MyDugsiStart learning

Surah Nuh in Telugu: translation and audio

Surah 71 · نوح · Noah · 28 verses

Surah Nuh verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah Nuh word by word in English.

Verse 1

إِنَّآ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِۦٓ أَنْ أَنذِرْ قَوْمَكَ مِن قَبْلِ أَن يَأْتِيَهُمْ عَذَابٌ أَلِيمٌ

Transliteration innā arsalnā nūḥan ilā qawmihi an andhir qawmaka min qabli an yatiyahum ʿadhābun alīmun

Telugu నిశ్చయంగా, మేము నూహ్ ను అతని జాతి వారి వద్దకు: "వారిపై బాధాకరమైన శిక్ష రాకముందే వారిని హెచ్చరించు!" అని (ఆజ్ఞాపించి) పంపాము.

Verse 2

قَالَ يَـٰقَوْمِ إِنِّى لَكُمْ نَذِيرٌ مُّبِينٌ

Transliteration qāla yāqawmi innī lakum nadhīrun mubīnun

Telugu అతను వారితో ఇలా అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! నిశ్చయంగా, నేను మీకు స్పష్టంగా హెచ్చరిక చేయటానికి వచ్చిన వాడిని!

Verse 3

أَنِ ٱعْبُدُوا۟ ٱللَّهَ وَٱتَّقُوهُ وَأَطِيعُونِ

Transliteration ani uʿ'budū l-laha wa-ittaqūhu wa-aṭīʿūni

Telugu కావున మీరు అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి.

Verse 4

يَغْفِرْ لَكُم مِّن ذُنُوبِكُمْ وَيُؤَخِّرْكُمْ إِلَىٰٓ أَجَلٍ مُّسَمًّى ۚ إِنَّ أَجَلَ ٱللَّهِ إِذَا جَآءَ لَا يُؤَخَّرُ ۖ لَوْ كُنتُمْ تَعْلَمُونَ

Transliteration yaghfir lakum min dhunūbikum wayu-akhir'kum ilā ajalin musamman inna ajala l-lahi idhā jāa lā yu-akharu law kuntum taʿlamūna

Telugu అలా చేస్తే ఆయన మీ పాపాలను క్షమిస్తాడు. మరియు ఒక నియమిత కాలం వరకు మిమ్మల్ని వదలి పెడ్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ నిర్ణయించిన కాలం వచ్చినపుడు, దానిని తప్పించడం సాధ్యం కాదు. ఇది మీరు తెలుసుకుంటే ఎంత బాగుండేది!"

Verse 5

قَالَ رَبِّ إِنِّى دَعَوْتُ قَوْمِى لَيْلًا وَنَهَارًا

Transliteration qāla rabbi innī daʿawtu qawmī laylan wanahāran

Telugu అతను ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నిశ్చయంగా, నేను నా జాతివారిని రేయింబవళ్ళు పిలిచాను;

Verse 6

فَلَمْ يَزِدْهُمْ دُعَآءِىٓ إِلَّا فِرَارًا

Transliteration falam yazid'hum duʿāī illā firāran

Telugu కాని, నా పిలుపు, వారి పలాయనాన్ని మాత్రమే హెచ్చించింది.

Verse 7

وَإِنِّى كُلَّمَا دَعَوْتُهُمْ لِتَغْفِرَ لَهُمْ جَعَلُوٓا۟ أَصَـٰبِعَهُمْ فِىٓ ءَاذَانِهِمْ وَٱسْتَغْشَوْا۟ ثِيَابَهُمْ وَأَصَرُّوا۟ وَٱسْتَكْبَرُوا۟ ٱسْتِكْبَارًا

Transliteration wa-innī kullamā daʿawtuhum litaghfira lahum jaʿalū aṣābiʿahum fī ādhānihim wa-is'taghshaw thiyābahum wa-aṣarrū wa-is'takbarū is'tik'bāran

Telugu మరియు వాస్తవానికి, నేను వారిని, నీ క్షమాభిక్ష వైపునకు పిలిచినప్పుడల్లా, వారు తమ చెవులలో వ్రేళ్ళు దూర్చుకునేవారు మరియు తమ వస్త్రాలను తమపై కప్పుకునేవారు మరియు వారు మొండి వైఖరి అవలంబిస్తూ దురహంకారంలో మునిగి ఉండేవారు.

Verse 8

ثُمَّ إِنِّى دَعَوْتُهُمْ جِهَارًا

Transliteration thumma innī daʿawtuhum jihāran

Telugu తరువాత వాస్తవానికి, నేను వారిని ఎలుగెత్తి పిలిచాను.

Verse 9

ثُمَّ إِنِّىٓ أَعْلَنتُ لَهُمْ وَأَسْرَرْتُ لَهُمْ إِسْرَارًا

Transliteration thumma innī aʿlantu lahum wa-asrartu lahum is'rāran

Telugu ఆ తరువాత వాస్తవంగా, నేను వారికి బహిరంగంగా చాటి చెప్పాను మరియు ఏకాంతంలో రహస్యంగా పిలిచాను.

Verse 10

فَقُلْتُ ٱسْتَغْفِرُوا۟ رَبَّكُمْ إِنَّهُۥ كَانَ غَفَّارًا

Transliteration faqul'tu is'taghfirū rabbakum innahu kāna ghaffāran

Telugu ఇంకా వారితో ఇలా అన్నాను: 'మీ ప్రభువును క్షమాపణకై వేడుకోండి, నిశ్చయంగా ఆయన ఎంతో క్షమాశీలుడు!

Verse 11

يُرْسِلِ ٱلسَّمَآءَ عَلَيْكُم مِّدْرَارًا

Transliteration yur'sili l-samāa ʿalaykum mid'rāran

Telugu ఆయన మీపై ఆకాశం నుండి ధారాళంగా వర్షాన్ని కురిపింపజేస్తాడు.

Verse 12

وَيُمْدِدْكُم بِأَمْوَٰلٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّـٰتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَـٰرًا

Transliteration wayum'did'kum bi-amwālin wabanīna wayajʿal lakum jannātin wayajʿal lakum anhāran

Telugu మరియు మీకు ధన సంపదలలోను మరియు సంతానంలోను వృద్ధి నొసంగుతాడు మరియు మీ కొరకు తోటలను ఉత్పత్తి చేస్తాడు. మరియు నదులను ప్రవహింపజేస్తాడు.'"

Verse 13

مَّا لَكُمْ لَا تَرْجُونَ لِلَّهِ وَقَارًا

Transliteration mā lakum lā tarjūna lillahi waqāran

Telugu మీకేమయింది? మీరు అల్లాహ్ మహత్త్వమును ఎందుకు ఆదరించరు?

Verse 14

وَقَدْ خَلَقَكُمْ أَطْوَارًا

Transliteration waqad khalaqakum aṭwāran

Telugu మరియు వాస్తవానికి ఆయనే మిమ్మల్ని విభిన్న దశలలో సృష్టించాడు.

Verse 15

أَلَمْ تَرَوْا۟ كَيْفَ خَلَقَ ٱللَّهُ سَبْعَ سَمَـٰوَٰتٍ طِبَاقًا

Transliteration alam taraw kayfa khalaqa l-lahu sabʿa samāwātin ṭibāqan

Telugu ఏమీ? మీరు చూడటం లేదా? అల్లాహ్ ఏడు ఆకాశాలను ఏ విధంగా అంతస్తులలో సృష్టించాడో!

Verse 16

وَجَعَلَ ٱلْقَمَرَ فِيهِنَّ نُورًا وَجَعَلَ ٱلشَّمْسَ سِرَاجًا

Transliteration wajaʿala l-qamara fīhinna nūran wajaʿala l-shamsa sirājan

Telugu మరియు వాటి మధ్య చంద్రుణ్ణి (ప్రతిబింబించే) కాంతిగాను మరియు సూర్యుణ్ణి (వెలిగే) దీపం గాను చేశాడు!

Verse 17

وَٱللَّهُ أَنۢبَتَكُم مِّنَ ٱلْأَرْضِ نَبَاتًا

Transliteration wal-lahu anbatakum mina l-arḍi nabātan

Telugu మరియు అల్లాహ్ యే మిమ్మల్ని భూమి (మట్టి) నుండి ఉత్పత్తి చేశాడు!

Verse 18

ثُمَّ يُعِيدُكُمْ فِيهَا وَيُخْرِجُكُمْ إِخْرَاجًا

Transliteration thumma yuʿīdukum fīhā wayukh'rijukum ikh'rājan

Telugu తరువాత ఆయన మిమ్మల్ని అందులోకే తీసుకొని పోతాడు మరియు మిమ్మల్ని దాని నుండి (బ్రతికించి) బయటికి తీస్తాడు!

Verse 19

وَٱللَّهُ جَعَلَ لَكُمُ ٱلْأَرْضَ بِسَاطًا

Transliteration wal-lahu jaʿala lakumu l-arḍa bisāṭan

Telugu మరియు అల్లాహ్ యే మీ కొరకు భూమిని విస్తరింపజేశాడు.

Verse 20

لِّتَسْلُكُوا۟ مِنْهَا سُبُلًا فِجَاجًا

Transliteration litaslukū min'hā subulan fijājan

Telugu మీరు దానిపై నున్న విశాలమైన మార్గాలలో నడవటానికి.

Verse 21

قَالَ نُوحٌ رَّبِّ إِنَّهُمْ عَصَوْنِى وَٱتَّبَعُوا۟ مَن لَّمْ يَزِدْهُ مَالُهُۥ وَوَلَدُهُۥٓ إِلَّا خَسَارًا

Transliteration qāla nūḥun rabbi innahum ʿaṣawnī wa-ittabaʿū man lam yazid'hu māluhu wawaladuhu illā khasāran

Telugu నూహ్ ఇంకా ఇలా విన్నవించుకున్నాడు: "ఓ నా ప్రభూ! వాస్తవానికి వారు నా మాటను ధిక్కరించారు. మరియు వాడిని అనుసరించారు, ఎవడి సంపద మరియు సంతానం వారికి కేవలం నష్టం తప్ప మరేమీ అధికం చేయదో!

Verse 22

وَمَكَرُوا۟ مَكْرًا كُبَّارًا

Transliteration wamakarū makran kubbāran

Telugu మరియు వారు పెద్ద కుట్ర పన్నారు.

Verse 23

وَقَالُوا۟ لَا تَذَرُنَّ ءَالِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّا وَلَا سُوَاعًا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا

Transliteration waqālū lā tadharunna ālihatakum walā tadharunna waddan walā suwāʿan walā yaghūtha wayaʿūqa wanasran

Telugu మరియు వారు ఒకరితోనొకరు ఇలా అనుకున్నారు: 'మీరు మీ ఆరాధ్యదైవాలను విడిచి పెట్టకండి. వద్ద్ మరియు సువాఅ; యగూస్, యఊఖ్ మరియు నస్ర్ లను విడిచిపెట్టకండి!'

Verse 24

وَقَدْ أَضَلُّوا۟ كَثِيرًا ۖ وَلَا تَزِدِ ٱلظَّـٰلِمِينَ إِلَّا ضَلَـٰلًا

Transliteration waqad aḍallū kathīran walā tazidi l-ẓālimīna illā ḍalālan

Telugu మరియు వాస్తవానికి, వారు చాలా మందిని తప్పు దారిలో పడవేశారు. కావున (ఓ నా ప్రభూ!) : నీవు కూడా ఈ దుర్మార్గులకు కేవలం వారి మార్గభ్రష్టత్వాన్నే హెచ్చించు!''"

Verse 25

مِّمَّا خَطِيٓـَٔـٰتِهِمْ أُغْرِقُوا۟ فَأُدْخِلُوا۟ نَارًا فَلَمْ يَجِدُوا۟ لَهُم مِّن دُونِ ٱللَّهِ أَنصَارًا

Transliteration mimmā khaṭīātihim ugh'riqū fa-ud'khilū nāran falam yajidū lahum min dūni l-lahi anṣāran

Telugu వారు తమ పాపాల కారణంగా ముంచి వేయబడ్డారు మరియు నరకాగ్నిలోకి త్రోయబడ్డారు, కావున వారు అల్లాహ్ తప్ప తమను కాపాడే వారినెవ్వరినీ పొందలేక పోయారు.

Verse 26

وَقَالَ نُوحٌ رَّبِّ لَا تَذَرْ عَلَى ٱلْأَرْضِ مِنَ ٱلْكَـٰفِرِينَ دَيَّارًا

Transliteration waqāla nūḥun rabbi lā tadhar ʿalā l-arḍi mina l-kāfirīna dayyāran

Telugu మరియు నూహ్ ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! సత్యతిరస్కారులలో ఒక్కరిని కూడా భూమి మీద వదలకు.

Verse 27

إِنَّكَ إِن تَذَرْهُمْ يُضِلُّوا۟ عِبَادَكَ وَلَا يَلِدُوٓا۟ إِلَّا فَاجِرًا كَفَّارًا

Transliteration innaka in tadharhum yuḍillū ʿibādaka walā yalidū illā fājiran kaffāran

Telugu ఒకవేళ నీవు వారిని వదలి పెడితే, నిశ్చయంగా వారు నీ దాసులను మార్గభ్రష్టత్వంలో పడవేస్తారు. మరియు వారు పాపులను మరియు కృతఘ్నులను మాత్రమే పుట్టిస్తారు.

Verse 28

رَّبِّ ٱغْفِرْ لِى وَلِوَٰلِدَىَّ وَلِمَن دَخَلَ بَيْتِىَ مُؤْمِنًا وَلِلْمُؤْمِنِينَ وَٱلْمُؤْمِنَـٰتِ وَلَا تَزِدِ ٱلظَّـٰلِمِينَ إِلَّا تَبَارًۢا

Transliteration rabbi igh'fir lī waliwālidayya waliman dakhala baytiya mu'minan walil'mu'minīna wal-mu'mināti walā tazidi l-ẓālimīna illā tabāran

Telugu ఓ మా ప్రభూ! నన్ను, నా తల్లిదండ్రులను మరియు విశ్వాసిగా నా ఇంటిలోనికి ప్రవేశించిన వానిని మరియు విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను, అందరినీ క్షమించు. మరియు దుర్మార్గులకు వినాశం తప్ప మరేమీ అధికం చేయకు!"

Read Surah Nuh in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.