MyDugsiStart learning

Surah Ali 'Imran in Telugu: translation and audio

Surah 3 · آل عمران · Family of Imran · 200 verses

Surah Ali 'Imran verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Ali 'Imran word by word in English.

Verse 1

الٓمٓ

Transliteration alif-lam-meem

Telugu అలిఫ్-లామ్-మీమ్

Verse 2

ٱللَّهُ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ٱلْحَىُّ ٱلْقَيُّومُ

Transliteration al-lahu lā ilāha illā huwa l-ḥayu l-qayūmu

Telugu అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు (నిత్యుడు), విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు.

Verse 3

نَزَّلَ عَلَيْكَ ٱلْكِتَـٰبَ بِٱلْحَقِّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ وَأَنزَلَ ٱلتَّوْرَىٰةَ وَٱلْإِنجِيلَ

Transliteration nazzala ʿalayka l-kitāba bil-ḥaqi muṣaddiqan limā bayna yadayhi wa-anzala l-tawrāta wal-injīla

Telugu ఆయన, సత్యమైన ఈ దివ్యగ్రంథాన్ని (ఓ ముహమ్మద్!) నీపై అవతరింపజేశాడు. ఇది పూర్వం అవతరింపజేయబడిన గ్రంథాలలో నుండి (మిగిలి వున్న సత్యాన్ని) ధృవపరుస్తోంది. మరియు ఆయనే తౌరాత్ ను మరియు ఇంజీలును అవతరింపజేశాడు.

Verse 4

مِن قَبْلُ هُدًى لِّلنَّاسِ وَأَنزَلَ ٱلْفُرْقَانَ ۗ إِنَّ ٱلَّذِينَ كَفَرُوا۟ بِـَٔايَـٰتِ ٱللَّهِ لَهُمْ عَذَابٌ شَدِيدٌ ۗ وَٱللَّهُ عَزِيزٌ ذُو ٱنتِقَامٍ

Transliteration min qablu hudan lilnnāsi wa-anzala l-fur'qāna inna alladhīna kafarū biāyāti l-lahi lahum ʿadhābun shadīdun wal-lahu ʿazīzun dhū intiqāmin

Telugu దీనికి ముందు ప్రజలకు సన్మార్గం చూపటానికి, మరియు (సత్యాసత్యాలను విశదీకరించే) ఈ గీటురాయిని కూడా అవతరింపజేశాడు. నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ ఆజ్ఞను తిరస్కరిస్తారో వారికి కఠినశిక్ష ఉంటుంది. మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, ప్రతీకారం తీర్చుకోగలవాడు.

Verse 5

إِنَّ ٱللَّهَ لَا يَخْفَىٰ عَلَيْهِ شَىْءٌ فِى ٱلْأَرْضِ وَلَا فِى ٱلسَّمَآءِ

Transliteration inna l-laha lā yakhfā ʿalayhi shayon fī l-arḍi walā fī l-samāi

Telugu నిశ్చయంగా, భూమిలో గానీ మరియు ఆకాశాలలో గానీ, అల్లాహ్ కు గోప్యంగా ఉన్నది ఏదీ లేదు.

Verse 6

هُوَ ٱلَّذِى يُصَوِّرُكُمْ فِى ٱلْأَرْحَامِ كَيْفَ يَشَآءُ ۚ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

Transliteration huwa alladhī yuṣawwirukum fī l-arḥāmi kayfa yashāu lā ilāha illā huwa l-ʿazīzu l-ḥakīmu

Telugu ఆయన తన ఇష్టానుసారంగా మిమ్మల్ని (మాతృ) గర్భాలలో తీర్చి దిద్దుతాడు. ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

Verse 7

هُوَ ٱلَّذِىٓ أَنزَلَ عَلَيْكَ ٱلْكِتَـٰبَ مِنْهُ ءَايَـٰتٌ مُّحْكَمَـٰتٌ هُنَّ أُمُّ ٱلْكِتَـٰبِ وَأُخَرُ مُتَشَـٰبِهَـٰتٌ ۖ فَأَمَّا ٱلَّذِينَ فِى قُلُوبِهِمْ زَيْغٌ فَيَتَّبِعُونَ مَا تَشَـٰبَهَ مِنْهُ ٱبْتِغَآءَ ٱلْفِتْنَةِ وَٱبْتِغَآءَ تَأْوِيلِهِۦ ۗ وَمَا يَعْلَمُ تَأْوِيلَهُۥٓ إِلَّا ٱللَّهُ ۗ وَٱلرَّٰسِخُونَ فِى ٱلْعِلْمِ يَقُولُونَ ءَامَنَّا بِهِۦ كُلٌّ مِّنْ عِندِ رَبِّنَا ۗ وَمَا يَذَّكَّرُ إِلَّآ أُو۟لُوا۟ ٱلْأَلْبَـٰبِ

Transliteration huwa alladhī anzala ʿalayka l-kitāba min'hu āyātun muḥ'kamātun hunna ummu l-kitābi wa-ukharu mutashābihātun fa-ammā alladhīna fī qulūbihim zayghun fayattabiʿūna mā tashābaha min'hu ib'tighāa l-fit'nati wa-ib'tighāa tawīlihi wamā yaʿlamu tawīlahu illā l-lahu wal-rāsikhūna fī l-ʿil'mi yaqūlūna āmannā bihi kullun min ʿindi rabbinā wamā yadhakkaru illā ulū l-albābi

Telugu ఆయన (అల్లాహ్) యే నీపై (ఓ ముహమ్మద్!) ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ముహ్ కమాత్) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్) ఉన్నాయి. కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు, సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను అపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటబడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ, పరిపక్వ జ్ఞానం గలవారు: "మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!" అని అంటారు. జ్ఞానవంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు.

Verse 8

رَبَّنَا لَا تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِن لَّدُنكَ رَحْمَةً ۚ إِنَّكَ أَنتَ ٱلْوَهَّابُ

Transliteration rabbanā lā tuzigh qulūbanā baʿda idh hadaytanā wahab lanā min ladunka raḥmatan innaka anta l-wahābu

Telugu (వారు ఇలా అంటారు): "ఓ మా ప్రభూ! మాకు సన్మార్గం చూపిన తరువాత మా హృదయాలను వక్రమార్గం వైపునకు పోనివ్వకు. మరియు మాపై నీ కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా, నీవే సర్వప్రదుడవు.

Verse 9

رَبَّنَآ إِنَّكَ جَامِعُ ٱلنَّاسِ لِيَوْمٍ لَّا رَيْبَ فِيهِ ۚ إِنَّ ٱللَّهَ لَا يُخْلِفُ ٱلْمِيعَادَ

Transliteration rabbanā innaka jāmiʿu l-nāsi liyawmin lā rayba fīhi inna l-laha lā yukh'lifu l-mīʿāda

Telugu "ఓ మా ప్రభూ! నిశ్చయంగా నీవే మానవులందరినీ నిస్సందేహంగా రాబోయే ఆ దినమున సమావేశపరచే వాడవు. నిశ్చయంగా అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగం చేయడు."

Verse 10

إِنَّ ٱلَّذِينَ كَفَرُوا۟ لَن تُغْنِىَ عَنْهُمْ أَمْوَٰلُهُمْ وَلَآ أَوْلَـٰدُهُم مِّنَ ٱللَّهِ شَيْـًٔا ۖ وَأُو۟لَـٰٓئِكَ هُمْ وَقُودُ ٱلنَّارِ

Transliteration inna alladhīna kafarū lan tugh'niya ʿanhum amwāluhum walā awlāduhum mina l-lahi shayan wa-ulāika hum waqūdu l-nāri

Telugu నిశ్చయంగా, సత్యతిరస్కారులైన వారికి వారి ధనం గానీ, వారి సంతానం గానీ, అల్లాహ్ కు ప్రతికూలంగా ఏ మాత్రం పనికిరావు. మరియు ఇలాంటి వారే నరకాగ్నికి ఇంధనమయ్యేవారు.

Verse 11

كَدَأْبِ ءَالِ فِرْعَوْنَ وَٱلَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَذَّبُوا۟ بِـَٔايَـٰتِنَا فَأَخَذَهُمُ ٱللَّهُ بِذُنُوبِهِمْ ۗ وَٱللَّهُ شَدِيدُ ٱلْعِقَابِ

Transliteration kadabi āli fir'ʿawna wa-alladhīna min qablihim kadhabū biāyātinā fa-akhadhahumu l-lahu bidhunūbihim wal-lahu shadīdu l-ʿiqābi

Telugu వారి ముగింపు ఫిర్ఔను జాతి మరియు వారికి ముందున్న వారి వలే ఉంటుంది. వారు మా సూచనలను (ఆజ్ఞలను) తిరస్కరించారు, కాబట్టి అల్లాహ్ వారి పాపాల ఫలితంగా, వారిని పట్టుకున్నాడు. మరియు అల్లాహ్ శిక్ష విధించటంలో చాలా కఠినుడు.

Verse 12

قُل لِّلَّذِينَ كَفَرُوا۟ سَتُغْلَبُونَ وَتُحْشَرُونَ إِلَىٰ جَهَنَّمَ ۚ وَبِئْسَ ٱلْمِهَادُ

Transliteration qul lilladhīna kafarū satugh'labūna watuḥ'sharūna ilā jahannama wabi'sa l-mihādu

Telugu (ఓ ప్రవక్తా!) సత్యాన్ని తిరస్కరించిన వారితో అను: "మీరు త్వరలోనే లొంగదీయబడి నరకంలో జమ చేయబడతారు. మరియు అది అతి చెడ్డ విరామ స్థలము!"

Verse 13

قَدْ كَانَ لَكُمْ ءَايَةٌ فِى فِئَتَيْنِ ٱلْتَقَتَا ۖ فِئَةٌ تُقَـٰتِلُ فِى سَبِيلِ ٱللَّهِ وَأُخْرَىٰ كَافِرَةٌ يَرَوْنَهُم مِّثْلَيْهِمْ رَأْىَ ٱلْعَيْنِ ۚ وَٱللَّهُ يُؤَيِّدُ بِنَصْرِهِۦ مَن يَشَآءُ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَعِبْرَةً لِّأُو۟لِى ٱلْأَبْصَـٰرِ

Transliteration qad kāna lakum āyatun fī fi-atayni l-taqatā fi-atun tuqātilu fī sabīli l-lahi wa-ukh'rā kāfiratun yarawnahum mith'layhim raya l-ʿayni wal-lahu yu-ayyidu binaṣrihi man yashāu inna fī dhālika laʿib'ratan li-ulī l-abṣāri

Telugu వాస్తవానికి (బద్ర్ యుద్ధ రంగంలో) మార్కొనిన ఆ రెండు వర్గాలలో మీకు ఒక సూచన ఉంది. ఒక వర్గం అల్లాహ్ మార్గంలో పోరాడేది మరియు రెండవది సత్యతిరస్కారులది. వారు (విశ్వాసులు) వారిని (సత్యతిరస్కారులను) రెట్టింపు సంఖ్యలో ఉన్నట్లు తమ కళ్ళారా చూశారు. మరియు అల్లాహ్ తాను కోరిన వారిని తన సహాయంతో (విజయంతో) బలపరుస్తాడు. నిశ్చయంగా, దూరదృష్టి గలవారికి ఇందులో ఒక గుణపాఠముంది.

Verse 14

زُيِّنَ لِلنَّاسِ حُبُّ ٱلشَّهَوَٰتِ مِنَ ٱلنِّسَآءِ وَٱلْبَنِينَ وَٱلْقَنَـٰطِيرِ ٱلْمُقَنطَرَةِ مِنَ ٱلذَّهَبِ وَٱلْفِضَّةِ وَٱلْخَيْلِ ٱلْمُسَوَّمَةِ وَٱلْأَنْعَـٰمِ وَٱلْحَرْثِ ۗ ذَٰلِكَ مَتَـٰعُ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا ۖ وَٱللَّهُ عِندَهُۥ حُسْنُ ٱلْمَـَٔابِ

Transliteration zuyyina lilnnāsi ḥubbu l-shahawāti mina l-nisāi wal-banīna wal-qanāṭīri l-muqanṭarati mina l-dhahabi wal-fiḍati wal-khayli l-musawamati wal-anʿāmi wal-ḥarthi dhālika matāʿu l-ḥayati l-dun'yā wal-lahu ʿindahu ḥus'nu l-maābi

Telugu స్త్రీలు, సంతానం మరియు కూర్చిపెట్టిన వెండి-బంగారు రాసులు, మేలు జాతి గుర్రాలు, పశువులు, పొలాలు మొదలైన మనోహరమైన వస్తువుల ప్రేమ ప్రజలకు ఆకర్షణీయంగా చేయబడింది. ఇదంతా ఇహలోక జీవనభోగం. కానీ, అసలైన గమ్యస్థానం అల్లాహ్ వద్దనే ఉంది.

Verse 15

۞ قُلْ أَؤُنَبِّئُكُم بِخَيْرٍ مِّن ذَٰلِكُمْ ۚ لِلَّذِينَ ٱتَّقَوْا۟ عِندَ رَبِّهِمْ جَنَّـٰتٌ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ خَـٰلِدِينَ فِيهَا وَأَزْوَٰجٌ مُّطَهَّرَةٌ وَرِضْوَٰنٌ مِّنَ ٱللَّهِ ۗ وَٱللَّهُ بَصِيرٌۢ بِٱلْعِبَادِ

Transliteration qul a-unabbi-ukum bikhayrin min dhālikum lilladhīna ittaqaw ʿinda rabbihim jannātun tajrī min taḥtihā l-anhāru khālidīna fīhā wa-azwājun muṭahharatun wariḍ'wānun mina l-lahi wal-lahu baṣīrun bil-ʿibādi

Telugu ఇలా చెప్పు: "ఏమీ? వాటి కంటే ఉత్తమమైన వాటిని నేను మీకు తెలుపనా? దైవభీతి గలవారికి, వారి ప్రభువు వద్ద స్వర్గవనాలుంటాయి. వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు మరియు వారికి అక్కడ పవిత్ర సహవాసులు (అజ్వాజ్) ఉంటారు మరియు వారికి అల్లాహ్ ప్రసన్నత లభిస్తుంది." మరియు అల్లాహ్ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు.

Verse 16

ٱلَّذِينَ يَقُولُونَ رَبَّنَآ إِنَّنَآ ءَامَنَّا فَٱغْفِرْ لَنَا ذُنُوبَنَا وَقِنَا عَذَابَ ٱلنَّارِ

Transliteration alladhīna yaqūlūna rabbanā innanā āmannā fa-igh'fir lanā dhunūbanā waqinā ʿadhāba l-nāri

Telugu ఎవరైతే : "ఓ మా ప్రభూ! మేము నిశ్చయంగా విశ్వసించాము, కావున మా తప్పులను క్షమించు మరియు నరకాగ్ని నుండి మమ్మల్ని తప్పించు." అని పలుకుతారో!

Verse 17

ٱلصَّـٰبِرِينَ وَٱلصَّـٰدِقِينَ وَٱلْقَـٰنِتِينَ وَٱلْمُنفِقِينَ وَٱلْمُسْتَغْفِرِينَ بِٱلْأَسْحَارِ

Transliteration al-ṣābirīna wal-ṣādiqīna wal-qānitīna wal-munfiqīna wal-mus'taghfirīna bil-asḥāri

Telugu (అలాంటి వారే!) సహనశీలురు, సత్యవంతులు మరియు వినయ విధేయతలు గల వారు, దానపరులు మరియు వేకువ జామున తమ పాపాలకు క్షమాపణ వేడుకునేవారు.

Verse 18

شَهِدَ ٱللَّهُ أَنَّهُۥ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ وَٱلْمَلَـٰٓئِكَةُ وَأُو۟لُوا۟ ٱلْعِلْمِ قَآئِمًۢا بِٱلْقِسْطِ ۚ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

Transliteration shahida l-lahu annahu lā ilāha illā huwa wal-malāikatu wa-ulū l-ʿil'mi qāiman bil-qis'ṭi lā ilāha illā huwa l-ʿazīzu l-ḥakīmu

Telugu నిశ్చయంగా, ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడని, అల్లాహ్, దేవదూతలు మరియు జ్ఞానవంతులు సాక్ష్యమిచ్చారు; ఆయనే న్యాయపరిరక్షకుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యనీయుడు లేడు! ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

Verse 19

إِنَّ ٱلدِّينَ عِندَ ٱللَّهِ ٱلْإِسْلَـٰمُ ۗ وَمَا ٱخْتَلَفَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَـٰبَ إِلَّا مِنۢ بَعْدِ مَا جَآءَهُمُ ٱلْعِلْمُ بَغْيًۢا بَيْنَهُمْ ۗ وَمَن يَكْفُرْ بِـَٔايَـٰتِ ٱللَّهِ فَإِنَّ ٱللَّهَ سَرِيعُ ٱلْحِسَابِ

Transliteration inna l-dīna ʿinda l-lahi l-is'lāmu wamā ikh'talafa alladhīna ūtū l-kitāba illā min baʿdi mā jāahumu l-ʿil'mu baghyan baynahum waman yakfur biāyāti l-lahi fa-inna l-laha sarīʿu l-ḥisābi

Telugu నిశ్చయంగా, అల్లాహ్ కు సమ్మతమైన ధర్మం కేవలం అల్లాహ్ కు విధేయులవటం (ఇస్లాం) మాత్రమే. కాని పూర్వ గ్రంథ ప్రజలు పరస్పర ఈర్ష్యతో, వారికి జ్ఞానం లభించిన తరువాతనే భేదాభిప్రాయాలకు లోనయ్యారు. మరియు ఎవరైతే అల్లాహ్ సూచనలను తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు (అని తెలుసుకోవాలి).

Verse 20

فَإِنْ حَآجُّوكَ فَقُلْ أَسْلَمْتُ وَجْهِىَ لِلَّهِ وَمَنِ ٱتَّبَعَنِ ۗ وَقُل لِّلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَـٰبَ وَٱلْأُمِّيِّـۧنَ ءَأَسْلَمْتُمْ ۚ فَإِنْ أَسْلَمُوا۟ فَقَدِ ٱهْتَدَوا۟ ۖ وَّإِن تَوَلَّوْا۟ فَإِنَّمَا عَلَيْكَ ٱلْبَلَـٰغُ ۗ وَٱللَّهُ بَصِيرٌۢ بِٱلْعِبَادِ

Transliteration fa-in ḥājjūka faqul aslamtu wajhiya lillahi wamani ittabaʿani waqul lilladhīna ūtū l-kitāba wal-umiyīna a-aslamtum fa-in aslamū faqadi ih'tadaw wa-in tawallaw fa-innamā ʿalayka l-balāghu wal-lahu baṣīrun bil-ʿibādi

Telugu (ఓ ప్రవక్తా!) వారు నీతో వివాదమాడితే ఇట్లను: "నేనూ మరియు నా అనుచరులు అల్లాహ్ ప్రీతి పొందటానికి ఆయనకు సంపూర్ణంగా విధేయులం (ముస్లిములం) అయ్యాము." మరియు గ్రంథ ప్రజలతో మరియు నిరక్ష్యరాస్యులతో (చదువురాని అరబ్బులతో): "ఏమీ? మీరు కూడా విధేయులయ్యారా?" అని అడుగు. వారు విధేయులైతే సన్మార్గం పొందిన వారవుతారు. కాని ఒకవేళ వారు వెనుదిరిగితే, నీ బాధ్యత కేవలం సందేశాన్ని అందజేయటం మాత్రమే! మరియు అల్లాహ్ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు.

Verse 21

إِنَّ ٱلَّذِينَ يَكْفُرُونَ بِـَٔايَـٰتِ ٱللَّهِ وَيَقْتُلُونَ ٱلنَّبِيِّـۧنَ بِغَيْرِ حَقٍّ وَيَقْتُلُونَ ٱلَّذِينَ يَأْمُرُونَ بِٱلْقِسْطِ مِنَ ٱلنَّاسِ فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ

Transliteration inna alladhīna yakfurūna biāyāti l-lahi wayaqtulūna l-nabiyīna bighayri ḥaqqin wayaqtulūna alladhīna yamurūna bil-qis'ṭi mina l-nāsi fabashir'hum biʿadhābin alīmin

Telugu నిశ్చయంగా, అల్లాహ్ ఆదేశాలను (ఆయాత్ లను) తిరస్కరించే వారికి మరియు ఆయన ప్రవక్తలను అన్యాయంగా చంపే వారికి మరియు న్యాయసమ్మతంగా వ్యవహరించమని బోధించే ప్రజలను చంపే వారికి, బాధాకరమైన శిక్ష ఉందని తెలియజెయ్యి.

Verse 22

أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ حَبِطَتْ أَعْمَـٰلُهُمْ فِى ٱلدُّنْيَا وَٱلْـَٔاخِرَةِ وَمَا لَهُم مِّن نَّـٰصِرِينَ

Transliteration ulāika alladhīna ḥabiṭat aʿmāluhum fī l-dun'yā wal-ākhirati wamā lahum min nāṣirīna

Telugu అలాంటి వారి కర్మలు ఇహలోక మందును మరియు పరలోక మందును వృథా అవుతాయి. మరియు వారికి సహాయకులు ఎవ్వరూ ఉండరు.

Verse 23

أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ أُوتُوا۟ نَصِيبًا مِّنَ ٱلْكِتَـٰبِ يُدْعَوْنَ إِلَىٰ كِتَـٰبِ ٱللَّهِ لِيَحْكُمَ بَيْنَهُمْ ثُمَّ يَتَوَلَّىٰ فَرِيقٌ مِّنْهُمْ وَهُم مُّعْرِضُونَ

Transliteration alam tara ilā alladhīna ūtū naṣīban mina l-kitābi yud'ʿawna ilā kitābi l-lahi liyaḥkuma baynahum thumma yatawallā farīqun min'hum wahum muʿ'riḍūna

Telugu ఏమీ? గ్రంథంలోని కొంతభాగం పొందిన వారి పరిస్థితి ఎలా ఉందో నీవు గమనించలేదా ? వారి మధ్య తీర్పు చేయటానికి, అల్లాహ్ గ్రంథం వైపునకు రండి అని, వారిని ఆహ్వానించినపుడు, వారిలోని ఒక వర్గం వారు విముఖులై, వెనుదిరిగి పోతారు.

Verse 24

ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا۟ لَن تَمَسَّنَا ٱلنَّارُ إِلَّآ أَيَّامًا مَّعْدُودَٰتٍ ۖ وَغَرَّهُمْ فِى دِينِهِم مَّا كَانُوا۟ يَفْتَرُونَ

Transliteration dhālika bi-annahum qālū lan tamassanā l-nāru illā ayyāman maʿdūdātin wagharrahum fī dīnihim mā kānū yaftarūna

Telugu వారు అలా చేయటానికి కారణం వారు: "నరకాగ్ని కొన్ని దినాలు మాత్రమే మమ్మల్ని తాకుతుంది." అనటం. మరియు వారు కల్పించుకున్న అపోహయే వారిని తమ ధర్మ విషయంలో మోసపుచ్చింది.

Verse 25

فَكَيْفَ إِذَا جَمَعْنَـٰهُمْ لِيَوْمٍ لَّا رَيْبَ فِيهِ وَوُفِّيَتْ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ

Transliteration fakayfa idhā jamaʿnāhum liyawmin lā rayba fīhi wawuffiyat kullu nafsin mā kasabat wahum lā yuẓ'lamūna

Telugu నిస్సందేహంగా, రాబోయే ఆ (పునరుత్థాన) దినమున, మేము వారిని సమావేశ పరచినపుడు, వారి స్థితి ఎలా ఉంటుందో (ఆలోచించారా?) మరియు ప్రతి జీవికి తాను చేసిన కర్మల ఫలితం పూర్తిగా నొసంగబడుతుంది. మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.

Verse 26

قُلِ ٱللَّهُمَّ مَـٰلِكَ ٱلْمُلْكِ تُؤْتِى ٱلْمُلْكَ مَن تَشَآءُ وَتَنزِعُ ٱلْمُلْكَ مِمَّن تَشَآءُ وَتُعِزُّ مَن تَشَآءُ وَتُذِلُّ مَن تَشَآءُ ۖ بِيَدِكَ ٱلْخَيْرُ ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ

Transliteration quli l-lahuma mālika l-mul'ki tu'tī l-mul'ka man tashāu watanziʿu l-mul'ka mimman tashāu watuʿizzu man tashāu watudhillu man tashāu biyadika l-khayru innaka ʿalā kulli shayin qadīrun

Telugu ఇలా అను: "ఓ అల్లాహ్, విశ్వ సామ్రాజ్యాధిపతి! నీవు ఇష్టపడిన వారికి రాజ్యాధికారాన్ని ప్రసాదిస్తావు మరియు నీవు కోరిన వారిని రాజ్యాధికారం నుండి తొలగిస్తావు మరియు నీవు ఇష్టపడిన వారికి గౌరవాన్ని (శక్తిని) ప్రసాదిస్తావు మరియు నీవు కోరిన వారిని పరాభవం పాలు చేస్తావు. నీ చేతిలోనే మేలున్నది. నిశ్చయంగా, నీవు ప్రతిదీ చేయగల సమర్ధుడవు.

Verse 27

تُولِجُ ٱلَّيْلَ فِى ٱلنَّهَارِ وَتُولِجُ ٱلنَّهَارَ فِى ٱلَّيْلِ ۖ وَتُخْرِجُ ٱلْحَىَّ مِنَ ٱلْمَيِّتِ وَتُخْرِجُ ٱلْمَيِّتَ مِنَ ٱلْحَىِّ ۖ وَتَرْزُقُ مَن تَشَآءُ بِغَيْرِ حِسَابٍ

Transliteration tūliju al-layla fī l-nahāri watūliju l-nahāra fī al-layli watukh'riju l-ḥaya mina l-mayiti watukh'riju l-mayita mina l-ḥayi watarzuqu man tashāu bighayri ḥisābin

Telugu "నీవు రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తావు మరియు పగటిని రాత్రిలోకి ప్రవేశింపజేస్తావు. మరియు నీవు సజీవులను నిర్జీవుల నుండి తీస్తావు మరియు నిర్జీవులను సజీవుల నుండి తీస్తావు. మరియు నీవు కోరిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తావు."

Verse 28

لَّا يَتَّخِذِ ٱلْمُؤْمِنُونَ ٱلْكَـٰفِرِينَ أَوْلِيَآءَ مِن دُونِ ٱلْمُؤْمِنِينَ ۖ وَمَن يَفْعَلْ ذَٰلِكَ فَلَيْسَ مِنَ ٱللَّهِ فِى شَىْءٍ إِلَّآ أَن تَتَّقُوا۟ مِنْهُمْ تُقَىٰةً ۗ وَيُحَذِّرُكُمُ ٱللَّهُ نَفْسَهُۥ ۗ وَإِلَى ٱللَّهِ ٱلْمَصِيرُ

Transliteration lā yattakhidhi l-mu'minūna l-kāfirīna awliyāa min dūni l-mu'minīna waman yafʿal dhālika falaysa mina l-lahi fī shayin illā an tattaqū min'hum tuqātan wayuḥadhirukumu l-lahu nafsahu wa-ilā l-lahi l-maṣīru

Telugu విశ్వాసులు - తమ తోటి విశ్వాసులను విడిచి - సత్యతిరస్కారులను స్నేహితులుగా చేసుకోరాదు. అలా చేసేవారికి అల్లాహ్ తో ఏ విధమైన సంబంధం లేదు. కాని, వారి దౌర్జన్యానికి భీతిపరులైతే తప్ప! అల్లాహ్ (ఆయనకే భీతిపరులై ఉండమని) మిమ్మల్ని స్వయంగా హెచ్చరిస్తున్నాడు. మరియు అల్లాహ్ వైపుకే మీ మరలింపు ఉంది.

Verse 29

قُلْ إِن تُخْفُوا۟ مَا فِى صُدُورِكُمْ أَوْ تُبْدُوهُ يَعْلَمْهُ ٱللَّهُ ۗ وَيَعْلَمُ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۗ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ

Transliteration qul in tukh'fū mā fī ṣudūrikum aw tub'dūhu yaʿlamhu l-lahu wayaʿlamu mā fī l-samāwāti wamā fī l-arḍi wal-lahu ʿalā kulli shayin qadīrun

Telugu వారితో ఇలా అను: "మీరు మీ హృదయాలలో ఉన్నది దాచినా వెలిబుచ్చినా, అది అల్లాహ్ కు తెలుస్తుంది. మరియు భూమ్యాకాశాలలో ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు."

Verse 30

يَوْمَ تَجِدُ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ مِنْ خَيْرٍ مُّحْضَرًا وَمَا عَمِلَتْ مِن سُوٓءٍ تَوَدُّ لَوْ أَنَّ بَيْنَهَا وَبَيْنَهُۥٓ أَمَدًۢا بَعِيدًا ۗ وَيُحَذِّرُكُمُ ٱللَّهُ نَفْسَهُۥ ۗ وَٱللَّهُ رَءُوفٌۢ بِٱلْعِبَادِ

Transliteration yawma tajidu kullu nafsin mā ʿamilat min khayrin muḥ'ḍaran wamā ʿamilat min sūin tawaddu law anna baynahā wabaynahu amadan baʿīdan wayuḥadhirukumu l-lahu nafsahu wal-lahu raūfun bil-ʿibādi

Telugu ఆ రోజు ప్రతి ప్రాణి తాను చేసిన మంచిని మరియు తాను చేసిన చెడును ప్రత్యక్షంగా చూసుకున్నప్పుడు తనకు మరియు దానికి మధ్య దూరం ఉంటే, ఎంత బాగుండేదని ఆశిస్తుంది. మరియు అల్లాహ్ (తనకే భీతిపరులై ఉండమని) మిమ్మల్ని స్వయంగా హెచ్చరిస్తున్నాడు. మరియు అల్లాహ్ తన దాసుల ఎడల ఎంతో కనికరుడు.

Verse 31

قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ ٱللَّهَ فَٱتَّبِعُونِى يُحْبِبْكُمُ ٱللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَٱللَّهُ غَفُورٌ رَّحِيمٌ

Transliteration qul in kuntum tuḥibbūna l-laha fa-ittabiʿūnī yuḥ'bib'kumu l-lahu wayaghfir lakum dhunūbakum wal-lahu ghafūrun raḥīmun

Telugu (ఓ ప్రవక్తా!) ఇలా అను: "మీకు (నిజంగా) అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (అప్పుడు) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత."

Verse 32

قُلْ أَطِيعُوا۟ ٱللَّهَ وَٱلرَّسُولَ ۖ فَإِن تَوَلَّوْا۟ فَإِنَّ ٱللَّهَ لَا يُحِبُّ ٱلْكَـٰفِرِينَ

Transliteration qul aṭīʿū l-laha wal-rasūla fa-in tawallaw fa-inna l-laha lā yuḥibbu l-kāfirīna

Telugu (ఇంకా) ఇలా అను: "అల్లాహ్ కు మరియు సందేశహరునికి విధేయులై ఉండండి. "వారు కాదంటే! నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారులను ప్రేమించడు, (అని తెలుసుకోవాలి).

Verse 33

۞ إِنَّ ٱللَّهَ ٱصْطَفَىٰٓ ءَادَمَ وَنُوحًا وَءَالَ إِبْرَٰهِيمَ وَءَالَ عِمْرَٰنَ عَلَى ٱلْعَـٰلَمِينَ

Transliteration inna l-laha iṣ'ṭafā ādama wanūḥan waāla ib'rāhīma waāla ʿim'rāna ʿalā l-ʿālamīna

Telugu నిశ్చయంగా అల్లాహ్, ఆదమ్ ను నూహ్ ను, ఇబ్రాహీమ్ సంతతి వారిని మరియు ఇమ్రాన్ సంతతివారిని (ఆయా కాలపు) సర్వలోకాల (ప్రజలపై) ప్రాధాన్యతనిచ్చి ఎన్నుకున్నాడు.

Verse 34

ذُرِّيَّةًۢ بَعْضُهَا مِنۢ بَعْضٍ ۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٌ

Transliteration dhurriyyatan baʿḍuhā min baʿḍin wal-lahu samīʿun ʿalīmun

Telugu వారంతా ఒకే పరంపరకు చెందినవారు. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

Verse 35

إِذْ قَالَتِ ٱمْرَأَتُ عِمْرَٰنَ رَبِّ إِنِّى نَذَرْتُ لَكَ مَا فِى بَطْنِى مُحَرَّرًا فَتَقَبَّلْ مِنِّىٓ ۖ إِنَّكَ أَنتَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ

Transliteration idh qālati im'ra-atu ʿim'rāna rabbi innī nadhartu laka mā fī baṭnī muḥarraran fataqabbal minnī innaka anta l-samīʿu l-ʿalīmu

Telugu ఇమ్రాన్ భార్య ప్రార్థించింది (జ్ఞాపకం చేసుకోండి): "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నేను నా గర్భము నందున్న శిశువును నీ సేవకు అంకితం చేయటానికి మొక్కుకున్నాను, కావున నా నుండి దీనిని తప్పక స్వీకరించు. నిశ్చయంగా నీవే సర్వం వినేవాడవు, సర్వజ్ఞుడవు."

Verse 36

فَلَمَّا وَضَعَتْهَا قَالَتْ رَبِّ إِنِّى وَضَعْتُهَآ أُنثَىٰ وَٱللَّهُ أَعْلَمُ بِمَا وَضَعَتْ وَلَيْسَ ٱلذَّكَرُ كَٱلْأُنثَىٰ ۖ وَإِنِّى سَمَّيْتُهَا مَرْيَمَ وَإِنِّىٓ أُعِيذُهَا بِكَ وَذُرِّيَّتَهَا مِنَ ٱلشَّيْطَـٰنِ ٱلرَّجِيمِ

Transliteration falammā waḍaʿathā qālat rabbi innī waḍaʿtuhā unthā wal-lahu aʿlamu bimā waḍaʿat walaysa l-dhakaru kal-unthā wa-innī sammaytuhā maryama wa-innī uʿīdhuhā bika wadhurriyyatahā mina l-shayṭāni l-rajīmi

Telugu తరువాత ఆమె ఆడ శిశువు (మర్యమ్) ను ప్రసవించినప్పుడు, ఆమె ఇలా విన్నవించుకున్నది: "ఓ నా ప్రభూ! నేను ఆడ శిశువును ప్రసవించాను" - ఆమె ప్రసవించినదేమిటో అల్లాహ్ కు బాగా తెలుసు మరియు బాలుడు బాలిక వంటి వాడు కాడు - "మరియు నేను ఈమెకు మర్యమ్ అని పేరు పెట్టాను. మరియు నేను ఈమెను మరియు ఈమె సంతానాన్ని శపించబడిన (బహిష్కరించబడిన) షైతాన్ నుండి రక్షించటానికి, నీ శరణు వేడుకుంటున్నాను!"

Verse 37

فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُولٍ حَسَنٍ وَأَنۢبَتَهَا نَبَاتًا حَسَنًا وَكَفَّلَهَا زَكَرِيَّا ۖ كُلَّمَا دَخَلَ عَلَيْهَا زَكَرِيَّا ٱلْمِحْرَابَ وَجَدَ عِندَهَا رِزْقًا ۖ قَالَ يَـٰمَرْيَمُ أَنَّىٰ لَكِ هَـٰذَا ۖ قَالَتْ هُوَ مِنْ عِندِ ٱللَّهِ ۖ إِنَّ ٱللَّهَ يَرْزُقُ مَن يَشَآءُ بِغَيْرِ حِسَابٍ

Transliteration fataqabbalahā rabbuhā biqabūlin ḥasanin wa-anbatahā nabātan ḥasanan wakaffalahā zakariyyā kullamā dakhala ʿalayhā zakariyyā l-miḥ'rāba wajada ʿindahā riz'qan qāla yāmaryamu annā laki hādhā qālat huwa min ʿindi l-lahi inna l-laha yarzuqu man yashāu bighayri ḥisābin

Telugu ఆ తరువాత ఆ బాలికను, ఆమె ప్రభువు ఆదరంతో స్వీకరించి, ఆమెను ఒక మంచి స్త్రీగా పెంచాడు మరియు ఆమెను 'జకరియ్యా సంరక్షణలో ఉంచాడు. జకరియ్యా ఆమె గదికి పోయినప్పుడల్లా, ఆమె వద్ద (ఏవో కొన్ని) భోజన పదార్థాలను చూసి, ఆమెను ఇలా అడిగేవాడు: "ఓ మర్యమ్, ఇది నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చింది?" ఆమె ఇలా జవాబిచ్చేది: "ఇది అల్లాహ్ వద్ద నుండి వచ్చింది." నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరిన వారికి లెక్క లేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు.

Verse 38

هُنَالِكَ دَعَا زَكَرِيَّا رَبَّهُۥ ۖ قَالَ رَبِّ هَبْ لِى مِن لَّدُنكَ ذُرِّيَّةً طَيِّبَةً ۖ إِنَّكَ سَمِيعُ ٱلدُّعَآءِ

Transliteration hunālika daʿā zakariyyā rabbahu qāla rabbi hab lī min ladunka dhurriyyatan ṭayyibatan innaka samīʿu l-duʿāi

Telugu అప్పుడు జకరియ్యా తన ప్రభువును ప్రార్థించాడు. అతను ఇలా విన్నవించుకున్నాడు: "ఓ నా ప్రభూ! నీ కనికరంతో నాకు కూడా ఒక మంచి సంతానాన్ని ప్రసాదించు. నిశ్చయంగా నీవే ప్రార్థనలను వినేవాడవు."

Verse 39

فَنَادَتْهُ ٱلْمَلَـٰٓئِكَةُ وَهُوَ قَآئِمٌ يُصَلِّى فِى ٱلْمِحْرَابِ أَنَّ ٱللَّهَ يُبَشِّرُكَ بِيَحْيَىٰ مُصَدِّقًۢا بِكَلِمَةٍ مِّنَ ٱللَّهِ وَسَيِّدًا وَحَصُورًا وَنَبِيًّا مِّنَ ٱلصَّـٰلِحِينَ

Transliteration fanādathu l-malāikatu wahuwa qāimun yuṣallī fī l-miḥ'rābi anna l-laha yubashiruka biyaḥyā muṣaddiqan bikalimatin mina l-lahi wasayyidan waḥaṣūran wanabiyyan mina l-ṣāliḥīna

Telugu తరువాత అతను (జకరియ్యా) తన గదిలో నిలబడి నమాజ్ చేస్తున్నప్పుడు దేవదూతలు: "నిశ్చయంగా, అల్లాహ్ నీకు యహ్యా యొక్క శుభవార్తను ఇస్తున్నాడు. అతను, అల్లాహ్ వాక్కును ధృవ పరుస్తాడు. అతను మంచి నాయకుడు మరియు మనో నిగ్రహం గల ప్రవక్త అయి సద్వర్తనులలో చేరిన వాడవుతాడు." అని వినిపించారు.

Verse 40

قَالَ رَبِّ أَنَّىٰ يَكُونُ لِى غُلَـٰمٌ وَقَدْ بَلَغَنِىَ ٱلْكِبَرُ وَٱمْرَأَتِى عَاقِرٌ ۖ قَالَ كَذَٰلِكَ ٱللَّهُ يَفْعَلُ مَا يَشَآءُ

Transliteration qāla rabbi annā yakūnu lī ghulāmun waqad balaghaniya l-kibaru wa-im'ra-atī ʿāqirun qāla kadhālika l-lahu yafʿalu mā yashāu

Telugu అతను (జకరియ్యా) ఇలా అన్నాడు: "ఓ నా ప్రభూ! నాకు కుమారుడు ఎలా కలుగుతాడు, నాకు ముసలితనం వచ్చింది మరియు నా భార్యనేమో గొడ్రాలు!" ఆయన అన్నాడు: "అలాగే జరుగుతుంది. అల్లాహ్ తాను కోరింది చేస్తాడు."

Verse 41

قَالَ رَبِّ ٱجْعَل لِّىٓ ءَايَةً ۖ قَالَ ءَايَتُكَ أَلَّا تُكَلِّمَ ٱلنَّاسَ ثَلَـٰثَةَ أَيَّامٍ إِلَّا رَمْزًا ۗ وَٱذْكُر رَّبَّكَ كَثِيرًا وَسَبِّحْ بِٱلْعَشِىِّ وَٱلْإِبْكَـٰرِ

Transliteration qāla rabbi ij'ʿal lī āyatan qāla āyatuka allā tukallima l-nāsa thalāthata ayyāmin illā ramzan wa-udh'kur rabbaka kathīran wasabbiḥ bil-ʿashiyi wal-ib'kāri

Telugu అతను (జకరియ్యా) ఇలా మనవి చేసుకున్నాడు: "ఓ నా ప్రభూ! నా కొరకు ఏదైనా సూచన నియమించు." ఆయన జవాబిచ్చాడు: "నీకు సూచన ఏమిటంటే, నీవు మూడు రోజుల వరకు సైగలతో తప్ప ప్రజలతో మాట్లాడలేవు. నీవు ఎక్కువగా నీ ప్రభువును స్మరించు. మరియు సాయంకాలము నందును మరియు ఉదయము నందును ఆయన పవిత్రతను కొనియాడు."

Verse 42

وَإِذْ قَالَتِ ٱلْمَلَـٰٓئِكَةُ يَـٰمَرْيَمُ إِنَّ ٱللَّهَ ٱصْطَفَىٰكِ وَطَهَّرَكِ وَٱصْطَفَىٰكِ عَلَىٰ نِسَآءِ ٱلْعَـٰلَمِينَ

Transliteration wa-idh qālati l-malāikatu yāmaryamu inna l-laha iṣ'ṭafāki waṭahharaki wa-iṣ'ṭafāki ʿalā nisāi l-ʿālamīna

Telugu మరియు దేవదూతలు: "ఓ మర్యమ్! నిశ్చయంగా, అల్లాహ్ నిన్ను ఎన్నుకున్నాడు. మరియు నిన్ను పరిశుద్ధ పరిచాడు. మరియు (నీ కాలపు) సర్వలోకాలలోని స్త్రీలలో నిన్ను ఎన్నుకున్నాడు." అని అన్న విషయం (జ్ఞాపకం చేసుకోండి).

Verse 43

يَـٰمَرْيَمُ ٱقْنُتِى لِرَبِّكِ وَٱسْجُدِى وَٱرْكَعِى مَعَ ٱلرَّٰكِعِينَ

Transliteration yāmaryamu uq'nutī lirabbiki wa-us'judī wa-ir'kaʿī maʿa l-rākiʿīna

Telugu (వారింకా ఇలా అన్నారు): "ఓ మర్యమ్! నీవు నీ ప్రభువుకు విధేయురాలుగా ఉండు. (ఆయన సాన్నిధ్యంలో) సాష్టాంగం (సజ్దా) చెయ్యి. మరియు వంగే (రుకూఉ చేసే) వారితో కలిసి వంగు (రుకూఉ చెయ్యి)."

Verse 44

ذَٰلِكَ مِنْ أَنۢبَآءِ ٱلْغَيْبِ نُوحِيهِ إِلَيْكَ ۚ وَمَا كُنتَ لَدَيْهِمْ إِذْ يُلْقُونَ أَقْلَـٰمَهُمْ أَيُّهُمْ يَكْفُلُ مَرْيَمَ وَمَا كُنتَ لَدَيْهِمْ إِذْ يَخْتَصِمُونَ

Transliteration dhālika min anbāi l-ghaybi nūḥīhi ilayka wamā kunta ladayhim idh yul'qūna aqlāmahum ayyuhum yakfulu maryama wamā kunta ladayhim idh yakhtaṣimūna

Telugu (ఓ ప్రవక్తా!) ఇవన్నీ అగోచరమైన వార్తలు. వాటిని మేము నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా తెలుపుతున్నాము. మర్యమ్ సంరక్షకుడు ఎవరు కావాలని వారు (ఆలయ సేవకులు) తమ కలములను విసిరినపుడు, నీవు వారి దగ్గర లేవు మరియు వారు వాదించుకున్నపుడు కూడా నీవు వారి దగ్గర లేవు.

Verse 45

إِذْ قَالَتِ ٱلْمَلَـٰٓئِكَةُ يَـٰمَرْيَمُ إِنَّ ٱللَّهَ يُبَشِّرُكِ بِكَلِمَةٍ مِّنْهُ ٱسْمُهُ ٱلْمَسِيحُ عِيسَى ٱبْنُ مَرْيَمَ وَجِيهًا فِى ٱلدُّنْيَا وَٱلْـَٔاخِرَةِ وَمِنَ ٱلْمُقَرَّبِينَ

Transliteration idh qālati l-malāikatu yāmaryamu inna l-laha yubashiruki bikalimatin min'hu us'muhu l-masīḥu ʿīsā ub'nu maryama wajīhan fī l-dun'yā wal-ākhirati wamina l-muqarabīna

Telugu దేవదూతలు ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): "ఓ మర్యమ్! నిశ్చయంగా, అల్లాహ్! నీకు తన వాక్కును గురించి శుభవార్తను ఇస్తున్నాడు. అతని పేరు: "మసీహ్ ఈసా ఇబ్నె మర్యమ్. అతను ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ గౌరవనీయుడైనవాడై మరియు (అల్లాహ్) సామీప్యం పొందినవారిలో ఒకడై ఉంటాడు.

Verse 46

وَيُكَلِّمُ ٱلنَّاسَ فِى ٱلْمَهْدِ وَكَهْلًا وَمِنَ ٱلصَّـٰلِحِينَ

Transliteration wayukallimu l-nāsa fī l-mahdi wakahlan wamina l-ṣāliḥīna

Telugu "మరియు అతను ప్రజలతో ఉయ్యాలలో ఉండగానే మాట్లాడుతాడు మరియు పెద్దవాడైన తరువాత కూడా (మాట్లాడుతాడు) మరియు సత్పురుషులలో ఒకడై ఉంటాడు."

Verse 47

قَالَتْ رَبِّ أَنَّىٰ يَكُونُ لِى وَلَدٌ وَلَمْ يَمْسَسْنِى بَشَرٌ ۖ قَالَ كَذَٰلِكِ ٱللَّهُ يَخْلُقُ مَا يَشَآءُ ۚ إِذَا قَضَىٰٓ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُۥ كُن فَيَكُونُ

Transliteration qālat rabbi annā yakūnu lī waladun walam yamsasnī basharun qāla kadhāliki l-lahu yakhluqu mā yashāu idhā qaḍā amran fa-innamā yaqūlu lahu kun fayakūnu

Telugu ఆమె (మర్యమ్) ఇలా అన్నది: "ఓ నా ప్రభూ! నాకు కుమారుడు ఎలా కలుగుతాడు? ఏ పురుషుడు కూడా నన్ను ముట్టలేదే?" ఆయన ఇలా సమాధాన మిచ్చాడు: "అల్లాహ్ తాను కోరింది ఇదే విధంగా సృష్టిస్తాడు. ఆయన ఒక పని చేయాలని నిర్ణయించినపుడు కేవలం దానిని : 'అయిపో!' అని అంటాడు, అంతే అది అయిపోతుంది."

Verse 48

وَيُعَلِّمُهُ ٱلْكِتَـٰبَ وَٱلْحِكْمَةَ وَٱلتَّوْرَىٰةَ وَٱلْإِنجِيلَ

Transliteration wayuʿallimuhu l-kitāba wal-ḥik'mata wal-tawrāta wal-injīla

Telugu మరియు ఆయన (అల్లాహ్) అతనికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని మరియు తౌరాతును మరియు ఇంజీలును నేర్పుతాడు.

Verse 49

وَرَسُولًا إِلَىٰ بَنِىٓ إِسْرَٰٓءِيلَ أَنِّى قَدْ جِئْتُكُم بِـَٔايَةٍ مِّن رَّبِّكُمْ ۖ أَنِّىٓ أَخْلُقُ لَكُم مِّنَ ٱلطِّينِ كَهَيْـَٔةِ ٱلطَّيْرِ فَأَنفُخُ فِيهِ فَيَكُونُ طَيْرًۢا بِإِذْنِ ٱللَّهِ ۖ وَأُبْرِئُ ٱلْأَكْمَهَ وَٱلْأَبْرَصَ وَأُحْىِ ٱلْمَوْتَىٰ بِإِذْنِ ٱللَّهِ ۖ وَأُنَبِّئُكُم بِمَا تَأْكُلُونَ وَمَا تَدَّخِرُونَ فِى بُيُوتِكُمْ ۚ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ

Transliteration warasūlan ilā banī is'rāīla annī qad ji'tukum biāyatin min rabbikum annī akhluqu lakum mina l-ṭīni kahayati l-ṭayri fa-anfukhu fīhi fayakūnu ṭayran bi-idh'ni l-lahi wa-ub'ri-u l-akmaha wal-abraṣa wa-uḥ'yī l-mawtā bi-idh'ni l-lahi wa-unabbi-ukum bimā takulūna wamā taddakhirūna fī buyūtikum inna fī dhālika laāyatan lakum in kuntum mu'minīna

Telugu మరియు అతనిని ఇస్రాయీల్ సంతతి వారి వైపుకు సందేశహరునిగా పంపుతాడు. (అతను ఇలా అంటాడు): "నిశ్చయంగా, నేను మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు సూచన (ఆయత్) తీసుకొని వచ్చాను. నిశ్చయంగా, నేను మీ కొరకు మట్టితో పక్షి ఆకారంలో ఒక బొమ్మను తయారుచేసి దానిలో శ్వాసను ఊదుతాను! అప్పుడది అల్లాహ్ ఆజ్ఞతో పక్షి అవుతుంది. మరియు నేను అల్లాహ్ ఆజ్ఞతో పుట్టుగ్రుడ్డిని, కుష్ఠురోగిని బాగు చేస్తాను మరియు మృతుణ్ణి బ్రతికిస్తాను. మరియు మీరు తినేది, ఇండ్లలో కూడబెట్టేది మీకు తెలుపుతాను. మీరు విశ్వాసులే అయితే! నిశ్చయంగా, ఇందులో మీకు ఒక గొప్ప సూచన (ఆయత్) ఉంది.

Verse 50

وَمُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَىَّ مِنَ ٱلتَّوْرَىٰةِ وَلِأُحِلَّ لَكُم بَعْضَ ٱلَّذِى حُرِّمَ عَلَيْكُمْ ۚ وَجِئْتُكُم بِـَٔايَةٍ مِّن رَّبِّكُمْ فَٱتَّقُوا۟ ٱللَّهَ وَأَطِيعُونِ

Transliteration wamuṣaddiqan limā bayna yadayya mina l-tawrāti wali-uḥilla lakum baʿḍa alladhī ḥurrima ʿalaykum waji'tukum biāyatin min rabbikum fa-ittaqū l-laha wa-aṭīʿūni

Telugu " మరియు నేను, ప్రస్తుతం తౌరాత్ లో (మిగిలి ఉన్న సత్యాన్ని) ధృవ పరచటానికి మరియు పూర్వం మీకు నిషేధించబడిన (హరామ్ చేయబడిన) కొన్ని వస్తువులను ధర్మసమ్మతం (హలాల్) చేయటానికి (వచ్చాను). మరియు నేను మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు అద్భుత సూచనలు (ఆయాత్) తీసుకొని వచ్చాను, కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి!

Verse 51

إِنَّ ٱللَّهَ رَبِّى وَرَبُّكُمْ فَٱعْبُدُوهُ ۗ هَـٰذَا صِرَٰطٌ مُّسْتَقِيمٌ

Transliteration inna l-laha rabbī warabbukum fa-uʿ'budūhu hādhā ṣirāṭun mus'taqīmun

Telugu "నిశ్చయంగా, అల్లాహ్ నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను, కావున మీరు ఆయననే ఆరాధించండి. ఇదే ఋజుమార్గము."

Verse 52

۞ فَلَمَّآ أَحَسَّ عِيسَىٰ مِنْهُمُ ٱلْكُفْرَ قَالَ مَنْ أَنصَارِىٓ إِلَى ٱللَّهِ ۖ قَالَ ٱلْحَوَارِيُّونَ نَحْنُ أَنصَارُ ٱللَّهِ ءَامَنَّا بِٱللَّهِ وَٱشْهَدْ بِأَنَّا مُسْلِمُونَ

Transliteration falammā aḥassa ʿīsā min'humu l-kuf'ra qāla man anṣārī ilā l-lahi qāla l-ḥawāriyūna naḥnu anṣāru l-lahi āmannā bil-lahi wa-ish'had bi-annā mus'limūna

Telugu ఈసా వారిలో సత్యతిరస్కారాన్ని కనుగొని ఇలా ప్రశ్నించాడు: "అల్లాహ్ మార్గంలో నాకు సహాయకులుగా ఎవరు ఉంటారు?" (అప్పుడతని) శిష్యులు ఇలా జవాబిచ్చారు: "మేము నీకు అల్లాహ్ మార్గంలో సహాయకులముగా ఉంటాము. మేము అల్లాహ్ ను విశ్వసించాము మరియు మేము అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము) అయ్యామని, నీవు మాకు సాక్షిగా ఉండు.

Verse 53

رَبَّنَآ ءَامَنَّا بِمَآ أَنزَلْتَ وَٱتَّبَعْنَا ٱلرَّسُولَ فَٱكْتُبْنَا مَعَ ٱلشَّـٰهِدِينَ

Transliteration rabbanā āmannā bimā anzalta wa-ittabaʿnā l-rasūla fa-uk'tub'nā maʿa l-shāhidīna

Telugu "ఓ మా ప్రభూ! నీవు అవతరింప జేసిన సందేశాన్ని మేము విశ్వసించాము మరియు మేము ఈ సందేశహరుణ్ణి అనుసరించాము. కావున మమ్మల్ని సాక్షులలో వ్రాసుకో!"

Verse 54

وَمَكَرُوا۟ وَمَكَرَ ٱللَّهُ ۖ وَٱللَّهُ خَيْرُ ٱلْمَـٰكِرِينَ

Transliteration wamakarū wamakara l-lahu wal-lahu khayru l-mākirīna

Telugu మరియు వారు (ఇస్రాయీల్ సంతతిలోని అవిశ్వాసులు, ఈసా కు విరుద్ధంగా) కుట్రలు చేశారు. మరియు అల్లాహ్ (వారి కుట్రలకు విరుద్ధంగా) పన్నాగాలు పన్నాడు. ఎత్తులు వేయటంలో అల్లాహ్ అత్యుత్తముడు!

Verse 55

إِذْ قَالَ ٱللَّهُ يَـٰعِيسَىٰٓ إِنِّى مُتَوَفِّيكَ وَرَافِعُكَ إِلَىَّ وَمُطَهِّرُكَ مِنَ ٱلَّذِينَ كَفَرُوا۟ وَجَاعِلُ ٱلَّذِينَ ٱتَّبَعُوكَ فَوْقَ ٱلَّذِينَ كَفَرُوٓا۟ إِلَىٰ يَوْمِ ٱلْقِيَـٰمَةِ ۖ ثُمَّ إِلَىَّ مَرْجِعُكُمْ فَأَحْكُمُ بَيْنَكُمْ فِيمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ

Transliteration idh qāla l-lahu yāʿīsā innī mutawaffīka warāfiʿuka ilayya wamuṭahhiruka mina alladhīna kafarū wajāʿilu alladhīna ittabaʿūka fawqa alladhīna kafarū ilā yawmi l-qiyāmati thumma ilayya marjiʿukum fa-aḥkumu baynakum fīmā kuntum fīhi takhtalifūna

Telugu (జ్ఞాపకం చేసుకోండి) అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: "ఓ ఈసా! నేను నిన్ను తీసుకుంటాను మరియు నిన్ను నా వైపునకు ఎత్తుకుంటాను మరియు సత్యతిరస్కారుల నుండి నిన్ను శుద్ధపరుస్తాను మరియు నిన్ను అనుసరించిన వారిని, పునరుత్థాన దినం వరకు సత్యతిరస్కారులకు పైచేయిగా ఉండేటట్లు చేస్తాను. చివరకు మీరంతా నా వద్దకే మరలి రావలసి ఉంది. అప్పుడు నేను మీ మధ్య తలెత్తిన విభేదాలను గురించి తీర్పు చేస్తాను.

Verse 56

فَأَمَّا ٱلَّذِينَ كَفَرُوا۟ فَأُعَذِّبُهُمْ عَذَابًا شَدِيدًا فِى ٱلدُّنْيَا وَٱلْـَٔاخِرَةِ وَمَا لَهُم مِّن نَّـٰصِرِينَ

Transliteration fa-ammā alladhīna kafarū fa-uʿadhibuhum ʿadhāban shadīdan fī l-dun'yā wal-ākhirati wamā lahum min nāṣirīna

Telugu "ఇక సత్యతిరస్కారులకు ఇహలోకంలో మరియు పరలోకంలోనూ కఠినమైన శిక్ష విధిస్తాను. మరియు వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు."

Verse 57

وَأَمَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ ۗ وَٱللَّهُ لَا يُحِبُّ ٱلظَّـٰلِمِينَ

Transliteration wa-ammā alladhīna āmanū waʿamilū l-ṣāliḥāti fayuwaffīhim ujūrahum wal-lahu lā yuḥibbu l-ẓālimīna

Telugu మరియు విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి (అల్లాహ్) పరిపూర్ణ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ దుర్మార్గులు అంటే ఇష్టపడడు.

Verse 58

ذَٰلِكَ نَتْلُوهُ عَلَيْكَ مِنَ ٱلْـَٔايَـٰتِ وَٱلذِّكْرِ ٱلْحَكِيمِ

Transliteration dhālika natlūhu ʿalayka mina l-āyāti wal-dhik'ri l-ḥakīmi

Telugu (ఓ ముహమ్మద్!) మేము నీకు ఈ సూచనలను (ఆయాత్ లను) వినిపిస్తున్నాము. మరియు ఇవి వివేకంతో నిండిన ఉపదేశాలు.

Verse 59

إِنَّ مَثَلَ عِيسَىٰ عِندَ ٱللَّهِ كَمَثَلِ ءَادَمَ ۖ خَلَقَهُۥ مِن تُرَابٍ ثُمَّ قَالَ لَهُۥ كُن فَيَكُونُ

Transliteration inna mathala ʿīsā ʿinda l-lahi kamathali ādama khalaqahu min turābin thumma qāla lahu kun fayakūnu

Telugu నిశ్చయంగా, అల్లాహ్ దృష్టిలో ఈసా ఉపమానం, ఆదమ్ ఉపమానం వంటిదే. ఆయన (ఆదమ్ ను) మట్టితో సృజించి: "అయిపో!" అని అన్నాడు. అంతే అతను అయిపోయాడు.

Verse 60

ٱلْحَقُّ مِن رَّبِّكَ فَلَا تَكُن مِّنَ ٱلْمُمْتَرِينَ

Transliteration al-ḥaqu min rabbika falā takun mina l-mum'tarīna

Telugu ఈ సత్యం నీ ప్రభువు తరఫు నుండి వచ్చింది, కావున నీవు శంకించేవారిలో చేరిన వాడవు కావద్దు.

Verse 61

فَمَنْ حَآجَّكَ فِيهِ مِنۢ بَعْدِ مَا جَآءَكَ مِنَ ٱلْعِلْمِ فَقُلْ تَعَالَوْا۟ نَدْعُ أَبْنَآءَنَا وَأَبْنَآءَكُمْ وَنِسَآءَنَا وَنِسَآءَكُمْ وَأَنفُسَنَا وَأَنفُسَكُمْ ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَل لَّعْنَتَ ٱللَّهِ عَلَى ٱلْكَـٰذِبِينَ

Transliteration faman ḥājjaka fīhi min baʿdi mā jāaka mina l-ʿil'mi faqul taʿālaw nadʿu abnāanā wa-abnāakum wanisāanā wanisāakum wa-anfusanā wa-anfusakum thumma nabtahil fanajʿal laʿnata l-lahi ʿalā l-kādhibīna

Telugu ఈ జ్ఞానం నీకు అందిన తర్వాత కూడా ఎవడైనా నీతో అతనిని (ఈసాను) గురించి వివాదానికి దిగితే, ఇలా అను: "రండి! మేము మరియు మీరు కలిసి, మా కుమారులను మరియు మీ కుమారులను; మా స్త్రీలను మరియు మీ స్త్రీలను పిలుచుకొని, అందరమూ కలిసి: 'అసత్యం పలికే వారిపై అల్లాహ్ శాపం (బహిష్కారం) పడుగాక!' అని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాము."

Verse 62

إِنَّ هَـٰذَا لَهُوَ ٱلْقَصَصُ ٱلْحَقُّ ۚ وَمَا مِنْ إِلَـٰهٍ إِلَّا ٱللَّهُ ۚ وَإِنَّ ٱللَّهَ لَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ

Transliteration inna hādhā lahuwa l-qaṣaṣu l-ḥaqu wamā min ilāhin illā l-lahu wa-inna l-laha lahuwa l-ʿazīzu l-ḥakīmu

Telugu నిశ్చయంగా, ఇదే (ఈసాను గురించిన) సత్యగాథ. మరియు అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.

Verse 63

فَإِن تَوَلَّوْا۟ فَإِنَّ ٱللَّهَ عَلِيمٌۢ بِٱلْمُفْسِدِينَ

Transliteration fa-in tawallaw fa-inna l-laha ʿalīmun bil-muf'sidīna

Telugu ఒకవేళ వారు వెనుదిరిగితే! నిశ్చయంగా, అల్లాహ్ కు కల్లలోలం రేకెత్తించే వారిని గురించి బాగా తెలుసు.

Verse 64

قُلْ يَـٰٓأَهْلَ ٱلْكِتَـٰبِ تَعَالَوْا۟ إِلَىٰ كَلِمَةٍ سَوَآءٍۭ بَيْنَنَا وَبَيْنَكُمْ أَلَّا نَعْبُدَ إِلَّا ٱللَّهَ وَلَا نُشْرِكَ بِهِۦ شَيْـًٔا وَلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا أَرْبَابًا مِّن دُونِ ٱللَّهِ ۚ فَإِن تَوَلَّوْا۟ فَقُولُوا۟ ٱشْهَدُوا۟ بِأَنَّا مُسْلِمُونَ

Transliteration qul yāahla l-kitābi taʿālaw ilā kalimatin sawāin baynanā wabaynakum allā naʿbuda illā l-laha walā nush'rika bihi shayan walā yattakhidha baʿḍunā baʿḍan arbāban min dūni l-lahi fa-in tawallaw faqūlū ish'hadū bi-annā mus'limūna

Telugu ఇలా అను: " ఓ గ్రంథ ప్రజలారా! మాకూ మరియు మీకూ మధ్య ఉమ్మడిగా ఉన్న ధర్మ విషయం (ఉత్తరువు) వైపునకు రండి, అది ఏమిటంటే: 'మనం అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించరాదు, ఆయనకు భాగస్వాములను ఎవ్వరినీ నిలబెట్టరాదు మరియు అల్లాహ్ తప్ప, మనవారిలో నుండి ఎవ్వరినీ ప్రభువులుగా చేసుకోరాదు." వారు (సమ్మతించక) తిరిగి పోతే: "మేము నిశ్చయంగా అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము), దీనికి మీరు సాక్షులుగా ఉండండి." అని పలుకు.

Verse 65

يَـٰٓأَهْلَ ٱلْكِتَـٰبِ لِمَ تُحَآجُّونَ فِىٓ إِبْرَٰهِيمَ وَمَآ أُنزِلَتِ ٱلتَّوْرَىٰةُ وَٱلْإِنجِيلُ إِلَّا مِنۢ بَعْدِهِۦٓ ۚ أَفَلَا تَعْقِلُونَ

Transliteration yāahla l-kitābi lima tuḥājjūna fī ib'rāhīma wamā unzilati l-tawrātu wal-injīlu illā min baʿdihi afalā taʿqilūna

Telugu ఓ గ్రంథ ప్రజలారా! ఇబ్రాహీమ్ (ధర్మాన్ని) గురించి మీరు ఎందుకు వాదులాడుతున్నారు? తౌరాతు మరియు ఇంజీల్ లు అతని తరువాతనే అవతరించాయి కదా! ఇది మీరు అర్థం చేసుకోలేరా?

Verse 66

هَـٰٓأَنتُمْ هَـٰٓؤُلَآءِ حَـٰجَجْتُمْ فِيمَا لَكُم بِهِۦ عِلْمٌ فَلِمَ تُحَآجُّونَ فِيمَا لَيْسَ لَكُم بِهِۦ عِلْمٌ ۚ وَٱللَّهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ

Transliteration hāantum hāulāi ḥājajtum fīmā lakum bihi ʿil'mun falima tuḥājjūna fīmā laysa lakum bihi ʿil'mun wal-lahu yaʿlamu wa-antum lā taʿlamūna

Telugu అవును, మీరే వారు! తెలిసివున్న విషయాలను గురించి వాదులాడినవారు. అయితే మీకేమీ తెలియని విషయాలను గురించి ఎందుకు వాదులాడుతున్నారు? మరియు అల్లాహ్ కు అంతా తెలుసు, కానీ మీకు ఏమీ తెలియదు.

Verse 67

مَا كَانَ إِبْرَٰهِيمُ يَهُودِيًّا وَلَا نَصْرَانِيًّا وَلَـٰكِن كَانَ حَنِيفًا مُّسْلِمًا وَمَا كَانَ مِنَ ٱلْمُشْرِكِينَ

Transliteration mā kāna ib'rāhīmu yahūdiyyan walā naṣrāniyyan walākin kāna ḥanīfan mus'liman wamā kāna mina l-mush'rikīna

Telugu ఇబ్రాహీమ్ యూదుడూ కాడు మరియు క్రైస్తవుడూ కాడు! కాని అతను ఏకదైవ సిద్ధాంతంపై ఉన్నవాడు (హనీఫ్), అల్లాహ్ కు విధేయుడు (ముస్లిం) మరియు అతడు ఏ మాత్రం (అల్లాహ్ కు) సాటి కల్పించేవాడు (ముష్రిక్) కాడు.

Verse 68

إِنَّ أَوْلَى ٱلنَّاسِ بِإِبْرَٰهِيمَ لَلَّذِينَ ٱتَّبَعُوهُ وَهَـٰذَا ٱلنَّبِىُّ وَٱلَّذِينَ ءَامَنُوا۟ ۗ وَٱللَّهُ وَلِىُّ ٱلْمُؤْمِنِينَ

Transliteration inna awlā l-nāsi bi-ib'rāhīma lalladhīna ittabaʿūhu wahādhā l-nabiyu wa-alladhīna āmanū wal-lahu waliyyu l-mu'minīna

Telugu నిశ్చయంగా, ఇబ్రాహీమ్ తో దగ్గరి సంబంధం గల వారంటే, అతనిని అనుసరించే వారు మరియు ఈ ప్రవక్త (ముహమ్మద్) మరియు (ఇతనిని) విశ్వసించిన వారు. మరియు అల్లాహ్ యే విశ్వాసుల సంరక్షకుడు.

Verse 69

وَدَّت طَّآئِفَةٌ مِّنْ أَهْلِ ٱلْكِتَـٰبِ لَوْ يُضِلُّونَكُمْ وَمَا يُضِلُّونَ إِلَّآ أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ

Transliteration waddat ṭāifatun min ahli l-kitābi law yuḍillūnakum wamā yuḍillūna illā anfusahum wamā yashʿurūna

Telugu గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు, మిమ్మల్ని మార్గభ్రష్టులు చేయాలని కోరుతున్నారు. కాని వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మార్గభ్రష్టులు చేయటం లేదు, కాని వారది గ్రహించటం లేదు.

Verse 70

يَـٰٓأَهْلَ ٱلْكِتَـٰبِ لِمَ تَكْفُرُونَ بِـَٔايَـٰتِ ٱللَّهِ وَأَنتُمْ تَشْهَدُونَ

Transliteration yāahla l-kitābi lima takfurūna biāyāti l-lahi wa-antum tashhadūna

Telugu "ఓ గ్రంథ ప్రజలారా! మీరు అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) ఎందుకు తిరస్కరిస్తున్నారు? మరియు వాటికి మీరే సాక్షులుగా ఉన్నారు కదా!"

Verse 71

يَـٰٓأَهْلَ ٱلْكِتَـٰبِ لِمَ تَلْبِسُونَ ٱلْحَقَّ بِٱلْبَـٰطِلِ وَتَكْتُمُونَ ٱلْحَقَّ وَأَنتُمْ تَعْلَمُونَ

Transliteration yāahla l-kitābi lima talbisūna l-ḥaqa bil-bāṭili wataktumūna l-ḥaqa wa-antum taʿlamūna

Telugu "ఓ గ్రంథ ప్రజలారా! తెలిసి ఉండి కూడా మీరు సత్యాన్ని అసత్యంతో ఎందుకు కప్పి పుచ్చుతున్నారు? మరియు మీకు తెలిసి ఉండి కూడా సత్యాన్ని ఎందుకు దాస్తున్నారు?"

Verse 72

وَقَالَت طَّآئِفَةٌ مِّنْ أَهْلِ ٱلْكِتَـٰبِ ءَامِنُوا۟ بِٱلَّذِىٓ أُنزِلَ عَلَى ٱلَّذِينَ ءَامَنُوا۟ وَجْهَ ٱلنَّهَارِ وَٱكْفُرُوٓا۟ ءَاخِرَهُۥ لَعَلَّهُمْ يَرْجِعُونَ

Transliteration waqālat ṭāifatun min ahli l-kitābi āminū bi-alladhī unzila ʿalā alladhīna āmanū wajha l-nahāri wa-uk'furū ākhirahu laʿallahum yarjiʿūna

Telugu మరియు గ్రంథ ప్రజలలోని కొందరు (పరస్పరం ఇలా చెప్పుకుంటారు): "(ఈ ప్రవక్తను) విశ్వసించిన వారిపై (ముస్లింలపై) అవతరింపజేయబడిన దానిని ఉదయం విశ్వసించండి మరియు సాయంత్రం తిరస్కరించండి. (ఇలా చేస్తే) బహుశా, వారు కూడా (తమ విశ్వాసం నుండి) తిరిగి పోతారేమో!"

Verse 73

وَلَا تُؤْمِنُوٓا۟ إِلَّا لِمَن تَبِعَ دِينَكُمْ قُلْ إِنَّ ٱلْهُدَىٰ هُدَى ٱللَّهِ أَن يُؤْتَىٰٓ أَحَدٌ مِّثْلَ مَآ أُوتِيتُمْ أَوْ يُحَآجُّوكُمْ عِندَ رَبِّكُمْ ۗ قُلْ إِنَّ ٱلْفَضْلَ بِيَدِ ٱللَّهِ يُؤْتِيهِ مَن يَشَآءُ ۗ وَٱللَّهُ وَٰسِعٌ عَلِيمٌ

Transliteration walā tu'minū illā liman tabiʿa dīnakum qul inna l-hudā hudā l-lahi an yu'tā aḥadun mith'la mā ūtītum aw yuḥājjūkum ʿinda rabbikum qul inna l-faḍla biyadi l-lahi yu'tīhi man yashāu wal-lahu wāsiʿun ʿalīmun

Telugu మరియు (పరస్పరం ఇలా చెప్పుకుంటారు): "మీ ధర్మాన్ని అనుసరించే వారిని తప్ప మరెవ్వరినీ నమ్మకండి." (ఓ ప్రవక్తా!) నీవు వారితో అను: "నిశ్చయంగా, అల్లాహ్ మార్గదర్శకత్వమే సరైన మార్గదర్శకత్వం." (వారు ఇంకా ఇలా అంటారు): "మీకు ఇవ్వబడినటువంటిది ఇంకెవరికైనా ఇవ్వబడుతుందని, లేక వారు మీ ప్రభువు సమక్షంలో మీతో వాదిస్తారని, (నమ్మకండి)." వారితో అను: "నిశ్చయంగా, అనుగ్రహం అల్లాహ్ చేతిలోనే ఉంది; ఆయన దానిని తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ సర్వవ్యాప్తి, సర్వజ్ఞుడు."

Verse 74

يَخْتَصُّ بِرَحْمَتِهِۦ مَن يَشَآءُ ۗ وَٱللَّهُ ذُو ٱلْفَضْلِ ٱلْعَظِيمِ

Transliteration yakhtaṣṣu biraḥmatihi man yashāu wal-lahu dhū l-faḍli l-ʿaẓīmi

Telugu ఆయన తాను కోరిన వారిని తన కారుణ్యం కొరకు ప్రత్యేకించుకుంటాడు. మరియు అల్లాహ్ దాతృత్వంలో, సర్వోత్తముడు.

Verse 75

۞ وَمِنْ أَهْلِ ٱلْكِتَـٰبِ مَنْ إِن تَأْمَنْهُ بِقِنطَارٍ يُؤَدِّهِۦٓ إِلَيْكَ وَمِنْهُم مَّنْ إِن تَأْمَنْهُ بِدِينَارٍ لَّا يُؤَدِّهِۦٓ إِلَيْكَ إِلَّا مَا دُمْتَ عَلَيْهِ قَآئِمًا ۗ ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا۟ لَيْسَ عَلَيْنَا فِى ٱلْأُمِّيِّـۧنَ سَبِيلٌ وَيَقُولُونَ عَلَى ٱللَّهِ ٱلْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ

Transliteration wamin ahli l-kitābi man in tamanhu biqinṭārin yu-addihi ilayka wamin'hum man in tamanhu bidīnārin lā yu-addihi ilayka illā mā dum'ta ʿalayhi qāiman dhālika bi-annahum qālū laysa ʿalaynā fī l-umiyīna sabīlun wayaqūlūna ʿalā l-lahi l-kadhiba wahum yaʿlamūna

Telugu మరియు గ్రంథ ప్రజలలో ఎలాంటి వాడున్నాడంటే: నీవు అతనికి ధనరాసులు ఇచ్చినా అతడు వాటిని నమ్మకంగా నీకు తిరిగి అప్పగిస్తాడు. మరొకడు వారిలో ఎలాంటి వాడంటే: నీవతన్ని నమ్మి ఒక్క దీనారు ఇచ్చినా అతడు దానిని - నీవతని వెంట బడితేనే కానీ - నీకు తిరిగి ఇవ్వడు. ఇలాంటి వారు ఏమంటారంటే: "నిరక్ష్యరాస్యుల (యూదులు కాని వారి) పట్ల ఎలా వ్యవహరించినా మాపై ఎలాంటి దోషం లేదు." మరియు వారు తెలిసి ఉండి కూడా అల్లాహ్ ను గురించి అబద్ధాలాడుతున్నారు.

Verse 76

بَلَىٰ مَنْ أَوْفَىٰ بِعَهْدِهِۦ وَٱتَّقَىٰ فَإِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلْمُتَّقِينَ

Transliteration balā man awfā biʿahdihi wa-ittaqā fa-inna l-laha yuḥibbu l-mutaqīna

Telugu వాస్తవానికి, ఎవడు తన ఒప్పందాన్ని పూర్తి చేసి దైవభీతి కలిగి ఉంటాడో; అలాంటి దైవభీతి గలవారిని నిశ్చయంగా, అల్లాహ్ ప్రేమిస్తాడు.

Verse 77

إِنَّ ٱلَّذِينَ يَشْتَرُونَ بِعَهْدِ ٱللَّهِ وَأَيْمَـٰنِهِمْ ثَمَنًا قَلِيلًا أُو۟لَـٰٓئِكَ لَا خَلَـٰقَ لَهُمْ فِى ٱلْـَٔاخِرَةِ وَلَا يُكَلِّمُهُمُ ٱللَّهُ وَلَا يَنظُرُ إِلَيْهِمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ

Transliteration inna alladhīna yashtarūna biʿahdi l-lahi wa-aymānihim thamanan qalīlan ulāika lā khalāqa lahum fī l-ākhirati walā yukallimuhumu l-lahu walā yanẓuru ilayhim yawma l-qiyāmati walā yuzakkīhim walahum ʿadhābun alīmun

Telugu నిశ్చయంగా, ఎవరైతే తాము అల్లాహ్ తో చేసిన ఒప్పందాన్ని మరియు తమ ప్రమాణాలను స్వల్పలాభాలకు అమ్ముకుంటారో, అలాంటి వారికి పరలోక జీవితంలో ఎలాంటి భాగం ఉండదు మరియు పునరుత్థాన దినమున అల్లాహ్ వారితో మాట్లాడడు మరియు వారి వైపు కూడా చూడడు మరియు వారిని పరిశుద్ధులుగా చేయడు మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

Verse 78

وَإِنَّ مِنْهُمْ لَفَرِيقًا يَلْوُۥنَ أَلْسِنَتَهُم بِٱلْكِتَـٰبِ لِتَحْسَبُوهُ مِنَ ٱلْكِتَـٰبِ وَمَا هُوَ مِنَ ٱلْكِتَـٰبِ وَيَقُولُونَ هُوَ مِنْ عِندِ ٱللَّهِ وَمَا هُوَ مِنْ عِندِ ٱللَّهِ وَيَقُولُونَ عَلَى ٱللَّهِ ٱلْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ

Transliteration wa-inna min'hum lafarīqan yalwūna alsinatahum bil-kitābi litaḥsabūhu mina l-kitābi wamā huwa mina l-kitābi wayaqūlūna huwa min ʿindi l-lahi wamā huwa min ʿindi l-lahi wayaqūlūna ʿalā l-lahi l-kadhiba wahum yaʿlamūna

Telugu మరియు మీరు అది గ్రంథం లోనిదని భావించాలని, వాస్తవానికి వారిలో కొందరు తమ నాలుకలను త్రిప్పి గ్రంథాన్ని చదువుతారు, కాని (నిజానికి) అది గ్రంథం లోనిది కాదు; మరియు వారు: "అది అల్లాహ్ దగ్గర నుండి వచ్చింది." అని అంటారు, కాని అది (నిజానికి) అల్లాహ్ దగ్గర నుండి వచ్చింది కాదు, మరియు వారు తెలిసి కూడా అల్లాహ్ పై అబద్ధాలు పలుకుతున్నారు.

Verse 79

مَا كَانَ لِبَشَرٍ أَن يُؤْتِيَهُ ٱللَّهُ ٱلْكِتَـٰبَ وَٱلْحُكْمَ وَٱلنُّبُوَّةَ ثُمَّ يَقُولَ لِلنَّاسِ كُونُوا۟ عِبَادًا لِّى مِن دُونِ ٱللَّهِ وَلَـٰكِن كُونُوا۟ رَبَّـٰنِيِّـۧنَ بِمَا كُنتُمْ تُعَلِّمُونَ ٱلْكِتَـٰبَ وَبِمَا كُنتُمْ تَدْرُسُونَ

Transliteration mā kāna libasharin an yu'tiyahu l-lahu l-kitāba wal-ḥuk'ma wal-nubuwata thumma yaqūla lilnnāsi kūnū ʿibādan lī min dūni l-lahi walākin kūnū rabbāniyyīna bimā kuntum tuʿallimūna l-kitāba wabimā kuntum tadrusūna

Telugu ఏ మానవునికైనా అల్లాహ్ అతనికి గ్రంథాన్ని, వివేకాన్ని మరియు ప్రవక్త పదవిని ప్రసాదించిన తర్వాత అతడు ప్రజలతో: "మీరు అల్లాహ్ కు బదులుగా నన్ను ప్రార్థించండి." అని అనటం తగినది కాదు, కాని వారితో: "మీరు ఇతరులకు బోధించే మరియు మీరు చదివే గ్రంథాల అనుసారంగా ధర్మవేత్తలు (రబ్బానియ్యూన్) కండి." అని అనటం (భావింపదగినది);

Verse 80

وَلَا يَأْمُرَكُمْ أَن تَتَّخِذُوا۟ ٱلْمَلَـٰٓئِكَةَ وَٱلنَّبِيِّـۧنَ أَرْبَابًا ۗ أَيَأْمُرُكُم بِٱلْكُفْرِ بَعْدَ إِذْ أَنتُم مُّسْلِمُونَ

Transliteration walā yamurakum an tattakhidhū l-malāikata wal-nabiyīna arbāban ayamurukum bil-kuf'ri baʿda idh antum mus'limūna

Telugu మరియు మీరు దేవదూతలనో, లేదా ప్రవక్తలనో ప్రభువులుగా చేసుకోండని అతను మిమ్మల్ని ఎన్నడూ ఆజ్ఞాపించడు. అయితే! అలాంటప్పుడు మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన తరువాత మిమ్మల్ని సత్యతిరస్కారులు కమ్మని ఆదేశించగలడా?

Verse 81

وَإِذْ أَخَذَ ٱللَّهُ مِيثَـٰقَ ٱلنَّبِيِّـۧنَ لَمَآ ءَاتَيْتُكُم مِّن كِتَـٰبٍ وَحِكْمَةٍ ثُمَّ جَآءَكُمْ رَسُولٌ مُّصَدِّقٌ لِّمَا مَعَكُمْ لَتُؤْمِنُنَّ بِهِۦ وَلَتَنصُرُنَّهُۥ ۚ قَالَ ءَأَقْرَرْتُمْ وَأَخَذْتُمْ عَلَىٰ ذَٰلِكُمْ إِصْرِى ۖ قَالُوٓا۟ أَقْرَرْنَا ۚ قَالَ فَٱشْهَدُوا۟ وَأَنَا۠ مَعَكُم مِّنَ ٱلشَّـٰهِدِينَ

Transliteration wa-idh akhadha l-lahu mīthāqa l-nabiyīna lamā ātaytukum min kitābin waḥik'matin thumma jāakum rasūlun muṣaddiqun limā maʿakum latu'minunna bihi walatanṣurunnahu qāla a-aqrartum wa-akhadhtum ʿalā dhālikum iṣ'rī qālū aqrarnā qāla fa-ish'hadū wa-anā maʿakum mina l-shāhidīna

Telugu మరియు అల్లాహ్ ప్రవక్తల నుండి తీసుకున్న గట్టి ప్రమాణాన్ని (జ్ఞాపకం చేసుకోండి): "నేను మీకు ఒక గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించిన తరువాత, ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి (మీ గ్రంథాలలో నుండి మిగిలివున్న) సత్యాన్ని ధృవపరిస్తే మీరు అతని (ధర్మాన్ని) విశ్వసించి, అతనికి సహాయం చేయవలసి ఉంటుంది." అని చెప్పి ఇలా ప్రశ్నించాడు: "ఏమీ? మీరు దీనికి అంగీకరిస్తారా? మరియు నా ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తారా?" వారన్నారు: "మేము అంగీకరిస్తాము." అప్పుడు ఆయన అన్నాడు: "అయితే, మీరు దీనికి సాక్షులుగా ఉండండి. మరియు నేను కూడా మీతోపాటు సాక్షిగా ఉంటాను.

Verse 82

فَمَن تَوَلَّىٰ بَعْدَ ذَٰلِكَ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْفَـٰسِقُونَ

Transliteration faman tawallā baʿda dhālika fa-ulāika humu l-fāsiqūna

Telugu ఇకపై ఎవరు తమ వాగ్దానం నుండి మరలుతారో, వారే దుష్టులు (ఫాసిఖూన్).

Verse 83

أَفَغَيْرَ دِينِ ٱللَّهِ يَبْغُونَ وَلَهُۥٓ أَسْلَمَ مَن فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَإِلَيْهِ يُرْجَعُونَ

Transliteration afaghayra dīni l-lahi yabghūna walahu aslama man fī l-samāwāti wal-arḍi ṭawʿan wakarhan wa-ilayhi yur'jaʿūna

Telugu ఏమీ? వీరు అల్లాహ్ ధర్మం కాక వేరే ధర్మాన్ని అవలంబించగోరుతున్నారా? మరియు భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఇష్టం ఉన్నా, ఇష్టం లేకున్నా ఆయనకే విధేయులై (ముస్లింలై) ఉన్నాయి! మరియు ఆయన వైపునకే అందరూ మరలింపబడతారు.

Verse 84

قُلْ ءَامَنَّا بِٱللَّهِ وَمَآ أُنزِلَ عَلَيْنَا وَمَآ أُنزِلَ عَلَىٰٓ إِبْرَٰهِيمَ وَإِسْمَـٰعِيلَ وَإِسْحَـٰقَ وَيَعْقُوبَ وَٱلْأَسْبَاطِ وَمَآ أُوتِىَ مُوسَىٰ وَعِيسَىٰ وَٱلنَّبِيُّونَ مِن رَّبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّنْهُمْ وَنَحْنُ لَهُۥ مُسْلِمُونَ

Transliteration qul āmannā bil-lahi wamā unzila ʿalaynā wamā unzila ʿalā ib'rāhīma wa-is'māʿīla wa-is'ḥāqa wayaʿqūba wal-asbāṭi wamā ūtiya mūsā waʿīsā wal-nabiyūna min rabbihim lā nufarriqu bayna aḥadin min'hum wanaḥnu lahu mus'limūna

Telugu (ఓ ప్రవక్తా!) ఇలా అను: "మేము అల్లాహ్ ను విశ్వసించాము; మరియు మాపై అవతరింపజేయబడిన దానిని మరియు ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ లపై మరియు అతని సంతానంపై అవతరింపజేయబడిన వాటిని కూడా (విశ్వసించాము). ఇంకా మూసా, ఈసా మరియు ఇతర ప్రవక్తలపై వారి ప్రభువు తరఫు నుండి (అవతరింపజేయబడిన వాటిని) కూడా విశ్వసించాము). మేము వారి మధ్య ఎలాంటి విచక్షణ చేయము. మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉన్నాము."

Verse 85

وَمَن يَبْتَغِ غَيْرَ ٱلْإِسْلَـٰمِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِى ٱلْـَٔاخِرَةِ مِنَ ٱلْخَـٰسِرِينَ

Transliteration waman yabtaghi ghayra l-is'lāmi dīnan falan yuq'bala min'hu wahuwa fī l-ākhirati mina l-khāsirīna

Telugu మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు.

Verse 86

كَيْفَ يَهْدِى ٱللَّهُ قَوْمًا كَفَرُوا۟ بَعْدَ إِيمَـٰنِهِمْ وَشَهِدُوٓا۟ أَنَّ ٱلرَّسُولَ حَقٌّ وَجَآءَهُمُ ٱلْبَيِّنَـٰتُ ۚ وَٱللَّهُ لَا يَهْدِى ٱلْقَوْمَ ٱلظَّـٰلِمِينَ

Transliteration kayfa yahdī l-lahu qawman kafarū baʿda īmānihim washahidū anna l-rasūla ḥaqqun wajāahumu l-bayinātu wal-lahu lā yahdī l-qawma l-ẓālimīna

Telugu అల్లాహ్ వారికి ఎలా సన్మార్గం చూపగలడు? ఏ జాతివారైతే, విశ్వాసం పొందిన తరువాత - మరియు నిశ్చయంగా సందేశహరుడు సత్యవంతుడే, అని సాక్ష్యమిచ్చిన తరువాత మరియు వారి వద్దకు స్పష్టమైన సూచనలు వచ్చిన తరువాత కూడా - సత్యతిరస్కారం అవలంబించారో! మరియు అల్లాహ్ దుర్మార్గులైన వారికి సన్మార్గం చూపడు.

Verse 87

أُو۟لَـٰٓئِكَ جَزَآؤُهُمْ أَنَّ عَلَيْهِمْ لَعْنَةَ ٱللَّهِ وَٱلْمَلَـٰٓئِكَةِ وَٱلنَّاسِ أَجْمَعِينَ

Transliteration ulāika jazāuhum anna ʿalayhim laʿnata l-lahi wal-malāikati wal-nāsi ajmaʿīna

Telugu అలాంటి వారి శిక్ష: నిశ్చయంగా అల్లాహ్ మరియు దేవదూతల మరియు సర్వమానవుల శాపం వారిపై పడటమే!

Verse 88

خَـٰلِدِينَ فِيهَا لَا يُخَفَّفُ عَنْهُمُ ٱلْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ

Transliteration khālidīna fīhā lā yukhaffafu ʿanhumu l-ʿadhābu walā hum yunẓarūna

Telugu అందులో (నరకంలో) వారు శాశ్వతంగా ఉంటారు. వారి శిక్ష ఏ మాత్రం తగ్గించబడదు మరియు వారికి వ్యవధి కూడా ఇవ్వబడదు.

Verse 89

إِلَّا ٱلَّذِينَ تَابُوا۟ مِنۢ بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوا۟ فَإِنَّ ٱللَّهَ غَفُورٌ رَّحِيمٌ

Transliteration illā alladhīna tābū min baʿdi dhālika wa-aṣlaḥū fa-inna l-laha ghafūrun raḥīmun

Telugu కానీ, ఇక మీదట ఎవరైతే పశ్చాత్తాప పడి, తమ నడవడికను సరిదిద్దుకుంటారో! అలాంటి వారి యెడల నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

Verse 90

إِنَّ ٱلَّذِينَ كَفَرُوا۟ بَعْدَ إِيمَـٰنِهِمْ ثُمَّ ٱزْدَادُوا۟ كُفْرًا لَّن تُقْبَلَ تَوْبَتُهُمْ وَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلضَّآلُّونَ

Transliteration inna alladhīna kafarū baʿda īmānihim thumma iz'dādū kuf'ran lan tuq'bala tawbatuhum wa-ulāika humu l-ḍālūna

Telugu (అయితే) నిశ్చయంగా, విశ్వసించిన తరువాత ఎవరు సత్యతిరస్కార వైఖరిని అవలంబిస్తారో మరియు తమ సత్యతిరస్కార వైఖరిని పెంచుకుంటారో, వారి పశ్చాత్తాపం ఏ మాత్రం అంగీకరించబడదు మరియు అలాంటి వారే మార్గభ్రష్టులైన వారు.

Verse 91

إِنَّ ٱلَّذِينَ كَفَرُوا۟ وَمَاتُوا۟ وَهُمْ كُفَّارٌ فَلَن يُقْبَلَ مِنْ أَحَدِهِم مِّلْءُ ٱلْأَرْضِ ذَهَبًا وَلَوِ ٱفْتَدَىٰ بِهِۦٓ ۗ أُو۟لَـٰٓئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ وَمَا لَهُم مِّن نَّـٰصِرِينَ

Transliteration inna alladhīna kafarū wamātū wahum kuffārun falan yuq'bala min aḥadihim mil'u l-arḍi dhahaban walawi if'tadā bihi ulāika lahum ʿadhābun alīmun wamā lahum min nāṣirīna

Telugu నిశ్చయంగా, ఎవరైతే సత్యతిరస్కారులై, ఆ సత్యతిరస్కార స్థితిలోనే మృతి చెందుతారో! వారు భూగోళమంత బంగారం పాపపరిహారంగా ఇవ్వదలిచినా అది అంగీకరించబడదు. అలాంటి వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. మరియు వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు.

Verse 92

لَن تَنَالُوا۟ ٱلْبِرَّ حَتَّىٰ تُنفِقُوا۟ مِمَّا تُحِبُّونَ ۚ وَمَا تُنفِقُوا۟ مِن شَىْءٍ فَإِنَّ ٱللَّهَ بِهِۦ عَلِيمٌ

Transliteration lan tanālū l-bira ḥattā tunfiqū mimmā tuḥibbūna wamā tunfiqū min shayin fa-inna l-laha bihi ʿalīmun

Telugu మీకు అత్యంత ప్రీతికరమైన దానిని మీరు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్యాత్ములు (ధర్మనిష్ఠాపరులు) కాలేరు. మరియు మీరు ఏమి ఖర్చుపెట్టినా అది అల్లాహ్ కు తప్పక తెలుస్తుంది.

Verse 93

۞ كُلُّ ٱلطَّعَامِ كَانَ حِلًّا لِّبَنِىٓ إِسْرَٰٓءِيلَ إِلَّا مَا حَرَّمَ إِسْرَٰٓءِيلُ عَلَىٰ نَفْسِهِۦ مِن قَبْلِ أَن تُنَزَّلَ ٱلتَّوْرَىٰةُ ۗ قُلْ فَأْتُوا۟ بِٱلتَّوْرَىٰةِ فَٱتْلُوهَآ إِن كُنتُمْ صَـٰدِقِينَ

Transliteration kullu l-ṭaʿāmi kāna ḥillan libanī is'rāīla illā mā ḥarrama is'rāīlu ʿalā nafsihi min qabli an tunazzala l-tawrātu qul fatū bil-tawrāti fa-it'lūhā in kuntum ṣādiqīna

Telugu ఆహార పదార్థాలన్నీ ఇస్రాయీల్ సంతతివారికి ధర్మసమ్మతమైనవిగానే ఉండేవి. కాని, తౌరాత్ అవతరణకు పూర్వం ఇస్రాయీల్ (యఅఖూబ్) తనకు తాను కొన్ని వస్తువులను నిషేధించుకున్నాడు. వారితో ఇట్లను: "మీరు సత్యవంతులే అయితే, తౌరాత్ ను తీసుకొని రండి మరియు దానిని చదవండి."

Verse 94

فَمَنِ ٱفْتَرَىٰ عَلَى ٱللَّهِ ٱلْكَذِبَ مِنۢ بَعْدِ ذَٰلِكَ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلظَّـٰلِمُونَ

Transliteration famani if'tarā ʿalā l-lahi l-kadhiba min baʿdi dhālika fa-ulāika humu l-ẓālimūna

Telugu కావున దీని తర్వాత కూడా ఎవడైనా అబద్ధాన్ని కల్పించి దానిని అల్లాహ్ కు ఆపాదిస్తే, అలాంటి వారు, వారే దుర్మార్గులు.

Verse 95

قُلْ صَدَقَ ٱللَّهُ ۗ فَٱتَّبِعُوا۟ مِلَّةَ إِبْرَٰهِيمَ حَنِيفًا وَمَا كَانَ مِنَ ٱلْمُشْرِكِينَ

Transliteration qul ṣadaqa l-lahu fa-ittabiʿū millata ib'rāhīma ḥanīfan wamā kāna mina l-mush'rikīna

Telugu ఇలా అను: "అల్లాహ్ సత్యం పలికాడు. కనుక మీరు ఏకదైవసిద్ధాంతం (సత్యధర్మం) అయిన ఇబ్రాహీమ్ ధర్మాన్నే అనుసరించండి. మరియు అతను అల్లాహ్ కు సాటి కల్పించేవాడు (ముష్రిక్) కాడు."

Verse 96

إِنَّ أَوَّلَ بَيْتٍ وُضِعَ لِلنَّاسِ لَلَّذِى بِبَكَّةَ مُبَارَكًا وَهُدًى لِّلْعَـٰلَمِينَ

Transliteration inna awwala baytin wuḍiʿa lilnnāsi lalladhī bibakkata mubārakan wahudan lil'ʿālamīna

Telugu నిశ్చయంగా, మానవజాతి కొరకు మొట్టమొదట నియమించబడిన (ఆరాధనా) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే, శుభాలతో నిండినది సమస్త లోకాల ప్రజలకు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించేది.

Verse 97

فِيهِ ءَايَـٰتٌۢ بَيِّنَـٰتٌ مَّقَامُ إِبْرَٰهِيمَ ۖ وَمَن دَخَلَهُۥ كَانَ ءَامِنًا ۗ وَلِلَّهِ عَلَى ٱلنَّاسِ حِجُّ ٱلْبَيْتِ مَنِ ٱسْتَطَاعَ إِلَيْهِ سَبِيلًا ۚ وَمَن كَفَرَ فَإِنَّ ٱللَّهَ غَنِىٌّ عَنِ ٱلْعَـٰلَمِينَ

Transliteration fīhi āyātun bayyinātun maqāmu ib'rāhīma waman dakhalahu kāna āminan walillahi ʿalā l-nāsi ḥijju l-bayti mani is'taṭāʿa ilayhi sabīlan waman kafara fa-inna l-laha ghaniyyun ʿani l-ʿālamīna

Telugu అందులో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ఇబ్రాహీమ్ నిలిచిన స్థలం ఉంది. మరియు దానిలో ప్రవేశించినవాడు అభయం (రక్షణ) పొందుతాడు. మరియు అక్కడికి పోవటానికి, శక్తిగలవారికి ఆ గృహయాత్ర (హిజ్జుల్ బైత్) అల్లాహ్ (ప్రసన్నత) కొరకు చేయటం, విధిగా చేయబడింది. ఎవరు దీనిని తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్ సమస్త లోకాల వారి అవసరం లేని స్వయం సమృద్ధుడు (అని తెలుసుకోవాలి).

Verse 98

قُلْ يَـٰٓأَهْلَ ٱلْكِتَـٰبِ لِمَ تَكْفُرُونَ بِـَٔايَـٰتِ ٱللَّهِ وَٱللَّهُ شَهِيدٌ عَلَىٰ مَا تَعْمَلُونَ

Transliteration qul yāahla l-kitābi lima takfurūna biāyāti l-lahi wal-lahu shahīdun ʿalā mā taʿmalūna

Telugu ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! మీరు అల్లాహ్ సందేశాలను ఎందుకు తిరస్కరిస్తున్నారు? మరియు మీరు చేసే కర్మలన్నింటికీ అల్లాహ్ సాక్షిగా ఉన్నాడు!"

Verse 99

قُلْ يَـٰٓأَهْلَ ٱلْكِتَـٰبِ لِمَ تَصُدُّونَ عَن سَبِيلِ ٱللَّهِ مَنْ ءَامَنَ تَبْغُونَهَا عِوَجًا وَأَنتُمْ شُهَدَآءُ ۗ وَمَا ٱللَّهُ بِغَـٰفِلٍ عَمَّا تَعْمَلُونَ

Transliteration qul yāahla l-kitābi lima taṣuddūna ʿan sabīli l-lahi man āmana tabghūnahā ʿiwajan wa-antum shuhadāu wamā l-lahu bighāfilin ʿammā taʿmalūna

Telugu ఇంకా ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! మీరు దానికి (సత్యమార్గానికి) సాక్ష్యులుగా ఉండి కూడా అది వక్రమార్గమని చూప దలచి, విశ్వసించిన వారిని అల్లాహ్ మార్గంపై నడవకుండా ఎందుకు ఆటంక పరుస్తున్నారు? మరియు అల్లాహ్ మీ కర్మల పట్ల నిర్లక్ష్యంగా లేడు."

Verse 100

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِن تُطِيعُوا۟ فَرِيقًا مِّنَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَـٰبَ يَرُدُّوكُم بَعْدَ إِيمَـٰنِكُمْ كَـٰفِرِينَ

Transliteration yāayyuhā alladhīna āmanū in tuṭīʿū farīqan mina alladhīna ūtū l-kitāba yaruddūkum baʿda īmānikum kāfirīna

Telugu ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు గ్రంథ ప్రజల (కొందరి) మాటలు విని వారిని అనుసరిస్తే! వారు మిమ్మల్ని, విశ్వసించిన తరువాత కూడా సత్యతిరస్కారులుగా మార్చి వేస్తారు.

Verse 101

وَكَيْفَ تَكْفُرُونَ وَأَنتُمْ تُتْلَىٰ عَلَيْكُمْ ءَايَـٰتُ ٱللَّهِ وَفِيكُمْ رَسُولُهُۥ ۗ وَمَن يَعْتَصِم بِٱللَّهِ فَقَدْ هُدِىَ إِلَىٰ صِرَٰطٍ مُّسْتَقِيمٍ

Transliteration wakayfa takfurūna wa-antum tut'lā ʿalaykum āyātu l-lahi wafīkum rasūluhu waman yaʿtaṣim bil-lahi faqad hudiya ilā ṣirāṭin mus'taqīmin

Telugu మరియు అల్లాహ్ సందేశాలు మీకు చదివి వినిపించబడుతూ ఉన్నప్పుడు మరియు ఆయన సందేశహరుడు మీలో ఉన్నప్పుడు; మీరు ఎలా సత్యతిరస్కారులు కాగలరు? మరియు మీలో ఎవడు స్థిరంగా అల్లాహ్ ను ఆశ్రయిస్తాడో, అతడు నిశ్చయంగా, ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం పొందినవాడే!

Verse 102

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ حَقَّ تُقَاتِهِۦ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ

Transliteration yāayyuhā alladhīna āmanū ittaqū l-laha ḥaqqa tuqātihi walā tamūtunna illā wa-antum mus'limūna

Telugu ఓ విశ్వసించిన ప్రజలారా! మీరు కర్తవ్యపాలనగా అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు మీరు అల్లాహ్ కు విధేయులుగా (ముస్లింలుగా) ఉన్న స్థితిలో తప్ప మరణించకండి!

Verse 103

وَٱعْتَصِمُوا۟ بِحَبْلِ ٱللَّهِ جَمِيعًا وَلَا تَفَرَّقُوا۟ ۚ وَٱذْكُرُوا۟ نِعْمَتَ ٱللَّهِ عَلَيْكُمْ إِذْ كُنتُمْ أَعْدَآءً فَأَلَّفَ بَيْنَ قُلُوبِكُمْ فَأَصْبَحْتُم بِنِعْمَتِهِۦٓ إِخْوَٰنًا وَكُنتُمْ عَلَىٰ شَفَا حُفْرَةٍ مِّنَ ٱلنَّارِ فَأَنقَذَكُم مِّنْهَا ۗ كَذَٰلِكَ يُبَيِّنُ ٱللَّهُ لَكُمْ ءَايَـٰتِهِۦ لَعَلَّكُمْ تَهْتَدُونَ

Transliteration wa-iʿ'taṣimū biḥabli l-lahi jamīʿan walā tafarraqū wa-udh'kurū niʿ'mata l-lahi ʿalaykum idh kuntum aʿdāan fa-allafa bayna qulūbikum fa-aṣbaḥtum biniʿ'matihi ikh'wānan wakuntum ʿalā shafā ḥuf'ratin mina l-nāri fa-anqadhakum min'hā kadhālika yubayyinu l-lahu lakum āyātihi laʿallakum tahtadūna

Telugu మీరందరూ కలసి అల్లాహ్ త్రాడు (ఖుర్ఆన్) ను గట్టిగా పట్టుకోండి. మరియు విభేదాలలో పడకండి. అల్లాహ్ మీ యెడల చూపిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి; మీరు ఒకరికొకరు శత్రువులుగా ఉండేవారు, ఆయన మీ హృదయాలను కలిపాడు. ఆయన అనుగ్రహం వల్లనే మీరు పరస్పరం సోదరులయ్యారు. మరియు మీరు అగ్నిగుండం ఒడ్డున నిలబడినప్పుడు ఆయన మిమ్మల్ని దాని నుండి రక్షించాడు. ఈ విధంగా అల్లాహ్ తన సూచనలను మీకు స్పష్టం చేస్తున్నాడు. బహుశా మీరు మార్గదర్శకత్వం పొందుతారని!

Verse 104

وَلْتَكُن مِّنكُمْ أُمَّةٌ يَدْعُونَ إِلَى ٱلْخَيْرِ وَيَأْمُرُونَ بِٱلْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ ٱلْمُنكَرِ ۚ وَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْمُفْلِحُونَ

Transliteration waltakun minkum ummatun yadʿūna ilā l-khayri wayamurūna bil-maʿrūfi wayanhawna ʿani l-munkari wa-ulāika humu l-muf'liḥūna

Telugu మీలో ఒక వర్గం, (ప్రజలను) మంచి మార్గం వైపునకు పిలిచేదిగా, ధర్మాన్ని (మంచిని) ఆదేశించేదిగా (బోధించేదిగా) మరియు అధర్మాన్ని (చెడును) నిషేధించేదిగా (నిరోధించేదిగా) ఉండాలి. మరియు అలాంటి వారు, వారే సాఫల్యం పొందేవారు.

Verse 105

وَلَا تَكُونُوا۟ كَٱلَّذِينَ تَفَرَّقُوا۟ وَٱخْتَلَفُوا۟ مِنۢ بَعْدِ مَا جَآءَهُمُ ٱلْبَيِّنَـٰتُ ۚ وَأُو۟لَـٰٓئِكَ لَهُمْ عَذَابٌ عَظِيمٌ

Transliteration walā takūnū ka-alladhīna tafarraqū wa-ikh'talafū min baʿdi mā jāahumu l-bayinātu wa-ulāika lahum ʿadhābun ʿaẓīmun

Telugu స్పష్టమైన ఉపదేశాలను పొందిన తరువాత కూడా ఎవరైతే, (వేర్వేరు తెగలుగా) చీలిపోయారో మరియు విభేదాలకు గురి అయ్యారో, వారి మాదిరిగా మీరూ కావద్దు. మరియు అలాంటి వారికి ఘోరశిక్ష ఉంటుంది.

Verse 106

يَوْمَ تَبْيَضُّ وُجُوهٌ وَتَسْوَدُّ وُجُوهٌ ۚ فَأَمَّا ٱلَّذِينَ ٱسْوَدَّتْ وُجُوهُهُمْ أَكَفَرْتُم بَعْدَ إِيمَـٰنِكُمْ فَذُوقُوا۟ ٱلْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ

Transliteration yawma tabyaḍḍu wujūhun wataswaddu wujūhun fa-ammā alladhīna is'waddat wujūhuhum akafartum baʿda īmānikum fadhūqū l-ʿadhāba bimā kuntum takfurūna

Telugu ఆ (తీర్పు) దినమున కొందరి ముఖాలు (సంతోషంతో) ప్రకాశిస్తూ ఉంటాయి. మరికొందరి ముఖాలు (దుఃఖంతో) నల్లబడి ఉంటాయి. ఇక ఎవరి ముఖాలు నల్లబడి ఉంటాయో వారితో: "మీరు విశ్వసించిన తరువాత సత్యతిరస్కారులు అయ్యారు కదా? కాబట్టి మీరు సత్యాన్ని తిరస్కరించినందుకు ఈ శిక్షను అనుభవించండి." (అని అనబడుతుంది).

Verse 107

وَأَمَّا ٱلَّذِينَ ٱبْيَضَّتْ وُجُوهُهُمْ فَفِى رَحْمَةِ ٱللَّهِ هُمْ فِيهَا خَـٰلِدُونَ

Transliteration wa-ammā alladhīna ib'yaḍḍat wujūhuhum fafī raḥmati l-lahi hum fīhā khālidūna

Telugu ఇక ఎవరి ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయో వారు అల్లాహ్ కారుణ్యంలో (స్వర్గంలో) ఉంటారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.

Verse 108

تِلْكَ ءَايَـٰتُ ٱللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِٱلْحَقِّ ۗ وَمَا ٱللَّهُ يُرِيدُ ظُلْمًا لِّلْعَـٰلَمِينَ

Transliteration til'ka āyātu l-lahi natlūhā ʿalayka bil-ḥaqi wamā l-lahu yurīdu ẓul'man lil'ʿālamīna

Telugu (ఓ ప్రవక్తా!) ఇవి అల్లాహ్ సూక్తులు (ఆయాత్) మేము వాటిని యథాతథంగా నీకు వినిపిస్తున్నాము. మరియు అల్లాహ్ సర్వలోకాల వారికి అన్యాయం చేయగోరడు.

Verse 109

وَلِلَّهِ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۚ وَإِلَى ٱللَّهِ تُرْجَعُ ٱلْأُمُورُ

Transliteration walillahi mā fī l-samāwāti wamā fī l-arḍi wa-ilā l-lahi tur'jaʿu l-umūru

Telugu మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. మరియు వ్యవహారాలన్నీ (తీర్పు కొరకు) అల్లాహ్ వైపునకే మరలింపబడతాయి.

Verse 110

كُنتُمْ خَيْرَ أُمَّةٍ أُخْرِجَتْ لِلنَّاسِ تَأْمُرُونَ بِٱلْمَعْرُوفِ وَتَنْهَوْنَ عَنِ ٱلْمُنكَرِ وَتُؤْمِنُونَ بِٱللَّهِ ۗ وَلَوْ ءَامَنَ أَهْلُ ٱلْكِتَـٰبِ لَكَانَ خَيْرًا لَّهُم ۚ مِّنْهُمُ ٱلْمُؤْمِنُونَ وَأَكْثَرُهُمُ ٱلْفَـٰسِقُونَ

Transliteration kuntum khayra ummatin ukh'rijat lilnnāsi tamurūna bil-maʿrūfi watanhawna ʿani l-munkari watu'minūna bil-lahi walaw āmana ahlu l-kitābi lakāna khayran lahum min'humu l-mu'minūna wa-aktharuhumu l-fāsiqūna

Telugu మీరే (విశ్వాసులే) మానవజాతి (హితం) కొరకు నిలబెట్టబడిన ఉత్తమ సమాజం వారు. మీరు ధర్మాన్ని ఆదేశించే (బోధించే) వారు మరియు అధర్మాన్ని నిషేధించే (నిరోధించే) వారు మరియు మీరు అల్లాహ్ యందు విశ్వాసం కలిగి ఉన్నవారు. మరియు ఒకవేళ గ్రంథప్రజలు విశ్వసిస్తే, వారికే మేలై ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు. కాని అత్యధికులు అవిధేయులే (ఫాసిఖూన్).

Verse 111

لَن يَضُرُّوكُمْ إِلَّآ أَذًى ۖ وَإِن يُقَـٰتِلُوكُمْ يُوَلُّوكُمُ ٱلْأَدْبَارَ ثُمَّ لَا يُنصَرُونَ

Transliteration lan yaḍurrūkum illā adhan wa-in yuqātilūkum yuwallūkumu l-adbāra thumma lā yunṣarūna

Telugu వారు మిమ్మల్ని కొంత వరకు బాధించటం తప్ప, మీకు ఏ విధమైన హాని కలిగించజాలరు. మరియు వారు మీతో యుద్ధం చేసినట్లయితే, మీకు వీపు చూపించి పారిపోతారు. తరువాత వారికెలాంటి సహాయం లభించదు.

Verse 112

ضُرِبَتْ عَلَيْهِمُ ٱلذِّلَّةُ أَيْنَ مَا ثُقِفُوٓا۟ إِلَّا بِحَبْلٍ مِّنَ ٱللَّهِ وَحَبْلٍ مِّنَ ٱلنَّاسِ وَبَآءُو بِغَضَبٍ مِّنَ ٱللَّهِ وَضُرِبَتْ عَلَيْهِمُ ٱلْمَسْكَنَةُ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ كَانُوا۟ يَكْفُرُونَ بِـَٔايَـٰتِ ٱللَّهِ وَيَقْتُلُونَ ٱلْأَنۢبِيَآءَ بِغَيْرِ حَقٍّ ۚ ذَٰلِكَ بِمَا عَصَوا۟ وَّكَانُوا۟ يَعْتَدُونَ

Transliteration ḍuribat ʿalayhimu l-dhilatu ayna mā thuqifū illā biḥablin mina l-lahi waḥablin mina l-nāsi wabāū bighaḍabin mina l-lahi waḍuribat ʿalayhimu l-maskanatu dhālika bi-annahum kānū yakfurūna biāyāti l-lahi wayaqtulūna l-anbiyāa bighayri ḥaqqin dhālika bimā ʿaṣaw wakānū yaʿtadūna

Telugu వారు ఎక్కడున్నా, అవమానానికే గురి చేయబడతారు, అల్లాహ్ శరణులోనో లేక మానవుల అభయంలోనో ఉంటేనే తప్ప; వారు అల్లాహ్ ఆగ్రహానికి గురి అయ్యారు మరియు వారు అధోగతికి చేరారు. ఇది వారు అల్లాహ్ సూచనలను తిరస్కరించినందుకు మరియు అన్యాయంగా ప్రవక్తలను చంపి నందుకు. ఇది వారి ఆజ్ఞోల్లంఘన మరియు హద్దులు మీరి ప్రవర్తించిన దాని పర్యవసానం.

Verse 113

۞ لَيْسُوا۟ سَوَآءً ۗ مِّنْ أَهْلِ ٱلْكِتَـٰبِ أُمَّةٌ قَآئِمَةٌ يَتْلُونَ ءَايَـٰتِ ٱللَّهِ ءَانَآءَ ٱلَّيْلِ وَهُمْ يَسْجُدُونَ

Transliteration laysū sawāan min ahli l-kitābi ummatun qāimatun yatlūna āyāti l-lahi ānāa al-layli wahum yasjudūna

Telugu వారందరూ ఒకే రకమైన వారు కారు. గ్రంథ ప్రజలలో కొందరు సరైన మార్గంలో ఉన్న వారున్నారు; వారు రాత్రివేళలందు అల్లాహ్ సూక్తులను (ఆయాత్ లను) పఠిస్తూ ఉంటారు మరియు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారు.

Verse 114

يُؤْمِنُونَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ وَيَأْمُرُونَ بِٱلْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ ٱلْمُنكَرِ وَيُسَـٰرِعُونَ فِى ٱلْخَيْرَٰتِ وَأُو۟لَـٰٓئِكَ مِنَ ٱلصَّـٰلِحِينَ

Transliteration yu'minūna bil-lahi wal-yawmi l-ākhiri wayamurūna bil-maʿrūfi wayanhawna ʿani l-munkari wayusāriʿūna fī l-khayrāti wa-ulāika mina l-ṣāliḥīna

Telugu వారు అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తారు మరియు ధర్మాన్ని ఆదేశిస్తారు (బోధిస్తారు) మరియు అధర్మాన్ని నిషేధిస్తారు (నిరోధిస్తారు) మరియు మంచి పనులు చేయటంలో పోటీ పడతారు మరియు ఇలాంటి వారే సత్పురుషులలోని వారు.

Verse 115

وَمَا يَفْعَلُوا۟ مِنْ خَيْرٍ فَلَن يُكْفَرُوهُ ۗ وَٱللَّهُ عَلِيمٌۢ بِٱلْمُتَّقِينَ

Transliteration wamā yafʿalū min khayrin falan yuk'farūhu wal-lahu ʿalīmun bil-mutaqīna

Telugu మరియు వారు ఏ మంచిపని చేసినా అది వృథా చేయబడదు. మరియు దైవభీతి గలవారెవరో అల్లాహ్ కు బాగా తెలుసు.

Verse 116

إِنَّ ٱلَّذِينَ كَفَرُوا۟ لَن تُغْنِىَ عَنْهُمْ أَمْوَٰلُهُمْ وَلَآ أَوْلَـٰدُهُم مِّنَ ٱللَّهِ شَيْـًٔا ۖ وَأُو۟لَـٰٓئِكَ أَصْحَـٰبُ ٱلنَّارِ ۚ هُمْ فِيهَا خَـٰلِدُونَ

Transliteration inna alladhīna kafarū lan tugh'niya ʿanhum amwāluhum walā awlāduhum mina l-lahi shayan wa-ulāika aṣḥābu l-nāri hum fīhā khālidūna

Telugu నిశ్చయంగా, సత్యతిరస్కారానికి పాల్పబడిన వారికి, వారి సంపద గానీ, వారి సంతానం గానీ, అల్లాహ్ ముందు ఏమీ పనికి రావు. మరియు అలాంటివారు నరకాగ్ని వాసులే. అందు వారు శాశ్వతంగా ఉంటారు.

Verse 117

مَثَلُ مَا يُنفِقُونَ فِى هَـٰذِهِ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا كَمَثَلِ رِيحٍ فِيهَا صِرٌّ أَصَابَتْ حَرْثَ قَوْمٍ ظَلَمُوٓا۟ أَنفُسَهُمْ فَأَهْلَكَتْهُ ۚ وَمَا ظَلَمَهُمُ ٱللَّهُ وَلَـٰكِنْ أَنفُسَهُمْ يَظْلِمُونَ

Transliteration mathalu mā yunfiqūna fī hādhihi l-ḥayati l-dun'yā kamathali rīḥin fīhā ṣirrun aṣābat ḥartha qawmin ẓalamū anfusahum fa-ahlakathu wamā ẓalamahumu l-lahu walākin anfusahum yaẓlimūna

Telugu వారు ఈ ఇహలోక జీవితంలో చేస్తున్న ధన వ్యయాన్ని, తమకు తాము అన్యాయం చేసుకున్నవారి పొలాలపై వీచి వాటిని సమూలంగా నాశనం చేసే, మంచు గాలితో పోల్చవచ్చు. మరియు అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు. కానీ వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.

Verse 118

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَتَّخِذُوا۟ بِطَانَةً مِّن دُونِكُمْ لَا يَأْلُونَكُمْ خَبَالًا وَدُّوا۟ مَا عَنِتُّمْ قَدْ بَدَتِ ٱلْبَغْضَآءُ مِنْ أَفْوَٰهِهِمْ وَمَا تُخْفِى صُدُورُهُمْ أَكْبَرُ ۚ قَدْ بَيَّنَّا لَكُمُ ٱلْـَٔايَـٰتِ ۖ إِن كُنتُمْ تَعْقِلُونَ

Transliteration yāayyuhā alladhīna āmanū lā tattakhidhū biṭānatan min dūnikum lā yalūnakum khabālan waddū mā ʿanittum qad badati l-baghḍāu min afwāhihim wamā tukh'fī ṣudūruhum akbaru qad bayyannā lakumu l-āyāti in kuntum taʿqilūna

Telugu ఓ విశ్వాసులారా! మీరు మీ వారిని (విశ్వాసులను) తప్ప ఇతరులను మీ సన్నిహిత స్నేహితులుగా చేసుకోకండి. వారు మీకు హాని కలిగించే ఏ అవకాశాన్నైనా ఉపయోగించు కోవటానికి వెనుకాడరు. వారు మిమ్మల్ని ఇబ్బందిలో చూడగోరుతున్నారు. మరియు వారి ఈర్ష్య వారి నోళ్ళ నుండి బయటపడుతున్నది. కాని వారి హృదయాలలో దాచుకున్నది దాని కంటే తీవ్రమైనది. వాస్తవానికి మేము ఈ సూచనలను మీకు స్పష్టం చేశాము. మీరు అర్థం చేసుకోగలిగితే (ఎంత బాగుండేది)!

Verse 119

هَـٰٓأَنتُمْ أُو۟لَآءِ تُحِبُّونَهُمْ وَلَا يُحِبُّونَكُمْ وَتُؤْمِنُونَ بِٱلْكِتَـٰبِ كُلِّهِۦ وَإِذَا لَقُوكُمْ قَالُوٓا۟ ءَامَنَّا وَإِذَا خَلَوْا۟ عَضُّوا۟ عَلَيْكُمُ ٱلْأَنَامِلَ مِنَ ٱلْغَيْظِ ۚ قُلْ مُوتُوا۟ بِغَيْظِكُمْ ۗ إِنَّ ٱللَّهَ عَلِيمٌۢ بِذَاتِ ٱلصُّدُورِ

Transliteration hāantum ulāi tuḥibbūnahum walā yuḥibbūnakum watu'minūna bil-kitābi kullihi wa-idhā laqūkum qālū āmannā wa-idhā khalaw ʿaḍḍū ʿalaykumu l-anāmila mina l-ghayẓi qul mūtū bighayẓikum inna l-laha ʿalīmun bidhāti l-ṣudūri

Telugu అవును! మీరైతే వారిని ప్రేమిస్తున్నారు. కాని వారు మిమ్మల్ని ప్రేమించటం లేదు. మరియు మీరు దివ్యగ్రంథాలన్నింటినీ విశ్వసిస్తున్నారు. వారు మీతో కలసినపుడు: "మేము విశ్వసించాము." అని అంటారు. కాని వేరుగా ఉన్నప్పుడు, మీ ఎడల ఉన్న క్రోదావేశం వల్ల తమ వ్రేళ్ళను కొరుక్కుంటారు. వారితో: "మీ క్రోధావేశంలో మీరే మాడి చావండి. నిశ్చయంగా, హృదయాలలో దాగి ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు." అని అను.

Verse 120

إِن تَمْسَسْكُمْ حَسَنَةٌ تَسُؤْهُمْ وَإِن تُصِبْكُمْ سَيِّئَةٌ يَفْرَحُوا۟ بِهَا ۖ وَإِن تَصْبِرُوا۟ وَتَتَّقُوا۟ لَا يَضُرُّكُمْ كَيْدُهُمْ شَيْـًٔا ۗ إِنَّ ٱللَّهَ بِمَا يَعْمَلُونَ مُحِيطٌ

Transliteration in tamsaskum ḥasanatun tasu'hum wa-in tuṣib'kum sayyi-atun yafraḥū bihā wa-in taṣbirū watattaqū lā yaḍurrukum kayduhum shayan inna l-laha bimā yaʿmalūna muḥīṭun

Telugu మీకేదైనా మేలు కలిగితే వారికది దుఃఖం కలిగిస్తుంది మరియు మీకేదైనా కీడు కలిగితే వారికది సంతోషం కలిగిస్తుంది. మరియు మీరు సహనం వహించి దైవభీతి కలిగి ఉంటే, వారి కుట్ర మీకెలాంటి నష్టం కలిగించ జాలదు. నిశ్చయంగా, అల్లాహ్ వారు చేసే దానినంతా పరివేష్టించి ఉన్నాడు.

Verse 121

وَإِذْ غَدَوْتَ مِنْ أَهْلِكَ تُبَوِّئُ ٱلْمُؤْمِنِينَ مَقَـٰعِدَ لِلْقِتَالِ ۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٌ

Transliteration wa-idh ghadawta min ahlika tubawwi-u l-mu'minīna maqāʿida lil'qitāli wal-lahu samīʿun ʿalīmun

Telugu మరియు (ఓ ప్రవక్తా! ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకో) నీవు వేకుజామున నీ ఇంటి నుండి బయలుదేరి (ఉహుద్ క్షేత్రంలో) విశ్వాసులను వారి వారి యుద్ధ స్థానాలలో నియమించటానికి వెళ్ళావు. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

Verse 122

إِذْ هَمَّت طَّآئِفَتَانِ مِنكُمْ أَن تَفْشَلَا وَٱللَّهُ وَلِيُّهُمَا ۗ وَعَلَى ٱللَّهِ فَلْيَتَوَكَّلِ ٱلْمُؤْمِنُونَ

Transliteration idh hammat ṭāifatāni minkum an tafshalā wal-lahu waliyyuhumā waʿalā l-lahi falyatawakkali l-mu'minūna

Telugu అప్పుడు మీలోని రెండు వర్గాల వారు పిరికితనం చూపబోయారు; మరియు అల్లాహ్ వారికి సంక్షకుడుగా ఉన్నాడు మరియు విశ్వసించిన వారు అల్లాహ్ యందే నమ్మకం ఉంచుకోవాలి.

Verse 123

وَلَقَدْ نَصَرَكُمُ ٱللَّهُ بِبَدْرٍ وَأَنتُمْ أَذِلَّةٌ ۖ فَٱتَّقُوا۟ ٱللَّهَ لَعَلَّكُمْ تَشْكُرُونَ

Transliteration walaqad naṣarakumu l-lahu bibadrin wa-antum adhillatun fa-ittaqū l-laha laʿallakum tashkurūna

Telugu బద్ర్ (యుద్ధం) నందు మీరు బలహీనులుగా ఉన్నప్పుడు అల్లాహ్ మీకు సహాయం (మిమ్మల్ని విజేతలుగా) చేశాడు. కాబట్టి మీరు కృతజ్ఞతాపరులై అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి!

Verse 124

إِذْ تَقُولُ لِلْمُؤْمِنِينَ أَلَن يَكْفِيَكُمْ أَن يُمِدَّكُمْ رَبُّكُم بِثَلَـٰثَةِ ءَالَـٰفٍ مِّنَ ٱلْمَلَـٰٓئِكَةِ مُنزَلِينَ

Transliteration idh taqūlu lil'mu'minīna alan yakfiyakum an yumiddakum rabbukum bithalāthati ālāfin mina l-malāikati munzalīna

Telugu (ఓ ప్రవక్తా!) నీవు విశ్వాసులతో : "ఏమీ? మీ ప్రభువు, ఆకాశం నుండి మూడు వేల దేవదూతలను దింపి మీకు సహాయం చేస్తున్నది చాలదా?" అని అడిగిన సందర్భాన్ని (జ్ఞాపకం చేసుకోండి!)

Verse 125

بَلَىٰٓ ۚ إِن تَصْبِرُوا۟ وَتَتَّقُوا۟ وَيَأْتُوكُم مِّن فَوْرِهِمْ هَـٰذَا يُمْدِدْكُمْ رَبُّكُم بِخَمْسَةِ ءَالَـٰفٍ مِّنَ ٱلْمَلَـٰٓئِكَةِ مُسَوِّمِينَ

Transliteration balā in taṣbirū watattaqū wayatūkum min fawrihim hādhā yum'did'kum rabbukum bikhamsati ālāfin mina l-malāikati musawwimīna

Telugu అవును! ఒకవేళ మీరు సహనం వహించి దైవభీతి కలిగి వుంటే, శత్రువు వచ్చి ఆకస్మాత్తుగా మీపై పడినా, మీ ప్రభువు ఐదువేల ప్రత్యేక చిహ్నాలు గల దేవదూతలను పంపి మీకు సహాయం చేయవచ్చు!

Verse 126

وَمَا جَعَلَهُ ٱللَّهُ إِلَّا بُشْرَىٰ لَكُمْ وَلِتَطْمَئِنَّ قُلُوبُكُم بِهِۦ ۗ وَمَا ٱلنَّصْرُ إِلَّا مِنْ عِندِ ٱللَّهِ ٱلْعَزِيزِ ٱلْحَكِيمِ

Transliteration wamā jaʿalahu l-lahu illā bush'rā lakum walitaṭma-inna qulūbukum bihi wamā l-naṣru illā min ʿindi l-lahi l-ʿazīzi l-ḥakīmi

Telugu అల్లాహ్ మీకు ఈ విషయాన్ని తెలిపింది మీకు శుభవార్త ఇవ్వటానికి మరియు మీ హృదయాలకు తృప్తి కలుగ జేయటానికి మాత్రమే. మరియు సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడైన అల్లాహ్ తప్ప, ఇతరుల నుండి సహాయం (విజయం) రాజాలదు కదా!

Verse 127

لِيَقْطَعَ طَرَفًا مِّنَ ٱلَّذِينَ كَفَرُوٓا۟ أَوْ يَكْبِتَهُمْ فَيَنقَلِبُوا۟ خَآئِبِينَ

Transliteration liyaqṭaʿa ṭarafan mina alladhīna kafarū aw yakbitahum fayanqalibū khāibīna

Telugu ఆయన ఇదంతా సత్యతిరస్కారంపై నడిచేవారిని కొందరిని నశింపజేయటానికి, లేదా వారు ఘోర పరాజయం పొంది ఆశాభంగంతో వెనుదిరిగి పోవటానికి (చేశాడు).

Verse 128

لَيْسَ لَكَ مِنَ ٱلْأَمْرِ شَىْءٌ أَوْ يَتُوبَ عَلَيْهِمْ أَوْ يُعَذِّبَهُمْ فَإِنَّهُمْ ظَـٰلِمُونَ

Transliteration laysa laka mina l-amri shayon aw yatūba ʿalayhim aw yuʿadhibahum fa-innahum ẓālimūna

Telugu (ఓ ప్రవక్తా!) ఈ విషయమునందు నీ కెలాంటి అధికారం లేదు. ఆయన (అల్లాహ్) వారిని క్షమించవచ్చు, లేదా వారిని శిక్షించవచ్చు. ఎందుకంటే నిశ్చయంగా, వారు దుర్మార్గులు.

Verse 129

وَلِلَّهِ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۚ يَغْفِرُ لِمَن يَشَآءُ وَيُعَذِّبُ مَن يَشَآءُ ۚ وَٱللَّهُ غَفُورٌ رَّحِيمٌ

Transliteration walillahi mā fī l-samāwāti wamā fī l-arḍi yaghfiru liman yashāu wayuʿadhibu man yashāu wal-lahu ghafūrun raḥīmun

Telugu మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

Verse 130

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَأْكُلُوا۟ ٱلرِّبَوٰٓا۟ أَضْعَـٰفًا مُّضَـٰعَفَةً ۖ وَٱتَّقُوا۟ ٱللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ

Transliteration yāayyuhā alladhīna āmanū lā takulū l-riba aḍʿāfan muḍāʿafatan wa-ittaqū l-laha laʿallakum tuf'liḥūna

Telugu ఓ విశ్వాసులారా! ఇబ్బడిముబ్బడిగా పెరిగే ఈ వడ్డీని తినకండి. మరియు మీరు సాఫల్యం పొందటానికి అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి.

Verse 131

وَٱتَّقُوا۟ ٱلنَّارَ ٱلَّتِىٓ أُعِدَّتْ لِلْكَـٰفِرِينَ

Transliteration wa-ittaqū l-nāra allatī uʿiddat lil'kāfirīna

Telugu మరియు సత్యతిరస్కారుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భీతిపరులై ఉండండి.

Verse 132

وَأَطِيعُوا۟ ٱللَّهَ وَٱلرَّسُولَ لَعَلَّكُمْ تُرْحَمُونَ

Transliteration wa-aṭīʿū l-laha wal-rasūla laʿallakum tur'ḥamūna

Telugu మరియు మీరు కరుణింపబడటానికి అల్లాహ్ కు మరియు సందేశహరునికి విధేయులై ఉండండి.

Verse 133

۞ وَسَارِعُوٓا۟ إِلَىٰ مَغْفِرَةٍ مِّن رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا ٱلسَّمَـٰوَٰتُ وَٱلْأَرْضُ أُعِدَّتْ لِلْمُتَّقِينَ

Transliteration wasāriʿū ilā maghfiratin min rabbikum wajannatin ʿarḍuhā l-samāwātu wal-arḍu uʿiddat lil'muttaqīna

Telugu మరియు మీ ప్రభువు క్షమాభిక్ష కొరకు మరియు స్వర్గవాసం కొరకు ఒకరితో నొకరు పోటీ పడండి; అది భూమ్యాకాశాలంత విశాలమైనది; అది దైవభీతి గలవారికై సిద్ధ పరచపడింది.

Verse 134

ٱلَّذِينَ يُنفِقُونَ فِى ٱلسَّرَّآءِ وَٱلضَّرَّآءِ وَٱلْكَـٰظِمِينَ ٱلْغَيْظَ وَٱلْعَافِينَ عَنِ ٱلنَّاسِ ۗ وَٱللَّهُ يُحِبُّ ٱلْمُحْسِنِينَ

Transliteration alladhīna yunfiqūna fī l-sarāi wal-ḍarāi wal-kāẓimīna l-ghayẓa wal-ʿāfīna ʿani l-nāsi wal-lahu yuḥibbu l-muḥ'sinīna

Telugu (వారి కొరకు) ఎవరైతే కలిమిలోనూ మరియు లేమిలోనూ (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తారో మరియు తమ కోపాన్ని నిగ్రహించుకుంటారో మరియు ప్రజలను క్షమిస్తారో! అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు.

Verse 135

وَٱلَّذِينَ إِذَا فَعَلُوا۟ فَـٰحِشَةً أَوْ ظَلَمُوٓا۟ أَنفُسَهُمْ ذَكَرُوا۟ ٱللَّهَ فَٱسْتَغْفَرُوا۟ لِذُنُوبِهِمْ وَمَن يَغْفِرُ ٱلذُّنُوبَ إِلَّا ٱللَّهُ وَلَمْ يُصِرُّوا۟ عَلَىٰ مَا فَعَلُوا۟ وَهُمْ يَعْلَمُونَ

Transliteration wa-alladhīna idhā faʿalū fāḥishatan aw ẓalamū anfusahum dhakarū l-laha fa-is'taghfarū lidhunūbihim waman yaghfiru l-dhunūba illā l-lahu walam yuṣirrū ʿalā mā faʿalū wahum yaʿlamūna

Telugu మరియు వారు, ఎవరైతే, అశ్లీల పనులు చేసినా, లేదా తమకు తాము అన్యాయం చేసుకున్నా, అల్లాహ్ ను స్మరించి తమ పాపాలకు క్షమాపణ వేడుకుంటారో! మరియు అల్లాహ్ తప్ప, పాపాలను క్షమించ గలవారు ఇతరులు ఎవరున్నారు? మరియు వారు తాము చేసిన (తప్పులను), బుద్ధిపూర్వకంగా మూర్ఖపు పట్టుతో మళ్ళీ చేయరు!

Verse 136

أُو۟لَـٰٓئِكَ جَزَآؤُهُم مَّغْفِرَةٌ مِّن رَّبِّهِمْ وَجَنَّـٰتٌ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ خَـٰلِدِينَ فِيهَا ۚ وَنِعْمَ أَجْرُ ٱلْعَـٰمِلِينَ

Transliteration ulāika jazāuhum maghfiratun min rabbihim wajannātun tajrī min taḥtihā l-anhāru khālidīna fīhā waniʿ'ma ajru l-ʿāmilīna

Telugu ఇలాంటి వారి ప్రతిఫలం, వారి ప్రభువు నుండి క్షమాభిక్ష మరియు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలు. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సత్కార్యాలు చేసేవారికి ఎంత శ్రేష్ఠమైన ప్రతిఫలం ఉంది!

Verse 137

قَدْ خَلَتْ مِن قَبْلِكُمْ سُنَنٌ فَسِيرُوا۟ فِى ٱلْأَرْضِ فَٱنظُرُوا۟ كَيْفَ كَانَ عَـٰقِبَةُ ٱلْمُكَذِّبِينَ

Transliteration qad khalat min qablikum sunanun fasīrū fī l-arḍi fa-unẓurū kayfa kāna ʿāqibatu l-mukadhibīna

Telugu మీకు పూర్వం ఇలాంటి ఎన్నో సంప్రదాయాలు (తరాలు) గడిచి పోయాయి. సత్యాన్ని తిరస్కరించిన వారి గతి ఏమయిందో మీరు భూమిలో సంచారం చేసి చూడండి.

Verse 138

هَـٰذَا بَيَانٌ لِّلنَّاسِ وَهُدًى وَمَوْعِظَةٌ لِّلْمُتَّقِينَ

Transliteration hādhā bayānun lilnnāsi wahudan wamawʿiẓatun lil'muttaqīna

Telugu ఇది (ఈ ఖుర్ఆన్) ప్రజల కొరకు ఒక స్పష్టమైన వ్యాఖ్యానం మరియు దైవభీతి గల వారికి మార్గదర్శకత్వం మరియు హితోపదేశం.

Verse 139

وَلَا تَهِنُوا۟ وَلَا تَحْزَنُوا۟ وَأَنتُمُ ٱلْأَعْلَوْنَ إِن كُنتُم مُّؤْمِنِينَ

Transliteration walā tahinū walā taḥzanū wa-antumu l-aʿlawna in kuntum mu'minīna

Telugu కాబట్టి మీరు బలహీనత కనబరచకండి మరియు దుఃఖపడకండి మరియు మీరు విశ్వాసులే అయితే, మీరే తప్పక ప్రాబల్యం పొందుతారు.

Verse 140

إِن يَمْسَسْكُمْ قَرْحٌ فَقَدْ مَسَّ ٱلْقَوْمَ قَرْحٌ مِّثْلُهُۥ ۚ وَتِلْكَ ٱلْأَيَّامُ نُدَاوِلُهَا بَيْنَ ٱلنَّاسِ وَلِيَعْلَمَ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَيَتَّخِذَ مِنكُمْ شُهَدَآءَ ۗ وَٱللَّهُ لَا يُحِبُّ ٱلظَّـٰلِمِينَ

Transliteration in yamsaskum qarḥun faqad massa l-qawma qarḥun mith'luhu watil'ka l-ayāmu nudāwiluhā bayna l-nāsi waliyaʿlama l-lahu alladhīna āmanū wayattakhidha minkum shuhadāa wal-lahu lā yuḥibbu l-ẓālimīna

Telugu ఒకవేళ ఇప్పుడు మీరు గాయపడితే, వాస్తవానికి ఆ జాతివారు (మీ విరోధులు) కూడా ఇదే విధంగా గాయపడ్డారు. మరియు మేము ఇలాంటి దినాలను ప్రజల మధ్య త్రిప్పుతూ ఉంటాము. మరియు అల్లాహ్, మీలో నిజమైన విశ్వాసులెవ్వరో చూడటానికి మరియు (సత్యస్థాపనకు) తమ ప్రాణాలను త్యాగం చేయగల వారిని ఎన్నుకోవటానికి ఇలా చేస్తూ ఉంటాడు. మరియు అల్లాహ్ దుర్మార్గులను ప్రేమించడు.

Verse 141

وَلِيُمَحِّصَ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَيَمْحَقَ ٱلْكَـٰفِرِينَ

Transliteration waliyumaḥḥiṣa l-lahu alladhīna āmanū wayamḥaqa l-kāfirīna

Telugu మరియు అల్లాహ్ విశ్వాసులను పరిశుద్ధులుగా చేయటానికీ మరియు సత్యతిరస్కారులను అణచివేయటానికీ (ఈ విధంగా చేస్తాడు)

Verse 142

أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا۟ ٱلْجَنَّةَ وَلَمَّا يَعْلَمِ ٱللَّهُ ٱلَّذِينَ جَـٰهَدُوا۟ مِنكُمْ وَيَعْلَمَ ٱلصَّـٰبِرِينَ

Transliteration am ḥasib'tum an tadkhulū l-janata walammā yaʿlami l-lahu alladhīna jāhadū minkum wayaʿlama l-ṣābirīna

Telugu ఏమీ? మీలో ఆయన మార్గంలో ప్రాణాలు తెగించి పోరాడేవారు (ధర్మయోధులు) ఎవరో, అల్లాహ్ చూడక ముందే మరియు సహనం చూపేవారు ఎవరో చూడకముందే, మీరు స్వర్గంలో ప్రవేశించ గలరని భావిస్తున్నారా?

Verse 143

وَلَقَدْ كُنتُمْ تَمَنَّوْنَ ٱلْمَوْتَ مِن قَبْلِ أَن تَلْقَوْهُ فَقَدْ رَأَيْتُمُوهُ وَأَنتُمْ تَنظُرُونَ

Transliteration walaqad kuntum tamannawna l-mawta min qabli an talqawhu faqad ra-aytumūhu wa-antum tanẓurūna

Telugu మరియు వాస్తవానికి మీరు (అల్లాహ్ మార్గంలో మరణించాలని కోరుచుంటిరి! అది, మీరు దానిని ప్రత్యక్షంగా చూడక ముందటి విషయం; కాని, మీరు దానిని ఎదురు చూస్తుండగానే, వాస్తవానికి ఇప్పుడు అది మీ ముందుకు వచ్చేసింది.

Verse 144

وَمَا مُحَمَّدٌ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِن قَبْلِهِ ٱلرُّسُلُ ۚ أَفَإِي۟ن مَّاتَ أَوْ قُتِلَ ٱنقَلَبْتُمْ عَلَىٰٓ أَعْقَـٰبِكُمْ ۚ وَمَن يَنقَلِبْ عَلَىٰ عَقِبَيْهِ فَلَن يَضُرَّ ٱللَّهَ شَيْـًٔا ۗ وَسَيَجْزِى ٱللَّهُ ٱلشَّـٰكِرِينَ

Transliteration wamā muḥammadun illā rasūlun qad khalat min qablihi l-rusulu afa-in māta aw qutila inqalabtum ʿalā aʿqābikum waman yanqalib ʿalā ʿaqibayhi falan yaḍurra l-laha shayan wasayajzī l-lahu l-shākirīna

Telugu మరియు ముహమ్మద్ కేవలం ఒక సందేశహరుడు మాత్రమే! వాస్తవానికి అతనికి పూర్వం అనేక సందేశహరులు గడిచి పోయారు. ఏమీ? ఒకవేళ అతను మరణిస్తే, లేక హత్యచేయబడితే, మీరు వెనుకంజ వేసి మరలిపోతారా? మరియు వెనుకంజ వేసి మరలిపోయేవాడు అల్లాహ్ కు ఏ మాత్రం నష్టం కలిగించలేడు. మరియు కృతజ్ఞతాపరులైన వారికి అల్లాహ్ తగిన ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.

Verse 145

وَمَا كَانَ لِنَفْسٍ أَن تَمُوتَ إِلَّا بِإِذْنِ ٱللَّهِ كِتَـٰبًا مُّؤَجَّلًا ۗ وَمَن يُرِدْ ثَوَابَ ٱلدُّنْيَا نُؤْتِهِۦ مِنْهَا وَمَن يُرِدْ ثَوَابَ ٱلْـَٔاخِرَةِ نُؤْتِهِۦ مِنْهَا ۚ وَسَنَجْزِى ٱلشَّـٰكِرِينَ

Transliteration wamā kāna linafsin an tamūta illā bi-idh'ni l-lahi kitāban mu-ajjalan waman yurid thawāba l-dun'yā nu'tihi min'hā waman yurid thawāba l-ākhirati nu'tihi min'hā wasanajzī l-shākirīna

Telugu అల్లాహ్ అనుమతి లేనిదే, ఏ ప్రాణి కూడా మరణించజాలదు, దానికి ఒక నియమిత కాలం వ్రాయబడి ఉంది. మరియు ఎవడైతే ఈ ప్రపంచ సుఖాన్ని కోరుకుంటాడో, మేము అతనికది నొసంగుతాము మరియు ఎవడు పరలోక సుఖాన్ని కోరుకుంటాడో అతనికది నొసంగుతాము. మరియు మేము కృతజ్ఞులైన వారికి తగిన ప్రతిఫలాన్ని ప్రసాదించగలము.

Verse 146

وَكَأَيِّن مِّن نَّبِىٍّ قَـٰتَلَ مَعَهُۥ رِبِّيُّونَ كَثِيرٌ فَمَا وَهَنُوا۟ لِمَآ أَصَابَهُمْ فِى سَبِيلِ ٱللَّهِ وَمَا ضَعُفُوا۟ وَمَا ٱسْتَكَانُوا۟ ۗ وَٱللَّهُ يُحِبُّ ٱلصَّـٰبِرِينَ

Transliteration waka-ayyin min nabiyyin qātala maʿahu ribbiyyūna kathīrun famā wahanū limā aṣābahum fī sabīli l-lahi wamā ḍaʿufū wamā is'takānū wal-lahu yuḥibbu l-ṣābirīna

Telugu మరియు ఎందరో ప్రవక్తలు మరియు వారితో కలిసి ఎంతోమంది ధర్మవేత్తలు / దైవభక్తులు (రిబ్బీయ్యూన్) ధర్మ యుద్ధాలు చేశారు, అల్లాహ్ మార్గంలో ఎదురైన కష్టాలకు వారు ధైర్యం విడువలేదు మరియు బలహీనత కనబరచలేదు మరియు వారికి (శత్రువులకు) లోబడనూ లేదు. మరియు అల్లాహ్ ఆపదలలో సహనం వహించే వారిని ప్రేమిస్తాడు.

Verse 147

وَمَا كَانَ قَوْلَهُمْ إِلَّآ أَن قَالُوا۟ رَبَّنَا ٱغْفِرْ لَنَا ذُنُوبَنَا وَإِسْرَافَنَا فِىٓ أَمْرِنَا وَثَبِّتْ أَقْدَامَنَا وَٱنصُرْنَا عَلَى ٱلْقَوْمِ ٱلْكَـٰفِرِينَ

Transliteration wamā kāna qawlahum illā an qālū rabbanā igh'fir lanā dhunūbanā wa-is'rāfanā fī amrinā wathabbit aqdāmanā wa-unṣur'nā ʿalā l-qawmi l-kāfirīna

Telugu మరియు వారి ప్రార్థన కేవలం: "ఓ మా ప్రభూ! మా పాపాలను, మా వ్యవహారాలలో మేము మితిమీరి పోయిన వాటిని క్షమించు మరియు మా పాదాలకు స్థైర్యాన్ని ప్రసాదించు మరియు సత్యతిరస్కారులకు ప్రతికూలంగా మాకు విజయాన్ని ప్రసాదించు." అని పలకటం మాత్రమే!

Verse 148

فَـَٔاتَىٰهُمُ ٱللَّهُ ثَوَابَ ٱلدُّنْيَا وَحُسْنَ ثَوَابِ ٱلْـَٔاخِرَةِ ۗ وَٱللَّهُ يُحِبُّ ٱلْمُحْسِنِينَ

Transliteration faātāhumu l-lahu thawāba l-dun'yā waḥus'na thawābi l-ākhirati wal-lahu yuḥibbu l-muḥ'sinīna

Telugu కావున అల్లాహ్ వారికి ఇహలోకంలో తగిన ఫలితాన్ని మరియు పరలోకంలో ఉత్తమ ప్రతిఫలాన్ని ప్రసాదించాడు. మరియు అల్లాహ్ సజ్జనులను ప్రేమిస్తాడు.

Verse 149

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِن تُطِيعُوا۟ ٱلَّذِينَ كَفَرُوا۟ يَرُدُّوكُمْ عَلَىٰٓ أَعْقَـٰبِكُمْ فَتَنقَلِبُوا۟ خَـٰسِرِينَ

Transliteration yāayyuhā alladhīna āmanū in tuṭīʿū alladhīna kafarū yaruddūkum ʿalā aʿqābikum fatanqalibū khāsirīna

Telugu ఓ విశ్వాసులారా! మీరు సత్యతిరస్కారుల సలహాలను పాటిస్తే, వారు మిమ్మల్ని వెనుకకు (అవిశ్వాసం వైపునకు) మరలిస్తారు. అప్పుడు మీరే నష్టపడిన వారవుతారు.

Verse 150

بَلِ ٱللَّهُ مَوْلَىٰكُمْ ۖ وَهُوَ خَيْرُ ٱلنَّـٰصِرِينَ

Transliteration bali l-lahu mawlākum wahuwa khayru l-nāṣirīna

Telugu వాస్తవానికి! అల్లాహ్ యే మీ సంరక్షకుడు. మరియు ఆయనే అత్యుత్తమ సహాయకుడు.

Verse 151

سَنُلْقِى فِى قُلُوبِ ٱلَّذِينَ كَفَرُوا۟ ٱلرُّعْبَ بِمَآ أَشْرَكُوا۟ بِٱللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِۦ سُلْطَـٰنًا ۖ وَمَأْوَىٰهُمُ ٱلنَّارُ ۚ وَبِئْسَ مَثْوَى ٱلظَّـٰلِمِينَ

Transliteration sanul'qī fī qulūbi alladhīna kafarū l-ruʿ'ba bimā ashrakū bil-lahi mā lam yunazzil bihi sul'ṭānan wamawāhumu l-nāru wabi'sa mathwā l-ẓālimīna

Telugu ఆయన ఏ విధమైన ప్రమాణం అవతరింపజేయనిదే, అల్లాహ్ కు సాటి కల్పించినందుకు, మేము సత్యతిరస్కారుల హృదయాలలో ఘోర భయాన్ని కల్పిస్తాము. వారి ఆశ్రయం నరకాగ్నియే! అది దుర్మార్గులకు లభించే, అతి చెడ్డ నివాసం.

Verse 152

وَلَقَدْ صَدَقَكُمُ ٱللَّهُ وَعْدَهُۥٓ إِذْ تَحُسُّونَهُم بِإِذْنِهِۦ ۖ حَتَّىٰٓ إِذَا فَشِلْتُمْ وَتَنَـٰزَعْتُمْ فِى ٱلْأَمْرِ وَعَصَيْتُم مِّنۢ بَعْدِ مَآ أَرَىٰكُم مَّا تُحِبُّونَ ۚ مِنكُم مَّن يُرِيدُ ٱلدُّنْيَا وَمِنكُم مَّن يُرِيدُ ٱلْـَٔاخِرَةَ ۚ ثُمَّ صَرَفَكُمْ عَنْهُمْ لِيَبْتَلِيَكُمْ ۖ وَلَقَدْ عَفَا عَنكُمْ ۗ وَٱللَّهُ ذُو فَضْلٍ عَلَى ٱلْمُؤْمِنِينَ

Transliteration walaqad ṣadaqakumu l-lahu waʿdahu idh taḥussūnahum bi-idh'nihi ḥattā idhā fashil'tum watanāzaʿtum fī l-amri waʿaṣaytum min baʿdi mā arākum mā tuḥibbūna minkum man yurīdu l-dun'yā waminkum man yurīdu l-ākhirata thumma ṣarafakum ʿanhum liyabtaliyakum walaqad ʿafā ʿankum wal-lahu dhū faḍlin ʿalā l-mu'minīna

Telugu మరియు వాస్తవానికి అల్లాహ్ మీకు చేసిన తన వాగ్దానాన్ని సత్యపరచాడు. ఎప్పుడైతే మీరు ఆయన అనుమతితో, వారిని (సత్యతిరస్కారులను) చంపుతూ ఉన్నారో! తరువాత మీరు పిరికితనాన్ని ప్రదర్శించి, మీ కర్తవ్య విషయంలో పరస్పర విభేదాలకు గురి అయ్యి - ఆయన (అల్లాహ్) మీకు, మీరు వ్యామోహపడుతున్న దానిని చూపగానే - (మీ నాయకుని) ఆజ్ఞను ఉల్లంఘించారు. (ఎందుకంటే) మీలో కొందరు ఇహలోకాన్ని కోరేవారున్నారు మరియు మీలో కొందరు పరలోకాన్ని కోరేవారున్నారు. తరువాత మిమ్మల్ని పరీక్షించటానికి ఆయన (అల్లాహ్) మీరు మీ విరోధులను ఓడించకుండా చేశాడు. మరియు వాస్తవానికి ఇపుడు ఆయన మిమ్మలన్ని క్షమించాడు. మరియు అల్లాహ్ విశ్వాసుల పట్ల ఎంతో అనుగ్రహుడు.

Verse 153

۞ إِذْ تُصْعِدُونَ وَلَا تَلْوُۥنَ عَلَىٰٓ أَحَدٍ وَٱلرَّسُولُ يَدْعُوكُمْ فِىٓ أُخْرَىٰكُمْ فَأَثَـٰبَكُمْ غَمًّۢا بِغَمٍّ لِّكَيْلَا تَحْزَنُوا۟ عَلَىٰ مَا فَاتَكُمْ وَلَا مَآ أَصَـٰبَكُمْ ۗ وَٱللَّهُ خَبِيرٌۢ بِمَا تَعْمَلُونَ

Transliteration idh tuṣ'ʿidūna walā talwūna ʿalā aḥadin wal-rasūlu yadʿūkum fī ukh'rākum fa-athābakum ghamman bighammin likaylā taḥzanū ʿalā mā fātakum walā mā aṣābakum wal-lahu khabīrun bimā taʿmalūna

Telugu (జ్ఞాపకం చేసుకోండి!) ఎప్పుడయితే మీరు పారిపోతూ ఉన్నారో మరియు వెనుకకు కూడా తిరిగి ఎవరినీ చూడకుండా ఉన్నారో మరియు ప్రవక్త మీ వెనుక నుండి, మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడో! అప్పుడు (మీ ఈ వైఖరికి) ప్రతిఫలంగా (అల్లాహ్) మీకు దుఃఖం మీద దుఃఖం కలుగజేసాడు; మీరు ఏదైనా పోగొట్టుకున్నా, లేదా మీకు ఏదైనా ఆపద కలిగినా మీరు చింతించకుండా ఉండేందుకు. మరియు మీ కర్మలన్నింటినీ అల్లాహ్ బాగా ఎరుగును.

Verse 154

ثُمَّ أَنزَلَ عَلَيْكُم مِّنۢ بَعْدِ ٱلْغَمِّ أَمَنَةً نُّعَاسًا يَغْشَىٰ طَآئِفَةً مِّنكُمْ ۖ وَطَآئِفَةٌ قَدْ أَهَمَّتْهُمْ أَنفُسُهُمْ يَظُنُّونَ بِٱللَّهِ غَيْرَ ٱلْحَقِّ ظَنَّ ٱلْجَـٰهِلِيَّةِ ۖ يَقُولُونَ هَل لَّنَا مِنَ ٱلْأَمْرِ مِن شَىْءٍ ۗ قُلْ إِنَّ ٱلْأَمْرَ كُلَّهُۥ لِلَّهِ ۗ يُخْفُونَ فِىٓ أَنفُسِهِم مَّا لَا يُبْدُونَ لَكَ ۖ يَقُولُونَ لَوْ كَانَ لَنَا مِنَ ٱلْأَمْرِ شَىْءٌ مَّا قُتِلْنَا هَـٰهُنَا ۗ قُل لَّوْ كُنتُمْ فِى بُيُوتِكُمْ لَبَرَزَ ٱلَّذِينَ كُتِبَ عَلَيْهِمُ ٱلْقَتْلُ إِلَىٰ مَضَاجِعِهِمْ ۖ وَلِيَبْتَلِىَ ٱللَّهُ مَا فِى صُدُورِكُمْ وَلِيُمَحِّصَ مَا فِى قُلُوبِكُمْ ۗ وَٱللَّهُ عَلِيمٌۢ بِذَاتِ ٱلصُّدُورِ

Transliteration thumma anzala ʿalaykum min baʿdi l-ghami amanatan nuʿāsan yaghshā ṭāifatan minkum waṭāifatun qad ahammathum anfusuhum yaẓunnūna bil-lahi ghayra l-ḥaqi ẓanna l-jāhiliyati yaqūlūna hal lanā mina l-amri min shayin qul inna l-amra kullahu lillahi yukh'fūna fī anfusihim mā lā yub'dūna laka yaqūlūna law kāna lanā mina l-amri shayon mā qutil'nā hāhunā qul law kuntum fī buyūtikum labaraza alladhīna kutiba ʿalayhimu l-qatlu ilā maḍājiʿihim waliyabtaliya l-lahu mā fī ṣudūrikum waliyumaḥḥiṣa mā fī qulūbikum wal-lahu ʿalīmun bidhāti l-ṣudūri

Telugu అప్పుడు ఈ దుఃఖం తరువాత ఆయన (అల్లాహ్) మీపై శాంతి భద్రతలను అవతరింపజేశాడు; దాని వల్ల మీలో కొందరికి కునుకుపాటు ఆవరించింది. కాని మరికొందరు - కేవలం స్వంత ప్రాణాలకు ప్రాముఖ్యత నిచ్చేవారు, అల్లాహ్ ను గురించి పామరుల వంటి తప్పుడు ఊహలు చేసేవారు - ఇలా అన్నారు: "ఏమీ? ఈ వ్యవహారంలో మాకు ఏమైనా భాగముందా?" వారితో ఇలా అను: "నిశ్చయంగా, సమస్త వ్యవహారాలపై సర్వాధికారం అల్లాహ్ దే!" వారు తమ హృదయాలలో దాచుకున్న దానిని నీకు వ్యక్తం చేయటం లేదు. వారు ఇంకా ఇలా అంటారు: "మాకు అధికారమే ఉండి వుంటే, మేము ఇక్కడు చంపబడి ఉండేవారము కాదు." వారికి ఇలా జవాబివ్వు: "ఒకవేళ మీరు మీ ఇళ్ళలోనే ఉండి వున్నప్పటికీ, మరణం వ్రాయబడి ఉన్నవారు స్వయంగా తమ వధ్య స్థానాలకు తరలి వచ్చేవారు." మరియు అల్లాహ్ మీ గుండెలలో దాగి వున్న దానిని పరీక్షించటానికి మరియు మీ హృదయాలను పరిశుద్ధ పరచటానికి ఇలా చేశాడు. మరియు హృదయాలలో (దాగి) ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.

Verse 155

إِنَّ ٱلَّذِينَ تَوَلَّوْا۟ مِنكُمْ يَوْمَ ٱلْتَقَى ٱلْجَمْعَانِ إِنَّمَا ٱسْتَزَلَّهُمُ ٱلشَّيْطَـٰنُ بِبَعْضِ مَا كَسَبُوا۟ ۖ وَلَقَدْ عَفَا ٱللَّهُ عَنْهُمْ ۗ إِنَّ ٱللَّهَ غَفُورٌ حَلِيمٌ

Transliteration inna alladhīna tawallaw minkum yawma l-taqā l-jamʿāni innamā is'tazallahumu l-shayṭānu bibaʿḍi mā kasabū walaqad ʿafā l-lahu ʿanhum inna l-laha ghafūrun ḥalīmun

Telugu రెండు సైన్యాలు (ఉహుద్ యుద్ధానికి) తలబడిన దినమున, వాస్తవానికి మీలో వెన్ను చూపిన వారిని - వారు చేసుకున్న వాటికి (కర్మలకు) ఫలితంగా - షైతాను వారి పాదాలను జార్చాడు. అయినా, వాస్తవానికి అల్లాహ్ వారిని క్షమించాడు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, సహనశీలుడు.

Verse 156

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَكُونُوا۟ كَٱلَّذِينَ كَفَرُوا۟ وَقَالُوا۟ لِإِخْوَٰنِهِمْ إِذَا ضَرَبُوا۟ فِى ٱلْأَرْضِ أَوْ كَانُوا۟ غُزًّى لَّوْ كَانُوا۟ عِندَنَا مَا مَاتُوا۟ وَمَا قُتِلُوا۟ لِيَجْعَلَ ٱللَّهُ ذَٰلِكَ حَسْرَةً فِى قُلُوبِهِمْ ۗ وَٱللَّهُ يُحْىِۦ وَيُمِيتُ ۗ وَٱللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ

Transliteration yāayyuhā alladhīna āmanū lā takūnū ka-alladhīna kafarū waqālū li-ikh'wānihim idhā ḍarabū fī l-arḍi aw kānū ghuzzan law kānū ʿindanā mā mātū wamā qutilū liyajʿala l-lahu dhālika ḥasratan fī qulūbihim wal-lahu yuḥ'yī wayumītu wal-lahu bimā taʿmalūna baṣīrun

Telugu ఓ విశ్వాసులారా! మీరు సత్యతిరస్కారుల మాదిరిగా ప్రవర్తించకండి; వారు తమ సోదరులు ఎప్పుడైనా ప్రయాణంలో ఉంటే, లేదా యుద్ధంలో ఉంటే, (అక్కడ వారు ఏదైనా ప్రమాదానికి గురి అయితే) వారిని గురించి ఇలా అనేవారు: "ఒకవేళ వారు మాతోపాటు ఉండివుంటే చనిపోయే వారు కాదు మరియు చంపబడేవారునూ కాదు!" వాటిని (ఈ విధమైన మాటలను) అల్లాహ్ వారి హృదయ ఆవేదనకు కారణాలుగా చేస్తాడు. మరియు అల్లాహ్ యే జీవనమిచ్చే వాడు. మరియు మరణమిచ్చే వాడు మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్ చూస్తున్నాడు.

Verse 157

وَلَئِن قُتِلْتُمْ فِى سَبِيلِ ٱللَّهِ أَوْ مُتُّمْ لَمَغْفِرَةٌ مِّنَ ٱللَّهِ وَرَحْمَةٌ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ

Transliteration wala-in qutil'tum fī sabīli l-lahi aw muttum lamaghfiratun mina l-lahi waraḥmatun khayrun mimmā yajmaʿūna

Telugu మరియు మీరు అల్లాహ్ మార్గంలో చంపబడినా లేదా మరణించినా మీకు లభించే అల్లాహ్ క్షమాభిక్ష మరియు కారుణ్యం, నిశ్చయంగా మీరు కూడబెట్టే వాటి అన్నిటి కంటే ఎంతో ఉత్తమమైనవి.

Verse 158

وَلَئِن مُّتُّمْ أَوْ قُتِلْتُمْ لَإِلَى ٱللَّهِ تُحْشَرُونَ

Transliteration wala-in muttum aw qutil'tum la-ilā l-lahi tuḥ'sharūna

Telugu మరియు మీరు మరణించినా లేదా చంపబడినా, మీరందరూ అల్లాహ్ సమక్షంలో సమావేశపరచ బడతారు.

Verse 159

فَبِمَا رَحْمَةٍ مِّنَ ٱللَّهِ لِنتَ لَهُمْ ۖ وَلَوْ كُنتَ فَظًّا غَلِيظَ ٱلْقَلْبِ لَٱنفَضُّوا۟ مِنْ حَوْلِكَ ۖ فَٱعْفُ عَنْهُمْ وَٱسْتَغْفِرْ لَهُمْ وَشَاوِرْهُمْ فِى ٱلْأَمْرِ ۖ فَإِذَا عَزَمْتَ فَتَوَكَّلْ عَلَى ٱللَّهِ ۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلْمُتَوَكِّلِينَ

Transliteration fabimā raḥmatin mina l-lahi linta lahum walaw kunta faẓẓan ghalīẓa l-qalbi la-infaḍḍū min ḥawlika fa-uʿ'fu ʿanhum wa-is'taghfir lahum washāwir'hum fī l-amri fa-idhā ʿazamta fatawakkal ʿalā l-lahi inna l-laha yuḥibbu l-mutawakilīna

Telugu (ఓ ప్రవక్తా!) అల్లాహ్ యొక్క అపార కారుణ్యం వల్లనే నీవు వారి పట్ల మృదుహృదయుడవయ్యావు. నీవే గనక క్రూరుడవు, కఠిన హృదయుడవు అయి వుంటే, వారందరూ నీ చుట్టుప్రక్కల నుండి దూరంగా పారిపోయే వారు. కావున నీవు వారిని మన్నించు, వారి క్షమాపణ కొరకు (అల్లాహ్ ను) ప్రార్థించు మరియు వ్యవహారాలలో వారిని సంప్రదించు. ఆ పిదప నీవు కార్యానికి సిద్ధమైనపుడు అల్లాహ్ పై ఆధారపడు. నిశ్చయంగా, అల్లాహ్ తనపై ఆధారపడే వారిని ప్రేమిస్తాడు.

Verse 160

إِن يَنصُرْكُمُ ٱللَّهُ فَلَا غَالِبَ لَكُمْ ۖ وَإِن يَخْذُلْكُمْ فَمَن ذَا ٱلَّذِى يَنصُرُكُم مِّنۢ بَعْدِهِۦ ۗ وَعَلَى ٱللَّهِ فَلْيَتَوَكَّلِ ٱلْمُؤْمِنُونَ

Transliteration in yanṣur'kumu l-lahu falā ghāliba lakum wa-in yakhdhul'kum faman dhā alladhī yanṣurukum min baʿdihi waʿalā l-lahi falyatawakkali l-mu'minūna

Telugu ఒకవేళ మీకు అల్లాహ్ సహాయమే ఉంటే, మరెవ్వరూ మీపై ఆధిక్యాన్ని పొందజాలరు. మరియు ఆయనే మిమ్మల్ని త్యజిస్తే, ఆయన తప్ప మీకు సహాయం చేయగల వాడెవడు? మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్ పైననే నమ్మకం ఉంచుకుంటారు!

Verse 161

وَمَا كَانَ لِنَبِىٍّ أَن يَغُلَّ ۚ وَمَن يَغْلُلْ يَأْتِ بِمَا غَلَّ يَوْمَ ٱلْقِيَـٰمَةِ ۚ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ

Transliteration wamā kāna linabiyyin an yaghulla waman yaghlul yati bimā ghalla yawma l-qiyāmati thumma tuwaffā kullu nafsin mā kasabat wahum lā yuẓ'lamūna

Telugu మరియు ఏ ప్రవక్త కూడా విజయధనం (బూటీ) కొరకు నమ్మక ద్రోహానికి పాల్పడడు. మరియు నమ్మకద్రోహానికి పాల్పడినవాడు పునరుత్థాన దినమున తన నమ్మక ద్రోహంతో పాటు హాజరవుతాడు. అప్పుడు ప్రతి ప్రాణికి తాను అర్జించిన దానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు.

Verse 162

أَفَمَنِ ٱتَّبَعَ رِضْوَٰنَ ٱللَّهِ كَمَنۢ بَآءَ بِسَخَطٍ مِّنَ ٱللَّهِ وَمَأْوَىٰهُ جَهَنَّمُ ۚ وَبِئْسَ ٱلْمَصِيرُ

Transliteration afamani ittabaʿa riḍ'wāna l-lahi kaman bāa bisakhaṭin mina l-lahi wamawāhu jahannamu wabi'sa l-maṣīru

Telugu ఏమీ? అల్లాహ్ అభీష్టం ప్రకారం నడిచే వ్యక్తి, అల్లాహ్ ఆగ్రహానికి గురయ్యే వాడితో సమానుడవుతాడా? మరియు నరకమే వాని ఆశ్రయము. మరియు అది అతి చెడ్డ గమ్యస్థానం!

Verse 163

هُمْ دَرَجَـٰتٌ عِندَ ٱللَّهِ ۗ وَٱللَّهُ بَصِيرٌۢ بِمَا يَعْمَلُونَ

Transliteration hum darajātun ʿinda l-lahi wal-lahu baṣīrun bimā yaʿmalūna

Telugu అల్లాహ్ దృష్టిలో వారు వేర్వేరు స్థానాలలో ఉన్నారు. మరియు వారు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు.

Verse 164

لَقَدْ مَنَّ ٱللَّهُ عَلَى ٱلْمُؤْمِنِينَ إِذْ بَعَثَ فِيهِمْ رَسُولًا مِّنْ أَنفُسِهِمْ يَتْلُوا۟ عَلَيْهِمْ ءَايَـٰتِهِۦ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ ٱلْكِتَـٰبَ وَٱلْحِكْمَةَ وَإِن كَانُوا۟ مِن قَبْلُ لَفِى ضَلَـٰلٍ مُّبِينٍ

Transliteration laqad manna l-lahu ʿalā l-mu'minīna idh baʿatha fīhim rasūlan min anfusihim yatlū ʿalayhim āyātihi wayuzakkīhim wayuʿallimuhumu l-kitāba wal-ḥik'mata wa-in kānū min qablu lafī ḍalālin mubīnin

Telugu వాస్తవానికి అల్లాహ్ విశ్వాసులకు మహోపకారం చేశాడు; వారి నుండియే వారి మధ్య ఒక ప్రవక్త (ముహమ్మద్) ను లేపాడు; అతను, ఆయన (అల్లాహ్) సందేశాలను (ఆయాత్ లను) వారికి వినిపిస్తున్నాడు. మరియు వారి జీవితాలను సంస్కరించి పావనం చేస్తున్నాడు; మరియు వారికి గ్రంథాన్ని మరియు వివేకాన్ని బోధిస్తున్నాడు; మరియు వాస్తవానికి వారు ఇంతకు ముందు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి వున్నారు.

Verse 165

أَوَلَمَّآ أَصَـٰبَتْكُم مُّصِيبَةٌ قَدْ أَصَبْتُم مِّثْلَيْهَا قُلْتُمْ أَنَّىٰ هَـٰذَا ۖ قُلْ هُوَ مِنْ عِندِ أَنفُسِكُمْ ۗ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ

Transliteration awalammā aṣābatkum muṣībatun qad aṣabtum mith'layhā qul'tum annā hādhā qul huwa min ʿindi anfusikum inna l-laha ʿalā kulli shayin qadīrun

Telugu ఏమయిందీ? మీకొక చిన్న ఆపదే కదా కలిగింది! వాస్తవానికి మీరు, వారికి (మీ శత్రువులను బద్ర్ లో) ఇంతకు రెట్టింపు ఆపద కలిగించారు కదా! అయితే ఇప్పుడు: "ఇది ఎక్కడి నుంచి వచ్చిందీ?" అని అంటున్నారా? వారితో ఇలా అను: "ఇది మీరు స్వయంగా తెచ్చుకున్నదే!" నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.

Verse 166

وَمَآ أَصَـٰبَكُمْ يَوْمَ ٱلْتَقَى ٱلْجَمْعَانِ فَبِإِذْنِ ٱللَّهِ وَلِيَعْلَمَ ٱلْمُؤْمِنِينَ

Transliteration wamā aṣābakum yawma l-taqā l-jamʿāni fabi-idh'ni l-lahi waliyaʿlama l-mu'minīna

Telugu మరియు (ఉహుద్ యుద్ధరంగంలో) రెండు సైన్యాలు ఎదుర్కొన్నప్పుడు, మీకు కలిగిన కష్టం, అల్లాహ్ అనుమతితోనే కలిగింది మరియు అది నిజమైన విశ్వాసులెవరో తెలుసుకోవటానికి -

Verse 167

وَلِيَعْلَمَ ٱلَّذِينَ نَافَقُوا۟ ۚ وَقِيلَ لَهُمْ تَعَالَوْا۟ قَـٰتِلُوا۟ فِى سَبِيلِ ٱللَّهِ أَوِ ٱدْفَعُوا۟ ۖ قَالُوا۟ لَوْ نَعْلَمُ قِتَالًا لَّٱتَّبَعْنَـٰكُمْ ۗ هُمْ لِلْكُفْرِ يَوْمَئِذٍ أَقْرَبُ مِنْهُمْ لِلْإِيمَـٰنِ ۚ يَقُولُونَ بِأَفْوَٰهِهِم مَّا لَيْسَ فِى قُلُوبِهِمْ ۗ وَٱللَّهُ أَعْلَمُ بِمَا يَكْتُمُونَ

Transliteration waliyaʿlama alladhīna nāfaqū waqīla lahum taʿālaw qātilū fī sabīli l-lahi awi id'faʿū qālū law naʿlamu qitālan la-ittabaʿnākum hum lil'kuf'ri yawma-idhin aqrabu min'hum lil'īmāni yaqūlūna bi-afwāhihim mā laysa fī qulūbihim wal-lahu aʿlamu bimā yaktumūna

Telugu మరియు కపటవిశ్వాసులు ఎవరో తెలుసుకోవటానికి. మరియు వారితో (కపట విశ్వాసులతో): "రండి అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయండి, లేదా కనీసం మిమ్మల్ని మీరు రక్షించుకోండి!" అని అన్నప్పుడు వారు: "ఒకవేళ మాకు యుద్ధం జరుగుతుందని తెలిసివుంటే, మేము తప్పకుండా మీతోపాటు వచ్చి ఉండేవారం." అని జవాబిచ్చారు. ఆ రోజు వారు విశ్వాసానికంటే అవిశ్వాసానికి దగ్గరగా ఉన్నారు. మరియు వారు తమ హృదయాలలో లేని మాటలను తమ నోళ్ళతో పలుకుతూ ఉన్నారు. మరియు వారు దాస్తున్నది అల్లాహ్ కు బాగా తెలుసు.

Verse 168

ٱلَّذِينَ قَالُوا۟ لِإِخْوَٰنِهِمْ وَقَعَدُوا۟ لَوْ أَطَاعُونَا مَا قُتِلُوا۟ ۗ قُلْ فَٱدْرَءُوا۟ عَنْ أَنفُسِكُمُ ٱلْمَوْتَ إِن كُنتُمْ صَـٰدِقِينَ

Transliteration alladhīna qālū li-ikh'wānihim waqaʿadū law aṭāʿūnā mā qutilū qul fa-id'raū ʿan anfusikumu l-mawta in kuntum ṣādiqīna

Telugu అలాంటి వారు తమ ఇండ్లలో కూర్చొని ఉండి (చంపబడిన) తమ సోదరులను గురించి ఇలా అన్నారు: "వారు గనక మా మాట విని ఉంటే చంపబడి ఉండేవారు కాదు!" నీవు వారితో: "మీరు సత్యవంతులే అయితే, మీకు మరణం రాకుండా మిమ్మల్ని మీరు తప్పించుకోండి!" అని చెప్పు.

Verse 169

وَلَا تَحْسَبَنَّ ٱلَّذِينَ قُتِلُوا۟ فِى سَبِيلِ ٱللَّهِ أَمْوَٰتًۢا ۚ بَلْ أَحْيَآءٌ عِندَ رَبِّهِمْ يُرْزَقُونَ

Transliteration walā taḥsabanna alladhīna qutilū fī sabīli l-lahi amwātan bal aḥyāon ʿinda rabbihim yur'zaqūna

Telugu మరియు అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులై, తమ ప్రభువు వద్ద జీవనోపాధి పొందుతున్నారు.

Verse 170

فَرِحِينَ بِمَآ ءَاتَىٰهُمُ ٱللَّهُ مِن فَضْلِهِۦ وَيَسْتَبْشِرُونَ بِٱلَّذِينَ لَمْ يَلْحَقُوا۟ بِهِم مِّنْ خَلْفِهِمْ أَلَّا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ

Transliteration fariḥīna bimā ātāhumu l-lahu min faḍlihi wayastabshirūna bi-alladhīna lam yalḥaqū bihim min khalfihim allā khawfun ʿalayhim walā hum yaḥzanūna

Telugu అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానితో (ప్రాణత్యాగంతో) వారు సంతోషంతో ఉప్పొంగిపోతారు. మరియు వారిని కలువక, వెనుక (బ్రతికి) ఉన్నవారి కొరకు (ఇవ్వబడిన శుభవార్తతో) వారు సంతోషపడుతూ ఉంటారు. ఎందుకంటే వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!

Verse 171

۞ يَسْتَبْشِرُونَ بِنِعْمَةٍ مِّنَ ٱللَّهِ وَفَضْلٍ وَأَنَّ ٱللَّهَ لَا يُضِيعُ أَجْرَ ٱلْمُؤْمِنِينَ

Transliteration yastabshirūna biniʿ'matin mina l-lahi wafaḍlin wa-anna l-laha lā yuḍīʿu ajra l-mu'minīna

Telugu వారు అల్లాహ్ అనుగ్రహానికి, దాతృత్వానికి సంతోషపడుతూ ఉంటారు. మరియు నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసుల ప్రతిఫలాన్ని వ్యర్థం కానివ్వడు.

Verse 172

ٱلَّذِينَ ٱسْتَجَابُوا۟ لِلَّهِ وَٱلرَّسُولِ مِنۢ بَعْدِ مَآ أَصَابَهُمُ ٱلْقَرْحُ ۚ لِلَّذِينَ أَحْسَنُوا۟ مِنْهُمْ وَٱتَّقَوْا۟ أَجْرٌ عَظِيمٌ

Transliteration alladhīna is'tajābū lillahi wal-rasūli min baʿdi mā aṣābahumu l-qarḥu lilladhīna aḥsanū min'hum wa-ittaqaw ajrun ʿaẓīmun

Telugu ఎవరైతే గాయపడిన తరువాత కూడా అల్లాహ్ మరియు సందేశహరుని (ఆజ్ఞలను) పాటించారో; వారిలో ఎవరైతే, సత్కార్యాలు చేశారో, మరియు దైవభీతి కలిగి ఉన్నారో, వారికి గొప్ప ప్రతిఫలం ఉంది.

Verse 173

ٱلَّذِينَ قَالَ لَهُمُ ٱلنَّاسُ إِنَّ ٱلنَّاسَ قَدْ جَمَعُوا۟ لَكُمْ فَٱخْشَوْهُمْ فَزَادَهُمْ إِيمَـٰنًا وَقَالُوا۟ حَسْبُنَا ٱللَّهُ وَنِعْمَ ٱلْوَكِيلُ

Transliteration alladhīna qāla lahumu l-nāsu inna l-nāsa qad jamaʿū lakum fa-ikh'shawhum fazādahum īmānan waqālū ḥasbunā l-lahu waniʿ'ma l-wakīlu

Telugu వారితో (విశ్వాసులతో) ప్రజలు: "వాస్తవానికి, మీకు వ్యతిరేకంగా పెద్ద జన సమూహాలు కూర్చబడి ఉన్నాయి, కావున మీరు వారికి భయపడండి." అని అన్నప్పుడు, వారి విశ్వాసం మరింత అధికమే అయింది. మరియు వారు: "మాకు అల్లాహ్ యే చాలు మరియు ఆయనే సర్వోత్తమమైన కార్యసాధకుడు." అని అన్నారు.

Verse 174

فَٱنقَلَبُوا۟ بِنِعْمَةٍ مِّنَ ٱللَّهِ وَفَضْلٍ لَّمْ يَمْسَسْهُمْ سُوٓءٌ وَٱتَّبَعُوا۟ رِضْوَٰنَ ٱللَّهِ ۗ وَٱللَّهُ ذُو فَضْلٍ عَظِيمٍ

Transliteration fa-inqalabū biniʿ'matin mina l-lahi wafaḍlin lam yamsashum sūon wa-ittabaʿū riḍ'wāna l-lahi wal-lahu dhū faḍlin ʿaẓīmin

Telugu ఈ విధంగా వారు అల్లాహ్ ఉపకారాలు మరియు అనుగ్రహాలతో (యుద్ధరంగం నుండి) తిరిగి వచ్చారు, వారికెలాంటి హాని కలుగలేదు మరియు వారు అల్లాహ్ అభీష్టాన్నీ అనుసరించారు. మరియు అల్లాహ్ ఎంతో అనుగ్రహుడు, సర్వోత్తముడు.

Verse 175

إِنَّمَا ذَٰلِكُمُ ٱلشَّيْطَـٰنُ يُخَوِّفُ أَوْلِيَآءَهُۥ فَلَا تَخَافُوهُمْ وَخَافُونِ إِن كُنتُم مُّؤْمِنِينَ

Transliteration innamā dhālikumu l-shayṭānu yukhawwifu awliyāahu falā takhāfūhum wakhāfūni in kuntum mu'minīna

Telugu నిశ్చయంగా, షైతానే తన మిత్రుల గురించి మీలో భయం పుట్టిస్తాడు. కావున మీరు వారికి భయపడకండి. మరియు మీరు విశ్వాసులే అయితే, కేవలం నాకే (అల్లాహ్ కే) భయపడండి.

Verse 176

وَلَا يَحْزُنكَ ٱلَّذِينَ يُسَـٰرِعُونَ فِى ٱلْكُفْرِ ۚ إِنَّهُمْ لَن يَضُرُّوا۟ ٱللَّهَ شَيْـًٔا ۗ يُرِيدُ ٱللَّهُ أَلَّا يَجْعَلَ لَهُمْ حَظًّا فِى ٱلْـَٔاخِرَةِ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ

Transliteration walā yaḥzunka alladhīna yusāriʿūna fī l-kuf'ri innahum lan yaḍurrū l-laha shayan yurīdu l-lahu allā yajʿala lahum ḥaẓẓan fī l-ākhirati walahum ʿadhābun ʿaẓīmun

Telugu మరియు సత్యతిరస్కారం కొరకు పోటీ చేసేవారు నిన్ను ఖేదానికి గురి చేయనివ్వరాదు. నిశ్చయంగా, వారు అల్లాహ్ కు ఎలాంటి నష్టం కలిగించలేరు. పరలోక సుఖంలో అల్లాహ్ వారి కెలాంటి భాగం ఇవ్వదలచుకోలేదు. మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది.

Verse 177

إِنَّ ٱلَّذِينَ ٱشْتَرَوُا۟ ٱلْكُفْرَ بِٱلْإِيمَـٰنِ لَن يَضُرُّوا۟ ٱللَّهَ شَيْـًٔا وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ

Transliteration inna alladhīna ish'tarawū l-kuf'ra bil-īmāni lan yaḍurrū l-laha shayan walahum ʿadhābun alīmun

Telugu నిశ్చయంగా, విశ్వాసానికి బదులుగా సత్యతిరస్కారాన్ని కొనేవారు అల్లాహ్ కు ఎలాంటి నష్టం కలిగించలేరు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

Verse 178

وَلَا يَحْسَبَنَّ ٱلَّذِينَ كَفَرُوٓا۟ أَنَّمَا نُمْلِى لَهُمْ خَيْرٌ لِّأَنفُسِهِمْ ۚ إِنَّمَا نُمْلِى لَهُمْ لِيَزْدَادُوٓا۟ إِثْمًا ۚ وَلَهُمْ عَذَابٌ مُّهِينٌ

Transliteration walā yaḥsabanna alladhīna kafarū annamā num'lī lahum khayrun li-anfusihim innamā num'lī lahum liyazdādū ith'man walahum ʿadhābun muhīnun

Telugu మరియు వాస్తవానికి మేము ఇస్తున్న ఈ వ్యవధిని సత్యతిరస్కారులు తమకు మేలైనదిగా భావించకూడదు. మరియు వాస్తవానికి, మేము ఇస్తున్న ఈ వ్యవధి వారి పాపాలు అధికమవటానికే! మరియు వారికి అవమానకరమైన శిక్ష ఉంటుంది.

Verse 179

مَّا كَانَ ٱللَّهُ لِيَذَرَ ٱلْمُؤْمِنِينَ عَلَىٰ مَآ أَنتُمْ عَلَيْهِ حَتَّىٰ يَمِيزَ ٱلْخَبِيثَ مِنَ ٱلطَّيِّبِ ۗ وَمَا كَانَ ٱللَّهُ لِيُطْلِعَكُمْ عَلَى ٱلْغَيْبِ وَلَـٰكِنَّ ٱللَّهَ يَجْتَبِى مِن رُّسُلِهِۦ مَن يَشَآءُ ۖ فَـَٔامِنُوا۟ بِٱللَّهِ وَرُسُلِهِۦ ۚ وَإِن تُؤْمِنُوا۟ وَتَتَّقُوا۟ فَلَكُمْ أَجْرٌ عَظِيمٌ

Transliteration mā kāna l-lahu liyadhara l-mu'minīna ʿalā mā antum ʿalayhi ḥattā yamīza l-khabītha mina l-ṭayibi wamā kāna l-lahu liyuṭ'liʿakum ʿalā l-ghaybi walākinna l-laha yajtabī min rusulihi man yashāu faāminū bil-lahi warusulihi wa-in tu'minū watattaqū falakum ajrun ʿaẓīmun

Telugu అల్లాహ్ విశ్వాసులను, మీరు (సత్యతిరస్కారులు) ఇప్పుడు ఉన్న స్థితిలో, ఏ మాత్రమూ ఉండనివ్వడు. చివరకు ఆయన దుష్టులను సత్పురుషుల నుండి తప్పకుండా వేరు చేస్తాడు. మరియు అగోచర విషయాలను మీకు తెలపడం అల్లాహ్ విధానం కాదు, కాని అల్లాహ్ తన ప్రవక్తలలో నుండి తాను కోరిన వారిని ఎన్నుకుంటాడు. కావున మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించండి మరియు ఒకవేళ మీరు విశ్వసించి, దైవభీతి గలిగి ఉంటే, మీకు గొప్ప ప్రతిఫలం ఉంటుంది.

Verse 180

وَلَا يَحْسَبَنَّ ٱلَّذِينَ يَبْخَلُونَ بِمَآ ءَاتَىٰهُمُ ٱللَّهُ مِن فَضْلِهِۦ هُوَ خَيْرًا لَّهُم ۖ بَلْ هُوَ شَرٌّ لَّهُمْ ۖ سَيُطَوَّقُونَ مَا بَخِلُوا۟ بِهِۦ يَوْمَ ٱلْقِيَـٰمَةِ ۗ وَلِلَّهِ مِيرَٰثُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۗ وَٱللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ

Transliteration walā yaḥsabanna alladhīna yabkhalūna bimā ātāhumu l-lahu min faḍlihi huwa khayran lahum bal huwa sharrun lahum sayuṭawwaqūna mā bakhilū bihi yawma l-qiyāmati walillahi mīrāthu l-samāwāti wal-arḍi wal-lahu bimā taʿmalūna khabīrun

Telugu అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రసాదించిన దానిలో లోభం వహించే వారు, తమకది (లోభమే) మేలైనదని భావించ రాదు, వాస్తవానికి అది వారి కొరకు ఎంతో హానికరమైనది. వారు తమ లోభత్వంతో కూడబెట్టినదంతా, తీర్పు దినమున వారి మెడల చుట్టు కట్టబడుతుంది. మరియు భూమ్యాకాశాల వారసత్వం అల్లాహ్ కే చెందుతుంది. మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్ ఎరుగును.

Verse 181

لَّقَدْ سَمِعَ ٱللَّهُ قَوْلَ ٱلَّذِينَ قَالُوٓا۟ إِنَّ ٱللَّهَ فَقِيرٌ وَنَحْنُ أَغْنِيَآءُ ۘ سَنَكْتُبُ مَا قَالُوا۟ وَقَتْلَهُمُ ٱلْأَنۢبِيَآءَ بِغَيْرِ حَقٍّ وَنَقُولُ ذُوقُوا۟ عَذَابَ ٱلْحَرِيقِ

Transliteration laqad samiʿa l-lahu qawla alladhīna qālū inna l-laha faqīrun wanaḥnu aghniyāu sanaktubu mā qālū waqatlahumu l-anbiyāa bighayri ḥaqqin wanaqūlu dhūqū ʿadhāba l-ḥarīqi

Telugu "నిశ్చయంగా, అల్లాహ్ పేదవాడు మరియు మేము ధనవంతులము." అని చెప్పేవారి మాటలను వాస్తవంగా అల్లాహ్ విన్నాడు. వారు పలుకుతున్నది మరియు అన్యాయంగా ప్రవక్తలను వధించినది మేము వ్రాసిపెడుతున్నాము. మరియు (పునరుత్థాన దినమున) వారితో మేమను ఇలా అంటాము: "దహించే అగ్ని శిక్షను రుచి చూడండి!"

Verse 182

ذَٰلِكَ بِمَا قَدَّمَتْ أَيْدِيكُمْ وَأَنَّ ٱللَّهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ

Transliteration dhālika bimā qaddamat aydīkum wa-anna l-laha laysa biẓallāmin lil'ʿabīdi

Telugu ఇది మీ చేతులారా మీరు చేసి పంపుకున్న కర్మల ఫలితం. నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులకు ఎలాంటి అన్యాయం చేసేవాడు కాడు!

Verse 183

ٱلَّذِينَ قَالُوٓا۟ إِنَّ ٱللَّهَ عَهِدَ إِلَيْنَآ أَلَّا نُؤْمِنَ لِرَسُولٍ حَتَّىٰ يَأْتِيَنَا بِقُرْبَانٍ تَأْكُلُهُ ٱلنَّارُ ۗ قُلْ قَدْ جَآءَكُمْ رُسُلٌ مِّن قَبْلِى بِٱلْبَيِّنَـٰتِ وَبِٱلَّذِى قُلْتُمْ فَلِمَ قَتَلْتُمُوهُمْ إِن كُنتُمْ صَـٰدِقِينَ

Transliteration alladhīna qālū inna l-laha ʿahida ilaynā allā nu'mina lirasūlin ḥattā yatiyanā biqur'bānin takuluhu l-nāru qul qad jāakum rusulun min qablī bil-bayināti wabi-alladhī qul'tum falima qataltumūhum in kuntum ṣādiqīna

Telugu "అగ్ని (ఆకాశం నుండి దిగి వచ్చి) బలి (ఖుర్బానీ)ని మా సమక్షంలో తిననంత వరకు మేము ఎవరినీ ప్రవక్తగా స్వీకరించ గూడదని అల్లాహ్ మాతో వాగ్దానం తీసుకున్నాడు." అని పలికే వారితో (యూదులతో) ఇలా అను: "వాస్తవానికి నాకు పూర్వం మీ వద్దకు చాలా మంది ప్రవక్తలు స్పష్టమైన ఎన్నో నిదర్శనాలను తీసుకువచ్చారు; మరియు మీరు ప్రస్తావించే ఈ నిదర్శనాన్ని కూడా! మీరు సత్యవంతులే అయితే, మీరు వారిని ఎందుకు హత్య చేశారు?"

Verse 184

فَإِن كَذَّبُوكَ فَقَدْ كُذِّبَ رُسُلٌ مِّن قَبْلِكَ جَآءُو بِٱلْبَيِّنَـٰتِ وَٱلزُّبُرِ وَٱلْكِتَـٰبِ ٱلْمُنِيرِ

Transliteration fa-in kadhabūka faqad kudhiba rusulun min qablika jāū bil-bayināti wal-zuburi wal-kitābi l-munīri

Telugu (ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు నిన్ను అసత్యవాదుడవని తిరస్కరిస్తే, నీవు (ఆశ్చర్యపడకు); వాస్తవానికి నీకు ముందు ప్రత్యక్ష నిదర్శనాలను, సహీఫాలను (జుబుర్ లను) మరియు జ్యోతిని ప్రసాదించే గ్రంథాన్ని తీసుకు వచ్చిన చాలా మంది ప్రవక్తలు కూడా అసత్యవాదులని తిరస్కరించబడ్డారు.

Verse 185

كُلُّ نَفْسٍ ذَآئِقَةُ ٱلْمَوْتِ ۗ وَإِنَّمَا تُوَفَّوْنَ أُجُورَكُمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ ۖ فَمَن زُحْزِحَ عَنِ ٱلنَّارِ وَأُدْخِلَ ٱلْجَنَّةَ فَقَدْ فَازَ ۗ وَمَا ٱلْحَيَوٰةُ ٱلدُّنْيَآ إِلَّا مَتَـٰعُ ٱلْغُرُورِ

Transliteration kullu nafsin dhāiqatu l-mawti wa-innamā tuwaffawna ujūrakum yawma l-qiyāmati faman zuḥ'ziḥa ʿani l-nāri wa-ud'khila l-janata faqad fāza wamā l-ḥayatu l-dun'yā illā matāʿu l-ghurūri

Telugu ప్రతి పాణి చావును చవి చూస్తుంది. మరియు నిశ్చయంగా, తీర్పుదినమున మీ కర్మల ఫలితం మీకు పూర్తిగా ఇవ్వబడుతుంది. కావున ఎవడు నరకాగ్ని నుండి తప్పించబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడతాడో! వాస్తవానికి వాడే సఫలీకృతుడు. మరియు ఇహలోక జీవితం కేవలం మోసపుచ్చే సుఖానుభవం మాత్రమే!

Verse 186

۞ لَتُبْلَوُنَّ فِىٓ أَمْوَٰلِكُمْ وَأَنفُسِكُمْ وَلَتَسْمَعُنَّ مِنَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَـٰبَ مِن قَبْلِكُمْ وَمِنَ ٱلَّذِينَ أَشْرَكُوٓا۟ أَذًى كَثِيرًا ۚ وَإِن تَصْبِرُوا۟ وَتَتَّقُوا۟ فَإِنَّ ذَٰلِكَ مِنْ عَزْمِ ٱلْأُمُورِ

Transliteration latub'lawunna fī amwālikum wa-anfusikum walatasmaʿunna mina alladhīna ūtū l-kitāba min qablikum wamina alladhīna ashrakū adhan kathīran wa-in taṣbirū watattaqū fa-inna dhālika min ʿazmi l-umūri

Telugu నిశ్చయంగా మీరు, మీ ధన ప్రాణాలతో పరీక్షింపబడతారు; మరియు నిశ్చయంగా, మీకు పూర్వం గ్రంథం ప్రసాదించబడిన వారి నుండి మరియు అల్లాహ్ కు భాగస్వాములు (సాటి) కల్పించిన వారి నుండి, మీరు అనేక వేదన కలిగించే మాటలు వింటుంటారు. కానీ, ఒకవేళ మీరు ఓర్పు వహించి, దైవభీతి కలిగి ఉంటే! నిశ్చయంగా అది ఎంతో సాహసంతో కూడిన కార్యం.

Verse 187

وَإِذْ أَخَذَ ٱللَّهُ مِيثَـٰقَ ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَـٰبَ لَتُبَيِّنُنَّهُۥ لِلنَّاسِ وَلَا تَكْتُمُونَهُۥ فَنَبَذُوهُ وَرَآءَ ظُهُورِهِمْ وَٱشْتَرَوْا۟ بِهِۦ ثَمَنًا قَلِيلًا ۖ فَبِئْسَ مَا يَشْتَرُونَ

Transliteration wa-idh akhadha l-lahu mīthāqa alladhīna ūtū l-kitāba latubayyinunnahu lilnnāsi walā taktumūnahu fanabadhūhu warāa ẓuhūrihim wa-ish'taraw bihi thamanan qalīlan fabi'sa mā yashtarūna

Telugu మరియు అల్లాహ్ గ్రంథ ప్రజలతో: "దీనిని (దైవప్రవక్త ముహమ్మద్ రానున్నాడు అనే సత్యాన్ని) ప్రజలకు తెలియజేయండి మరియు దానిని దాచకండి." అని చేయించిన ప్రమాణాన్ని , (జ్ఞాపకం చేసుకోండి). కాని వారు దానిని తమ వీపుల వెనుక పడవేసి దానికి బదులుగా స్వల్ప మూల్యాన్ని పొందారు, వారి ఈ వ్యాపారం ఎంత నీచమైనది!

Verse 188

لَا تَحْسَبَنَّ ٱلَّذِينَ يَفْرَحُونَ بِمَآ أَتَوا۟ وَّيُحِبُّونَ أَن يُحْمَدُوا۟ بِمَا لَمْ يَفْعَلُوا۟ فَلَا تَحْسَبَنَّهُم بِمَفَازَةٍ مِّنَ ٱلْعَذَابِ ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ

Transliteration lā taḥsabanna alladhīna yafraḥūna bimā ataw wayuḥibbūna an yuḥ'madū bimā lam yafʿalū falā taḥsabannahum bimafāzatin mina l-ʿadhābi walahum ʿadhābun alīmun

Telugu ఎవరైతే తాము చేసిన పనికి సంతోష పడుతూ, తాము చేయని పనికి ప్రశంసలు లభిస్తాయని కోరుతారో, వారు శిక్ష నుండి తప్పించుకోగలరని నీవు భావించకు. మరియు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.

Verse 189

وَلِلَّهِ مُلْكُ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۗ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ

Transliteration walillahi mul'ku l-samāwāti wal-arḍi wal-lahu ʿalā kulli shayin qadīrun

Telugu మరియు భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్ కే చెందినది. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.

Verse 190

إِنَّ فِى خَلْقِ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ وَٱخْتِلَـٰفِ ٱلَّيْلِ وَٱلنَّهَارِ لَـَٔايَـٰتٍ لِّأُو۟لِى ٱلْأَلْبَـٰبِ

Transliteration inna fī khalqi l-samāwāti wal-arḍi wa-ikh'tilāfi al-layli wal-nahāri laāyātin li-ulī l-albābi

Telugu నిశ్చయంగా, భూమ్యాకాశాల సృష్టిలో మరియు రేయింబవళ్ళ అనుక్రమం (ఒకదాని తరువాత ఒకటి రావడం మరియు వాటి హెచ్చుతగ్గుల)లో, బుద్ధిమంతుల కొరకు ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి;

Verse 191

ٱلَّذِينَ يَذْكُرُونَ ٱللَّهَ قِيَـٰمًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِهِمْ وَيَتَفَكَّرُونَ فِى خَلْقِ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ رَبَّنَا مَا خَلَقْتَ هَـٰذَا بَـٰطِلًا سُبْحَـٰنَكَ فَقِنَا عَذَابَ ٱلنَّارِ

Transliteration alladhīna yadhkurūna l-laha qiyāman waquʿūdan waʿalā junūbihim wayatafakkarūna fī khalqi l-samāwāti wal-arḍi rabbanā mā khalaqta hādhā bāṭilan sub'ḥānaka faqinā ʿadhāba l-nāri

Telugu ఎవరైతే నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా, అన్ని వేళలా అల్లాహ్ ను స్మరిస్తారో, భూమ్యాకాశాల నిర్మాణాన్ని గురించి ఆలోచిస్తారో! (వారు ఇలా ప్రార్థిస్తారు): "ఓ మా ప్రభూ! నీవు దీనిని (ఈ విశ్వాన్ని) వ్యర్థంగా సృష్టించలేదు, నీవు సర్వలోపాలకు అతీతువు, మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుండి కాపాడు.

Verse 192

رَبَّنَآ إِنَّكَ مَن تُدْخِلِ ٱلنَّارَ فَقَدْ أَخْزَيْتَهُۥ ۖ وَمَا لِلظَّـٰلِمِينَ مِنْ أَنصَارٍ

Transliteration rabbanā innaka man tud'khili l-nāra faqad akhzaytahu wamā lilẓẓālimīna min anṣārin

Telugu "ఓ మా ప్రభూ! నీవు ఎవడిని నరకాగ్నిలో పడవేస్తావో వాస్తవంగా వానిని నీవు అవమానపరిచావు. మరియు దుర్మార్గులకు సహాయకులు ఎవ్వరూ ఉండరు."

Verse 193

رَّبَّنَآ إِنَّنَا سَمِعْنَا مُنَادِيًا يُنَادِى لِلْإِيمَـٰنِ أَنْ ءَامِنُوا۟ بِرَبِّكُمْ فَـَٔامَنَّا ۚ رَبَّنَا فَٱغْفِرْ لَنَا ذُنُوبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّـَٔاتِنَا وَتَوَفَّنَا مَعَ ٱلْأَبْرَارِ

Transliteration rabbanā innanā samiʿ'nā munādiyan yunādī lil'īmāni an āminū birabbikum faāmannā rabbanā fa-igh'fir lanā dhunūbanā wakaffir ʿannā sayyiātinā watawaffanā maʿa l-abrāri

Telugu "ఓ మా ప్రభూ! నిశ్చయంగా, మేము: 'మీ ప్రభువును విశ్వసించండి.' అని విశ్వాసం వైపుకు పిలిచే అతని (ముహమ్మద్) యొక్క పిలుపు విని విశ్వసించాము. ఓ మా ప్రభూ! మా పాపాలను క్షమించు మరియు మాలో ఉన్న చెడులను మా నుండి తొలగించు మరియు పుణ్యాత్ములతో (ధర్మనిష్ఠాపరులతో) మిమ్మల్ని మరణింపజెయ్యి!"

Verse 194

رَبَّنَا وَءَاتِنَا مَا وَعَدتَّنَا عَلَىٰ رُسُلِكَ وَلَا تُخْزِنَا يَوْمَ ٱلْقِيَـٰمَةِ ۗ إِنَّكَ لَا تُخْلِفُ ٱلْمِيعَادَ

Transliteration rabbanā waātinā mā waʿadttanā ʿalā rusulika walā tukh'zinā yawma l-qiyāmati innaka lā tukh'lifu l-mīʿāda

Telugu "ఓ మా ప్రభూ! మరియు నీ ప్రవక్తల ద్వారా నీవు మాకు చేసిన వాగ్దానాలను పూర్తి చేయి మరియు తీర్పు దినమున మమ్మల్ని అవమాన పరచకు. నిశ్చయంగా, నీవు నీ వాగ్దానాలను భంగం చేయవు."

Verse 195

فَٱسْتَجَابَ لَهُمْ رَبُّهُمْ أَنِّى لَآ أُضِيعُ عَمَلَ عَـٰمِلٍ مِّنكُم مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ ۖ بَعْضُكُم مِّنۢ بَعْضٍ ۖ فَٱلَّذِينَ هَاجَرُوا۟ وَأُخْرِجُوا۟ مِن دِيَـٰرِهِمْ وَأُوذُوا۟ فِى سَبِيلِى وَقَـٰتَلُوا۟ وَقُتِلُوا۟ لَأُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّـَٔاتِهِمْ وَلَأُدْخِلَنَّهُمْ جَنَّـٰتٍ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ ثَوَابًا مِّنْ عِندِ ٱللَّهِ ۗ وَٱللَّهُ عِندَهُۥ حُسْنُ ٱلثَّوَابِ

Transliteration fa-is'tajāba lahum rabbuhum annī lā uḍīʿu ʿamala ʿāmilin minkum min dhakarin aw unthā baʿḍukum min baʿḍin fa-alladhīna hājarū wa-ukh'rijū min diyārihim waūdhū fī sabīlī waqātalū waqutilū la-ukaffiranna ʿanhum sayyiātihim wala-ud'khilannahum jannātin tajrī min taḥtihā l-anhāru thawāban min ʿindi l-lahi wal-lahu ʿindahu ḥus'nu l-thawābi

Telugu అప్పుడు సమాధానంగా వారి ప్రభువు, వారితో ఇలా అంటాడు: "మీలో పురుషులు గానీ, స్త్రీలు గానీ చేసిన కర్మలను నేను వ్యర్థం కానివ్వను. మీరందరూ ఒకరికొకరు (సమానులు). కనుక నా కొరకు, తమ దేశాన్ని విడిచి పెట్టి వలస పోయినవారు, తమ గృహాల నుండి తరిమి వేయబడి (నిరాశ్రయులై, దేశదిమ్మరులై), నా మార్గంలో పలుకష్టాలు పడినవారు మరియు నా కొరకు పోరాడినవారు మరియు చంపబడినవారు; నిశ్చయంగా, ఇలాంటి వారందరి చెడులను వారి నుండి తుడిచి వేస్తాను. మరియు నిశ్చయంగా, వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రేవశింపజేస్తాను; ఇది అల్లాహ్ వద్ద వారికి లభించే ప్రతిఫలం. మరియు అల్లాహ్! ఆయన వద్దనే ఉత్తమ ప్రతిఫలం ఉంది."

Verse 196

لَا يَغُرَّنَّكَ تَقَلُّبُ ٱلَّذِينَ كَفَرُوا۟ فِى ٱلْبِلَـٰدِ

Transliteration lā yaghurrannaka taqallubu alladhīna kafarū fī l-bilādi

Telugu (ఓ ప్రవక్తా!) దేశాలలో సత్యతిరస్కారుల సంచారం, నిన్ను మోసంలో పడవేయకూడదు!

Verse 197

مَتَـٰعٌ قَلِيلٌ ثُمَّ مَأْوَىٰهُمْ جَهَنَّمُ ۚ وَبِئْسَ ٱلْمِهَادُ

Transliteration matāʿun qalīlun thumma mawāhum jahannamu wabi'sa l-mihādu

Telugu ఇది వారికి కొద్దిపాటి సుఖం మాత్రమే! తరువాత వారి ఆశ్రయం నరకమే. మరియు అది అతి అధ్వాన్నమైన నివాస స్థలము.

Verse 198

لَـٰكِنِ ٱلَّذِينَ ٱتَّقَوْا۟ رَبَّهُمْ لَهُمْ جَنَّـٰتٌ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ خَـٰلِدِينَ فِيهَا نُزُلًا مِّنْ عِندِ ٱللَّهِ ۗ وَمَا عِندَ ٱللَّهِ خَيْرٌ لِّلْأَبْرَارِ

Transliteration lākini alladhīna ittaqaw rabbahum lahum jannātun tajrī min taḥtihā l-anhāru khālidīna fīhā nuzulan min ʿindi l-lahi wamā ʿinda l-lahi khayrun lil'abrāri

Telugu కాని ఎవరైతే తమ ప్రభువు నందు భయభక్తులు కలిగి ఉంటారో, వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలుంటాయి. అందులో వారు అల్లాహ్ ఆతిథ్యం పొందుతూ శాశ్వతంగా ఉంటారు. మరియు పుణ్యాత్ములకు (ధర్మనిష్ఠాపరులకు) అల్లాహ్ దగ్గర ఉన్నదే ఎంతో శ్రేష్ఠమైనది!

Verse 199

وَإِنَّ مِنْ أَهْلِ ٱلْكِتَـٰبِ لَمَن يُؤْمِنُ بِٱللَّهِ وَمَآ أُنزِلَ إِلَيْكُمْ وَمَآ أُنزِلَ إِلَيْهِمْ خَـٰشِعِينَ لِلَّهِ لَا يَشْتَرُونَ بِـَٔايَـٰتِ ٱللَّهِ ثَمَنًا قَلِيلًا ۗ أُو۟لَـٰٓئِكَ لَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ ۗ إِنَّ ٱللَّهَ سَرِيعُ ٱلْحِسَابِ

Transliteration wa-inna min ahli l-kitābi laman yu'minu bil-lahi wamā unzila ilaykum wamā unzila ilayhim khāshiʿīna lillahi lā yashtarūna biāyāti l-lahi thamanan qalīlan ulāika lahum ajruhum ʿinda rabbihim inna l-laha sarīʿu l-ḥisābi

Telugu మరియు నిశ్చయంగా, గ్రంథ ప్రజలలో, కొందరు అల్లాహ్ ను విశ్వసిస్తారు. మరియు వారు మీకు అవతరింపజేయబడిన దానిని మరియు వారికి అవతరింపజేయబడిన దానిని (సందేశాన్ని) విశ్వసించి, అల్లాహ్ కు వినమ్రులై, అల్లాహ్ సూక్తులను స్వల్పమైన మూల్యానికి అమ్ముకోరు. అలాంటి వారికి వారి ప్రభువు వద్ద ప్రతిఫలం ఉంది. నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు.

Verse 200

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱصْبِرُوا۟ وَصَابِرُوا۟ وَرَابِطُوا۟ وَٱتَّقُوا۟ ٱللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ

Transliteration yāayyuhā alladhīna āmanū iṣ'birū waṣābirū warābiṭū wa-ittaqū l-laha laʿallakum tuf'liḥūna

Telugu ఓ విశ్వాసులారా! సహనం వహించండి, మరియు (మిథ్యావాదుల ముందు స్థైర్యాన్ని చూపండి. మరియు (మాటువేసి ఉండవలసిన చోట) స్థిరంగా ఉండండి. మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి, అప్పుడే మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు!

Read Surah Ali 'Imran in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.