-shajaru yasjudāni

Telugu మరియు నక్షత్రాలు మరియు వృక్షాలు అన్నీ ఆయనకు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటాయి.

Verse 7

وَٱلسَّمَآءَ رَفَعَهَا وَوَضَعَ ٱلْمِيزَانَ

Transliteration wal-samāa rafaʿahā wawaḍaʿa l-mīzāna

Telugu మరియు ఆయనే ఖగోళాన్ని పైకెత్తి ఉంచాడు మరియు ఆయనే త్రాసును నెలకొల్పాడు.

Verse 8

أَلَّا تَطْغَوْا۟ فِى ٱلْمِيزَانِ

Transliteration allā taṭghaw fī l-mīzāni

Telugu తద్వారా మీరు తూకంలో మోసానికి పాల్పడకూడదని!

Verse 9

وَأَقِيمُوا۟ ٱلْوَزْنَ بِٱلْقِسْطِ وَلَا تُخْسِرُوا۟ ٱلْمِيزَانَ

Transliteration wa-aqīmū l-wazna bil-qis'ṭi walā tukh'sirū l-mīzāna

Telugu మరియు న్యాయంగా తూకం చేయండి మరియు తూకంలో తగ్గించకండి.

Verse 10

وَٱلْأَرْضَ وَضَعَهَا لِلْأَنَامِ

Transliteration wal-arḍa waḍaʿahā lil'anāmi

Telugu మరియు ఆయన, భూమిని సకల జీవరాసుల కొరకు ఉంచాడు.

Verse 11

فِيهَا فَـٰكِهَةٌ وَٱلنَّخْلُ ذَاتُ ٱلْأَكْمَامِ

Transliteration fīhā fākihatun wal-nakhlu dhātu l-akmāmi

Telugu అందులో రకరకాల ఫలాలు మరియు పొరలలో (పుష్పకోశాలలో) ఉండే ఖర్జూర పండ్లు ఉన్నాయి.

Verse 12

وَٱلْحَبُّ ذُو ٱلْعَصْفِ وَٱلرَّيْحَانُ

Transliteration wal-ḥabu dhū l-ʿaṣfi wal-rayḥānu

Telugu మరియు దంట్లపై (పొరలలో చుట్టబడి) ఉన్న ధాన్యం మరియు సుగంధ పుష్పాలు కూడా!

Verse 13

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు (మానవులు మరియు జిన్నాతులు) మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 14

خَلَقَ ٱلْإِنسَـٰنَ مِن صَلْصَـٰلٍ كَٱلْفَخَّارِ

Transliteration khalaqa l-insāna min ṣalṣālin kal-fakhāri

Telugu ఆయన మానవుణ్ణి పెంకులాంటి శబ్దమిచ్చే మట్టితో సృష్టించాడు.

Verse 15

وَخَلَقَ ٱلْجَآنَّ مِن مَّارِجٍ مِّن نَّارٍ

Transliteration wakhalaqa l-jāna min mārijin min nārin

Telugu మరియు జిన్నాతులను అగ్నిజ్వాలలతో సృష్టించాడు.

Verse 16

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 17

رَبُّ ٱلْمَشْرِقَيْنِ وَرَبُّ ٱلْمَغْرِبَيْنِ

Transliteration rabbu l-mashriqayni warabbu l-maghribayni

Telugu ఆయనే రెండు తూర్పు (దిక్కు)లకు మరియు రెండు పడమర (దిక్కు)లకు ప్రభువు.

Verse 18

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 19

مَرَجَ ٱلْبَحْرَيْنِ يَلْتَقِيَانِ

Transliteration maraja l-baḥrayni yaltaqiyāni

Telugu ఆయనే రెండు సముద్రాలను కలుసుకోవటానికి వదలిపెట్టాడు.

Verse 20

بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيَانِ

Transliteration baynahumā barzakhun lā yabghiyāni

Telugu ఆ రెండింటి మధ్య, అవి అతిక్రమించలేని అడ్డు తెర వుంది.

Verse 21

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 22

يَخْرُجُ مِنْهُمَا ٱللُّؤْلُؤُ وَٱلْمَرْجَانُ

Transliteration yakhruju min'humā l-lu'lu-u wal-marjānu

Telugu ఆ రెండింటి నుండి ముత్యాలు మరియు పగడాలు వస్తాయి.

Verse 23

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 24

وَلَهُ ٱلْجَوَارِ ٱلْمُنشَـَٔاتُ فِى ٱلْبَحْرِ كَٱلْأَعْلَـٰمِ

Transliteration walahu l-jawāri l-munshaātu fī l-baḥri kal-aʿlāmi

Telugu మరియు ఎత్తైన కొండల వలే సముద్రంలో పయనించే ఓడలు ఆయనకు చెందినవే!

Verse 25

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 26

كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ

Transliteration kullu man ʿalayhā fānin

Telugu దానిపై (భూమిపై) నున్నది ప్రతిదీ నశిస్తుంది.

Verse 27

وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو ٱلْجَلَـٰلِ وَٱلْإِكْرَامِ

Transliteration wayabqā wajhu rabbika dhū l-jalāli wal-ik'rāmi

Telugu మరియు మిగిలివుండేది, కేవలం మహిమాన్వితుడు మరియు పరమదాత అయిన నీ ప్రభువు ముఖం (ఉనికి) మాత్రమే!

Verse 28

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 29

يَسْـَٔلُهُۥ مَن فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ كُلَّ يَوْمٍ هُوَ فِى شَأْنٍ

Transliteration yasaluhu man fī l-samāwāti wal-arḍi kulla yawmin huwa fī shanin

Telugu భూమిలో మరియు ఆకాశాలలో నున్న ప్రతిదీ (తన జీవనోపాధి కొరకు) ఆయననే యాచిస్తుంది. మరియు ప్రతి క్షణం (రోజు) ఆయన ఒక కార్యంలో నిమగ్నుడై ఉంటాడు.

Verse 30

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 31

سَنَفْرُغُ لَكُمْ أَيُّهَ ٱلثَّقَلَانِ

Transliteration sanafrughu lakum ayyuha l-thaqalāni

Telugu భారాలను మోసే మీరిద్దరు! త్వరలోనే మేము మీ విషయం నిర్ణయించగలము.

Verse 32

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 33

يَـٰمَعْشَرَ ٱلْجِنِّ وَٱلْإِنسِ إِنِ ٱسْتَطَعْتُمْ أَن تَنفُذُوا۟ مِنْ أَقْطَارِ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ فَٱنفُذُوا۟ ۚ لَا تَنفُذُونَ إِلَّا بِسُلْطَـٰنٍ

Transliteration yāmaʿshara l-jini wal-insi ini is'taṭaʿtum an tanfudhū min aqṭāri l-samāwāti wal-arḍi fa-unfudhū lā tanfudhūna illā bisul'ṭānin

Telugu ఓ జిన్నాతుల మరియు మానవ జాతి వారలారా! ఒకవేళ మీరు ఆకాశాల మరియు భూమి యొక్క సరిహద్దుల నుండి బయటికి వెళ్ళి పోగలిగితే, వెళ్ళిపోండి! ఆయన (అల్లాహ్) యొక్క సెలవు లేనిదే మీరు వాటి నుండి వెళ్ళి పోలేరు.

Verse 34

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 35

يُرْسَلُ عَلَيْكُمَا شُوَاظٌ مِّن نَّارٍ وَنُحَاسٌ فَلَا تَنتَصِرَانِ

Transliteration yur'salu ʿalaykumā shuwāẓun min nārin wanuḥāsun falā tantaṣirāni

Telugu మీ ఇద్దరి పైకి అగ్నిజ్వాలలు మరియు పొగ పంపబడతాయి. అప్పుడు మీరు ఎదుర్కోలేరు (మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు).

Verse 36

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 37

فَإِذَا ٱنشَقَّتِ ٱلسَّمَآءُ فَكَانَتْ وَرْدَةً كَٱلدِّهَانِ

Transliteration fa-idhā inshaqqati l-samāu fakānat wardatan kal-dihāni

Telugu మరియు ఆకాశం ప్రేలిపోయినప్పుడు అది మండే నూనెగా ఎర్రగా మారిపోతుంది.

Verse 38

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 39

فَيَوْمَئِذٍ لَّا يُسْـَٔلُ عَن ذَنۢبِهِۦٓ إِنسٌ وَلَا جَآنٌّ

Transliteration fayawma-idhin lā yus'alu ʿan dhanbihi insun walā jānnun

Telugu ఇక, ఆ రోజు ఏ మానవునితో గానీ, లేక ఏ జిన్నాతునితో గానీ అతని పాపాలను గురించి అడగడం జరుగదు.

Verse 40

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 41

يُعْرَفُ ٱلْمُجْرِمُونَ بِسِيمَـٰهُمْ فَيُؤْخَذُ بِٱلنَّوَٰصِى وَٱلْأَقْدَامِ

Transliteration yuʿ'rafu l-muj'rimūna bisīmāhum fayu'khadhu bil-nawāṣī wal-aqdāmi

Telugu ఈ నేరస్తులు వారి వారి ముఖ చిహ్నాలతోనే గుర్తింపబడతారు. అప్పుడు వారు, వారి ముంగురులు మరియు కాళ్ళు పట్టి లాగబడతారు.

Verse 42

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 43

هَـٰذِهِۦ جَهَنَّمُ ٱلَّتِى يُكَذِّبُ بِهَا ٱلْمُجْرِمُونَ

Transliteration hādhihi jahannamu allatī yukadhibu bihā l-muj'rimūna

Telugu ఈ నేరస్తులు అసత్యమని తిరస్కరిస్తూ వుండిన నరకం ఇదే!

Verse 44

يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ ءَانٍ

Transliteration yaṭūfūna baynahā wabayna ḥamīmin ānin

Telugu వారి దానిలో (ఆ నరకంలో) మరియు సలసల కాగే నీటి మధ్య అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు.

Verse 45

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 46

وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِۦ جَنَّتَانِ

Transliteration waliman khāfa maqāma rabbihi jannatāni

Telugu మరియు ఎవడైతే తన ప్రభువు సన్నధిలో హాజరు కావలసి ఉంటుందనే భయం కలిగి ఉంటాడో, అతనికి రెండు స్వర్గవనాలుంటాయి.

Verse 47

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 48

ذَوَاتَآ أَفْنَانٍ

Transliteration dhawātā afnānin

Telugu అవి రెండూ అనేక శాఖల (వృక్షాల)తో నిండి ఉంటాయి.

Verse 49

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 50

فِيهِمَا عَيْنَانِ تَجْرِيَانِ

Transliteration fīhimā ʿaynāni tajriyāni

Telugu ఆ రెండింటిలో రెండు సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి.

Verse 51

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 52

فِيهِمَا مِن كُلِّ فَـٰكِهَةٍ زَوْجَانِ

Transliteration fīhimā min kulli fākihatin zawjāni

Telugu ఆ రెండింటిలో ప్రతి ఫలం జోడుగా (రెండు రకాలుగా) ఉంటుంది.

Verse 53

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 54

مُتَّكِـِٔينَ عَلَىٰ فُرُشٍۭ بَطَآئِنُهَا مِنْ إِسْتَبْرَقٍ ۚ وَجَنَى ٱلْجَنَّتَيْنِ دَانٍ

Transliteration muttakiīna ʿalā furushin baṭāinuhā min is'tabraqin wajanā l-janatayni dānin

Telugu వారు జరీ పని అస్తరుగల పట్టు తివాచీల మీద ఆనుకొని కూర్చొని ఉంటారు. మరియు ఆ రెండు స్వర్గవనాల ఫలాలు దగ్గరగా అందుబాటులో ఉంటాయి.

Verse 55

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 56

فِيهِنَّ قَـٰصِرَٰتُ ٱلطَّرْفِ لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَآنٌّ

Transliteration fīhinna qāṣirātu l-ṭarfi lam yaṭmith'hunna insun qablahum walā jānnun

Telugu అందులో తమ దృష్టి ఎల్లప్పుడూ క్రిందికి వంచి ఉంచే నిర్మల కన్యలుంటారు. వారిని ఇంతకు పూర్వం ఏ మానవుడు గానీ, ఏ జిన్నాతు గానీ తాకి ఉండడు.

Verse 57

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 58

كَأَنَّهُنَّ ٱلْيَاقُوتُ وَٱلْمَرْجَانُ

Transliteration ka-annahunna l-yāqūtu wal-marjānu

Telugu వారు కెంపులను (మాణిక్యాలను) మరియు పగడాలను పోలి ఉంటారు.

Verse 59

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 60

هَلْ جَزَآءُ ٱلْإِحْسَـٰنِ إِلَّا ٱلْإِحْسَـٰنُ

Transliteration hal jazāu l-iḥ'sāni illā l-iḥ'sānu

Telugu సత్కార్యానికి మంచి ప్రతిఫలం తప్ప మరేమైనా ఉంటుందా?

Verse 61

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 62

وَمِن دُونِهِمَا جَنَّتَانِ

Transliteration wamin dūnihimā jannatāni

Telugu మరియు ఆ రెండే కాక ఇంకా రెండు స్వర్గవనాలుంటాయి.

Verse 63

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 64

مُدْهَآمَّتَانِ

Transliteration mud'hāmmatāni

Telugu అవి దట్టంగా ముదరు పచ్చగా ఉంటాయి.

Verse 65

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 66

فِيهِمَا عَيْنَانِ نَضَّاخَتَانِ

Transliteration fīhimā ʿaynāni naḍḍākhatāni

Telugu ఆ రెండు తోటలలో పొంగి ప్రవహించే రెండు చెలమలుంటాయి.

Verse 67

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 68

فِيهِمَا فَـٰكِهَةٌ وَنَخْلٌ وَرُمَّانٌ

Transliteration fīhimā fākihatun wanakhlun warummānun

Telugu ఆ రెండింటిలో ఫలాలు, ఖర్జూరాలు మరియు దానిమ్మలు ఉంటాయి.

Verse 69

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 70

فِيهِنَّ خَيْرَٰتٌ حِسَانٌ

Transliteration fīhinna khayrātun ḥisānun

Telugu వాటిలో గుణవంతులు, సౌందర్యవతులైన స్త్రీలు ఉంటారు.

Verse 71

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 72

حُورٌ مَّقْصُورَٰتٌ فِى ٱلْخِيَامِ

Transliteration ḥūrun maqṣūrātun fī l-khiyāmi

Telugu నిర్మలమైన, శీలవంతులైన స్త్రీలు (హూర్) డేరాలలో ఉంటారు.

Verse 73

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 74

لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَآنٌّ

Transliteration lam yaṭmith'hunna insun qablahum walā jānnun

Telugu ఆ స్త్రీలను ఇంతకు ముందు ఏ మానవుడు కాని, ఏ జిన్నాతు కాని తాకి ఉండడు.

Verse 75

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 76

مُتَّكِـِٔينَ عَلَىٰ رَفْرَفٍ خُضْرٍ وَعَبْقَرِىٍّ حِسَانٍ

Transliteration muttakiīna ʿalā rafrafin khuḍ'rin waʿabqariyyin ḥisānin

Telugu వారు అందమైన తివాచీల మీద ఆకుపచ్చని దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు.

Verse 77

فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ

Transliteration fabi-ayyi ālāi rabbikumā tukadhibāni

Telugu అయితే మీరిరువురు మీ ప్రభువు యొక్క ఏ యే అనుగ్రహాలను నిరాకరిస్తారు?

Verse 78

تَبَـٰرَكَ ٱسْمُ رَبِّكَ ذِى ٱلْجَلَـٰلِ وَٱلْإِكْرَامِ

Transliteration tabāraka us'mu rabbika dhī l-jalāli wal-ik'rāmi

Telugu మహిమాన్వితుడు మరియు పరమ దాత అయిన నీ ప్రభువు పేరే సర్వశ్రేష్ఠమైనది.

Read Surah Ar-Rahman in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.