MyDugsiStart learning

Surah Al-Jinn in Telugu: translation and audio

Surah 72 · الجن · The Jinn · 28 verses

Surah Al-Jinn verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Al-Jinn word by word in English.

Verse 1

قُلْ أُوحِىَ إِلَىَّ أَنَّهُ ٱسْتَمَعَ نَفَرٌ مِّنَ ٱلْجِنِّ فَقَالُوٓا۟ إِنَّا سَمِعْنَا قُرْءَانًا عَجَبًا

Transliteration qul ūḥiya ilayya annahu is'tamaʿa nafarun mina l-jini faqālū innā samiʿ'nā qur'ānan ʿajaban

Telugu (ఓ ప్రవక్తా!) ఇలా అను: "నాకు ఈ విధంగా దివ్యసందేశం పంపబడింది; నిశ్చయంగా, ఒక జిన్నాతుల సమూహం - దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విని - తమ జాతి వారితో ఇలా అన్నారు: 'వాస్తవానికి మేము ఒక అద్భుతమైన పఠనం (ఖుర్ఆన్) విన్నాము!

Verse 2

يَهْدِىٓ إِلَى ٱلرُّشْدِ فَـَٔامَنَّا بِهِۦ ۖ وَلَن نُّشْرِكَ بِرَبِّنَآ أَحَدًا

Transliteration yahdī ilā l-rush'di faāmannā bihi walan nush'rika birabbinā aḥadan

Telugu అది సరైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది. కావున మేము దానిని విశ్వసించాము. మరియు మేము మా ప్రభువుకు ఎవ్వడిని కూడా భాగస్వామిగా సాటి కల్పించము.

Verse 3

وَأَنَّهُۥ تَعَـٰلَىٰ جَدُّ رَبِّنَا مَا ٱتَّخَذَ صَـٰحِبَةً وَلَا وَلَدًا

Transliteration wa-annahu taʿālā jaddu rabbinā mā ittakhadha ṣāḥibatan walā waladan

Telugu మరియు నిశ్చయంగా, మా ప్రభువు వైభవం ఎంతో ఉన్నతమైనది. ఆయన ఎవ్వడినీ భార్యగా (సాహిబతున్ గా) గానీ, కుమారునిగా గానీ చేసుకోలేదు.

Verse 4

وَأَنَّهُۥ كَانَ يَقُولُ سَفِيهُنَا عَلَى ٱللَّهِ شَطَطًا

Transliteration wa-annahu kāna yaqūlu safīhunā ʿalā l-lahi shaṭaṭan

Telugu మరియు నిశ్చయంగా, మనలోని అవివేకులు, కొందరు అల్లాహ్ విషయంలో దారుణమైన మాటలు పలుకుతున్నారు.

Verse 5

وَأَنَّا ظَنَنَّآ أَن لَّن تَقُولَ ٱلْإِنسُ وَٱلْجِنُّ عَلَى ٱللَّهِ كَذِبًا

Transliteration wa-annā ẓanannā an lan taqūla l-insu wal-jinu ʿalā l-lahi kadhiban

Telugu మరియు వాస్తవానికి మనం మానవులు గానీ, జిన్నాతులు గానీ అల్లాహ్ ను గురించి అబద్ధం పలకరని భావించేవారము.

Verse 6

وَأَنَّهُۥ كَانَ رِجَالٌ مِّنَ ٱلْإِنسِ يَعُوذُونَ بِرِجَالٍ مِّنَ ٱلْجِنِّ فَزَادُوهُمْ رَهَقًا

Transliteration wa-annahu kāna rijālun mina l-insi yaʿūdhūna birijālin mina l-jini fazādūhum rahaqan

Telugu మరియు వాస్తవానికి, మానవులలో నుండి కొందరు పురుషులు, జిన్నాతులలో నుండి కొందరు పురుషుల శరణు వేడుతూ ఉండేవారు. ఈ విధంగా వారు, వారి (జిన్నాతుల) తలబిరుసుతనం మరింత అధికమే చేసేవారు.

Verse 7

وَأَنَّهُمْ ظَنُّوا۟ كَمَا ظَنَنتُمْ أَن لَّن يَبْعَثَ ٱللَّهُ أَحَدًا

Transliteration wa-annahum ẓannū kamā ẓanantum an lan yabʿatha l-lahu aḥadan

Telugu మరియు వాస్తవానికి, వారు (మానవులు) కూడా మీరు (జిన్నాతులు) భావించినట్లు, అల్లాహ్ ఎవ్వడినీ కూడా సందేశహరునిగా పంపడని భావించారు.

Verse 8

وَأَنَّا لَمَسْنَا ٱلسَّمَآءَ فَوَجَدْنَـٰهَا مُلِئَتْ حَرَسًا شَدِيدًا وَشُهُبًا

Transliteration wa-annā lamasnā l-samāa fawajadnāhā muli-at ḥarasan shadīdan washuhuban

Telugu మరియు నిశ్చయంగా, మేము ఆకాశాలలో (రహస్యాలను) తొంగి చూడటానికి ప్రయత్నించినపుడు, మేము దానిని కఠినమైన కావలివారితో మరియు అగ్ని జ్వాలలతో నిండి ఉండటాన్ని చూశాము.

Verse 9

وَأَنَّا كُنَّا نَقْعُدُ مِنْهَا مَقَـٰعِدَ لِلسَّمْعِ ۖ فَمَن يَسْتَمِعِ ٱلْـَٔانَ يَجِدْ لَهُۥ شِهَابًا رَّصَدًا

Transliteration wa-annā kunnā naqʿudu min'hā maqāʿida lilssamʿi faman yastamiʿi l-āna yajid lahu shihāban raṣadan

Telugu మరియు వాస్తవానికి పూర్వం అక్కడి మాటలు వినటానికి మేము రహస్యంగా అక్కడ కూర్చునేవారం. కాని ఇప్పుడు ఎవడైనా (రహస్యంగా) వినే ప్రయత్నం చేస్తే, అతడి కొరకు అక్కడ ఒక అగ్నిజ్వాల పొంచి ఉంటుంది.

Verse 10

وَأَنَّا لَا نَدْرِىٓ أَشَرٌّ أُرِيدَ بِمَن فِى ٱلْأَرْضِ أَمْ أَرَادَ بِهِمْ رَبُّهُمْ رَشَدًا

Transliteration wa-annā lā nadrī asharrun urīda biman fī l-arḍi am arāda bihim rabbuhum rashadan

Telugu మరియు వాస్తవానికి భూమిలో ఉన్న వారికి ఏదైనా కీడు ఉద్దేశింపబడిందా, లేక వారి ప్రభువు వారికి సరైన మార్గం చూపగోరుతున్నాడా అనే విషయం మాకు అర్థం కావడం లేదు.

Verse 11

وَأَنَّا مِنَّا ٱلصَّـٰلِحُونَ وَمِنَّا دُونَ ذَٰلِكَ ۖ كُنَّا طَرَآئِقَ قِدَدًا

Transliteration wa-annā minnā l-ṣāliḥūna waminnā dūna dhālika kunnā ṭarāiqa qidadan

Telugu మరియు వాస్తవానికి, మనలో కొందరు సద్వర్తనులున్నారు, మరికొందరు దానికి విరుద్ధంగా ఉన్నారు. వాస్తవానికి మనం విభిన్న మార్గాలను అనుసరిస్తూ వచ్చాము.

Verse 12

وَأَنَّا ظَنَنَّآ أَن لَّن نُّعْجِزَ ٱللَّهَ فِى ٱلْأَرْضِ وَلَن نُّعْجِزَهُۥ هَرَبًا

Transliteration wa-annā ẓanannā an lan nuʿ'jiza l-laha fī l-arḍi walan nuʿ'jizahu haraban

Telugu మరియు నిశ్చయంగా, మేము అల్లాహ్ నుండి భూలోకంలో తప్పించుకోలేము, అని అర్థం చేసుకున్నాము. మరియు పారిపోయి కూడా ఆయన నుండి తప్పించుకోలేము.

Verse 13

وَأَنَّا لَمَّا سَمِعْنَا ٱلْهُدَىٰٓ ءَامَنَّا بِهِۦ ۖ فَمَن يُؤْمِنۢ بِرَبِّهِۦ فَلَا يَخَافُ بَخْسًا وَلَا رَهَقًا

Transliteration wa-annā lammā samiʿ'nā l-hudā āmannā bihi faman yu'min birabbihi falā yakhāfu bakhsan walā rahaqan

Telugu మరియు నిశ్చయంగా, మేము ఈ మార్గదర్శకత్వాన్ని (ఖుర్ఆన్ ను) విన్నప్పుడు దానిని విశ్వసించాము. కావున ఎవడైనా తన ప్రభువును విశ్వసిస్తాడో అతడికి తన సత్కర్మల ఫలితంలో నష్టాన్ని గురించీ మరియు శిక్షలో హెచ్చింపును గురించీ భయపడే అవసరం ఉండదు.

Verse 14

وَأَنَّا مِنَّا ٱلْمُسْلِمُونَ وَمِنَّا ٱلْقَـٰسِطُونَ ۖ فَمَنْ أَسْلَمَ فَأُو۟لَـٰٓئِكَ تَحَرَّوْا۟ رَشَدًا

Transliteration wa-annā minnā l-mus'limūna waminnā l-qāsiṭūna faman aslama fa-ulāika taḥarraw rashadan

Telugu మరియు నిశ్చయంగా, మనలో కొందరు అల్లాహ్ కు విధేయులైన వారు (ముస్లింలు) ఉన్నారు. మరికొందరు నిశ్చయంగా, అన్యాయపరులు (సత్యానికి దూరమైన వారు) ఉన్నారు. కావున ఎవరైతే అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) ను అవలంబించారో, అలాంటి వారే సరైన మార్గాన్ని కనుగొన్న వారు!' "

Verse 15

وَأَمَّا ٱلْقَـٰسِطُونَ فَكَانُوا۟ لِجَهَنَّمَ حَطَبًا

Transliteration wa-ammā l-qāsiṭūna fakānū lijahannama ḥaṭaban

Telugu మరియు అన్యాయపరులే (సత్యానికి దూరమైనవారు) నరకానికి ఇంధనమయ్యే వారు!

Verse 16

وَأَلَّوِ ٱسْتَقَـٰمُوا۟ عَلَى ٱلطَّرِيقَةِ لَأَسْقَيْنَـٰهُم مَّآءً غَدَقًا

Transliteration wa-allawi is'taqāmū ʿalā l-ṭarīqati la-asqaynāhum māan ghadaqan

Telugu ఒకవేళ వారు (సత్యతిరస్కారులు) ఋజుమార్గం మీద స్థిరంగా ఉన్నట్లైతే, మేము వారిపై పుష్కలంగా నీటిని కురిపించే వారము.

Verse 17

لِّنَفْتِنَهُمْ فِيهِ ۚ وَمَن يُعْرِضْ عَن ذِكْرِ رَبِّهِۦ يَسْلُكْهُ عَذَابًا صَعَدًا

Transliteration linaftinahum fīhi waman yuʿ'riḍ ʿan dhik'ri rabbihi yasluk'hu ʿadhāban ṣaʿadan

Telugu దాంతో వారిని పరీక్షించటానికి! మరియు ఎవడైతే తన ప్రభువు ధాన్యం నుండి విముఖుడవుతాడో, ఆయన వానిని తీవ్రమైన శిక్షకు గురి చేస్తాడు.

Verse 18

وَأَنَّ ٱلْمَسَـٰجِدَ لِلَّهِ فَلَا تَدْعُوا۟ مَعَ ٱللَّهِ أَحَدًا

Transliteration wa-anna l-masājida lillahi falā tadʿū maʿa l-lahi aḥadan

Telugu మరియు నిశ్చయంగా, మస్జిదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కావున వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి.

Verse 19

وَأَنَّهُۥ لَمَّا قَامَ عَبْدُ ٱللَّهِ يَدْعُوهُ كَادُوا۟ يَكُونُونَ عَلَيْهِ لِبَدًا

Transliteration wa-annahu lammā qāma ʿabdu l-lahi yadʿūhu kādū yakūnūna ʿalayhi libadan

Telugu మరియు నిశ్చయంగా, అల్లాహ్ యొక్క దాసుడు (ముహమ్మద్) ఆయన (అల్లాహ్)ను ప్రార్థించటానికి నిలబడి నప్పుడు, వారు (జిన్నాతులు) అతన చుట్టు దట్టంగా (అతని ఖుర్ఆన్ పఠనాన్ని వినటానికి) గుమి గూడుతారు.

Verse 20

قُلْ إِنَّمَآ أَدْعُوا۟ رَبِّى وَلَآ أُشْرِكُ بِهِۦٓ أَحَدًا

Transliteration qul innamā adʿū rabbī walā ush'riku bihi aḥadan

Telugu వారితో ఇలా అను: "నిశ్చయంగా నేను నా ప్రభువును మాత్రమే ప్రార్థిస్తాను మరియు ఆయనకు ఎవ్వరినీ సాటి కల్పించను."

Verse 21

قُلْ إِنِّى لَآ أَمْلِكُ لَكُمْ ضَرًّا وَلَا رَشَدًا

Transliteration qul innī lā amliku lakum ḍarran walā rashadan

Telugu వారితో ఇలా అను: "నిశ్చయంగా, మీకు కీడు చేయటం గానీ, లేదా సరైన మార్గం చూపటం గానీ నా వశంలో లేదు."

Verse 22

قُلْ إِنِّى لَن يُجِيرَنِى مِنَ ٱللَّهِ أَحَدٌ وَلَنْ أَجِدَ مِن دُونِهِۦ مُلْتَحَدًا

Transliteration qul innī lan yujīranī mina l-lahi aḥadun walan ajida min dūnihi mul'taḥadan

Telugu ఇంకా ఇలా అను: "నిశ్చయంగా, నన్ను అల్లాహ్ నుండి ఎవ్వడునూ కాపాడలేడు మరియు నాకు ఆయన తప్ప మరొకరి ఆశ్రయం కూడా లేదు;

Verse 23

إِلَّا بَلَـٰغًا مِّنَ ٱللَّهِ وَرِسَـٰلَـٰتِهِۦ ۚ وَمَن يَعْصِ ٱللَّهَ وَرَسُولَهُۥ فَإِنَّ لَهُۥ نَارَ جَهَنَّمَ خَـٰلِدِينَ فِيهَآ أَبَدًا

Transliteration illā balāghan mina l-lahi warisālātihi waman yaʿṣi l-laha warasūlahu fa-inna lahu nāra jahannama khālidīna fīhā abadan

Telugu (నా పని) కేవలం అల్లాహ్ ఉపదేశాన్ని మరియు ఆయన సందేశాన్ని అందజేయటమే!" ఇక ఎవడైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘిస్తాడో! అతడు నిశ్చయంగా, నరకాగ్నికి గురి అవుతాడు; అందులో శాశ్వతంగా కలకాలం ఉంటాడు.

Verse 24

حَتَّىٰٓ إِذَا رَأَوْا۟ مَا يُوعَدُونَ فَسَيَعْلَمُونَ مَنْ أَضْعَفُ نَاصِرًا وَأَقَلُّ عَدَدًا

Transliteration ḥattā idhā ra-aw mā yūʿadūna fasayaʿlamūna man aḍʿafu nāṣiran wa-aqallu ʿadadan

Telugu చివరకు వారికి వాగ్దానం చేయబడిన దానిని వారు చూసినప్పుడు, ఎవరి సహాయకులు బలహీనులో, మరెవరి వర్గం సంఖ్యాపరంగా తక్కువో వారికి తెలిసి పోతుంది.

Verse 25

قُلْ إِنْ أَدْرِىٓ أَقَرِيبٌ مَّا تُوعَدُونَ أَمْ يَجْعَلُ لَهُۥ رَبِّىٓ أَمَدًا

Transliteration qul in adrī aqarībun mā tūʿadūna am yajʿalu lahu rabbī amadan

Telugu ఇలా అను: "మీకు వాగ్దానం చేయబడినది (శిక్ష) సమీపంలోనే రానున్నదో, లేక దాని కొరకు నా ప్రభువు దీర్ఘకాల వ్యవధి నియమించాడో నాకు తెలియదు."

Verse 26

عَـٰلِمُ ٱلْغَيْبِ فَلَا يُظْهِرُ عَلَىٰ غَيْبِهِۦٓ أَحَدًا

Transliteration ʿālimu l-ghaybi falā yuẓ'hiru ʿalā ghaybihi aḥadan

Telugu ఆయనే అగోచర జ్ఞానం గలవాడు, కావున ఆయన అగోచర విషయాలు ఎవ్వడికీ తెలియజేయడు -

Verse 27

إِلَّا مَنِ ٱرْتَضَىٰ مِن رَّسُولٍ فَإِنَّهُۥ يَسْلُكُ مِنۢ بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِۦ رَصَدًا

Transliteration illā mani ir'taḍā min rasūlin fa-innahu yasluku min bayni yadayhi wamin khalfihi raṣadan

Telugu తాను కోరి ఎన్నుకొన్న ప్రవక్తకు తప్ప - ఎందుకంటే, ఆయన నిశ్చయంగా, అతని (ఆ ప్రవక్త) ముందు మరియు వెనుక రక్షకభటులను నియమిస్తాడు.

Verse 28

لِّيَعْلَمَ أَن قَدْ أَبْلَغُوا۟ رِسَـٰلَـٰتِ رَبِّهِمْ وَأَحَاطَ بِمَا لَدَيْهِمْ وَأَحْصَىٰ كُلَّ شَىْءٍ عَدَدًۢا

Transliteration liyaʿlama an qad ablaghū risālāti rabbihim wa-aḥāṭa bimā ladayhim wa-aḥṣā kulla shayin ʿadadan

Telugu వారు, (ప్రవక్తలు) తమ ప్రభువు యొక్క సందేశాలను యథాతథంగా అందజేస్తున్నారని పరిశీలించడానికి. మరియు ఆయన వారి అన్ని విషయాలను పరివేష్టించి ఉన్నాడు మరియు ఆయన ప్రతి ఒక్క విషయాన్ని లెక్క పెట్టి ఉంచుతాడు.

Read Surah Al-Jinn in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.