Surah Al-Mulk in Telugu: translation and audio
Surah 67 · الملك · The Sovereignty · 30 verses
Surah Al-Mulk verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Al-Mulk word by word in English.
Verse 1
تَبَـٰرَكَ ٱلَّذِى بِيَدِهِ ٱلْمُلْكُ وَهُوَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ
Transliteration tabāraka alladhī biyadihi l-mul'ku wahuwa ʿalā kulli shayin qadīrun
Telugu ఎవరి చేతిలోనయితే విశ్వసామ్రాజ్యాధిపత్యం ఉందో! ఆయన సర్వశ్రేష్ఠుడు (శుభదాయకుడు) మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు.
Verse 2
ٱلَّذِى خَلَقَ ٱلْمَوْتَ وَٱلْحَيَوٰةَ لِيَبْلُوَكُمْ أَيُّكُمْ أَحْسَنُ عَمَلًا ۚ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْغَفُورُ
Transliteration alladhī khalaqa l-mawta wal-ḥayata liyabluwakum ayyukum aḥsanu ʿamalan wahuwa l-ʿazīzu l-ghafūru
Telugu ఆయనే! మీలో మంచిపనులు చేసే వారెవరో పరీక్షించటానికి, చావు-బ్రతుకులను సృష్టించాడు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు.
Verse 3
ٱلَّذِى خَلَقَ سَبْعَ سَمَـٰوَٰتٍ طِبَاقًا ۖ مَّا تَرَىٰ فِى خَلْقِ ٱلرَّحْمَـٰنِ مِن تَفَـٰوُتٍ ۖ فَٱرْجِعِ ٱلْبَصَرَ هَلْ تَرَىٰ مِن فُطُورٍ
Transliteration alladhī khalaqa sabʿa samāwātin ṭibāqan mā tarā fī khalqi l-raḥmāni min tafāwutin fa-ir'jiʿi l-baṣara hal tarā min fuṭūrin
Telugu ఆయనే ఒకదానిపై ఒకటి ఏడు ఆకాశాలను సృష్టించాడు. ఆ అనంత కరుణా మయుని సృష్టిలో నీవు ఎలాంటి లోపాన్నీ చూడలేవు. కావాలంటే మరొకసారి చూడు: "ఏమీ? నీకేమైనా లోపం కనిపిస్తుందా?"
Verse 4
ثُمَّ ٱرْجِعِ ٱلْبَصَرَ كَرَّتَيْنِ يَنقَلِبْ إِلَيْكَ ٱلْبَصَرُ خَاسِئًا وَهُوَ حَسِيرٌ
Transliteration thumma ir'jiʿi l-baṣara karratayni yanqalib ilayka l-baṣaru khāsi-an wahuwa ḥasīrun
Telugu ఇంకా, మాటిమాటికీ నీ చూపులు త్రిప్పి చూడు. అది (నీ చూపు) విఫలమై అలిసి సొలిసి తిరిగి నీ వైపుకే వస్తుంది.
Verse 5
وَلَقَدْ زَيَّنَّا ٱلسَّمَآءَ ٱلدُّنْيَا بِمَصَـٰبِيحَ وَجَعَلْنَـٰهَا رُجُومًا لِّلشَّيَـٰطِينِ ۖ وَأَعْتَدْنَا لَهُمْ عَذَابَ ٱلسَّعِيرِ
Transliteration walaqad zayyannā l-samāa l-dun'yā bimaṣābīḥa wajaʿalnāhā rujūman lilshayāṭīni wa-aʿtadnā lahum ʿadhāba l-saʿīri
Telugu మరియు వాస్తవంగా, మేము భూమికి దగ్గరగా ఉన్న ఆకాశాన్ని దీపాలతో అలంకరించాము. మరియు వాటిని, షైతాన్ లను తరిమి కొట్టే సాధనాలుగా చేశాము. మరియు వారి కొరకు (షైతానుల కొరకు) మేము భగభగ మండే అగ్నిజ్వాలల శిక్షను సిద్ధపరచి ఉంచాము.
Verse 6
وَلِلَّذِينَ كَفَرُوا۟ بِرَبِّهِمْ عَذَابُ جَهَنَّمَ ۖ وَبِئْسَ ٱلْمَصِيرُ
Transliteration walilladhīna kafarū birabbihim ʿadhābu jahannama wabi'sa l-maṣīru
Telugu మరియు తన ప్రభువును (అల్లాహ్ ను) తిరస్కరించే వారికి నరకశిక్ష ఉంది. అది ఎంత చెడ్డ గమ్యస్థానం.
Verse 7
إِذَآ أُلْقُوا۟ فِيهَا سَمِعُوا۟ لَهَا شَهِيقًا وَهِىَ تَفُورُ
Transliteration idhā ul'qū fīhā samiʿū lahā shahīqan wahiya tafūru
Telugu వారు అందులోకి విసిరి వేయ బడినప్పుడు వారు దాని (భయంకరమైన) గర్జనను వింటారు. మరియు అది మరిగి పొంగుతూ ఉంటుంది.
Verse 8
تَكَادُ تَمَيَّزُ مِنَ ٱلْغَيْظِ ۖ كُلَّمَآ أُلْقِىَ فِيهَا فَوْجٌ سَأَلَهُمْ خَزَنَتُهَآ أَلَمْ يَأْتِكُمْ نَذِيرٌ
Transliteration takādu tamayyazu mina l-ghayẓi kullamā ul'qiya fīhā fawjun sa-alahum khazanatuhā alam yatikum nadhīrun
Telugu అది దాదాపు ఉద్రేకంగా ప్రేలిపోతూ ఉంటుంది. ప్రతిసారి అందులోకి (పాపుల) గుంపు పడవేయబడి నప్పుడు! దాని కాపలాదారులు వారితో: "ఏమీ? మీ వద్దకు ఏ హెచ్చరిక చేసేవాడు రాలేదు?" అని ప్రశ్నిస్తారు.
Verse 9
قَالُوا۟ بَلَىٰ قَدْ جَآءَنَا نَذِيرٌ فَكَذَّبْنَا وَقُلْنَا مَا نَزَّلَ ٱللَّهُ مِن شَىْءٍ إِنْ أَنتُمْ إِلَّا فِى ضَلَـٰلٍ كَبِيرٍ
Transliteration qālū balā qad jāanā nadhīrun fakadhabnā waqul'nā mā nazzala l-lahu min shayin in antum illā fī ḍalālin kabīrin
Telugu వారంటారు: "ఎందుకు రాలేదు! వాస్తవానికి మా వద్దకు హెచ్చరిక చేసేవాడు వచ్చాడు, కాని మేము అతనిని అసత్యుడవని తిరస్కరించాము మరియు అతనితో ఇలా అన్నాము: 'అల్లాహ్ దేనినీ (ఏ దివ్యజ్ఞానాన్ని) అవతరింప జేయలేదు; మీరు కేవలం ఘోర మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు!'"
Verse 10
وَقَالُوا۟ لَوْ كُنَّا نَسْمَعُ أَوْ نَعْقِلُ مَا كُنَّا فِىٓ أَصْحَـٰبِ ٱلسَّعِيرِ
Transliteration waqālū law kunnā nasmaʿu aw naʿqilu mā kunnā fī aṣḥābi l-saʿīri
Telugu ఇంకా వారు ఇలా అంటారు: "ఒకవేళ మేము విని ఉంటే లేదా గ్రహించి ఉంటే, మేము మండే అగ్నిజ్వాలలో పడి వుండే వారితో చేరే వారము కాము కదా!"
Verse 11
فَٱعْتَرَفُوا۟ بِذَنۢبِهِمْ فَسُحْقًا لِّأَصْحَـٰبِ ٱلسَّعِيرِ
Transliteration fa-iʿ'tarafū bidhanbihim fasuḥ'qan li-aṣḥābi l-saʿīri
Telugu అప్పుడు వారే స్వయంగా తమ పాపాన్ని ఒప్పుకుంటారు. కావున భగభగమండే అగ్నిజ్వాలలు దూరమై పోవుగాక!
Verse 12
إِنَّ ٱلَّذِينَ يَخْشَوْنَ رَبَّهُم بِٱلْغَيْبِ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ
Transliteration inna alladhīna yakhshawna rabbahum bil-ghaybi lahum maghfiratun wa-ajrun kabīrun
Telugu నిశ్చయంగా, ఎవరైతే అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో! వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి.
Verse 13
وَأَسِرُّوا۟ قَوْلَكُمْ أَوِ ٱجْهَرُوا۟ بِهِۦٓ ۖ إِنَّهُۥ عَلِيمٌۢ بِذَاتِ ٱلصُّدُورِ
Transliteration wa-asirrū qawlakum awi ij'harū bihi innahu ʿalīmun bidhāti l-ṣudūri
Telugu మరియు మీరు మీ మాటలను రహస్యంగా ఉంచినా సరే! లేక వాటిని వెల్లడి చేసినా సరే! నిశ్చయంగా, ఆయనకు హృదయాల స్థితి బాగా తెలుసు.
Verse 14
أَلَا يَعْلَمُ مَنْ خَلَقَ وَهُوَ ٱللَّطِيفُ ٱلْخَبِيرُ
Transliteration alā yaʿlamu man khalaqa wahuwa l-laṭīfu l-khabīru
Telugu ఏమిటీ? పుట్టించిన వాడికే తెలియదా? మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు!
Verse 15
هُوَ ٱلَّذِى جَعَلَ لَكُمُ ٱلْأَرْضَ ذَلُولًا فَٱمْشُوا۟ فِى مَنَاكِبِهَا وَكُلُوا۟ مِن رِّزْقِهِۦ ۖ وَإِلَيْهِ ٱلنُّشُورُ
Transliteration huwa alladhī jaʿala lakumu l-arḍa dhalūlan fa-im'shū fī manākibihā wakulū min riz'qihi wa-ilayhi l-nushūru
Telugu భూమిని మీ అధీనంలో ఉంచినవాడు ఆయనే! కావున మీరు దాని దారులలో తిరగండి. మరియు ఆయన ప్రసాదించిన జీవనోపాధిని తినండి, మరియు మీరు ఆయన వైపునకే సజీవులై మరలి పోవలసి ఉంది.
Verse 16
ءَأَمِنتُم مَّن فِى ٱلسَّمَآءِ أَن يَخْسِفَ بِكُمُ ٱلْأَرْضَ فَإِذَا هِىَ تَمُورُ
Transliteration a-amintum man fī l-samāi an yakhsifa bikumu l-arḍa fa-idhā hiya tamūru
Telugu ఏమీ? మీరు నిర్భయంగా ఉన్నారా? ఆకాశాలలో ఉన్నవాడు, మిమ్మల్ని భూమిలోకి అణగద్రొక్కడని, ఎప్పుడైతే అది తీవ్రకంపనాలకు గురి అవుతుందో?
Verse 17
أَمْ أَمِنتُم مَّن فِى ٱلسَّمَآءِ أَن يُرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا ۖ فَسَتَعْلَمُونَ كَيْفَ نَذِيرِ
Transliteration am amintum man fī l-samāi an yur'sila ʿalaykum ḥāṣiban fasataʿlamūna kayfa nadhīri
Telugu లేక ఆకాశాలలో ఉన్నవాడు, మీపైకి రాళ్ళు కురిపించే గాలివాన పంపడని మీరు నిర్భయంగా ఉన్నారా? నా హెచ్చరిక ఎలాంటిదో అప్పుడు మీరు తెలుసుకోగలరు.
Verse 18
وَلَقَدْ كَذَّبَ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ فَكَيْفَ كَانَ نَكِيرِ
Transliteration walaqad kadhaba alladhīna min qablihim fakayfa kāna nakīri
Telugu మరియు వాస్తవానికి వారికి పూర్వం గతించిన వారు కూడా (ప్రవక్తలను) తిరస్కరించారు. నా పట్టు (శిక్ష) ఎంత తీవ్రంగా ఉండిందో (చూశారా)?
Verse 19
أَوَلَمْ يَرَوْا۟ إِلَى ٱلطَّيْرِ فَوْقَهُمْ صَـٰٓفَّـٰتٍ وَيَقْبِضْنَ ۚ مَا يُمْسِكُهُنَّ إِلَّا ٱلرَّحْمَـٰنُ ۚ إِنَّهُۥ بِكُلِّ شَىْءٍۭ بَصِيرٌ
Transliteration awalam yaraw ilā l-ṭayri fawqahum ṣāffātin wayaqbiḍ'na mā yum'sikuhunna illā l-raḥmānu innahu bikulli shayin baṣīrun
Telugu ఏమీ? వారు తమ ఎగిరే పక్షులు రెక్కలను ఎలా చాపుతూ ముడుచుకుంటూ, ఎగురుతున్నాయో చూడటం లేదా? ఆ అనంత కరుణామయుడు తప్ప మరెవ్వరూ వాటిని అలా నిలిపి ఉంచలేరు కదా! నిశ్చయంగా ఆయన ప్రతి దానినీ చూస్తున్నాడు!
Verse 20
أَمَّنْ هَـٰذَا ٱلَّذِى هُوَ جُندٌ لَّكُمْ يَنصُرُكُم مِّن دُونِ ٱلرَّحْمَـٰنِ ۚ إِنِ ٱلْكَـٰفِرُونَ إِلَّا فِى غُرُورٍ
Transliteration amman hādhā alladhī huwa jundun lakum yanṣurukum min dūni l-raḥmāni ini l-kāfirūna illā fī ghurūrin
Telugu ఏమీ? అనంత కరుణామయుడు తప్ప మీకు సేన వలే అడ్డుగా నిలిచి, మీకు సహాయపడ గల వాడెవడైనా ఉన్నాడా? ఈ సత్యతిరస్కారులు కేవలం మోసంలో పడి వున్నారు.
Verse 21
أَمَّنْ هَـٰذَا ٱلَّذِى يَرْزُقُكُمْ إِنْ أَمْسَكَ رِزْقَهُۥ ۚ بَل لَّجُّوا۟ فِى عُتُوٍّ وَنُفُورٍ
Transliteration amman hādhā alladhī yarzuqukum in amsaka riz'qahu bal lajjū fī ʿutuwwin wanufūrin
Telugu ఒకవేళ ఆయన మీ జీవనోపాధిని ఆపి వేస్తే, మీకు జీవనోపాధి ఇచ్చేవాడు ఎవడున్నాడు? అయినా వారు తలబిరుసుతనంలో మునిగి (సత్యానికి) దూరమై పోతున్నారు.
Verse 22
أَفَمَن يَمْشِى مُكِبًّا عَلَىٰ وَجْهِهِۦٓ أَهْدَىٰٓ أَمَّن يَمْشِى سَوِيًّا عَلَىٰ صِرَٰطٍ مُّسْتَقِيمٍ
Transliteration afaman yamshī mukibban ʿalā wajhihi ahdā amman yamshī sawiyyan ʿalā ṣirāṭin mus'taqīmin
Telugu ఏమీ? ఎవడైతే తన ముఖం మీద దేవులాడుతూ నడుస్తాడో, అతడు సరైన మార్గం పొందుతాడా? లేక చక్కగా ఋజుమార్గం మీద నడిచేవాడు పొందుతాడా?
Verse 23
قُلْ هُوَ ٱلَّذِىٓ أَنشَأَكُمْ وَجَعَلَ لَكُمُ ٱلسَّمْعَ وَٱلْأَبْصَـٰرَ وَٱلْأَفْـِٔدَةَ ۖ قَلِيلًا مَّا تَشْكُرُونَ
Transliteration qul huwa alladhī ansha-akum wajaʿala lakumu l-samʿa wal-abṣāra wal-afidata qalīlan mā tashkurūna
Telugu వారితో ఇలా అను: "ఆయనే మిమ్మల్ని సృజించాడు. మరియు ఆయనే మీకు వినికిడినీ, దృష్టినీ మరియు హృదయాలనూ ఇచ్చాడు. (అయినా) మీరు కృతజ్ఞతలు తెలిపేది చాలా తక్కువ!"
Verse 24
قُلْ هُوَ ٱلَّذِى ذَرَأَكُمْ فِى ٱلْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ
Transliteration qul huwa alladhī dhara-akum fī l-arḍi wa-ilayhi tuḥ'sharūna
Telugu (ఇంకా) ఇలా అను: "ఆయనే మిమ్మల్ని భూమిలో వ్యాపింపజేశాడు మరియు ఆయన వద్దనే మీరంతా సమావేశ పరచబడతారు."
Verse 25
وَيَقُولُونَ مَتَىٰ هَـٰذَا ٱلْوَعْدُ إِن كُنتُمْ صَـٰدِقِينَ
Transliteration wayaqūlūna matā hādhā l-waʿdu in kuntum ṣādiqīna
Telugu మరియు వారు ఇలా అడుగుతున్నారు: "మీరు సత్యవంతులే అయితే, ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరనున్నది?"
Verse 26
قُلْ إِنَّمَا ٱلْعِلْمُ عِندَ ٱللَّهِ وَإِنَّمَآ أَنَا۠ نَذِيرٌ مُّبِينٌ
Transliteration qul innamā l-ʿil'mu ʿinda l-lahi wa-innamā anā nadhīrun mubīnun
Telugu వారితో ఇలా అను: "నిశ్చయంగా, దాని జ్ఞానం కేవలం అల్లాహ్ కే ఉంది. మరియు నేను స్పష్టంగా హెచ్చరిక చేసే వాడిని మాత్రమే!"
Verse 27
فَلَمَّا رَأَوْهُ زُلْفَةً سِيٓـَٔتْ وُجُوهُ ٱلَّذِينَ كَفَرُوا۟ وَقِيلَ هَـٰذَا ٱلَّذِى كُنتُم بِهِۦ تَدَّعُونَ
Transliteration falammā ra-awhu zul'fatan sīat wujūhu alladhīna kafarū waqīla hādhā alladhī kuntum bihi taddaʿūna
Telugu తరువాత వారు దానిని సమీపంలో ఉండటం చూసినప్పుడు, సత్యతిరస్కారుల ముఖాలు దుఃఖంతో నిండి నల్లబడిపోతాయి. మరియు వారితో ఇలా అనబడుతుంది: "మీరు దేనినయితే అడుగుతూ ఉండేవారో అది (ఆ వాగ్దానం) ఇదే!"
Verse 28
قُلْ أَرَءَيْتُمْ إِنْ أَهْلَكَنِىَ ٱللَّهُ وَمَن مَّعِىَ أَوْ رَحِمَنَا فَمَن يُجِيرُ ٱلْكَـٰفِرِينَ مِنْ عَذَابٍ أَلِيمٍ
Transliteration qul ara-aytum in ahlakaniya l-lahu waman maʿiya aw raḥimanā faman yujīru l-kāfirīna min ʿadhābin alīmin
Telugu (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "ఏమీ? మీరు ఆలోచించరా? ఒకవేళ అల్లాహ్ నన్ను మరియు నా తోటి వారిని నాశనం చేయనూ వచ్చు! లేదా మమ్మల్ని కరుణించనూ వచ్చు. కాని సత్యతిరస్కారులను బాధాకరమైన శిక్ష నుండి ఎవడు రక్షించగలడు?"
Verse 29
قُلْ هُوَ ٱلرَّحْمَـٰنُ ءَامَنَّا بِهِۦ وَعَلَيْهِ تَوَكَّلْنَا ۖ فَسَتَعْلَمُونَ مَنْ هُوَ فِى ضَلَـٰلٍ مُّبِينٍ
Transliteration qul huwa l-raḥmānu āmannā bihi waʿalayhi tawakkalnā fasataʿlamūna man huwa fī ḍalālin mubīnin
Telugu వారితో ఇంకా ఇలా అను: "ఆయనే అనంత కరుణామయుడు, మేము ఆయననే విశ్వసించాము మరియు ఆయననే నమ్ముకున్నాము. ఇక ఎవరు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారో త్వరలోనే మీరు తెలుసుకోగలరు!"
Verse 30
قُلْ أَرَءَيْتُمْ إِنْ أَصْبَحَ مَآؤُكُمْ غَوْرًا فَمَن يَأْتِيكُم بِمَآءٍ مَّعِينٍۭ
Transliteration qul ara-aytum in aṣbaḥa māukum ghawran faman yatīkum bimāin maʿīnin
Telugu వారితో ఇలా అను: "ఏమీ? మీరు ఆలోచించరా? ఒకవేళ మీ బావులలోని నీరు, భూమిలోనికి ఇంకి పోతే, ప్రవహించే ఈ నీటి ఊటలను మీ కొరకు ఎవడు బయటికి తేగలడు?"
Read Surah Al-Mulk in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Gujarati
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Telugu: the Qur’an in Telugu.
Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.