MyDugsiStart learning

Surah Al-Qasas in Telugu: translation and audio

Surah 28 · القصص · The Stories · 88 verses

Surah Al-Qasas verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Al-Qasas word by word in English.

Verse 1

طسٓمٓ

Transliteration tta-seen-meem

Telugu తా-సీన్-మీమ్.

Verse 2

تِلْكَ ءَايَـٰتُ ٱلْكِتَـٰبِ ٱلْمُبِينِ

Transliteration til'ka āyātu l-kitābi l-mubīni

Telugu ఇవి స్పష్టమైన గ్రంథ సూచనలు (ఆయాత్).

Verse 3

نَتْلُوا۟ عَلَيْكَ مِن نَّبَإِ مُوسَىٰ وَفِرْعَوْنَ بِٱلْحَقِّ لِقَوْمٍ يُؤْمِنُونَ

Transliteration natlū ʿalayka min naba-i mūsā wafir'ʿawna bil-ḥaqi liqawmin yu'minūna

Telugu విశ్వసించే ప్రజల కొరకు, మేము మూసా మరియు ఫిర్ఔన్ ల యొక్క నిజ వృత్తాంతాన్ని నీకు వినిపిస్తున్నాము.

Verse 4

إِنَّ فِرْعَوْنَ عَلَا فِى ٱلْأَرْضِ وَجَعَلَ أَهْلَهَا شِيَعًا يَسْتَضْعِفُ طَآئِفَةً مِّنْهُمْ يُذَبِّحُ أَبْنَآءَهُمْ وَيَسْتَحْىِۦ نِسَآءَهُمْ ۚ إِنَّهُۥ كَانَ مِنَ ٱلْمُفْسِدِينَ

Transliteration inna fir'ʿawna ʿalā fī l-arḍi wajaʿala ahlahā shiyaʿan yastaḍʿifu ṭāifatan min'hum yudhabbiḥu abnāahum wayastaḥyī nisāahum innahu kāna mina l-muf'sidīna

Telugu నిశ్చయంగా, ఫిర్ఔన్ భూమి మీద అహంకారంతో ప్రవర్తిస్తూ ఉండేవాడు. మరియు అందులోని ప్రజలను వర్గాలుగా విభజించి, వారిలోని ఒక తెగ వారిని నీచపరచి వారి పుత్రులను వధిస్తూ ఉండేవాడు మరియు వారి స్త్రీలను బ్రతకనిచ్చేవాడు. నిశ్చయంగా, అతడు దౌర్జన్యపరులలోని వాడిగా ఉండేవాడు.

Verse 5

وَنُرِيدُ أَن نَّمُنَّ عَلَى ٱلَّذِينَ ٱسْتُضْعِفُوا۟ فِى ٱلْأَرْضِ وَنَجْعَلَهُمْ أَئِمَّةً وَنَجْعَلَهُمُ ٱلْوَٰرِثِينَ

Transliteration wanurīdu an namunna ʿalā alladhīna us'tuḍ'ʿifū fī l-arḍi wanajʿalahum a-immatan wanajʿalahumu l-wārithīna

Telugu మరియు భూమి మీద అణచి వేయబడిన వారిని కనికరించాలని మరియు వారిని నాయకులుగా చేయాలని మరియు వారిని వారసులుగా చేయాలని మేము కోరాము.

Verse 6

وَنُمَكِّنَ لَهُمْ فِى ٱلْأَرْضِ وَنُرِىَ فِرْعَوْنَ وَهَـٰمَـٰنَ وَجُنُودَهُمَا مِنْهُم مَّا كَانُوا۟ يَحْذَرُونَ

Transliteration wanumakkina lahum fī l-arḍi wanuriya fir'ʿawna wahāmāna wajunūdahumā min'hum mā kānū yaḥdharūna

Telugu మరియు (ఇస్రాయీల్ సంతతి) వారికి భూమిలో అధికారం ఒసంగాలనీ మరియు ఫిర్ఔన్, హామాన్ మరియు వారి సైనికులకు - దేనిని గురించైతే (ఫిర్ఔన్ జాతి) వారు భయపడుతూ ఉండేవారో - అదే వారికి చూపాలని!

Verse 7

وَأَوْحَيْنَآ إِلَىٰٓ أُمِّ مُوسَىٰٓ أَنْ أَرْضِعِيهِ ۖ فَإِذَا خِفْتِ عَلَيْهِ فَأَلْقِيهِ فِى ٱلْيَمِّ وَلَا تَخَافِى وَلَا تَحْزَنِىٓ ۖ إِنَّا رَآدُّوهُ إِلَيْكِ وَجَاعِلُوهُ مِنَ ٱلْمُرْسَلِينَ

Transliteration wa-awḥaynā ilā ummi mūsā an arḍiʿīhi fa-idhā khif'ti ʿalayhi fa-alqīhi fī l-yami walā takhāfī walā taḥzanī innā rāddūhu ilayki wajāʿilūhu mina l-mur'salīna

Telugu మేము మూసా తల్లి మనస్సులో ఇలా సూచించాము: "నీవు అతనికి (మూసాకు) పాలు ఇస్తూ ఉండు. కాని అతనికి ప్రమాదమున్నదని, నీవు భావిస్తే అతనిని నదిలో విడిచి పెట్టు. మరియు నీవు భయపడకు మరియు దుఃఖించకు; నిశ్చయంగా మేము అతనిని నీ వద్దకు తిరిగి చేర్చుతాము. మరియు అతనిని (మా) సందేశహరులలో ఒకనిగా చేస్తాము!"

Verse 8

فَٱلْتَقَطَهُۥٓ ءَالُ فِرْعَوْنَ لِيَكُونَ لَهُمْ عَدُوًّا وَحَزَنًا ۗ إِنَّ فِرْعَوْنَ وَهَـٰمَـٰنَ وَجُنُودَهُمَا كَانُوا۟ خَـٰطِـِٔينَ

Transliteration fal-taqaṭahu ālu fir'ʿawna liyakūna lahum ʿaduwwan waḥazanan inna fir'ʿawna wahāmāna wajunūdahumā kānū khāṭiīna

Telugu తరువాత ఫిర్ఔన్ కుటుంబంవారు - తమకు శత్రువై, దుఃఖకారణుడవటానికి - అతనిని ఎత్తుకున్నారు. నిశ్చయంగా ఫిర్ఔన్, హామాన్ మరియు వారి సైనికులు పాపిష్ఠులు!

Verse 9

وَقَالَتِ ٱمْرَأَتُ فِرْعَوْنَ قُرَّتُ عَيْنٍ لِّى وَلَكَ ۖ لَا تَقْتُلُوهُ عَسَىٰٓ أَن يَنفَعَنَآ أَوْ نَتَّخِذَهُۥ وَلَدًا وَهُمْ لَا يَشْعُرُونَ

Transliteration waqālati im'ra-atu fir'ʿawna qurratu ʿaynin lī walaka lā taqtulūhu ʿasā an yanfaʿanā aw nattakhidhahu waladan wahum lā yashʿurūna

Telugu మరియు ఫిర్ఔన్ భార్య (అతనితో) ఇలా అన్నది: "ఇతను నీకూ మరియు నాకూ కంటి చలువ! ఇతనిని చంపకు, బహుశా ఇతడు మనకు ఉపయోగకారి కావచ్చు! లేదా మనం ఇతనిని కుమారునిగా చేసుకోవచ్చు!" కాని వారు (వాస్తవాన్ని) తెలుసుకోలేక పోయారు.

Verse 10

وَأَصْبَحَ فُؤَادُ أُمِّ مُوسَىٰ فَـٰرِغًا ۖ إِن كَادَتْ لَتُبْدِى بِهِۦ لَوْلَآ أَن رَّبَطْنَا عَلَىٰ قَلْبِهَا لِتَكُونَ مِنَ ٱلْمُؤْمِنِينَ

Transliteration wa-aṣbaḥa fuādu ummi mūsā fārighan in kādat latub'dī bihi lawlā an rabaṭnā ʿalā qalbihā litakūna mina l-mu'minīna

Telugu మరియు మూసా తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఆమె విశ్వసించినవారిలో ఉండటానికి మేము, ఆమె హృదయాన్ని దృఢపరచి ఉండకపోతే, ఆమె అతనిని (మూసాను) గురించి అంతా బట్టబయలు చేసి ఉండేది.

Verse 11

وَقَالَتْ لِأُخْتِهِۦ قُصِّيهِ ۖ فَبَصُرَتْ بِهِۦ عَن جُنُبٍ وَهُمْ لَا يَشْعُرُونَ

Transliteration waqālat li-ukh'tihi quṣṣīhi fabaṣurat bihi ʿan junubin wahum lā yashʿurūna

Telugu ఆమె, అతని (మూసా) సోదరితో అన్నది: "అతని వెంట వెళ్ళు." కావున ఆమె దూరం నుండియే అతనిని గమనించసాగింది. కానీ, వారది గ్రహించలేక పోయారు.

Verse 12

۞ وَحَرَّمْنَا عَلَيْهِ ٱلْمَرَاضِعَ مِن قَبْلُ فَقَالَتْ هَلْ أَدُلُّكُمْ عَلَىٰٓ أَهْلِ بَيْتٍ يَكْفُلُونَهُۥ لَكُمْ وَهُمْ لَهُۥ نَـٰصِحُونَ

Transliteration waḥarramnā ʿalayhi l-marāḍiʿa min qablu faqālat hal adullukum ʿalā ahli baytin yakfulūnahu lakum wahum lahu nāṣiḥūna

Telugu మరియు మేము అతనిని (ఇతరుల) పాలు త్రాగకుండా మొదటనే నిషేధించి ఉన్నాము. (అతని సోదరి) వారితో అన్నది: "మీ కొరకు అతనిని (పాలిచ్చి) పోషించగల ఒక కుటుంబం వారిని నేను మీకు చూపనా? మరియు వారు అతనిని మంచిగా చూసుకునే వారై ఉంటారు."

Verse 13

فَرَدَدْنَـٰهُ إِلَىٰٓ أُمِّهِۦ كَىْ تَقَرَّ عَيْنُهَا وَلَا تَحْزَنَ وَلِتَعْلَمَ أَنَّ وَعْدَ ٱللَّهِ حَقٌّ وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ

Transliteration faradadnāhu ilā ummihi kay taqarra ʿaynuhā walā taḥzana walitaʿlama anna waʿda l-lahi ḥaqqun walākinna aktharahum lā yaʿlamūna

Telugu ఈ విధంగా మేము అతనిని (మూసాను) - అతని తల్లి కళ్ళు చల్లబడటానికి, ఆమె దుఃఖించకుండా ఉండటానికి మరియు అల్లాహ్ వాగ్దానం సత్యమైనదని ఆమె తెలుసుకోవటానికి - తిరిగి ఆమె వద్దకు చేర్చాము. కాని వాస్తవానికి చాలా మందికి ఇది తెలియదు.

Verse 14

وَلَمَّا بَلَغَ أَشُدَّهُۥ وَٱسْتَوَىٰٓ ءَاتَيْنَـٰهُ حُكْمًا وَعِلْمًا ۚ وَكَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ

Transliteration walammā balagha ashuddahu wa-is'tawā ātaynāhu ḥuk'man waʿil'man wakadhālika najzī l-muḥ'sinīna

Telugu మరియు అతను (మూసా) యుక్తవయస్సుకు చేరి పరిపూర్ణుడు అయినప్పుడు, మేము అతనికి వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము. మరియు ఈ విధంగా, మేము సజ్జనులకు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాము.

Verse 15

وَدَخَلَ ٱلْمَدِينَةَ عَلَىٰ حِينِ غَفْلَةٍ مِّنْ أَهْلِهَا فَوَجَدَ فِيهَا رَجُلَيْنِ يَقْتَتِلَانِ هَـٰذَا مِن شِيعَتِهِۦ وَهَـٰذَا مِنْ عَدُوِّهِۦ ۖ فَٱسْتَغَـٰثَهُ ٱلَّذِى مِن شِيعَتِهِۦ عَلَى ٱلَّذِى مِنْ عَدُوِّهِۦ فَوَكَزَهُۥ مُوسَىٰ فَقَضَىٰ عَلَيْهِ ۖ قَالَ هَـٰذَا مِنْ عَمَلِ ٱلشَّيْطَـٰنِ ۖ إِنَّهُۥ عَدُوٌّ مُّضِلٌّ مُّبِينٌ

Transliteration wadakhala l-madīnata ʿalā ḥīni ghaflatin min ahlihā fawajada fīhā rajulayni yaqtatilāni hādhā min shīʿatihi wahādhā min ʿaduwwihi fa-is'taghāthahu alladhī min shīʿatihi ʿalā alladhī min ʿaduwwihi fawakazahu mūsā faqaḍā ʿalayhi qāla hādhā min ʿamali l-shayṭāni innahu ʿaduwwun muḍillun mubīnun

Telugu మరియు (ఒకరోజు) నగరవాసులు ఏమరుపాటులో ఉన్నప్పుడు, అతను నగరంలోకి ప్రవేశించాడు, అతను ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకోవడం చూశాడు, వారిలో ఒకడు అతని జాతికి చెందినవాడు, మరొకడు విరోధి జాతికి చెందినవాడు. అతని జాతికి చెందిన వాడు, విరోధి జాతివానికి వ్యతిరేకంగా సహాయపడమని అతనిని (మూసాను) అర్థించాడు. మూసా అతడిని ఒక గుద్దుగుద్దాడు. అది అతడిని అంతమొందించింది. (అప్పుడు) అతను (మూసా) అన్నాడు: "ఇది షైతాన్ పనే! నిశ్చయంగా, అతడు శత్రువు మరియు స్పష్టంగా దారి తప్పించేవాడు."

Verse 16

قَالَ رَبِّ إِنِّى ظَلَمْتُ نَفْسِى فَٱغْفِرْ لِى فَغَفَرَ لَهُۥٓ ۚ إِنَّهُۥ هُوَ ٱلْغَفُورُ ٱلرَّحِيمُ

Transliteration qāla rabbi innī ẓalamtu nafsī fa-igh'fir lī faghafara lahu innahu huwa l-ghafūru l-raḥīmu

Telugu (మూసా) ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నాకు నేను అన్యాయం చేసుకున్నాను. కావున నన్ను క్షమించు!" (అల్లాహ్) అతనిని క్షమించాడు. నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

Verse 17

قَالَ رَبِّ بِمَآ أَنْعَمْتَ عَلَىَّ فَلَنْ أَكُونَ ظَهِيرًا لِّلْمُجْرِمِينَ

Transliteration qāla rabbi bimā anʿamta ʿalayya falan akūna ẓahīran lil'muj'rimīna

Telugu (మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు నాకు మహోపకారం చేశావు. కావున నేను ఇక ఎన్నటికీ నేరస్తులకు సహాయపడను!"

Verse 18

فَأَصْبَحَ فِى ٱلْمَدِينَةِ خَآئِفًا يَتَرَقَّبُ فَإِذَا ٱلَّذِى ٱسْتَنصَرَهُۥ بِٱلْأَمْسِ يَسْتَصْرِخُهُۥ ۚ قَالَ لَهُۥ مُوسَىٰٓ إِنَّكَ لَغَوِىٌّ مُّبِينٌ

Transliteration fa-aṣbaḥa fī l-madīnati khāifan yataraqqabu fa-idhā alladhī is'tanṣarahu bil-amsi yastaṣrikhuhu qāla lahu mūsā innaka laghawiyyun mubīnun

Telugu మరుసటి రోజు ఉదయం అతను (మూసా) భయపడుతూ అతని జాగ్రత్తగా (ఇటూ అటూ చూస్తూ) నగరంలోకి వెళ్ళాడు. అప్పుడు అకస్మాత్తుగా అంతకు ముందు రోజు, అతనిని సహాయానికి పిలిచినవాడే, మళ్ళీ సహాయానికై అరవసాగాడు. మూసా వానితో అన్నాడు: "నిశ్చయంగా, నీవు స్పష్టమైన తప్పు దారికి లాగేవాడవు!"

Verse 19

فَلَمَّآ أَنْ أَرَادَ أَن يَبْطِشَ بِٱلَّذِى هُوَ عَدُوٌّ لَّهُمَا قَالَ يَـٰمُوسَىٰٓ أَتُرِيدُ أَن تَقْتُلَنِى كَمَا قَتَلْتَ نَفْسًۢا بِٱلْأَمْسِ ۖ إِن تُرِيدُ إِلَّآ أَن تَكُونَ جَبَّارًا فِى ٱلْأَرْضِ وَمَا تُرِيدُ أَن تَكُونَ مِنَ ٱلْمُصْلِحِينَ

Transliteration falammā an arāda an yabṭisha bi-alladhī huwa ʿaduwwun lahumā qāla yāmūsā aturīdu an taqtulanī kamā qatalta nafsan bil-amsi in turīdu illā an takūna jabbāran fī l-arḍi wamā turīdu an takūna mina l-muṣ'liḥīna

Telugu ఆ తరువాత అతను తమ ఇద్దరికీ విరోధి అయిన వాడిని గట్టిగా పట్టుకోబోగా, అతడు అరిచాడు: "ఓ మూసా! ఏమీ? నీవు నిన్న ఒక వ్యక్తిని చంపినట్లు నన్ను కూడా చంపదలచుకున్నావా? నీవు ఈ దేశంలో క్రూరునిగా మారి ఉండదలుచుకున్నావా? సద్వర్తనునిగా ఉండదలుచుకోలేదా?"

Verse 20

وَجَآءَ رَجُلٌ مِّنْ أَقْصَا ٱلْمَدِينَةِ يَسْعَىٰ قَالَ يَـٰمُوسَىٰٓ إِنَّ ٱلْمَلَأَ يَأْتَمِرُونَ بِكَ لِيَقْتُلُوكَ فَٱخْرُجْ إِنِّى لَكَ مِنَ ٱلنَّـٰصِحِينَ

Transliteration wajāa rajulun min aqṣā l-madīnati yasʿā qāla yāmūsā inna l-mala-a yatamirūna bika liyaqtulūka fa-ukh'ruj innī laka mina l-nāṣiḥīna

Telugu మరియు ఒక వ్యక్తి నగరపు ఒక వైపు నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు: ఓ మూసా! నాయకులందరూ కలిసి నిన్ను హత్య చేయాలని సంప్రదింపులు చేస్తున్నారు. కావున నీవు వెళ్ళిపో, నేను నిశ్చయంగా, నీ శ్రేయోభిలాషిని!"

Verse 21

فَخَرَجَ مِنْهَا خَآئِفًا يَتَرَقَّبُ ۖ قَالَ رَبِّ نَجِّنِى مِنَ ٱلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ

Transliteration fakharaja min'hā khāifan yataraqqabu qāla rabbi najjinī mina l-qawmi l-ẓālimīna

Telugu అప్పుడతను భయపడుతూ, అతి జాగ్రత్తగా అక్కడి నుండి బయలు దేరాడు. అతను ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నన్ను దుర్మార్గుల నుండి కాపాడు!"

Verse 22

وَلَمَّا تَوَجَّهَ تِلْقَآءَ مَدْيَنَ قَالَ عَسَىٰ رَبِّىٓ أَن يَهْدِيَنِى سَوَآءَ ٱلسَّبِيلِ

Transliteration walammā tawajjaha til'qāa madyana qāla ʿasā rabbī an yahdiyanī sawāa l-sabīli

Telugu ఆ తరువాత మద్ యన్ వైపుకు బయలు దేరుతూ, ఇలా అనుకున్నాడు: "బహుశా, నా ప్రభువు నాకు సరైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తున్నాడు!"

Verse 23

وَلَمَّا وَرَدَ مَآءَ مَدْيَنَ وَجَدَ عَلَيْهِ أُمَّةً مِّنَ ٱلنَّاسِ يَسْقُونَ وَوَجَدَ مِن دُونِهِمُ ٱمْرَأَتَيْنِ تَذُودَانِ ۖ قَالَ مَا خَطْبُكُمَا ۖ قَالَتَا لَا نَسْقِى حَتَّىٰ يُصْدِرَ ٱلرِّعَآءُ ۖ وَأَبُونَا شَيْخٌ كَبِيرٌ

Transliteration walammā warada māa madyana wajada ʿalayhi ummatan mina l-nāsi yasqūna wawajada min dūnihimu im'ra-atayni tadhūdāni qāla mā khaṭbukumā qālatā lā nasqī ḥattā yuṣ'dira l-riʿāu wa-abūnā shaykhun kabīrun

Telugu ఇత అతను మద్ యన్ లోని ఒక బావి వద్దకు చేరుకున్నప్పుడు; అక్కడ చాలా మంది ప్రజలు, తమ తమ పశువులకు నీరు త్రాగించటాన్ని మరియు వారికి దూరంగా ఒక ప్రక్కన ఇద్దరు స్త్రీలు తమ పశువులను ఆపుతూ ఉండటాన్ని చూశాడు. (మూసా) ఆ స్త్రీలను అడిగాడు: "మీరిద్దరి చిక్కు ఏమిటి?" వారిద్దరన్నారు: "ఈ పశువుల కాపరులంతా పోయే వరకు మేము (మా పశువులకు) నీరు త్రాపలేము. మరియు మా తండ్రి చాలా వృద్ధుడు"

Verse 24

فَسَقَىٰ لَهُمَا ثُمَّ تَوَلَّىٰٓ إِلَى ٱلظِّلِّ فَقَالَ رَبِّ إِنِّى لِمَآ أَنزَلْتَ إِلَىَّ مِنْ خَيْرٍ فَقِيرٌ

Transliteration fasaqā lahumā thumma tawallā ilā l-ẓili faqāla rabbi innī limā anzalta ilayya min khayrin faqīrun

Telugu అప్పుడు అతను వారిద్దరి పశువులకు నీరు త్రాపాడు. తరువాత నీడలోకి పోయి ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నీవు నాపై ఏ మేలును అవతరింపజేసినా, నేను దాని ఆవశ్యకత గలవాడనే!"

Verse 25

فَجَآءَتْهُ إِحْدَىٰهُمَا تَمْشِى عَلَى ٱسْتِحْيَآءٍ قَالَتْ إِنَّ أَبِى يَدْعُوكَ لِيَجْزِيَكَ أَجْرَ مَا سَقَيْتَ لَنَا ۚ فَلَمَّا جَآءَهُۥ وَقَصَّ عَلَيْهِ ٱلْقَصَصَ قَالَ لَا تَخَفْ ۖ نَجَوْتَ مِنَ ٱلْقَوْمِ ٱلظَّـٰلِمِينَ

Transliteration fajāathu iḥ'dāhumā tamshī ʿalā is'tiḥ'yāin qālat inna abī yadʿūka liyajziyaka ajra mā saqayta lanā falammā jāahu waqaṣṣa ʿalayhi l-qaṣaṣa qāla lā takhaf najawta mina l-qawmi l-ẓālimīna

Telugu తరువాత ఆ ఇద్దరిలో ఒకామె సిగ్గుపడుతూ మెల్లగా అతని వద్దకు వచ్చి ఇలా అన్నది: "వాస్తవానికి నా తండ్రి - నీవు మా కొరకు (మా పశువులకు) నీరు త్రాపించి నందుకు - ప్రతిఫలమివ్వటానికి, నిన్ను పిలుస్తున్నాడు." అతను, అతని వద్దకు పోయి తన వృత్తాంతాన్ని వినిపించాడు. అప్పుడతను అన్నాడు: "నీవు ఏ మాత్రం భయపడకు. నీవు దుర్మార్గ ప్రజల నుండి విముక్తి పొందావు."

Verse 26

قَالَتْ إِحْدَىٰهُمَا يَـٰٓأَبَتِ ٱسْتَـْٔجِرْهُ ۖ إِنَّ خَيْرَ مَنِ ٱسْتَـْٔجَرْتَ ٱلْقَوِىُّ ٱلْأَمِينُ

Transliteration qālat iḥ'dāhumā yāabati is'tajir'hu inna khayra mani is'tajarta l-qawiyu l-amīnu

Telugu వారిద్దరిలో ఒకామె ఇలా అన్నది: "నాన్నా! ఇతనిని పని కొరకు పెట్టుకో. నిశ్చయంగా, ఇలాంటి బలవంతుని మరియు నమ్మదగిన వానిని పని కొరకు పెట్టుకోవటం ఎంతో మేలైనది."

Verse 27

قَالَ إِنِّىٓ أُرِيدُ أَنْ أُنكِحَكَ إِحْدَى ٱبْنَتَىَّ هَـٰتَيْنِ عَلَىٰٓ أَن تَأْجُرَنِى ثَمَـٰنِىَ حِجَجٍ ۖ فَإِنْ أَتْمَمْتَ عَشْرًا فَمِنْ عِندِكَ ۖ وَمَآ أُرِيدُ أَنْ أَشُقَّ عَلَيْكَ ۚ سَتَجِدُنِىٓ إِن شَآءَ ٱللَّهُ مِنَ ٱلصَّـٰلِحِينَ

Transliteration qāla innī urīdu an unkiḥaka iḥ'dā ib'natayya hātayni ʿalā an tajuranī thamāniya ḥijajin fa-in atmamta ʿashran famin ʿindika wamā urīdu an ashuqqa ʿalayka satajidunī in shāa l-lahu mina l-ṣāliḥīna

Telugu (వారి తండ్రి) అన్నాడు: "నీవు నా వద్ద ఎనిమిది సంవత్సరాలు పని చేస్తూ ఉండటానికి ఒప్పుకుంటే, నేను నా ఈ ఇద్దరు కుమార్తెలలో ఒకామెను నీకిచ్చి వివాహం చేయగోరుతున్నాను. నీవు ఒకవేళ పది సంవత్సరాలు పూర్తి చేయదలిస్తే అది నీ ఇష్టం! నేను నీకు కష్టం కలిగించ దలచుకోలేదు. అల్లాహ్ కోరితే, నీవు నన్ను సద్వర్తనునిగా పొందుతావు!"

Verse 28

قَالَ ذَٰلِكَ بَيْنِى وَبَيْنَكَ ۖ أَيَّمَا ٱلْأَجَلَيْنِ قَضَيْتُ فَلَا عُدْوَٰنَ عَلَىَّ ۖ وَٱللَّهُ عَلَىٰ مَا نَقُولُ وَكِيلٌ

Transliteration qāla dhālika baynī wabaynaka ayyamā l-ajalayni qaḍaytu falā ʿud'wāna ʿalayya wal-lahu ʿalā mā naqūlu wakīlun

Telugu (మూసా) అన్నాడు: "ఈ విషయం నీకూ మరియు నాకూ మధ్య నిశ్చయమే! ఈ రెండు గడువులలో నేను దేనిని పూర్తి చేసినా, నా పై ఎలాంటి ఒత్తిడి ఉండకూడదు. మరియు మన ఈ మాటలకు అల్లాహ్ యే సాక్షి!"

Verse 29

۞ فَلَمَّا قَضَىٰ مُوسَى ٱلْأَجَلَ وَسَارَ بِأَهْلِهِۦٓ ءَانَسَ مِن جَانِبِ ٱلطُّورِ نَارًا قَالَ لِأَهْلِهِ ٱمْكُثُوٓا۟ إِنِّىٓ ءَانَسْتُ نَارًا لَّعَلِّىٓ ءَاتِيكُم مِّنْهَا بِخَبَرٍ أَوْ جَذْوَةٍ مِّنَ ٱلنَّارِ لَعَلَّكُمْ تَصْطَلُونَ

Transliteration falammā qaḍā mūsā l-ajala wasāra bi-ahlihi ānasa min jānibi l-ṭūri nāran qāla li-ahlihi um'kuthū innī ānastu nāran laʿallī ātīkum min'hā bikhabarin aw jadhwatin mina l-nāri laʿallakum taṣṭalūna

Telugu ఆ తరువాత మూసా తన గడువు పూర్తి చేసి, తన కుటుంబం వారిని తీసుకొని పోతుండగా, తూర్ పర్వతపు దిక్కులో ఒక మంటను చూశాడు. (అప్పుడు) తన ఇంటి వారితో అన్నాడు: "ఆగండి! నేను ఒక మంటను చూశాను, బహుశా! నేను అక్కడి నుండి ఏదైనా మంచి వార్తను తీసుకొని రావచ్చు, లేదా ఒక అగ్ని కొరవినైనా! అప్పుడు మీరు దానితో చలి కాచుకోవచ్చు."

Verse 30

فَلَمَّآ أَتَىٰهَا نُودِىَ مِن شَـٰطِئِ ٱلْوَادِ ٱلْأَيْمَنِ فِى ٱلْبُقْعَةِ ٱلْمُبَـٰرَكَةِ مِنَ ٱلشَّجَرَةِ أَن يَـٰمُوسَىٰٓ إِنِّىٓ أَنَا ٱللَّهُ رَبُّ ٱلْعَـٰلَمِينَ

Transliteration falammā atāhā nūdiya min shāṭi-i l-wādi l-aymani fī l-buq'ʿati l-mubārakati mina l-shajarati an yāmūsā innī anā l-lahu rabbu l-ʿālamīna

Telugu కాని అతను దాని (అగ్ని) వద్దకు చేరుకున్నప్పుడు, ఆ లోయ కుడివైపు ఉన్న ఒక శుభవంతమైన స్థలములో ఉన్న ఒక చెట్టు నుండి: "ఓ మూసా! నిశ్చయంగా, నేనే అల్లాహ్ ను! సర్వలోకాల ప్రభువును." అనే మాటలు వినిపించాయి.

Verse 31

وَأَنْ أَلْقِ عَصَاكَ ۖ فَلَمَّا رَءَاهَا تَهْتَزُّ كَأَنَّهَا جَآنٌّ وَلَّىٰ مُدْبِرًا وَلَمْ يُعَقِّبْ ۚ يَـٰمُوسَىٰٓ أَقْبِلْ وَلَا تَخَفْ ۖ إِنَّكَ مِنَ ٱلْـَٔامِنِينَ

Transliteration wa-an alqi ʿaṣāka falammā raāhā tahtazzu ka-annahā jānnun wallā mud'biran walam yuʿaqqib yāmūsā aqbil walā takhaf innaka mina l-āminīna

Telugu (ఇంకా ఇలా వినిపించింది): "నీ చేతి కర్రను పడవేయి!" అతను (మూసా) దానిని పామువలే కదలటం చూసి వెనక్కి మరలి పరుగెత్తాడు, తిరిగి కూడా చూడలేదు. (తరువాత ఇలా సెలవీయబడింది): "ఓ మూసా, ముందుకు రా, భయపడకు! నిశ్చయంగా, నీవు సురక్షితంగా ఉన్నావు!

Verse 32

ٱسْلُكْ يَدَكَ فِى جَيْبِكَ تَخْرُجْ بَيْضَآءَ مِنْ غَيْرِ سُوٓءٍ وَٱضْمُمْ إِلَيْكَ جَنَاحَكَ مِنَ ٱلرَّهْبِ ۖ فَذَٰنِكَ بُرْهَـٰنَانِ مِن رَّبِّكَ إِلَىٰ فِرْعَوْنَ وَمَلَإِي۟هِۦٓ ۚ إِنَّهُمْ كَانُوا۟ قَوْمًا فَـٰسِقِينَ

Transliteration us'luk yadaka fī jaybika takhruj bayḍāa min ghayri sūin wa-uḍ'mum ilayka janāḥaka mina l-rahbi fadhānika bur'hānāni min rabbika ilā fir'ʿawna wamala-ihi innahum kānū qawman fāsiqīna

Telugu నీ చేతిని నీ చంకలోకి దూర్చుకో, అది ఎలాంటి లోపం లేకుండా ప్రకాశిస్తూ బయటికి వస్తుంది. నీవు భయపడకుండా ఉండటానికి నీ చేతిని నీ ప్రక్కకు అదుముకో! ఈ రెండు, నీవు ఫిర్ఔన్ మరియు అతని నాయకులకు (చూపటానికి) నీ ప్రభువు ప్రసాదించిన నిదర్శనాలు (ఆయాత్). నిశ్చయంగా వారు చాలా దుష్టులయి పోయారు!"

Verse 33

قَالَ رَبِّ إِنِّى قَتَلْتُ مِنْهُمْ نَفْسًا فَأَخَافُ أَن يَقْتُلُونِ

Transliteration qāla rabbi innī qataltu min'hum nafsan fa-akhāfu an yaqtulūni

Telugu (మూసా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నేను వారి మనిషిని ఒకనిని చంపాను. కావున వారు నన్ను చంపుతారేమోనని భయపడుతున్నాను.

Verse 34

وَأَخِى هَـٰرُونُ هُوَ أَفْصَحُ مِنِّى لِسَانًا فَأَرْسِلْهُ مَعِىَ رِدْءًا يُصَدِّقُنِىٓ ۖ إِنِّىٓ أَخَافُ أَن يُكَذِّبُونِ

Transliteration wa-akhī hārūnu huwa afṣaḥu minnī lisānan fa-arsil'hu maʿiya rid'an yuṣaddiqunī innī akhāfu an yukadhibūni

Telugu మరియు నా సోదరుడు హారూన్ మాట్లాడటంలో నా కంటే మంచి వాగ్ధాటి గలవాడు. నన్ను సమర్థించటానికి అతనిని నాకు సహాయకునిగా నాతో పాటు పంపు. వాస్తవానికి వారు నన్ను అసత్యవాదివని తిరస్కరిస్తారేమోనని నేను భయపడుతున్నాను!"

Verse 35

قَالَ سَنَشُدُّ عَضُدَكَ بِأَخِيكَ وَنَجْعَلُ لَكُمَا سُلْطَـٰنًا فَلَا يَصِلُونَ إِلَيْكُمَا ۚ بِـَٔايَـٰتِنَآ أَنتُمَا وَمَنِ ٱتَّبَعَكُمَا ٱلْغَـٰلِبُونَ

Transliteration qāla sanashuddu ʿaḍudaka bi-akhīka wanajʿalu lakumā sul'ṭānan falā yaṣilūna ilaykumā biāyātinā antumā wamani ittabaʿakumā l-ghālibūna

Telugu ఆయన (అల్లాహ్) అన్నాడు: "మేము నీ సోదరుని ద్వారా నీ చేతులను బలపరుస్తాము. మరియు మేము మీ ఇద్దరికీ విశేష శక్తి నొసంగుతాము. వారు మీ ఇద్దరికి ఏ మాత్రం హాని చేయలేరు. మా సూచనల ద్వారా మీరిద్దరూ మరియు మిమ్మల్ని అనుసరించే వారు గెలుపొందుతారు."

Verse 36

فَلَمَّا جَآءَهُم مُّوسَىٰ بِـَٔايَـٰتِنَا بَيِّنَـٰتٍ قَالُوا۟ مَا هَـٰذَآ إِلَّا سِحْرٌ مُّفْتَرًى وَمَا سَمِعْنَا بِهَـٰذَا فِىٓ ءَابَآئِنَا ٱلْأَوَّلِينَ

Transliteration falammā jāahum mūsā biāyātinā bayyinātin qālū mā hādhā illā siḥ'run muf'taran wamā samiʿ'nā bihādhā fī ābāinā l-awalīna

Telugu ఆ తరువాత మూసా మా స్పష్టమైన సూచనలను తీసుకొని వారి వద్దకు పోగా వారన్నారు: "ఇది కల్పితమైన మాయాజాలం మాత్రమే. ఇలాంటిది పూర్వీకులైన మా తాతముత్తాతల కాలంలో కూడా జరిగినట్లు మేము వినలేదు."

Verse 37

وَقَالَ مُوسَىٰ رَبِّىٓ أَعْلَمُ بِمَن جَآءَ بِٱلْهُدَىٰ مِنْ عِندِهِۦ وَمَن تَكُونُ لَهُۥ عَـٰقِبَةُ ٱلدَّارِ ۖ إِنَّهُۥ لَا يُفْلِحُ ٱلظَّـٰلِمُونَ

Transliteration waqāla mūsā rabbī aʿlamu biman jāa bil-hudā min ʿindihi waman takūnu lahu ʿāqibatu l-dāri innahu lā yuf'liḥu l-ẓālimūna

Telugu ఇక మూసా అన్నాడు: "నా ప్రభువు తరఫు నుండి ఎవడు మార్గదర్శకత్వం తీసుకొని వచ్చాడో మరియు చివరికి ఎవరి పర్యవసానం మంచిదవుతుందో ఆయనకు బాగా తెలుసు. నిశ్చయంగా, దుర్మార్గులు ఎన్నడూ సాఫల్యం పొందలేరు."

Verse 38

وَقَالَ فِرْعَوْنُ يَـٰٓأَيُّهَا ٱلْمَلَأُ مَا عَلِمْتُ لَكُم مِّنْ إِلَـٰهٍ غَيْرِى فَأَوْقِدْ لِى يَـٰهَـٰمَـٰنُ عَلَى ٱلطِّينِ فَٱجْعَل لِّى صَرْحًا لَّعَلِّىٓ أَطَّلِعُ إِلَىٰٓ إِلَـٰهِ مُوسَىٰ وَإِنِّى لَأَظُنُّهُۥ مِنَ ٱلْكَـٰذِبِينَ

Transliteration waqāla fir'ʿawnu yāayyuhā l-mala-u mā ʿalim'tu lakum min ilāhin ghayrī fa-awqid lī yāhāmānu ʿalā l-ṭīni fa-ij'ʿal lī ṣarḥan laʿallī aṭṭaliʿu ilā ilāhi mūsā wa-innī la-aẓunnuhu mina l-kādhibīna

Telugu మరియు ఫిర్ఔన్ అన్నాడు: "ఓ నాయకులారా! నేను తప్ప మీకు మరొక ఆరాధ్య దేవుడు గలడని నాకు తెలియదు. కావున ఓ హామాన్! కాల్చిన మట్టి ఇటుకలతో నాకొక ఎత్తైన గోపురాన్ని నిర్మించు. దానిపై ఎక్కి నేను బహుశా, మూసా దేవుణ్ణి చూడగలనేమో! నిశ్చయంగా, నేను ఇతనిని అసత్యవాదిగా భావిస్తున్నాను."

Verse 39

وَٱسْتَكْبَرَ هُوَ وَجُنُودُهُۥ فِى ٱلْأَرْضِ بِغَيْرِ ٱلْحَقِّ وَظَنُّوٓا۟ أَنَّهُمْ إِلَيْنَا لَا يُرْجَعُونَ

Transliteration wa-is'takbara huwa wajunūduhu fī l-arḍi bighayri l-ḥaqi waẓannū annahum ilaynā lā yur'jaʿūna

Telugu మరియు, అతడు మరియు అతడి సైనికులు భూమిపై అన్యాయంగా అహంభావాన్ని ప్రదర్శించారు. మరియు నిశ్చయంగా, మా వైపుకు తాము ఎన్నడూ మరలిరారని భావించారు.

Verse 40

فَأَخَذْنَـٰهُ وَجُنُودَهُۥ فَنَبَذْنَـٰهُمْ فِى ٱلْيَمِّ ۖ فَٱنظُرْ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلظَّـٰلِمِينَ

Transliteration fa-akhadhnāhu wajunūdahu fanabadhnāhum fī l-yami fa-unẓur kayfa kāna ʿāqibatu l-ẓālimīna

Telugu కావున మేము అతనిని మరియు అతని సేనలను పట్టుకొని సముద్రంలోకి విసరివేశాము. ఇక చూడు! దుర్మార్గుల పర్యవసానం ఏమయిందో!

Verse 41

وَجَعَلْنَـٰهُمْ أَئِمَّةً يَدْعُونَ إِلَى ٱلنَّارِ ۖ وَيَوْمَ ٱلْقِيَـٰمَةِ لَا يُنصَرُونَ

Transliteration wajaʿalnāhum a-immatan yadʿūna ilā l-nāri wayawma l-qiyāmati lā yunṣarūna

Telugu మరియు మేము వారిని నరకం వైపునకు పిలిచే నాయకులుగా చేశాము. మరియు పునరుత్థాన దినమున వారికెలాంటి సహాయం దొరకదు.

Verse 42

وَأَتْبَعْنَـٰهُمْ فِى هَـٰذِهِ ٱلدُّنْيَا لَعْنَةً ۖ وَيَوْمَ ٱلْقِيَـٰمَةِ هُم مِّنَ ٱلْمَقْبُوحِينَ

Transliteration wa-atbaʿnāhum fī hādhihi l-dun'yā laʿnatan wayawma l-qiyāmati hum mina l-maqbūḥīna

Telugu మరియు మేము ఈ లోకంలో కూడా అభిశాపం వారిని వెంటాడేటట్లు చేశాము. మరియు పునరుత్థాన దినమున వారు తృణీకరింప బడేవారిలో చేరుతారు.

Verse 43

وَلَقَدْ ءَاتَيْنَا مُوسَى ٱلْكِتَـٰبَ مِنۢ بَعْدِ مَآ أَهْلَكْنَا ٱلْقُرُونَ ٱلْأُولَىٰ بَصَآئِرَ لِلنَّاسِ وَهُدًى وَرَحْمَةً لَّعَلَّهُمْ يَتَذَكَّرُونَ

Transliteration walaqad ātaynā mūsā l-kitāba min baʿdi mā ahlaknā l-qurūna l-ūlā baṣāira lilnnāsi wahudan waraḥmatan laʿallahum yatadhakkarūna

Telugu మరియు వాస్తవానికి - పూర్వ తరాల వారిని నాశనం చేసిన తరువాత - మేము మానవులకు జ్ఞానవృద్ధి చేయటానికి మరియు వారికి మార్గదర్శకత్వంగా కారుణ్యంగా ఉండటానికి, మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము. బహుశా వారు హితబోధ నేర్చుకుంటారని!

Verse 44

وَمَا كُنتَ بِجَانِبِ ٱلْغَرْبِىِّ إِذْ قَضَيْنَآ إِلَىٰ مُوسَى ٱلْأَمْرَ وَمَا كُنتَ مِنَ ٱلشَّـٰهِدِينَ

Transliteration wamā kunta bijānibi l-gharbiyi idh qaḍaynā ilā mūsā l-amra wamā kunta mina l-shāhidīna

Telugu మరియు (ఓ ముహమ్మద్!) మేము మూసాపై మా ఆదేశం (తౌరాత్) పూర్తిగా అవతరింప జేసినపుడు, నీవు (తూర్ పర్వతపు) కుడి వైపునా లేవు. మరియు నీవు అక్కడ ప్రత్యక్ష సాక్షులలో కూడా లేవు!

Verse 45

وَلَـٰكِنَّآ أَنشَأْنَا قُرُونًا فَتَطَاوَلَ عَلَيْهِمُ ٱلْعُمُرُ ۚ وَمَا كُنتَ ثَاوِيًا فِىٓ أَهْلِ مَدْيَنَ تَتْلُوا۟ عَلَيْهِمْ ءَايَـٰتِنَا وَلَـٰكِنَّا كُنَّا مُرْسِلِينَ

Transliteration walākinnā anshanā qurūnan fataṭāwala ʿalayhimu l-ʿumuru wamā kunta thāwiyan fī ahli madyana tatlū ʿalayhim āyātinā walākinnā kunnā mur'silīna

Telugu కాని నిశ్చయంగా, (ఆ తరువాత కూడా) మేము అనేక తరాలను ప్రభవింపజేశాము. వారి మీదుగా ఒక సుదీర్ఘకాలం గడిచి పోయింది. మా సూచనలను వినిపించటానికి నీవు మద్ యన్ వాసులతో కూడా లేవు, కాని మేము (ఎల్లప్పుడూ) మా సందేశహరులను పంపుతూ వచ్చాము.

Verse 46

وَمَا كُنتَ بِجَانِبِ ٱلطُّورِ إِذْ نَادَيْنَا وَلَـٰكِن رَّحْمَةً مِّن رَّبِّكَ لِتُنذِرَ قَوْمًا مَّآ أَتَىٰهُم مِّن نَّذِيرٍ مِّن قَبْلِكَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ

Transliteration wamā kunta bijānibi l-ṭūri idh nādaynā walākin raḥmatan min rabbika litundhira qawman mā atāhum min nadhīrin min qablika laʿallahum yatadhakkarūna

Telugu మరియు మేము (మూసాను) పిలిచినపుడు, నీవు (ఓ ముహమ్మద్!) తూర్ పర్వతం దగ్గర లేవు. కాని నీవు నీ ప్రభువు యొక్క కారుణ్యంతో, నీకు పూర్వం హెచ్చరిక చేసేవాడు రానటువంటి జాతివారిని హెచ్చరించటానికి - బహుశా వారు హితబోధ నేర్చుకుంటారేమోనని - (పంపబడ్డావు).

Verse 47

وَلَوْلَآ أَن تُصِيبَهُم مُّصِيبَةٌۢ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ فَيَقُولُوا۟ رَبَّنَا لَوْلَآ أَرْسَلْتَ إِلَيْنَا رَسُولًا فَنَتَّبِعَ ءَايَـٰتِكَ وَنَكُونَ مِنَ ٱلْمُؤْمِنِينَ

Transliteration walawlā an tuṣībahum muṣībatun bimā qaddamat aydīhim fayaqūlū rabbanā lawlā arsalta ilaynā rasūlan fanattabiʿa āyātika wanakūna mina l-mu'minīna

Telugu మరియు వారు తమ చేతులారా, చేసుకొని పంపిన కర్మల ఫలితంగా వారిపై ఆపద వచ్చి పడినపుడు, వారు: "ఓ మా ప్రభూ! నీవు మా వద్దకు ఒక సందేశహరుణ్ణి ఎందుకు పంపలేదు, అలా చేస్తే మేము నీ సూచనలను అనుసరిస్తూ, విశ్వాసులైన వారిలో చేరి ఉండేవారం కదా!" (అని తీర్పు దినమున అనకూడదని).

Verse 48

فَلَمَّا جَآءَهُمُ ٱلْحَقُّ مِنْ عِندِنَا قَالُوا۟ لَوْلَآ أُوتِىَ مِثْلَ مَآ أُوتِىَ مُوسَىٰٓ ۚ أَوَلَمْ يَكْفُرُوا۟ بِمَآ أُوتِىَ مُوسَىٰ مِن قَبْلُ ۖ قَالُوا۟ سِحْرَانِ تَظَـٰهَرَا وَقَالُوٓا۟ إِنَّا بِكُلٍّ كَـٰفِرُونَ

Transliteration falammā jāahumu l-ḥaqu min ʿindinā qālū lawlā ūtiya mith'la mā ūtiya mūsā awalam yakfurū bimā ūtiya mūsā min qablu qālū siḥ'rāni taẓāharā waqālū innā bikullin kāfirūna

Telugu ఆ తర్వాత మా తరఫు నుండి వారి వద్దకు సత్యం వచ్చినపుడు, వారిలా అన్నారు: "మూసాకు ఇవ్వ బడినటువంటిది, ఇతనికి ఎందుకు ఇవ్వబడలేదు!" ఏమీ? దీనికి పూర్వం మూసాకు ఇవ్వబడిన దానిని వారు తిరస్కరించలేదా? వారన్నారు: "రెండూ మాయాజాలాలే! అవి ఒకదాని కొకటి సహాయపడుతున్నాయి." ఇంకా ఇలా అన్నారు: "నిశ్చయంగా, మేము వీటన్నింటినీ తిరస్కరిస్తున్నాము."

Verse 49

قُلْ فَأْتُوا۟ بِكِتَـٰبٍ مِّنْ عِندِ ٱللَّهِ هُوَ أَهْدَىٰ مِنْهُمَآ أَتَّبِعْهُ إِن كُنتُمْ صَـٰدِقِينَ

Transliteration qul fatū bikitābin min ʿindi l-lahi huwa ahdā min'humā attabiʿ'hu in kuntum ṣādiqīna

Telugu (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "మీరు నిజాయితీపరులే అయితే, అల్లాహ్ దగ్గర నుండి ఈ రెండింటి కంటే ఉత్తమమైన మార్గం చూపే ఒక గ్రంథాన్ని తీసుకురండి. దానిని నేను అనుసరిస్తాను."

Verse 50

فَإِن لَّمْ يَسْتَجِيبُوا۟ لَكَ فَٱعْلَمْ أَنَّمَا يَتَّبِعُونَ أَهْوَآءَهُمْ ۚ وَمَنْ أَضَلُّ مِمَّنِ ٱتَّبَعَ هَوَىٰهُ بِغَيْرِ هُدًى مِّنَ ٱللَّهِ ۚ إِنَّ ٱللَّهَ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلظَّـٰلِمِينَ

Transliteration fa-in lam yastajībū laka fa-iʿ'lam annamā yattabiʿūna ahwāahum waman aḍallu mimmani ittabaʿa hawāhu bighayri hudan mina l-lahi inna l-laha lā yahdī l-qawma l-ẓālimīna

Telugu వారు నీకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోతే, వారు కేవలం తమ కోరికలను అనుసరిస్తున్నారని తెలుసుకో! మరియు అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని విడిచి కేవలం తన కోరికలను అనుసరించే వాని కంటే ఎక్కువ మార్గభ్రష్టుడు ఎవడు? నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు.

Verse 51

۞ وَلَقَدْ وَصَّلْنَا لَهُمُ ٱلْقَوْلَ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ

Transliteration walaqad waṣṣalnā lahumu l-qawla laʿallahum yatadhakkarūna

Telugu మరియు వారు హితబోధ పొందాలని, వాస్తవంగా మేము ఈ వచనాన్ని (ఖుర్ఆన్ ను) క్రమక్రమంగా అందజేశాము.

Verse 52

ٱلَّذِينَ ءَاتَيْنَـٰهُمُ ٱلْكِتَـٰبَ مِن قَبْلِهِۦ هُم بِهِۦ يُؤْمِنُونَ

Transliteration alladhīna ātaynāhumu l-kitāba min qablihi hum bihi yu'minūna

Telugu ఎవరికైతే పూర్వం మేము గ్రంథాన్ని ఇచ్చామో వారు దీనిని (ఖుర్ఆన్ ను) విశ్వసిస్తారు.

Verse 53

وَإِذَا يُتْلَىٰ عَلَيْهِمْ قَالُوٓا۟ ءَامَنَّا بِهِۦٓ إِنَّهُ ٱلْحَقُّ مِن رَّبِّنَآ إِنَّا كُنَّا مِن قَبْلِهِۦ مُسْلِمِينَ

Transliteration wa-idhā yut'lā ʿalayhim qālū āmannā bihi innahu l-ḥaqu min rabbinā innā kunnā min qablihi mus'limīna

Telugu మరియు వారికి ఇది వినిపించబడి నప్పుడు, వారు ఇలా అంటారు: "మేము దీనిని విశ్వసించాము, నిశ్చయంగా ఇది మా ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. నిశ్చయంగా, మేము మొదటి నుండియో అల్లాహ్ కు విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము."

Verse 54

أُو۟لَـٰٓئِكَ يُؤْتَوْنَ أَجْرَهُم مَّرَّتَيْنِ بِمَا صَبَرُوا۟ وَيَدْرَءُونَ بِٱلْحَسَنَةِ ٱلسَّيِّئَةَ وَمِمَّا رَزَقْنَـٰهُمْ يُنفِقُونَ

Transliteration ulāika yu'tawna ajrahum marratayni bimā ṣabarū wayadraūna bil-ḥasanati l-sayi-ata wamimmā razaqnāhum yunfiqūna

Telugu వీరే, తమ సహనానికి ఫలితంగా రెండింతలు ప్రతిఫలమొసంగపడే వారు. వీరే మంచితో చెడును నివారించే వారు. మరియు మేము వారికిచ్చిన జీవనోపాధి నుండి ఖర్చు చేసేవారు.

Verse 55

وَإِذَا سَمِعُوا۟ ٱللَّغْوَ أَعْرَضُوا۟ عَنْهُ وَقَالُوا۟ لَنَآ أَعْمَـٰلُنَا وَلَكُمْ أَعْمَـٰلُكُمْ سَلَـٰمٌ عَلَيْكُمْ لَا نَبْتَغِى ٱلْجَـٰهِلِينَ

Transliteration wa-idhā samiʿū l-laghwa aʿraḍū ʿanhu waqālū lanā aʿmālunā walakum aʿmālukum salāmun ʿalaykum lā nabtaghī l-jāhilīna

Telugu మరియు వారు వ్యర్థమైన మాటలు విన్నప్పుడు, ఇలా అంటూ దూరంగా తొలగి పోతారు: "మాకు మా కర్మలు మరియు మీకు మీ కర్మలు, మీకు సలాం! మాకు మూర్ఖులతో పనిలేదు."

Verse 56

إِنَّكَ لَا تَهْدِى مَنْ أَحْبَبْتَ وَلَـٰكِنَّ ٱللَّهَ يَهْدِى مَن يَشَآءُ ۚ وَهُوَ أَعْلَمُ بِٱلْمُهْتَدِينَ

Transliteration innaka lā tahdī man aḥbabta walākinna l-laha yahdī man yashāu wahuwa aʿlamu bil-muh'tadīna

Telugu (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీవు, నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వం చేయలేవు, కాని అల్లాహ్ తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఆయనకు మార్గదర్శకత్వం పొందే వారెవరో బాగా తెలుసు.

Verse 57

وَقَالُوٓا۟ إِن نَّتَّبِعِ ٱلْهُدَىٰ مَعَكَ نُتَخَطَّفْ مِنْ أَرْضِنَآ ۚ أَوَلَمْ نُمَكِّن لَّهُمْ حَرَمًا ءَامِنًا يُجْبَىٰٓ إِلَيْهِ ثَمَرَٰتُ كُلِّ شَىْءٍ رِّزْقًا مِّن لَّدُنَّا وَلَـٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ

Transliteration waqālū in nattabiʿi l-hudā maʿaka nutakhaṭṭaf min arḍinā awalam numakkin lahum ḥaraman āminan yuj'bā ilayhi thamarātu kulli shayin riz'qan min ladunnā walākinna aktharahum lā yaʿlamūna

Telugu వారు ఇలా అంటారు: "ఒకవేళ నీతో పాటు మేము కూడా ఈ మార్గదర్శకత్వాన్ని అవలంబిస్తే! మేము మా భూమి నుండియే పారద్రోలబడతాము." ఏమీ? మేము వారిని శాంతికి నిలయమైన ఒక పవిత్ర స్థలం (మక్కా) లో స్థిరనివాసము నొసంగి వారికి మా తరఫు నుండి జీవనోపాధిగా అన్ని రకాల ఫలాలను సమకూర్చలేదా? కాని వాస్తవానికి వారిలో చాలా మందికి ఇది తెలియదు.

Verse 58

وَكَمْ أَهْلَكْنَا مِن قَرْيَةٍۭ بَطِرَتْ مَعِيشَتَهَا ۖ فَتِلْكَ مَسَـٰكِنُهُمْ لَمْ تُسْكَن مِّنۢ بَعْدِهِمْ إِلَّا قَلِيلًا ۖ وَكُنَّا نَحْنُ ٱلْوَٰرِثِينَ

Transliteration wakam ahlaknā min qaryatin baṭirat maʿīshatahā fatil'ka masākinuhum lam tus'kan min baʿdihim illā qalīlan wakunnā naḥnu l-wārithīna

Telugu మరియు మేము ఎన్నో నగరాలను, జీవన సుఖసంపదలతో ఉప్పొంగిపోతూ ఉండగా, వాటిని నాశనం చేయలేదా! అవిగో వారి నివాసాలు, వారి తరువాత వాటిలో నివసించిన వారు చాలా తక్కువ! మరియు నిశ్చయంగా, మేమే వాటికి వారసులయ్యాము.

Verse 59

وَمَا كَانَ رَبُّكَ مُهْلِكَ ٱلْقُرَىٰ حَتَّىٰ يَبْعَثَ فِىٓ أُمِّهَا رَسُولًا يَتْلُوا۟ عَلَيْهِمْ ءَايَـٰتِنَا ۚ وَمَا كُنَّا مُهْلِكِى ٱلْقُرَىٰٓ إِلَّا وَأَهْلُهَا ظَـٰلِمُونَ

Transliteration wamā kāna rabbuka muh'lika l-qurā ḥattā yabʿatha fī ummihā rasūlan yatlū ʿalayhim āyātinā wamā kunnā muh'likī l-qurā illā wa-ahluhā ẓālimūna

Telugu మరియు నీ ప్రభువు నగరాలను ఏ మాత్రమూ నాశనం చేసేవాడు కాదు, ఎంత వరకైతే వాటి ముఖ్య నగరానికి మా సూచన (ఆయాత్) లను వినిపించే సందేశహరులను పంపమో! మేము నగరాలను వాటి ప్రజలు దుర్మార్గులై పోతే తప్ప, నాశనం చేసే వారం కాము.

Verse 60

وَمَآ أُوتِيتُم مِّن شَىْءٍ فَمَتَـٰعُ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا وَزِينَتُهَا ۚ وَمَا عِندَ ٱللَّهِ خَيْرٌ وَأَبْقَىٰٓ ۚ أَفَلَا تَعْقِلُونَ

Transliteration wamā ūtītum min shayin famatāʿu l-ḥayati l-dun'yā wazīnatuhā wamā ʿinda l-lahi khayrun wa-abqā afalā taʿqilūna

Telugu మరియు మీకు ఇవ్వబడిన వన్నీ ఈ ప్రాపంచిక జీవితపు సుఖసంతోషాల సామాగ్రి మరియు దాని అలంకరణలు మాత్రమే! కాని అల్లాహ్ వద్ద ఉన్నది దీని కంటే ఎంతో ఉత్తమమైనది మరియు నిత్యమైనది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా?

Verse 61

أَفَمَن وَعَدْنَـٰهُ وَعْدًا حَسَنًا فَهُوَ لَـٰقِيهِ كَمَن مَّتَّعْنَـٰهُ مَتَـٰعَ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا ثُمَّ هُوَ يَوْمَ ٱلْقِيَـٰمَةِ مِنَ ٱلْمُحْضَرِينَ

Transliteration afaman waʿadnāhu waʿdan ḥasanan fahuwa lāqīhi kaman mattaʿnāhu matāʿa l-ḥayati l-dun'yā thumma huwa yawma l-qiyāmati mina l-muḥ'ḍarīna

Telugu ఏమీ? మేము చేసిన మంచి వాగ్దానాన్ని తప్పకుండా పొందేవాడు, మేము ఒసంగిన ఈ ప్రాపంచిక సుఖసంతోషాలు పొంది, పునరుత్థాన దినమున మా ముందు (శిక్షకై) హాజరు చేయబడే వాడితో సమానుడు కాగలడా?

Verse 62

وَيَوْمَ يُنَادِيهِمْ فَيَقُولُ أَيْنَ شُرَكَآءِىَ ٱلَّذِينَ كُنتُمْ تَزْعُمُونَ

Transliteration wayawma yunādīhim fayaqūlu ayna shurakāiya alladhīna kuntum tazʿumūna

Telugu మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆ రోజు ఆయన (అల్లాహ్) వారిని పిలిచి ఇలా ప్రశ్నిస్తాడు: "మీరు నా భాగస్వాములని నొక్కి చెప్పిన వారు (భావించిన వారు) ఇప్పుడు ఎక్కడున్నారు?"

Verse 63

قَالَ ٱلَّذِينَ حَقَّ عَلَيْهِمُ ٱلْقَوْلُ رَبَّنَا هَـٰٓؤُلَآءِ ٱلَّذِينَ أَغْوَيْنَآ أَغْوَيْنَـٰهُمْ كَمَا غَوَيْنَا ۖ تَبَرَّأْنَآ إِلَيْكَ ۖ مَا كَانُوٓا۟ إِيَّانَا يَعْبُدُونَ

Transliteration qāla alladhīna ḥaqqa ʿalayhimu l-qawlu rabbanā hāulāi alladhīna aghwaynā aghwaynāhum kamā ghawaynā tabarranā ilayka mā kānū iyyānā yaʿbudūna

Telugu ఎవరైతే ఆ మాట (శిక్ష) వర్తిస్తుందో, వారిలా విన్నవించుకుంటారు: "ఓ మా ప్రభూ! మేము దారి తప్పించిన వారు వీరే! మేము దారి తప్పిన విధంగానే వీరిని కూడా దారి తప్పించాము. వీరితో మాకెలాంటి సంబంధం లేదని నీ ముందు ప్రకటిస్తున్నాము. అసలు వీరు మమ్మల్ని ఆరాధించనేలేదు."

Verse 64

وَقِيلَ ٱدْعُوا۟ شُرَكَآءَكُمْ فَدَعَوْهُمْ فَلَمْ يَسْتَجِيبُوا۟ لَهُمْ وَرَأَوُا۟ ٱلْعَذَابَ ۚ لَوْ أَنَّهُمْ كَانُوا۟ يَهْتَدُونَ

Transliteration waqīla id'ʿū shurakāakum fadaʿawhum falam yastajībū lahum wara-awū l-ʿadhāba law annahum kānū yahtadūna

Telugu మరియు వారితో ఇలా అనబడుతుంది: "మీరు సాటి కల్పించిన మీ భాగస్వాములను పిలువండి!" అప్పుడు వారు, వారిని (భాగస్వాములను) పిలుస్తారు, కాని వారు, వారికి సమాధానమివ్వరు. మరియు వారు శిక్షను చూసి (అనుకుంటారు): "ఒకవేళ వాస్తవానికి తాము సన్మార్గాన్ని అవలంబించి వుంటే ఎంత బాగుండేది!" అని.

Verse 65

وَيَوْمَ يُنَادِيهِمْ فَيَقُولُ مَاذَآ أَجَبْتُمُ ٱلْمُرْسَلِينَ

Transliteration wayawma yunādīhim fayaqūlu mādhā ajabtumu l-mur'salīna

Telugu మరియు (జ్ఞాపకముంచుకోండి!) ఆయన (అల్లాహ్) వారిని పిలిచిన రోజు ఇలా ప్రశ్నిస్తాడు: "మేము పంపిన సందేశహరులకు మీరు ఏ విధంగా సమాధానమిచ్చారు?"

Verse 66

فَعَمِيَتْ عَلَيْهِمُ ٱلْأَنۢبَآءُ يَوْمَئِذٍ فَهُمْ لَا يَتَسَآءَلُونَ

Transliteration faʿamiyat ʿalayhimu l-anbāu yawma-idhin fahum lā yatasāalūna

Telugu ఆ రోజు వారి సమాధానాలన్నీ (కారణాలన్నీ) అస్పష్టమై పోతాయి మరియు వారు ఒకరితో నొకరు సంప్రదించుకోనూ లేరు.

Verse 67

فَأَمَّا مَن تَابَ وَءَامَنَ وَعَمِلَ صَـٰلِحًا فَعَسَىٰٓ أَن يَكُونَ مِنَ ٱلْمُفْلِحِينَ

Transliteration fa-ammā man tāba waāmana waʿamila ṣāliḥan faʿasā an yakūna mina l-muf'liḥīna

Telugu కాని ఎవడైతే పశ్చాత్తాప పడి, విశ్వసించి, సత్కార్యాలు చేస్తాడో! అతడు సాఫల్యం పొందే వారిలో చేరగలడని ఆశించవచ్చు!

Verse 68

وَرَبُّكَ يَخْلُقُ مَا يَشَآءُ وَيَخْتَارُ ۗ مَا كَانَ لَهُمُ ٱلْخِيَرَةُ ۚ سُبْحَـٰنَ ٱللَّهِ وَتَعَـٰلَىٰ عَمَّا يُشْرِكُونَ

Transliteration warabbuka yakhluqu mā yashāu wayakhtāru mā kāna lahumu l-khiyaratu sub'ḥāna l-lahi wataʿālā ʿammā yush'rikūna

Telugu మరియు నీ ప్రభువు తాను కోరిన దానిని సృష్టిస్తాడు మరియు ఎన్నుకుంటాడు. మరియు ఎన్నుకునే హక్కు వారికి ఏ మాత్రం లేదు. అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు, వారు సాటి కల్పించే భాగస్వాముల కంటే మహోన్నతుడు.

Verse 69

وَرَبُّكَ يَعْلَمُ مَا تُكِنُّ صُدُورُهُمْ وَمَا يُعْلِنُونَ

Transliteration warabbuka yaʿlamu mā tukinnu ṣudūruhum wamā yuʿ'linūna

Telugu మరియు వారు తమ హృదయాలలో దాచుకున్నది మరియు బహిర్గతం చేసేది అంతా నీ ప్రభువుకు తెలుసు.

Verse 70

وَهُوَ ٱللَّهُ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ۖ لَهُ ٱلْحَمْدُ فِى ٱلْأُولَىٰ وَٱلْـَٔاخِرَةِ ۖ وَلَهُ ٱلْحُكْمُ وَإِلَيْهِ تُرْجَعُونَ

Transliteration wahuwa l-lahu lā ilāha illā huwa lahu l-ḥamdu fī l-ūlā wal-ākhirati walahu l-ḥuk'mu wa-ilayhi tur'jaʿūna

Telugu మరియు ఆయనే, అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! మొదట (ఇహలోకంలో) మరియు చివరకు (పరలోకంలో) స్తుతింపదగినవాడు కేవలం ఆయనే! మరియు విశ్వన్యాయాధిపత్యం ఆయనదే. మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు.

Verse 71

قُلْ أَرَءَيْتُمْ إِن جَعَلَ ٱللَّهُ عَلَيْكُمُ ٱلَّيْلَ سَرْمَدًا إِلَىٰ يَوْمِ ٱلْقِيَـٰمَةِ مَنْ إِلَـٰهٌ غَيْرُ ٱللَّهِ يَأْتِيكُم بِضِيَآءٍ ۖ أَفَلَا تَسْمَعُونَ

Transliteration qul ara-aytum in jaʿala l-lahu ʿalaykumu al-layla sarmadan ilā yawmi l-qiyāmati man ilāhun ghayru l-lahi yatīkum biḍiyāin afalā tasmaʿūna

Telugu వారితో అను: "ఏమీ? మీరు ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్ మీపైన పునరుత్థాన దినం వరకు ఎడతెగకుండా రాత్రి ఆవరింపజేస్తే, అల్లాహ్ తప్ప మరే దేవుడైనా, మీకు వెలుగును తేగలడా? అయితే మీరెందుకు వినరు?"

Verse 72

قُلْ أَرَءَيْتُمْ إِن جَعَلَ ٱللَّهُ عَلَيْكُمُ ٱلنَّهَارَ سَرْمَدًا إِلَىٰ يَوْمِ ٱلْقِيَـٰمَةِ مَنْ إِلَـٰهٌ غَيْرُ ٱللَّهِ يَأْتِيكُم بِلَيْلٍ تَسْكُنُونَ فِيهِ ۖ أَفَلَا تُبْصِرُونَ

Transliteration qul ara-aytum in jaʿala l-lahu ʿalaykumu l-nahāra sarmadan ilā yawmi l-qiyāmati man ilāhun ghayru l-lahi yatīkum bilaylin taskunūna fīhi afalā tub'ṣirūna

Telugu ఇంకా ఇలా అను: "ఏమీ? మీరు ఆలోచించారా? ఒకవేళ అల్లాహ్ మీపై పునరుత్థాన దినము వరకు ఎడతెగకుండా పగటిని అవతరింపజేస్తే, అల్లాహ్ తప్ప మరే దేవుడైనా మీకు విశ్రాంతి పొందటానికి రాత్రిని తేగలడా? అయితే, మీరెందుకు చూడలేరు?"

Verse 73

وَمِن رَّحْمَتِهِۦ جَعَلَ لَكُمُ ٱلَّيْلَ وَٱلنَّهَارَ لِتَسْكُنُوا۟ فِيهِ وَلِتَبْتَغُوا۟ مِن فَضْلِهِۦ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ

Transliteration wamin raḥmatihi jaʿala lakumu al-layla wal-nahāra litaskunū fīhi walitabtaghū min faḍlihi walaʿallakum tashkurūna

Telugu ఆయన తన కారుణ్యంతో మీ కొరకు రాత్రిని మరియు పగటిని, విశ్రాంతి పొందటానికి మరియు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి చేశాడు, బహుశా మీరు కృతజ్ఞులౌతారేమోనని.

Verse 74

وَيَوْمَ يُنَادِيهِمْ فَيَقُولُ أَيْنَ شُرَكَآءِىَ ٱلَّذِينَ كُنتُمْ تَزْعُمُونَ

Transliteration wayawma yunādīhim fayaqūlu ayna shurakāiya alladhīna kuntum tazʿumūna

Telugu మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆయన (అల్లాహ్), వారిని ఆ రోజు పిలిచి ఇలా ప్రశ్నిస్తాడు: "మీరు నాకు భాగస్వాములని నొక్కి చెప్పిన వారు (భావించిన వారు) ఇప్పుడు ఎక్కడున్నారు?"

Verse 75

وَنَزَعْنَا مِن كُلِّ أُمَّةٍ شَهِيدًا فَقُلْنَا هَاتُوا۟ بُرْهَـٰنَكُمْ فَعَلِمُوٓا۟ أَنَّ ٱلْحَقَّ لِلَّهِ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا۟ يَفْتَرُونَ

Transliteration wanazaʿnā min kulli ummatin shahīdan faqul'nā hātū bur'hānakum faʿalimū anna l-ḥaqa lillahi waḍalla ʿanhum mā kānū yaftarūna

Telugu మరియు మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని నిలబెట్టి ఇలా అంటాము: "మీ నిదర్శనాన్ని తీసుకురండి!" అప్పుడు వారు సత్యం, నిశ్చయంగా అల్లాహ్ వైపే ఉందని తెలుసుకుంటారు. మరియు వారు కల్పించుకున్నవన్నీ వారిని త్యజించి ఉంటాయి.

Verse 76

۞ إِنَّ قَـٰرُونَ كَانَ مِن قَوْمِ مُوسَىٰ فَبَغَىٰ عَلَيْهِمْ ۖ وَءَاتَيْنَـٰهُ مِنَ ٱلْكُنُوزِ مَآ إِنَّ مَفَاتِحَهُۥ لَتَنُوٓأُ بِٱلْعُصْبَةِ أُو۟لِى ٱلْقُوَّةِ إِذْ قَالَ لَهُۥ قَوْمُهُۥ لَا تَفْرَحْ ۖ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلْفَرِحِينَ

Transliteration inna qārūna kāna min qawmi mūsā fabaghā ʿalayhim waātaynāhu mina l-kunūzi mā inna mafātiḥahu latanūu bil-ʿuṣ'bati ulī l-quwati idh qāla lahu qawmuhu lā tafraḥ inna l-laha lā yuḥibbu l-fariḥīna

Telugu వాస్తవానికి, ఖారూన్, మూసా జాతికి చెందినవాడే. కాని అతడు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. మరియు మేము అతడికి ఎన్నో నిధులను ఇచ్చి ఉంటిమి. వాటి తాళవు చెవులను బలవంతులైన పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది కూడా ఎంతో కష్టంతో మాత్రమే మోయగలిగే వారు. అతడి జాతి వారు అతనితో అన్నారు: "నీవు విర్రవీగకు, నిశ్చయంగా, అల్లాహ్ విర్రవీగే వారిని ప్రేమించడు!

Verse 77

وَٱبْتَغِ فِيمَآ ءَاتَىٰكَ ٱللَّهُ ٱلدَّارَ ٱلْـَٔاخِرَةَ ۖ وَلَا تَنسَ نَصِيبَكَ مِنَ ٱلدُّنْيَا ۖ وَأَحْسِن كَمَآ أَحْسَنَ ٱللَّهُ إِلَيْكَ ۖ وَلَا تَبْغِ ٱلْفَسَادَ فِى ٱلْأَرْضِ ۖ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلْمُفْسِدِينَ

Transliteration wa-ib'taghi fīmā ātāka l-lahu l-dāra l-ākhirata walā tansa naṣībaka mina l-dun'yā wa-aḥsin kamā aḥsana l-lahu ilayka walā tabghi l-fasāda fī l-arḍi inna l-laha lā yuḥibbu l-muf'sidīna

Telugu మరియు అల్లాహ్ నీకు ఇచ్చిన సంపదతో పరలోక గృహాన్ని పొందటానికి ప్రయత్నించు. మరియు ఇహలోకం నుండి లభించే భాగాన్ని మరచిపోకు. నీకు అల్లాహ్ మేలు చేసినట్లు, నీవు కూడా (ప్రజలకు) మేలు చేయి. భూమిపై కల్లోలం రేకెత్తించటానికి ప్రయత్నించకు. నిశ్చయంగా, అల్లాహ్ కల్లోలం రేకెత్తించేవారిని ప్రేమించడు!"

Verse 78

قَالَ إِنَّمَآ أُوتِيتُهُۥ عَلَىٰ عِلْمٍ عِندِىٓ ۚ أَوَلَمْ يَعْلَمْ أَنَّ ٱللَّهَ قَدْ أَهْلَكَ مِن قَبْلِهِۦ مِنَ ٱلْقُرُونِ مَنْ هُوَ أَشَدُّ مِنْهُ قُوَّةً وَأَكْثَرُ جَمْعًا ۚ وَلَا يُسْـَٔلُ عَن ذُنُوبِهِمُ ٱلْمُجْرِمُونَ

Transliteration qāla innamā ūtītuhu ʿalā ʿil'min ʿindī awalam yaʿlam anna l-laha qad ahlaka min qablihi mina l-qurūni man huwa ashaddu min'hu quwwatan wa-aktharu jamʿan walā yus'alu ʿan dhunūbihimu l-muj'rimūna

Telugu అతడు (ఖారూన్) అన్నాడు: "నిశ్చయంగా, ఇది (ఈ ధనం) నాకు నా జ్ఞానం వల్లనే ఇవ్వబడింది!" ఏమీ? అతడికి తెలియదా? నిశ్చయంగా అల్లాహ్ అతడికి ముందు ఎన్నో తరాల వారిని - అతడి కంటే ఎక్కువ బలం మరియు ఎక్కువ ధనసంపదలు గలవారిని కూడా - నాశనం చేశాడని? మరియు పాపాత్ములు వారి పాపాలను గురించి ప్రశ్నింపబడరు.

Verse 79

فَخَرَجَ عَلَىٰ قَوْمِهِۦ فِى زِينَتِهِۦ ۖ قَالَ ٱلَّذِينَ يُرِيدُونَ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا يَـٰلَيْتَ لَنَا مِثْلَ مَآ أُوتِىَ قَـٰرُونُ إِنَّهُۥ لَذُو حَظٍّ عَظِيمٍ

Transliteration fakharaja ʿalā qawmihi fī zīnatihi qāla alladhīna yurīdūna l-ḥayata l-dun'yā yālayta lanā mith'la mā ūtiya qārūnu innahu ladhū ḥaẓẓin ʿaẓīmin

Telugu తరువాత అతడు తన వైభవంతో తన జాతి వారి ఎదుటకు వచ్చాడు. ఇహలోక జీవితపు సుఖాలు కోరేవారు ఇలా అన్నారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! ఖారూన్ కు లభించినటు వంటివి (ధనసంపత్తులు) మాకు కూడా లభించి ఉంటే ఎంత బాగుండేది? నిశ్చయంగా అతడు ఎంతో అదృష్టవంతుడు!"

Verse 80

وَقَالَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْعِلْمَ وَيْلَكُمْ ثَوَابُ ٱللَّهِ خَيْرٌ لِّمَنْ ءَامَنَ وَعَمِلَ صَـٰلِحًا وَلَا يُلَقَّىٰهَآ إِلَّا ٱلصَّـٰبِرُونَ

Transliteration waqāla alladhīna ūtū l-ʿil'ma waylakum thawābu l-lahi khayrun liman āmana waʿamila ṣāliḥan walā yulaqqāhā illā l-ṣābirūna

Telugu కాని జ్ఞానసంపన్నులు అన్నారు: "మీ దౌర్భాగ్యం! అల్లాహ్ ఇచ్చే ప్రతిఫలమే, విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి ఎంతో శ్రేష్ఠమైనది. మరియు ఈ మహాభాగ్యం, సహనం వహించే వారికి తప్ప ఇతరులకు లభించదు."

Verse 81

فَخَسَفْنَا بِهِۦ وَبِدَارِهِ ٱلْأَرْضَ فَمَا كَانَ لَهُۥ مِن فِئَةٍ يَنصُرُونَهُۥ مِن دُونِ ٱللَّهِ وَمَا كَانَ مِنَ ٱلْمُنتَصِرِينَ

Transliteration fakhasafnā bihi wabidārihi l-arḍa famā kāna lahu min fi-atin yanṣurūnahu min dūni l-lahi wamā kāna mina l-muntaṣirīna

Telugu ఆ పిదప మేము అతనిని, అతని గృహంతో సహా భూమిలోకి అణగద్రొక్కాము. అతడిని, అల్లాహ్ (శిక్ష) నుండి తప్పించగల, అతడి తెగవారు ఎవ్వరూ లేకపోయారు మరియు అతడు కూడా తనను తాను కాపాడు కోలేకపోయాడు.

Verse 82

وَأَصْبَحَ ٱلَّذِينَ تَمَنَّوْا۟ مَكَانَهُۥ بِٱلْأَمْسِ يَقُولُونَ وَيْكَأَنَّ ٱللَّهَ يَبْسُطُ ٱلرِّزْقَ لِمَن يَشَآءُ مِنْ عِبَادِهِۦ وَيَقْدِرُ ۖ لَوْلَآ أَن مَّنَّ ٱللَّهُ عَلَيْنَا لَخَسَفَ بِنَا ۖ وَيْكَأَنَّهُۥ لَا يُفْلِحُ ٱلْكَـٰفِرُونَ

Transliteration wa-aṣbaḥa alladhīna tamannaw makānahu bil-amsi yaqūlūna wayka-anna l-laha yabsuṭu l-riz'qa liman yashāu min ʿibādihi wayaqdiru lawlā an manna l-lahu ʿalaynā lakhasafa binā wayka-annahu lā yuf'liḥu l-kāfirūna

Telugu మరియు నిన్నటి వరకు అతడి (ఖారూన్) వలే కావలెనని ఎవరైతే కోరుతూ వచ్చారో, వారు ఇప్పుడు ఇలా పలుకసాగారు: "తెలుసుకోండి! అల్లాహ్ తన దాసులలో, తాను కోరిన వారికి జీవనోపాధిని విస్తరింపజేస్తాడు. మరియు (తాను కోరిన వారికి) తగ్గిస్తాడు. ఒకవేళ అల్లాహ్ అనుగ్రహమే మాపై లేకుంటే ఆయన మమ్మల్ని కూడా భూమిలోకి అణగద్రొక్కి ఉండేవాడు. తెలుసుకోండి! సత్యతిరస్కారులు ఎన్నడూ సాఫల్యం పొందలేరు!"

Verse 83

تِلْكَ ٱلدَّارُ ٱلْـَٔاخِرَةُ نَجْعَلُهَا لِلَّذِينَ لَا يُرِيدُونَ عُلُوًّا فِى ٱلْأَرْضِ وَلَا فَسَادًا ۚ وَٱلْعَـٰقِبَةُ لِلْمُتَّقِينَ

Transliteration til'ka l-dāru l-ākhiratu najʿaluhā lilladhīna lā yurīdūna ʿuluwwan fī l-arḍi walā fasādan wal-ʿāqibatu lil'muttaqīna

Telugu ఆ పరలోక జీవితపు గృహాన్ని మేము భూమిలో పెద్దరికం చూపగోరని వారి కొరకు మరియు కల్లోలం రేకెత్తించని వారి కొరకు ప్రత్యేకిస్తాము. మరియు దైవభీతి గలవారికే (మేలైన) పర్యవసానం ఉంటుంది.

Verse 84

مَن جَآءَ بِٱلْحَسَنَةِ فَلَهُۥ خَيْرٌ مِّنْهَا ۖ وَمَن جَآءَ بِٱلسَّيِّئَةِ فَلَا يُجْزَى ٱلَّذِينَ عَمِلُوا۟ ٱلسَّيِّـَٔاتِ إِلَّا مَا كَانُوا۟ يَعْمَلُونَ

Transliteration man jāa bil-ḥasanati falahu khayrun min'hā waman jāa bil-sayi-ati falā yuj'zā alladhīna ʿamilū l-sayiāti illā mā kānū yaʿmalūna

Telugu మంచి పనులు చేసి వచ్చిన వారికి వాటి కంటే ఉత్తమమైన (ప్రతిఫలం) లభిస్తుంది. మరియు చెడ్డపనులు చేసి వచ్చిన వారికి, వారు చేస్తూ ఉండిన చెడ్డపనులకు తగినంత ప్రతిఫలమే ఇవ్వబడుతుంది.

Verse 85

إِنَّ ٱلَّذِى فَرَضَ عَلَيْكَ ٱلْقُرْءَانَ لَرَآدُّكَ إِلَىٰ مَعَادٍ ۚ قُل رَّبِّىٓ أَعْلَمُ مَن جَآءَ بِٱلْهُدَىٰ وَمَنْ هُوَ فِى ضَلَـٰلٍ مُّبِينٍ

Transliteration inna alladhī faraḍa ʿalayka l-qur'āna larādduka ilā maʿādin qul rabbī aʿlamu man jāa bil-hudā waman huwa fī ḍalālin mubīnin

Telugu (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ ను నీకు విధిగా చేసినవాడు (అల్లాహ్) తప్పక నిన్ను నీ నిర్ణీత స్థానానికి తిరిగి తెస్తాడు. వారితో ఇలా అను: "ఎవడు మార్గదర్శకత్వంలో ఉన్నాడో మరియు ఎవడు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నాడో, నా ప్రభువుకు బాగా తెలుసు."

Verse 86

وَمَا كُنتَ تَرْجُوٓا۟ أَن يُلْقَىٰٓ إِلَيْكَ ٱلْكِتَـٰبُ إِلَّا رَحْمَةً مِّن رَّبِّكَ ۖ فَلَا تَكُونَنَّ ظَهِيرًا لِّلْكَـٰفِرِينَ

Transliteration wamā kunta tarjū an yul'qā ilayka l-kitābu illā raḥmatan min rabbika falā takūnanna ẓahīran lil'kāfirīna

Telugu మరియు నీకు ఈ గ్రంథం (ఖుర్ఆన్) ఇవ్వబడుతుందని నీవెన్నడూ ఆశించలేదు, ఇది కేవలం నీ ప్రభువు కారుణ్యం వల్లనే లభించింది. కావున నీవు ఎన్నటికీ సత్యతిరస్కారులకు తోడ్పడే వాడవు కావద్దు!

Verse 87

وَلَا يَصُدُّنَّكَ عَنْ ءَايَـٰتِ ٱللَّهِ بَعْدَ إِذْ أُنزِلَتْ إِلَيْكَ ۖ وَٱدْعُ إِلَىٰ رَبِّكَ ۖ وَلَا تَكُونَنَّ مِنَ ٱلْمُشْرِكِينَ

Transliteration walā yaṣuddunnaka ʿan āyāti l-lahi baʿda idh unzilat ilayka wa-ud'ʿu ilā rabbika walā takūnanna mina l-mush'rikīna

Telugu మరియు అల్లాహ్ ఆయతులు, నీపై అవతరింపజేయబడిన తరువాత; వారు (సత్యతిరస్కారులు) వాటి (పఠనం / ప్రచారం) నుండి నిన్ను ఏ మాత్రం తొలగింపనివ్వరాదు. మరియు (ప్రజలను) నీ ప్రభువు వైపునకు ఆహ్వానించు. మరియు నీవు బహుదైవారాధకులలో చేరిపోకు.

Verse 88

وَلَا تَدْعُ مَعَ ٱللَّهِ إِلَـٰهًا ءَاخَرَ ۘ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ۚ كُلُّ شَىْءٍ هَالِكٌ إِلَّا وَجْهَهُۥ ۚ لَهُ ٱلْحُكْمُ وَإِلَيْهِ تُرْجَعُونَ

Transliteration walā tadʿu maʿa l-lahi ilāhan ākhara lā ilāha illā huwa kullu shayin hālikun illā wajhahu lahu l-ḥuk'mu wa-ilayhi tur'jaʿūna

Telugu మరియు అల్లాహ్ తో పాటు ఏ ఇతర దైవాన్నీ ఆరాధించకు. ఆయన (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. కేవలం ఆయన ఉనికి (ముఖం) తప్ప ప్రతిదీ నశిస్తుంది. సర్వన్యాయాధిపత్యం కేవలం ఆయనదే మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు.

Read Surah Al-Qasas in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.