Surah Al-Ahzab in Telugu: translation and audio
Surah 33 · الأحزاب · The Combined Forces · 73 verses
Surah Al-Ahzab verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Al-Ahzab word by word in English.
Verse 1
يَـٰٓأَيُّهَا ٱلنَّبِىُّ ٱتَّقِ ٱللَّهَ وَلَا تُطِعِ ٱلْكَـٰفِرِينَ وَٱلْمُنَـٰفِقِينَ ۗ إِنَّ ٱللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا
Transliteration yāayyuhā l-nabiyu ittaqi l-laha walā tuṭiʿi l-kāfirīna wal-munāfiqīna inna l-laha kāna ʿalīman ḥakīman
Telugu ఓ ప్రవక్తా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండు మరియు సత్యతిరస్కారుల మరియు కపట విశ్వాసుల యొక్క అభిప్రాయాన్ని లక్ష్య పెట్టకు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనా పరుడు.
Verse 2
وَٱتَّبِعْ مَا يُوحَىٰٓ إِلَيْكَ مِن رَّبِّكَ ۚ إِنَّ ٱللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
Transliteration wa-ittabiʿ mā yūḥā ilayka min rabbika inna l-laha kāna bimā taʿmalūna khabīran
Telugu మరియు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానం (వహీని) మాత్రమే అనుసరించు. నిశ్చయంగా, అల్లాహ్ మీరు చేసేదంతా ఎరుగును.
Verse 3
وَتَوَكَّلْ عَلَى ٱللَّهِ ۚ وَكَفَىٰ بِٱللَّهِ وَكِيلًا
Transliteration watawakkal ʿalā l-lahi wakafā bil-lahi wakīlan
Telugu కావున అల్లాహ్ పైననే నమ్మకం ఉంచుకో మరియు కార్యసాధకుడుగా అల్లాహ్ చాలు.
Verse 4
مَّا جَعَلَ ٱللَّهُ لِرَجُلٍ مِّن قَلْبَيْنِ فِى جَوْفِهِۦ ۚ وَمَا جَعَلَ أَزْوَٰجَكُمُ ٱلَّـٰٓـِٔى تُظَـٰهِرُونَ مِنْهُنَّ أُمَّهَـٰتِكُمْ ۚ وَمَا جَعَلَ أَدْعِيَآءَكُمْ أَبْنَآءَكُمْ ۚ ذَٰلِكُمْ قَوْلُكُم بِأَفْوَٰهِكُمْ ۖ وَٱللَّهُ يَقُولُ ٱلْحَقَّ وَهُوَ يَهْدِى ٱلسَّبِيلَ
Transliteration mā jaʿala l-lahu lirajulin min qalbayni fī jawfihi wamā jaʿala azwājakumu allāī tuẓāhirūna min'hunna ummahātikum wamā jaʿala adʿiyāakum abnāakum dhālikum qawlukum bi-afwāhikum wal-lahu yaqūlu l-ḥaqa wahuwa yahdī l-sabīla
Telugu అల్లాహ్ ఏ వ్యక్తి ఎదలో కూడా రెండు హృదయాలు పెట్టలేదు. మరియు మీరు మీ భార్యలను 'తల్లులు' అని పలికి, జిహార్ చేసినంతటనే వారిని మీకు తల్లులుగా చేయలేదు. మరియు మీరు దత్త తీసుకొన్న వారిని మీ (కన్న) కుమారులుగా చేయలేదు. ఇవన్నీ మీరు మీ నోటితో పలికే మాటలు మాత్రమే! మరియు అల్లాహ్ సత్యం పలుకుతాడు మరియు ఆయన (ఋజు) మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.
Verse 5
ٱدْعُوهُمْ لِـَٔابَآئِهِمْ هُوَ أَقْسَطُ عِندَ ٱللَّهِ ۚ فَإِن لَّمْ تَعْلَمُوٓا۟ ءَابَآءَهُمْ فَإِخْوَٰنُكُمْ فِى ٱلدِّينِ وَمَوَٰلِيكُمْ ۚ وَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ فِيمَآ أَخْطَأْتُم بِهِۦ وَلَـٰكِن مَّا تَعَمَّدَتْ قُلُوبُكُمْ ۚ وَكَانَ ٱللَّهُ غَفُورًا رَّحِيمًا
Transliteration id'ʿūhum liābāihim huwa aqsaṭu ʿinda l-lahi fa-in lam taʿlamū ābāahum fa-ikh'wānukum fī l-dīni wamawālīkum walaysa ʿalaykum junāḥun fīmā akhṭatum bihi walākin mā taʿammadat qulūbukum wakāna l-lahu ghafūran raḥīman
Telugu వారిని (మీ దత్త పిల్లలను), వారి (వాస్తవ) తండ్రుల పేర్లతోనే కలిపి పిలవండి. అల్లాహ్ దృష్టిలో ఇదే న్యాయమైనది. ఒకవేళ వారి తండ్రులెవరో మీకు తెలియక పోతే, అపుడు వారు మీ ధార్మిక సోదరులు మరియు మీ స్నేహితులు. మీరు ఈ విషయంలో (ఇంత వరకు) చేసిన పొరపాటు గురించి మీ కెలాంటి పాపం లేదు, కాని ఇక ముందు మీరు ఉద్దేశ్యపూర్వకంగా చేస్తే (పాపం) అవుతుంది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
Verse 6
ٱلنَّبِىُّ أَوْلَىٰ بِٱلْمُؤْمِنِينَ مِنْ أَنفُسِهِمْ ۖ وَأَزْوَٰجُهُۥٓ أُمَّهَـٰتُهُمْ ۗ وَأُو۟لُوا۟ ٱلْأَرْحَامِ بَعْضُهُمْ أَوْلَىٰ بِبَعْضٍ فِى كِتَـٰبِ ٱللَّهِ مِنَ ٱلْمُؤْمِنِينَ وَٱلْمُهَـٰجِرِينَ إِلَّآ أَن تَفْعَلُوٓا۟ إِلَىٰٓ أَوْلِيَآئِكُم مَّعْرُوفًا ۚ كَانَ ذَٰلِكَ فِى ٱلْكِتَـٰبِ مَسْطُورًا
Transliteration al-nabiyu awlā bil-mu'minīna min anfusihim wa-azwājuhu ummahātuhum wa-ulū l-arḥāmi baʿḍuhum awlā bibaʿḍin fī kitābi l-lahi mina l-mu'minīna wal-muhājirīna illā an tafʿalū ilā awliyāikum maʿrūfan kāna dhālika fī l-kitābi masṭūran
Telugu విశ్వాసులకు (ముస్లింలకు), దైవప్రవక్త స్వయంగా తమ కంటే కూడా ముఖ్యుడు. మరియు అతని భార్యలు వారికి తల్లులు. అల్లాహ్ గ్రంథం ప్రకారం రక్తసంబంధీకులు - ఇతర విశ్వాసుల మరియు వలస వచ్చిన వారి (ముహాజిరీన్) కంటే - ఒకరి కొకరు ఎక్కువగా పరస్పర సంబంధం (హక్కులు) గలవారు. కాని! మీరు మీ స్నేహితులకు మేలు చేయగోరితే (అది వేరే విషయం)! వాస్తవానికి ఇదంతా గ్రంథంలో వ్రాయబడి వుంది.
Verse 7
وَإِذْ أَخَذْنَا مِنَ ٱلنَّبِيِّـۧنَ مِيثَـٰقَهُمْ وَمِنكَ وَمِن نُّوحٍ وَإِبْرَٰهِيمَ وَمُوسَىٰ وَعِيسَى ٱبْنِ مَرْيَمَ ۖ وَأَخَذْنَا مِنْهُم مِّيثَـٰقًا غَلِيظًا
Transliteration wa-idh akhadhnā mina l-nabiyīna mīthāqahum waminka wamin nūḥin wa-ib'rāhīma wamūsā waʿīsā ib'ni maryama wa-akhadhnā min'hum mīthāqan ghalīẓan
Telugu మరియు (జ్ఞాపకముంచుకో) వాస్తవానికి మేము ప్రవక్తలందరి నుండి వాగ్దానం తీసుకున్నాము మరియు నీతో (ఓ ముహమ్మద్), నూహ్ తో, ఇబ్రాహీమ్ తో, మూసాతో మరియు మర్యమ్ కుమారుడైన ఈసాతో కూడా! మరియు మేము వారందరి నుండి గట్టి వాగ్దానం తీసుకున్నాము.
Verse 8
لِّيَسْـَٔلَ ٱلصَّـٰدِقِينَ عَن صِدْقِهِمْ ۚ وَأَعَدَّ لِلْكَـٰفِرِينَ عَذَابًا أَلِيمًا
Transliteration liyasala l-ṣādiqīna ʿan ṣid'qihim wa-aʿadda lil'kāfirīna ʿadhāban alīman
Telugu ఇది సత్యవంతులను, వారి సత్యాన్ని గురించి ప్రశ్నించడానికి. మరియు ఆయన సత్యతిరస్కారుల కొరకు బాధాకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచాడు.
Verse 9
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱذْكُرُوا۟ نِعْمَةَ ٱللَّهِ عَلَيْكُمْ إِذْ جَآءَتْكُمْ جُنُودٌ فَأَرْسَلْنَا عَلَيْهِمْ رِيحًا وَجُنُودًا لَّمْ تَرَوْهَا ۚ وَكَانَ ٱللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرًا
Transliteration yāayyuhā alladhīna āmanū udh'kurū niʿ'mata l-lahi ʿalaykum idh jāatkum junūdun fa-arsalnā ʿalayhim rīḥan wajunūdan lam tarawhā wakāna l-lahu bimā taʿmalūna baṣīran
Telugu ఓ విశ్వాసులారా! అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ పైకి సైన్యాలు (దండెత్తి) వచ్చినపుడు, మేము వారి పైకి ఒక తుఫాను గాలిని మరియు మీకు కనబడని సైన్యాలను పంపాము. మరియు అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు.
Verse 10
إِذْ جَآءُوكُم مِّن فَوْقِكُمْ وَمِنْ أَسْفَلَ مِنكُمْ وَإِذْ زَاغَتِ ٱلْأَبْصَـٰرُ وَبَلَغَتِ ٱلْقُلُوبُ ٱلْحَنَاجِرَ وَتَظُنُّونَ بِٱللَّهِ ٱلظُّنُونَا۠
Transliteration idh jāūkum min fawqikum wamin asfala minkum wa-idh zāghati l-abṣāru wabalaghati l-qulūbu l-ḥanājira wataẓunnūna bil-lahi l-ẓunūnā
Telugu వారు (మీ శత్రువులు) మీ మీదకు పైనుండి మరియు క్రింది నుండి (దండెత్తి) వచ్చినపుడు మరియు మీ కళ్ళు (భయంతో) తిరిగిపోయి, మీ గుండెలు గొంతులోనికి వచ్చినపుడు, మీరు అల్లాహ్ ను గురించి పలువిధాలుగా ఊహించసాగారు.
Verse 11
هُنَالِكَ ٱبْتُلِىَ ٱلْمُؤْمِنُونَ وَزُلْزِلُوا۟ زِلْزَالًا شَدِيدًا
Transliteration hunālika ub'tuliya l-mu'minūna wazul'zilū zil'zālan shadīdan
Telugu అక్కడ (ఆ సమయంలో) విశ్వాసులు పరీక్షించబడ్డారు. మరియు దానితో వారు తీవ్రంగా కంపింప జేయబడ్డారు.
Verse 12
وَإِذْ يَقُولُ ٱلْمُنَـٰفِقُونَ وَٱلَّذِينَ فِى قُلُوبِهِم مَّرَضٌ مَّا وَعَدَنَا ٱللَّهُ وَرَسُولُهُۥٓ إِلَّا غُرُورًا
Transliteration wa-idh yaqūlu l-munāfiqūna wa-alladhīna fī qulūbihim maraḍun mā waʿadanā l-lahu warasūluhu illā ghurūran
Telugu మరియు ఆ సమయంలో, కపట విశ్వాసులు మరియు తమ హృదయాలలో రోగమున్న వారు: "అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు మాతో చేసిన వాగ్దానాలన్నీ బూటకాలు మాత్రమే!" అని అనసాగారు.
Verse 13
وَإِذْ قَالَت طَّآئِفَةٌ مِّنْهُمْ يَـٰٓأَهْلَ يَثْرِبَ لَا مُقَامَ لَكُمْ فَٱرْجِعُوا۟ ۚ وَيَسْتَـْٔذِنُ فَرِيقٌ مِّنْهُمُ ٱلنَّبِىَّ يَقُولُونَ إِنَّ بُيُوتَنَا عَوْرَةٌ وَمَا هِىَ بِعَوْرَةٍ ۖ إِن يُرِيدُونَ إِلَّا فِرَارًا
Transliteration wa-idh qālat ṭāifatun min'hum yāahla yathriba lā muqāma lakum fa-ir'jiʿū wayastadhinu farīqun min'humu l-nabiya yaqūlūna inna buyūtanā ʿawratun wamā hiya biʿawratin in yurīdūna illā firāran
Telugu అపుడు వారిలోని ఒక పక్షం వారు: "ఓ యస్ రిబ్ (మదీనా మునవ్వరా) ప్రజలారా! ఇక మీరు వీరిని (శత్రువులను) ఎదిరించలేరు. కనుక వెనుదిరగండి!" అని అన్నారు. మరియు వారిలో మరొక వర్గం వారు ప్రవక్తతో ఈ విధంగా పలుకుతూ (వెనుదిరిగి) పోవటానికి అనుమతి అడగసాగారు: "మా ఇండ్లు భద్రంగా లేవు." కాని వాస్తవానికి అవి భద్రంగానే ఉండెను. వారు కేవలం అక్కడి నుండి పారిపోదలచారు.
Verse 14
وَلَوْ دُخِلَتْ عَلَيْهِم مِّنْ أَقْطَارِهَا ثُمَّ سُئِلُوا۟ ٱلْفِتْنَةَ لَـَٔاتَوْهَا وَمَا تَلَبَّثُوا۟ بِهَآ إِلَّا يَسِيرًا
Transliteration walaw dukhilat ʿalayhim min aqṭārihā thumma su-ilū l-fit'nata laātawhā wamā talabbathū bihā illā yasīran
Telugu ఒకవేళ నగరపు చుట్టుప్రక్కల నుండి శత్రువులు లోపలికి దూరి, వారిని విద్రోహ చర్యలకు పాల్పడమని పిలిస్తే, వారు వెంటనే సమ్మతించే వారు, మరియు వారు దాని కోసం ఏ మాత్రం ఆలస్యం చేసేవారు కాదు.
Verse 15
وَلَقَدْ كَانُوا۟ عَـٰهَدُوا۟ ٱللَّهَ مِن قَبْلُ لَا يُوَلُّونَ ٱلْأَدْبَـٰرَ ۚ وَكَانَ عَهْدُ ٱللَّهِ مَسْـُٔولًا
Transliteration walaqad kānū ʿāhadū l-laha min qablu lā yuwallūna l-adbāra wakāna ʿahdu l-lahi masūlan
Telugu వాస్తవానికి వారు ఇంతకు ముందు, తాము వెన్ను చూపి పారిపోమని, అల్లాహ్ తో వాగ్దానం చేసి ఉన్నారు. మరియు అల్లాహ్ తో చేసిన వాగ్దానం గురించి తప్పక ప్రశ్నించటం జరుగుతుంది.
Verse 16
قُل لَّن يَنفَعَكُمُ ٱلْفِرَارُ إِن فَرَرْتُم مِّنَ ٱلْمَوْتِ أَوِ ٱلْقَتْلِ وَإِذًا لَّا تُمَتَّعُونَ إِلَّا قَلِيلًا
Transliteration qul lan yanfaʿakumu l-firāru in farartum mina l-mawti awi l-qatli wa-idhan lā tumattaʿūna illā qalīlan
Telugu వారితో ఇలా అను: "ఒకవేళ మీరు మరణం నుండి గానీ, లేదా హత్య నుండి గానీ, పారిపోదలచు కుంటే! ఆ పారిపోవటం మీకు ఏ మాత్రం లాభదాయకం కాదు. అప్పుడు మీరు కేవలం కొంతకాలం మాత్రమే సుఖసంతోషాలు అనుభవిస్తారు!"
Verse 17
قُلْ مَن ذَا ٱلَّذِى يَعْصِمُكُم مِّنَ ٱللَّهِ إِنْ أَرَادَ بِكُمْ سُوٓءًا أَوْ أَرَادَ بِكُمْ رَحْمَةً ۚ وَلَا يَجِدُونَ لَهُم مِّن دُونِ ٱللَّهِ وَلِيًّا وَلَا نَصِيرًا
Transliteration qul man dhā alladhī yaʿṣimukum mina l-lahi in arāda bikum sūan aw arāda bikum raḥmatan walā yajidūna lahum min dūni l-lahi waliyyan walā naṣīran
Telugu వారితో ఇంకా ఇలా అను: "ఒకవేళ అల్లాహ్ మీకు కీడు చేయదలిస్తే! లేదా కరుణించదలిస్తే! ఆయన నుండి మిమ్మల్ని తప్పించే వాడెవడు?" మరియు వారు అల్లాహ్ ను వదలి ఇతరుణ్ణి ఎవడినీ సంరక్షకునిగా గానీ లేక సహాయకునిగా గానీ పొందలేరు.
Verse 18
۞ قَدْ يَعْلَمُ ٱللَّهُ ٱلْمُعَوِّقِينَ مِنكُمْ وَٱلْقَآئِلِينَ لِإِخْوَٰنِهِمْ هَلُمَّ إِلَيْنَا ۖ وَلَا يَأْتُونَ ٱلْبَأْسَ إِلَّا قَلِيلًا
Transliteration qad yaʿlamu l-lahu l-muʿawiqīna minkum wal-qāilīna li-ikh'wānihim halumma ilaynā walā yatūna l-basa illā qalīlan
Telugu వాస్తవానికి మీలో ఎవరు ఇతరులను (యుద్ధం నుండి) ఆటంక పరుస్తూ ఉన్నారో మరియు తమ సోదరులతో: "మా వైపునకు రండి!" అని పలుకుతూ ఉన్నారో, అలాంటి వారందరి గురించి, అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు వారు మాత్రం యుద్ధంలో చాలా తక్కువగా పాల్గొనేవారు;
Verse 19
أَشِحَّةً عَلَيْكُمْ ۖ فَإِذَا جَآءَ ٱلْخَوْفُ رَأَيْتَهُمْ يَنظُرُونَ إِلَيْكَ تَدُورُ أَعْيُنُهُمْ كَٱلَّذِى يُغْشَىٰ عَلَيْهِ مِنَ ٱلْمَوْتِ ۖ فَإِذَا ذَهَبَ ٱلْخَوْفُ سَلَقُوكُم بِأَلْسِنَةٍ حِدَادٍ أَشِحَّةً عَلَى ٱلْخَيْرِ ۚ أُو۟لَـٰٓئِكَ لَمْ يُؤْمِنُوا۟ فَأَحْبَطَ ٱللَّهُ أَعْمَـٰلَهُمْ ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرًا
Transliteration ashiḥḥatan ʿalaykum fa-idhā jāa l-khawfu ra-aytahum yanẓurūna ilayka tadūru aʿyunuhum ka-alladhī yugh'shā ʿalayhi mina l-mawti fa-idhā dhahaba l-khawfu salaqūkum bi-alsinatin ḥidādin ashiḥḥatan ʿalā l-khayri ulāika lam yu'minū fa-aḥbaṭa l-lahu aʿmālahum wakāna dhālika ʿalā l-lahi yasīran
Telugu (మీకు తోడ్పడే విషయంలో) వారు పరమ లోభులుగా ఉండేవారు. (ఓ ప్రవక్తా!) వారి పైకి ప్రమాదం వచ్చినపుడు వారు (నీ సహాయం కోరుతూ) మరణం ఆసన్నమైన వ్యక్తి కనుగ్రుడ్లు త్రిప్పే విధంగా నీ వైపుకు తిరిగి చూడటాన్ని, నీవు చూస్తావు. కాని ఆ ప్రమాదం తొలగిపోయిన వెంటనే, వారు లాభాలను పొందే ఉద్దేశంతో, కత్తెర వలే ఆడే నాలుకలతో మీతో బడాయీలు చెప్పుకుంటారు. అలాంటి వారు ఏ మాత్రం విశ్వసించలేదు. కావున, అల్లాహ్ వారి కర్మలను నిరర్థకం చేశాడు. మరియు ఇది అల్లాహ్ కు ఎంతో సులభం.
Verse 20
يَحْسَبُونَ ٱلْأَحْزَابَ لَمْ يَذْهَبُوا۟ ۖ وَإِن يَأْتِ ٱلْأَحْزَابُ يَوَدُّوا۟ لَوْ أَنَّهُم بَادُونَ فِى ٱلْأَعْرَابِ يَسْـَٔلُونَ عَنْ أَنۢبَآئِكُمْ ۖ وَلَوْ كَانُوا۟ فِيكُم مَّا قَـٰتَلُوٓا۟ إِلَّا قَلِيلًا
Transliteration yaḥsabūna l-aḥzāba lam yadhhabū wa-in yati l-aḥzābu yawaddū law annahum bādūna fī l-aʿrābi yasalūna ʿan anbāikum walaw kānū fīkum mā qātalū illā qalīlan
Telugu దాడి చేసిన వర్గాలు ఇంకా వెళ్ళి పోలేదు అనే వారు భావిస్తున్నారు. ఒకవేళ ఆ వర్గాలు తిరిగి మళ్ళీ దాడి చేస్తే! ఎడారి వాసులతో (బద్దూలతో) కలిసి నివసించి అక్కడి నుండి మీ వృత్తాంతాలను తెలుసుకుంటే బాగుండేది కదా! అని అనుకుంటారు. ఒకవేళ వారు మీతో పాటు ఉన్నా చాలా తక్కువగా యుద్ధంలో పాల్గొని ఉండేవారు.
Verse 21
لَّقَدْ كَانَ لَكُمْ فِى رَسُولِ ٱللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ لِّمَن كَانَ يَرْجُوا۟ ٱللَّهَ وَٱلْيَوْمَ ٱلْـَٔاخِرَ وَذَكَرَ ٱللَّهَ كَثِيرًا
Transliteration laqad kāna lakum fī rasūli l-lahi us'watun ḥasanatun liman kāna yarjū l-laha wal-yawma l-ākhira wadhakara l-laha kathīran
Telugu వాస్తవానికి, అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది, వారి కొరకు ఎవరైతే అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని ఆశిస్తారో మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తారో!
Verse 22
وَلَمَّا رَءَا ٱلْمُؤْمِنُونَ ٱلْأَحْزَابَ قَالُوا۟ هَـٰذَا مَا وَعَدَنَا ٱللَّهُ وَرَسُولُهُۥ وَصَدَقَ ٱللَّهُ وَرَسُولُهُۥ ۚ وَمَا زَادَهُمْ إِلَّآ إِيمَـٰنًا وَتَسْلِيمًا
Transliteration walammā raā l-mu'minūna l-aḥzāba qālū hādhā mā waʿadanā l-lahu warasūluhu waṣadaqa l-lahu warasūluhu wamā zādahum illā īmānan wataslīman
Telugu మరియు విశ్వాసులు, దాడి చేసిన వర్గాల వారిని చూసినపుడు ఇలా పలికారు: "అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు సత్యం పలికారు." ఇది వారి విశ్వాసాన్ని మరియు అల్లాహ్ పట్ల వారి విధేయతను మరింత అధికమే చేసింది.
Verse 23
مِّنَ ٱلْمُؤْمِنِينَ رِجَالٌ صَدَقُوا۟ مَا عَـٰهَدُوا۟ ٱللَّهَ عَلَيْهِ ۖ فَمِنْهُم مَّن قَضَىٰ نَحْبَهُۥ وَمِنْهُم مَّن يَنتَظِرُ ۖ وَمَا بَدَّلُوا۟ تَبْدِيلًا
Transliteration mina l-mu'minīna rijālun ṣadaqū mā ʿāhadū l-laha ʿalayhi famin'hum man qaḍā naḥbahu wamin'hum man yantaẓiru wamā baddalū tabdīlan
Telugu విశ్వాసులలో అల్లాహ్ కు తాము చేసిన ఒప్పందం నిజం చేసి చూపినవారు కూడా ఉన్నారు. వారిలో కొందరు తమ శపథాన్ని పూర్తి చేసుకున్న వారున్నారు, మరికొందరు దానిని పూర్తి చేసుకోవటానికి నిరీక్షిస్తున్నారు. మరియు వారు తమ వైఖరిని ఏ మాత్రం మార్చుకోలేదు.
Verse 24
لِّيَجْزِىَ ٱللَّهُ ٱلصَّـٰدِقِينَ بِصِدْقِهِمْ وَيُعَذِّبَ ٱلْمُنَـٰفِقِينَ إِن شَآءَ أَوْ يَتُوبَ عَلَيْهِمْ ۚ إِنَّ ٱللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا
Transliteration liyajziya l-lahu l-ṣādiqīna biṣid'qihim wayuʿadhiba l-munāfiqīna in shāa aw yatūba ʿalayhim inna l-laha kāna ghafūran raḥīman
Telugu అల్లాహ్, సత్యవంతులకు వారి సత్యానికి ప్రతిఫలం నొసంగటానికి మరియు కపట విశ్వాసులకు తాను కోరితే శిక్ష విధించటానికి లేదా వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించటానికి ఇలా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
Verse 25
وَرَدَّ ٱللَّهُ ٱلَّذِينَ كَفَرُوا۟ بِغَيْظِهِمْ لَمْ يَنَالُوا۟ خَيْرًا ۚ وَكَفَى ٱللَّهُ ٱلْمُؤْمِنِينَ ٱلْقِتَالَ ۚ وَكَانَ ٱللَّهُ قَوِيًّا عَزِيزًا
Transliteration waradda l-lahu alladhīna kafarū bighayẓihim lam yanālū khayran wakafā l-lahu l-mu'minīna l-qitāla wakāna l-lahu qawiyyan ʿazīzan
Telugu మరియు అల్లాహ్ అవిశ్వాసులను వారి క్రోధావేశంతోనే - వారికెలాంటి మేలు లభింప జేయకుండా - వెనుకకు మరలించాడు. యుద్ధరంగంలో విశ్వాసులకు అల్లాహ్ యే (సహాయకునిగా) మిగిలాడు. వాస్తవంగా అల్లాహ్ మహా బలవంతుడు, సర్వశక్తిమంతుడు.
Verse 26
وَأَنزَلَ ٱلَّذِينَ ظَـٰهَرُوهُم مِّنْ أَهْلِ ٱلْكِتَـٰبِ مِن صَيَاصِيهِمْ وَقَذَفَ فِى قُلُوبِهِمُ ٱلرُّعْبَ فَرِيقًا تَقْتُلُونَ وَتَأْسِرُونَ فَرِيقًا
Transliteration wa-anzala alladhīna ẓāharūhum min ahli l-kitābi min ṣayāṣīhim waqadhafa fī qulūbihimu l-ruʿ'ba farīqan taqtulūna watasirūna farīqan
Telugu మరియు గ్రంథ ప్రజలలో నుండి వారికి (అవిశ్వాసులకు యుద్ధంలో) తోడ్పడిన వారిని ఆయన (అల్లాహ్) వారి కోటల నుండి క్రిందికి తీసుకు వచ్చాడు. మరియు వారి హృదయాలలో భీతిని ప్రవేశింపజేశాడు. వారిలో కొందరిని మీరు చంపుతున్నారు, మరికొందరిని ఖైదీలుగా చేసుకుంటున్నారు.
Verse 27
وَأَوْرَثَكُمْ أَرْضَهُمْ وَدِيَـٰرَهُمْ وَأَمْوَٰلَهُمْ وَأَرْضًا لَّمْ تَطَـُٔوهَا ۚ وَكَانَ ٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرًا
Transliteration wa-awrathakum arḍahum wadiyārahum wa-amwālahum wa-arḍan lam taṭaūhā wakāna l-lahu ʿalā kulli shayin qadīran
Telugu మరియు ఆయన (అల్లాహ్) వారి భూమికి, వారి ఇండ్లకు మరియు వారి ఆస్తులకు మిమ్మల్ని వారసులుగా చేశాడు. మరియు మీరు ఎన్నడూ అడుగుమోపని భూమికి కూడా, (మిమ్మల్ని వారసులుగా చేశాడు). మరియు వాస్తవంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.
Verse 28
يَـٰٓأَيُّهَا ٱلنَّبِىُّ قُل لِّأَزْوَٰجِكَ إِن كُنتُنَّ تُرِدْنَ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا وَزِينَتَهَا فَتَعَالَيْنَ أُمَتِّعْكُنَّ وَأُسَرِّحْكُنَّ سَرَاحًا جَمِيلًا
Transliteration yāayyuhā l-nabiyu qul li-azwājika in kuntunna turid'na l-ḥayata l-dun'yā wazīnatahā fataʿālayna umattiʿ'kunna wa-usarriḥ'kunna sarāḥan jamīlan
Telugu ఓ ప్రవక్తా! నీవు నీ భార్యలతో ఇలా అను: "ఒకవేళ మీరు ప్రాపంచిక జీవితాన్ని మరియు దాని శోభను కోరుతున్నట్లైతే, రండి నేను మీకు తప్పక జీవన సామాగ్రినిచ్చి, మిమ్మల్ని మంచి పద్ధతిలో విడిచి పెడతాను."
Verse 29
وَإِن كُنتُنَّ تُرِدْنَ ٱللَّهَ وَرَسُولَهُۥ وَٱلدَّارَ ٱلْـَٔاخِرَةَ فَإِنَّ ٱللَّهَ أَعَدَّ لِلْمُحْسِنَـٰتِ مِنكُنَّ أَجْرًا عَظِيمًا
Transliteration wa-in kuntunna turid'na l-laha warasūlahu wal-dāra l-ākhirata fa-inna l-laha aʿadda lil'muḥ'sināti minkunna ajran ʿaẓīman
Telugu "కాని ఒకవేళ మీరు అల్లాహ్ ను మరియు ఆయన సందేశహరుణ్ణి మరియు పరలోక గృహాన్ని కోరుతున్నట్లైతే, నిశ్చయంగా, అల్లాహ్ మలో సజ్జనులైన వారికి గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు."
Verse 30
يَـٰنِسَآءَ ٱلنَّبِىِّ مَن يَأْتِ مِنكُنَّ بِفَـٰحِشَةٍ مُّبَيِّنَةٍ يُضَـٰعَفْ لَهَا ٱلْعَذَابُ ضِعْفَيْنِ ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرًا
Transliteration yānisāa l-nabiyi man yati minkunna bifāḥishatin mubayyinatin yuḍāʿaf lahā l-ʿadhābu ḍiʿ'fayni wakāna dhālika ʿalā l-lahi yasīran
Telugu ఓ ప్రవక్త స్త్రీలారా! మీలో ఎవరైనా స్పష్టంగా అనుచితమైన పనికి పాల్పడితే ఆమెకు రెట్టింపు శిక్ష విధించబడుతుంది. మరియు వాస్తవంగా, ఇది అల్లాహ్ కు ఎంతో సులభం.
Verse 31
۞ وَمَن يَقْنُتْ مِنكُنَّ لِلَّهِ وَرَسُولِهِۦ وَتَعْمَلْ صَـٰلِحًا نُّؤْتِهَآ أَجْرَهَا مَرَّتَيْنِ وَأَعْتَدْنَا لَهَا رِزْقًا كَرِيمًا
Transliteration waman yaqnut minkunna lillahi warasūlihi wataʿmal ṣāliḥan nu'tihā ajrahā marratayni wa-aʿtadnā lahā riz'qan karīman
Telugu మరియు మీలో ఏ స్త్రీ అయితే అల్లాహ్ కు మరియు ఆయన సందేశహరునికి విధేయురాలై ఉండి సత్కార్యాలు చేస్తుందో, ఆమెకు రెట్టింపు ప్రతిఫలమిస్తాము మరియు ఆమె కొరకు గౌరవప్రదమైన జీవనోపాధిని సిద్ధపరచి ఉంచాము.
Verse 32
يَـٰنِسَآءَ ٱلنَّبِىِّ لَسْتُنَّ كَأَحَدٍ مِّنَ ٱلنِّسَآءِ ۚ إِنِ ٱتَّقَيْتُنَّ فَلَا تَخْضَعْنَ بِٱلْقَوْلِ فَيَطْمَعَ ٱلَّذِى فِى قَلْبِهِۦ مَرَضٌ وَقُلْنَ قَوْلًا مَّعْرُوفًا
Transliteration yānisāa l-nabiyi lastunna ka-aḥadin mina l-nisāi ini ittaqaytunna falā takhḍaʿna bil-qawli fayaṭmaʿa alladhī fī qalbihi maraḍun waqul'na qawlan maʿrūfan
Telugu ఓ ప్రవక్త భార్యలారా! మీరు సాధారణ స్త్రీల వంటి వారు కారు. మీరు దైవభీతి గలవారైతే మీరు మెత్తని స్వరంతో మాట్లాడకండి. ఎందుకంటే! దానితో తన హృదయంలో రోగమున్న వానికి దుర్భుద్ధి పుట్టవచ్చు. కావున మీరు స్పష్టంగా, సూటిగానే మాట్లాడండి.
Verse 33
وَقَرْنَ فِى بُيُوتِكُنَّ وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ ٱلْجَـٰهِلِيَّةِ ٱلْأُولَىٰ ۖ وَأَقِمْنَ ٱلصَّلَوٰةَ وَءَاتِينَ ٱلزَّكَوٰةَ وَأَطِعْنَ ٱللَّهَ وَرَسُولَهُۥٓ ۚ إِنَّمَا يُرِيدُ ٱللَّهُ لِيُذْهِبَ عَنكُمُ ٱلرِّجْسَ أَهْلَ ٱلْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيرًا
Transliteration waqarna fī buyūtikunna walā tabarrajna tabarruja l-jāhiliyati l-ūlā wa-aqim'na l-ṣalata waātīna l-zakata wa-aṭiʿ'na l-laha warasūlahu innamā yurīdu l-lahu liyudh'hiba ʿankumu l-rij'sa ahla l-bayti wayuṭahhirakum taṭhīran
Telugu మరియు మీరు మీ ఇండ్లలోనే ఉండిండి మరియు పూర్వపు అజ్ఞానకాలంలో అలంకరణను ప్రదర్శిస్తూ తిరిగినట్లు తిరగకండి. మరియు నమాజ్ స్థాపించండి మరియు విధిదానం (జకాత్) ఇవ్వండి మరియు అల్లాహ్ కు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి. (ఓ ప్రవక్త) గృహిణులారా! నిశ్చయంగా, అల్లాహ్ మీ నుండి మాలిన్యాన్ని తొలగించి, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయగోరు తున్నాడు.
Verse 34
وَٱذْكُرْنَ مَا يُتْلَىٰ فِى بُيُوتِكُنَّ مِنْ ءَايَـٰتِ ٱللَّهِ وَٱلْحِكْمَةِ ۚ إِنَّ ٱللَّهَ كَانَ لَطِيفًا خَبِيرًا
Transliteration wa-udh'kur'na mā yut'lā fī buyūtikunna min āyāti l-lahi wal-ḥik'mati inna l-laha kāna laṭīfan khabīran
Telugu మరియు మీ ఇండ్లలో వినిపించబడే అల్లాహ్ ఆయతులను మరియు జ్ఞాన విషయాలను (హదీస్ లను) స్మరిస్తూ ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ అత్యంత సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసిన వాడు.
Verse 35
إِنَّ ٱلْمُسْلِمِينَ وَٱلْمُسْلِمَـٰتِ وَٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَـٰتِ وَٱلْقَـٰنِتِينَ وَٱلْقَـٰنِتَـٰتِ وَٱلصَّـٰدِقِينَ وَٱلصَّـٰدِقَـٰتِ وَٱلصَّـٰبِرِينَ وَٱلصَّـٰبِرَٰتِ وَٱلْخَـٰشِعِينَ وَٱلْخَـٰشِعَـٰتِ وَٱلْمُتَصَدِّقِينَ وَٱلْمُتَصَدِّقَـٰتِ وَٱلصَّـٰٓئِمِينَ وَٱلصَّـٰٓئِمَـٰتِ وَٱلْحَـٰفِظِينَ فُرُوجَهُمْ وَٱلْحَـٰفِظَـٰتِ وَٱلذَّٰكِرِينَ ٱللَّهَ كَثِيرًا وَٱلذَّٰكِرَٰتِ أَعَدَّ ٱللَّهُ لَهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا
Transliteration inna l-mus'limīna wal-mus'limāti wal-mu'minīna wal-mu'mināti wal-qānitīna wal-qānitāti wal-ṣādiqīna wal-ṣādiqāti wal-ṣābirīna wal-ṣābirāti wal-khāshiʿīna wal-khāshiʿāti wal-mutaṣadiqīna wal-mutaṣadiqāti wal-ṣāimīna wal-ṣāimāti wal-ḥāfiẓīna furūjahum wal-ḥāfiẓāti wal-dhākirīna l-laha kathīran wal-dhākirāti aʿadda l-lahu lahum maghfiratan wa-ajran ʿaẓīman
Telugu నిశ్చయంగా, ముస్లిం (అల్లాహ్ కు విధేయులైన) పురుషులు మరియు ముస్లిం స్త్రీలు; విశ్వాసులైన (ము'మిన్) పురుషులు మరియు విశ్వాసులైన (ము'మిన్) స్త్రీలు; భక్తిపరులైన పురుషులు మరియు భక్తిపరులైన స్త్రీలు; సత్యవంతులైన పురుషులు మరియు సత్యవంతులైన స్త్రీలు; ఓర్పు గల పురుషులు మరియు ఓర్పు గల స్త్రీలు; వినమ్రత గల పురుషులు మరియు వినమ్రత గల స్త్రీలు; దానశీలురైన పురుషులు మరియు దానశీలురైన స్త్రీలు; ఉపవాసాలు ఉండే పురుషులు మరియు ఉపవాసాలు ఉండే స్త్రీలు; తమ మర్గాంగాలను కాపాడుకునే పురుషులు మరియు (తమ మర్మాంగాలను) కాపాడుకునే స్త్రీలు; మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే స్త్రీలు; ఇలాంటి వారి కొరకు అల్లాహ్ క్షమాభిక్ష మరియు గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు.
Verse 36
وَمَا كَانَ لِمُؤْمِنٍ وَلَا مُؤْمِنَةٍ إِذَا قَضَى ٱللَّهُ وَرَسُولُهُۥٓ أَمْرًا أَن يَكُونَ لَهُمُ ٱلْخِيَرَةُ مِنْ أَمْرِهِمْ ۗ وَمَن يَعْصِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدْ ضَلَّ ضَلَـٰلًا مُّبِينًا
Transliteration wamā kāna limu'minin walā mu'minatin idhā qaḍā l-lahu warasūluhu amran an yakūna lahumu l-khiyaratu min amrihim waman yaʿṣi l-laha warasūlahu faqad ḍalla ḍalālan mubīnan
Telugu మరియు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు, ఒక విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు, విశ్వసించిన పురుషునికి గానీ లేక విశ్వసించిన స్త్రీకి గానీ ఆ విషయంలో మరొక నిర్ణయం తీసుకునే హక్కు లేదు. మరియు ఎవడైతే అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికి అవిధేయుడవుతాడో, వాస్తవంగా, అతడు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నట్లే!
Verse 37
وَإِذْ تَقُولُ لِلَّذِىٓ أَنْعَمَ ٱللَّهُ عَلَيْهِ وَأَنْعَمْتَ عَلَيْهِ أَمْسِكْ عَلَيْكَ زَوْجَكَ وَٱتَّقِ ٱللَّهَ وَتُخْفِى فِى نَفْسِكَ مَا ٱللَّهُ مُبْدِيهِ وَتَخْشَى ٱلنَّاسَ وَٱللَّهُ أَحَقُّ أَن تَخْشَىٰهُ ۖ فَلَمَّا قَضَىٰ زَيْدٌ مِّنْهَا وَطَرًا زَوَّجْنَـٰكَهَا لِكَىْ لَا يَكُونَ عَلَى ٱلْمُؤْمِنِينَ حَرَجٌ فِىٓ أَزْوَٰجِ أَدْعِيَآئِهِمْ إِذَا قَضَوْا۟ مِنْهُنَّ وَطَرًا ۚ وَكَانَ أَمْرُ ٱللَّهِ مَفْعُولًا
Transliteration wa-idh taqūlu lilladhī anʿama l-lahu ʿalayhi wa-anʿamta ʿalayhi amsik ʿalayka zawjaka wa-ittaqi l-laha watukh'fī fī nafsika mā l-lahu mub'dīhi watakhshā l-nāsa wal-lahu aḥaqqu an takhshāhu falammā qaḍā zaydun min'hā waṭaran zawwajnākahā likay lā yakūna ʿalā l-mu'minīna ḥarajun fī azwāji adʿiyāihim idhā qaḍaw min'hunna waṭaran wakāna amru l-lahi mafʿūlan
Telugu మరియు (ఓ ప్రవక్తా జ్ఞాపకం చేసుకో!) అల్లాహ్ అనుగ్రహించిన మరియు నీవు అనుగ్రహించిన వ్యక్తితో నీవు: "నీ భార్యను ఉండనివ్వు (విడిచి పెట్టకు) మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండు." అని అన్నప్పుడు; నీవు అల్లాహ్ బయట పెట్టదలచిన విషయాన్ని, నీ మనస్సులో దాచి ఉంచావు. నీవు ప్రజలకు భయపడ్డావు, వాస్తవానికి నీవు అల్లాహ్ కు భయపడటమే చాలా ఉత్తమమైనది. జైద్, ఆమెతో తన సంబంధాన్ని తన ఇచ్ఛానుసారంగా త్రెంపుకున్న తరువాతనే, మేము ఆమె వివాహం నీతో జరిపించాము. విశ్వాసులకు తమ దత్తపుత్రుల భార్యలతో పెండ్లి చేసుకోవటంలో - వారు తమ భార్యల నుండి తమ ఇష్టానుసారంగా తమ సంబంధం త్రెంపు కున్నప్పుడు - ఏ విధమైన దోషం లేదు. వాస్తవానికి అల్లాహ్ ఆదేశం తప్పక అమలులోకి రావలసిందే!
Verse 38
مَّا كَانَ عَلَى ٱلنَّبِىِّ مِنْ حَرَجٍ فِيمَا فَرَضَ ٱللَّهُ لَهُۥ ۖ سُنَّةَ ٱللَّهِ فِى ٱلَّذِينَ خَلَوْا۟ مِن قَبْلُ ۚ وَكَانَ أَمْرُ ٱللَّهِ قَدَرًا مَّقْدُورًا
Transliteration mā kāna ʿalā l-nabiyi min ḥarajin fīmā faraḍa l-lahu lahu sunnata l-lahi fī alladhīna khalaw min qablu wakāna amru l-lahi qadaran maqdūran
Telugu అల్లాహ్ తన కొరకు ధర్మసమ్మతం చేసిన దానిని ప్రవక్త పూర్తి చేస్తే, అతనిపై ఎలాంటి నింద లేదు. ఇంతకు పూర్వం గతించిన వారి విషయంలో కూడా అల్లాహ్ సంప్రదాయం ఇదే. మరియు అల్లాహ్ ఆజ్ఞ, నిర్దేశింపబడిన (తిరుగులేని) శాసనం;
Verse 39
ٱلَّذِينَ يُبَلِّغُونَ رِسَـٰلَـٰتِ ٱللَّهِ وَيَخْشَوْنَهُۥ وَلَا يَخْشَوْنَ أَحَدًا إِلَّا ٱللَّهَ ۗ وَكَفَىٰ بِٱللَّهِ حَسِيبًا
Transliteration alladhīna yuballighūna risālāti l-lahi wayakhshawnahu walā yakhshawna aḥadan illā l-laha wakafā bil-lahi ḥasīban
Telugu వారికి, ఎవరైతే అల్లాహ్ సందేశాలను అందజేస్తారో మరియు కేవలం ఆయనకే భయపడతారో మరియు అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడరో! మరియు లెక్క తీసుకోవటానికి కేవలం అల్లాహ్ యే చాలు!
Verse 40
مَّا كَانَ مُحَمَّدٌ أَبَآ أَحَدٍ مِّن رِّجَالِكُمْ وَلَـٰكِن رَّسُولَ ٱللَّهِ وَخَاتَمَ ٱلنَّبِيِّـۧنَ ۗ وَكَانَ ٱللَّهُ بِكُلِّ شَىْءٍ عَلِيمًا
Transliteration mā kāna muḥammadun abā aḥadin min rijālikum walākin rasūla l-lahi wakhātama l-nabiyīna wakāna l-lahu bikulli shayin ʿalīman
Telugu (ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు. మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతి విషయపు జ్ఞానం గలవాడు.
Verse 41
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱذْكُرُوا۟ ٱللَّهَ ذِكْرًا كَثِيرًا
Transliteration yāayyuhā alladhīna āmanū udh'kurū l-laha dhik'ran kathīran
Telugu ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను (ఏకాగ్రతతో) అత్యధికంగా స్మరించండి.
Verse 42
وَسَبِّحُوهُ بُكْرَةً وَأَصِيلًا
Transliteration wasabbiḥūhu buk'ratan wa-aṣīlan
Telugu మరియు ఉదయం మరియు సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండండి.
Verse 43
هُوَ ٱلَّذِى يُصَلِّى عَلَيْكُمْ وَمَلَـٰٓئِكَتُهُۥ لِيُخْرِجَكُم مِّنَ ٱلظُّلُمَـٰتِ إِلَى ٱلنُّورِ ۚ وَكَانَ بِٱلْمُؤْمِنِينَ رَحِيمًا
Transliteration huwa alladhī yuṣallī ʿalaykum wamalāikatuhu liyukh'rijakum mina l-ẓulumāti ilā l-nūri wakāna bil-mu'minīna raḥīman
Telugu ఆయన మీపై ఆశీర్వాదాలు (సలాత్) పంపుతూ ఉంటాడు మరియు ఆయన దూతలు మిమ్మల్ని అంధకారం నుండి వెలుగులోకి తీసుకు రావటానికి (ఆయనను ప్రార్థిస్తూ ఉంటారు). మరియు ఆయన విశ్వాసుల పట్ల అపార కరుణా ప్రదాత.
Verse 44
تَحِيَّتُهُمْ يَوْمَ يَلْقَوْنَهُۥ سَلَـٰمٌ ۚ وَأَعَدَّ لَهُمْ أَجْرًا كَرِيمًا
Transliteration taḥiyyatuhum yawma yalqawnahu salāmun wa-aʿadda lahum ajran karīman
Telugu వారు ఆయనను కలుసుకునే రోజున వారికి: "మీకు శాంతి కలుగు గాక (సలాం)!" అనే అభినందనలతో స్వాగతం లభిస్తుంది. మరియు ఆయన వారి కొరకు గౌరవప్రదమైన ప్రతిఫలం సిద్ధపరచి ఉంచాడు.
Verse 45
يَـٰٓأَيُّهَا ٱلنَّبِىُّ إِنَّآ أَرْسَلْنَـٰكَ شَـٰهِدًا وَمُبَشِّرًا وَنَذِيرًا
Transliteration yāayyuhā l-nabiyu innā arsalnāka shāhidan wamubashiran wanadhīran
Telugu ఓ ప్రవక్తా! నిశ్చయంగా మేము, నిన్ను సాక్షిగా, శుభవార్త అందజేసేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా పంపాము!
Verse 46
وَدَاعِيًا إِلَى ٱللَّهِ بِإِذْنِهِۦ وَسِرَاجًا مُّنِيرًا
Transliteration wadāʿiyan ilā l-lahi bi-idh'nihi wasirājan munīran
Telugu మరియు ఆయన అనుమతితో, అల్లాహ్ వైపునకు పిలిచేవానిగా మరియు ప్రకాశించే దీపంగానూ (చేసి పంపాము)!
Verse 47
وَبَشِّرِ ٱلْمُؤْمِنِينَ بِأَنَّ لَهُم مِّنَ ٱللَّهِ فَضْلًا كَبِيرًا
Transliteration wabashiri l-mu'minīna bi-anna lahum mina l-lahi faḍlan kabīran
Telugu మరియు నిశ్చయంగా, వారి మీద అల్లాహ్ యొక్క గొప్ప అనుగ్రహం ఉందనే శుభవార్తను విశ్వాసులకు ఇవ్వు.
Verse 48
وَلَا تُطِعِ ٱلْكَـٰفِرِينَ وَٱلْمُنَـٰفِقِينَ وَدَعْ أَذَىٰهُمْ وَتَوَكَّلْ عَلَى ٱللَّهِ ۚ وَكَفَىٰ بِٱللَّهِ وَكِيلًا
Transliteration walā tuṭiʿi l-kāfirīna wal-munāfiqīna wadaʿ adhāhum watawakkal ʿalā l-lahi wakafā bil-lahi wakīlan
Telugu మరియు నీవు సత్యతిరస్కారుల మరియు కపట విశ్వాసుల మాటలకు లోబడకు మరియు వారి వేధింపులను లక్ష్య పెట్టకు మరియు కేవలం అల్లాహ్ నే నమ్ముకో మరియు కార్యకర్తగా కేవలం అల్లాహ్ యే చాలు!
Verse 49
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِذَا نَكَحْتُمُ ٱلْمُؤْمِنَـٰتِ ثُمَّ طَلَّقْتُمُوهُنَّ مِن قَبْلِ أَن تَمَسُّوهُنَّ فَمَا لَكُمْ عَلَيْهِنَّ مِنْ عِدَّةٍ تَعْتَدُّونَهَا ۖ فَمَتِّعُوهُنَّ وَسَرِّحُوهُنَّ سَرَاحًا جَمِيلًا
Transliteration yāayyuhā alladhīna āmanū idhā nakaḥtumu l-mu'mināti thumma ṭallaqtumūhunna min qabli an tamassūhunna famā lakum ʿalayhinna min ʿiddatin taʿtaddūnahā famattiʿūhunna wasarriḥūhunna sarāḥan jamīlan
Telugu ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసినులైన స్త్రీలను వివాహమాడి, తరువాత - మీరు వారిని తాకక పూర్వమే - వారికి విడాకులిచ్చినట్లైతే, మీ కొరకు వేచి వుండే వ్యవధి (ఇద్దత్) పూర్తి చేయమని అడిగే హక్కు మీకు వారిపై లేదు. కనుక వారికి పారితోషికం ఇచ్చి, మంచితనంతో వారిని సాగనంపండి.
Verse 50
يَـٰٓأَيُّهَا ٱلنَّبِىُّ إِنَّآ أَحْلَلْنَا لَكَ أَزْوَٰجَكَ ٱلَّـٰتِىٓ ءَاتَيْتَ أُجُورَهُنَّ وَمَا مَلَكَتْ يَمِينُكَ مِمَّآ أَفَآءَ ٱللَّهُ عَلَيْكَ وَبَنَاتِ عَمِّكَ وَبَنَاتِ عَمَّـٰتِكَ وَبَنَاتِ خَالِكَ وَبَنَاتِ خَـٰلَـٰتِكَ ٱلَّـٰتِى هَاجَرْنَ مَعَكَ وَٱمْرَأَةً مُّؤْمِنَةً إِن وَهَبَتْ نَفْسَهَا لِلنَّبِىِّ إِنْ أَرَادَ ٱلنَّبِىُّ أَن يَسْتَنكِحَهَا خَالِصَةً لَّكَ مِن دُونِ ٱلْمُؤْمِنِينَ ۗ قَدْ عَلِمْنَا مَا فَرَضْنَا عَلَيْهِمْ فِىٓ أَزْوَٰجِهِمْ وَمَا مَلَكَتْ أَيْمَـٰنُهُمْ لِكَيْلَا يَكُونَ عَلَيْكَ حَرَجٌ ۗ وَكَانَ ٱللَّهُ غَفُورًا رَّحِيمًا
Transliteration yāayyuhā l-nabiyu innā aḥlalnā laka azwājaka allātī ātayta ujūrahunna wamā malakat yamīnuka mimmā afāa l-lahu ʿalayka wabanāti ʿammika wabanāti ʿammātika wabanāti khālika wabanāti khālātika allātī hājarna maʿaka wa-im'ra-atan mu'minatan in wahabat nafsahā lilnnabiyyi in arāda l-nabiyu an yastankiḥahā khāliṣatan laka min dūni l-mu'minīna qad ʿalim'nā mā faraḍnā ʿalayhim fī azwājihim wamā malakat aymānuhum likaylā yakūna ʿalayka ḥarajun wakāna l-lahu ghafūran raḥīman
Telugu ఓ ప్రవక్తా! నిశ్చయంగా, మేము నీకు: నీవు మహ్ర్ చెల్లించిన నీ భార్యలను మరియు అల్లాహ్ ప్రసాదించిన (బానిస) స్త్రీల నుండి నీ ఆధీనంలోకి వచ్చిన వారిని (స్త్రీలను) మరియు నీతో పాటు వలస వచ్చిన నీ పినతండ్రి (తండ్రి సోదరుల) కుమార్తెలను మరియు నీ మేనత్తల (తండ్రి సోదరీమణుల) కుమార్తెలను మరియు నీ మేనమామల (తల్లిసోదరుల) కుమార్తెలను మరియు నీ పినతల్లుల (తల్లిసోదరీమణుల) కుమార్తెలను; మరియు తనను తాను ప్రవక్తకు సమర్పించుకున్న విశ్వాసిని అయిన స్త్రీని - ఒకవేళ ప్రవక్త ఆమెను వివాహం చేసుకోదలిస్తే ఇతర విశ్వాసుల కొరకు గాక ప్రత్యేకంగా నీ కొరకే - ధర్మసమ్మతం చేశాము. వాస్తవానికి వారి (ఇతర విశ్వాసుల) కొరకు, వారి భార్యల విషయంలో మరియు వారి బానిసల విషయంలో, మేము విధించిన పరిమితులు మాకు బాగా తెలుసు. ఇదంతా మేము నీకు ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా ఉండాలని చేశాము. వాస్తవానికి అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
Verse 51
۞ تُرْجِى مَن تَشَآءُ مِنْهُنَّ وَتُـْٔوِىٓ إِلَيْكَ مَن تَشَآءُ ۖ وَمَنِ ٱبْتَغَيْتَ مِمَّنْ عَزَلْتَ فَلَا جُنَاحَ عَلَيْكَ ۚ ذَٰلِكَ أَدْنَىٰٓ أَن تَقَرَّ أَعْيُنُهُنَّ وَلَا يَحْزَنَّ وَيَرْضَيْنَ بِمَآ ءَاتَيْتَهُنَّ كُلُّهُنَّ ۚ وَٱللَّهُ يَعْلَمُ مَا فِى قُلُوبِكُمْ ۚ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَلِيمًا
Transliteration tur'jī man tashāu min'hunna watu'wī ilayka man tashāu wamani ib'taghayta mimman ʿazalta falā junāḥa ʿalayka dhālika adnā an taqarra aʿyunuhunna walā yaḥzanna wayarḍayna bimā ātaytahunna kulluhunna wal-lahu yaʿlamu mā fī qulūbikum wakāna l-lahu ʿalīman ḥalīman
Telugu నీవు వారిలో (నీ భార్యలలో) నుండి, నీవు కోరిన ఆమెను నీ నుండి కొంత కాలం వేరుగా ఉంచవచ్చు. మరియు నీవు కోరిన ఆమెను నీతోపాటు ఉంచవచ్చు. మరియు నీవు వేరుగా ఉంచిన వారిలో నుండి ఏ స్త్రీనైనా నీవు తిరిగి పిలుచుకోగోరితే, నీపై ఎలాంటి దోషం లేదు. దీనితో వారి కళ్లకు చల్లదనం కలుగుతుందని, వారు దుఃఖపడరనీ నీవు వారికి ఏమి ఇచ్చినా, వారు సంతోషపడతారని ఆశించవచ్చు! వాస్తవానికి మీ హృదయాలలో ఏముందో అల్లాహ్ కు తెలుసు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, శాంత స్వభావుడు (సహన శీలుడు).
Verse 52
لَّا يَحِلُّ لَكَ ٱلنِّسَآءُ مِنۢ بَعْدُ وَلَآ أَن تَبَدَّلَ بِهِنَّ مِنْ أَزْوَٰجٍ وَلَوْ أَعْجَبَكَ حُسْنُهُنَّ إِلَّا مَا مَلَكَتْ يَمِينُكَ ۗ وَكَانَ ٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍ رَّقِيبًا
Transliteration lā yaḥillu laka l-nisāu min baʿdu walā an tabaddala bihinna min azwājin walaw aʿjabaka ḥus'nuhunna illā mā malakat yamīnuka wakāna l-lahu ʿalā kulli shayin raqīban
Telugu వీరు గాక, ఇతర స్త్రీలు నీకు (వివాహమాడటానికి) ధర్మసమ్మతం కారు. వీరికి బదులుగా కూడా మరెవ్వరినీ భార్యలుగా తీసుకునే అనుమతి కూడా నీకు లేదు - వారి సౌందర్యం నీకు ఎంత నచ్చినా - నీ ఆధీనంలో ఉన్న (బానిస) స్త్రీలు తప్ప! వాస్తవానికి అల్లాహ్ ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు.
Verse 53
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَدْخُلُوا۟ بُيُوتَ ٱلنَّبِىِّ إِلَّآ أَن يُؤْذَنَ لَكُمْ إِلَىٰ طَعَامٍ غَيْرَ نَـٰظِرِينَ إِنَىٰهُ وَلَـٰكِنْ إِذَا دُعِيتُمْ فَٱدْخُلُوا۟ فَإِذَا طَعِمْتُمْ فَٱنتَشِرُوا۟ وَلَا مُسْتَـْٔنِسِينَ لِحَدِيثٍ ۚ إِنَّ ذَٰلِكُمْ كَانَ يُؤْذِى ٱلنَّبِىَّ فَيَسْتَحْىِۦ مِنكُمْ ۖ وَٱللَّهُ لَا يَسْتَحْىِۦ مِنَ ٱلْحَقِّ ۚ وَإِذَا سَأَلْتُمُوهُنَّ مَتَـٰعًا فَسْـَٔلُوهُنَّ مِن وَرَآءِ حِجَابٍ ۚ ذَٰلِكُمْ أَطْهَرُ لِقُلُوبِكُمْ وَقُلُوبِهِنَّ ۚ وَمَا كَانَ لَكُمْ أَن تُؤْذُوا۟ رَسُولَ ٱللَّهِ وَلَآ أَن تَنكِحُوٓا۟ أَزْوَٰجَهُۥ مِنۢ بَعْدِهِۦٓ أَبَدًا ۚ إِنَّ ذَٰلِكُمْ كَانَ عِندَ ٱللَّهِ عَظِيمًا
Transliteration yāayyuhā alladhīna āmanū lā tadkhulū buyūta l-nabiyi illā an yu'dhana lakum ilā ṭaʿāmin ghayra nāẓirīna ināhu walākin idhā duʿītum fa-ud'khulū fa-idhā ṭaʿim'tum fa-intashirū walā mus'tanisīna liḥadīthin inna dhālikum kāna yu'dhī l-nabiya fayastaḥyī minkum wal-lahu lā yastaḥyī mina l-ḥaqi wa-idhā sa-altumūhunna matāʿan fasalūhunna min warāi ḥijābin dhālikum aṭharu liqulūbikum waqulūbihinna wamā kāna lakum an tu'dhū rasūla l-lahi walā an tankiḥū azwājahu min baʿdihi abadan inna dhālikum kāna ʿinda l-lahi ʿaẓīman
Telugu ఓ విశ్వాసులారా! ప్రవక్త యొక్క ఇండ్లలోకి అనుమతి లేకుండా ప్రవేశించకండి. భోజనార్థం (పిలువబడినపుడు) ఆహారం సిద్ధపరిచే సమయం కొరకు వేచి ఉండకండి, కాని మీరు పిలువబడి నప్పుడు తప్పకుండా వెళ్ళండి. అయితే భోజనం చేసిన వెంటనే వెళ్ళిపొండి మరియు సాధారణ సంభాషణలో కాలక్షేపం చేస్తూ కూర్చోకండి. నిశ్చయంగా, దీని వలన ప్రవక్తకు కష్టం కలుగుతుంది; కాని అతను మిమ్మల్ని (పొమ్మనటానికి) సంకోచిస్తాడు. మరియు అల్లాహ్ సత్యం చెప్పటానికి సంకోచించడు (సిగ్గు పడడు). మరియు మీరు ప్రవక్త భార్యలతో ఏదైనా అడగ వలసి వచ్చినప్పుడు తెరచాటు నుండి అడగండి. ఇది మీ హృదయాలను మరియు వారి హృదయాలను కూడా నిర్మలంగా ఉంచుతుంది. మరియు అల్లాహ్ సందేశహరునికి కష్టం కలిగించటం మీకు తగదు. మరియు అతని తరువాత అతని భార్యలతో మీరు ఎన్నటికీ వివాహం చేసుకోకండి. నిశ్చయంగా ఇది అల్లాహ్ దృష్టిలో మహా అపరాధం.
Verse 54
إِن تُبْدُوا۟ شَيْـًٔا أَوْ تُخْفُوهُ فَإِنَّ ٱللَّهَ كَانَ بِكُلِّ شَىْءٍ عَلِيمًا
Transliteration in tub'dū shayan aw tukh'fūhu fa-inna l-laha kāna bikulli shayin ʿalīman
Telugu ఒకవేళ మీరు ఏ విషయాన్నైనా వెలిబుచ్చినా లేదా దానిని దాచినా! నిశ్చయంగా, అల్లాహ్ కు మాత్రం ప్రతి విషయం గురించి బాగా తెలుసు.
Verse 55
لَّا جُنَاحَ عَلَيْهِنَّ فِىٓ ءَابَآئِهِنَّ وَلَآ أَبْنَآئِهِنَّ وَلَآ إِخْوَٰنِهِنَّ وَلَآ أَبْنَآءِ إِخْوَٰنِهِنَّ وَلَآ أَبْنَآءِ أَخَوَٰتِهِنَّ وَلَا نِسَآئِهِنَّ وَلَا مَا مَلَكَتْ أَيْمَـٰنُهُنَّ ۗ وَٱتَّقِينَ ٱللَّهَ ۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَىٰ كُلِّ شَىْءٍ شَهِيدًا
Transliteration lā junāḥa ʿalayhinna fī ābāihinna walā abnāihinna walā ikh'wānihinna walā abnāi ikh'wānihinna walā abnāi akhawātihinna walā nisāihinna walā mā malakat aymānuhunna wa-ittaqīna l-laha inna l-laha kāna ʿalā kulli shayin shahīdan
Telugu వారిపై (ప్రవక్త భార్యలపై) - తమ తండ్రుల, తమ కుమారుల, తమ సోదరుల, తమ సోదరీమణుల కుమారుల, తమ స్త్రీల లేదా తమ బానిస (స్త్రీల) - యెదుట వస్తే ఎలాంటి దోషం లేదు. (ఓ స్త్రీలారా!) మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి దానికి సాక్షి;
Verse 56
إِنَّ ٱللَّهَ وَمَلَـٰٓئِكَتَهُۥ يُصَلُّونَ عَلَى ٱلنَّبِىِّ ۚ يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ صَلُّوا۟ عَلَيْهِ وَسَلِّمُوا۟ تَسْلِيمًا
Transliteration inna l-laha wamalāikatahu yuṣallūna ʿalā l-nabiyi yāayyuhā alladhīna āmanū ṣallū ʿalayhi wasallimū taslīman
Telugu నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్తపై దరూద్ లు పంపుతూ ఉంటారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దరూద్ లు మరియు మీ హృదయ పూర్వక సలాంలు పంపుతూ ఉండండి.
Verse 57
إِنَّ ٱلَّذِينَ يُؤْذُونَ ٱللَّهَ وَرَسُولَهُۥ لَعَنَهُمُ ٱللَّهُ فِى ٱلدُّنْيَا وَٱلْـَٔاخِرَةِ وَأَعَدَّ لَهُمْ عَذَابًا مُّهِينًا
Transliteration inna alladhīna yu'dhūna l-laha warasūlahu laʿanahumu l-lahu fī l-dun'yā wal-ākhirati wa-aʿadda lahum ʿadhāban muhīnan
Telugu నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికి బాధ కలిగిస్తారో, వారిని అల్లాహ్ ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా శపిస్తాడు (బహిష్కరిస్తాడు) మరియు ఆయన వారికై అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు.
Verse 58
وَٱلَّذِينَ يُؤْذُونَ ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَـٰتِ بِغَيْرِ مَا ٱكْتَسَبُوا۟ فَقَدِ ٱحْتَمَلُوا۟ بُهْتَـٰنًا وَإِثْمًا مُّبِينًا
Transliteration wa-alladhīna yu'dhūna l-mu'minīna wal-mu'mināti bighayri mā ik'tasabū faqadi iḥ'tamalū buh'tānan wa-ith'man mubīnan
Telugu మరియు ఎవరైతే, ఏ తప్పూ చేయని, విశ్వాసులైన పురుషులకు మరియు స్త్రీలకు బాధ కలిగిస్తారో, వాస్తవానికి వారు అపనిందను మరియు స్పష్టమైన పాపభారాన్ని తమ మీద మోపుకున్నట్లే!
Verse 59
يَـٰٓأَيُّهَا ٱلنَّبِىُّ قُل لِّأَزْوَٰجِكَ وَبَنَاتِكَ وَنِسَآءِ ٱلْمُؤْمِنِينَ يُدْنِينَ عَلَيْهِنَّ مِن جَلَـٰبِيبِهِنَّ ۚ ذَٰلِكَ أَدْنَىٰٓ أَن يُعْرَفْنَ فَلَا يُؤْذَيْنَ ۗ وَكَانَ ٱللَّهُ غَفُورًا رَّحِيمًا
Transliteration yāayyuhā l-nabiyu qul li-azwājika wabanātika wanisāi l-mu'minīna yud'nīna ʿalayhinna min jalābībihinna dhālika adnā an yuʿ'rafna falā yu'dhayna wakāna l-lahu ghafūran raḥīman
Telugu ఓ ప్రవక్తా! నీ భార్యలతో, నీ కుమార్తెలతో మరియు విశ్వాసినులైన స్త్రీలతోనూ తమ దుప్పట్లను తమ మీద పూర్తిగా కప్పుకోమని చెప్పు. ఇది వారు గుర్తించబడి బాధింపబడ కుండా ఉండటానికి ఎంతో సముచితమైనది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
Verse 60
۞ لَّئِن لَّمْ يَنتَهِ ٱلْمُنَـٰفِقُونَ وَٱلَّذِينَ فِى قُلُوبِهِم مَّرَضٌ وَٱلْمُرْجِفُونَ فِى ٱلْمَدِينَةِ لَنُغْرِيَنَّكَ بِهِمْ ثُمَّ لَا يُجَاوِرُونَكَ فِيهَآ إِلَّا قَلِيلًا
Transliteration la-in lam yantahi l-munāfiqūna wa-alladhīna fī qulūbihim maraḍun wal-mur'jifūna fī l-madīnati lanugh'riyannaka bihim thumma lā yujāwirūnaka fīhā illā qalīlan
Telugu ఒకవేళ ఈ కపట విశ్వాసులు మరియు తమ హృదయాలలో రోగం (కలుషితం) ఉన్న వారు మరియు మదీనాలో వదంతులు వ్యాపింప జేసేవారు. తమ (దుశ్చేష్టలను) మానుకోక పోతే, మేము తప్పక నీకు వారిపై ఆధిక్యత నొసంగుతాము. ఆ తరువాత వారు ఈ నగరంలో నీ పొరుగు వారిగా కొన్నాళ్ళ కంటే ఎక్కువ ఉండలేరు.
Verse 61
مَّلْعُونِينَ ۖ أَيْنَمَا ثُقِفُوٓا۟ أُخِذُوا۟ وَقُتِّلُوا۟ تَقْتِيلًا
Transliteration malʿūnīna aynamā thuqifū ukhidhū waquttilū taqtīlan
Telugu వారు శపించబడ్డ (బహిష్కరించబడ్డ) వారు. వారు ఎక్కడ కనబడితే అక్కడ పట్టుకోబడతారు మరియు వారు దారుణంగా చంపబడతారు.
Verse 62
سُنَّةَ ٱللَّهِ فِى ٱلَّذِينَ خَلَوْا۟ مِن قَبْلُ ۖ وَلَن تَجِدَ لِسُنَّةِ ٱللَّهِ تَبْدِيلًا
Transliteration sunnata l-lahi fī alladhīna khalaw min qablu walan tajida lisunnati l-lahi tabdīlan
Telugu ఇది ఇంతకు పూర్వం గడిచిన వారి విషయంలో జరుగుతున్న అల్లాహ్ సంప్రదాయమే! మరియు అల్లాహ్ సంప్రదాయంలో నీవు ఎలాంటి మార్పును చూడవు.
Verse 63
يَسْـَٔلُكَ ٱلنَّاسُ عَنِ ٱلسَّاعَةِ ۖ قُلْ إِنَّمَا عِلْمُهَا عِندَ ٱللَّهِ ۚ وَمَا يُدْرِيكَ لَعَلَّ ٱلسَّاعَةَ تَكُونُ قَرِيبًا
Transliteration yasaluka l-nāsu ʿani l-sāʿati qul innamā ʿil'muhā ʿinda l-lahi wamā yud'rīka laʿalla l-sāʿata takūnu qarīban
Telugu ప్రజలు నిన్ను అంతిమ ఘడియ (పునరుత్థానం) ను గురించి అడుగు తున్నారు. వారితో ఇలా అను: "దాని జ్ఞానం కేవలం అల్లాహ్ కే ఉంది." మరియు నీకెలా తెలియదు? బహుశా ఆ ఘడియ సమీపంలోనే ఉండవచ్చు!
Verse 64
إِنَّ ٱللَّهَ لَعَنَ ٱلْكَـٰفِرِينَ وَأَعَدَّ لَهُمْ سَعِيرًا
Transliteration inna l-laha laʿana l-kāfirīna wa-aʿadda lahum saʿīran
Telugu నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులను శపించాడు (బహిష్కరించాడు) మరియు ఆయన వారి కొరకు మండే (నరక) అగ్నిని సిద్ధపరచి ఉంచాడు.
Verse 65
خَـٰلِدِينَ فِيهَآ أَبَدًا ۖ لَّا يَجِدُونَ وَلِيًّا وَلَا نَصِيرًا
Transliteration khālidīna fīhā abadan lā yajidūna waliyyan walā naṣīran
Telugu వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు. వారు ఎలాంటి సంరక్షకుణ్ణి గానీ సహాయకుణ్ణి గానీ పొందలేరు.
Verse 66
يَوْمَ تُقَلَّبُ وُجُوهُهُمْ فِى ٱلنَّارِ يَقُولُونَ يَـٰلَيْتَنَآ أَطَعْنَا ٱللَّهَ وَأَطَعْنَا ٱلرَّسُولَا۠
Transliteration yawma tuqallabu wujūhuhum fī l-nāri yaqūlūna yālaytanā aṭaʿnā l-laha wa-aṭaʿnā l-rasūlā
Telugu వారి ముఖాలు నిప్పులపై బొర్లింప బడిన నాడు; వారు: "అయ్యే! మేము అల్లాహ్ కు విధేయులమై ఉండి, సందేశహరుణ్ణి అనుసరించి ఉంటే ఎంత బాగుండేది?" అని వాపోతారు.
Verse 67
وَقَالُوا۟ رَبَّنَآ إِنَّآ أَطَعْنَا سَادَتَنَا وَكُبَرَآءَنَا فَأَضَلُّونَا ٱلسَّبِيلَا۠
Transliteration waqālū rabbanā innā aṭaʿnā sādatanā wakubarāanā fa-aḍallūnā l-sabīlā
Telugu వారు ఇంకా ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము మా నాయకులను మరియు మా పెద్దలను అనుసరించాము. కాని, వారే మమ్మల్ని (ఋజు) మార్గం నుండి తప్పించారు."
Verse 68
رَبَّنَآ ءَاتِهِمْ ضِعْفَيْنِ مِنَ ٱلْعَذَابِ وَٱلْعَنْهُمْ لَعْنًا كَبِيرًا
Transliteration rabbanā ātihim ḍiʿ'fayni mina l-ʿadhābi wal-ʿanhum laʿnan kabīran
Telugu "ఓ మా ప్రభూ! వారికి రెట్టింపు శిక్ష విధించు మరియు వారిని పూర్తిగా శపించు (బహిష్కరించు)!"
Verse 69
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَكُونُوا۟ كَٱلَّذِينَ ءَاذَوْا۟ مُوسَىٰ فَبَرَّأَهُ ٱللَّهُ مِمَّا قَالُوا۟ ۚ وَكَانَ عِندَ ٱللَّهِ وَجِيهًا
Transliteration yāayyuhā alladhīna āmanū lā takūnū ka-alladhīna ādhaw mūsā fabarra-ahu l-lahu mimmā qālū wakāna ʿinda l-lahi wajīhan
Telugu ఓ విశ్వాసులారా! మీరు మూసాను బాధించిన వారి వలే అయి పోకండి. తరువాత అల్లాహ్ వారు (కల్పించిన) ఆరోపణ నుండి అతనికి విముక్తి కలిగించాడు. అతను (మూసా), అల్లాహ్ దృష్టిలో ఎంతో ఆదరణీయుడు.
Verse 70
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَقُولُوا۟ قَوْلًا سَدِيدًا
Transliteration yāayyuhā alladhīna āmanū ittaqū l-laha waqūlū qawlan sadīdan
Telugu ఓ విశ్వాసులారా! అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు మాట్లాడినప్పుడు యుక్తమైన మాటనే పలకండి.
Verse 71
يُصْلِحْ لَكُمْ أَعْمَـٰلَكُمْ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَقَدْ فَازَ فَوْزًا عَظِيمًا
Transliteration yuṣ'liḥ lakum aʿmālakum wayaghfir lakum dhunūbakum waman yuṭiʿi l-laha warasūlahu faqad fāza fawzan ʿaẓīman
Telugu ఆయన మీ కర్మలను సరిదిద్దుతాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు ఎవడైతే అల్లాహ్ కు విధేయుడై సందేశహరుని ఆజ్ఞను పాలిస్తాడో! నిశ్చయంగా, అతడే గొప్ప విజయం పొందినవాడు!
Verse 72
إِنَّا عَرَضْنَا ٱلْأَمَانَةَ عَلَى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَٱلْجِبَالِ فَأَبَيْنَ أَن يَحْمِلْنَهَا وَأَشْفَقْنَ مِنْهَا وَحَمَلَهَا ٱلْإِنسَـٰنُ ۖ إِنَّهُۥ كَانَ ظَلُومًا جَهُولًا
Transliteration innā ʿaraḍnā l-amānata ʿalā l-samāwāti wal-arḍi wal-jibāli fa-abayna an yaḥmil'nahā wa-ashfaqna min'hā waḥamalahā l-insānu innahu kāna ẓalūman jahūlan
Telugu నిశ్చయంగా, మేము బాధ్యతను ఆకాశాలకు, భూమికి మరియు పర్వతాలకు సమర్పించగోరాము, కాని అవి దానిని భరించటానికి సమ్మతించలేదు మరియు దానికి భయపడ్డాయి, కాని మానవుడు దానిని తన మీద మోపుకున్నాడు. నిశ్చయంగా అతడు దుర్మార్గుడు, మూఢుడు కూడాను.
Verse 73
لِّيُعَذِّبَ ٱللَّهُ ٱلْمُنَـٰفِقِينَ وَٱلْمُنَـٰفِقَـٰتِ وَٱلْمُشْرِكِينَ وَٱلْمُشْرِكَـٰتِ وَيَتُوبَ ٱللَّهُ عَلَى ٱلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَـٰتِ ۗ وَكَانَ ٱللَّهُ غَفُورًا رَّحِيمًۢا
Transliteration liyuʿadhiba l-lahu l-munāfiqīna wal-munāfiqāti wal-mush'rikīna wal-mush'rikāti wayatūba l-lahu ʿalā l-mu'minīna wal-mu'mināti wakāna l-lahu ghafūran raḥīman
Telugu (దాని ఫలితంగా!) అల్లాహ్ కపట విశ్వాసులయిన పురుషులను మరియు కపట విశ్వాసులయిన స్త్రీలను మరియు అల్లాహ్ కు సాటి కల్పించే పురుషులను మరియు సాటి కల్పించే స్త్రీలను శిక్షిస్తాడు; మరియు విశ్వాసులైన పురుషుల మరియు విశ్వాసులైన స్త్రీల పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
Read Surah Al-Ahzab in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Gujarati
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Telugu: the Qur’an in Telugu.
Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.