MyDugsiStart learning

Surah Al-Hujurat in Telugu: translation and audio

Surah 49 · الحجرات · The Rooms · 18 verses

Surah Al-Hujurat verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Al-Hujurat word by word in English.

Verse 1

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تُقَدِّمُوا۟ بَيْنَ يَدَىِ ٱللَّهِ وَرَسُولِهِۦ ۖ وَٱتَّقُوا۟ ٱللَّهَ ۚ إِنَّ ٱللَّهَ سَمِيعٌ عَلِيمٌ

Transliteration yāayyuhā alladhīna āmanū lā tuqaddimū bayna yadayi l-lahi warasūlihi wa-ittaqū l-laha inna l-laha samīʿun ʿalīmun

Telugu ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అనుమతికి ముందే నిర్ణయాలకు దిగకండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ అంతా వినేవాడు, సర్వజ్ఞుడు.

Verse 2

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَرْفَعُوٓا۟ أَصْوَٰتَكُمْ فَوْقَ صَوْتِ ٱلنَّبِىِّ وَلَا تَجْهَرُوا۟ لَهُۥ بِٱلْقَوْلِ كَجَهْرِ بَعْضِكُمْ لِبَعْضٍ أَن تَحْبَطَ أَعْمَـٰلُكُمْ وَأَنتُمْ لَا تَشْعُرُونَ

Transliteration yāayyuhā alladhīna āmanū lā tarfaʿū aṣwātakum fawqa ṣawti l-nabiyi walā tajharū lahu bil-qawli kajahri baʿḍikum libaʿḍin an taḥbaṭa aʿmālukum wa-antum lā tashʿurūna

Telugu ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాలను, ప్రవక్త కంఠస్వరాని కంటే పెంచకండి మరియు మీరు పరస్పరం ఒకరితో నొకరు విచ్చలవిడిగా మాట్లాడుకునే విధంగా అతనితో మాట్లాడకండి, దాని వల్ల మీకు తెలియకుండానే, మీ కర్మలు వ్యర్థం కావచ్చు!

Verse 3

إِنَّ ٱلَّذِينَ يَغُضُّونَ أَصْوَٰتَهُمْ عِندَ رَسُولِ ٱللَّهِ أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ ٱمْتَحَنَ ٱللَّهُ قُلُوبَهُمْ لِلتَّقْوَىٰ ۚ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ

Transliteration inna alladhīna yaghuḍḍūna aṣwātahum ʿinda rasūli l-lahi ulāika alladhīna im'taḥana l-lahu qulūbahum lilttaqwā lahum maghfiratun wa-ajrun ʿaẓīmun

Telugu నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశహరుని సన్నిధిలో తమ కంఠస్వరాలను తగ్గిస్తారో, అలాంటి వారి హృదయాలను అల్లాహ్ భయభక్తుల కొరకు పరీక్షించి ఉన్నాడు. వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి.

Verse 4

إِنَّ ٱلَّذِينَ يُنَادُونَكَ مِن وَرَآءِ ٱلْحُجُرَٰتِ أَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ

Transliteration inna alladhīna yunādūnaka min warāi l-ḥujurāti aktharuhum lā yaʿqilūna

Telugu (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, ఎవరైతే, నిన్ను గృహాల బయట నుండి బిగ్గరగా (అరుస్తూ) పిలుస్తారో, వారిలో చాలా మంది బుద్ధిహీనులే.

Verse 5

وَلَوْ أَنَّهُمْ صَبَرُوا۟ حَتَّىٰ تَخْرُجَ إِلَيْهِمْ لَكَانَ خَيْرًا لَّهُمْ ۚ وَٱللَّهُ غَفُورٌ رَّحِيمٌ

Transliteration walaw annahum ṣabarū ḥattā takhruja ilayhim lakāna khayran lahum wal-lahu ghafūrun raḥīmun

Telugu మరియు ఒకవేళ వారు నీవు బయటకు వచ్చే వరకు ఓపిక పట్టి వుంటే, అది వారికే మేలై ఉండేది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

Verse 6

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِن جَآءَكُمْ فَاسِقٌۢ بِنَبَإٍ فَتَبَيَّنُوٓا۟ أَن تُصِيبُوا۟ قَوْمًۢا بِجَهَـٰلَةٍ فَتُصْبِحُوا۟ عَلَىٰ مَا فَعَلْتُمْ نَـٰدِمِينَ

Transliteration yāayyuhā alladhīna āmanū in jāakum fāsiqun binaba-in fatabayyanū an tuṣībū qawman bijahālatin fatuṣ'biḥū ʿalā mā faʿaltum nādimīna

Telugu ఓ విశ్వాసులారా! ఎవడైనా ఒక అవిధేయుడు (ఫాసిఖ్), మీ వద్దకు ఏదైనా వార్త తెస్తే, మీరు - మీకు తెలియకుండానే జనులకు నష్టం కలిగించి, మీరు చేసిన దానికి పశ్చాత్తాప పడవలసిన స్థితి రాకముందే - నిజానిజాలను విచారించి తెలుసుకోండి.

Verse 7

وَٱعْلَمُوٓا۟ أَنَّ فِيكُمْ رَسُولَ ٱللَّهِ ۚ لَوْ يُطِيعُكُمْ فِى كَثِيرٍ مِّنَ ٱلْأَمْرِ لَعَنِتُّمْ وَلَـٰكِنَّ ٱللَّهَ حَبَّبَ إِلَيْكُمُ ٱلْإِيمَـٰنَ وَزَيَّنَهُۥ فِى قُلُوبِكُمْ وَكَرَّهَ إِلَيْكُمُ ٱلْكُفْرَ وَٱلْفُسُوقَ وَٱلْعِصْيَانَ ۚ أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلرَّٰشِدُونَ

Transliteration wa-iʿ'lamū anna fīkum rasūla l-lahi law yuṭīʿukum fī kathīrin mina l-amri laʿanittum walākinna l-laha ḥabbaba ilaykumu l-īmāna wazayyanahu fī qulūbikum wakarraha ilaykumu l-kuf'ra wal-fusūqa wal-ʿiṣ'yāna ulāika humu l-rāshidūna

Telugu మరియు మీ మధ్య అల్లాహ్ యొక్క సందేశహరుడు ఉన్నాడనే విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ అతన చాలా విషయాలలో మీ మాటనే వింటే మీరే ఆపదలో పడవచ్చు. కానీ అల్లాహ్ మీకు విశ్వాసం పట్ల ప్రేమ కలిగించాడు మరియు దానిని మీ హృదయాలకు ఆకర్షణీయమైనదిగా చేశాడు. మరియు సత్యతిరస్కారాన్ని, అవిధేయతను మరియు దుర్నడతను (ఆజ్ఞోల్లంఘనను) మీకు అసహ్యకరమైనదిగా చేశాడు. అలాంటి వారే సరైన మార్గదర్శకత్వం పొందినవారు.

Verse 8

فَضْلًا مِّنَ ٱللَّهِ وَنِعْمَةً ۚ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٌ

Transliteration faḍlan mina l-lahi waniʿ'matan wal-lahu ʿalīmun ḥakīmun

Telugu అది అల్లాహ్ తరఫు నుండి వారికి లభించిన అనుగ్రహం మరియు ఉపకారం. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

Verse 9

وَإِن طَآئِفَتَانِ مِنَ ٱلْمُؤْمِنِينَ ٱقْتَتَلُوا۟ فَأَصْلِحُوا۟ بَيْنَهُمَا ۖ فَإِنۢ بَغَتْ إِحْدَىٰهُمَا عَلَى ٱلْأُخْرَىٰ فَقَـٰتِلُوا۟ ٱلَّتِى تَبْغِى حَتَّىٰ تَفِىٓءَ إِلَىٰٓ أَمْرِ ٱللَّهِ ۚ فَإِن فَآءَتْ فَأَصْلِحُوا۟ بَيْنَهُمَا بِٱلْعَدْلِ وَأَقْسِطُوٓا۟ ۖ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلْمُقْسِطِينَ

Transliteration wa-in ṭāifatāni mina l-mu'minīna iq'tatalū fa-aṣliḥū baynahumā fa-in baghat iḥ'dāhumā ʿalā l-ukh'rā faqātilū allatī tabghī ḥattā tafīa ilā amri l-lahi fa-in fāat fa-aṣliḥū baynahumā bil-ʿadli wa-aqsiṭū inna l-laha yuḥibbu l-muq'siṭīna

Telugu మరియు ఒకవేళ విశ్వాసులలోని రెండు వర్గాల వారు పరస్పరం కలహించుకుంటే, వారిద్దరి మధ్య సంధి చేయించండి. కాని ఒకవేళ, వారిలోని ఒక వర్గం వారు రెండవ వర్గం వారిపై దౌర్జన్యం చేస్తే, దౌర్జన్యం చేసిన వారు, అల్లాహ్ ఆజ్ఞ వైపునకు మరలే వరకు, వారికి వ్యతిరేకంగా పోరాడండి. తరువాత వారు మరలి వస్తే, వారి మధ్య న్యాయంగా సంధి చేయించండి మరియు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. నిశ్చయంగా, అల్లాహ్ నిష్పక్షపాతంగా వ్యవహరించే వారిని ప్రేమిస్తాడు.

Verse 10

إِنَّمَا ٱلْمُؤْمِنُونَ إِخْوَةٌ فَأَصْلِحُوا۟ بَيْنَ أَخَوَيْكُمْ ۚ وَٱتَّقُوا۟ ٱللَّهَ لَعَلَّكُمْ تُرْحَمُونَ

Transliteration innamā l-mu'minūna ikh'watun fa-aṣliḥū bayna akhawaykum wa-ittaqū l-laha laʿallakum tur'ḥamūna

Telugu వాస్తవానికి విశ్వాసులు పరస్పరం సహోదరులు, కావున మీ సహోదరుల మధ్య సంధి చేయించండి. మరియు మీరు కరుణించ బడాలంటే అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి.

Verse 11

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا يَسْخَرْ قَوْمٌ مِّن قَوْمٍ عَسَىٰٓ أَن يَكُونُوا۟ خَيْرًا مِّنْهُمْ وَلَا نِسَآءٌ مِّن نِّسَآءٍ عَسَىٰٓ أَن يَكُنَّ خَيْرًا مِّنْهُنَّ ۖ وَلَا تَلْمِزُوٓا۟ أَنفُسَكُمْ وَلَا تَنَابَزُوا۟ بِٱلْأَلْقَـٰبِ ۖ بِئْسَ ٱلِٱسْمُ ٱلْفُسُوقُ بَعْدَ ٱلْإِيمَـٰنِ ۚ وَمَن لَّمْ يَتُبْ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلظَّـٰلِمُونَ

Transliteration yāayyuhā alladhīna āmanū lā yaskhar qawmun min qawmin ʿasā an yakūnū khayran min'hum walā nisāon min nisāin ʿasā an yakunna khayran min'hunna walā talmizū anfusakum walā tanābazū bil-alqābi bi'sa l-s'mu l-fusūqu baʿda l-īmāni waman lam yatub fa-ulāika humu l-ẓālimūna

Telugu ఓ విశ్వాసులారా! మీలో ఎవరూ (పురుషులు) ఇతరులెవరినీ ఎగతాళి చేయరాదు. బహుశా వారే (ఎగతాళి చేయబడే వారే) వీరి కంటే శ్రేష్ఠులు కావచ్చు! అదే విధంగా స్త్రీలు కూడా ఇతర స్త్రీలను ఎగతాళి చేయరాదు. బహశా వారే (ఎగతాళి చేయబడే స్త్రీలే) వీరి కంటే శ్రేష్ఠురాండ్రు కావచ్చు! మీరు పరస్పరం ఎత్తి పొడుచుకోకండి మరియు చెడ్డ పేర్లతో పిలుచుకోకండి. విశ్వసించిన తర్వాత ఒకనిని చెడ్డ పేరుతో పిలవటం ఎంతో నీచమైన విషయం మరియు (ఇలా చేసిన పిదప) పశ్చాత్తాప పడకుంటే, అలాంటి వారు చాలా దుర్మార్గులు.

Verse 12

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱجْتَنِبُوا۟ كَثِيرًا مِّنَ ٱلظَّنِّ إِنَّ بَعْضَ ٱلظَّنِّ إِثْمٌ ۖ وَلَا تَجَسَّسُوا۟ وَلَا يَغْتَب بَّعْضُكُم بَعْضًا ۚ أَيُحِبُّ أَحَدُكُمْ أَن يَأْكُلَ لَحْمَ أَخِيهِ مَيْتًا فَكَرِهْتُمُوهُ ۚ وَٱتَّقُوا۟ ٱللَّهَ ۚ إِنَّ ٱللَّهَ تَوَّابٌ رَّحِيمٌ

Transliteration yāayyuhā alladhīna āmanū ij'tanibū kathīran mina l-ẓani inna baʿḍa l-ẓani ith'mun walā tajassasū walā yaghtab baʿḍukum baʿḍan ayuḥibbu aḥadukum an yakula laḥma akhīhi maytan fakarih'tumūhu wa-ittaqū l-laha inna l-laha tawwābun raḥīmun

Telugu ఓ విశ్వాసులారా! అతిగా అనుమానించడం నుండి దూరంగా ఉండండి, ఎందుకంటే కొన్ని అనుమానాలే నిశ్చయంగా పాపాలు. మరియు మీరు మీ పరస్పర రహస్యాలను తెలుసుకోవటానికి ప్రయత్నించకండి మరియు చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవడైనా చచ్చిన తన సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? మీరు దానిని అసహ్యించుకుంటారు కదా! అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత.

Verse 13

يَـٰٓأَيُّهَا ٱلنَّاسُ إِنَّا خَلَقْنَـٰكُم مِّن ذَكَرٍ وَأُنثَىٰ وَجَعَلْنَـٰكُمْ شُعُوبًا وَقَبَآئِلَ لِتَعَارَفُوٓا۟ ۚ إِنَّ أَكْرَمَكُمْ عِندَ ٱللَّهِ أَتْقَىٰكُمْ ۚ إِنَّ ٱللَّهَ عَلِيمٌ خَبِيرٌ

Transliteration yāayyuhā l-nāsu innā khalaqnākum min dhakarin wa-unthā wajaʿalnākum shuʿūban waqabāila litaʿārafū inna akramakum ʿinda l-lahi atqākum inna l-laha ʿalīmun khabīrun

Telugu ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము. మరియు మీరు ఒకరి నొకరు గుర్తించుకోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము. నిశ్చయంగా, మీలో ఎక్కువ దైవభీతి గలవాడే, అల్లాహ్ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు.

Verse 14

۞ قَالَتِ ٱلْأَعْرَابُ ءَامَنَّا ۖ قُل لَّمْ تُؤْمِنُوا۟ وَلَـٰكِن قُولُوٓا۟ أَسْلَمْنَا وَلَمَّا يَدْخُلِ ٱلْإِيمَـٰنُ فِى قُلُوبِكُمْ ۖ وَإِن تُطِيعُوا۟ ٱللَّهَ وَرَسُولَهُۥ لَا يَلِتْكُم مِّنْ أَعْمَـٰلِكُمْ شَيْـًٔا ۚ إِنَّ ٱللَّهَ غَفُورٌ رَّحِيمٌ

Transliteration qālati l-aʿrābu āmannā qul lam tu'minū walākin qūlū aslamnā walammā yadkhuli l-īmānu fī qulūbikum wa-in tuṭīʿū l-laha warasūlahu lā yalit'kum min aʿmālikum shayan inna l-laha ghafūrun raḥīmun

Telugu ఎడారి వాసులు (బద్దూలు): "మేము విశ్వసించాము." అని అంటారు. (ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "మీరు ఇంకా విశ్వసించలేదు కావున: 'మేము విధేయులం (ముస్లింలం) అయ్యాము.' అని అనండి. ఎందుకంటే విశ్వాసం (ఈమాన్) మీ హృదయాలలోకి ఇంకా ప్రవేశించలేదు. ఒకవేళ మీరు అల్లాహ్ యొక్క మరియు ఆయన ప్రవక్త యొక్క ఆజ్ఞాపాలన చేస్తే, ఆయన మీ కర్మలను ఏ మాత్రం వృథా కానివ్వడు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత."

Verse 15

إِنَّمَا ٱلْمُؤْمِنُونَ ٱلَّذِينَ ءَامَنُوا۟ بِٱللَّهِ وَرَسُولِهِۦ ثُمَّ لَمْ يَرْتَابُوا۟ وَجَـٰهَدُوا۟ بِأَمْوَٰلِهِمْ وَأَنفُسِهِمْ فِى سَبِيلِ ٱللَّهِ ۚ أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلصَّـٰدِقُونَ

Transliteration innamā l-mu'minūna alladhīna āmanū bil-lahi warasūlihi thumma lam yartābū wajāhadū bi-amwālihim wa-anfusihim fī sabīli l-lahi ulāika humu l-ṣādiqūna

Telugu వాస్తవానికి, ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసించి, ఆ తరువాత ఏ అనుమానానికి లోను కాకుండా, అల్లాహ్ మార్గంలో, తమ సిరిసంపదలతో మరియు ప్రాణాలతో పోరాడుతారో! అలాంటి వారు, వారే! సత్యవంతులు.

Verse 16

قُلْ أَتُعَلِّمُونَ ٱللَّهَ بِدِينِكُمْ وَٱللَّهُ يَعْلَمُ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۚ وَٱللَّهُ بِكُلِّ شَىْءٍ عَلِيمٌ

Transliteration qul atuʿallimūna l-laha bidīnikum wal-lahu yaʿlamu mā fī l-samāwāti wamā fī l-arḍi wal-lahu bikulli shayin ʿalīmun

Telugu వారితో ఇలా అను: "ఏమిటి? మీరు అల్లాహ్ కు మీ ధర్మస్వీకారం గురించి తెలియజేస్తున్నారా? ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు."

Verse 17

يَمُنُّونَ عَلَيْكَ أَنْ أَسْلَمُوا۟ ۖ قُل لَّا تَمُنُّوا۟ عَلَىَّ إِسْلَـٰمَكُم ۖ بَلِ ٱللَّهُ يَمُنُّ عَلَيْكُمْ أَنْ هَدَىٰكُمْ لِلْإِيمَـٰنِ إِن كُنتُمْ صَـٰدِقِينَ

Transliteration yamunnūna ʿalayka an aslamū qul lā tamunnū ʿalayya is'lāmakum bali l-lahu yamunnu ʿalaykum an hadākum lil'īmāni in kuntum ṣādiqīna

Telugu (ఓ ముహమ్మద్!) వారు ఇస్లాంను స్వీకరించి, నీకు ఉపకారం చేసినట్లు వ్యవహరిస్తున్నారు. వారితో ఇలా అను: "మీరు ఇస్లాంను స్వీకరించి నాకు ఎలాంటి ఉపకారం చేయలేదు! వాస్తవానికి, మీరు సత్యవంతులే అయితే! మీకు విశ్వాసం వైపునకు మార్గదర్శకత్వం చేసి, అల్లాహ్ యే మీకు ఉపకారం చేశాడని తెలుసుకోండి."

Verse 18

إِنَّ ٱللَّهَ يَعْلَمُ غَيْبَ ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَٱللَّهُ بَصِيرٌۢ بِمَا تَعْمَلُونَ

Transliteration inna l-laha yaʿlamu ghayba l-samāwāti wal-arḍi wal-lahu baṣīrun bimā taʿmalūna

Telugu నిశ్చయంగా, అల్లాహ్! ఆకాశాలలో మరియు భూమిలోనున్న అగోచర విషయాలన్నింటినీ ఎరుగును. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు.

Read Surah Al-Hujurat in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.