Surah Sad in Telugu: translation and audio
Surah 38 · ص · The Letter "Saad" · 88 verses
Surah Sad verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Sad word by word in English.
Verse 1
صٓ ۚ وَٱلْقُرْءَانِ ذِى ٱلذِّكْرِ
Transliteration sad wal-qur'āni dhī l-dhik'ri
Telugu సాద్. మరియు హితబోధతో నిండివున్న ఈ ఖుర్ఆన్ సాక్షిగా!
Verse 2
بَلِ ٱلَّذِينَ كَفَرُوا۟ فِى عِزَّةٍ وَشِقَاقٍ
Transliteration bali alladhīna kafarū fī ʿizzatin washiqāqin
Telugu వాస్తవానికి, సత్యాన్ని తిరస్కరించిన వారు అహంకారంలో మరియు విరోధంలో పడివున్నారు.
Verse 3
كَمْ أَهْلَكْنَا مِن قَبْلِهِم مِّن قَرْنٍ فَنَادَوا۟ وَّلَاتَ حِينَ مَنَاصٍ
Transliteration kam ahlaknā min qablihim min qarnin fanādaw walāta ḥīna manāṣin
Telugu వారికి పూర్వం గతించిన ఎన్నో తరాలను మేము నాశనం చేశాము. అప్పుడు వారు మొర పెట్టుకోసాగారు, కాని అప్పుడు వారికి దాని నుండి తప్పించుకునే సమయం లేకపోయింది!
Verse 4
وَعَجِبُوٓا۟ أَن جَآءَهُم مُّنذِرٌ مِّنْهُمْ ۖ وَقَالَ ٱلْكَـٰفِرُونَ هَـٰذَا سَـٰحِرٌ كَذَّابٌ
Transliteration waʿajibū an jāahum mundhirun min'hum waqāla l-kāfirūna hādhā sāḥirun kadhābun
Telugu మరియు వారిని హెచ్చరించేవాడు, తమలో నుంచే రావటం చూసి వారు ఆశ్చర్యపడ్డారు! మరియు సత్యతిరస్కారులు ఇలా అన్నారు: "ఇతడు మాంత్రికుడు, అసత్యవాది."
Verse 5
أَجَعَلَ ٱلْـَٔالِهَةَ إِلَـٰهًا وَٰحِدًا ۖ إِنَّ هَـٰذَا لَشَىْءٌ عُجَابٌ
Transliteration ajaʿala l-ālihata ilāhan wāḥidan inna hādhā lashayon ʿujābun
Telugu "ఏమీ? ఇతను (ఈ ప్రవక్త) దైవాలందరినీ, ఒకే ఆరాధ్యదైవంగా చేశాడా? నిశ్చయంగా ఇది ఎంతో విచిత్రమైన విషయం!"
Verse 6
وَٱنطَلَقَ ٱلْمَلَأُ مِنْهُمْ أَنِ ٱمْشُوا۟ وَٱصْبِرُوا۟ عَلَىٰٓ ءَالِهَتِكُمْ ۖ إِنَّ هَـٰذَا لَشَىْءٌ يُرَادُ
Transliteration wa-inṭalaqa l-mala-u min'hum ani im'shū wa-iṣ'birū ʿalā ālihatikum inna hādhā lashayon yurādu
Telugu మరియు వారి నాయకులు ఇలా అనసాగారు: "పదండి! మీరు మీ దైవాల (ఆరాధన) మీద స్థిరంగా ఉండండి." నిశ్చయంగా, ఇందులో (మీకు విరుద్ధంగా) ఏదో ఉద్దేశింపబడి ఉంది!
Verse 7
مَا سَمِعْنَا بِهَـٰذَا فِى ٱلْمِلَّةِ ٱلْـَٔاخِرَةِ إِنْ هَـٰذَآ إِلَّا ٱخْتِلَـٰقٌ
Transliteration mā samiʿ'nā bihādhā fī l-milati l-ākhirati in hādhā illā ikh'tilāqun
Telugu "ఇలాంటి విషయాన్ని మేము ఇటీవలి కాలపు మతంలో విని ఉండలేదు. ఇది కేవలం కల్పన మాత్రమే!"
Verse 8
أَءُنزِلَ عَلَيْهِ ٱلذِّكْرُ مِنۢ بَيْنِنَا ۚ بَلْ هُمْ فِى شَكٍّ مِّن ذِكْرِى ۖ بَل لَّمَّا يَذُوقُوا۟ عَذَابِ
Transliteration a-unzila ʿalayhi l-dhik'ru min bayninā bal hum fī shakkin min dhik'rī bal lammā yadhūqū ʿadhābi
Telugu "ఏమీ? మా అందరిలోనూ, కేవలం ఇతనిపైననే, ఈ హితబోధ అవతరింప జేయబడిందా? వాస్తవానికి వారు నా హితబోధను గురించి సంశయంలో పడి వున్నారు. అలా కాదు, వారు ఇంకా (నా) శిక్షను రుచి చూడలేదు!
Verse 9
أَمْ عِندَهُمْ خَزَآئِنُ رَحْمَةِ رَبِّكَ ٱلْعَزِيزِ ٱلْوَهَّابِ
Transliteration am ʿindahum khazāinu raḥmati rabbika l-ʿazīzi l-wahābi
Telugu లేక వారి దగ్గర సర్వశక్తుడు, సర్వప్రదుడు అయిన నీ ప్రభువు యొక్క కారుణ్య నిధులు ఉన్నాయా?
Verse 10
أَمْ لَهُم مُّلْكُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ فَلْيَرْتَقُوا۟ فِى ٱلْأَسْبَـٰبِ
Transliteration am lahum mul'ku l-samāwāti wal-arḍi wamā baynahumā falyartaqū fī l-asbābi
Telugu లేక! ఆకాశాలు మరియు భూమి మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద వారికి సామ్రాజ్యాధిపత్యం ఉందా? అలా అయితే వారిని తమ సాధనాలతో పైకి (ఆకాశలోకి) ఎక్కమను!
Verse 11
جُندٌ مَّا هُنَالِكَ مَهْزُومٌ مِّنَ ٱلْأَحْزَابِ
Transliteration jundun mā hunālika mahzūmun mina l-aḥzābi
Telugu ఇంతకు ముందు ఓడించబడిన సైన్యాల వలే, ఒక వర్గం వీరిది కూడా ఉంటుంది!
Verse 12
كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَعَادٌ وَفِرْعَوْنُ ذُو ٱلْأَوْتَادِ
Transliteration kadhabat qablahum qawmu nūḥin waʿādun wafir'ʿawnu dhū l-awtādi
Telugu వీరికి పూర్వం నూహ్ మరియు ఆద్ (జాతి) వారు మరియు మేకుల ఫిర్ఔన్ జాతుల వారు సత్యాన్ని తిరస్కరించారు;
Verse 13
وَثَمُودُ وَقَوْمُ لُوطٍ وَأَصْحَـٰبُ لْـَٔيْكَةِ ۚ أُو۟لَـٰٓئِكَ ٱلْأَحْزَابُ
Transliteration wathamūdu waqawmu lūṭin wa-aṣḥābu al'aykati ulāika l-aḥzābu
Telugu మరియు సమూద్ మరియు లూత్ జాతుల వారు మరియు అయ్ కహ్ (మద్ యన్) వాసులు అందరూ ఇలాంటి వర్గాలకు చెందినవారే.
Verse 14
إِن كُلٌّ إِلَّا كَذَّبَ ٱلرُّسُلَ فَحَقَّ عِقَابِ
Transliteration in kullun illā kadhaba l-rusula faḥaqqa ʿiqābi
Telugu ఇక వీరిలో ఏ ఒక్కరూ ప్రవక్తలను అసత్యవాదులని తిరస్కరించకుండా ఉండలేదు, కావున నా శిక్ష అనివార్యమయ్యింది.
Verse 15
وَمَا يَنظُرُ هَـٰٓؤُلَآءِ إِلَّا صَيْحَةً وَٰحِدَةً مَّا لَهَا مِن فَوَاقٍ
Transliteration wamā yanẓuru hāulāi illā ṣayḥatan wāḥidatan mā lahā min fawāqin
Telugu మరియు వీరందరూ కేవలం ఒక గర్జన (సయ్ హా) కొరకు మాత్రమే ఎదురు చూస్తున్నారు, దానికి ఎలాంటి నిలుపుదల ఉండదు.
Verse 16
وَقَالُوا۟ رَبَّنَا عَجِّل لَّنَا قِطَّنَا قَبْلَ يَوْمِ ٱلْحِسَابِ
Transliteration waqālū rabbanā ʿajjil lanā qiṭṭanā qabla yawmi l-ḥisābi
Telugu మరియు వారు: "ఓ మా ప్రభూ! లెక్క దినానికి ముందే మా భాగం మాకు తొందరగా ఇచ్చి వెయ్యి." అని అంటారు.
Verse 17
ٱصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَٱذْكُرْ عَبْدَنَا دَاوُۥدَ ذَا ٱلْأَيْدِ ۖ إِنَّهُۥٓ أَوَّابٌ
Transliteration iṣ'bir ʿalā mā yaqūlūna wa-udh'kur ʿabdanā dāwūda dhā l-aydi innahu awwābun
Telugu (ఓ ముహమ్మద్!) వారి మాటల యెడల నీవు సహనం వహించు మరియు బలవంతుడైన, మా దాసుడు దావూద్ ను జ్ఞాపకం చేసుకో. నిశ్చయంగా, అతను ఎల్లప్పుడూ పశ్చాత్తాపంతో (అల్లాహ్ వైపునకు) మరలుతూ ఉండేవాడు.
Verse 18
إِنَّا سَخَّرْنَا ٱلْجِبَالَ مَعَهُۥ يُسَبِّحْنَ بِٱلْعَشِىِّ وَٱلْإِشْرَاقِ
Transliteration innā sakharnā l-jibāla maʿahu yusabbiḥ'na bil-ʿashiyi wal-ish'rāqi
Telugu నిశ్చయంగా, మేము పర్వతాలను అతనితో బాటు సాయంత్రం మరియు ఉదయం మా పవిత్రతను కొనియాడుతూ ఉండేటట్లు చేశాము.
Verse 19
وَٱلطَّيْرَ مَحْشُورَةً ۖ كُلٌّ لَّهُۥٓ أَوَّابٌ
Transliteration wal-ṭayra maḥshūratan kullun lahu awwābun
Telugu మరియు పక్షులు కూడా గుమికూడేవి. అంతా కలసి ఆయన (అల్లాహ్) వైపుకు మరలేవారు.
Verse 20
وَشَدَدْنَا مُلْكَهُۥ وَءَاتَيْنَـٰهُ ٱلْحِكْمَةَ وَفَصْلَ ٱلْخِطَابِ
Transliteration washadadnā mul'kahu waātaynāhu l-ḥik'mata wafaṣla l-khiṭābi
Telugu మరియు మేము అతని సామ్రాజ్యాన్ని పటిష్టపరిచాము మరియు మేము అతనికి వివేకాన్ని మరియు తిరుగులేని తీర్పు చేయడంలో, నేర్పరితనాన్ని ప్రసాదించాము.
Verse 21
۞ وَهَلْ أَتَىٰكَ نَبَؤُا۟ ٱلْخَصْمِ إِذْ تَسَوَّرُوا۟ ٱلْمِحْرَابَ
Transliteration wahal atāka naba-u l-khaṣmi idh tasawwarū l-miḥ'rāba
Telugu మరియు తగవులాడుకొని వచ్చిన ఆ ఇద్దరి వార్త నీకు చేరిందా? వారు గోడ ఎక్కి అతని ప్రార్థనా గదిలోకి వచ్చారు.
Verse 22
إِذْ دَخَلُوا۟ عَلَىٰ دَاوُۥدَ فَفَزِعَ مِنْهُمْ ۖ قَالُوا۟ لَا تَخَفْ ۖ خَصْمَانِ بَغَىٰ بَعْضُنَا عَلَىٰ بَعْضٍ فَٱحْكُم بَيْنَنَا بِٱلْحَقِّ وَلَا تُشْطِطْ وَٱهْدِنَآ إِلَىٰ سَوَآءِ ٱلصِّرَٰطِ
Transliteration idh dakhalū ʿalā dāwūda fafaziʿa min'hum qālū lā takhaf khaṣmāni baghā baʿḍunā ʿalā baʿḍin fa-uḥ'kum baynanā bil-ḥaqi walā tush'ṭiṭ wa-ih'dinā ilā sawāi l-ṣirāṭi
Telugu వారు దావూద్ వద్దకు వచ్చినపుడు, అతను వారిని చూసి బెదిరి పోయాడు. వారన్నారు: "భయపడకు! మేమిద్దరం ప్రత్యర్థులం, మాలో ఒకడు మరొకనికి అన్యాయం చేశాడు. కావున నీవు మా మధ్య న్యాయంగా తీర్పు చెయ్యి. మరియు నీతి మీరి నడువకు, మాకు సరైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం చెయ్యి.
Verse 23
إِنَّ هَـٰذَآ أَخِى لَهُۥ تِسْعٌ وَتِسْعُونَ نَعْجَةً وَلِىَ نَعْجَةٌ وَٰحِدَةٌ فَقَالَ أَكْفِلْنِيهَا وَعَزَّنِى فِى ٱلْخِطَابِ
Transliteration inna hādhā akhī lahu tis'ʿun watis'ʿūna naʿjatan waliya naʿjatun wāḥidatun faqāla akfil'nīhā waʿazzanī fī l-khiṭābi
Telugu వాస్తవానికి, ఇతడు నా సోదరుడు, ఇతని వద్ద తొంభై తొమ్మిది ఆడ గొర్రెలున్నాయి. మరియు నా దగ్గర కేవలం ఒకే ఒక్క ఆడ గొర్రె ఉంది, అయినా ఇతడు అంటున్నాడు: 'దీనిని నాకివ్వు.' మరియు తన మాటల నేర్పులోత నన్ను వశపరచుకుంటున్నాడు."
Verse 24
قَالَ لَقَدْ ظَلَمَكَ بِسُؤَالِ نَعْجَتِكَ إِلَىٰ نِعَاجِهِۦ ۖ وَإِنَّ كَثِيرًا مِّنَ ٱلْخُلَطَآءِ لَيَبْغِى بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ وَقَلِيلٌ مَّا هُمْ ۗ وَظَنَّ دَاوُۥدُ أَنَّمَا فَتَنَّـٰهُ فَٱسْتَغْفَرَ رَبَّهُۥ وَخَرَّ رَاكِعًا وَأَنَابَ ۩
Transliteration qāla laqad ẓalamaka bisuāli naʿjatika ilā niʿājihi wa-inna kathīran mina l-khulaṭāi layabghī baʿḍuhum ʿalā baʿḍin illā alladhīna āmanū waʿamilū l-ṣāliḥāti waqalīlun mā hum waẓanna dāwūdu annamā fatannāhu fa-is'taghfara rabbahu wakharra rākiʿan wa-anāba
Telugu (దావూద్) అన్నాడు: "వాస్తవంగా, నీ ఆడగొర్రెను తన గొర్రెలలో కలుపుకోవటానికి అడిగి, ఇతడు నీపై అన్యాయం చేస్తున్నాడు. మరియు వాస్తవానికి, చాలా మంది భాగస్థులు ఒకరి కొకరు అన్యాయం చేసుకుంటూ ఉంటారు, విశ్వసించి సత్కార్యాలు చేసేవారు తప్ప! కాని అటువంటి వారు కొందరు మాత్రమే!" వాస్తవానికి మేము అతనిని (దావూద్ ను) పరీక్షిస్తున్నామని అతను అర్థం చేసుకున్నాడు. కాబట్టి తన ప్రభువును క్షమాపణ వేడుకున్నాడు. మరియు సాష్టాంగం (సజ్దా)లో పడిపోయాడు మరియు పశ్చాత్తాపంతో (అల్లాహ్ వైపుకు) మరలాడు.
Verse 25
فَغَفَرْنَا لَهُۥ ذَٰلِكَ ۖ وَإِنَّ لَهُۥ عِندَنَا لَزُلْفَىٰ وَحُسْنَ مَـَٔابٍ
Transliteration faghafarnā lahu dhālika wa-inna lahu ʿindanā lazul'fā waḥus'na maābin
Telugu అప్పుడు మేము అతనిని (ఆ తప్పును) క్షమించాము. మరియు నిశ్చయంగా, మా వద్ద అతనికి సాన్నిహిత్యం మరియు మంచి స్థానం కూడా ఉన్నాయి.
Verse 26
يَـٰدَاوُۥدُ إِنَّا جَعَلْنَـٰكَ خَلِيفَةً فِى ٱلْأَرْضِ فَٱحْكُم بَيْنَ ٱلنَّاسِ بِٱلْحَقِّ وَلَا تَتَّبِعِ ٱلْهَوَىٰ فَيُضِلَّكَ عَن سَبِيلِ ٱللَّهِ ۚ إِنَّ ٱلَّذِينَ يَضِلُّونَ عَن سَبِيلِ ٱللَّهِ لَهُمْ عَذَابٌ شَدِيدٌۢ بِمَا نَسُوا۟ يَوْمَ ٱلْحِسَابِ
Transliteration yādāwūdu innā jaʿalnāka khalīfatan fī l-arḍi fa-uḥ'kum bayna l-nāsi bil-ḥaqi walā tattabiʿi l-hawā fayuḍillaka ʿan sabīli l-lahi inna alladhīna yaḍillūna ʿan sabīli l-lahi lahum ʿadhābun shadīdun bimā nasū yawma l-ḥisābi
Telugu (మేము అతనితో ఇలా అన్నాము): "ఓ దావూద్! నిశ్చయంగా, మేము నిన్ను భూమిలో ఉత్తరాధికారిగా నియమించాము. కావున నీవు ప్రజల మధ్య న్యాయంగా తీర్పు చెయ్యి మరియు నీ మనోకాంక్షలను అనుసరించకు, ఎందుకంటే అవి నిన్ను అల్లాహ్ మార్గం నుండి తప్పిస్తాయి." నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ మార్గం నుండి తప్పిపోతారో, వారికి లెక్క దినమున మరచి పోయిన దాని ఫలితంగా, కఠినమైన శిక్ష పడుతుంది.
Verse 27
وَمَا خَلَقْنَا ٱلسَّمَآءَ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَا بَـٰطِلًا ۚ ذَٰلِكَ ظَنُّ ٱلَّذِينَ كَفَرُوا۟ ۚ فَوَيْلٌ لِّلَّذِينَ كَفَرُوا۟ مِنَ ٱلنَّارِ
Transliteration wamā khalaqnā l-samāa wal-arḍa wamā baynahumā bāṭilan dhālika ẓannu alladhīna kafarū fawaylun lilladhīna kafarū mina l-nāri
Telugu మరియు మేము ఈ ఆకాశాన్ని మరియు ఈ భూమిని మరియు వాటి మధ్య ఉన్న దాన్నంతా వృథాగా సృష్టించలేదు! ఇది సత్యాన్ని తిరస్కరించిన వారి భ్రమ మాత్రమే. కావున అట్టి సత్యతిరస్కారులకు నరకాగ్ని బాధ పడనున్నది!
Verse 28
أَمْ نَجْعَلُ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ كَٱلْمُفْسِدِينَ فِى ٱلْأَرْضِ أَمْ نَجْعَلُ ٱلْمُتَّقِينَ كَٱلْفُجَّارِ
Transliteration am najʿalu alladhīna āmanū waʿamilū l-ṣāliḥāti kal-muf'sidīna fī l-arḍi am najʿalu l-mutaqīna kal-fujāri
Telugu ఏమీ? మేము విశ్వసించి, సత్కార్యాలు చేసేవారిని భూమిలో కల్లోలం రేకెత్తించే వారితో సమానులుగా చేస్తామా? లేక మేము దైవభీతి గలవారిని దుష్టులతో సమానులుగా చేస్తామా?
Verse 29
كِتَـٰبٌ أَنزَلْنَـٰهُ إِلَيْكَ مُبَـٰرَكٌ لِّيَدَّبَّرُوٓا۟ ءَايَـٰتِهِۦ وَلِيَتَذَكَّرَ أُو۟لُوا۟ ٱلْأَلْبَـٰبِ
Transliteration kitābun anzalnāhu ilayka mubārakun liyaddabbarū āyātihi waliyatadhakkara ulū l-albābi
Telugu (ఓ ముహమ్మద్!) మేము ఎంతో శుభవంతమైన ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) నీపై అవతరింప జేశాము. ప్రజలు దీని సూచనలను (ఆయాత్ లను) గురించి యోచించాలని మరియు బుద్ధిమంతులు దీని నుండి హితబోధ గ్రహించాలని.
Verse 30
وَوَهَبْنَا لِدَاوُۥدَ سُلَيْمَـٰنَ ۚ نِعْمَ ٱلْعَبْدُ ۖ إِنَّهُۥٓ أَوَّابٌ
Transliteration wawahabnā lidāwūda sulaymāna niʿ'ma l-ʿabdu innahu awwābun
Telugu మరియు మేము దావూద్ కు సులైమాన్ ను ప్రసాదించాము. అతను ఉత్తమ దాసుడు! నిశ్చయంగా, అతను ఎల్లప్పుడు మా వైపునకు పశ్చాత్తాపంతో మరలుతూ ఉండేవాడు.
Verse 31
إِذْ عُرِضَ عَلَيْهِ بِٱلْعَشِىِّ ٱلصَّـٰفِنَـٰتُ ٱلْجِيَادُ
Transliteration idh ʿuriḍa ʿalayhi bil-ʿashiyi l-ṣāfinātu l-jiyādu
Telugu ఒకరోజు సాయంకాలం అతని ముందు మేలు జాతి, వడి గల గుర్రాలు ప్రవేశపెట్టబడినప్పుడు;
Verse 32
فَقَالَ إِنِّىٓ أَحْبَبْتُ حُبَّ ٱلْخَيْرِ عَن ذِكْرِ رَبِّى حَتَّىٰ تَوَارَتْ بِٱلْحِجَابِ
Transliteration faqāla innī aḥbabtu ḥubba l-khayri ʿan dhik'ri rabbī ḥattā tawārat bil-ḥijābi
Telugu అతను అన్నాడు: "అయ్యో! వాస్తవంగా నేను నా ప్రభువు స్మరణకు బదులుగా ఈ సంపదను (గుర్రాలను) ప్రేమించాను." చివరకు (సూర్యుడు) కనుమరుగై పోయాడు.
Verse 33
رُدُّوهَا عَلَىَّ ۖ فَطَفِقَ مَسْحًۢا بِٱلسُّوقِ وَٱلْأَعْنَاقِ
Transliteration ruddūhā ʿalayya faṭafiqa masḥan bil-sūqi wal-aʿnāqi
Telugu (అతను ఇంకా ఇలా అన్నాడు): "వాటిని నా వద్దకు తిరిగి తీసుకురండి." తరువాత అతను వాటి పిక్కలను మరియు మెడలను నిమరసాగాడు.
Verse 34
وَلَقَدْ فَتَنَّا سُلَيْمَـٰنَ وَأَلْقَيْنَا عَلَىٰ كُرْسِيِّهِۦ جَسَدًا ثُمَّ أَنَابَ
Transliteration walaqad fatannā sulaymāna wa-alqaynā ʿalā kur'siyyihi jasadan thumma anāba
Telugu మరియు వాస్తవానికి మేము సులైమాన్ ను పరీక్షకు గురి చేశాము మరియు అతని సింహాసనంపై ఒక కళేబరాన్ని పడవేశాము, అప్పుడతను పశ్చాత్తాపంతో మా వైపునకు మరలాడు.
Verse 35
قَالَ رَبِّ ٱغْفِرْ لِى وَهَبْ لِى مُلْكًا لَّا يَنۢبَغِى لِأَحَدٍ مِّنۢ بَعْدِىٓ ۖ إِنَّكَ أَنتَ ٱلْوَهَّابُ
Transliteration qāla rabbi igh'fir lī wahab lī mul'kan lā yanbaghī li-aḥadin min baʿdī innaka anta l-wahābu
Telugu అతను ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నన్ను క్షమించు, నా తరువాత మరెవ్వరికీ లభించనటువంటి సామ్రాజ్యాన్ని నాకు ప్రసాదించు. నిశ్చయంగా, నీవే సర్వప్రదుడవు!"
Verse 36
فَسَخَّرْنَا لَهُ ٱلرِّيحَ تَجْرِى بِأَمْرِهِۦ رُخَآءً حَيْثُ أَصَابَ
Transliteration fasakharnā lahu l-rīḥa tajrī bi-amrihi rukhāan ḥaythu aṣāba
Telugu అప్పుడు మేము గాలిని అతనికి వశ పరచాము. అది అతని ఆజ్ఞానుసారంగా, అతడు కోరిన వైపునకు తగినట్లుగా మెల్లగా వీచేది.
Verse 37
وَٱلشَّيَـٰطِينَ كُلَّ بَنَّآءٍ وَغَوَّاصٍ
Transliteration wal-shayāṭīna kulla bannāin waghawwāṣin
Telugu మరియు షైతానులలో (జిన్నాతులలో) నుండి కూడా రకరకాల కట్టడాలు నిర్మించే వాటినీ మరియు సముద్రంలో మునిగి (ముత్యాలు తీసే) వాటినీ (అతనికి వశ పరచి ఉన్నాము).
Verse 38
وَءَاخَرِينَ مُقَرَّنِينَ فِى ٱلْأَصْفَادِ
Transliteration waākharīna muqarranīna fī l-aṣfādi
Telugu మరికొన్ని సంకెళ్ళతో బంధింపబడినవి కూడా ఉండేవి.
Verse 39
هَـٰذَا عَطَآؤُنَا فَٱمْنُنْ أَوْ أَمْسِكْ بِغَيْرِ حِسَابٍ
Transliteration hādhā ʿaṭāunā fa-um'nun aw amsik bighayri ḥisābin
Telugu (అల్లాహ్ అతనితో అన్నాడు): "ఇది నీకు మా కానుక, కావున నీవు దీనిని (ఇతరులకు) ఇచ్చినా, లేక నీవే ఉంచుకున్నా, నీతో ఎలాంటి లెక్క తీసుకోబడదు."
Verse 40
وَإِنَّ لَهُۥ عِندَنَا لَزُلْفَىٰ وَحُسْنَ مَـَٔابٍ
Transliteration wa-inna lahu ʿindanā lazul'fā waḥus'na maābin
Telugu మరియు నిశ్చయంగా, అతనికి మా సాన్నిహిత్యం మరియు ఉత్తమ గమ్యస్థానం ఉన్నాయి.
Verse 41
وَٱذْكُرْ عَبْدَنَآ أَيُّوبَ إِذْ نَادَىٰ رَبَّهُۥٓ أَنِّى مَسَّنِىَ ٱلشَّيْطَـٰنُ بِنُصْبٍ وَعَذَابٍ
Transliteration wa-udh'kur ʿabdanā ayyūba idh nādā rabbahu annī massaniya l-shayṭānu binuṣ'bin waʿadhābin
Telugu మరియు మా దాసుడు అయ్యూబ్ ను గురించి ప్రస్తావించు; అతను తన ప్రభువుతో ఇలా మొరపెట్టుకున్నాడు: "నిశ్చయంగా షైతాన్ నన్ను ఆపదకు మరియు శిక్షకు గురి చేశాడు."
Verse 42
ٱرْكُضْ بِرِجْلِكَ ۖ هَـٰذَا مُغْتَسَلٌۢ بَارِدٌ وَشَرَابٌ
Transliteration ur'kuḍ birij'lika hādhā mugh'tasalun bāridun washarābun
Telugu (మేము అతనితో అన్నాము): "నీ కాలును నేల మీద కొట్టు. అదిగో చల్ల (నీటి చెలిమ)! నీవు స్నానం చేయటానికి మరియు త్రాగుటకూను."
Verse 43
وَوَهَبْنَا لَهُۥٓ أَهْلَهُۥ وَمِثْلَهُم مَّعَهُمْ رَحْمَةً مِّنَّا وَذِكْرَىٰ لِأُو۟لِى ٱلْأَلْبَـٰبِ
Transliteration wawahabnā lahu ahlahu wamith'lahum maʿahum raḥmatan minnā wadhik'rā li-ulī l-albābi
Telugu మరియు మేము అతని కుటుంబం వారిని మరియు వారితో బాటు, వారి వంటి వారిని మా కరుణతో అతనికి తిరిగి ఇచ్చాము మరియు బుద్ధిమంతులకు ఇది ఒక హితబోధ.
Verse 44
وَخُذْ بِيَدِكَ ضِغْثًا فَٱضْرِب بِّهِۦ وَلَا تَحْنَثْ ۗ إِنَّا وَجَدْنَـٰهُ صَابِرًا ۚ نِّعْمَ ٱلْعَبْدُ ۖ إِنَّهُۥٓ أَوَّابٌ
Transliteration wakhudh biyadika ḍigh'than fa-iḍ'rib bihi walā taḥnath innā wajadnāhu ṣābiran niʿ'ma l-ʿabdu innahu awwābun
Telugu (అల్లాహ్ అతనితో అన్నాడు): "ఒక పుల్లల కట్టను నీ చేతిలోకి తీసికొని దానితో (నీ భార్యను) కొట్టు మరియు నీ ఒట్టును భంగపరచుకోకు." వాస్తవానికి, మేము అతనిని ఎంతో సహనశీలునిగా పొందాము. అతను ఉత్తమ దాసుడు! నిశ్చయంగా, ఎల్లపుడు మా వైపునకు పశ్చాత్తాపంతో మరలుతూ ఉండేవాడు.
Verse 45
وَٱذْكُرْ عِبَـٰدَنَآ إِبْرَٰهِيمَ وَإِسْحَـٰقَ وَيَعْقُوبَ أُو۟لِى ٱلْأَيْدِى وَٱلْأَبْصَـٰرِ
Transliteration wa-udh'kur ʿibādanā ib'rāhīma wa-is'ḥāqa wayaʿqūba ulī l-aydī wal-abṣāri
Telugu మరియు మా దాసులైన ఇబ్రాహీమ్, ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను జ్ఞాపకం చేసుకో! వారు గొప్ప కార్యశీలురు మరియు దూరదృష్టి గలవారు.
Verse 46
إِنَّآ أَخْلَصْنَـٰهُم بِخَالِصَةٍ ذِكْرَى ٱلدَّارِ
Transliteration innā akhlaṣnāhum bikhāliṣatin dhik'rā l-dāri
Telugu నిశ్చయంగా, మేము వారిని ఒక విశిష్ట గుణం కారణంగా ఎన్నుకున్నాము, అది వారి పరలోక చింతన.
Verse 47
وَإِنَّهُمْ عِندَنَا لَمِنَ ٱلْمُصْطَفَيْنَ ٱلْأَخْيَارِ
Transliteration wa-innahum ʿindanā lamina l-muṣ'ṭafayna l-akhyāri
Telugu మరియు నిశ్చయంగా, మా దృష్టిలో వారు ఎన్నుకోబడిన ఉత్తమ (పుణ్య) పురుషులలోని వారు!
Verse 48
وَٱذْكُرْ إِسْمَـٰعِيلَ وَٱلْيَسَعَ وَذَا ٱلْكِفْلِ ۖ وَكُلٌّ مِّنَ ٱلْأَخْيَارِ
Transliteration wa-udh'kur is'māʿīla wal-yasaʿa wadhā l-kif'li wakullun mina l-akhyāri
Telugu మరియు ఇస్మాయీల్, అల్ యస్అ మరియు జుల్ కిప్ల్ ను కూడా జ్ఞాపకం చేసుకో. మరియు వారందరూ ఎన్నుకొనబడిన ఉత్తమ పురుషులలోని వారు.
Verse 49
هَـٰذَا ذِكْرٌ ۚ وَإِنَّ لِلْمُتَّقِينَ لَحُسْنَ مَـَٔابٍ
Transliteration hādhā dhik'run wa-inna lil'muttaqīna laḥus'na maābin
Telugu ఇది ఒక ప్రస్తావన. మరియు నిశ్చయంగా! దైవభీతి గలవారికి ఉత్తమ గమ్యస్థానం ఉంది.
Verse 50
جَنَّـٰتِ عَدْنٍ مُّفَتَّحَةً لَّهُمُ ٱلْأَبْوَٰبُ
Transliteration jannāti ʿadnin mufattaḥatan lahumu l-abwābu
Telugu శాశ్వతమైన స్వర్గవనాలు, వాటి ద్వారాలు వారి కొరకు తెరువబడి ఉంటాయి.
Verse 51
مُتَّكِـِٔينَ فِيهَا يَدْعُونَ فِيهَا بِفَـٰكِهَةٍ كَثِيرَةٍ وَشَرَابٍ
Transliteration muttakiīna fīhā yadʿūna fīhā bifākihatin kathīratin washarābin
Telugu అందులో వారు దిండ్లను ఆనుకొని కూర్చొని; అందులో వారు అనేక ఫలాలను మరియు పానీయాలను అడుగుతూ ఉంటారు.
Verse 52
۞ وَعِندَهُمْ قَـٰصِرَٰتُ ٱلطَّرْفِ أَتْرَابٌ
Transliteration waʿindahum qāṣirātu l-ṭarfi atrābun
Telugu మరియు వారి దగ్గర సమవయస్కులు మరియు తమ చూపులను వారి కొరకే ప్రత్యేకించుకొనే శీలవతులైన స్త్రీలు ఉంటారు.
Verse 53
هَـٰذَا مَا تُوعَدُونَ لِيَوْمِ ٱلْحِسَابِ
Transliteration hādhā mā tūʿadūna liyawmi l-ḥisābi
Telugu లెక్కదినం కొరకు మీతో (దైవభీతి గలవారితో) చేయబడిన వాగ్దానం ఇదే!
Verse 54
إِنَّ هَـٰذَا لَرِزْقُنَا مَا لَهُۥ مِن نَّفَادٍ
Transliteration inna hādhā lariz'qunā mā lahu min nafādin
Telugu నిశ్చయంగా, ఇదే మేమిచ్చే జీవనోపాధి. దానికి తరుగులేదు;
Verse 55
هَـٰذَا ۚ وَإِنَّ لِلطَّـٰغِينَ لَشَرَّ مَـَٔابٍ
Transliteration hādhā wa-inna lilṭṭāghīna lasharra maābin
Telugu ఇదే (విశ్వాసులకు లభించేది). మరియు నిశ్చయంగా, తలబిరుసుతనం గల దుష్టులకు అతి చెడ్డ గమ్యస్థానం ఉంటుంది -
Verse 56
جَهَنَّمَ يَصْلَوْنَهَا فَبِئْسَ ٱلْمِهَادُ
Transliteration jahannama yaṣlawnahā fabi'sa l-mihādu
Telugu నరకం - వారందులో కాలుతారు. ఎంత బాధాకరమైన విరామ (నివాస) స్థలము.
Verse 57
هَـٰذَا فَلْيَذُوقُوهُ حَمِيمٌ وَغَسَّاقٌ
Transliteration hādhā falyadhūqūhu ḥamīmun waghassāqun
Telugu ఇదే (దుష్టులకు లభించేది), కావున వారు దాని రుచి చూస్తారు; సలసలకాగే నీరు మరియు చీము.
Verse 58
وَءَاخَرُ مِن شَكْلِهِۦٓ أَزْوَٰجٌ
Transliteration waākharu min shaklihi azwājun
Telugu ఇంకా ఇలాంటివే అనేకం ఉంటాయి!
Verse 59
هَـٰذَا فَوْجٌ مُّقْتَحِمٌ مَّعَكُمْ ۖ لَا مَرْحَبًۢا بِهِمْ ۚ إِنَّهُمْ صَالُوا۟ ٱلنَّارِ
Transliteration hādhā fawjun muq'taḥimun maʿakum lā marḥaban bihim innahum ṣālū l-nāri
Telugu "ఇదొక దళం, మీ వైపునకు త్రోయబడుతూ వస్తున్నది. వారికి ఎలాంటి స్వాగతం లేదు! నిశ్చయంగా, వారు నరకాగ్నిలో కాలుతారు."
Verse 60
قَالُوا۟ بَلْ أَنتُمْ لَا مَرْحَبًۢا بِكُمْ ۖ أَنتُمْ قَدَّمْتُمُوهُ لَنَا ۖ فَبِئْسَ ٱلْقَرَارُ
Transliteration qālū bal antum lā marḥaban bikum antum qaddamtumūhu lanā fabi'sa l-qarāru
Telugu (సత్యతిరస్కారులు తమను మార్గం తప్పించిన వారితో) అంటారు: "అయితే మీకు కూడా స్వాగతం లేదు కదా! ఈ పర్యవసానాన్ని మా ముందుకు తెచ్చిన వారు మీరే కదా! ఎంత చెడ్డ నివాస స్థలము."
Verse 61
قَالُوا۟ رَبَّنَا مَن قَدَّمَ لَنَا هَـٰذَا فَزِدْهُ عَذَابًا ضِعْفًا فِى ٱلنَّارِ
Transliteration qālū rabbanā man qaddama lanā hādhā fazid'hu ʿadhāban ḍiʿ'fan fī l-nāri
Telugu వారు ఇంకా ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! మా యెదుట దీనిని (నరకాన్ని) తెచ్చిన వానికి రెట్టింపు నరకాగ్ని శిక్షను విధించు!"
Verse 62
وَقَالُوا۟ مَا لَنَا لَا نَرَىٰ رِجَالًا كُنَّا نَعُدُّهُم مِّنَ ٱلْأَشْرَارِ
Transliteration waqālū mā lanā lā narā rijālan kunnā naʿudduhum mina l-ashrāri
Telugu ఇంకా వారు ఇలా అంటారు: "మాకేమయింది? మనం చెడ్డవారిగా ఎంచిన వారు ఇక్కడ మనకు కనబడటం లేదేమిటి?
Verse 63
أَتَّخَذْنَـٰهُمْ سِخْرِيًّا أَمْ زَاغَتْ عَنْهُمُ ٱلْأَبْصَـٰرُ
Transliteration attakhadhnāhum sikh'riyyan am zāghat ʿanhumu l-abṣāru
Telugu మనం ఊరికే వారిని ఎగతాళి చేశామా? లేదా వారు మనకు కనుమరుగయ్యారా?"
Verse 64
إِنَّ ذَٰلِكَ لَحَقٌّ تَخَاصُمُ أَهْلِ ٱلنَّارِ
Transliteration inna dhālika laḥaqqun takhāṣumu ahli l-nāri
Telugu నిశ్చయంగా, ఇదే నిజం! నరకవాసులు ఇలాగే వాదులాడుకుంటారు.
Verse 65
قُلْ إِنَّمَآ أَنَا۠ مُنذِرٌ ۖ وَمَا مِنْ إِلَـٰهٍ إِلَّا ٱللَّهُ ٱلْوَٰحِدُ ٱلْقَهَّارُ
Transliteration qul innamā anā mundhirun wamā min ilāhin illā l-lahu l-wāḥidu l-qahāru
Telugu (ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "వాస్తవానికి నేను హెచ్చరించేవాడను మాత్రమే! అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! ఆయన అద్వితీయుడు తన సృష్టి మీద సంపూర్ణ అధికారం గలవాడు."
Verse 66
رَبُّ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَمَا بَيْنَهُمَا ٱلْعَزِيزُ ٱلْغَفَّـٰرُ
Transliteration rabbu l-samāwāti wal-arḍi wamā baynahumā l-ʿazīzu l-ghafāru
Telugu ఆకాశాలు, భూమి మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు, సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు."
Verse 67
قُلْ هُوَ نَبَؤٌا۟ عَظِيمٌ
Transliteration qul huwa naba-on ʿaẓīmun
Telugu వారితో అను: "ఇది (ఈ ఖుర్ఆన్) ఒక గొప్ప సందేశం.
Verse 68
أَنتُمْ عَنْهُ مُعْرِضُونَ
Transliteration antum ʿanhu muʿ'riḍūna
Telugu దాని నుండి మీరు విముఖులవు తున్నారు!"
Verse 69
مَا كَانَ لِىَ مِنْ عِلْمٍۭ بِٱلْمَلَإِ ٱلْأَعْلَىٰٓ إِذْ يَخْتَصِمُونَ
Transliteration mā kāna liya min ʿil'min bil-mala-i l-aʿlā idh yakhtaṣimūna
Telugu (ఓ ముహమ్మద్! ఇలా అను): "ఉన్నత స్థానాలలో ఉన్న ముఖ్యుల (దేవదూతల) మధ్య (ఆదమ్ సృష్టి గురించి) ఒకప్పుడు జరిగిన వివాదం గురించి నాకు తెలియదు.
Verse 70
إِن يُوحَىٰٓ إِلَىَّ إِلَّآ أَنَّمَآ أَنَا۠ نَذِيرٌ مُّبِينٌ
Transliteration in yūḥā ilayya illā annamā anā nadhīrun mubīnun
Telugu కాని అది నాకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారానే తెలుపబడింది. వాస్తవానికి, నేను స్పష్టంగా హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే!"
Verse 71
إِذْ قَالَ رَبُّكَ لِلْمَلَـٰٓئِكَةِ إِنِّى خَـٰلِقٌۢ بَشَرًا مِّن طِينٍ
Transliteration idh qāla rabbuka lil'malāikati innī khāliqun basharan min ṭīnin
Telugu నీ ప్రభువు దేవదూతలతో ఇలా అన్న మాటను (జ్ఞాపకం చేసుకో): "నేను మట్టితో ఒక మనిషిని సృష్టించబోతున్నాను.
Verse 72
فَإِذَا سَوَّيْتُهُۥ وَنَفَخْتُ فِيهِ مِن رُّوحِى فَقَعُوا۟ لَهُۥ سَـٰجِدِينَ
Transliteration fa-idhā sawwaytuhu wanafakhtu fīhi min rūḥī faqaʿū lahu sājidīna
Telugu ఇక ఎప్పుడైతే, నేను అతని సృష్టిని పూర్తి చేసి అతనిలో నా (తరఫు నుండి) ఆత్మను (జీవాన్ని) ఊదుతానో అప్పుడు, మీరు అతని ముందు సాష్టాంగం (సజ్దా)లో పడిపోండి.
Verse 73
فَسَجَدَ ٱلْمَلَـٰٓئِكَةُ كُلُّهُمْ أَجْمَعُونَ
Transliteration fasajada l-malāikatu kulluhum ajmaʿūna
Telugu అప్పుడు దేవదూతలందరూ కలసి అతనికి సజ్దా చేశారు.
Verse 74
إِلَّآ إِبْلِيسَ ٱسْتَكْبَرَ وَكَانَ مِنَ ٱلْكَـٰفِرِينَ
Transliteration illā ib'līsa is'takbara wakāna mina l-kāfirīna
Telugu ఒక్క ఇబ్లీస్ తప్ప! అతడు గర్వితుడయ్యాడు మరియు సత్యతిరస్కారులలో కలిసి పోయాడు.
Verse 75
قَالَ يَـٰٓإِبْلِيسُ مَا مَنَعَكَ أَن تَسْجُدَ لِمَا خَلَقْتُ بِيَدَىَّ ۖ أَسْتَكْبَرْتَ أَمْ كُنتَ مِنَ ٱلْعَالِينَ
Transliteration qāla yāib'līsu mā manaʿaka an tasjuda limā khalaqtu biyadayya astakbarta am kunta mina l-ʿālīna
Telugu (అల్లాహ్) ఇలా అన్నాడు: "ఓ ఇబ్లీస్! నేను నా రెండు చేతులతో సృష్టించిన వానికి సాష్టాంగం (సజ్దా) చేయకుండా నిన్ను ఆపింది ఏమిటీ? నీవు గర్వితుడవై పోయావా! లేదా నిన్ను, నీవు ఉన్నత శ్రేణికి చెందిన వాడవనుకున్నావా?"
Verse 76
قَالَ أَنَا۠ خَيْرٌ مِّنْهُ ۖ خَلَقْتَنِى مِن نَّارٍ وَخَلَقْتَهُۥ مِن طِينٍ
Transliteration qāla anā khayrun min'hu khalaqtanī min nārin wakhalaqtahu min ṭīnin
Telugu (ఇబ్లీస్) అన్నాడు: "నేను అతని కంటే శ్రేష్ఠుడను. నీవు నన్ను అగ్నితో సృష్టించావు మరియు అతనిని మట్టితో సృష్టించావు."
Verse 77
قَالَ فَٱخْرُجْ مِنْهَا فَإِنَّكَ رَجِيمٌ
Transliteration qāla fa-ukh'ruj min'hā fa-innaka rajīmun
Telugu (అల్లాహ్) అన్నాడు: "ఇక ఇక్కడి నుండి వెళ్ళిపో! నిశ్చయంగా నీవు భ్రష్టుడవు.
Verse 78
وَإِنَّ عَلَيْكَ لَعْنَتِىٓ إِلَىٰ يَوْمِ ٱلدِّينِ
Transliteration wa-inna ʿalayka laʿnatī ilā yawmi l-dīni
Telugu మరియు నిశ్చయంగా, తీర్పుదినం వరకు నీపై నా శాపం (బహిష్కారం) ఉంటుంది."
Verse 79
قَالَ رَبِّ فَأَنظِرْنِىٓ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
Transliteration qāla rabbi fa-anẓir'nī ilā yawmi yub'ʿathūna
Telugu (అప్పుడు ఇబ్లీస్) ఇలా మనవి చేసుకున్నాడు: "ఓ నా ప్రభూ! మృతులు తిరిగి లేపబడే దినం వరకు నాకు వ్యవధినివ్వు!"
Verse 80
قَالَ فَإِنَّكَ مِنَ ٱلْمُنظَرِينَ
Transliteration qāla fa-innaka mina l-munẓarīna
Telugu (అల్లాహ్) సెలవిచ్చాడు: "సరే! నీకు వ్యవధి ఇవ్వబడుతోంది!
Verse 81
إِلَىٰ يَوْمِ ٱلْوَقْتِ ٱلْمَعْلُومِ
Transliteration ilā yawmi l-waqti l-maʿlūmi
Telugu ఆ నియమిత దినపు ఆ గడువు వచ్చే వరకు."
Verse 82
قَالَ فَبِعِزَّتِكَ لَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ
Transliteration qāla fabiʿizzatika la-ugh'wiyannahum ajmaʿīna
Telugu (ఇబ్లీస్) అన్నాడు: "నీ శక్తి సాక్షిగా నేను వారందరినీ తప్పు దారి పట్టిస్తాను;
Verse 83
إِلَّا عِبَادَكَ مِنْهُمُ ٱلْمُخْلَصِينَ
Transliteration illā ʿibādaka min'humu l-mukh'laṣīna
Telugu వారిలో నుండి నీవు ఎన్నుకున్న నీ దాసుల్ని తప్ప!"
Verse 84
قَالَ فَٱلْحَقُّ وَٱلْحَقَّ أَقُولُ
Transliteration qāla fal-ḥaqu wal-ḥaqa aqūlu
Telugu (అల్లాహ్) అన్నాడు: "అయితే సత్యం ఇదే! మరియు నేను సత్యం పలుకుతున్నాను;
Verse 85
لَأَمْلَأَنَّ جَهَنَّمَ مِنكَ وَمِمَّن تَبِعَكَ مِنْهُمْ أَجْمَعِينَ
Transliteration la-amla-anna jahannama minka wamimman tabiʿaka min'hum ajmaʿīna
Telugu నీవు మరియు వారిలో నుండి నిన్ను అనుసరించే వారందరితో నేను నరకాన్ని నింపుతాను!"
Verse 86
قُلْ مَآ أَسْـَٔلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ وَمَآ أَنَا۠ مِنَ ٱلْمُتَكَلِّفِينَ
Transliteration qul mā asalukum ʿalayhi min ajrin wamā anā mina l-mutakalifīna
Telugu (ఓ ప్రవక్తా!) వారితో అను: "నేను దీని (ఈ సందేశం) కొరకు మీ నుండి, ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు మరియు నేను వంచకులలోని వాడను కాను.
Verse 87
إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَـٰلَمِينَ
Transliteration in huwa illā dhik'run lil'ʿālamīna
Telugu ఇది (ఈ ఖుర్ఆన్) సమస్త లోకాల వారందరికీ కేవలం ఒక జ్ఞాపిక (హితబోధ)!
Verse 88
وَلَتَعْلَمُنَّ نَبَأَهُۥ بَعْدَ حِينٍۭ
Transliteration walataʿlamunna naba-ahu baʿda ḥīnin
Telugu మరియు అచిర కాలంలోనే దీని ఉద్దేశాన్ని (వార్తను) మీరు తప్పక తెలుసుకుంటారు."
Read Surah Sad in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Gujarati
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Telugu: the Qur’an in Telugu.
Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.