MyDugsiStart learning

Surah Qaf in Telugu: translation and audio

Surah 50 · ق · The Letter "Qaf" · 45 verses

Surah Qaf verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Qaf word by word in English.

Verse 1

قٓ ۚ وَٱلْقُرْءَانِ ٱلْمَجِيدِ

Transliteration qaf wal-qur'āni l-majīdi

Telugu ఖాఫ్, మరియు దివ్యమైన ఈ ఖుర్ఆన్ సాక్షిగా!

Verse 2

بَلْ عَجِبُوٓا۟ أَن جَآءَهُم مُّنذِرٌ مِّنْهُمْ فَقَالَ ٱلْكَـٰفِرُونَ هَـٰذَا شَىْءٌ عَجِيبٌ

Transliteration bal ʿajibū an jāahum mundhirun min'hum faqāla l-kāfirūna hādhā shayon ʿajībun

Telugu అలా కాదు! హెచ్చరిక చేసేవాడు, వారి వద్దకు వారిలో నుంచే వచ్చాడనే విషయం వారికి ఆశ్చర్యం కలిగించింది, కావున సత్యతిరస్కారులు ఇలా అన్నారు: "ఇది ఆశ్చర్యకరమైన విషయం!

Verse 3

أَءِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا ۖ ذَٰلِكَ رَجْعٌۢ بَعِيدٌ

Transliteration a-idhā mit'nā wakunnā turāban dhālika rajʿun baʿīdun

Telugu మేము మరణించి మట్టిగా మారి పోయినా (మరల బ్రతికించ బడతామా)? ఈ విధంగా మరల (సజీవులై) రావటం చాలా అసంభవమైన విషయం!"

Verse 4

قَدْ عَلِمْنَا مَا تَنقُصُ ٱلْأَرْضُ مِنْهُمْ ۖ وَعِندَنَا كِتَـٰبٌ حَفِيظٌۢ

Transliteration qad ʿalim'nā mā tanquṣu l-arḍu min'hum waʿindanā kitābun ḥafīẓun

Telugu వాస్తవానికి వారి (శరీరాల)లో నుండి భూమి దేనిని తగ్గిస్తుందో మాకు బాగా తెలుసు. మరియు మా దగ్గర అంతా ఒక సురక్షితమైన గ్రంథంలో (వ్రాయబడి) ఉంది.

Verse 5

بَلْ كَذَّبُوا۟ بِٱلْحَقِّ لَمَّا جَآءَهُمْ فَهُمْ فِىٓ أَمْرٍ مَّرِيجٍ

Transliteration bal kadhabū bil-ḥaqi lammā jāahum fahum fī amrin marījin

Telugu కాని వారు, సత్యం వారి వద్దకు వచ్చినపుడు దానిని అసత్యమని తిరస్కరించారు. కాబట్టి వారు ఈ విషయం గురించి కలవరపడుతున్నారు.

Verse 6

أَفَلَمْ يَنظُرُوٓا۟ إِلَى ٱلسَّمَآءِ فَوْقَهُمْ كَيْفَ بَنَيْنَـٰهَا وَزَيَّنَّـٰهَا وَمَا لَهَا مِن فُرُوجٍ

Transliteration afalam yanẓurū ilā l-samāi fawqahum kayfa banaynāhā wazayyannāhā wamā lahā min furūjin

Telugu వారు, తమ మీద ఉన్న ఆకాశం వైపునకు చూడటం లేదా ఏమిటి? మేము దానిని ఏ విధంగా నిర్మించి అలంకరించామో మరియు దానిలో ఎలాంటి చీలికలూ (పగుళ్ళూ) లేవు.

Verse 7

وَٱلْأَرْضَ مَدَدْنَـٰهَا وَأَلْقَيْنَا فِيهَا رَوَٰسِىَ وَأَنۢبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍۭ بَهِيجٍ

Transliteration wal-arḍa madadnāhā wa-alqaynā fīhā rawāsiya wa-anbatnā fīhā min kulli zawjin bahījin

Telugu ఇక భూమిని! మేము దానిని విస్తరింపజేసి, దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము. మరియు అందులో అన్ని రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పత్తి చేశాము.

Verse 8

تَبْصِرَةً وَذِكْرَىٰ لِكُلِّ عَبْدٍ مُّنِيبٍ

Transliteration tabṣiratan wadhik'rā likulli ʿabdin munībin

Telugu (అల్లాహ్) వైపునకు మరలే ప్రతి దాసునికి సూచనగా మరియు బోధనగా!

Verse 9

وَنَزَّلْنَا مِنَ ٱلسَّمَآءِ مَآءً مُّبَـٰرَكًا فَأَنۢبَتْنَا بِهِۦ جَنَّـٰتٍ وَحَبَّ ٱلْحَصِيدِ

Transliteration wanazzalnā mina l-samāi māan mubārakan fa-anbatnā bihi jannātin waḥabba l-ḥaṣīdi

Telugu మరియు మేము ఆకాశం నుండి శుభదాయకమైన నీటిని కురిపించి దాని ద్వారా తోటలను ఉత్పత్తి చేశాము మరియు ధాన్యాలను పండించాము.

Verse 10

وَٱلنَّخْلَ بَاسِقَـٰتٍ لَّهَا طَلْعٌ نَّضِيدٌ

Transliteration wal-nakhla bāsiqātin lahā ṭalʿun naḍīdun

Telugu మరియు ఎత్తయిన ఖర్జూరపు చెట్లను పెంచి, వాటికి వరుసలలో పండ్ల గుత్తులను (పుట్టించాము);

Verse 11

رِّزْقًا لِّلْعِبَادِ ۖ وَأَحْيَيْنَا بِهِۦ بَلْدَةً مَّيْتًا ۚ كَذَٰلِكَ ٱلْخُرُوجُ

Transliteration riz'qan lil'ʿibādi wa-aḥyaynā bihi baldatan maytan kadhālika l-khurūju

Telugu మా దాసులకు జీవనోపాధిగా మరియు దానితో (ఆ నీటితో) చచ్చిన భూమికి ప్రాణం పోశాము. ఇదే విధంగా (చచ్చిన వారిని) కూడా లేపుతాము.

Verse 12

كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَأَصْحَـٰبُ ٱلرَّسِّ وَثَمُودُ

Transliteration kadhabat qablahum qawmu nūḥin wa-aṣḥābu l-rasi wathamūdu

Telugu వారికి పూర్వం నూహ్ జాతి వారు, అర్ రస్ వాసులు మరియు సమూద్ జాతి వారు కూడా, సత్యాన్ని తిరస్కరించారు.

Verse 13

وَعَادٌ وَفِرْعَوْنُ وَإِخْوَٰنُ لُوطٍ

Transliteration waʿādun wafir'ʿawnu wa-ikh'wānu lūṭin

Telugu మరియు ఆద్ జాతి వారు, ఫిర్ఔన్ జాతి వారు మరియు లూత్ సహోదరులు కూడా;

Verse 14

وَأَصْحَـٰبُ ٱلْأَيْكَةِ وَقَوْمُ تُبَّعٍ ۚ كُلٌّ كَذَّبَ ٱلرُّسُلَ فَحَقَّ وَعِيدِ

Transliteration wa-aṣḥābu l-aykati waqawmu tubbaʿin kullun kadhaba l-rusula faḥaqqa waʿīdi

Telugu మరియు అయ్ కహ్ (వన) వాసులు మరియు తుబ్బఅ జాతి వారు కూడాను. ప్రతి ఒక్కరూ తమ ప్రవక్తలను అసత్యులని తిరస్కరించారు, కావున నా బెదరింపు వారి విషయంలో సత్యమయింది.

Verse 15

أَفَعَيِينَا بِٱلْخَلْقِ ٱلْأَوَّلِ ۚ بَلْ هُمْ فِى لَبْسٍ مِّنْ خَلْقٍ جَدِيدٍ

Transliteration afaʿayīnā bil-khalqi l-awali bal hum fī labsin min khalqin jadīdin

Telugu ఏమిటి? మేము మొదటి సృష్టితోనే అలసిపోయామా? అలా కాదు, అసలు వారు కొత్త సృష్టి (పునరుత్థానమును) గురించి సందేహంలో పడి ఉన్నారు.

Verse 16

وَلَقَدْ خَلَقْنَا ٱلْإِنسَـٰنَ وَنَعْلَمُ مَا تُوَسْوِسُ بِهِۦ نَفْسُهُۥ ۖ وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنْ حَبْلِ ٱلْوَرِيدِ

Transliteration walaqad khalaqnā l-insāna wanaʿlamu mā tuwaswisu bihi nafsuhu wanaḥnu aqrabu ilayhi min ḥabli l-warīdi

Telugu మరియు వాస్తవంగా, మేమే మానవుణ్ణి సృష్టించాము మరియు అతని మనస్సులో మెదిలే ఊహలను కూడా మేము ఎరుగుతాము. మరియు మేము అతనికి అతని కంఠ రక్తనాళం కంటే కూడా అతి దగ్గరగా ఉన్నాము.

Verse 17

إِذْ يَتَلَقَّى ٱلْمُتَلَقِّيَانِ عَنِ ٱلْيَمِينِ وَعَنِ ٱلشِّمَالِ قَعِيدٌ

Transliteration idh yatalaqqā l-mutalaqiyāni ʿani l-yamīni waʿani l-shimāli qaʿīdun

Telugu (జ్ఞాపకముంచుకోండి) అతని కుడి మరియు ఎడమ ప్రక్కలలో కూర్చుండి (ప్రతి విషయాన్ని వ్రాసే) ఇద్దరు పర్యవేక్షకులు (దేవదూతలు) అతనిని కలుసుకొన్న తరువాత నుంచి -

Verse 18

مَّا يَلْفِظُ مِن قَوْلٍ إِلَّا لَدَيْهِ رَقِيبٌ عَتِيدٌ

Transliteration mā yalfiẓu min qawlin illā ladayhi raqībun ʿatīdun

Telugu అతనితో బాటు ఒక పర్యవేక్షకుడైనా సిద్ధంగా లేనిదే - అతడు ఏ మాటనూ పలకలేడు.

Verse 19

وَجَآءَتْ سَكْرَةُ ٱلْمَوْتِ بِٱلْحَقِّ ۖ ذَٰلِكَ مَا كُنتَ مِنْهُ تَحِيدُ

Transliteration wajāat sakratu l-mawti bil-ḥaqi dhālika mā kunta min'hu taḥīdu

Telugu మరియు మరణ మూర్ఛ వచ్చేది సత్యం. అది, ఇదే! దేని నుండైతే నీవు తప్పించుకో గోరుతూ ఉండేవాడివో!

Verse 20

وَنُفِخَ فِى ٱلصُّورِ ۚ ذَٰلِكَ يَوْمُ ٱلْوَعِيدِ

Transliteration wanufikha fī l-ṣūri dhālika yawmu l-waʿīdi

Telugu మరియు బాకా (సూర్) ఊదబడుతుంది. ఆ హెచ్చరించబడిన (పునరుత్థాన) దినం అదే!

Verse 21

وَجَآءَتْ كُلُّ نَفْسٍ مَّعَهَا سَآئِقٌ وَشَهِيدٌ

Transliteration wajāat kullu nafsin maʿahā sāiqun washahīdun

Telugu మరియు ప్రతి ఆత్మ (ప్రాణి) ఒక తోలేవాడితో మరొక సాక్ష్యమిచ్చేవాడితో సహా వస్తుంది.

Verse 22

لَّقَدْ كُنتَ فِى غَفْلَةٍ مِّنْ هَـٰذَا فَكَشَفْنَا عَنكَ غِطَآءَكَ فَبَصَرُكَ ٱلْيَوْمَ حَدِيدٌ

Transliteration laqad kunta fī ghaflatin min hādhā fakashafnā ʿanka ghiṭāaka fabaṣaruka l-yawma ḥadīdun

Telugu (ఇలా అనబడుతుంది): "వాస్తవానికి నీవు (ఈ దినాన్ని గురించి) నిర్లక్ష్యంగా ఉండే వాడివి. కావున ఇపుడు మేము నీ ముందున్న తెరను తొలగించాము. కావున, ఈ రోజు నీ దృష్టి చాలా చురుకుగా ఉంది."

Verse 23

وَقَالَ قَرِينُهُۥ هَـٰذَا مَا لَدَىَّ عَتِيدٌ

Transliteration waqāla qarīnuhu hādhā mā ladayya ʿatīdun

Telugu మరియు అతని సహచరుడు (ఖరీనున్) ఇలా అంటాడు: "ఇదిగో నా దగ్గర సిద్ధంగా ఉన్న (ఇతని కర్మ పత్రం) ఇది!"

Verse 24

أَلْقِيَا فِى جَهَنَّمَ كُلَّ كَفَّارٍ عَنِيدٍ

Transliteration alqiyā fī jahannama kulla kaffārin ʿanīdin

Telugu (ఇలా ఆజ్ఞ వస్తుంది): "మూర్ఖపు పట్టు (హఠము) గల ప్రతి సత్యతిరస్కారుణ్ణి మీరిద్దరు కలసి నరకంలో విసరివేయండి;

Verse 25

مَّنَّاعٍ لِّلْخَيْرِ مُعْتَدٍ مُّرِيبٍ

Transliteration mannāʿin lil'khayri muʿ'tadin murībin

Telugu మంచిని నిషేధించే వాడిని, హద్దులు మీరి ప్రవర్తిస్తూ సందేహాలను వ్యాపింప జేసేవాడిని;

Verse 26

ٱلَّذِى جَعَلَ مَعَ ٱللَّهِ إِلَـٰهًا ءَاخَرَ فَأَلْقِيَاهُ فِى ٱلْعَذَابِ ٱلشَّدِيدِ

Transliteration alladhī jaʿala maʿa l-lahi ilāhan ākhara fa-alqiyāhu fī l-ʿadhābi l-shadīdi

Telugu అల్లాహ్ కు సాటిగా ఇతర ఆరాధ్య దైవాన్ని కల్పించినవాడు ఇతడే. కావున ఇతనిని మీరిద్దరూ కలిసి ఘోరశిక్షలో పడవేయండి."

Verse 27

۞ قَالَ قَرِينُهُۥ رَبَّنَا مَآ أَطْغَيْتُهُۥ وَلَـٰكِن كَانَ فِى ضَلَـٰلٍۭ بَعِيدٍ

Transliteration qāla qarīnuhu rabbanā mā aṭghaytuhu walākin kāna fī ḍalālin baʿīdin

Telugu అతని స్నేహితుడు (ఖరీనున్) ఇలా అంటాడు: "ఓ మా ప్రభూ! నేను ఇతని తలబిరుసుతనాన్ని ప్రోత్సహించలేదు, కాని ఇతడే స్వయంగా, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళి పోయాడు."

Verse 28

قَالَ لَا تَخْتَصِمُوا۟ لَدَىَّ وَقَدْ قَدَّمْتُ إِلَيْكُم بِٱلْوَعِيدِ

Transliteration qāla lā takhtaṣimū ladayya waqad qaddamtu ilaykum bil-waʿīdi

Telugu ఆయన (అల్లాహ్) ఇలా అంటాడు: "మీరు నా దగ్గర వాదులాడకండి మరియు వాస్తవానికి నేను ముందుగానే మీ వద్దకు హెచ్చరికను పంపి ఉన్నాను."

Verse 29

مَا يُبَدَّلُ ٱلْقَوْلُ لَدَىَّ وَمَآ أَنَا۠ بِظَلَّـٰمٍ لِّلْعَبِيدِ

Transliteration mā yubaddalu l-qawlu ladayya wamā anā biẓallāmin lil'ʿabīdi

Telugu నా దగ్గర మాట మార్చటం జరుగదు మరియు నేను నా దాసులకు అన్యాయం చేసేవాడను కాను.

Verse 30

يَوْمَ نَقُولُ لِجَهَنَّمَ هَلِ ٱمْتَلَأْتِ وَتَقُولُ هَلْ مِن مَّزِيدٍ

Transliteration yawma naqūlu lijahannama hali im'talati wataqūlu hal min mazīdin

Telugu ఆ రోజు మేము నరకంతో: "నీవు నిండిపోయావా?" అని ప్రశ్నిస్తాము. మరియు అది: "ఇంకా ఏమైనా ఉందా ఏమిటి?" అని అడుగుతుంది.

Verse 31

وَأُزْلِفَتِ ٱلْجَنَّةُ لِلْمُتَّقِينَ غَيْرَ بَعِيدٍ

Transliteration wa-uz'lifati l-janatu lil'muttaqīna ghayra baʿīdin

Telugu మరియు స్వర్గం దైవభీతి గలవారి దగ్గరకు తీసుకురాబడుతుంది! అది వారి నుండి ఏ మాత్రం దూరంగా ఉండదు.

Verse 32

هَـٰذَا مَا تُوعَدُونَ لِكُلِّ أَوَّابٍ حَفِيظٍ

Transliteration hādhā mā tūʿadūna likulli awwābin ḥafīẓin

Telugu (వారితో ఇలా అనబడుతుంది): "ఇదే మీకు వాగ్దానం చేయబడినది. మళ్ళీ మళ్ళీ మా వైపుకు మరలే ప్రతివానికి, (మా హద్దును) లక్ష్యపెట్టిన (పాటించిన) వానికి;

Verse 33

مَّنْ خَشِىَ ٱلرَّحْمَـٰنَ بِٱلْغَيْبِ وَجَآءَ بِقَلْبٍ مُّنِيبٍ

Transliteration man khashiya l-raḥmāna bil-ghaybi wajāa biqalbin munībin

Telugu అగోచరుడైన ఆ కరుణామయునికి భయపడేవానికి మరియు మా వైపునకు పశ్చాత్తాప హృదయంతో మరలేవానికి;

Verse 34

ٱدْخُلُوهَا بِسَلَـٰمٍ ۖ ذَٰلِكَ يَوْمُ ٱلْخُلُودِ

Transliteration ud'khulūhā bisalāmin dhālika yawmu l-khulūdi

Telugu ఇందులో (ఈ స్వర్గంలో), శాంతితో ప్రవేశించండి. ఇదే శాశ్వాత జీవిత దినం."

Verse 35

لَهُم مَّا يَشَآءُونَ فِيهَا وَلَدَيْنَا مَزِيدٌ

Transliteration lahum mā yashāūna fīhā waladaynā mazīdun

Telugu అందులో వారికి, వారు కోరేదంతా ఉంటుంది. మరియు మా దగ్గర ఇంకా చాలా ఉంది.

Verse 36

وَكَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّن قَرْنٍ هُمْ أَشَدُّ مِنْهُم بَطْشًا فَنَقَّبُوا۟ فِى ٱلْبِلَـٰدِ هَلْ مِن مَّحِيصٍ

Transliteration wakam ahlaknā qablahum min qarnin hum ashaddu min'hum baṭshan fanaqqabū fī l-bilādi hal min maḥīṣin

Telugu మరియు మేము, వీరికి పూర్వం ఎన్నో తరాల వారిని నాశనం చేశాము. వారు వీరి కంటే ఎక్కువ శక్తిమంతులు. కాని, (మా శిక్ష పడినప్పుడు) వారు దేశదిమ్మరులై పోయారు. ఏమీ? వారికి తప్పించుకునే మార్గం ఏదైనా దొరికిందా?

Verse 37

إِنَّ فِى ذَٰلِكَ لَذِكْرَىٰ لِمَن كَانَ لَهُۥ قَلْبٌ أَوْ أَلْقَى ٱلسَّمْعَ وَهُوَ شَهِيدٌ

Transliteration inna fī dhālika ladhik'rā liman kāna lahu qalbun aw alqā l-samʿa wahuwa shahīdun

Telugu నిశ్చయంగా, హృదయమున్న వాడికి, శ్రద్ధతో వినేవాడికి మరియు లక్ష్యపెట్టే వాడికి ఇందులో ఒక గుణపాఠముంది.

Verse 38

وَلَقَدْ خَلَقْنَا ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَا فِى سِتَّةِ أَيَّامٍ وَمَا مَسَّنَا مِن لُّغُوبٍ

Transliteration walaqad khalaqnā l-samāwāti wal-arḍa wamā baynahumā fī sittati ayyāmin wamā massanā min lughūbin

Telugu మరియు వాస్తవంగా! మేము ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్ని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాము. కాని మాకు ఎలాంటి అలసట కలుగలేదు.

Verse 39

فَٱصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ قَبْلَ طُلُوعِ ٱلشَّمْسِ وَقَبْلَ ٱلْغُرُوبِ

Transliteration fa-iṣ'bir ʿalā mā yaqūlūna wasabbiḥ biḥamdi rabbika qabla ṭulūʿi l-shamsi waqabla l-ghurūbi

Telugu కావున (ఓ ముహమ్మద్!) వారు పలికే మాటలకు సహనం వహించు మరియు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు. ఆయన స్తోత్రాలు చెయ్యి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయానికి ముందు కూడా;

Verse 40

وَمِنَ ٱلَّيْلِ فَسَبِّحْهُ وَأَدْبَـٰرَ ٱلسُّجُودِ

Transliteration wamina al-layli fasabbiḥ'hu wa-adbāra l-sujūdi

Telugu మరియు రాత్రి వేళలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు మరియు సాష్టాంగం (సజ్దా) చేసిన తరువాత కూడా స్తుతించు.

Verse 41

وَٱسْتَمِعْ يَوْمَ يُنَادِ ٱلْمُنَادِ مِن مَّكَانٍ قَرِيبٍ

Transliteration wa-is'tamiʿ yawma yunādi l-munādi min makānin qarībin

Telugu మరియు చెవి యొగ్గి విను, చాటింపు చేసేవాడు అతి దగ్గరి నుంచే పిలిచే రోజున!

Verse 42

يَوْمَ يَسْمَعُونَ ٱلصَّيْحَةَ بِٱلْحَقِّ ۚ ذَٰلِكَ يَوْمُ ٱلْخُرُوجِ

Transliteration yawma yasmaʿūna l-ṣayḥata bil-ḥaqi dhālika yawmu l-khurūji

Telugu ఆ రోజు మీరు ఒక భయంకర శబ్దం వినేది సత్యం. (గోరీలలో నుండి) బయటికి వచ్చే దినం అదే!

Verse 43

إِنَّا نَحْنُ نُحْىِۦ وَنُمِيتُ وَإِلَيْنَا ٱلْمَصِيرُ

Transliteration innā naḥnu nuḥ'yī wanumītu wa-ilaynā l-maṣīru

Telugu నిశ్చయంగా, మేమే జీవనమిచ్చే వారం మరియు మేమే మరణింపజేసే వారం మరియు మీ అందరి మరలింపు మా వైపునకే జరుగుతుంది.

Verse 44

يَوْمَ تَشَقَّقُ ٱلْأَرْضُ عَنْهُمْ سِرَاعًا ۚ ذَٰلِكَ حَشْرٌ عَلَيْنَا يَسِيرٌ

Transliteration yawma tashaqqaqu l-arḍu ʿanhum sirāʿan dhālika ḥashrun ʿalaynā yasīrun

Telugu ఆ రోజు భూమి చీలిపోయి వారందరూ పరుగిడుతూ బయటికి వస్తారు. అదే సమావేశ సమయం. అది మాకెంతో సులభం.

Verse 45

نَّحْنُ أَعْلَمُ بِمَا يَقُولُونَ ۖ وَمَآ أَنتَ عَلَيْهِم بِجَبَّارٍ ۖ فَذَكِّرْ بِٱلْقُرْءَانِ مَن يَخَافُ وَعِيدِ

Transliteration naḥnu aʿlamu bimā yaqūlūna wamā anta ʿalayhim bijabbārin fadhakkir bil-qur'āni man yakhāfu waʿīdi

Telugu వారనేది మాకు బాగా తెలుసు. నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేయలేవు. కావున నా హెచ్చరికకు భయపడే వాడికి మాత్రమే నీవు ఈ ఖుర్ఆన్ ద్వారా హితబోధ చెయ్యి.

Read Surah Qaf in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.