MyDugsiStart learning

Surah Al-Mu'minun in Telugu: translation and audio

Surah 23 · المؤمنون · The Believers · 118 verses

Surah Al-Mu'minun verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Al-Mu'minun word by word in English.

Verse 1

قَدْ أَفْلَحَ ٱلْمُؤْمِنُونَ

Transliteration qad aflaḥa l-mu'minūna

Telugu వాస్తవానికి విశ్వాసులు సాఫల్యం పొందుతారు;

Verse 2

ٱلَّذِينَ هُمْ فِى صَلَاتِهِمْ خَـٰشِعُونَ

Transliteration alladhīna hum fī ṣalātihim khāshiʿūna

Telugu వారే! ఎవరైతే తమ నమాజ్ లో వినమ్రత పాటిస్తారో!

Verse 3

وَٱلَّذِينَ هُمْ عَنِ ٱللَّغْوِ مُعْرِضُونَ

Transliteration wa-alladhīna hum ʿani l-laghwi muʿ'riḍūna

Telugu మరియు ఎవరైతే వ్యర్థమైన మాటల నుండి దూరంగా ఉంటారో;

Verse 4

وَٱلَّذِينَ هُمْ لِلزَّكَوٰةِ فَـٰعِلُونَ

Transliteration wa-alladhīna hum lilzzakati fāʿilūna

Telugu మరియు ఎవరైతే విధిదానం (జకాత్) సక్రమంగా చెల్లిస్తారో!

Verse 5

وَٱلَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَـٰفِظُونَ

Transliteration wa-alladhīna hum lifurūjihim ḥāfiẓūna

Telugu మరియు ఎవరైతే తమ మర్మాంగాలను కాపాడుకుంటారో -

Verse 6

إِلَّا عَلَىٰٓ أَزْوَٰجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَـٰنُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ

Transliteration illā ʿalā azwājihim aw mā malakat aymānuhum fa-innahum ghayru malūmīna

Telugu తమ భార్యలతో (అజ్వాజ్ లతో) లేక తమ ఆధీనంలో (కుడిచేతిలో) ఉన్న బానిస స్త్రీలతో తప్ప! అలాంటప్పుడు వారు నిశ్చయంగా, నిందార్హులు కారు.

Verse 7

فَمَنِ ٱبْتَغَىٰ وَرَآءَ ذَٰلِكَ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْعَادُونَ

Transliteration famani ib'taghā warāa dhālika fa-ulāika humu l-ʿādūna

Telugu కాని ఎవరైతే దీనిని మించి కోరుతారో! అలాంటి వారే వాస్తవంగా హద్దులను అతిక్రమించిన వారు.

Verse 8

وَٱلَّذِينَ هُمْ لِأَمَـٰنَـٰتِهِمْ وَعَهْدِهِمْ رَٰعُونَ

Transliteration wa-alladhīna hum li-amānātihim waʿahdihim rāʿūna

Telugu మరియు వారు ఎవరైతే తమ పూచీలను (అమానతులను) మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో.

Verse 9

وَٱلَّذِينَ هُمْ عَلَىٰ صَلَوَٰتِهِمْ يُحَافِظُونَ

Transliteration wa-alladhīna hum ʿalā ṣalawātihim yuḥāfiẓūna

Telugu మరియు వారు ఎవరైతే తమ నమాజ్ లను కాపాడుకుంటారో!

Verse 10

أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْوَٰرِثُونَ

Transliteration ulāika humu l-wārithūna

Telugu అలాంటి వారే (స్వర్గానికి) వారసులు అవుతారు.

Verse 11

ٱلَّذِينَ يَرِثُونَ ٱلْفِرْدَوْسَ هُمْ فِيهَا خَـٰلِدُونَ

Transliteration alladhīna yarithūna l-fir'dawsa hum fīhā khālidūna

Telugu వారే ఫిరదౌస్ స్వర్గానికి వారసులై, అందులో వారు శాశ్వతంగా ఉంటారు.

Verse 12

وَلَقَدْ خَلَقْنَا ٱلْإِنسَـٰنَ مِن سُلَـٰلَةٍ مِّن طِينٍ

Transliteration walaqad khalaqnā l-insāna min sulālatin min ṭīnin

Telugu మరియు వాస్తవంగా, మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము.

Verse 13

ثُمَّ جَعَلْنَـٰهُ نُطْفَةً فِى قَرَارٍ مَّكِينٍ

Transliteration thumma jaʿalnāhu nuṭ'fatan fī qarārin makīnin

Telugu తరువాత అతనిని ఇంద్రియ బిందువుగా ఒక కోశంలో భద్రంగా ఉంచాము.

Verse 14

ثُمَّ خَلَقْنَا ٱلنُّطْفَةَ عَلَقَةً فَخَلَقْنَا ٱلْعَلَقَةَ مُضْغَةً فَخَلَقْنَا ٱلْمُضْغَةَ عِظَـٰمًا فَكَسَوْنَا ٱلْعِظَـٰمَ لَحْمًا ثُمَّ أَنشَأْنَـٰهُ خَلْقًا ءَاخَرَ ۚ فَتَبَارَكَ ٱللَّهُ أَحْسَنُ ٱلْخَـٰلِقِينَ

Transliteration thumma khalaqnā l-nuṭ'fata ʿalaqatan fakhalaqnā l-ʿalaqata muḍ'ghatan fakhalaqnā l-muḍ'ghata ʿiẓāman fakasawnā l-ʿiẓāma laḥman thumma anshanāhu khalqan ākhara fatabāraka l-lahu aḥsanu l-khāliqīna

Telugu ఆ తరువాత ఆ ఇంద్రియ బిందువును రక్తపు ముద్దగా (జలగగా) మార్చాము. ఆ పైన ఆ రక్తపు ముద్దను (జలగను) మాంసపు ముద్దగా (జీవాణువుల పిండంగా) మార్చాము, ఆ జీవాణువుల పిండంలో ఎముకలను ఏర్పరచి, ఆ ఎముకలను మాంసంతో కప్పాము. ఆ తరువాత దానిని మరొక (భిన్న) సృష్టిగా చేశాము. కావున శుభకరుడు (శుభప్రదుడు) అయిన అల్లాహ్ యే అత్యుత్తమ సృష్టికర్త.

Verse 15

ثُمَّ إِنَّكُم بَعْدَ ذَٰلِكَ لَمَيِّتُونَ

Transliteration thumma innakum baʿda dhālika lamayyitūna

Telugu ఆ తరువాత మీరు నిశ్చయంగా, మరణిస్తారు.

Verse 16

ثُمَّ إِنَّكُمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ تُبْعَثُونَ

Transliteration thumma innakum yawma l-qiyāmati tub'ʿathūna

Telugu అటు పిమ్మట నిశ్చయంగా, మీరు పునరుత్థాన దినమున మరల లేపబడతారు.

Verse 17

وَلَقَدْ خَلَقْنَا فَوْقَكُمْ سَبْعَ طَرَآئِقَ وَمَا كُنَّا عَنِ ٱلْخَلْقِ غَـٰفِلِينَ

Transliteration walaqad khalaqnā fawqakum sabʿa ṭarāiqa wamā kunnā ʿani l-khalqi ghāfilīna

Telugu మరియు వాస్తవానికి మేము మీపై ఏడు మార్గాలను (ఆకాశాలను) సృష్టించాము. మరియు మేము సృష్టి విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా లేము.

Verse 18

وَأَنزَلْنَا مِنَ ٱلسَّمَآءِ مَآءًۢ بِقَدَرٍ فَأَسْكَنَّـٰهُ فِى ٱلْأَرْضِ ۖ وَإِنَّا عَلَىٰ ذَهَابٍۭ بِهِۦ لَقَـٰدِرُونَ

Transliteration wa-anzalnā mina l-samāi māan biqadarin fa-askannāhu fī l-arḍi wa-innā ʿalā dhahābin bihi laqādirūna

Telugu మరియు మేము ఆకాశం నుండి ఒక పరిమాణంతో వర్షాన్ని (నీటిని) కురిపించాము, పిదప దానిని భూమిలో నిలువ జేశాము. మరియు నిశ్చయంగా, దానిని వెనక్కి తీసుకునే శక్తి మాకుంది.

Verse 19

فَأَنشَأْنَا لَكُم بِهِۦ جَنَّـٰتٍ مِّن نَّخِيلٍ وَأَعْنَـٰبٍ لَّكُمْ فِيهَا فَوَٰكِهُ كَثِيرَةٌ وَمِنْهَا تَأْكُلُونَ

Transliteration fa-anshanā lakum bihi jannātin min nakhīlin wa-aʿnābin lakum fīhā fawākihu kathīratun wamin'hā takulūna

Telugu తరువాత దాని ద్వారా మేము మీ కొరకు ఖర్జూరపు తోటలను ద్రాక్షతోటలను ఉత్పత్తి చేశాము; అందులో మీకు ఎన్నో ఫలాలు దొరుకుతాయి. మరియు వాటి నుండి మీరు తింటారు.

Verse 20

وَشَجَرَةً تَخْرُجُ مِن طُورِ سَيْنَآءَ تَنۢبُتُ بِٱلدُّهْنِ وَصِبْغٍ لِّلْـَٔاكِلِينَ

Transliteration washajaratan takhruju min ṭūri saynāa tanbutu bil-duh'ni waṣib'ghin lil'ākilīna

Telugu మరియు సినాయి కొండ ప్రాంతంలో ఒక వృక్షం పెరుగుతున్నది. అది నూనె ఇస్తుంది మరియు (దాని ఫలం) తినేవారికి రుచికరమైన (కూరగా) ఉపయోగపడుతుంది.

Verse 21

وَإِنَّ لَكُمْ فِى ٱلْأَنْعَـٰمِ لَعِبْرَةً ۖ نُّسْقِيكُم مِّمَّا فِى بُطُونِهَا وَلَكُمْ فِيهَا مَنَـٰفِعُ كَثِيرَةٌ وَمِنْهَا تَأْكُلُونَ

Transliteration wa-inna lakum fī l-anʿāmi laʿib'ratan nus'qīkum mimmā fī buṭūnihā walakum fīhā manāfiʿu kathīratun wamin'hā takulūna

Telugu మరియు నిశ్చయంగా, మీ పశువులలో మీకు ఒక గుణపాఠముంది. మేము వాటి కడుపులలో ఉన్నది (పాలు) మీకు త్రాపుతున్నాము. మరియు వాటిలో మీకు ఇంకా ఎన్నో ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మరియు వాటి (మాంసం) మీరు తింటారు.

Verse 22

وَعَلَيْهَا وَعَلَى ٱلْفُلْكِ تُحْمَلُونَ

Transliteration waʿalayhā waʿalā l-ful'ki tuḥ'malūna

Telugu మరియు వాటి మీద మరియు ఓడల మీద మీరు సవారీ చేస్తారు.

Verse 23

وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦ فَقَالَ يَـٰقَوْمِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُۥٓ ۖ أَفَلَا تَتَّقُونَ

Transliteration walaqad arsalnā nūḥan ilā qawmihi faqāla yāqawmi uʿ'budū l-laha mā lakum min ilāhin ghayruhu afalā tattaqūna

Telugu మరియు వాస్తవానికి మేము నూహ్ ను తన జాతి ప్రజల వద్దకు పంపాము. అతను వారితో అన్నాడు: "నా జాతి ప్రజలారా! అల్లాహ్ నే ఆరాధించండి మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు! ఏమీ మీరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండరా?"

Verse 24

فَقَالَ ٱلْمَلَؤُا۟ ٱلَّذِينَ كَفَرُوا۟ مِن قَوْمِهِۦ مَا هَـٰذَآ إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ يُرِيدُ أَن يَتَفَضَّلَ عَلَيْكُمْ وَلَوْ شَآءَ ٱللَّهُ لَأَنزَلَ مَلَـٰٓئِكَةً مَّا سَمِعْنَا بِهَـٰذَا فِىٓ ءَابَآئِنَا ٱلْأَوَّلِينَ

Transliteration faqāla l-mala-u alladhīna kafarū min qawmihi mā hādhā illā basharun mith'lukum yurīdu an yatafaḍḍala ʿalaykum walaw shāa l-lahu la-anzala malāikatan mā samiʿ'nā bihādhā fī ābāinā l-awalīna

Telugu అతని జాతిలోని సత్యతిరస్కారులైన నాయకులు ఇలా అన్నారు: "ఇతను మీ వంటి ఒక సాధారణ మానవుడే తప్ప మరేమీ కాడు! మీపై ఆధిక్యత పొందగోరుతున్నాడు. మరియు అల్లాహ్ తలుచుకుంటే దైవదూతలను పంపి ఉండేవాడు. ఇలాంటి విషయం పూర్వీకులైన మన తాతముత్తాతలలో కూడా జరిగినట్లు మేము వినలేదే!"

Verse 25

إِنْ هُوَ إِلَّا رَجُلٌۢ بِهِۦ جِنَّةٌ فَتَرَبَّصُوا۟ بِهِۦ حَتَّىٰ حِينٍ

Transliteration in huwa illā rajulun bihi jinnatun fatarabbaṣū bihi ḥattā ḥīnin

Telugu "ఇతడు కేవలం పిచ్చి పట్టిన మనిషి కావున కొంత కాలం ఇతనిని సహించండి."

Verse 26

قَالَ رَبِّ ٱنصُرْنِى بِمَا كَذَّبُونِ

Transliteration qāla rabbi unṣur'nī bimā kadhabūni

Telugu (నూహ్) అన్నాడు: "ఓ నా ప్రభూ! వీరు నన్ను అసత్యపరుడని తిరస్కరిస్తున్నారు. కావున నాకు సహాయం చేయి."

Verse 27

فَأَوْحَيْنَآ إِلَيْهِ أَنِ ٱصْنَعِ ٱلْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا فَإِذَا جَآءَ أَمْرُنَا وَفَارَ ٱلتَّنُّورُ ۙ فَٱسْلُكْ فِيهَا مِن كُلٍّ زَوْجَيْنِ ٱثْنَيْنِ وَأَهْلَكَ إِلَّا مَن سَبَقَ عَلَيْهِ ٱلْقَوْلُ مِنْهُمْ ۖ وَلَا تُخَـٰطِبْنِى فِى ٱلَّذِينَ ظَلَمُوٓا۟ ۖ إِنَّهُم مُّغْرَقُونَ

Transliteration fa-awḥaynā ilayhi ani iṣ'naʿi l-ful'ka bi-aʿyuninā wawaḥyinā fa-idhā jāa amrunā wafāra l-tanūru fa-us'luk fīhā min kullin zawjayni ith'nayni wa-ahlaka illā man sabaqa ʿalayhi l-qawlu min'hum walā tukhāṭib'nī fī alladhīna ẓalamū innahum mugh'raqūna

Telugu కావున మేము అతనికి ఈ విధంగా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "మా పర్యవేక్షణలో, మా దివ్యజ్ఞానం (వహీ) ప్రకారం ఒక ఓడను తయారు చెయ్యి. తరువాత మా ఆజ్ఞ వచ్చినప్పుడు మరియు పొయ్యి నుండి నీరు ఉబికినప్పుడు (పొంగినప్పుడు), ఆ నావలో ప్రతిరకపు జంతుజాతి నుండి ఒక్కొక్క జంటను మరియు నీ పరివారపు వారిని ఎక్కించుకో ఎవరిని గురించి అయితే ముందుగానే నిర్ణయం జరిగిందో వారు తప్ప! ఇక దుర్మార్గుల కొరకు నాతో మనవి చేయకు. నిశ్చయంగా, వారు ముంచి వేయబడతారు."

Verse 28

فَإِذَا ٱسْتَوَيْتَ أَنتَ وَمَن مَّعَكَ عَلَى ٱلْفُلْكِ فَقُلِ ٱلْحَمْدُ لِلَّهِ ٱلَّذِى نَجَّىٰنَا مِنَ ٱلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ

Transliteration fa-idhā is'tawayta anta waman maʿaka ʿalā l-ful'ki faquli l-ḥamdu lillahi alladhī najjānā mina l-qawmi l-ẓālimīna

Telugu "ఆ తరువాత నీవు మరియు నీతో ఉన్నవారు నావలోకి ఎక్కిన పిదప ఇలా ప్రార్థించండి: 'సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే, ఆయనే మమ్మల్ని దుర్మార్గుల నుండి విమోచనం కలిగించాడు.'

Verse 29

وَقُل رَّبِّ أَنزِلْنِى مُنزَلًا مُّبَارَكًا وَأَنتَ خَيْرُ ٱلْمُنزِلِينَ

Transliteration waqul rabbi anzil'nī munzalan mubārakan wa-anta khayru l-munzilīna

Telugu ఇంకా ఇలా ప్రార్థించు: 'ఓ నా ప్రభూ! నన్ను శుభప్రదమైన గమ్యస్థానంలో దించు. గమ్యస్థానానికి చేర్పించే వారిలో నీవే అత్యుత్తముడవు!'"

Verse 30

إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَـٰتٍ وَإِن كُنَّا لَمُبْتَلِينَ

Transliteration inna fī dhālika laāyātin wa-in kunnā lamub'talīna

Telugu నిశ్చయంగా, ఇందులో (ఈ గాథలో) సూచనలున్నాయి. మరియు నిశ్చయంగా, మేము (ప్రజలను) పరీక్షకు గురి చేస్తూ ఉంటాము.

Verse 31

ثُمَّ أَنشَأْنَا مِنۢ بَعْدِهِمْ قَرْنًا ءَاخَرِينَ

Transliteration thumma anshanā min baʿdihim qarnan ākharīna

Telugu వారి తరువాత మేము మరొక తరాన్ని పుట్టించాము.

Verse 32

فَأَرْسَلْنَا فِيهِمْ رَسُولًا مِّنْهُمْ أَنِ ٱعْبُدُوا۟ ٱللَّهَ مَا لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرُهُۥٓ ۖ أَفَلَا تَتَّقُونَ

Transliteration fa-arsalnā fīhim rasūlan min'hum ani uʿ'budū l-laha mā lakum min ilāhin ghayruhu afalā tattaqūna

Telugu మరియు వారి వద్దకు వారి నుండియే, ఒక సందేశహరుణ్ణి పంపినప్పుడు, (అతను): "కేవలం అల్లాహ్ నే ఆరాధించండి. మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. ఏమీ? మీకు దైవభీతి లేదా?" అని అన్నాడు.

Verse 33

وَقَالَ ٱلْمَلَأُ مِن قَوْمِهِ ٱلَّذِينَ كَفَرُوا۟ وَكَذَّبُوا۟ بِلِقَآءِ ٱلْـَٔاخِرَةِ وَأَتْرَفْنَـٰهُمْ فِى ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا مَا هَـٰذَآ إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ يَأْكُلُ مِمَّا تَأْكُلُونَ مِنْهُ وَيَشْرَبُ مِمَّا تَشْرَبُونَ

Transliteration waqāla l-mala-u min qawmihi alladhīna kafarū wakadhabū biliqāi l-ākhirati wa-atrafnāhum fī l-ḥayati l-dun'yā mā hādhā illā basharun mith'lukum yakulu mimmā takulūna min'hu wayashrabu mimmā tashrabūna

Telugu దానికి, అతని జాతివారిలోని - సత్యతిరస్కారులైనట్టి వారు, పరలోక సమావేశాన్ని అబద్ధమని నిరాకరించేవారు మరియు ఇహలోక జీవితంలో మేము భాగ్యవంతులుగా చేసినట్టి - నాయకులు ఇలా అన్నారు: "ఇతను మీ వంటి సాధారణ మానవుడే తప్ప మరేమీ కాడు, మీరు తినేదే ఇతనూ తింటున్నాడు మరియు మీరు త్రాగేదే ఇతనూ త్రాగుతున్నాడు.

Verse 34

وَلَئِنْ أَطَعْتُم بَشَرًا مِّثْلَكُمْ إِنَّكُمْ إِذًا لَّخَـٰسِرُونَ

Transliteration wala-in aṭaʿtum basharan mith'lakum innakum idhan lakhāsirūna

Telugu మరియు ఒకవేళ మీరు మీ వంటి ఒక సాధారణ మానవుణ్ణి అనుసరించినట్లైతే! నిశ్చయంగా, మీరు నష్టపడిన వారవుతారు.

Verse 35

أَيَعِدُكُمْ أَنَّكُمْ إِذَا مِتُّمْ وَكُنتُمْ تُرَابًا وَعِظَـٰمًا أَنَّكُم مُّخْرَجُونَ

Transliteration ayaʿidukum annakum idhā mittum wakuntum turāban waʿiẓāman annakum mukh'rajūna

Telugu ఏమీ? మీరు మరణించి మట్టిగా ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా తిరిగి లేపబడతారని ఇతను మీకు వాగ్దానం చేస్తున్నాడా?

Verse 36

۞ هَيْهَاتَ هَيْهَاتَ لِمَا تُوعَدُونَ

Transliteration hayhāta hayhāta limā tūʿadūna

Telugu అసంభవం! మీకు చేయబడే ఈ వాగ్దానం నెరవేరటం అసంభవం.

Verse 37

إِنْ هِىَ إِلَّا حَيَاتُنَا ٱلدُّنْيَا نَمُوتُ وَنَحْيَا وَمَا نَحْنُ بِمَبْعُوثِينَ

Transliteration in hiya illā ḥayātunā l-dun'yā namūtu wanaḥyā wamā naḥnu bimabʿūthīna

Telugu ఇక మన జీవితం ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే! మనం మరణించేది జీవించేది ఇక్కడే! మనం ఏ మాత్రమూ తిరిగి సజీవులుగా లేపబడము!

Verse 38

إِنْ هُوَ إِلَّا رَجُلٌ ٱفْتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا وَمَا نَحْنُ لَهُۥ بِمُؤْمِنِينَ

Transliteration in huwa illā rajulun if'tarā ʿalā l-lahi kadhiban wamā naḥnu lahu bimu'minīna

Telugu ఇక ఇతను, ఈ వ్యక్తి అల్లాహ్ పేరుతో కేవలం అబద్ధాలు కల్పిస్తున్నాడు మరియు మేము ఇతనిని (ఇతని మాటలను) ఎన్నటికీ విశ్వసించలేము."

Verse 39

قَالَ رَبِّ ٱنصُرْنِى بِمَا كَذَّبُونِ

Transliteration qāla rabbi unṣur'nī bimā kadhabūni

Telugu (ఆ ప్రవక్త) అన్నాడు: "ఓ నా ప్రభూ! వీరు చేసే నిందారోపణల నుండి నన్ను కాపాడు."

Verse 40

قَالَ عَمَّا قَلِيلٍ لَّيُصْبِحُنَّ نَـٰدِمِينَ

Transliteration qāla ʿammā qalīlin layuṣ'biḥunna nādimīna

Telugu (అల్లాహ్) ఇలా సెలవిచ్చాడు: "వీరు కొంతకాలంలోనే పశ్చాత్తాప పడతారు."

Verse 41

فَأَخَذَتْهُمُ ٱلصَّيْحَةُ بِٱلْحَقِّ فَجَعَلْنَـٰهُمْ غُثَآءً ۚ فَبُعْدًا لِّلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ

Transliteration fa-akhadhathumu l-ṣayḥatu bil-ḥaqi fajaʿalnāhum ghuthāan fabuʿ'dan lil'qawmi l-ẓālimīna

Telugu ఆ తరువాత సత్య (వాగ్దాన) ప్రకారం ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) వారిని చుట్టు ముట్టింది. మేము వారిని చెత్తా చెదారంగా మార్చి వేశాము. ఇక దుర్మార్గులైన జాతివారు ఈ విధంగానే దూరమై పోతారు (నాశనం చేయబడతారు)!

Verse 42

ثُمَّ أَنشَأْنَا مِنۢ بَعْدِهِمْ قُرُونًا ءَاخَرِينَ

Transliteration thumma anshanā min baʿdihim qurūnan ākharīna

Telugu వారి తరువాత ఇతర తరాల వారిని పుట్టించాము.

Verse 43

مَا تَسْبِقُ مِنْ أُمَّةٍ أَجَلَهَا وَمَا يَسْتَـْٔخِرُونَ

Transliteration mā tasbiqu min ummatin ajalahā wamā yastakhirūna

Telugu ఏ సమాజం వారు కూడా తమకు (నియమింపబడిన) గడువుకు ముందు కాలేరు మరియు దానికి వెనుక కాలేరు.

Verse 44

ثُمَّ أَرْسَلْنَا رُسُلَنَا تَتْرَا ۖ كُلَّ مَا جَآءَ أُمَّةً رَّسُولُهَا كَذَّبُوهُ ۚ فَأَتْبَعْنَا بَعْضَهُم بَعْضًا وَجَعَلْنَـٰهُمْ أَحَادِيثَ ۚ فَبُعْدًا لِّقَوْمٍ لَّا يُؤْمِنُونَ

Transliteration thumma arsalnā rusulanā tatrā kulla mā jāa ummatan rasūluhā kadhabūhu fa-atbaʿnā baʿḍahum baʿḍan wajaʿalnāhum aḥādītha fabuʿ'dan liqawmin lā yu'minūna

Telugu ఆ తరువాత మేము మా సందేశహరులను ఒకరి తరువాత ఒకరిని పంపుతూ వచ్చాము. ప్రతిసారి ఒక సమాజం వద్దకు దాని సందేశహరుడు వచ్చినప్పుడు, వారు అతనిని అసత్యుడని తిరస్కరించారు. వారిని ఒకరి తరువాత ఒకరిని నశింపజేస్తూ వచ్చాము. చివరకు వారిని గాథలుగా చేసి వదిలాము. ఇక విశ్వసించని ప్రజలు ఈ విధంగా దూరమై పోవుగాక (నాశనం చేయబడుగాక!)

Verse 45

ثُمَّ أَرْسَلْنَا مُوسَىٰ وَأَخَاهُ هَـٰرُونَ بِـَٔايَـٰتِنَا وَسُلْطَـٰنٍ مُّبِينٍ

Transliteration thumma arsalnā mūsā wa-akhāhu hārūna biāyātinā wasul'ṭānin mubīnin

Telugu ఆ తరువాత మూసా మరియు అతని సోదరుడు హారూన్ లను మా సూచనలతో మరియు స్పష్టమైన ప్రమాణంతో పంపాము;

Verse 46

إِلَىٰ فِرْعَوْنَ وَمَلَإِي۟هِۦ فَٱسْتَكْبَرُوا۟ وَكَانُوا۟ قَوْمًا عَالِينَ

Transliteration ilā fir'ʿawna wamala-ihi fa-is'takbarū wakānū qawman ʿālīna

Telugu ఫిర్ఔన్ మరియు అతని నాయకుల వద్దకు. కాని వారు దురహంకారం చూపారు. వారు తమ అహంభావంలో మునిగి ఉండేవారు.

Verse 47

فَقَالُوٓا۟ أَنُؤْمِنُ لِبَشَرَيْنِ مِثْلِنَا وَقَوْمُهُمَا لَنَا عَـٰبِدُونَ

Transliteration faqālū anu'minu libasharayni mith'linā waqawmuhumā lanā ʿābidūna

Telugu అపుడు వారన్నారు: "ఏమీ? మేము మా వంటి ఈ ఇద్దరు మానవులను విశ్వసించాలా? మరియు ఎవరి జాతి వారైతే మా బానిసలుగా ఉన్నారో!"

Verse 48

فَكَذَّبُوهُمَا فَكَانُوا۟ مِنَ ٱلْمُهْلَكِينَ

Transliteration fakadhabūhumā fakānū mina l-muh'lakīna

Telugu కావున వారు, ఆ ఇరువురిని అసత్యవాదులని తిరస్కరించి, నాశనం చేయబడిన వారిలో చేరిపోయారు.

Verse 49

وَلَقَدْ ءَاتَيْنَا مُوسَى ٱلْكِتَـٰبَ لَعَلَّهُمْ يَهْتَدُونَ

Transliteration walaqad ātaynā mūsā l-kitāba laʿallahum yahtadūna

Telugu మరియు వాస్తవానికి మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము, బహుశా వారు మార్గదర్శకత్వం పొందుతారేమోనని!

Verse 50

وَجَعَلْنَا ٱبْنَ مَرْيَمَ وَأُمَّهُۥٓ ءَايَةً وَءَاوَيْنَـٰهُمَآ إِلَىٰ رَبْوَةٍ ذَاتِ قَرَارٍ وَمَعِينٍ

Transliteration wajaʿalnā ib'na maryama wa-ummahu āyatan waāwaynāhumā ilā rabwatin dhāti qarārin wamaʿīnin

Telugu ఇక మర్యమ్ కుమారుణ్ణి మరియు అతని తల్లిని మేము (మా అనుగ్రహపు) సూచనగా చేశాము. మరియు వారిద్దరికి ఉన్నతమైన, ప్రశాంతమైన నీడ, ప్రవహించే సెలయేళ్ళు మరియు చెలమలు గల స్థానంలో ఆశ్రయమిచ్చాము.

Verse 51

يَـٰٓأَيُّهَا ٱلرُّسُلُ كُلُوا۟ مِنَ ٱلطَّيِّبَـٰتِ وَٱعْمَلُوا۟ صَـٰلِحًا ۖ إِنِّى بِمَا تَعْمَلُونَ عَلِيمٌ

Transliteration yāayyuhā l-rusulu kulū mina l-ṭayibāti wa-iʿ'malū ṣāliḥan innī bimā taʿmalūna ʿalīmun

Telugu ఓ సందేశహరులారా! పరిశుద్ధమైన వస్తువులనే తినండి మరియు సత్కార్యాలు చేయండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా నాకు బాగా తెలుసు.

Verse 52

وَإِنَّ هَـٰذِهِۦٓ أُمَّتُكُمْ أُمَّةً وَٰحِدَةً وَأَنَا۠ رَبُّكُمْ فَٱتَّقُونِ

Transliteration wa-inna hādhihi ummatukum ummatan wāḥidatan wa-anā rabbukum fa-ittaqūni

Telugu మరియు నిశ్చయంగా, మీ ఈ సమాజం ఒకే ఒక్క సమాజం మరియు నేనే మీ ప్రభువును, కావున మీరు నా యందే భయభక్తులు కలిగి ఉండండి.

Verse 53

فَتَقَطَّعُوٓا۟ أَمْرَهُم بَيْنَهُمْ زُبُرًا ۖ كُلُّ حِزْبٍۭ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ

Transliteration fataqaṭṭaʿū amrahum baynahum zuburan kullu ḥiz'bin bimā ladayhim fariḥūna

Telugu కాని వారు తమ (ధర్మం) విషయంలో పరస్పర భేదాభిప్రాయాలు కల్పించుకొని, విభిన్న తెగలుగా చీలిపోయారు. ప్రతి వర్గం వారు, తాము అనుసరించే దానితో సంతోషపడుతున్నారు.

Verse 54

فَذَرْهُمْ فِى غَمْرَتِهِمْ حَتَّىٰ حِينٍ

Transliteration fadharhum fī ghamratihim ḥattā ḥīnin

Telugu కావున వారిని కొంత కాలం వరకు వారి మూఢత్వంలోనే మునిగి ఉండనివ్వు.

Verse 55

أَيَحْسَبُونَ أَنَّمَا نُمِدُّهُم بِهِۦ مِن مَّالٍ وَبَنِينَ

Transliteration ayaḥsabūna annamā numidduhum bihi min mālin wabanīna

Telugu ఏమీ? మేము వారికి సంపదలు మరియు సంతానం సమృద్ధిగా ఇస్తున్నామంటే!

Verse 56

نُسَارِعُ لَهُمْ فِى ٱلْخَيْرَٰتِ ۚ بَل لَّا يَشْعُرُونَ

Transliteration nusāriʿu lahum fī l-khayrāti bal lā yashʿurūna

Telugu మేము వారికి మేలు చేయటంలో తొందరపడుతున్నామని, వారు భావిస్తున్నారా? అలా కాదు వారు గ్రహించటం లేదు!

Verse 57

إِنَّ ٱلَّذِينَ هُم مِّنْ خَشْيَةِ رَبِّهِم مُّشْفِقُونَ

Transliteration inna alladhīna hum min khashyati rabbihim mush'fiqūna

Telugu నిశ్చయంగా, ఎవరైతే, తమ ప్రభువు భయం వల్ల, భీతిపరులై ఉంటారో;

Verse 58

وَٱلَّذِينَ هُم بِـَٔايَـٰتِ رَبِّهِمْ يُؤْمِنُونَ

Transliteration wa-alladhīna hum biāyāti rabbihim yu'minūna

Telugu మరియు ఎవరైతే, తమ ప్రభువు ఆయాతులను విశ్వసిస్తారో;

Verse 59

وَٱلَّذِينَ هُم بِرَبِّهِمْ لَا يُشْرِكُونَ

Transliteration wa-alladhīna hum birabbihim lā yush'rikūna

Telugu మరియు ఎవరైతే తమ ప్రభువుకు ఎవ్వరినీ సాటిగా (భాగస్వాములుగా) కల్పించరో;

Verse 60

وَٱلَّذِينَ يُؤْتُونَ مَآ ءَاتَوا۟ وَّقُلُوبُهُمْ وَجِلَةٌ أَنَّهُمْ إِلَىٰ رَبِّهِمْ رَٰجِعُونَ

Transliteration wa-alladhīna yu'tūna mā ātaw waqulūbuhum wajilatun annahum ilā rabbihim rājiʿūna

Telugu మరియు ఎవరైతే, తాము ఇవ్వ వలసినది (జకాత్) ఇచ్చేటప్పుడు, నిశ్చయంగా, వారు తమ ప్రభువు వైపుకు మరలిపోవలసి ఉన్నదనే భయాన్ని తమ హృదయాలలో ఉంచుకొని ఇస్తారో;

Verse 61

أُو۟لَـٰٓئِكَ يُسَـٰرِعُونَ فِى ٱلْخَيْرَٰتِ وَهُمْ لَهَا سَـٰبِقُونَ

Transliteration ulāika yusāriʿūna fī l-khayrāti wahum lahā sābiqūna

Telugu ఇలాంటి వారే మంచిపనులు చేయటంలో పోటీ పడేవారు. మరియు వారు వాటిని చేయటానికి అందరి కంటే ముందు ఉండేవారు.

Verse 62

وَلَا نُكَلِّفُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۖ وَلَدَيْنَا كِتَـٰبٌ يَنطِقُ بِٱلْحَقِّ ۚ وَهُمْ لَا يُظْلَمُونَ

Transliteration walā nukallifu nafsan illā wus'ʿahā waladaynā kitābun yanṭiqu bil-ḥaqi wahum lā yuẓ'lamūna

Telugu మరియు మేము ఏ ప్రాణి పై కూడా దాని శక్తికి మించిన భారం వేయము. మరియు మా వద్ద అంతా వ్రాయబడిన ఒక గ్రంథముంది. అది సత్యాన్ని పలుకుతుంది. మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.

Verse 63

بَلْ قُلُوبُهُمْ فِى غَمْرَةٍ مِّنْ هَـٰذَا وَلَهُمْ أَعْمَـٰلٌ مِّن دُونِ ذَٰلِكَ هُمْ لَهَا عَـٰمِلُونَ

Transliteration bal qulūbuhum fī ghamratin min hādhā walahum aʿmālun min dūni dhālika hum lahā ʿāmilūna

Telugu అలా కాదు, వారి హృదయాలు దీనిని గురించి అజ్ఞానంలో పడి ఉన్నాయి. ఇంతేగాక వారు చేసే (దుష్ట) కార్యాలు ఎన్నో ఉన్నాయి వారు వాటిని చూస్తునే ఉంటారు.

Verse 64

حَتَّىٰٓ إِذَآ أَخَذْنَا مُتْرَفِيهِم بِٱلْعَذَابِ إِذَا هُمْ يَجْـَٔرُونَ

Transliteration ḥattā idhā akhadhnā mut'rafīhim bil-ʿadhābi idhā hum yajarūna

Telugu చివరకు, వారిలోని ఇహలోక భోగభాగ్యాలలో మునిగి ఉన్న వారిని శిక్షించటానికి మేము పట్టుకున్నప్పుడు, వారు మొరపెట్టుకుంటారు.

Verse 65

لَا تَجْـَٔرُوا۟ ٱلْيَوْمَ ۖ إِنَّكُم مِّنَّا لَا تُنصَرُونَ

Transliteration lā tajarū l-yawma innakum minnā lā tunṣarūna

Telugu (అప్పుడు వారితో ఇలా అనబడుతుంది): "ఈరోజు మీరు మొరపెట్టుకోకండి! నిశ్చయంగా, మా తరఫు నుండి మీకు ఎలాంటి సహాయం లభించడం జరుగదు.

Verse 66

قَدْ كَانَتْ ءَايَـٰتِى تُتْلَىٰ عَلَيْكُمْ فَكُنتُمْ عَلَىٰٓ أَعْقَـٰبِكُمْ تَنكِصُونَ

Transliteration qad kānat āyātī tut'lā ʿalaykum fakuntum ʿalā aʿqābikum tankiṣūna

Telugu వాస్తవానికి, నా సూచనలు మీకు వినిపించబడినప్పుడు, మీరు మీ మడమల మీద వెనుకకు తిరిగి పోయేవారు.

Verse 67

مُسْتَكْبِرِينَ بِهِۦ سَـٰمِرًا تَهْجُرُونَ

Transliteration mus'takbirīna bihi sāmiran tahjurūna

Telugu దురహంకారంతో దానిని గురించి వ్యర్థపు ప్రలాపాలలో రాత్రులు గడుపుతూ ఉండేవారు.

Verse 68

أَفَلَمْ يَدَّبَّرُوا۟ ٱلْقَوْلَ أَمْ جَآءَهُم مَّا لَمْ يَأْتِ ءَابَآءَهُمُ ٱلْأَوَّلِينَ

Transliteration afalam yaddabbarū l-qawla am jāahum mā lam yati ābāahumu l-awalīna

Telugu ఏమీ? వారు ఈ (దైవ) వాక్కును గురించి ఎన్నడూ ఆలోచించలేదా? లేక వారి పూర్వీకులైన, వారి తాతముత్తాతల వద్దకు ఎన్నడూ రానిది, వారి వద్దకు వచ్చిందనా?

Verse 69

أَمْ لَمْ يَعْرِفُوا۟ رَسُولَهُمْ فَهُمْ لَهُۥ مُنكِرُونَ

Transliteration am lam yaʿrifū rasūlahum fahum lahu munkirūna

Telugu లేక వారు తమ సందేశహరుణ్ణి ఎరుగరా? అందుకే అతన్ని తిరస్కరిస్తున్నారా?

Verse 70

أَمْ يَقُولُونَ بِهِۦ جِنَّةٌۢ ۚ بَلْ جَآءَهُم بِٱلْحَقِّ وَأَكْثَرُهُمْ لِلْحَقِّ كَـٰرِهُونَ

Transliteration am yaqūlūna bihi jinnatun bal jāahum bil-ḥaqi wa-aktharuhum lil'ḥaqqi kārihūna

Telugu లేక: "అతనికి పిచ్చిపట్టింది!" అని అంటున్నారా? వాస్తవానికి, అతను వారి వద్దకు సత్యాన్ని తెచ్చాడు. కాని చాలామంది సత్యాన్ని అసహ్యించుకుంటున్నారు.

Verse 71

وَلَوِ ٱتَّبَعَ ٱلْحَقُّ أَهْوَآءَهُمْ لَفَسَدَتِ ٱلسَّمَـٰوَٰتُ وَٱلْأَرْضُ وَمَن فِيهِنَّ ۚ بَلْ أَتَيْنَـٰهُم بِذِكْرِهِمْ فَهُمْ عَن ذِكْرِهِم مُّعْرِضُونَ

Transliteration walawi ittabaʿa l-ḥaqu ahwāahum lafasadati l-samāwātu wal-arḍu waman fīhinna bal ataynāhum bidhik'rihim fahum ʿan dhik'rihim muʿ'riḍūna

Telugu మరియు ఒకవేళ సత్యమే వారి కోరికలకు అనుగుణంగా ఉంటే భూమ్యాకాశాలు మరియు వాటిలో ఉన్నదంతా నాశనమై పోయేది. వాస్తవానికి మేము వారి వద్దకు హితబోధను పంపాము. కాని వారు తమ హితబోధ నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు.

Verse 72

أَمْ تَسْـَٔلُهُمْ خَرْجًا فَخَرَاجُ رَبِّكَ خَيْرٌ ۖ وَهُوَ خَيْرُ ٱلرَّٰزِقِينَ

Transliteration am tasaluhum kharjan fakharāju rabbika khayrun wahuwa khayru l-rāziqīna

Telugu లేక నీవు (ఓ ముహమ్మద్!) వారిని ప్రతిఫలం ఏమైనా అడుగుతున్నావా? నీ ప్రభువు ఇచ్చే ప్రతిఫలమే ఎంతో మేలైనది. ఆయనే అందరి కంటే శ్రేష్ఠుడైన ఉపాధి ప్రదాత.

Verse 73

وَإِنَّكَ لَتَدْعُوهُمْ إِلَىٰ صِرَٰطٍ مُّسْتَقِيمٍ

Transliteration wa-innaka latadʿūhum ilā ṣirāṭin mus'taqīmin

Telugu మరియు నిశ్చయంగా, నీవు వారిని ఋజుమార్గం వైపునకు పిలుస్తున్నావు.

Verse 74

وَإِنَّ ٱلَّذِينَ لَا يُؤْمِنُونَ بِٱلْـَٔاخِرَةِ عَنِ ٱلصِّرَٰطِ لَنَـٰكِبُونَ

Transliteration wa-inna alladhīna lā yu'minūna bil-ākhirati ʿani l-ṣirāṭi lanākibūna

Telugu మరియు నిశ్చయంగా, పరలోకాన్ని నమ్మని వారు (ఋజు) మార్గం నుండి వైదొలగిన వారే!

Verse 75

۞ وَلَوْ رَحِمْنَـٰهُمْ وَكَشَفْنَا مَا بِهِم مِّن ضُرٍّ لَّلَجُّوا۟ فِى طُغْيَـٰنِهِمْ يَعْمَهُونَ

Transliteration walaw raḥim'nāhum wakashafnā mā bihim min ḍurrin lalajjū fī ṭugh'yānihim yaʿmahūna

Telugu ఒకవేళ మేము వారిని కరుణించి, (ఇహలోకంలో వారికున్న) ఆపదను తొలగించినా! వారు తలబిరుసుతనంతో పట్టు విడువకుండా త్రోవ తప్పి, సంచరిస్తూ ఉంటారు.

Verse 76

وَلَقَدْ أَخَذْنَـٰهُم بِٱلْعَذَابِ فَمَا ٱسْتَكَانُوا۟ لِرَبِّهِمْ وَمَا يَتَضَرَّعُونَ

Transliteration walaqad akhadhnāhum bil-ʿadhābi famā is'takānū lirabbihim wamā yataḍarraʿūna

Telugu మరియు వాస్తవానికి, మేము వారిని శిక్షకు గురి చేశాము. అయినా వారు తమ ప్రభువు ముందు వంగలేదు మరియు వారు వినమ్రులు కూడా కాలేదు.

Verse 77

حَتَّىٰٓ إِذَا فَتَحْنَا عَلَيْهِم بَابًا ذَا عَذَابٍ شَدِيدٍ إِذَا هُمْ فِيهِ مُبْلِسُونَ

Transliteration ḥattā idhā fataḥnā ʿalayhim bāban dhā ʿadhābin shadīdin idhā hum fīhi mub'lisūna

Telugu చివరకు మేము వారి కొరకు కఠిన శిక్షా ద్వారాన్ని తెరిచాము. అప్పుడు వారు నిరాశ చెందిన వారయ్యారు.

Verse 78

وَهُوَ ٱلَّذِىٓ أَنشَأَ لَكُمُ ٱلسَّمْعَ وَٱلْأَبْصَـٰرَ وَٱلْأَفْـِٔدَةَ ۚ قَلِيلًا مَّا تَشْكُرُونَ

Transliteration wahuwa alladhī ansha-a lakumu l-samʿa wal-abṣāra wal-afidata qalīlan mā tashkurūna

Telugu మరియు ఆయనే, మీకు వినే శక్తినీ, చూసే శక్తినీ మరియు (అర్థం చేసుకోవటానికి) హృదయాలను సృజించినవాడు! అయినా మీరెంత తక్కువగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు!

Verse 79

وَهُوَ ٱلَّذِى ذَرَأَكُمْ فِى ٱلْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ

Transliteration wahuwa alladhī dhara-akum fī l-arḍi wa-ilayhi tuḥ'sharūna

Telugu మరియు మిమ్మల్ని భూమిపై వ్యాపింప జేసినవాడు ఆయనే. మరియు ఆయన వద్దనే మీరంతా సమావేశ పరచబడతారు.

Verse 80

وَهُوَ ٱلَّذِى يُحْىِۦ وَيُمِيتُ وَلَهُ ٱخْتِلَـٰفُ ٱلَّيْلِ وَٱلنَّهَارِ ۚ أَفَلَا تَعْقِلُونَ

Transliteration wahuwa alladhī yuḥ'yī wayumītu walahu ikh'tilāfu al-layli wal-nahāri afalā taʿqilūna

Telugu మరియు మీకు జీవితాన్ని ఇచ్చేవాడు మరియు మరణింపజేసేవాడు ఆయనే! మరియు రాత్రింబవళ్ళ మార్పు ఆయన ఆధీనంలోనే ఉంది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా?

Verse 81

بَلْ قَالُوا۟ مِثْلَ مَا قَالَ ٱلْأَوَّلُونَ

Transliteration bal qālū mith'la mā qāla l-awalūna

Telugu కాని వారు తమ పూర్వీకులు పలికినట్లే పలుకుతున్నారు.

Verse 82

قَالُوٓا۟ أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَـٰمًا أَءِنَّا لَمَبْعُوثُونَ

Transliteration qālū a-idhā mit'nā wakunnā turāban waʿiẓāman a-innā lamabʿūthūna

Telugu వారంటున్నారు: "ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారి పోయిన తరువాత కూడా మళ్ళీ సజీవులుగా లేపబడతామా?

Verse 83

لَقَدْ وُعِدْنَا نَحْنُ وَءَابَآؤُنَا هَـٰذَا مِن قَبْلُ إِنْ هَـٰذَآ إِلَّآ أَسَـٰطِيرُ ٱلْأَوَّلِينَ

Transliteration laqad wuʿid'nā naḥnu waābāunā hādhā min qablu in hādhā illā asāṭīru l-awalīna

Telugu వాస్తవానికి, ఇటువంటి వాగ్దానాలు, మాకూ మరియు మాకు పూర్వం మా తాతముత్తాతలకు చేయబడినవే! వాస్తవానికి ఇవి కేవలం పూర్వకాలపు కట్టుకథలు మాత్రమే"

Verse 84

قُل لِّمَنِ ٱلْأَرْضُ وَمَن فِيهَآ إِن كُنتُمْ تَعْلَمُونَ

Transliteration qul limani l-arḍu waman fīhā in kuntum taʿlamūna

Telugu వారిని ఇలా అడుగు: "ఈ భూమి మరియు ఇందులో ఉన్నదంతా ఎవరికి చెందినదో మీకు తెలిస్తే చెప్పండి?"

Verse 85

سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ أَفَلَا تَذَكَّرُونَ

Transliteration sayaqūlūna lillahi qul afalā tadhakkarūna

Telugu వారంటారు: "అల్లాహ్ కే!" వారితో అను: "అయినా మీరు హితోపదేశం స్వీకరించరా?"

Verse 86

قُلْ مَن رَّبُّ ٱلسَّمَـٰوَٰتِ ٱلسَّبْعِ وَرَبُّ ٱلْعَرْشِ ٱلْعَظِيمِ

Transliteration qul man rabbu l-samāwāti l-sabʿi warabbu l-ʿarshi l-ʿaẓīmi

Telugu వారిని అడుగు: "సప్తాకాశాల ప్రభువు మరియు సర్వోత్తమ సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు ఎవరు?"

Verse 87

سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ أَفَلَا تَتَّقُونَ

Transliteration sayaqūlūna lillahi qul afalā tattaqūna

Telugu వారంటారు: "అల్లాహ్ మాత్రమే!" అని. వారితో అను: "అయితే మీరెందుకు ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండరు?"

Verse 88

قُلْ مَنۢ بِيَدِهِۦ مَلَكُوتُ كُلِّ شَىْءٍ وَهُوَ يُجِيرُ وَلَا يُجَارُ عَلَيْهِ إِن كُنتُمْ تَعْلَمُونَ

Transliteration qul man biyadihi malakūtu kulli shayin wahuwa yujīru walā yujāru ʿalayhi in kuntum taʿlamūna

Telugu వారిని ఇలా అడుగు: "మీకు తెలిస్తే చెప్పండి! ప్రతిదానిపై పాలనాధికారం ఎవరి చేతిలో ఉంది? మరియు ప్రతిదానికి శరణమిచ్చేవాడు ఆయనే మరియు ఆయనకు వ్యతిరేకంగా శరణమివ్వగల వాడెవ్వడూ లేనివాడు, ఎవరు?"

Verse 89

سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ فَأَنَّىٰ تُسْحَرُونَ

Transliteration sayaqūlūna lillahi qul fa-annā tus'ḥarūna

Telugu వారంటారు: "అల్లాహ్ మాత్రమే!" వారితో అను: "అయితే మీరెందుకు మాయాజాలానికి గురవుతున్నారు (మోసగింపబడుతున్నారు)?"

Verse 90

بَلْ أَتَيْنَـٰهُم بِٱلْحَقِّ وَإِنَّهُمْ لَكَـٰذِبُونَ

Transliteration bal ataynāhum bil-ḥaqi wa-innahum lakādhibūna

Telugu అలా కాదు! మేము వారికి సత్యాన్ని అందజేశాము. మరియు నిశ్చయంగా, వారే అసత్యవాదులు!

Verse 91

مَا ٱتَّخَذَ ٱللَّهُ مِن وَلَدٍ وَمَا كَانَ مَعَهُۥ مِنْ إِلَـٰهٍ ۚ إِذًا لَّذَهَبَ كُلُّ إِلَـٰهٍۭ بِمَا خَلَقَ وَلَعَلَا بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ ۚ سُبْحَـٰنَ ٱللَّهِ عَمَّا يَصِفُونَ

Transliteration mā ittakhadha l-lahu min waladin wamā kāna maʿahu min ilāhin idhan ladhahaba kullu ilāhin bimā khalaqa walaʿalā baʿḍuhum ʿalā baʿḍin sub'ḥāna l-lahi ʿammā yaṣifūna

Telugu అల్లాహ్ ఎవ్వరినీ కూడా తనకు సంతానంగా చేసుకోలేదు మరియు ఆయనతో పాటు మరొక ఆరాధ్య దేవుడు లేడు. అలా అయితే ప్రతి దేవుడు తన సృష్టితో వేరై పోయేవాడు మరియు వారు ఒకరిపై నొకరు ప్రాబల్యం పొందగోరేవారు. అల్లాహ్! వారు కల్పించే వాటికి అతీతుడు.

Verse 92

عَـٰلِمِ ٱلْغَيْبِ وَٱلشَّهَـٰدَةِ فَتَعَـٰلَىٰ عَمَّا يُشْرِكُونَ

Transliteration ʿālimi l-ghaybi wal-shahādati fataʿālā ʿammā yush'rikūna

Telugu ఆయన అగోచర మరియు గోచర విషయాల జ్ఞానం గలవాడు. వారు సాటి కల్పించే భాగస్వాముల కంటే, ఆయన అత్యున్నతుడు.

Verse 93

قُل رَّبِّ إِمَّا تُرِيَنِّى مَا يُوعَدُونَ

Transliteration qul rabbi immā turiyannī mā yūʿadūna

Telugu (ఓ ముహమ్మద్!) ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! ఏ (శిక్ష అయితే) వారికి (అవిశ్వాసులకు) వాగ్దానం చేయబడి ఉన్నదో దానిని నీవు నాకు చూపనున్నచో!

Verse 94

رَبِّ فَلَا تَجْعَلْنِى فِى ٱلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ

Transliteration rabbi falā tajʿalnī fī l-qawmi l-ẓālimīna

Telugu ఓ నా ప్రభూ! నన్ను ఈ దుర్మార్గ ప్రజలలో చేర్చకు."

Verse 95

وَإِنَّا عَلَىٰٓ أَن نُّرِيَكَ مَا نَعِدُهُمْ لَقَـٰدِرُونَ

Transliteration wa-innā ʿalā an nuriyaka mā naʿiduhum laqādirūna

Telugu మరియు నిశ్చయంగా, మేము వారికి (అవిశ్వాసులకు) వాగ్దానము చేసింది (శిక్ష) నీకు చూపగల సమర్ధులము.

Verse 96

ٱدْفَعْ بِٱلَّتِى هِىَ أَحْسَنُ ٱلسَّيِّئَةَ ۚ نَحْنُ أَعْلَمُ بِمَا يَصِفُونَ

Transliteration id'faʿ bi-allatī hiya aḥsanu l-sayi-ata naḥnu aʿlamu bimā yaṣifūna

Telugu చెడును, మంచితనముతో నివారించు. వారు ఆపాదించే విషయాలు మాకు బాగా తెలుసు.

Verse 97

وَقُل رَّبِّ أَعُوذُ بِكَ مِنْ هَمَزَٰتِ ٱلشَّيَـٰطِينِ

Transliteration waqul rabbi aʿūdhu bika min hamazāti l-shayāṭīni

Telugu మరియు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! షైతానులు రేకెత్తించే కలతల నుండి (రక్షణ పొందటానికి) నేను నీ శరణు వేడుకుంటున్నాను.

Verse 98

وَأَعُوذُ بِكَ رَبِّ أَن يَحْضُرُونِ

Transliteration wa-aʿūdhu bika rabbi an yaḥḍurūni

Telugu మరియు ఓ నా ప్రభూ! అవి నా వద్దకు రాకుండా ఉండాలని, నేను నీ శరణు వేడుకుంటున్నాను."

Verse 99

حَتَّىٰٓ إِذَا جَآءَ أَحَدَهُمُ ٱلْمَوْتُ قَالَ رَبِّ ٱرْجِعُونِ

Transliteration ḥattā idhā jāa aḥadahumu l-mawtu qāla rabbi ir'jiʿūni

Telugu చివరికి వారిలో ఒకడికి మరణం సమీపించినప్పుడు వాడిలా వేడుకుంటాడు: "ఓ నా ప్రభూ! నన్ను తిరిగి (భూలోకానికి) పంపు:

Verse 100

لَعَلِّىٓ أَعْمَلُ صَـٰلِحًا فِيمَا تَرَكْتُ ۚ كَلَّآ ۚ إِنَّهَا كَلِمَةٌ هُوَ قَآئِلُهَا ۖ وَمِن وَرَآئِهِم بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ

Transliteration laʿallī aʿmalu ṣāliḥan fīmā taraktu kallā innahā kalimatun huwa qāiluhā wamin warāihim barzakhun ilā yawmi yub'ʿathūna

Telugu నేను చేయకుండా వచ్చిన సత్కార్యాలు చేయటానికి." అది కాని పని. నిశ్చయంగా అది అతని నోటిమాట మాత్రమే! ఇక (ఈ మరణించిన) వారు తిరిగి లేపబడే దినం వరకు వారి ముందు ఒక అడ్డుతెర (బర్ జఖ్) ఉంటుంది.

Verse 101

فَإِذَا نُفِخَ فِى ٱلصُّورِ فَلَآ أَنسَابَ بَيْنَهُمْ يَوْمَئِذٍ وَلَا يَتَسَآءَلُونَ

Transliteration fa-idhā nufikha fī l-ṣūri falā ansāba baynahum yawma-idhin walā yatasāalūna

Telugu ఆ తరువాత బాగా ఊదబడిన దినమున వారి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండవు. మరియు వారు ఒకరి నొకరు పలుకరించుకోరు కూడా!

Verse 102

فَمَن ثَقُلَتْ مَوَٰزِينُهُۥ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْمُفْلِحُونَ

Transliteration faman thaqulat mawāzīnuhu fa-ulāika humu l-muf'liḥūna

Telugu ఇక ఎవరి (సత్కార్యాల) పళ్ళాలు బరువుగా ఉంటాయో, ఆలాంటి వారే సాఫల్యం పొందేవారు.

Verse 103

وَمَنْ خَفَّتْ مَوَٰزِينُهُۥ فَأُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ خَسِرُوٓا۟ أَنفُسَهُمْ فِى جَهَنَّمَ خَـٰلِدُونَ

Transliteration waman khaffat mawāzīnuhu fa-ulāika alladhīna khasirū anfusahum fī jahannama khālidūna

Telugu మరియు ఎవరి పళ్ళాలు తేలికగా ఉంటాయో, అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేసుకున్న వారు, వారే నరకంలో శాశ్వతంగా ఉండేవారు.

Verse 104

تَلْفَحُ وُجُوهَهُمُ ٱلنَّارُ وَهُمْ فِيهَا كَـٰلِحُونَ

Transliteration talfaḥu wujūhahumu l-nāru wahum fīhā kāliḥūna

Telugu అగ్ని వారి ముఖాలను కాల్చి వేస్తుంది. వారి పెదవులు బిగించుకు పోయి, పళ్ళు బయట పడతాయి.

Verse 105

أَلَمْ تَكُنْ ءَايَـٰتِى تُتْلَىٰ عَلَيْكُمْ فَكُنتُم بِهَا تُكَذِّبُونَ

Transliteration alam takun āyātī tut'lā ʿalaykum fakuntum bihā tukadhibūna

Telugu (వారిని అల్లాహ్ ఇలా ప్రశ్నిస్తాడు): "ఏమీ? నా సూచనలు మీకు వినిపించబడలేదా? అప్పుడు మీరు వాటిని అసత్యాలని తిరస్కరిస్తూ ఉండేవారు కదా?"

Verse 106

قَالُوا۟ رَبَّنَا غَلَبَتْ عَلَيْنَا شِقْوَتُنَا وَكُنَّا قَوْمًا ضَآلِّينَ

Transliteration qālū rabbanā ghalabat ʿalaynā shiq'watunā wakunnā qawman ḍāllīna

Telugu వారిలా అంటారు: "ఓ మా ప్రభూ! మా దురదృష్టం మమ్మల్ని క్రమ్ముకొని ఉండింది. మేము మార్గభ్రష్టులమైన వారిగా ఉండేవారం!

Verse 107

رَبَّنَآ أَخْرِجْنَا مِنْهَا فَإِنْ عُدْنَا فَإِنَّا ظَـٰلِمُونَ

Transliteration rabbanā akhrij'nā min'hā fa-in ʿud'nā fa-innā ẓālimūna

Telugu ఓ మా ప్రభూ! మమ్మల్ని దీని (ఈ నరకం) నుండి బయటకు తీయి. ఒకవేళ మేము మరల (పాపాలు) చేస్తే, మేము నిశ్చయంగా, దుర్మార్గులమే!"

Verse 108

قَالَ ٱخْسَـُٔوا۟ فِيهَا وَلَا تُكَلِّمُونِ

Transliteration qāla ikh'saū fīhā walā tukallimūni

Telugu ఆయన (అల్లాహ్) అంటాడు: "దానిలోనే పరాభవంతో పడి ఉండండి మరియు నాతో మాట్లాడకండి!"

Verse 109

إِنَّهُۥ كَانَ فَرِيقٌ مِّنْ عِبَادِى يَقُولُونَ رَبَّنَآ ءَامَنَّا فَٱغْفِرْ لَنَا وَٱرْحَمْنَا وَأَنتَ خَيْرُ ٱلرَّٰحِمِينَ

Transliteration innahu kāna farīqun min ʿibādī yaqūlūna rabbanā āmannā fa-igh'fir lanā wa-ir'ḥamnā wa-anta khayru l-rāḥimīna

Telugu నిశ్చయంగా, నా దాసులలో కొందరు ఇలా ప్రార్థించే వారున్నారు: "ఓ మా ప్రభూ! మేము విశ్వసించాము, మమ్మల్ని క్షమించు మరియు మమ్మల్ని కరుణించు మరియు కరుణించేవారిలో నీవే అత్యుత్తముడవు!"

Verse 110

فَٱتَّخَذْتُمُوهُمْ سِخْرِيًّا حَتَّىٰٓ أَنسَوْكُمْ ذِكْرِى وَكُنتُم مِّنْهُمْ تَضْحَكُونَ

Transliteration fa-ittakhadhtumūhum sikh'riyyan ḥattā ansawkum dhik'rī wakuntum min'hum taḍḥakūna

Telugu కాని మీరు వారిని పరిహాసానికి గురి చేసేవారు, చివరకు (ఆ పరిహాసమే) మిమ్మల్ని నా ధ్యానం నుండి మరపింపజేసింది; మరియు మీరు వారి మీద నవ్వేవారు (ఎగతాళి చేసేవారు)!

Verse 111

إِنِّى جَزَيْتُهُمُ ٱلْيَوْمَ بِمَا صَبَرُوٓا۟ أَنَّهُمْ هُمُ ٱلْفَآئِزُونَ

Transliteration innī jazaytuhumu l-yawma bimā ṣabarū annahum humu l-fāizūna

Telugu నిశ్చయంగా, ఈ రోజు నేను వారికి, వారి సహనానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చాను. నిశ్చయంగా వారే విజయం పొందినవారు!

Verse 112

قَـٰلَ كَمْ لَبِثْتُمْ فِى ٱلْأَرْضِ عَدَدَ سِنِينَ

Transliteration qāla kam labith'tum fī l-arḍi ʿadada sinīna

Telugu (అల్లాహ్) ఇలా ప్రశ్నిస్తాడు: "మీరు భూమిలో ఎన్ని సంవత్సరాలు గడిపారు?"

Verse 113

قَالُوا۟ لَبِثْنَا يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ فَسْـَٔلِ ٱلْعَآدِّينَ

Transliteration qālū labith'nā yawman aw baʿḍa yawmin fasali l-ʿādīna

Telugu వారిలా జవాబిస్తారు: "మేమక్కడ ఒక్క దినమో లేక దినపు కొంత భాగమో ఉంటిమి. లెక్క పెట్టిన వారిని అడుగు!"

Verse 114

قَـٰلَ إِن لَّبِثْتُمْ إِلَّا قَلِيلًا ۖ لَّوْ أَنَّكُمْ كُنتُمْ تَعْلَمُونَ

Transliteration qāla in labith'tum illā qalīlan law annakum kuntum taʿlamūna

Telugu (అల్లాహ్) అంటాడు: "మీరక్కడ ఉన్నది కొంతకాలం మాత్రమే! ఒకవేళ ఇది మీరు తెలుసుకొని ఉంటే (ఎంత బాగుండేది)!"

Verse 115

أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَـٰكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ

Transliteration afaḥasib'tum annamā khalaqnākum ʿabathan wa-annakum ilaynā lā tur'jaʿūna

Telugu "ఏమీ? వాస్తవానికి మేము మిమ్మల్ని వృథాగానే పుట్టించామని మరియు మీరు మా వైపునకు ఎన్నడూ మరలి రారని భావించారా?"

Verse 116

فَتَعَـٰلَى ٱللَّهُ ٱلْمَلِكُ ٱلْحَقُّ ۖ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ رَبُّ ٱلْعَرْشِ ٱلْكَرِيمِ

Transliteration fataʿālā l-lahu l-maliku l-ḥaqu lā ilāha illā huwa rabbu l-ʿarshi l-karīmi

Telugu కావున (తెలుసుకోండి) అల్లాహ్ అత్యున్నతుడు, నిజమైన విశ్వసార్వభౌముడు, ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే గౌరవప్రదమైన సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు!

Verse 117

وَمَن يَدْعُ مَعَ ٱللَّهِ إِلَـٰهًا ءَاخَرَ لَا بُرْهَـٰنَ لَهُۥ بِهِۦ فَإِنَّمَا حِسَابُهُۥ عِندَ رَبِّهِۦٓ ۚ إِنَّهُۥ لَا يُفْلِحُ ٱلْكَـٰفِرُونَ

Transliteration waman yadʿu maʿa l-lahi ilāhan ākhara lā bur'hāna lahu bihi fa-innamā ḥisābuhu ʿinda rabbihi innahu lā yuf'liḥu l-kāfirūna

Telugu ఇక ఎవడైనా అల్లాహ్ తో పాటు మరొక దైవాన్ని - తన వద్ద దాని కొరకు ఎలాంటి ఆధారం లేకుండానే - ప్రార్థిస్తాడో, నిశ్చయంగా అతని లెక్క అతని ప్రభువు వద్ద ఉంది. నిశ్చయంగా, సత్యతిరస్కారులు సాఫల్యము పొందలేరు.

Verse 118

وَقُل رَّبِّ ٱغْفِرْ وَٱرْحَمْ وَأَنتَ خَيْرُ ٱلرَّٰحِمِينَ

Transliteration waqul rabbi igh'fir wa-ir'ḥam wa-anta khayru l-rāḥimīna

Telugu కావున నీవు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! నన్ను క్షమించు, నన్ను కరుణించు, కరుణించేవారిలో నీవే అత్యుత్తముడవు!"

Read Surah Al-Mu'minun in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.