Surah Al-Hashr in Telugu: translation and audio
Surah 59 · الحشر · The Exile · 24 verses
Surah Al-Hashr verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Al-Hashr word by word in English.
Verse 1
سَبَّحَ لِلَّهِ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۖ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ
Transliteration sabbaḥa lillahi mā fī l-samāwāti wamā fī l-arḍi wahuwa l-ʿazīzu l-ḥakīmu
Telugu ఆకాశాలలో నున్న సమస్తమూ మరియు భూమిలో నున్న సమస్తమూ, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతుంటాయి. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
Verse 2
هُوَ ٱلَّذِىٓ أَخْرَجَ ٱلَّذِينَ كَفَرُوا۟ مِنْ أَهْلِ ٱلْكِتَـٰبِ مِن دِيَـٰرِهِمْ لِأَوَّلِ ٱلْحَشْرِ ۚ مَا ظَنَنتُمْ أَن يَخْرُجُوا۟ ۖ وَظَنُّوٓا۟ أَنَّهُم مَّانِعَتُهُمْ حُصُونُهُم مِّنَ ٱللَّهِ فَأَتَىٰهُمُ ٱللَّهُ مِنْ حَيْثُ لَمْ يَحْتَسِبُوا۟ ۖ وَقَذَفَ فِى قُلُوبِهِمُ ٱلرُّعْبَ ۚ يُخْرِبُونَ بُيُوتَهُم بِأَيْدِيهِمْ وَأَيْدِى ٱلْمُؤْمِنِينَ فَٱعْتَبِرُوا۟ يَـٰٓأُو۟لِى ٱلْأَبْصَـٰرِ
Transliteration huwa alladhī akhraja alladhīna kafarū min ahli l-kitābi min diyārihim li-awwali l-ḥashri mā ẓanantum an yakhrujū waẓannū annahum māniʿatuhum ḥuṣūnuhum mina l-lahi fa-atāhumu l-lahu min ḥaythu lam yaḥtasibū waqadhafa fī qulūbihimu l-ruʿ'ba yukh'ribūna buyūtahum bi-aydīhim wa-aydī l-mu'minīna fa-iʿ'tabirū yāulī l-abṣāri
Telugu గ్రంథ ప్రజలలోని సత్యతిరస్కారులను మొదట సమీకరించిన (బనూ నదీర్ తెగ) వారిని, వారి గృహాల నుండి వెళ్లగొట్టినవాడు ఆయనే. వారు వెళ్ళిపోతారని మీరు ఏ మాత్రం భావించలేదు. మరియు అల్లాహ్ నుండి తమను తమ కోటలు తప్పక రక్షిస్తాయని వారు భావించారు! కాని అల్లాహ్ (శిక్ష) వారు ఊహించని వైపు నుండి, వారిపై వచ్చి పడింది. మరియు ఆయన వారి హృదయాలలో భయం కలుగజేశాడు, కావున వారు తమ ఇండ్లను తమ చేతులారా మరియు విశ్వాసుల చేతులతో కూడా, నాశనం చేయించుకున్నారు. కావున ఓ పరిజ్ఞానం (కళ్ళు) గల వారలారా! గుణపాఠం నేర్చుకోండి.
Verse 3
وَلَوْلَآ أَن كَتَبَ ٱللَّهُ عَلَيْهِمُ ٱلْجَلَآءَ لَعَذَّبَهُمْ فِى ٱلدُّنْيَا ۖ وَلَهُمْ فِى ٱلْـَٔاخِرَةِ عَذَابُ ٱلنَّارِ
Transliteration walawlā an kataba l-lahu ʿalayhimu l-jalāa laʿadhabahum fī l-dun'yā walahum fī l-ākhirati ʿadhābu l-nāri
Telugu మరియు ఒకవేళ అల్లాహ్ వారి విషయంలో దేశ బహిష్కారం వ్రాసి ఉండకపోతే, వారిని ఈ ప్రపంచములోనే శిక్షిచి ఉండేవాడు. మరియు వారికి పరలోకంలో నరకాగ్ని శిక్ష పడుతుంది.
Verse 4
ذَٰلِكَ بِأَنَّهُمْ شَآقُّوا۟ ٱللَّهَ وَرَسُولَهُۥ ۖ وَمَن يُشَآقِّ ٱللَّهَ فَإِنَّ ٱللَّهَ شَدِيدُ ٱلْعِقَابِ
Transliteration dhālika bi-annahum shāqqū l-laha warasūlahu waman yushāqqi l-laha fa-inna l-laha shadīdu l-ʿiqābi
Telugu ఇది ఎందుకంటే, వారు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకించారు. మరియు అల్లాహ్ ను వ్యతిరేకించిన వాడిని శిక్షించటంలో నిశ్చయంగా, అల్లాహ్ చాలా కఠినుడు.
Verse 5
مَا قَطَعْتُم مِّن لِّينَةٍ أَوْ تَرَكْتُمُوهَا قَآئِمَةً عَلَىٰٓ أُصُولِهَا فَبِإِذْنِ ٱللَّهِ وَلِيُخْزِىَ ٱلْفَـٰسِقِينَ
Transliteration mā qaṭaʿtum min līnatin aw taraktumūhā qāimatan ʿalā uṣūlihā fabi-idh'ni l-lahi waliyukh'ziya l-fāsiqīna
Telugu (ఓ విశ్వాసులారా!) మీరు ఏ ఖర్జూరపు చెట్లను నరికివేశారో లేక ఏ ఖర్జూరపు చెట్లను వాటి వ్రేళ్ళ మీద నిలబడేలా వదలి పెట్టారో, అంతా అల్లాహ్ ఆజ్ఞతోనే జరిగింది. మరియు ఇదంతా అవిధేయులను అవమానించటానికి జరిగిన విషయం.
Verse 6
وَمَآ أَفَآءَ ٱللَّهُ عَلَىٰ رَسُولِهِۦ مِنْهُمْ فَمَآ أَوْجَفْتُمْ عَلَيْهِ مِنْ خَيْلٍ وَلَا رِكَابٍ وَلَـٰكِنَّ ٱللَّهَ يُسَلِّطُ رُسُلَهُۥ عَلَىٰ مَن يَشَآءُ ۚ وَٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍ قَدِيرٌ
Transliteration wamā afāa l-lahu ʿalā rasūlihi min'hum famā awjaftum ʿalayhi min khaylin walā rikābin walākinna l-laha yusalliṭu rusulahu ʿalā man yashāu wal-lahu ʿalā kulli shayin qadīrun
Telugu మరియు అల్లాహ్ తన ప్రవక్తకు వారి నుండి ఇప్పించిన ఫయ్అ కొరకు, మీరు గుర్రాలను గానీ ఒంటెలను గానీ పరిగెత్తించలేదు. కాని అల్లాహ్ తాను కోరిన వారిపై, తన సందేశహరునికి ఆధిక్యత నొనంగుతాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.
Verse 7
مَّآ أَفَآءَ ٱللَّهُ عَلَىٰ رَسُولِهِۦ مِنْ أَهْلِ ٱلْقُرَىٰ فَلِلَّهِ وَلِلرَّسُولِ وَلِذِى ٱلْقُرْبَىٰ وَٱلْيَتَـٰمَىٰ وَٱلْمَسَـٰكِينِ وَٱبْنِ ٱلسَّبِيلِ كَىْ لَا يَكُونَ دُولَةًۢ بَيْنَ ٱلْأَغْنِيَآءِ مِنكُمْ ۚ وَمَآ ءَاتَىٰكُمُ ٱلرَّسُولُ فَخُذُوهُ وَمَا نَهَىٰكُمْ عَنْهُ فَٱنتَهُوا۟ ۚ وَٱتَّقُوا۟ ٱللَّهَ ۖ إِنَّ ٱللَّهَ شَدِيدُ ٱلْعِقَابِ
Transliteration mā afāa l-lahu ʿalā rasūlihi min ahli l-qurā falillahi walilrrasūli walidhī l-qur'bā wal-yatāmā wal-masākīni wa-ib'ni l-sabīli kay lā yakūna dūlatan bayna l-aghniyāi minkum wamā ātākumu l-rasūlu fakhudhūhu wamā nahākum ʿanhu fa-intahū wa-ittaqū l-laha inna l-laha shadīdu l-ʿiqābi
Telugu అల్లాహ్ తన ప్రవక్తకు ఆ నగరవాసుల నుండి ఇప్పించిన దానిలో (ఫయ్అ లో) అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు మరియు అతని దగ్గరి బంధువులకు మరియు అనాథులకు మరియు పేదలకు మరియు బాటసారులకు హక్కు ఉంది. అది మీలో ధనవంతులైన వారి మధ్యనే తిరగకుండా ఉండటానికి, ఇలా నిర్ణయించబడింది. మరియు ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి మరియు అతను మీకు నిషేధించిన దానికి దూరంగా ఉండండి. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ శిక్షించటంలో చాలా కఠినుడు.
Verse 8
لِلْفُقَرَآءِ ٱلْمُهَـٰجِرِينَ ٱلَّذِينَ أُخْرِجُوا۟ مِن دِيَـٰرِهِمْ وَأَمْوَٰلِهِمْ يَبْتَغُونَ فَضْلًا مِّنَ ٱللَّهِ وَرِضْوَٰنًا وَيَنصُرُونَ ٱللَّهَ وَرَسُولَهُۥٓ ۚ أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلصَّـٰدِقُونَ
Transliteration lil'fuqarāi l-muhājirīna alladhīna ukh'rijū min diyārihim wa-amwālihim yabtaghūna faḍlan mina l-lahi wariḍ'wānan wayanṣurūna l-laha warasūlahu ulāika humu l-ṣādiqūna
Telugu (దానిలో నుండి కొంతభాగంపై) తమ ఇండ్ల నుండి మరియు తమ ఆస్తిపాస్తుల నుండి వెడలగొట్టబడి, వలస వచ్చిన (ముహాజిర్ లకు) పేదవారికి కూడా హక్కు ఉంది. వారు అల్లాహ్ అనుగ్రహాన్ని మరియు ఆయన ప్రసన్నతను కోరుతున్నారు. మరియు వారు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు సహాయం చేస్తున్నారు. ఇలాంటి వారు, వీరే సత్యవంతులు.
Verse 9
وَٱلَّذِينَ تَبَوَّءُو ٱلدَّارَ وَٱلْإِيمَـٰنَ مِن قَبْلِهِمْ يُحِبُّونَ مَنْ هَاجَرَ إِلَيْهِمْ وَلَا يَجِدُونَ فِى صُدُورِهِمْ حَاجَةً مِّمَّآ أُوتُوا۟ وَيُؤْثِرُونَ عَلَىٰٓ أَنفُسِهِمْ وَلَوْ كَانَ بِهِمْ خَصَاصَةٌ ۚ وَمَن يُوقَ شُحَّ نَفْسِهِۦ فَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْمُفْلِحُونَ
Transliteration wa-alladhīna tabawwaū l-dāra wal-īmāna min qablihim yuḥibbūna man hājara ilayhim walā yajidūna fī ṣudūrihim ḥājatan mimmā ūtū wayu'thirūna ʿalā anfusihim walaw kāna bihim khaṣāṣatun waman yūqa shuḥḥa nafsihi fa-ulāika humu l-muf'liḥūna
Telugu మరియు ఎవరైతే - ఈ (వలస వచ్చినవారు) రాకపూర్వమే - విశ్వసించి వలస కేంద్రం (మదీనా)లో నివసిస్తూ ఉండేవారో! వారికి కూడా హక్కు వుంది. వారు తమ వద్దకు వలస వచ్చిన వారిని ప్రేమిస్తారు. మరియు వారు (వలస వచ్చిన) వారికి ఏది ఇవ్వబడినా! దాని అవసరం తమకు ఉన్నట్లు భావించరు. మరియు తమకు అవసరమున్నా వారికి తమ సొంత (అవసరాల) మీద ప్రాధాన్యతనిస్తారు. మరియు ఎవరైతే అత్మలోభం నుండి రక్షింప బడతారో! అలాంటి వారు, వారే! సాఫల్యం పొందేవారు.
Verse 10
وَٱلَّذِينَ جَآءُو مِنۢ بَعْدِهِمْ يَقُولُونَ رَبَّنَا ٱغْفِرْ لَنَا وَلِإِخْوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلْإِيمَـٰنِ وَلَا تَجْعَلْ فِى قُلُوبِنَا غِلًّا لِّلَّذِينَ ءَامَنُوا۟ رَبَّنَآ إِنَّكَ رَءُوفٌ رَّحِيمٌ
Transliteration wa-alladhīna jāū min baʿdihim yaqūlūna rabbanā igh'fir lanā wali-ikh'wāninā alladhīna sabaqūnā bil-īmāni walā tajʿal fī qulūbinā ghillan lilladhīna āmanū rabbanā innaka raūfun raḥīmun
Telugu మరియు ఎవరైతే వారి తరువాత వచ్చారో! వారికి అందులో హక్కు ఉంది. వారు ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! మమ్మల్ని మరియు మాకంటే ముందు విశ్వసించిన మా సోదరులను క్షమించు. మరియు మా హృదయాలలో విశ్వాసుల పట్ల ద్వేషాన్ని కలిగించకు. ఓ మా ప్రభూ! నిశ్చయంగా, నీవు చాలా కనికరించేవాడవు, అపార కరుణా ప్రదాతవు!"
Verse 11
۞ أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ نَافَقُوا۟ يَقُولُونَ لِإِخْوَٰنِهِمُ ٱلَّذِينَ كَفَرُوا۟ مِنْ أَهْلِ ٱلْكِتَـٰبِ لَئِنْ أُخْرِجْتُمْ لَنَخْرُجَنَّ مَعَكُمْ وَلَا نُطِيعُ فِيكُمْ أَحَدًا أَبَدًا وَإِن قُوتِلْتُمْ لَنَنصُرَنَّكُمْ وَٱللَّهُ يَشْهَدُ إِنَّهُمْ لَكَـٰذِبُونَ
Transliteration alam tara ilā alladhīna nāfaqū yaqūlūna li-ikh'wānihimu alladhīna kafarū min ahli l-kitābi la-in ukh'rij'tum lanakhrujanna maʿakum walā nuṭīʿu fīkum aḥadan abadan wa-in qūtil'tum lananṣurannakum wal-lahu yashhadu innahum lakādhibūna
Telugu (ఓ ముహమ్మద్!) కపట విశ్వాసుల గురించి నీకు తెలియదా? వారు గ్రంథ ప్రజలలో సత్యతిరస్కారులైన తమ సోదరులతో, ఇలా అంటారు: "ఒకవేళ మీరు వెళ్ళగొట్ట బడినట్లయితే, మేము కూడా తప్పక మీతోబాటు వెళ్తాము. మరియు మీ విషయంలో మేము ఎవ్వరి మాటా వినము. ఒకవేళ మీతో యుద్ధం జరిగితే, మేము తప్పక మీకు సహాయపడతాము." మరియు నిశ్చయంగా, వారు అసత్యవాదులు, అల్లాహ్ యే దీనికి సాక్షి!
Verse 12
لَئِنْ أُخْرِجُوا۟ لَا يَخْرُجُونَ مَعَهُمْ وَلَئِن قُوتِلُوا۟ لَا يَنصُرُونَهُمْ وَلَئِن نَّصَرُوهُمْ لَيُوَلُّنَّ ٱلْأَدْبَـٰرَ ثُمَّ لَا يُنصَرُونَ
Transliteration la-in ukh'rijū lā yakhrujūna maʿahum wala-in qūtilū lā yanṣurūnahum wala-in naṣarūhum layuwallunna l-adbāra thumma lā yunṣarūna
Telugu కాని (వాస్తవానికి) వారు (యూదులు) వెడలగొట్టబడితే, వీరు (ఈ కపట విశ్వాసులు) వారి వెంట ఎంతమాత్రం వెళ్ళరు మరియు వారితో యుద్ధం జరిగితే, (ఈ కపట విశ్వాసులు) వారికి ఏ మాత్రం సహాయపడరు. ఒకవేళ వీరు, వారికి (యూదులకు) సహాయపడినా, వారు తప్పక వెన్నుచూపి పారిపోతారు. ఆ తరువాత వారు విజయం (సహాయం) పొందలేరు.
Verse 13
لَأَنتُمْ أَشَدُّ رَهْبَةً فِى صُدُورِهِم مِّنَ ٱللَّهِ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَفْقَهُونَ
Transliteration la-antum ashaddu rahbatan fī ṣudūrihim mina l-lahi dhālika bi-annahum qawmun lā yafqahūna
Telugu వారి హృదయాలలో, అల్లాహ్ భయం కంటే, మీ భయమే ఎక్కువ ఉంది. ఇది ఎందుకంటే! వాస్తవానికి వారు అర్థం చేసుకోలేని జనులు.
Verse 14
لَا يُقَـٰتِلُونَكُمْ جَمِيعًا إِلَّا فِى قُرًى مُّحَصَّنَةٍ أَوْ مِن وَرَآءِ جُدُرٍۭ ۚ بَأْسُهُم بَيْنَهُمْ شَدِيدٌ ۚ تَحْسَبُهُمْ جَمِيعًا وَقُلُوبُهُمْ شَتَّىٰ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ قَوْمٌ لَّا يَعْقِلُونَ
Transliteration lā yuqātilūnakum jamīʿan illā fī quran muḥaṣṣanatin aw min warāi judurin basuhum baynahum shadīdun taḥsabuhum jamīʿan waqulūbuhum shattā dhālika bi-annahum qawmun lā yaʿqilūna
Telugu వారందరూ కలిసి కూడా, దృఢమైన కోటలు గల నగరాలలోనో, లేదా గోడల చాటు నుండో తప్ప, మీతో యుద్ధం చేయజాలరు. వారి మధ్య ఒకరి మీద ఒకరికి ఉన్న ద్వేషం, ఎంతో తీవ్రమైనది. వారు కలసి ఉన్నట్లు నీవు భావిస్తావు, కాని వారి హృదయాలు చీలి పోయి ఉన్నాయి. ఇది ఎందుకంటే, వాస్తవానికి వారు బుద్ధిహీనులైన జనులు.
Verse 15
كَمَثَلِ ٱلَّذِينَ مِن قَبْلِهِمْ قَرِيبًا ۖ ذَاقُوا۟ وَبَالَ أَمْرِهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
Transliteration kamathali alladhīna min qablihim qarīban dhāqū wabāla amrihim walahum ʿadhābun alīmun
Telugu వీరి దృష్టాంతం సమీపంలోనే గడిచిన వారిని (బనూ ఖైనుఖాఅ లను) పోలి ఉంది. వారు తమ కార్యాల ఫలితాన్ని చవి చూశారు, మరియు (పరలోకంలో) వారికి బాధాకరమైన శిక్ష ఉంది.
Verse 16
كَمَثَلِ ٱلشَّيْطَـٰنِ إِذْ قَالَ لِلْإِنسَـٰنِ ٱكْفُرْ فَلَمَّا كَفَرَ قَالَ إِنِّى بَرِىٓءٌ مِّنكَ إِنِّىٓ أَخَافُ ٱللَّهَ رَبَّ ٱلْعَـٰلَمِينَ
Transliteration kamathali l-shayṭāni idh qāla lil'insāni uk'fur falammā kafara qāla innī barīon minka innī akhāfu l-laha rabba l-ʿālamīna
Telugu వారి దృష్టాంతం మానవుణ్ణి ప్రేరేపిస్తూ, ఇలా అనే ఆ షైతాన్ వలే ఉంది. అతడు: "సత్యాన్ని తిరస్కరించు." అని అంటాడు. అతడు తిరస్కరించిన తరువాత ఇలా అంటాడు: "నిశ్చయంగా, నాకు నీతో ఏ విధమైన సంబంధం లేదు, నిశ్చయంగా, నేను సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కు భయపడేవాడిని!"
Verse 17
فَكَانَ عَـٰقِبَتَهُمَآ أَنَّهُمَا فِى ٱلنَّارِ خَـٰلِدَيْنِ فِيهَا ۚ وَذَٰلِكَ جَزَٰٓؤُا۟ ٱلظَّـٰلِمِينَ
Transliteration fakāna ʿāqibatahumā annahumā fī l-nāri khālidayni fīhā wadhālika jazāu l-ẓālimīna
Telugu తరువాత ఆ ఇద్దరి పర్యవసానం, నిశ్చయంగా, ఆ ఇరువురూ నరకాగ్నిలో ఉండటమే! అందు వారు శాశ్వతంగా ఉంటారు. మరియు దుర్మార్గులకు లభించే ప్రతిఫలం ఇదే!
Verse 18
يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ ٱتَّقُوا۟ ٱللَّهَ وَلْتَنظُرْ نَفْسٌ مَّا قَدَّمَتْ لِغَدٍ ۖ وَٱتَّقُوا۟ ٱللَّهَ ۚ إِنَّ ٱللَّهَ خَبِيرٌۢ بِمَا تَعْمَلُونَ
Transliteration yāayyuhā alladhīna āmanū ittaqū l-laha waltanẓur nafsun mā qaddamat lighadin wa-ittaqū l-laha inna l-laha khabīrun bimā taʿmalūna
Telugu ఓ విశ్వాసులారా! అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. మరియు ప్రతి వ్యక్తి, తాను రేపటి కొరకు ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ ఎరుగును!
Verse 19
وَلَا تَكُونُوا۟ كَٱلَّذِينَ نَسُوا۟ ٱللَّهَ فَأَنسَىٰهُمْ أَنفُسَهُمْ ۚ أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْفَـٰسِقُونَ
Transliteration walā takūnū ka-alladhīna nasū l-laha fa-ansāhum anfusahum ulāika humu l-fāsiqūna
Telugu మరియు అల్లాహ్ ను మరచి పోయిన వారి మాదిరిగా మీరూ అయి పోకండి. అందువలన ఆయన వారిని, తమను తాము మరచిపోయేటట్లు చేశాడు. అలాంటి వారు! వారే అవిధేయులు (ఫాసిఖూన్).
Verse 20
لَا يَسْتَوِىٓ أَصْحَـٰبُ ٱلنَّارِ وَأَصْحَـٰبُ ٱلْجَنَّةِ ۚ أَصْحَـٰبُ ٱلْجَنَّةِ هُمُ ٱلْفَآئِزُونَ
Transliteration lā yastawī aṣḥābu l-nāri wa-aṣḥābu l-janati aṣḥābu l-janati humu l-fāizūna
Telugu నరకవాసులు మరియు స్వర్గవాసులు సరిసమానులు కాజాలరు. స్వర్గవాసులు, వారే! విజయం పొందేవారు.
Verse 21
لَوْ أَنزَلْنَا هَـٰذَا ٱلْقُرْءَانَ عَلَىٰ جَبَلٍ لَّرَأَيْتَهُۥ خَـٰشِعًا مُّتَصَدِّعًا مِّنْ خَشْيَةِ ٱللَّهِ ۚ وَتِلْكَ ٱلْأَمْثَـٰلُ نَضْرِبُهَا لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَفَكَّرُونَ
Transliteration law anzalnā hādhā l-qur'āna ʿalā jabalin lara-aytahu khāshiʿan mutaṣaddiʿan min khashyati l-lahi watil'ka l-amthālu naḍribuhā lilnnāsi laʿallahum yatafakkarūna
Telugu ఒకవేళ మేము ఈ ఖుర్ఆన్ ను ఏ పర్వతం పైనైనా అవతరింపజేసి ఉంటే, అల్లాహ్ భయం వల్ల అది అణిగి బ్రద్దలై పోవటాన్ని నీవు చూసి ఉంటావు. మరియు బహుశా ప్రజలు ఆలోచిస్తారని, ఇలాంటి దృష్టాంతాలను మేము వారి ముందు పెడుతున్నాము.
Verse 22
هُوَ ٱللَّهُ ٱلَّذِى لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ۖ عَـٰلِمُ ٱلْغَيْبِ وَٱلشَّهَـٰدَةِ ۖ هُوَ ٱلرَّحْمَـٰنُ ٱلرَّحِيمُ
Transliteration huwa l-lahu alladhī lā ilāha illā huwa ʿālimu l-ghaybi wal-shahādati huwa l-raḥmānu l-raḥīmu
Telugu ఆయనే, అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! ఆయనకు అగోచర మరియు గోచర విషయాలన్నీ తెలుసు. ఆయన అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత.
Verse 23
هُوَ ٱللَّهُ ٱلَّذِى لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ٱلْمَلِكُ ٱلْقُدُّوسُ ٱلسَّلَـٰمُ ٱلْمُؤْمِنُ ٱلْمُهَيْمِنُ ٱلْعَزِيزُ ٱلْجَبَّارُ ٱلْمُتَكَبِّرُ ۚ سُبْحَـٰنَ ٱللَّهِ عَمَّا يُشْرِكُونَ
Transliteration huwa l-lahu alladhī lā ilāha illā huwa l-maliku l-qudūsu l-salāmu l-mu'minu l-muhayminu l-ʿazīzu l-jabāru l-mutakabiru sub'ḥāna l-lahi ʿammā yush'rikūna
Telugu ఆయనే, అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన విశ్వసార్వభౌముడు, పరమ పవిత్రుడు, శాంతికి మూలాధారుడు, శాంతి ప్రదాత, శరణమిచ్చేవాడు, సర్వశక్తిమంతుడు, నిరంకుశుడు, గొప్పవాడు. వారు కల్పించే భాగస్వాములకు అల్లాహ్ అతీతుడు.
Verse 24
هُوَ ٱللَّهُ ٱلْخَـٰلِقُ ٱلْبَارِئُ ٱلْمُصَوِّرُ ۖ لَهُ ٱلْأَسْمَآءُ ٱلْحُسْنَىٰ ۚ يُسَبِّحُ لَهُۥ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۖ وَهُوَ ٱلْعَزِيزُ ٱلْحَكِيمُ
Transliteration huwa l-lahu l-khāliqu l-bāri-u l-muṣawiru lahu l-asmāu l-ḥus'nā yusabbiḥu lahu mā fī l-samāwāti wal-arḍi wahuwa l-ʿazīzu l-ḥakīmu
Telugu ఆయనే, అల్లాహ్! విశ్వసృష్టికర్త, ప్రతిదానిని సృజించేవాడు మరియు రూపాలను తీర్చిదిద్దేవాడు. ఆయనకు సర్వశ్రేష్ఠమైన పేర్లున్నాయి. ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తమూ, ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
Read Surah Al-Hashr in another language
- English (word by word)
- Albanian
- Amazigh
- Amharic
- Assamese
- Azerbaijani
- Bambara
- Bangla
- Bosnian
- Bulgarian
- Chechen
- Chinese
- Czech
- Dari
- Dhivehi
- Dutch
- Finnish
- French
- German
- Gujarati
- Hausa
- Hebrew
- Hindi
- Indonesian
- Italian
- Japanese
- Kannada
- Kazakh
- Khmer
- Kinyarwanda
- Korean
- Kurdish
- Luganda
- Malay
- Malayalam
- Maranao
- Marathi
- Nepali
- Norwegian
- Oromo
- Pashto
- Persian
- Polish
- Portuguese
- Romanian
- Russian
- Sindhi
- Sinhala
- Somali
- Spanish
- Swahili
- Swedish
- Tagalog
- Tajik
- Tamil
- Tatar
- Thai
- Turkish
- Ukrainian
- Urdu
- Uyghur
- Uzbek
- Vietnamese
- Yao
- Yoruba
All 114 surahs in Telugu: the Qur’an in Telugu.
Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.