MyDugsiStart learning

Surah An-Nisa in Telugu: translation and audio

Surah 4 · النساء · The Women · 176 verses

Surah An-Nisa verse by verse: the Arabic with a recitation you can repeat, the transliteration, and the Telugu translation by Maulana Abder-Rahim ibn Muhammad. For the meaning of every word, see Surah An-Nisa word by word in English.

Verse 1

يَـٰٓأَيُّهَا ٱلنَّاسُ ٱتَّقُوا۟ رَبَّكُمُ ٱلَّذِى خَلَقَكُم مِّن نَّفْسٍ وَٰحِدَةٍ وَخَلَقَ مِنْهَا زَوْجَهَا وَبَثَّ مِنْهُمَا رِجَالًا كَثِيرًا وَنِسَآءً ۚ وَٱتَّقُوا۟ ٱللَّهَ ٱلَّذِى تَسَآءَلُونَ بِهِۦ وَٱلْأَرْحَامَ ۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَيْكُمْ رَقِيبًا

Transliteration yāayyuhā l-nāsu ittaqū rabbakumu alladhī khalaqakum min nafsin wāḥidatin wakhalaqa min'hā zawjahā wabatha min'humā rijālan kathīran wanisāan wa-ittaqū l-laha alladhī tasāalūna bihi wal-arḥāma inna l-laha kāna ʿalaykum raqīban

Telugu ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట(హవ్వా)ను సృష్టించాడు మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింపజేశాడు. మరియు ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి, ఎవరి ద్వారానైతే (పేరుతోనైతే) మీరు మీ పరస్పర (హక్కులను) కోరుతారో; మరియు మీ బంధుత్వాలను గౌరవించండి (త్రెంచకండి). నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు.

Verse 2

وَءَاتُوا۟ ٱلْيَتَـٰمَىٰٓ أَمْوَٰلَهُمْ ۖ وَلَا تَتَبَدَّلُوا۟ ٱلْخَبِيثَ بِٱلطَّيِّبِ ۖ وَلَا تَأْكُلُوٓا۟ أَمْوَٰلَهُمْ إِلَىٰٓ أَمْوَٰلِكُمْ ۚ إِنَّهُۥ كَانَ حُوبًا كَبِيرًا

Transliteration waātū l-yatāmā amwālahum walā tatabaddalū l-khabītha bil-ṭayibi walā takulū amwālahum ilā amwālikum innahu kāna ḥūban kabīran

Telugu మరియు అనాథుల ఆస్తిపాస్తులను వారికి తిరిగి ఇవ్వండి. మరియు (మీ) చెడ్డ వస్తువులను (వారి) మంచి వస్తువులతో మార్చకండి. మరియు వారి ఆస్తులను మీ ఆస్తులతో కలిపి తిని వేయకండి. నిశ్చయంగా, ఇది గొప్పనేరం (పాపం).

Verse 3

وَإِنْ خِفْتُمْ أَلَّا تُقْسِطُوا۟ فِى ٱلْيَتَـٰمَىٰ فَٱنكِحُوا۟ مَا طَابَ لَكُم مِّنَ ٱلنِّسَآءِ مَثْنَىٰ وَثُلَـٰثَ وَرُبَـٰعَ ۖ فَإِنْ خِفْتُمْ أَلَّا تَعْدِلُوا۟ فَوَٰحِدَةً أَوْ مَا مَلَكَتْ أَيْمَـٰنُكُمْ ۚ ذَٰلِكَ أَدْنَىٰٓ أَلَّا تَعُولُوا۟

Transliteration wa-in khif'tum allā tuq'siṭū fī l-yatāmā fa-inkiḥū mā ṭāba lakum mina l-nisāi mathnā wathulātha warubāʿa fa-in khif'tum allā taʿdilū fawāḥidatan aw mā malakat aymānukum dhālika adnā allā taʿūlū

Telugu మరియు అనాథ బాలికలకు న్యాయం చేయలేమనే భయం మీకు ఉంటే, మీకు నచ్చిన (ఇతర) స్త్రీలను ఇద్దరిని గానీ, ముగ్గురిని గానీ, నలుగురిని గానీ వివాహం చేసుకోండి. అయితే వారితో న్యాయంగా వ్యవహరించ లేమనే భయం మీకు ఉంటే, ఒకామెను మాత్రమే; లేదా మీ స్వాధీనంలో నున్నవారిని (బానిస స్త్రీలను దాంపత్యంలోకి) తీసుకోండి. ఒకే వైపునకు మొగ్గకుండా (అన్యాయవర్తన నుండి దూరంగా ఉండటానికి) ఇదే సముచితమైన మార్గం.

Verse 4

وَءَاتُوا۟ ٱلنِّسَآءَ صَدُقَـٰتِهِنَّ نِحْلَةً ۚ فَإِن طِبْنَ لَكُمْ عَن شَىْءٍ مِّنْهُ نَفْسًا فَكُلُوهُ هَنِيٓـًٔا مَّرِيٓـًٔا

Transliteration waātū l-nisāa ṣaduqātihinna niḥ'latan fa-in ṭib'na lakum ʿan shayin min'hu nafsan fakulūhu hanīan marīan

Telugu మరియు స్త్రీలకు వారి స్త్రీ శుల్కం (మహర్) సహృదయంతో ఇవ్వండి. కాని వారు తమంతట తామే సంతోషంగా కొంత భాగాన్ని మీకు విడిచి పెడితే, దానిని సంతోషంగా స్వేచ్ఛగా అనుభవించండి (తినండి).

Verse 5

وَلَا تُؤْتُوا۟ ٱلسُّفَهَآءَ أَمْوَٰلَكُمُ ٱلَّتِى جَعَلَ ٱللَّهُ لَكُمْ قِيَـٰمًا وَٱرْزُقُوهُمْ فِيهَا وَٱكْسُوهُمْ وَقُولُوا۟ لَهُمْ قَوْلًا مَّعْرُوفًا

Transliteration walā tu'tū l-sufahāa amwālakumu allatī jaʿala l-lahu lakum qiyāman wa-ur'zuqūhum fīhā wa-ik'sūhum waqūlū lahum qawlan maʿrūfan

Telugu మరియు అల్లాహ్ మీకు నిర్వహించటానికి అప్పగించిన ఆస్తులను, అవివేకులుగా ఉన్నప్పుడు (అనాథులకు) అప్పగించకండి. దాని నుండి వారికి అన్న వస్త్రాలు ఇస్తూ ఉండండి. మరియు వారితో వాత్సల్యంతో మాట్లాడండి.

Verse 6

وَٱبْتَلُوا۟ ٱلْيَتَـٰمَىٰ حَتَّىٰٓ إِذَا بَلَغُوا۟ ٱلنِّكَاحَ فَإِنْ ءَانَسْتُم مِّنْهُمْ رُشْدًا فَٱدْفَعُوٓا۟ إِلَيْهِمْ أَمْوَٰلَهُمْ ۖ وَلَا تَأْكُلُوهَآ إِسْرَافًا وَبِدَارًا أَن يَكْبَرُوا۟ ۚ وَمَن كَانَ غَنِيًّا فَلْيَسْتَعْفِفْ ۖ وَمَن كَانَ فَقِيرًا فَلْيَأْكُلْ بِٱلْمَعْرُوفِ ۚ فَإِذَا دَفَعْتُمْ إِلَيْهِمْ أَمْوَٰلَهُمْ فَأَشْهِدُوا۟ عَلَيْهِمْ ۚ وَكَفَىٰ بِٱللَّهِ حَسِيبًا

Transliteration wa-ib'talū l-yatāmā ḥattā idhā balaghū l-nikāḥa fa-in ānastum min'hum rush'dan fa-id'faʿū ilayhim amwālahum walā takulūhā is'rāfan wabidāran an yakbarū waman kāna ghaniyyan falyastaʿfif waman kāna faqīran falyakul bil-maʿrūfi fa-idhā dafaʿtum ilayhim amwālahum fa-ashhidū ʿalayhim wakafā bil-lahi ḥasīban

Telugu మరియు వివాహయోగ్యమైన వయస్సు వచ్చే వరకూ మీరు అనాథులను పరీక్షించండి, ఇక వారిలో మీకు యోగ్యత కనిపించినప్పుడు, వారి ఆస్తులను వారికి అప్పగించండి. మరియు వారు పెరిగి పెద్దవారు అవుతారనే తలంపుతో దానిని (వారి ఆస్తిని) త్వరపడి అపరిమితంగా తినకండి. మరియు అతడు (సంరక్షకుడు) సంపన్నుడైతే, వారి సొమ్ముకు దూరంగా ఉండాలి. కాని అతడు పేదవాడైతే, దాని నుండి ధర్మసమ్మతంగా తినాలి. ఇక వారి ఆస్తిని వారికి అప్పగించేటప్పుడు దానికి సాక్షులను పెట్టుకోండి. మరియు లెక్క తీసుకోవటానికి అల్లాహ్ చాలు!

Verse 7

لِّلرِّجَالِ نَصِيبٌ مِّمَّا تَرَكَ ٱلْوَٰلِدَانِ وَٱلْأَقْرَبُونَ وَلِلنِّسَآءِ نَصِيبٌ مِّمَّا تَرَكَ ٱلْوَٰلِدَانِ وَٱلْأَقْرَبُونَ مِمَّا قَلَّ مِنْهُ أَوْ كَثُرَ ۚ نَصِيبًا مَّفْرُوضًا

Transliteration lilrrijāli naṣībun mimmā taraka l-wālidāni wal-aqrabūna walilnnisāi naṣībun mimmā taraka l-wālidāni wal-aqrabūna mimmā qalla min'hu aw kathura naṣīban mafrūḍan

Telugu పురుషులకు వారి తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచిపోయిన దానిలో (ఆస్తిలో) భాగం ఉంది మరియు స్త్రీలకు కూడా వారి తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచిపోయిన దానిలో భాగం ఉంది; అది తక్కువైనా సరే, లేదా ఎక్కువైనా సరే. అది (అల్లాహ్) విధిగా నియమించిన భాగం.

Verse 8

وَإِذَا حَضَرَ ٱلْقِسْمَةَ أُو۟لُوا۟ ٱلْقُرْبَىٰ وَٱلْيَتَـٰمَىٰ وَٱلْمَسَـٰكِينُ فَٱرْزُقُوهُم مِّنْهُ وَقُولُوا۟ لَهُمْ قَوْلًا مَّعْرُوفًا

Transliteration wa-idhā ḥaḍara l-qis'mata ulū l-qur'bā wal-yatāmā wal-masākīnu fa-ur'zuqūhum min'hu waqūlū lahum qawlan maʿrūfan

Telugu మరియు (ఆస్తి) పంపకం జరిగేటప్పుడు ఇతర బంధువులు గానీ, అనాథులు గానీ, పేదవారు గానీ ఉంటే దాని నుండి వారికి కూడా కొంత ఇవ్వండి మరియు వారితో వాత్యల్యంగా మాట్లాడండి.

Verse 9

وَلْيَخْشَ ٱلَّذِينَ لَوْ تَرَكُوا۟ مِنْ خَلْفِهِمْ ذُرِّيَّةً ضِعَـٰفًا خَافُوا۟ عَلَيْهِمْ فَلْيَتَّقُوا۟ ٱللَّهَ وَلْيَقُولُوا۟ قَوْلًا سَدِيدًا

Transliteration walyakhsha alladhīna law tarakū min khalfihim dhurriyyatan ḍiʿāfan khāfū ʿalayhim falyattaqū l-laha walyaqūlū qawlan sadīdan

Telugu మరియు (పంపకం చేసేటప్పుడు, పంపకం చేసేవారు), ఒకవేళ తామే తమ పిల్లలను నిస్సహాయులుగా విడిచిపోతే, ఏ విధంగా వారిని గురించి భయపడతారో, అదే విధంగా భయపడాలి. వారు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండి, యుక్తమైన మాటలనే పలకాలి.

Verse 10

إِنَّ ٱلَّذِينَ يَأْكُلُونَ أَمْوَٰلَ ٱلْيَتَـٰمَىٰ ظُلْمًا إِنَّمَا يَأْكُلُونَ فِى بُطُونِهِمْ نَارًا ۖ وَسَيَصْلَوْنَ سَعِيرًا

Transliteration inna alladhīna yakulūna amwāla l-yatāmā ẓul'man innamā yakulūna fī buṭūnihim nāran wasayaṣlawna saʿīran

Telugu నిశ్చయంగా, అన్యాయంగా అనాథుల ఆస్తులను, తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. మరియు వారు సమీపంలోనే భగభగమండే నరకాగ్నిలో కాల్చబడతారు.

Verse 11

يُوصِيكُمُ ٱللَّهُ فِىٓ أَوْلَـٰدِكُمْ ۖ لِلذَّكَرِ مِثْلُ حَظِّ ٱلْأُنثَيَيْنِ ۚ فَإِن كُنَّ نِسَآءً فَوْقَ ٱثْنَتَيْنِ فَلَهُنَّ ثُلُثَا مَا تَرَكَ ۖ وَإِن كَانَتْ وَٰحِدَةً فَلَهَا ٱلنِّصْفُ ۚ وَلِأَبَوَيْهِ لِكُلِّ وَٰحِدٍ مِّنْهُمَا ٱلسُّدُسُ مِمَّا تَرَكَ إِن كَانَ لَهُۥ وَلَدٌ ۚ فَإِن لَّمْ يَكُن لَّهُۥ وَلَدٌ وَوَرِثَهُۥٓ أَبَوَاهُ فَلِأُمِّهِ ٱلثُّلُثُ ۚ فَإِن كَانَ لَهُۥٓ إِخْوَةٌ فَلِأُمِّهِ ٱلسُّدُسُ ۚ مِنۢ بَعْدِ وَصِيَّةٍ يُوصِى بِهَآ أَوْ دَيْنٍ ۗ ءَابَآؤُكُمْ وَأَبْنَآؤُكُمْ لَا تَدْرُونَ أَيُّهُمْ أَقْرَبُ لَكُمْ نَفْعًا ۚ فَرِيضَةً مِّنَ ٱللَّهِ ۗ إِنَّ ٱللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا

Transliteration yūṣīkumu l-lahu fī awlādikum lildhakari mith'lu ḥaẓẓi l-unthayayni fa-in kunna nisāan fawqa ith'natayni falahunna thuluthā mā taraka wa-in kānat wāḥidatan falahā l-niṣ'fu wali-abawayhi likulli wāḥidin min'humā l-sudusu mimmā taraka in kāna lahu waladun fa-in lam yakun lahu waladun wawarithahu abawāhu fali-ummihi l-thuluthu fa-in kāna lahu ikh'watun fali-ummihi l-sudusu min baʿdi waṣiyyatin yūṣī bihā aw daynin ābāukum wa-abnāukum lā tadrūna ayyuhum aqrabu lakum nafʿan farīḍatan mina l-lahi inna l-laha kāna ʿalīman ḥakīman

Telugu మీ సంతాన వారసత్వాన్ని గురించి అల్లాహ్ మీకు ఈ విధంగా ఆదేశిస్తున్నాడు: ఒక పురుషుని (భాగం) ఇద్దరు స్త్రీల భాగాలకు సమానంగా ఉండాలి. ఒకవేళ ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ స్త్రీ (సంతానం మాత్రమే) ఉంటే, వారికి విడిచిన ఆస్తిలో మూడింట రెండు భాగాలు ఉంటాయి. మరియు ఒకవేళ ఒకే ఆడపిల్ల ఉంటే అర్ధభాగానికి ఆమె హక్కుదారురాలు. మరియు (మృతుడు) సంతానం కలవాడైతే, అతని తల్లిదండ్రులలో ప్రతి ఒక్కరికీ విడిచిన ఆస్తిలో ఆరోభాగం లభిస్తుంది. ఒకవేళ అతనికి సంతానం లేకుంటే అతని తల్లిదండ్రులు మాత్రమే వారసులుగా ఉంటే, అప్పుడు తల్లికి మూడోభాగం. మృతునికి సోదరసోదరీమణులు ఉంటే, తల్లికి ఆరోభాగం. (ఈ పంపకమంతా) మృతుని అప్పులు తీర్చి, అతని వీలునామా పై అమలు జరిపిన తరువాతనే జరగాలి. మీ తల్లిదండ్రులు మరియు మీ సంతానంలో ప్రయోజనం రీత్యా మీకు ఎవరు ఎక్కువ సన్నిహితులో, మీకు తెలియదు. ఇది అల్లాహ్ నియమించిన విధానం. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

Verse 12

۞ وَلَكُمْ نِصْفُ مَا تَرَكَ أَزْوَٰجُكُمْ إِن لَّمْ يَكُن لَّهُنَّ وَلَدٌ ۚ فَإِن كَانَ لَهُنَّ وَلَدٌ فَلَكُمُ ٱلرُّبُعُ مِمَّا تَرَكْنَ ۚ مِنۢ بَعْدِ وَصِيَّةٍ يُوصِينَ بِهَآ أَوْ دَيْنٍ ۚ وَلَهُنَّ ٱلرُّبُعُ مِمَّا تَرَكْتُمْ إِن لَّمْ يَكُن لَّكُمْ وَلَدٌ ۚ فَإِن كَانَ لَكُمْ وَلَدٌ فَلَهُنَّ ٱلثُّمُنُ مِمَّا تَرَكْتُم ۚ مِّنۢ بَعْدِ وَصِيَّةٍ تُوصُونَ بِهَآ أَوْ دَيْنٍ ۗ وَإِن كَانَ رَجُلٌ يُورَثُ كَلَـٰلَةً أَوِ ٱمْرَأَةٌ وَلَهُۥٓ أَخٌ أَوْ أُخْتٌ فَلِكُلِّ وَٰحِدٍ مِّنْهُمَا ٱلسُّدُسُ ۚ فَإِن كَانُوٓا۟ أَكْثَرَ مِن ذَٰلِكَ فَهُمْ شُرَكَآءُ فِى ٱلثُّلُثِ ۚ مِنۢ بَعْدِ وَصِيَّةٍ يُوصَىٰ بِهَآ أَوْ دَيْنٍ غَيْرَ مُضَآرٍّ ۚ وَصِيَّةً مِّنَ ٱللَّهِ ۗ وَٱللَّهُ عَلِيمٌ حَلِيمٌ

Transliteration walakum niṣ'fu mā taraka azwājukum in lam yakun lahunna waladun fa-in kāna lahunna waladun falakumu l-rubuʿu mimmā tarakna min baʿdi waṣiyyatin yūṣīna bihā aw daynin walahunna l-rubuʿu mimmā taraktum in lam yakun lakum waladun fa-in kāna lakum waladun falahunna l-thumunu mimmā taraktum min baʿdi waṣiyyatin tūṣūna bihā aw daynin wa-in kāna rajulun yūrathu kalālatan awi im'ra-atun walahu akhun aw ukh'tun falikulli wāḥidin min'humā l-sudusu fa-in kānū akthara min dhālika fahum shurakāu fī l-thuluthi min baʿdi waṣiyyatin yūṣā bihā aw daynin ghayra muḍārrin waṣiyyatan mina l-lahi wal-lahu ʿalīmun ḥalīmun

Telugu మరియు మీ భార్యలకు సంతానం లేని పక్షంలో, వారు విడిచిపోయిన దానిలో మీకు అర్ధభాగం. కాని ఒకవేళ వారికి సంతానం ఉంటే, వారు విడిచి పోయిన దానిలో నాలుగోభాగం మీది. (ఇదంతా) వారు వ్రాసి పోయిన వీలునామాపై అమలు జరిపి, వారి అప్పులు తీర్చిన తరువాత. మరియు మీకు సంతానం లేని పక్షంలో మీరు విడిచి పోయిన దానిలో వారికి (మీ భార్యలకు) నాలుగోభాగం. కాని ఒకవేళ మీకు సంతానం ఉంటే, మీరు విడిచిన దానిలో వారికి ఎనిమిదో భాగం. ఇదంతా మీరు వ్రాసిన వీలునామాపై అమలు జరిగి మీ అప్పులు తీర్చిన తరువాత. మరియు ఒకవేళ మరణించిన పురుషుడు లేక స్త్రీ కలాల అయి (తండ్రి, కొడుకు లేక మనమడు లేకుండా) ఒక సోదరుడు మరియు ఒక సోదరి మాత్రమే ఉంటే, వారిలో ప్రతి ఒక్కరికీ ఆరోభాగం. కాని ఒకవేళ వారు (సోదరసోదరీమణులు) ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే, వారంతా మూడో భాగానికి వారసులవుతారు. ఇదంతా మృతుడు వ్రాసిన వీలునామాపై అమలు జరిగి అప్పులు తీర్చిన తరువాత. ఎవ్వరికీ నష్టం కలుగజేయకుండా జరగాలి. ఇది అల్లాహ్ నుండి వచ్చిన ఆదేశం. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, సహనశీలుడు (శాంతస్వభావుడు).

Verse 13

تِلْكَ حُدُودُ ٱللَّهِ ۚ وَمَن يُطِعِ ٱللَّهَ وَرَسُولَهُۥ يُدْخِلْهُ جَنَّـٰتٍ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ خَـٰلِدِينَ فِيهَا ۚ وَذَٰلِكَ ٱلْفَوْزُ ٱلْعَظِيمُ

Transliteration til'ka ḥudūdu l-lahi waman yuṭiʿi l-laha warasūlahu yud'khil'hu jannātin tajrī min taḥtihā l-anhāru khālidīna fīhā wadhālika l-fawzu l-ʿaẓīmu

Telugu ఇవి అల్లాహ్ (విధించిన) హద్దులు. ఎవరైతే అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారో, వారిని ఆయన క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. మరియు ఇదే గొప్ప సాఫల్యం (విజయం).

Verse 14

وَمَن يَعْصِ ٱللَّهَ وَرَسُولَهُۥ وَيَتَعَدَّ حُدُودَهُۥ يُدْخِلْهُ نَارًا خَـٰلِدًا فِيهَا وَلَهُۥ عَذَابٌ مُّهِينٌ

Transliteration waman yaʿṣi l-laha warasūlahu wayataʿadda ḥudūdahu yud'khil'hu nāran khālidan fīhā walahu ʿadhābun muhīnun

Telugu మరియు ఎవడైతే, అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు అవిధేయుడై, ఆయన నియమాలను ఉల్లంఘిస్తాడో! అలాంటి వాడు నరకాగ్నిలోకి త్రోయబడతాడు అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు. మరియు అతడికి అవమానకరమైన శిక్ష ఉంటుంది.

Verse 15

وَٱلَّـٰتِى يَأْتِينَ ٱلْفَـٰحِشَةَ مِن نِّسَآئِكُمْ فَٱسْتَشْهِدُوا۟ عَلَيْهِنَّ أَرْبَعَةً مِّنكُمْ ۖ فَإِن شَهِدُوا۟ فَأَمْسِكُوهُنَّ فِى ٱلْبُيُوتِ حَتَّىٰ يَتَوَفَّىٰهُنَّ ٱلْمَوْتُ أَوْ يَجْعَلَ ٱللَّهُ لَهُنَّ سَبِيلًا

Transliteration wa-allātī yatīna l-fāḥishata min nisāikum fa-is'tashhidū ʿalayhinna arbaʿatan minkum fa-in shahidū fa-amsikūhunna fī l-buyūti ḥattā yatawaffāhunna l-mawtu aw yajʿala l-lahu lahunna sabīlan

Telugu మరియు మీ స్త్రీలలో ఎవరైనా వ్యభిచారానికి పాల్పబడితే, వారికి వ్యతిరేకంగా, మీలో నుండి నలుగురి సాక్ష్యం తీసుకోండి. వారు (నలుగురు) సాక్ష్యమిస్తే, వారు మరణించే వరకైనా, లేదా వారి కొరకు అల్లాహ్ ఏదైనా మార్గం చూపించే వరకైనా, వారిని ఇండ్లలో నిర్బంధించండి.

Verse 16

وَٱلَّذَانِ يَأْتِيَـٰنِهَا مِنكُمْ فَـَٔاذُوهُمَا ۖ فَإِن تَابَا وَأَصْلَحَا فَأَعْرِضُوا۟ عَنْهُمَآ ۗ إِنَّ ٱللَّهَ كَانَ تَوَّابًا رَّحِيمًا

Transliteration wa-alladhāni yatiyānihā minkum faādhūhumā fa-in tābā wa-aṣlaḥā fa-aʿriḍū ʿanhumā inna l-laha kāna tawwāban raḥīman

Telugu మరియు మీలో ఏ ఇద్దరూ (స్త్రీలు గానీ, పురుషులు గానీ) దీనికి (వ్యభిచారానికి) పాల్పడితే వారిద్దరినీ శిక్షించండి. వారు పశ్చాత్తాప పడి తమ ప్రవర్తనను సవరించుకుంటే వారిని విడిచిపెట్టండి. నిశ్చయంగా, అల్లాహ్ యే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణాప్రదాత.

Verse 17

إِنَّمَا ٱلتَّوْبَةُ عَلَى ٱللَّهِ لِلَّذِينَ يَعْمَلُونَ ٱلسُّوٓءَ بِجَهَـٰلَةٍ ثُمَّ يَتُوبُونَ مِن قَرِيبٍ فَأُو۟لَـٰٓئِكَ يَتُوبُ ٱللَّهُ عَلَيْهِمْ ۗ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَكِيمًا

Transliteration innamā l-tawbatu ʿalā l-lahi lilladhīna yaʿmalūna l-sūa bijahālatin thumma yatūbūna min qarībin fa-ulāika yatūbu l-lahu ʿalayhim wakāna l-lahu ʿalīman ḥakīman

Telugu నిశ్చయంగా పశ్చాత్తాపాన్ని అంగీకరించటం అల్లాహ్ కే చెందినది. ఎవరైతే అజ్ఞానం వల్ల పాపం చేసి, వెనువెంటనే పశ్చాత్తాప పడతారో! అలాంటి వారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్ స్వీకరిస్తాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

Verse 18

وَلَيْسَتِ ٱلتَّوْبَةُ لِلَّذِينَ يَعْمَلُونَ ٱلسَّيِّـَٔاتِ حَتَّىٰٓ إِذَا حَضَرَ أَحَدَهُمُ ٱلْمَوْتُ قَالَ إِنِّى تُبْتُ ٱلْـَٔـٰنَ وَلَا ٱلَّذِينَ يَمُوتُونَ وَهُمْ كُفَّارٌ ۚ أُو۟لَـٰٓئِكَ أَعْتَدْنَا لَهُمْ عَذَابًا أَلِيمًا

Transliteration walaysati l-tawbatu lilladhīna yaʿmalūna l-sayiāti ḥattā idhā ḥaḍara aḥadahumu l-mawtu qāla innī tub'tu l-āna walā alladhīna yamūtūna wahum kuffārun ulāika aʿtadnā lahum ʿadhāban alīman

Telugu మరియు వారిలో ఒకడు, మరణం ఆసన్నమయ్యే వరకూ పాపకార్యాలు చేస్తూ వుండి: "ఇప్పుడు నేను పశ్చాత్తాప పడుతున్నాను!" అని అంటే అలాంటి వారి పశ్చాత్తాపం మరియు మరణించే వరకు సత్యతిరస్కారులుగా ఉన్నవారి (పశ్చాత్తాపం) స్వీకరించబడవు. అలాంటి వారి కొరకు మేము బాధాకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము.

Verse 19

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا يَحِلُّ لَكُمْ أَن تَرِثُوا۟ ٱلنِّسَآءَ كَرْهًا ۖ وَلَا تَعْضُلُوهُنَّ لِتَذْهَبُوا۟ بِبَعْضِ مَآ ءَاتَيْتُمُوهُنَّ إِلَّآ أَن يَأْتِينَ بِفَـٰحِشَةٍ مُّبَيِّنَةٍ ۚ وَعَاشِرُوهُنَّ بِٱلْمَعْرُوفِ ۚ فَإِن كَرِهْتُمُوهُنَّ فَعَسَىٰٓ أَن تَكْرَهُوا۟ شَيْـًٔا وَيَجْعَلَ ٱللَّهُ فِيهِ خَيْرًا كَثِيرًا

Transliteration yāayyuhā alladhīna āmanū lā yaḥillu lakum an tarithū l-nisāa karhan walā taʿḍulūhunna litadhhabū bibaʿḍi mā ātaytumūhunna illā an yatīna bifāḥishatin mubayyinatin waʿāshirūhunna bil-maʿrūfi fa-in karih'tumūhunna faʿasā an takrahū shayan wayajʿala l-lahu fīhi khayran kathīran

Telugu ఓ విశ్వాసులారా! మీరు బలవంతంగా స్త్రీలకు వారసులు కావటం మీకు ధర్మసమ్మతం కాదు. మరియు మీరు వారికిచ్చిన దాని (మహ్ర్) నుండి కొంత తీసుకోవటానికి వారిని ఇబ్బందిలో పెట్టకండి, వారు నిస్సందేహంగా వ్యభిచారానికి పాల్పడితే తప్ప. మరియు మీరు వారితో గౌరవంతో సహవాసం చేయండి. ఒకవేళ మీకు వారు నచ్చకపోతే! బహుశా మీకు ఒక విషయం నచ్చకపోవచ్చు, కాని అందులోనే అల్లాహ్ ఎంతో మేలు ఉంచి ఉండవచ్చు!

Verse 20

وَإِنْ أَرَدتُّمُ ٱسْتِبْدَالَ زَوْجٍ مَّكَانَ زَوْجٍ وَءَاتَيْتُمْ إِحْدَىٰهُنَّ قِنطَارًا فَلَا تَأْخُذُوا۟ مِنْهُ شَيْـًٔا ۚ أَتَأْخُذُونَهُۥ بُهْتَـٰنًا وَإِثْمًا مُّبِينًا

Transliteration wa-in aradttumu is'tib'dāla zawjin makāna zawjin waātaytum iḥ'dāhunna qinṭāran falā takhudhū min'hu shayan atakhudhūnahu buh'tānan wa-ith'man mubīnan

Telugu మరియు ఒకవేళ మీరు ఒక భార్యను విడనాడి వేరొకామెను పెండ్లి చేసుకోవాలని సంకల్పించుకుంటే! మరియు మీరు ఆమెకు ఒక పెద్ద ధనరాశిని ఇచ్చి ఉన్నా సరే, దాని నుండి ఏ మాత్రం తిరిగి తీసుకోకండి. ఏమీ? ఆమెపై అపనింద మోపి, ఘోరపాపానికి పాల్పబడి, దాన్ని తిరిగి తీసుకుంటారా?

Verse 21

وَكَيْفَ تَأْخُذُونَهُۥ وَقَدْ أَفْضَىٰ بَعْضُكُمْ إِلَىٰ بَعْضٍ وَأَخَذْنَ مِنكُم مِّيثَـٰقًا غَلِيظًا

Transliteration wakayfa takhudhūnahu waqad afḍā baʿḍukum ilā baʿḍin wa-akhadhna minkum mīthāqan ghalīẓan

Telugu మరియు మీరు పరస్పరం దాంపత్య సుఖం అనుభవించిన తరువాత, వారు మీ నుండి గట్టి వాగ్దానం తీసుకున్న తరువాత, మీరు దానిని (మహ్ర్ ను) ఎలా తిరిగి తీసుకోగలరు?

Verse 22

وَلَا تَنكِحُوا۟ مَا نَكَحَ ءَابَآؤُكُم مِّنَ ٱلنِّسَآءِ إِلَّا مَا قَدْ سَلَفَ ۚ إِنَّهُۥ كَانَ فَـٰحِشَةً وَمَقْتًا وَسَآءَ سَبِيلًا

Transliteration walā tankiḥū mā nakaḥa ābāukum mina l-nisāi illā mā qad salafa innahu kāna fāḥishatan wamaqtan wasāa sabīlan

Telugu మీ తండ్రులు వివాహమాడిన స్త్రీలను మీరు వివాహమాడకండీ. ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగి పోయింది. నిశ్చయంగా, ఇది అసభ్యకరమైనది (సిగ్గుమాలినది), జుగుప్సాకరమైనది మరియు చెడుమార్గము.

Verse 23

حُرِّمَتْ عَلَيْكُمْ أُمَّهَـٰتُكُمْ وَبَنَاتُكُمْ وَأَخَوَٰتُكُمْ وَعَمَّـٰتُكُمْ وَخَـٰلَـٰتُكُمْ وَبَنَاتُ ٱلْأَخِ وَبَنَاتُ ٱلْأُخْتِ وَأُمَّهَـٰتُكُمُ ٱلَّـٰتِىٓ أَرْضَعْنَكُمْ وَأَخَوَٰتُكُم مِّنَ ٱلرَّضَـٰعَةِ وَأُمَّهَـٰتُ نِسَآئِكُمْ وَرَبَـٰٓئِبُكُمُ ٱلَّـٰتِى فِى حُجُورِكُم مِّن نِّسَآئِكُمُ ٱلَّـٰتِى دَخَلْتُم بِهِنَّ فَإِن لَّمْ تَكُونُوا۟ دَخَلْتُم بِهِنَّ فَلَا جُنَاحَ عَلَيْكُمْ وَحَلَـٰٓئِلُ أَبْنَآئِكُمُ ٱلَّذِينَ مِنْ أَصْلَـٰبِكُمْ وَأَن تَجْمَعُوا۟ بَيْنَ ٱلْأُخْتَيْنِ إِلَّا مَا قَدْ سَلَفَ ۗ إِنَّ ٱللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا

Transliteration ḥurrimat ʿalaykum ummahātukum wabanātukum wa-akhawātukum waʿammātukum wakhālātukum wabanātu l-akhi wabanātu l-ukh'ti wa-ummahātukumu allātī arḍaʿnakum wa-akhawātukum mina l-raḍāʿati wa-ummahātu nisāikum warabāibukumu allātī fī ḥujūrikum min nisāikumu allātī dakhaltum bihinna fa-in lam takūnū dakhaltum bihinna falā junāḥa ʿalaykum waḥalāilu abnāikumu alladhīna min aṣlābikum wa-an tajmaʿū bayna l-ukh'tayni illā mā qad salafa inna l-laha kāna ghafūran raḥīman

Telugu మీకు ఈ స్త్రీలు నిషేధింపబడ్డారు. మీ తల్లులు, మీ కురమార్తెలు, మీ సోదరీమణులు, మీ మేనత్తలు, మీ తల్లిసోదరీ మణులు (పినతల్లులు), మీ సోదరుల కుమార్తెలు, మీ సోదరీమణుల కుమార్తెలు, మీకు పాలిచ్చిన తల్లులు (దాదులు), మీతో పాటు పాలు త్రాగిన సోదరీమణులు, మీ భార్యల తల్లులు; మీ సంరక్షణలో ఉన్న మీ భార్యల కుమార్తెలు - ఏ భార్యలతోనైతే మీరు సంభోగించారో - కాని మీరు వారితో సంభోగించక ముందు (వారికి విడాకులిచ్చి వారి కూతుళ్ళను పెండ్లాడితే) తప్పులేదు; మీ వెన్ను నుండి పుట్టిన మీ కుమారుల భార్యలు మరియు ఏక కాలంలో అక్కా చెల్లెళ్ళను ఇద్దరినీ చేర్చటం (భార్యలుగా చేసుకోవటం నిషిద్ధం); కాని ఇంతకు పూర్వం జరిగిందేదో జరిగి పోయింది. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత.

Verse 24

۞ وَٱلْمُحْصَنَـٰتُ مِنَ ٱلنِّسَآءِ إِلَّا مَا مَلَكَتْ أَيْمَـٰنُكُمْ ۖ كِتَـٰبَ ٱللَّهِ عَلَيْكُمْ ۚ وَأُحِلَّ لَكُم مَّا وَرَآءَ ذَٰلِكُمْ أَن تَبْتَغُوا۟ بِأَمْوَٰلِكُم مُّحْصِنِينَ غَيْرَ مُسَـٰفِحِينَ ۚ فَمَا ٱسْتَمْتَعْتُم بِهِۦ مِنْهُنَّ فَـَٔاتُوهُنَّ أُجُورَهُنَّ فَرِيضَةً ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ فِيمَا تَرَٰضَيْتُم بِهِۦ مِنۢ بَعْدِ ٱلْفَرِيضَةِ ۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلِيمًا حَكِيمًا

Transliteration wal-muḥ'ṣanātu mina l-nisāi illā mā malakat aymānukum kitāba l-lahi ʿalaykum wa-uḥilla lakum mā warāa dhālikum an tabtaghū bi-amwālikum muḥ'ṣinīna ghayra musāfiḥīna famā is'tamtaʿtum bihi min'hunna faātūhunna ujūrahunna farīḍatan walā junāḥa ʿalaykum fīmā tarāḍaytum bihi min baʿdi l-farīḍati inna l-laha kāna ʿalīman ḥakīman

Telugu మరియు ఇతరుల వివాహబంధంలో ఉన్న స్త్రీలు - (ధర్మయుద్ధంలో) మీ చేతికి చిక్కిన బానిస స్త్రీలు తప్ప- (మీరు వివాహమాడటానికి నిషేధించబడ్డారు). ఇది అల్లాహ్ మీకు విధించిన అనుశాసనం. మరియు వీరు తప్ప మిగతా స్త్రీలంతా మీకు వివాహమాడటానికి ధర్మసమ్మతం చేయబడ్డారు. మీరు వారికి తగిన స్త్రీశుల్కం (మహ్ర్) ఇచ్చి వ్యభిచారంగా కాకుండా వివాహబంధంలో తీసుకోవటానికి కోరవచ్చు. కావున మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించాలనుకున్న వారికి, వారి స్త్రీశుల్కం (మహ్ర్) విధిగా చెల్లించండి. కాని స్త్రీ శుల్కం (మహ్ర్) ఒప్పందం జరిగిన తరువాత పరస్పర అంగీకారంతో మీ మధ్య ఏమైనా రాజీ కుదిరితే, అందులో దోషం లేదు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

Verse 25

وَمَن لَّمْ يَسْتَطِعْ مِنكُمْ طَوْلًا أَن يَنكِحَ ٱلْمُحْصَنَـٰتِ ٱلْمُؤْمِنَـٰتِ فَمِن مَّا مَلَكَتْ أَيْمَـٰنُكُم مِّن فَتَيَـٰتِكُمُ ٱلْمُؤْمِنَـٰتِ ۚ وَٱللَّهُ أَعْلَمُ بِإِيمَـٰنِكُم ۚ بَعْضُكُم مِّنۢ بَعْضٍ ۚ فَٱنكِحُوهُنَّ بِإِذْنِ أَهْلِهِنَّ وَءَاتُوهُنَّ أُجُورَهُنَّ بِٱلْمَعْرُوفِ مُحْصَنَـٰتٍ غَيْرَ مُسَـٰفِحَـٰتٍ وَلَا مُتَّخِذَٰتِ أَخْدَانٍ ۚ فَإِذَآ أُحْصِنَّ فَإِنْ أَتَيْنَ بِفَـٰحِشَةٍ فَعَلَيْهِنَّ نِصْفُ مَا عَلَى ٱلْمُحْصَنَـٰتِ مِنَ ٱلْعَذَابِ ۚ ذَٰلِكَ لِمَنْ خَشِىَ ٱلْعَنَتَ مِنكُمْ ۚ وَأَن تَصْبِرُوا۟ خَيْرٌ لَّكُمْ ۗ وَٱللَّهُ غَفُورٌ رَّحِيمٌ

Transliteration waman lam yastaṭiʿ minkum ṭawlan an yankiḥa l-muḥ'ṣanāti l-mu'mināti famin mā malakat aymānukum min fatayātikumu l-mu'mināti wal-lahu aʿlamu biīmānikum baʿḍukum min baʿḍin fa-inkiḥūhunna bi-idh'ni ahlihinna waātūhunna ujūrahunna bil-maʿrūfi muḥ'ṣanātin ghayra musāfiḥātin walā muttakhidhāti akhdānin fa-idhā uḥ'ṣinna fa-in atayna bifāḥishatin faʿalayhinna niṣ'fu mā ʿalā l-muḥ'ṣanāti mina l-ʿadhābi dhālika liman khashiya l-ʿanata minkum wa-an taṣbirū khayrun lakum wal-lahu ghafūrun raḥīmun

Telugu మరియు మీలో ఎవరికైనా స్వతంత్రులైన ముస్లిం స్త్రీలను, వివాహం చేసుకునే స్తోమత లేకుంటే, అప్పుడు మీ స్వాధీనంలో ఉన్న ముస్లిం లైనటువంటి బానిస స్త్రీలను వివాహమాడవచ్చు. మరియు అల్లాహ్ కు మీ విశ్వాసం గురించి తెలుసు. మీరంతా ఒకే ఒక వర్గానికి చెందిన వారు. (ఒకరి కొకరు సంబంధించిన వారు), అందువల్ల వారి సంరక్షకుల అనుమతితో వారితో వివాహం చేసుకొని, ధర్మప్రకారంగా వారి స్త్రీ శుల్కం (మహ్ర్) ఇవ్వండి. ఇది వారిని వివాహ బంధంలో సురక్షితంగా ఉంచటానికి,స్వేచ్ఛా కామక్రీడలకు దిగకుండా ఉంచటానికి మరియు దొంగచాటు సంబంధాలు ఏర్పరచుకోకుండా ఉంచటానికి (ఆదేశించబడింది). వారు (ఆ బానిస స్త్రీలు) వివాహ బంధంలో రక్షణ పొందిన తరువాత కూడా వ్యభిచారానికి పాల్పడితే, స్వతంత్రులైన స్త్రీలకు విధించే శిక్షలోని సగం శిక్ష వారికి విధించండి. ఇది మీలో పాపభీతి గలవారికి వర్తిస్తుంది. ఒకవేళ మీరు నిగ్రహం పాటిస్తే అది మీకే మంచిది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు. అపార కరుణాప్రదాత.

Verse 26

يُرِيدُ ٱللَّهُ لِيُبَيِّنَ لَكُمْ وَيَهْدِيَكُمْ سُنَنَ ٱلَّذِينَ مِن قَبْلِكُمْ وَيَتُوبَ عَلَيْكُمْ ۗ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٌ

Transliteration yurīdu l-lahu liyubayyina lakum wayahdiyakum sunana alladhīna min qablikum wayatūba ʿalaykum wal-lahu ʿalīmun ḥakīmun

Telugu అల్లాహ్ మీకు (ధర్మ-అధర్మాలను) స్పష్టం చేయాలనీ మరియు మీ కంటే పూర్వం ఉన్న (సత్పురుషుల) మార్గం వైపునకు, మీకు మార్గదర్శకత్వం చేయాలనీ మరియు మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాలనీ కోరుతున్నాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.

Verse 27

وَٱللَّهُ يُرِيدُ أَن يَتُوبَ عَلَيْكُمْ وَيُرِيدُ ٱلَّذِينَ يَتَّبِعُونَ ٱلشَّهَوَٰتِ أَن تَمِيلُوا۟ مَيْلًا عَظِيمًا

Transliteration wal-lahu yurīdu an yatūba ʿalaykum wayurīdu alladhīna yattabiʿūna l-shahawāti an tamīlū maylan ʿaẓīman

Telugu మరియు అల్లాహ్ మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించ గోరుతున్నాడు. కాని తమ మనోవాంఛలను అనుసరిస్తున్న వారు, మీరు (సన్మార్గం నుండి) చాలా దూరంగా వైదొలగాలని కోరుతున్నారు.

Verse 28

يُرِيدُ ٱللَّهُ أَن يُخَفِّفَ عَنكُمْ ۚ وَخُلِقَ ٱلْإِنسَـٰنُ ضَعِيفًا

Transliteration yurīdu l-lahu an yukhaffifa ʿankum wakhuliqa l-insānu ḍaʿīfan

Telugu అల్లాహ్ మీ భారాన్ని తగ్గించగోరుతున్నాడు. మరియు (ఎందుకంటే) మానవుడు బలహీనుడిగా సృష్టించబడ్డాడు.

Verse 29

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَأْكُلُوٓا۟ أَمْوَٰلَكُم بَيْنَكُم بِٱلْبَـٰطِلِ إِلَّآ أَن تَكُونَ تِجَـٰرَةً عَن تَرَاضٍ مِّنكُمْ ۚ وَلَا تَقْتُلُوٓا۟ أَنفُسَكُمْ ۚ إِنَّ ٱللَّهَ كَانَ بِكُمْ رَحِيمًا

Transliteration yāayyuhā alladhīna āmanū lā takulū amwālakum baynakum bil-bāṭili illā an takūna tijāratan ʿan tarāḍin minkum walā taqtulū anfusakum inna l-laha kāna bikum raḥīman

Telugu ఓ విశ్వాసులారా! మీరు ఒకరి సొమ్ము నొకరు అన్యాయంగా తినకండి, పరస్పర అంగీకారంతో చేసే వ్యాపారం వల్ల వచ్చేది (లాభం) తప్ప. మరియు మీరు ఒకరి నొకరు చంపుకోకండి. నిశ్చయంగా, అల్లాహ్ మీ యెడల అపార కరుణాప్రదాత.

Verse 30

وَمَن يَفْعَلْ ذَٰلِكَ عُدْوَٰنًا وَظُلْمًا فَسَوْفَ نُصْلِيهِ نَارًا ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرًا

Transliteration waman yafʿal dhālika ʿud'wānan waẓul'man fasawfa nuṣ'līhi nāran wakāna dhālika ʿalā l-lahi yasīran

Telugu మరియు ఎవడు ద్వేషంతో మరియు దుర్మార్గంతో అలా చేస్తాడో, వానిని మేము నరకాగ్నిలో పడవేస్తాము. మరియు అది అల్లాహ్ కు ఎంతో సులభం.

Verse 31

إِن تَجْتَنِبُوا۟ كَبَآئِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنكُمْ سَيِّـَٔاتِكُمْ وَنُدْخِلْكُم مُّدْخَلًا كَرِيمًا

Transliteration in tajtanibū kabāira mā tun'hawna ʿanhu nukaffir ʿankum sayyiātikum wanud'khil'kum mud'khalan karīman

Telugu ఒకవేళ మీకు నిషేధించబడి నటువంటి మహాపాపాలకు మీరు దూరంగా ఉంటే, మేము మీ చిన్నచిన్న దోషాలను మన్నించి, మిమ్మల్ని గౌరవస్థానాల్లోకి ప్రవేశింపజేస్తాము.

Verse 32

وَلَا تَتَمَنَّوْا۟ مَا فَضَّلَ ٱللَّهُ بِهِۦ بَعْضَكُمْ عَلَىٰ بَعْضٍ ۚ لِّلرِّجَالِ نَصِيبٌ مِّمَّا ٱكْتَسَبُوا۟ ۖ وَلِلنِّسَآءِ نَصِيبٌ مِّمَّا ٱكْتَسَبْنَ ۚ وَسْـَٔلُوا۟ ٱللَّهَ مِن فَضْلِهِۦٓ ۗ إِنَّ ٱللَّهَ كَانَ بِكُلِّ شَىْءٍ عَلِيمًا

Transliteration walā tatamannaw mā faḍḍala l-lahu bihi baʿḍakum ʿalā baʿḍin lilrrijāli naṣībun mimmā ik'tasabū walilnnisāi naṣībun mimmā ik'tasabna wasalū l-laha min faḍlihi inna l-laha kāna bikulli shayin ʿalīman

Telugu మరియు అల్లాహ్ మీలో కొందరికి మరికొందరిపై ఇచ్చిన ఘనతను మీరు ఆశించకండి. పురుషులకు తాము సంపాదించిన దానికి తగినట్లుగా ఫలితం ఉంటుంది. మరియు స్త్రీలకు తాము సంపాదించిన దానికి తగినట్లుగా ఫలితం ఉంటుంది. మరియు అల్లాహ్ అనుగ్రహం కొరకు ప్రార్థిస్తూ ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రతిదాని పరిజ్ఞానం ఉంది.

Verse 33

وَلِكُلٍّ جَعَلْنَا مَوَٰلِىَ مِمَّا تَرَكَ ٱلْوَٰلِدَانِ وَٱلْأَقْرَبُونَ ۚ وَٱلَّذِينَ عَقَدَتْ أَيْمَـٰنُكُمْ فَـَٔاتُوهُمْ نَصِيبَهُمْ ۚ إِنَّ ٱللَّهَ كَانَ عَلَىٰ كُلِّ شَىْءٍ شَهِيدًا

Transliteration walikullin jaʿalnā mawāliya mimmā taraka l-wālidāni wal-aqrabūna wa-alladhīna ʿaqadat aymānukum faātūhum naṣībahum inna l-laha kāna ʿalā kulli shayin shahīdan

Telugu మరియు తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు, వదలి పోయిన ప్రతి వ్యక్తి (ఆస్తి)కి మేము వారసులను నియమించి ఉన్నాము. మరియు మీరు ఎవరితో ప్రమాణ పూర్వక ఒప్పందాలను చేసుకొని ఉన్నారో! వారి భాగాన్ని వారికి ఇచ్చి వేయండి. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదానికి సాక్షిగా ఉంటాడు.

Verse 34

ٱلرِّجَالُ قَوَّٰمُونَ عَلَى ٱلنِّسَآءِ بِمَا فَضَّلَ ٱللَّهُ بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ وَبِمَآ أَنفَقُوا۟ مِنْ أَمْوَٰلِهِمْ ۚ فَٱلصَّـٰلِحَـٰتُ قَـٰنِتَـٰتٌ حَـٰفِظَـٰتٌ لِّلْغَيْبِ بِمَا حَفِظَ ٱللَّهُ ۚ وَٱلَّـٰتِى تَخَافُونَ نُشُوزَهُنَّ فَعِظُوهُنَّ وَٱهْجُرُوهُنَّ فِى ٱلْمَضَاجِعِ وَٱضْرِبُوهُنَّ ۖ فَإِنْ أَطَعْنَكُمْ فَلَا تَبْغُوا۟ عَلَيْهِنَّ سَبِيلًا ۗ إِنَّ ٱللَّهَ كَانَ عَلِيًّا كَبِيرًا

Transliteration al-rijālu qawwāmūna ʿalā l-nisāi bimā faḍḍala l-lahu baʿḍahum ʿalā baʿḍin wabimā anfaqū min amwālihim fal-ṣāliḥātu qānitātun ḥāfiẓātun lil'ghaybi bimā ḥafiẓa l-lahu wa-allātī takhāfūna nushūzahunna faʿiẓūhunna wa-uh'jurūhunna fī l-maḍājiʿi wa-iḍ'ribūhunna fa-in aṭaʿnakum falā tabghū ʿalayhinna sabīlan inna l-laha kāna ʿaliyyan kabīran

Telugu పురుషులు స్త్రీలపై నిర్వాహకులు (ఖవ్వామూన్), ఎందుకంటే అల్లాహ్ కొందరికి మరికొందరిపై ఘనత నిచ్చాడు మరియు వారు (పురుషులు) తమ సంపదలో నుండి వారిపై (స్త్రీలపై) ఖర్చు చేస్తారు. కావున సుగుణవంతులైన స్త్రీలు విధేయవతులై ఉండి, భర్తలు లేనప్పుడు, అల్లాహ్ కాపాడమని ఆజ్ఞాపించిన దానిని (శీలమును) కాపాడుకుంటారు. కానీ అవిధేయత చూపుతారని మీకు భయముంటే, వారికి (మొదట) నచ్చజెప్పండి, (తరువాత) పడకలో వేరుగా ఉంచండి, (ఆ తరువాత కూడా వారు విధేయులు కాకపోతే) వారిని (మెల్లగా) కొట్టండి. కాని వారు మీకు విధేయులై ఉంటే! వారిని నిందించటానికి మార్గం వెతకకండి. నిశ్చయంగా, అల్లాహ్ మహోన్నతుడు, మహనీయుడు.

Verse 35

وَإِنْ خِفْتُمْ شِقَاقَ بَيْنِهِمَا فَٱبْعَثُوا۟ حَكَمًا مِّنْ أَهْلِهِۦ وَحَكَمًا مِّنْ أَهْلِهَآ إِن يُرِيدَآ إِصْلَـٰحًا يُوَفِّقِ ٱللَّهُ بَيْنَهُمَآ ۗ إِنَّ ٱللَّهَ كَانَ عَلِيمًا خَبِيرًا

Transliteration wa-in khif'tum shiqāqa baynihimā fa-ib'ʿathū ḥakaman min ahlihi waḥakaman min ahlihā in yurīdā iṣ'lāḥan yuwaffiqi l-lahu baynahumā inna l-laha kāna ʿalīman khabīran

Telugu మరియు వారిద్దరి (భార్యాభర్తల) మధ్య సంబంధాలు తెగి పోతాయనే భయం మీకు కలిగితే అతని (భర్త) బంధువుల నుండి ఒక మధ్యవర్తిని మరియు ఆమె (భార్య) బంధువుల నుండి ఒక మధ్యవర్తిని నియమించండి. వారిద్దరూ సంధి చేసుకో గోరితే అల్లాహ్ వారి మధ్య ఐకమత్యం చేకూర్చవచ్చు! నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు.

Verse 36

۞ وَٱعْبُدُوا۟ ٱللَّهَ وَلَا تُشْرِكُوا۟ بِهِۦ شَيْـًٔا ۖ وَبِٱلْوَٰلِدَيْنِ إِحْسَـٰنًا وَبِذِى ٱلْقُرْبَىٰ وَٱلْيَتَـٰمَىٰ وَٱلْمَسَـٰكِينِ وَٱلْجَارِ ذِى ٱلْقُرْبَىٰ وَٱلْجَارِ ٱلْجُنُبِ وَٱلصَّاحِبِ بِٱلْجَنۢبِ وَٱبْنِ ٱلسَّبِيلِ وَمَا مَلَكَتْ أَيْمَـٰنُكُمْ ۗ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ مَن كَانَ مُخْتَالًا فَخُورًا

Transliteration wa-uʿ'budū l-laha walā tush'rikū bihi shayan wabil-wālidayni iḥ'sānan wabidhī l-qur'bā wal-yatāmā wal-masākīni wal-jāri dhī l-qur'bā wal-jāri l-junubi wal-ṣāḥibi bil-janbi wa-ib'ni l-sabīli wamā malakat aymānukum inna l-laha lā yuḥibbu man kāna mukh'tālan fakhūran

Telugu మరియు మీరు అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఎవ్వరినీ ఆయనకు భాగస్వాములుగా సాటి కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో, దగ్గరి బంధువులతో అనాథులతో, నిరుపేదలతో, బంధువులైన పొరుగువారితో, అపరిచితులైన పొరుగువారితో, ప్రక్కనున్న మిత్రులతో, బాటసారులతో మరియు మీ ఆధీనంలో ఉన్న బానిసలతో అందరితోనూ ఉదార స్వభావంతో వ్యవహరించండి. నిశ్చయంగా, అల్లాహ్ గర్వితుణ్ణి, బడాయీలు చెప్పుకునే వాణ్ణి ప్రేమించడు.

Verse 37

ٱلَّذِينَ يَبْخَلُونَ وَيَأْمُرُونَ ٱلنَّاسَ بِٱلْبُخْلِ وَيَكْتُمُونَ مَآ ءَاتَىٰهُمُ ٱللَّهُ مِن فَضْلِهِۦ ۗ وَأَعْتَدْنَا لِلْكَـٰفِرِينَ عَذَابًا مُّهِينًا

Transliteration alladhīna yabkhalūna wayamurūna l-nāsa bil-bukh'li wayaktumūna mā ātāhumu l-lahu min faḍlihi wa-aʿtadnā lil'kāfirīna ʿadhāban muhīnan

Telugu ఎవరైతే తాము లోభులై, ఇతరులకు లోభం నేర్పుతారో వారినీ మరియు అల్లాహ్ తన అనుగ్రహంతో ఇచ్చిన దానిని దాచి పెట్టే వారినీ (అల్లాహ్ ప్రేమించడు). మరియు మేము సత్యతిరస్కారుల కొరకు అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము.

Verse 38

وَٱلَّذِينَ يُنفِقُونَ أَمْوَٰلَهُمْ رِئَآءَ ٱلنَّاسِ وَلَا يُؤْمِنُونَ بِٱللَّهِ وَلَا بِٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ ۗ وَمَن يَكُنِ ٱلشَّيْطَـٰنُ لَهُۥ قَرِينًا فَسَآءَ قَرِينًا

Transliteration wa-alladhīna yunfiqūna amwālahum riāa l-nāsi walā yu'minūna bil-lahi walā bil-yawmi l-ākhiri waman yakuni l-shayṭānu lahu qarīnan fasāa qarīnan

Telugu మరియు వారికి, ఎవరైతే ప్రజలకు చూపటానికి తమ సంపదను ఖర్చుపెడతారో మరియు అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించరో! మరియు ఎవడైతే షైతాన్ ను తన స్నేహితునిగా (ఖరీనున్ గా) చేసుకుంటాడో! అతడు ఎంత నీచమైన స్నేహితుడు.

Verse 39

وَمَاذَا عَلَيْهِمْ لَوْ ءَامَنُوا۟ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ وَأَنفَقُوا۟ مِمَّا رَزَقَهُمُ ٱللَّهُ ۚ وَكَانَ ٱللَّهُ بِهِمْ عَلِيمًا

Transliteration wamādhā ʿalayhim law āmanū bil-lahi wal-yawmi l-ākhiri wa-anfaqū mimmā razaqahumu l-lahu wakāna l-lahu bihim ʿalīman

Telugu మరియు వారు ఒకవేళ అల్లాహ్ ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఇతరులపై ఖర్చుచేసి ఉంటే వారికే మయ్యేది? మరియు అల్లాహ్ కు, వారిని గురించి బాగా తెలుసు.

Verse 40

إِنَّ ٱللَّهَ لَا يَظْلِمُ مِثْقَالَ ذَرَّةٍ ۖ وَإِن تَكُ حَسَنَةً يُضَـٰعِفْهَا وَيُؤْتِ مِن لَّدُنْهُ أَجْرًا عَظِيمًا

Transliteration inna l-laha lā yaẓlimu mith'qāla dharratin wa-in taku ḥasanatan yuḍāʿif'hā wayu'ti min ladun'hu ajran ʿaẓīman

Telugu నిశ్చయంగా, అల్లాహ్ ఎవరికీ రవ్వంత (పరమాణువంత) అన్యాయం కూడా చేయడు. ఒక సత్కార్యముంటే ఆయన దానిని రెండింతలు చేస్తాడు; మరియు తన తరఫు నుండి గొప్ప ప్రతిఫలాన్ని కూడా ప్రసాదిస్తాడు.

Verse 41

فَكَيْفَ إِذَا جِئْنَا مِن كُلِّ أُمَّةٍۭ بِشَهِيدٍ وَجِئْنَا بِكَ عَلَىٰ هَـٰٓؤُلَآءِ شَهِيدًا

Transliteration fakayfa idhā ji'nā min kulli ummatin bishahīdin waji'nā bika ʿalā hāulāi shahīdan

Telugu మేము (ప్రతిఫల దినమున) ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని తెచ్చి మరియు (ఓ ప్రవక్తా!) నిన్ను వీరికి సాక్షిగా నిలబెట్టినప్పుడు ఎలా ఉంటుంది?

Verse 42

يَوْمَئِذٍ يَوَدُّ ٱلَّذِينَ كَفَرُوا۟ وَعَصَوُا۟ ٱلرَّسُولَ لَوْ تُسَوَّىٰ بِهِمُ ٱلْأَرْضُ وَلَا يَكْتُمُونَ ٱللَّهَ حَدِيثًا

Transliteration yawma-idhin yawaddu alladhīna kafarū waʿaṣawū l-rasūla law tusawwā bihimu l-arḍu walā yaktumūna l-laha ḥadīthan

Telugu ఆ (ప్రతిఫల) దినమున, ప్రవక్త మాటను తిరస్కరించి, అతనికి అవిధేయత చూపిన వారంతా; తాము భూమిలో పూడ్చబడితే ఎంత బాగుండేదని కోరుతారు! కానీ, వారు అల్లాహ్ ముందు ఏ విషయాన్నీ దాచలేరు.

Verse 43

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَقْرَبُوا۟ ٱلصَّلَوٰةَ وَأَنتُمْ سُكَـٰرَىٰ حَتَّىٰ تَعْلَمُوا۟ مَا تَقُولُونَ وَلَا جُنُبًا إِلَّا عَابِرِى سَبِيلٍ حَتَّىٰ تَغْتَسِلُوا۟ ۚ وَإِن كُنتُم مَّرْضَىٰٓ أَوْ عَلَىٰ سَفَرٍ أَوْ جَآءَ أَحَدٌ مِّنكُم مِّنَ ٱلْغَآئِطِ أَوْ لَـٰمَسْتُمُ ٱلنِّسَآءَ فَلَمْ تَجِدُوا۟ مَآءً فَتَيَمَّمُوا۟ صَعِيدًا طَيِّبًا فَٱمْسَحُوا۟ بِوُجُوهِكُمْ وَأَيْدِيكُمْ ۗ إِنَّ ٱللَّهَ كَانَ عَفُوًّا غَفُورًا

Transliteration yāayyuhā alladhīna āmanū lā taqrabū l-ṣalata wa-antum sukārā ḥattā taʿlamū mā taqūlūna walā junuban illā ʿābirī sabīlin ḥattā taghtasilū wa-in kuntum marḍā aw ʿalā safarin aw jāa aḥadun minkum mina l-ghāiṭi aw lāmastumu l-nisāa falam tajidū māan fatayammamū ṣaʿīdan ṭayyiban fa-im'saḥū biwujūhikum wa-aydīkum inna l-laha kāna ʿafuwwan ghafūran

Telugu ఓ విశ్వాసులారా! మీరు మత్తులో ఉంటే, మీరు పలికేది గ్రహించనంత వరకు మరియు మీకు ఇంద్రియ స్ఖలనం (జునుబున్) అయి ఉంటే - స్నానం చేయనంత వరకు - నమాజ్ సమీపానికి వెళ్లకండి; కాని నడుస్తూ (మస్జిద్) నుండి దాట వలసి వస్తే తప్ప. కాని ఒకవేళ మీరు రోగపీడితులై ఉంటే, లేదా ప్రయాణంలో ఉంటే, లేక మలమూత్రవిసర్జన చేసి ఉంటే, లేక స్త్రీలతో సంభోగం చేసి ఉంటే - మీకు నీళ్ళు దొరక్కపోతే - పరిశుద్ధమైన మట్టిని చేతులతో స్పర్శించి, ఆ చేతులతో మీ ముఖాలను మరియు మీ చేతులను, తుడుచుకోండి (తయమ్మమ్ చేయండి). నిశ్చయంగా అల్లాహ్ తప్పులను మన్నించేవాడు, క్షమించేవాడు.

Verse 44

أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ أُوتُوا۟ نَصِيبًا مِّنَ ٱلْكِتَـٰبِ يَشْتَرُونَ ٱلضَّلَـٰلَةَ وَيُرِيدُونَ أَن تَضِلُّوا۟ ٱلسَّبِيلَ

Transliteration alam tara ilā alladhīna ūtū naṣīban mina l-kitābi yashtarūna l-ḍalālata wayurīdūna an taḍillū l-sabīla

Telugu ఏమీ? గ్రంథజ్ఞానంలో కొంతభాగం ఇవ్వబడిన వారిని గురించి నీకు తెలియదా (చూడలేదా)? వారు మార్గభ్రష్టత్వాన్ని కొనుక్కుంటున్నారు మరియు మీరు కూడా సన్మార్గం నుండి తప్పిపోవాలని కోరుతున్నారు.

Verse 45

وَٱللَّهُ أَعْلَمُ بِأَعْدَآئِكُمْ ۚ وَكَفَىٰ بِٱللَّهِ وَلِيًّا وَكَفَىٰ بِٱللَّهِ نَصِيرًا

Transliteration wal-lahu aʿlamu bi-aʿdāikum wakafā bil-lahi waliyyan wakafā bil-lahi naṣīran

Telugu మరియు అల్లాహ్ మీ శత్రువులను బాగా ఎరుగును. కావున మీ రక్షకుడుగా అల్లాహ్ యే చాలు మరియు మీకు సహాయకుడుగా కూడా అల్లాహ్ యే చాలు!

Verse 46

مِّنَ ٱلَّذِينَ هَادُوا۟ يُحَرِّفُونَ ٱلْكَلِمَ عَن مَّوَاضِعِهِۦ وَيَقُولُونَ سَمِعْنَا وَعَصَيْنَا وَٱسْمَعْ غَيْرَ مُسْمَعٍ وَرَٰعِنَا لَيًّۢا بِأَلْسِنَتِهِمْ وَطَعْنًا فِى ٱلدِّينِ ۚ وَلَوْ أَنَّهُمْ قَالُوا۟ سَمِعْنَا وَأَطَعْنَا وَٱسْمَعْ وَٱنظُرْنَا لَكَانَ خَيْرًا لَّهُمْ وَأَقْوَمَ وَلَـٰكِن لَّعَنَهُمُ ٱللَّهُ بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُونَ إِلَّا قَلِيلًا

Transliteration mina alladhīna hādū yuḥarrifūna l-kalima ʿan mawāḍiʿihi wayaqūlūna samiʿ'nā waʿaṣaynā wa-is'maʿ ghayra mus'maʿin warāʿinā layyan bi-alsinatihim waṭaʿnan fī l-dīni walaw annahum qālū samiʿ'nā wa-aṭaʿnā wa-is'maʿ wa-unẓur'nā lakāna khayran lahum wa-aqwama walākin laʿanahumu l-lahu bikuf'rihim falā yu'minūna illā qalīlan

Telugu యూదులలో కొందరు పదాలను వాటి సందర్భాల నుండి తారుమారు చేసి అంటారు: "మేము (నీ మాటలను) విన్నాము మరియు ఉల్లంఘించాము (సమి'అనా వ 'అ'సయ్ నా)." అనీ; మరియు: "విను! నీ మాట వినకబోవు గాక! (వస్ మ 'అ 'గైర మస్ మ'ఇన్)." అనీ; మరియు (ఓ ముహమ్మద్!) నీవు మా మాట విను (రా'ఇనా) అనీ తమ నాలుకలను మెలి త్రిప్పి సత్యధర్మాన్ని ఎగతాళి చేసే ఉద్దేశ్యంతో అంటారు. కాని అలా కాకుండా: "విన్నాము, విధేయులమయ్యాము. (సమి'అనా వ అ'త'అనా)." అనీ; మరియు: "మమ్మల్ని విను మరియు మా దిక్కుచూడు / మాకు వ్యవధినివ్వు (వస్ మ'అ వన్'జుర్ నా)," అనీ, అని ఉంటే వారికే మేలై ఉండేది మరియు ఉత్తమమైన పద్ధతిగా ఉండేది. కాని వారి సత్యతిరస్కార వైఖరి వల్ల అల్లాహ్ వారిని శపించాడు (బహిష్కరించాడు). కావున వారిలో కొందరు మాత్రమే విశ్వసించేవారు ఉన్నారు.

Verse 47

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَـٰبَ ءَامِنُوا۟ بِمَا نَزَّلْنَا مُصَدِّقًا لِّمَا مَعَكُم مِّن قَبْلِ أَن نَّطْمِسَ وُجُوهًا فَنَرُدَّهَا عَلَىٰٓ أَدْبَارِهَآ أَوْ نَلْعَنَهُمْ كَمَا لَعَنَّآ أَصْحَـٰبَ ٱلسَّبْتِ ۚ وَكَانَ أَمْرُ ٱللَّهِ مَفْعُولًا

Transliteration yāayyuhā alladhīna ūtū l-kitāba āminū bimā nazzalnā muṣaddiqan limā maʿakum min qabli an naṭmisa wujūhan fanaruddahā ʿalā adbārihā aw nalʿanahum kamā laʿannā aṣḥāba l-sabti wakāna amru l-lahi mafʿūlan

Telugu ఓ గ్రంథ ప్రజలారా! మీ వద్ద ఉన్న గ్రంథాన్ని ధృవపరుస్తూ, మేము అవతరింపజేసిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించండి, మేము మీ ముఖాలను వికృతం చేసి వాటిని వెనక్కి త్రిప్పక ముందే (నాశనం చేయక ముందే). లేక మేము సబ్త్ వారిని శపించినట్లుగా (బహిష్కరించినట్లుగా) మిమ్మల్ని కూడా శపించక (బహిష్కరించక) ముందే (దీనిని విశ్వసించండి). ఎందుకంటే! అల్లాహ్ ఆజ్ఞ తప్పకుండా నిర్వహించబడుతుంది.

Verse 48

إِنَّ ٱللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِۦ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَآءُ ۚ وَمَن يُشْرِكْ بِٱللَّهِ فَقَدِ ٱفْتَرَىٰٓ إِثْمًا عَظِيمًا

Transliteration inna l-laha lā yaghfiru an yush'raka bihi wayaghfiru mā dūna dhālika liman yashāu waman yush'rik bil-lahi faqadi if'tarā ith'man ʿaẓīman

Telugu నిశ్చయంగా, అల్లాహ్ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించడు. మరియు అది తప్ప దేనిని (ఏ పాపాన్ని) అయినా, ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ కు భాగస్వాములను కల్పించినవాడే, వాస్తవానికి మహాపాపం చేసిన వాడు!

Verse 49

أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ يُزَكُّونَ أَنفُسَهُم ۚ بَلِ ٱللَّهُ يُزَكِّى مَن يَشَآءُ وَلَا يُظْلَمُونَ فَتِيلًا

Transliteration alam tara ilā alladhīna yuzakkūna anfusahum bali l-lahu yuzakkī man yashāu walā yuẓ'lamūna fatīlan

Telugu ఏమీ? తమను తాము పవిత్రులమని చెప్పుకునేవారిని (యూదులు మరియు క్రైస్తవులను) గురించి నీకు తెలియదా (చూడలేదా)? వాస్తవానికి, అల్లాహ్ తాను కోరిన వారికి మాత్రమే పవిత్రతను ప్రసాదిస్తాడు. మరియు వారికి ఖర్జూర బీజపు చీలికలోని పొర అంత అన్యాయం కూడా చేయబడదు.

Verse 50

ٱنظُرْ كَيْفَ يَفْتَرُونَ عَلَى ٱللَّهِ ٱلْكَذِبَ ۖ وَكَفَىٰ بِهِۦٓ إِثْمًا مُّبِينًا

Transliteration unẓur kayfa yaftarūna ʿalā l-lahi l-kadhiba wakafā bihi ith'man mubīnan

Telugu చూడండి! వారు అల్లాహ్ ను గురించి ఏ విధమైన అబద్ధాన్ని కల్పిస్తున్నారో? మరియు స్పష్టమైన పాపం, అని చెప్పటానికి ఇది చాలు.

Verse 51

أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ أُوتُوا۟ نَصِيبًا مِّنَ ٱلْكِتَـٰبِ يُؤْمِنُونَ بِٱلْجِبْتِ وَٱلطَّـٰغُوتِ وَيَقُولُونَ لِلَّذِينَ كَفَرُوا۟ هَـٰٓؤُلَآءِ أَهْدَىٰ مِنَ ٱلَّذِينَ ءَامَنُوا۟ سَبِيلًا

Transliteration alam tara ilā alladhīna ūtū naṣīban mina l-kitābi yu'minūna bil-jib'ti wal-ṭāghūti wayaqūlūna lilladhīna kafarū hāulāi ahdā mina alladhīna āmanū sabīlan

Telugu ఏమీ? గ్రంథజ్ఞానంలో కొంతభాగం ఇవ్వబడిన వారిని గురించి నీకు తెలియదా ? వారు జిబ్త్ మరియు తాగూత్ లలో విశ్వాసముంచుతున్నారు. వారు సత్యతిరస్కారులను గురించి: "విశ్వాసుల కంటే, వీరే సరైన మార్గంలో ఉన్నారు." అని అంటారు.

Verse 52

أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ لَعَنَهُمُ ٱللَّهُ ۖ وَمَن يَلْعَنِ ٱللَّهُ فَلَن تَجِدَ لَهُۥ نَصِيرًا

Transliteration ulāika alladhīna laʿanahumu l-lahu waman yalʿani l-lahu falan tajida lahu naṣīran

Telugu ఇలాంటి వారే, అల్లాహ్ శాపానికి (బహిష్కారానికి) గురి అయిన వారు. మరియు అల్లాహ్ శపించిన వాడికి సహాయపడేవాడిని ఎవ్వడినీ నీవు పొందలేవు.

Verse 53

أَمْ لَهُمْ نَصِيبٌ مِّنَ ٱلْمُلْكِ فَإِذًا لَّا يُؤْتُونَ ٱلنَّاسَ نَقِيرًا

Transliteration am lahum naṣībun mina l-mul'ki fa-idhan lā yu'tūna l-nāsa naqīran

Telugu లేదా వారికి రాజ్యపాలనలో భాగం ఉందా? ఒకవేళ ఉండి ఉంటే, వారు ప్రజలకు ఖర్జూర బీజపు చీలిక అంత భాగం కూడా ఇచ్చేవారు కాదు.

Verse 54

أَمْ يَحْسُدُونَ ٱلنَّاسَ عَلَىٰ مَآ ءَاتَىٰهُمُ ٱللَّهُ مِن فَضْلِهِۦ ۖ فَقَدْ ءَاتَيْنَآ ءَالَ إِبْرَٰهِيمَ ٱلْكِتَـٰبَ وَٱلْحِكْمَةَ وَءَاتَيْنَـٰهُم مُّلْكًا عَظِيمًا

Transliteration am yaḥsudūna l-nāsa ʿalā mā ātāhumu l-lahu min faḍlihi faqad ātaynā āla ib'rāhīma l-kitāba wal-ḥik'mata waātaynāhum mul'kan ʿaẓīman

Telugu లేదా! అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రజలకు ప్రసాదించిన (సౌభాగ్యాన్ని) చూసి వారు ఈర్ష్య పడుతున్నారా? వాస్తవానికి (ఇంతకు ముందు) మేము ఇబ్రాహీమ్ కుటుంబం వారికి, గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించాము. మరియు వారికి గొప్ప సామ్రాజ్యాన్ని కూడా ప్రదానం చేశాము.

Verse 55

فَمِنْهُم مَّنْ ءَامَنَ بِهِۦ وَمِنْهُم مَّن صَدَّ عَنْهُ ۚ وَكَفَىٰ بِجَهَنَّمَ سَعِيرًا

Transliteration famin'hum man āmana bihi wamin'hum man ṣadda ʿanhu wakafā bijahannama saʿīran

Telugu కాని వారిలో కొందరు అతనిని (ప్రవక్తను) విశ్వసించిన వారు ఉన్నారు, మరికొందరు అతని నుండి విముఖులైన వారూ ఉన్నారు. మరియు వారికి దహించే నరకాగ్నియే చాలు!

Verse 56

إِنَّ ٱلَّذِينَ كَفَرُوا۟ بِـَٔايَـٰتِنَا سَوْفَ نُصْلِيهِمْ نَارًا كُلَّمَا نَضِجَتْ جُلُودُهُم بَدَّلْنَـٰهُمْ جُلُودًا غَيْرَهَا لِيَذُوقُوا۟ ٱلْعَذَابَ ۗ إِنَّ ٱللَّهَ كَانَ عَزِيزًا حَكِيمًا

Transliteration inna alladhīna kafarū biāyātinā sawfa nuṣ'līhim nāran kullamā naḍijat julūduhum baddalnāhum julūdan ghayrahā liyadhūqū l-ʿadhāba inna l-laha kāna ʿazīzan ḥakīman

Telugu నిశ్చయంగా, ఎవరు మా సూచనలను తిరస్కరించారో! వారిని మేము మున్ముందు నరకాగ్నిలో పడవేస్తాము. ప్రతిసారీ వారి చర్మాలు కాలిపోయి నపుడల్లా వాటికి బదులుగా - వారు బాధను బాగా రుచి చూడటానికి - వేరే చర్మాలతో మార్చుతాము. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు మహావివేచనాపరుడు.

Verse 57

وَٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ سَنُدْخِلُهُمْ جَنَّـٰتٍ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ خَـٰلِدِينَ فِيهَآ أَبَدًا ۖ لَّهُمْ فِيهَآ أَزْوَٰجٌ مُّطَهَّرَةٌ ۖ وَنُدْخِلُهُمْ ظِلًّا ظَلِيلًا

Transliteration wa-alladhīna āmanū waʿamilū l-ṣāliḥāti sanud'khiluhum jannātin tajrī min taḥtihā l-anhāru khālidīna fīhā abadan lahum fīhā azwājun muṭahharatun wanud'khiluhum ẓillan ẓalīlan

Telugu మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారిని మేము క్రింద కాలువలు ప్రవహించే వనాలలో ప్రవేశింపజేస్తాము; వారందులో, శాశ్వతంగా కలకాలం ఉంటారు. అందు వారికి పవిత్ర సహవాసులు (అజ్వాజ్) ఉంటారు. మరియు మేము వారిని దట్టమైన నీడలలో ప్రవేశింపజేస్తాము.

Verse 58

۞ إِنَّ ٱللَّهَ يَأْمُرُكُمْ أَن تُؤَدُّوا۟ ٱلْأَمَـٰنَـٰتِ إِلَىٰٓ أَهْلِهَا وَإِذَا حَكَمْتُم بَيْنَ ٱلنَّاسِ أَن تَحْكُمُوا۟ بِٱلْعَدْلِ ۚ إِنَّ ٱللَّهَ نِعِمَّا يَعِظُكُم بِهِۦٓ ۗ إِنَّ ٱللَّهَ كَانَ سَمِيعًۢا بَصِيرًا

Transliteration inna l-laha yamurukum an tu-addū l-amānāti ilā ahlihā wa-idhā ḥakamtum bayna l-nāsi an taḥkumū bil-ʿadli inna l-laha niʿimmā yaʿiẓukum bihi inna l-laha kāna samīʿan baṣīran

Telugu పూచీలను (అమానాత్ లను) తప్పక వాటికి అర్హులైన వారికి అప్పగించండనీ మరియు ప్రజల మధ్య తీర్పు చేసేటప్పుడు న్యాయంగా తీర్పు చేయండనీ, అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. నిశ్చయంగా, అల్లాహ్ ఎంత ఉత్తమమైన హితబోధ చేస్తున్నాడు! నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.

Verse 59

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ أَطِيعُوا۟ ٱللَّهَ وَأَطِيعُوا۟ ٱلرَّسُولَ وَأُو۟لِى ٱلْأَمْرِ مِنكُمْ ۖ فَإِن تَنَـٰزَعْتُمْ فِى شَىْءٍ فَرُدُّوهُ إِلَى ٱللَّهِ وَٱلرَّسُولِ إِن كُنتُمْ تُؤْمِنُونَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ ۚ ذَٰلِكَ خَيْرٌ وَأَحْسَنُ تَأْوِيلًا

Transliteration yāayyuhā alladhīna āmanū aṭīʿū l-laha wa-aṭīʿū l-rasūla wa-ulī l-amri minkum fa-in tanāzaʿtum fī shayin faruddūhu ilā l-lahi wal-rasūli in kuntum tu'minūna bil-lahi wal-yawmi l-ākhiri dhālika khayrun wa-aḥsanu tawīlan

Telugu ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి; మరియు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి మరియు మీలో అధికారం అప్పగించబడిన వారికి కూడా! మీ మధ్య ఏ విషయంలోనైనా అభిప్రాయ భేదం కలిగితే - మీరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారే అయితే - ఆ విషయాన్ని అల్లాహ్ కు మరియు ప్రవక్తకు నివేదించండి. ఇదే సరైన పద్ధతి మరియు ఫలితాన్ని బట్టి కూడా ఉత్తమమైనది.

Verse 60

أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ يَزْعُمُونَ أَنَّهُمْ ءَامَنُوا۟ بِمَآ أُنزِلَ إِلَيْكَ وَمَآ أُنزِلَ مِن قَبْلِكَ يُرِيدُونَ أَن يَتَحَاكَمُوٓا۟ إِلَى ٱلطَّـٰغُوتِ وَقَدْ أُمِرُوٓا۟ أَن يَكْفُرُوا۟ بِهِۦ وَيُرِيدُ ٱلشَّيْطَـٰنُ أَن يُضِلَّهُمْ ضَلَـٰلًۢا بَعِيدًا

Transliteration alam tara ilā alladhīna yazʿumūna annahum āmanū bimā unzila ilayka wamā unzila min qablika yurīdūna an yataḥākamū ilā l-ṭāghūti waqad umirū an yakfurū bihi wayurīdu l-shayṭānu an yuḍillahum ḍalālan baʿīdan

Telugu (ఓ ప్రవక్తా!) ఏమీ? నీ వద్దకు పంపబడిన దానిని మరియు నీ కంటే పూర్వం పంపబడిన దానిని మేము విశ్వసించామని పలికే వారిని (కపట విశ్వాసులను) నీవు ఎరుగవా (చూడలేదా)? తిరస్కరించండని ఆదేశింపబడినా, వారు తమ (వ్యవహారాల) పరిష్కారాలకు తాగూత్ వద్దకే పోవాలని కోరుతూ ఉంటారు. మరియు షైతాన్ వారిని, త్రోవ తప్పించి, దుర్మార్గంలో అతి దూరంగా తీసుకొని పోవాలని కోరుతుంటాడు.

Verse 61

وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا۟ إِلَىٰ مَآ أَنزَلَ ٱللَّهُ وَإِلَى ٱلرَّسُولِ رَأَيْتَ ٱلْمُنَـٰفِقِينَ يَصُدُّونَ عَنكَ صُدُودًا

Transliteration wa-idhā qīla lahum taʿālaw ilā mā anzala l-lahu wa-ilā l-rasūli ra-ayta l-munāfiqīna yaṣuddūna ʿanka ṣudūdan

Telugu మరియు వారితో: "అల్లాహ్ అవతరింపజేసిన వాటి (ఆదేశాల) వైపునకు మరియు ప్రవక్త వైపునకు రండి." అని చెప్పినపుడు, నీవు ఆ కపట విశ్వాసులను విముఖులై (నీ వైపునకు రాకుండా) తొలిగి పోవటాన్ని చూస్తావు!

Verse 62

فَكَيْفَ إِذَآ أَصَـٰبَتْهُم مُّصِيبَةٌۢ بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ثُمَّ جَآءُوكَ يَحْلِفُونَ بِٱللَّهِ إِنْ أَرَدْنَآ إِلَّآ إِحْسَـٰنًا وَتَوْفِيقًا

Transliteration fakayfa idhā aṣābathum muṣībatun bimā qaddamat aydīhim thumma jāūka yaḥlifūna bil-lahi in aradnā illā iḥ'sānan watawfīqan

Telugu అయితే వారు తమ చేతులారా చేసుకున్న (దుష్కార్యాల) ఫలితంగా వారికి బాధ కలిగినపుడు, వారు నీ దగ్గరకు వచ్చి అల్లాహ్ పేర ప్రమాణాలు చేస్తూ: "మేము మేలు చేయాలనీ మరియు ఐకమత్యం చేకూర్చాలనీ మాత్రమే ప్రయత్నించాము." అని అంటారు.

Verse 63

أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ يَعْلَمُ ٱللَّهُ مَا فِى قُلُوبِهِمْ فَأَعْرِضْ عَنْهُمْ وَعِظْهُمْ وَقُل لَّهُمْ فِىٓ أَنفُسِهِمْ قَوْلًۢا بَلِيغًا

Transliteration ulāika alladhīna yaʿlamu l-lahu mā fī qulūbihim fa-aʿriḍ ʿanhum waʿiẓ'hum waqul lahum fī anfusihim qawlan balīghan

Telugu అలాంటి వారినీ (కపట విశ్వాసులనూ) ! వారి హృదయాలలో ఉన్నదీ అల్లాహ్ ఎరుగును, కావున వారి నుండి ముఖం త్రిప్పుకో, వారికి ఉపదేశం చెయ్యి మరియు వారిని గురించి వారి హృదయాలు ప్రభావితమయ్యే మాట పలుకు.

Verse 64

وَمَآ أَرْسَلْنَا مِن رَّسُولٍ إِلَّا لِيُطَاعَ بِإِذْنِ ٱللَّهِ ۚ وَلَوْ أَنَّهُمْ إِذ ظَّلَمُوٓا۟ أَنفُسَهُمْ جَآءُوكَ فَٱسْتَغْفَرُوا۟ ٱللَّهَ وَٱسْتَغْفَرَ لَهُمُ ٱلرَّسُولُ لَوَجَدُوا۟ ٱللَّهَ تَوَّابًا رَّحِيمًا

Transliteration wamā arsalnā min rasūlin illā liyuṭāʿa bi-idh'ni l-lahi walaw annahum idh ẓalamū anfusahum jāūka fa-is'taghfarū l-laha wa-is'taghfara lahumu l-rasūlu lawajadū l-laha tawwāban raḥīman

Telugu మరియు మేము ఏ ప్రవక్తను పంపినా - అల్లాహ్ అనుజ్ఞతో - (ప్రజలు) అతనిని అనుసరించాలనే పంపాము. మరియు ఒకవేళ వారు తమకు తాము అన్యాయం చేసుకున్నప్పుడు, నీ వద్దకు వచ్చి వారు అల్లాహ్ యొక్క క్షమాభిక్ష కోరినప్పుడు - ప్రవక్త కూడా వారికై అల్లాహ్ యొక్క క్షమాభిక్ష కొరకు వేడుకున్నప్పుడు - వారు అల్లాహ్ ను నిశ్చయంగా, క్షమించేవాడు గానూ మరియు కరుణాప్రదాత గానూ పొందుతారు.

Verse 65

فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُونَ حَتَّىٰ يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا يَجِدُوا۟ فِىٓ أَنفُسِهِمْ حَرَجًا مِّمَّا قَضَيْتَ وَيُسَلِّمُوا۟ تَسْلِيمًا

Transliteration falā warabbika lā yu'minūna ḥattā yuḥakkimūka fīmā shajara baynahum thumma lā yajidū fī anfusihim ḥarajan mimmā qaḍayta wayusallimū taslīman

Telugu అలా కాదు, నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించనంత వరకు మరియు (ఓ ప్రవక్తా!) నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో ఏ మాత్రం సంకోచం లేకుండా దానికి (యథాతథంగా) శిరసావహించనంత వరకు, వారు (నిజమైన) విశ్వాసులు కాలేరు!

Verse 66

وَلَوْ أَنَّا كَتَبْنَا عَلَيْهِمْ أَنِ ٱقْتُلُوٓا۟ أَنفُسَكُمْ أَوِ ٱخْرُجُوا۟ مِن دِيَـٰرِكُم مَّا فَعَلُوهُ إِلَّا قَلِيلٌ مِّنْهُمْ ۖ وَلَوْ أَنَّهُمْ فَعَلُوا۟ مَا يُوعَظُونَ بِهِۦ لَكَانَ خَيْرًا لَّهُمْ وَأَشَدَّ تَثْبِيتًا

Transliteration walaw annā katabnā ʿalayhim ani uq'tulū anfusakum awi ukh'rujū min diyārikum mā faʿalūhu illā qalīlun min'hum walaw annahum faʿalū mā yūʿaẓūna bihi lakāna khayran lahum wa-ashadda tathbītan

Telugu మరియు ఒకవేళ వాస్తవానికి మేము వారిని: "మీ ప్రాణాల బలి ఇవ్వండి లేదా మీ ఇల్లూ వాకిళ్ళను విడిచి వెళ్ళండి!" అని ఆజ్ఞాపించి (విధిగా చేసి) ఉంటే, వారిలో కొందరు మాత్రమే అలా చేసి ఉండేవారు. ఒకవేళ వారికి ఉపదేశించినట్లు వారు చేసి ఉంటే, నిశ్చయంగా, అది వారికే శ్రేయస్కరమైనదిగా మరియు వారి (విశ్వాసాన్ని) దృఢపరిచేదిగా ఉండేది.

Verse 67

وَإِذًا لَّـَٔاتَيْنَـٰهُم مِّن لَّدُنَّآ أَجْرًا عَظِيمًا

Transliteration wa-idhan laātaynāhum min ladunnā ajran ʿaẓīman

Telugu మరియు అప్పుడు వారికి మేము, మా వైపు నుండి గొప్ప ప్రతిఫలం ఇచ్చి ఉండేవారం.

Verse 68

وَلَهَدَيْنَـٰهُمْ صِرَٰطًا مُّسْتَقِيمًا

Transliteration walahadaynāhum ṣirāṭan mus'taqīman

Telugu మరియు మేము వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేసి ఉండేవారం.

Verse 69

وَمَن يُطِعِ ٱللَّهَ وَٱلرَّسُولَ فَأُو۟لَـٰٓئِكَ مَعَ ٱلَّذِينَ أَنْعَمَ ٱللَّهُ عَلَيْهِم مِّنَ ٱلنَّبِيِّـۧنَ وَٱلصِّدِّيقِينَ وَٱلشُّهَدَآءِ وَٱلصَّـٰلِحِينَ ۚ وَحَسُنَ أُو۟لَـٰٓئِكَ رَفِيقًا

Transliteration waman yuṭiʿi l-laha wal-rasūla fa-ulāika maʿa alladhīna anʿama l-lahu ʿalayhim mina l-nabiyīna wal-ṣidīqīna wal-shuhadāi wal-ṣāliḥīna waḥasuna ulāika rafīqan

Telugu మరియు ఎవరు అల్లాహ్ కు మరియు ప్రవక్తకు విధేయులై ఉంటారో, అలాంటి వారు అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ సత్యవంతులతోనూ, (అల్లాహ్) ధర్మం కొరకు ప్రాణాలు కోల్పోయిన అమర వీరుల (షహీదుల) తోనూ, సద్వర్తనులతోనూ చేరి ఉంటారు. మరియు అలాంటి వారి సాంగత్యం ఎంతో మేలైనది!

Verse 70

ذَٰلِكَ ٱلْفَضْلُ مِنَ ٱللَّهِ ۚ وَكَفَىٰ بِٱللَّهِ عَلِيمًا

Transliteration dhālika l-faḍlu mina l-lahi wakafā bil-lahi ʿalīman

Telugu అల్లాహ్ నుండి లభించే అనుగ్రహం ఇలాంటిదే. మరియు (యథార్థం) తెలుసుకోవటానికి అల్లాహ్ చాలు.

Verse 71

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ خُذُوا۟ حِذْرَكُمْ فَٱنفِرُوا۟ ثُبَاتٍ أَوِ ٱنفِرُوا۟ جَمِيعًا

Transliteration yāayyuhā alladhīna āmanū khudhū ḥidh'rakum fa-infirū thubātin awi infirū jamīʿan

Telugu ఓ విశ్వాసులారా! మీరు (అన్ని విధాలుగా యుద్ధానికి సిద్ధమై) తగిన జాగ్రత్తలు వహించండి! మీరు (యుద్ధానికి) జట్లుగానో లేదా అందరూ కలిసియో బయలు దేరండి.

Verse 72

وَإِنَّ مِنكُمْ لَمَن لَّيُبَطِّئَنَّ فَإِنْ أَصَـٰبَتْكُم مُّصِيبَةٌ قَالَ قَدْ أَنْعَمَ ٱللَّهُ عَلَىَّ إِذْ لَمْ أَكُن مَّعَهُمْ شَهِيدًا

Transliteration wa-inna minkum laman layubaṭṭi-anna fa-in aṣābatkum muṣībatun qāla qad anʿama l-lahu ʿalayya idh lam akun maʿahum shahīdan

Telugu మరియు వాస్తవానికి మీలో వెనుక ఉండి పోయేవాడు ఉన్నాడు. ఒకవేళ మీకు ఏమైనా ఆపద వస్తే అప్పుడు వాడు: "వాస్తవానికి అల్లాహ్ నన్ను అనుగ్రహించాడు, అందుకే నేను కూడా వారితో పాటు లేను!" అని అంటాడు.

Verse 73

وَلَئِنْ أَصَـٰبَكُمْ فَضْلٌ مِّنَ ٱللَّهِ لَيَقُولَنَّ كَأَن لَّمْ تَكُنۢ بَيْنَكُمْ وَبَيْنَهُۥ مَوَدَّةٌ يَـٰلَيْتَنِى كُنتُ مَعَهُمْ فَأَفُوزَ فَوْزًا عَظِيمًا

Transliteration wala-in aṣābakum faḍlun mina l-lahi layaqūlanna ka-an lam takun baynakum wabaynahu mawaddatun yālaytanī kuntu maʿahum fa-afūza fawzan ʿaẓīman

Telugu మరియు ఒకవేళ మీకు అల్లాహ్ తరఫు నుండి అనుగ్రహమే లభిస్తే! మీకూ అతనికి మధ్య ఏ విధమైన అనురాగబంధమే లేనట్లుగా: "అయ్యో! నేను కూడా వారితో పాటు ఉండి ఉంటే నాకు కూడా గొప్ప విజయ ఫలితం లభించి ఉండేది కదా!" అని తప్పక అంటాడు.

Verse 74

۞ فَلْيُقَـٰتِلْ فِى سَبِيلِ ٱللَّهِ ٱلَّذِينَ يَشْرُونَ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا بِٱلْـَٔاخِرَةِ ۚ وَمَن يُقَـٰتِلْ فِى سَبِيلِ ٱللَّهِ فَيُقْتَلْ أَوْ يَغْلِبْ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا

Transliteration falyuqātil fī sabīli l-lahi alladhīna yashrūna l-ḥayata l-dun'yā bil-ākhirati waman yuqātil fī sabīli l-lahi fayuq'tal aw yaghlib fasawfa nu'tīhi ajran ʿaẓīman

Telugu కావున ఇహలోక జీవితాన్ని పరలోక జీవిత (సుఖానికి) బదులుగా అమ్మిన వారు (విశ్వాసులు), అల్లాహ్ మార్గంలో పోరాడాలి. మరియు అల్లాహ్ మార్గంలో పోరాడిన వాడు, చంపబడినా, లేదా విజేయుడైనా, మేము తప్పకుండా అతనికి గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించగలము.

Verse 75

وَمَا لَكُمْ لَا تُقَـٰتِلُونَ فِى سَبِيلِ ٱللَّهِ وَٱلْمُسْتَضْعَفِينَ مِنَ ٱلرِّجَالِ وَٱلنِّسَآءِ وَٱلْوِلْدَٰنِ ٱلَّذِينَ يَقُولُونَ رَبَّنَآ أَخْرِجْنَا مِنْ هَـٰذِهِ ٱلْقَرْيَةِ ٱلظَّالِمِ أَهْلُهَا وَٱجْعَل لَّنَا مِن لَّدُنكَ وَلِيًّا وَٱجْعَل لَّنَا مِن لَّدُنكَ نَصِيرًا

Transliteration wamā lakum lā tuqātilūna fī sabīli l-lahi wal-mus'taḍʿafīna mina l-rijāli wal-nisāi wal-wil'dāni alladhīna yaqūlūna rabbanā akhrij'nā min hādhihi l-qaryati l-ẓālimi ahluhā wa-ij'ʿal lanā min ladunka waliyyan wa-ij'ʿal lanā min ladunka naṣīran

Telugu మరియు మీకేమయింది, మీరెందుకు అల్లాహ్ మార్గంలో మరియు నిస్సహాయులై అణచి వేయబడిన పురుషుల, స్త్రీల మరియు పిల్లల కొరకు, పోరాడటం లేదు? వారు: "మా ప్రభూ! దౌర్జన్యపరులైన ఈ నగరవాసుల నుండి మాకు విమోచనం కలిగించు. నీ వద్ద నుండి మా కొరకు ఒక సంరక్షకుణ్ణి నియమించు. మరియు నీ వద్ద నుండి మా కొరకు ఒక సహాయకుణ్ణి ఏర్పాటు చేయి!" అని వేడుకుంటున్నారు.

Verse 76

ٱلَّذِينَ ءَامَنُوا۟ يُقَـٰتِلُونَ فِى سَبِيلِ ٱللَّهِ ۖ وَٱلَّذِينَ كَفَرُوا۟ يُقَـٰتِلُونَ فِى سَبِيلِ ٱلطَّـٰغُوتِ فَقَـٰتِلُوٓا۟ أَوْلِيَآءَ ٱلشَّيْطَـٰنِ ۖ إِنَّ كَيْدَ ٱلشَّيْطَـٰنِ كَانَ ضَعِيفًا

Transliteration alladhīna āmanū yuqātilūna fī sabīli l-lahi wa-alladhīna kafarū yuqātilūna fī sabīli l-ṭāghūti faqātilū awliyāa l-shayṭāni inna kayda l-shayṭāni kāna ḍaʿīfan

Telugu విశ్వసించిన వారు, అల్లాహ్ మార్గంలో పోరాడుతారు. మరియు సత్యతిరస్కారులు తాగూత్ మార్గంలో పోరాడుతారు; కావున మీరు (ఓ విశ్వాసులారా!) షైతాను అనుచరులను విరుద్ధంగా పోరాడండి. నిశ్చయంగా, షైతాను కుట్ర బలహీనమైనదే!

Verse 77

أَلَمْ تَرَ إِلَى ٱلَّذِينَ قِيلَ لَهُمْ كُفُّوٓا۟ أَيْدِيَكُمْ وَأَقِيمُوا۟ ٱلصَّلَوٰةَ وَءَاتُوا۟ ٱلزَّكَوٰةَ فَلَمَّا كُتِبَ عَلَيْهِمُ ٱلْقِتَالُ إِذَا فَرِيقٌ مِّنْهُمْ يَخْشَوْنَ ٱلنَّاسَ كَخَشْيَةِ ٱللَّهِ أَوْ أَشَدَّ خَشْيَةً ۚ وَقَالُوا۟ رَبَّنَا لِمَ كَتَبْتَ عَلَيْنَا ٱلْقِتَالَ لَوْلَآ أَخَّرْتَنَآ إِلَىٰٓ أَجَلٍ قَرِيبٍ ۗ قُلْ مَتَـٰعُ ٱلدُّنْيَا قَلِيلٌ وَٱلْـَٔاخِرَةُ خَيْرٌ لِّمَنِ ٱتَّقَىٰ وَلَا تُظْلَمُونَ فَتِيلًا

Transliteration alam tara ilā alladhīna qīla lahum kuffū aydiyakum wa-aqīmū l-ṣalata waātū l-zakata falammā kutiba ʿalayhimu l-qitālu idhā farīqun min'hum yakhshawna l-nāsa kakhashyati l-lahi aw ashadda khashyatan waqālū rabbanā lima katabta ʿalaynā l-qitāla lawlā akhartanā ilā ajalin qarībin qul matāʿu l-dun'yā qalīlun wal-ākhiratu khayrun limani ittaqā walā tuẓ'lamūna fatīlan

Telugu "మీ చేతులను ఆపుకోండి, నమాజ్ ను స్థాపించండి, విధిదానం (జకాత్) ఇవ్వండి." అని చెప్పబడిన వారిని నీవు చూడలేదా? యుద్ధం చేయమని వారిని ఆదేశించినప్పుడు, వారిలో కొందరు అల్లాహ్ కు భయపడవలసిన విధంగా మానవులకు భయపడుతున్నారు. కాదు! అంతకంటే ఎక్కువగానే భయపడుతున్నారు. వారు: "ఓ మా ప్రభూ! యుద్ధం చేయమని ఈ ఆజ్ఞను మా కొరకు ఎందుకు విధించావు? మాకు ఇంకా కొంత వ్యవధి ఎందుకివ్వలేదు? అని అంటారు. వారితో ఇలా అను: "ఇహలోక సుఖం తుచ్ఛమైనది మరియు దైవభీతి గలవారికి పరలోక సుఖమే ఉత్తమమైనది. మరియు మీకు ఖర్జూర బీజపు చీలికలోని పొర (ఫతీల) అంత అన్యాయం కూడా జరుగదు.

Verse 78

أَيْنَمَا تَكُونُوا۟ يُدْرِككُّمُ ٱلْمَوْتُ وَلَوْ كُنتُمْ فِى بُرُوجٍ مُّشَيَّدَةٍ ۗ وَإِن تُصِبْهُمْ حَسَنَةٌ يَقُولُوا۟ هَـٰذِهِۦ مِنْ عِندِ ٱللَّهِ ۖ وَإِن تُصِبْهُمْ سَيِّئَةٌ يَقُولُوا۟ هَـٰذِهِۦ مِنْ عِندِكَ ۚ قُلْ كُلٌّ مِّنْ عِندِ ٱللَّهِ ۖ فَمَالِ هَـٰٓؤُلَآءِ ٱلْقَوْمِ لَا يَكَادُونَ يَفْقَهُونَ حَدِيثًا

Transliteration aynamā takūnū yud'rikkumu l-mawtu walaw kuntum fī burūjin mushayyadatin wa-in tuṣib'hum ḥasanatun yaqūlū hādhihi min ʿindi l-lahi wa-in tuṣib'hum sayyi-atun yaqūlū hādhihi min ʿindika qul kullun min ʿindi l-lahi famāli hāulāi l-qawmi lā yakādūna yafqahūna ḥadīthan

Telugu "మీరు ఎక్కడున్నా సరే! మీకు చావు వచ్చి తీరుతుంది మరియు మీరు గొప్ప కోట బురుజులలో ఉన్నా చావు రాక తప్పదు." (అని పలుకు). మరియు వారికి ఏమైనా మేలు కలిగితే: "ఇది అల్లాహ్ తరఫు నుండి వచ్చింది." అని అంటారు. కాని వారికేదైనా కీడు గలిగితే: "(ఓ ముహమ్మద్!) ఇది నీ వల్ల జరిగింది." అని అంటారు. వారితో అను: "అంతా అల్లాహ్ తరఫు నుండే (వస్తుంది)!" ఈ జనులకు ఏమయింది? వారు ఏ విషయాన్ని కూడా ఎందుకు అర్థం చేసుకోలేక పోతున్నారు?

Verse 79

مَّآ أَصَابَكَ مِنْ حَسَنَةٍ فَمِنَ ٱللَّهِ ۖ وَمَآ أَصَابَكَ مِن سَيِّئَةٍ فَمِن نَّفْسِكَ ۚ وَأَرْسَلْنَـٰكَ لِلنَّاسِ رَسُولًا ۚ وَكَفَىٰ بِٱللَّهِ شَهِيدًا

Transliteration mā aṣābaka min ḥasanatin famina l-lahi wamā aṣābaka min sayyi-atin famin nafsika wa-arsalnāka lilnnāsi rasūlan wakafā bil-lahi shahīdan

Telugu (ఓ మానవుడా!) నీకు ఏ మేలు జరిగినా అది అల్లాహ్ అనుగ్రహం వల్లనే మరియు నీకు ఏ కీడు జరిగినా అది నీ స్వంత (కర్మల) ఫలితమే! మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను మానవులకు సందేశహరునిగా చేసి పంపాము. మరియు దీనికి అల్లాహ్ సాక్ష్యమే చాలు.

Verse 80

مَّن يُطِعِ ٱلرَّسُولَ فَقَدْ أَطَاعَ ٱللَّهَ ۖ وَمَن تَوَلَّىٰ فَمَآ أَرْسَلْنَـٰكَ عَلَيْهِمْ حَفِيظًا

Transliteration man yuṭiʿi l-rasūla faqad aṭāʿa l-laha waman tawallā famā arsalnāka ʿalayhim ḥafīẓan

Telugu ఎవడు ప్రవక్తకు విధేయత చూపుతాడో వాస్తవంగా అతడు అల్లాహ్ కు విధేయత చూపినట్లే. మరియు కాదని వెనుదిరిగి పోతే వారిని అదుపులో ఉంచటానికి (కావలివానిగా) మేము నిన్ను పంపలేదు.

Verse 81

وَيَقُولُونَ طَاعَةٌ فَإِذَا بَرَزُوا۟ مِنْ عِندِكَ بَيَّتَ طَآئِفَةٌ مِّنْهُمْ غَيْرَ ٱلَّذِى تَقُولُ ۖ وَٱللَّهُ يَكْتُبُ مَا يُبَيِّتُونَ ۖ فَأَعْرِضْ عَنْهُمْ وَتَوَكَّلْ عَلَى ٱللَّهِ ۚ وَكَفَىٰ بِٱللَّهِ وَكِيلًا

Transliteration wayaqūlūna ṭāʿatun fa-idhā barazū min ʿindika bayyata ṭāifatun min'hum ghayra alladhī taqūlu wal-lahu yaktubu mā yubayyitūna fa-aʿriḍ ʿanhum watawakkal ʿalā l-lahi wakafā bil-lahi wakīlan

Telugu మరియు వారు (నీ సమక్షంలో): "మేము విధేయులమయ్యాము." అని పలుకుతారు. కాని నీ వద్ద నుండి వెళ్ళి పోయిన తరువాత వారిలో కొందరు రాత్రివేళలో నీవు చెప్పిన దానికి విరుద్ధంగా సంప్రదింపులు జరుపుతారు. మరియు వారి రహస్య సంప్రదింపులన్నీ అల్లాహ్ వ్రాస్తున్నాడు. కనుక నీవు వారి నుండి ముఖము త్రిప్పుకో మరియు అల్లాహ్ పై ఆధారపడి ఉండు. మరియు కార్యసాధకుడిగా అల్లాహ్ చాలు!

Verse 82

أَفَلَا يَتَدَبَّرُونَ ٱلْقُرْءَانَ ۚ وَلَوْ كَانَ مِنْ عِندِ غَيْرِ ٱللَّهِ لَوَجَدُوا۟ فِيهِ ٱخْتِلَـٰفًا كَثِيرًا

Transliteration afalā yatadabbarūna l-qur'āna walaw kāna min ʿindi ghayri l-lahi lawajadū fīhi ikh'tilāfan kathīran

Telugu ఏమీ? వారు ఖుర్ఆన్ ను గురించి ఆలోచించరా? ఒకవేళ ఇది అల్లాహ్ తరఫు నుండి గాక ఇతరుల తరఫు నుండి వచ్చి వుంటే, అందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలను చూసేవారు కదా!

Verse 83

وَإِذَا جَآءَهُمْ أَمْرٌ مِّنَ ٱلْأَمْنِ أَوِ ٱلْخَوْفِ أَذَاعُوا۟ بِهِۦ ۖ وَلَوْ رَدُّوهُ إِلَى ٱلرَّسُولِ وَإِلَىٰٓ أُو۟لِى ٱلْأَمْرِ مِنْهُمْ لَعَلِمَهُ ٱلَّذِينَ يَسْتَنۢبِطُونَهُۥ مِنْهُمْ ۗ وَلَوْلَا فَضْلُ ٱللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُۥ لَٱتَّبَعْتُمُ ٱلشَّيْطَـٰنَ إِلَّا قَلِيلًا

Transliteration wa-idhā jāahum amrun mina l-amni awi l-khawfi adhāʿū bihi walaw raddūhu ilā l-rasūli wa-ilā ulī l-amri min'hum laʿalimahu alladhīna yastanbiṭūnahu min'hum walawlā faḍlu l-lahi ʿalaykum waraḥmatuhu la-ittabaʿtumu l-shayṭāna illā qalīlan

Telugu మరియు వారు (ప్రజల గురించి) ఏదైనా శాంతివార్త గానీ లేదా భయవార్త గానీ వినినప్పుడు, దానిని వ్యాపింపజేస్తారు. అలా చేయకుండా వారు దానిని సందేశహరునికో, లేదా వారిలో నిర్ణయాధికారం గలవారికో తెలియజేసి ఉంటే! దానిని విచారించ గలవారు, వారి నుండి దానిని విని అర్థం చేసుకునే వారు. మరియు ఒకవేళ మీపై అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కారణ్యమే లేకుంటే మీలో కొందరు తప్ప మిగతా వారందరూ షైతాన్ ను అనుసరించి ఉండేవారు.

Verse 84

فَقَـٰتِلْ فِى سَبِيلِ ٱللَّهِ لَا تُكَلَّفُ إِلَّا نَفْسَكَ ۚ وَحَرِّضِ ٱلْمُؤْمِنِينَ ۖ عَسَى ٱللَّهُ أَن يَكُفَّ بَأْسَ ٱلَّذِينَ كَفَرُوا۟ ۚ وَٱللَّهُ أَشَدُّ بَأْسًا وَأَشَدُّ تَنكِيلًا

Transliteration faqātil fī sabīli l-lahi lā tukallafu illā nafsaka waḥarriḍi l-mu'minīna ʿasā l-lahu an yakuffa basa alladhīna kafarū wal-lahu ashaddu basan wa-ashaddu tankīlan

Telugu కావున నీవు అల్లాహ్ మార్గంలో యుద్ధం చెయ్యి. నీవు నీ మట్టుకే బాధ్యుడవు. మరియు విశ్వాసులను (యుద్ధానికి) ప్రోత్సహించు. అల్లాహ్ సత్యతిరస్కారుల శక్తిని అణచవచ్చు! మరియు అల్లాహ్ అంతులేని శక్తిగలవాడు మరియు శిక్షించటంలో చాలా కఠినుడు!

Verse 85

مَّن يَشْفَعْ شَفَـٰعَةً حَسَنَةً يَكُن لَّهُۥ نَصِيبٌ مِّنْهَا ۖ وَمَن يَشْفَعْ شَفَـٰعَةً سَيِّئَةً يَكُن لَّهُۥ كِفْلٌ مِّنْهَا ۗ وَكَانَ ٱللَّهُ عَلَىٰ كُلِّ شَىْءٍ مُّقِيتًا

Transliteration man yashfaʿ shafāʿatan ḥasanatan yakun lahu naṣībun min'hā waman yashfaʿ shafāʿatan sayyi-atan yakun lahu kif'lun min'hā wakāna l-lahu ʿalā kulli shayin muqītan

Telugu మంచి విషయం కొరకు సిఫారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. మరియు చెడు విషయం కొరకు సిఫారసు చేసేవాడు దానికి బాధ్యత వహిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతి దానిపై అధికారం గలవాడు.

Verse 86

وَإِذَا حُيِّيتُم بِتَحِيَّةٍ فَحَيُّوا۟ بِأَحْسَنَ مِنْهَآ أَوْ رُدُّوهَآ ۗ إِنَّ ٱللَّهَ كَانَ عَلَىٰ كُلِّ شَىْءٍ حَسِيبًا

Transliteration wa-idhā ḥuyyītum bitaḥiyyatin faḥayyū bi-aḥsana min'hā aw ruddūhā inna l-laha kāna ʿalā kulli shayin ḥasīban

Telugu మరియు మీకు ఎవరైనా సలాం చేస్తే, దానికి మీరు అంతకంటే ఉత్తమమైన రీతిలో ప్రతి సలాం చెయ్యండి లేదా కనీసం అవే పదాలు తిరిగి పలకండి (అదే విధంగానైనా చెయ్యండి). నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి దానిని పరిగణించగలవాడు.

Verse 87

ٱللَّهُ لَآ إِلَـٰهَ إِلَّا هُوَ ۚ لَيَجْمَعَنَّكُمْ إِلَىٰ يَوْمِ ٱلْقِيَـٰمَةِ لَا رَيْبَ فِيهِ ۗ وَمَنْ أَصْدَقُ مِنَ ٱللَّهِ حَدِيثًا

Transliteration al-lahu lā ilāha illā huwa layajmaʿannakum ilā yawmi l-qiyāmati lā rayba fīhi waman aṣdaqu mina l-lahi ḥadīthan

Telugu అల్లాహ్! ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. ఆయన మిమ్మల్ని అందరినీ పునరుత్థాన దినమున సమావేశ పరుస్తాడు. అది (రావటంలో) ఏ మాత్రం సందేహం లేదు. మరియు అల్లాహ్ వాక్కు కంటే మరెవరి (వాక్కు) సత్యమైనది?

Verse 88

۞ فَمَا لَكُمْ فِى ٱلْمُنَـٰفِقِينَ فِئَتَيْنِ وَٱللَّهُ أَرْكَسَهُم بِمَا كَسَبُوٓا۟ ۚ أَتُرِيدُونَ أَن تَهْدُوا۟ مَنْ أَضَلَّ ٱللَّهُ ۖ وَمَن يُضْلِلِ ٱللَّهُ فَلَن تَجِدَ لَهُۥ سَبِيلًا

Transliteration famā lakum fī l-munāfiqīna fi-atayni wal-lahu arkasahum bimā kasabū aturīdūna an tahdū man aḍalla l-lahu waman yuḍ'lili l-lahu falan tajida lahu sabīlan

Telugu (ఓ విశ్వాసులారా!) మీకేమయింది, కపట విశ్వాసుల విషయంలో మీరు రెండు వర్గాలుగా చీలిపోయారు. అల్లాహ్ వారి కర్మల ఫలితంగా, వారిని వారి పూర్వ (అవిశ్వాస) స్థితికి మరలించాడు. ఏమీ? అల్లాహ్ మార్గభ్రష్టులుగా చేసిన వారికి మీరు సన్మార్గం చూపదలచారా? వాస్తవానికి, అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడవేసిన వానికి నీవు (ఋజు) మార్గం చూప లేవు.

Verse 89

وَدُّوا۟ لَوْ تَكْفُرُونَ كَمَا كَفَرُوا۟ فَتَكُونُونَ سَوَآءً ۖ فَلَا تَتَّخِذُوا۟ مِنْهُمْ أَوْلِيَآءَ حَتَّىٰ يُهَاجِرُوا۟ فِى سَبِيلِ ٱللَّهِ ۚ فَإِن تَوَلَّوْا۟ فَخُذُوهُمْ وَٱقْتُلُوهُمْ حَيْثُ وَجَدتُّمُوهُمْ ۖ وَلَا تَتَّخِذُوا۟ مِنْهُمْ وَلِيًّا وَلَا نَصِيرًا

Transliteration waddū law takfurūna kamā kafarū fatakūnūna sawāan falā tattakhidhū min'hum awliyāa ḥattā yuhājirū fī sabīli l-lahi fa-in tawallaw fakhudhūhum wa-uq'tulūhum ḥaythu wajadttumūhum walā tattakhidhū min'hum waliyyan walā naṣīran

Telugu మరియు వారు సత్యతిరస్కారులైనట్లే మీరు కూడా సత్యతిరస్కారులై, వారితో సమానులై పోవాలని వారు కోరుతున్నారు. కావున అల్లాహ్ మార్గంలో వారు వలస పోనంత వరకు (హిజ్రత్ చేయనంత వరకు), వారిలో ఎవ్వరినీ మీరు స్నేహితులుగా చేసుకోకండి. ఒకవేళ వారు వెను దిరిగితే, మీరు వారిని ఎక్కడ దొరికితే అక్కడే పట్టుకొని వధించండి. మరియు వారిలో ఎవ్వరినీ మీ స్నేహితులుగా, సహాయకులుగా చేసుకోకండి.

Verse 90

إِلَّا ٱلَّذِينَ يَصِلُونَ إِلَىٰ قَوْمٍۭ بَيْنَكُمْ وَبَيْنَهُم مِّيثَـٰقٌ أَوْ جَآءُوكُمْ حَصِرَتْ صُدُورُهُمْ أَن يُقَـٰتِلُوكُمْ أَوْ يُقَـٰتِلُوا۟ قَوْمَهُمْ ۚ وَلَوْ شَآءَ ٱللَّهُ لَسَلَّطَهُمْ عَلَيْكُمْ فَلَقَـٰتَلُوكُمْ ۚ فَإِنِ ٱعْتَزَلُوكُمْ فَلَمْ يُقَـٰتِلُوكُمْ وَأَلْقَوْا۟ إِلَيْكُمُ ٱلسَّلَمَ فَمَا جَعَلَ ٱللَّهُ لَكُمْ عَلَيْهِمْ سَبِيلًا

Transliteration illā alladhīna yaṣilūna ilā qawmin baynakum wabaynahum mīthāqun aw jāūkum ḥaṣirat ṣudūruhum an yuqātilūkum aw yuqātilū qawmahum walaw shāa l-lahu lasallaṭahum ʿalaykum falaqātalūkum fa-ini iʿ'tazalūkum falam yuqātilūkum wa-alqaw ilaykumu l-salama famā jaʿala l-lahu lakum ʿalayhim sabīlan

Telugu కాని, మీరు ఎవరితోనైతే ఒడంబడిక చేసుకొని ఉన్నారో, అలాంటి వారితో కలసి పోయిన వారు గానీ, లేదా ఎవరైతే తమ హృదయాలలో మీతో గానీ, లేక తమ జాతి వారితో గానీ యుద్ధం చేయటానికి సంకట పడుతూ మీ వద్దకు వస్తారో అలాంటి వారిని గానీ, (మీరు వధించకండి). మరియు ఒకవేళ అల్లాహ్ కోరితే వారికి మీపై ఆధిక్యత ఇచ్చి ఉండేవాడు మరియు వారు మీతో యుద్ధం చేసి ఉండేవారు. కావున వారు మీ నుండి మరలిపోతే, మీతో యుద్ధం చేయక, మీతో సంధి చేసుకోవటానికి అంగీకరిస్తే (వారిపై దాడి చేయటానికి) అల్లాహ్ మీకు దారి చూపలేదు.

Verse 91

سَتَجِدُونَ ءَاخَرِينَ يُرِيدُونَ أَن يَأْمَنُوكُمْ وَيَأْمَنُوا۟ قَوْمَهُمْ كُلَّ مَا رُدُّوٓا۟ إِلَى ٱلْفِتْنَةِ أُرْكِسُوا۟ فِيهَا ۚ فَإِن لَّمْ يَعْتَزِلُوكُمْ وَيُلْقُوٓا۟ إِلَيْكُمُ ٱلسَّلَمَ وَيَكُفُّوٓا۟ أَيْدِيَهُمْ فَخُذُوهُمْ وَٱقْتُلُوهُمْ حَيْثُ ثَقِفْتُمُوهُمْ ۚ وَأُو۟لَـٰٓئِكُمْ جَعَلْنَا لَكُمْ عَلَيْهِمْ سُلْطَـٰنًا مُّبِينًا

Transliteration satajidūna ākharīna yurīdūna an yamanūkum wayamanū qawmahum kulla mā ruddū ilā l-fit'nati ur'kisū fīhā fa-in lam yaʿtazilūkum wayul'qū ilaykumu l-salama wayakuffū aydiyahum fakhudhūhum wa-uq'tulūhum ḥaythu thaqif'tumūhum wa-ulāikum jaʿalnā lakum ʿalayhim sul'ṭānan mubīnan

Telugu మరొక రకమైన వారిని మీరు చూస్తారు; వారు మీ నుండి శాంతి పొందాలని మరియు తమ జాతి వారితో కూడా శాంతి పొందాలని కోరుతుంటారు. కాని సమయం దొరికినప్పుడల్లా వారు (తమ మాట నుండి) మరలి పోయి ఉపద్రవానికి పూనుకుంటారు. అలాంటి వారు మీతో (పోరాడటం) మానుకోకపోతే, మీతో సంధి చేసుకోవటానికి అంగీకరించక పోతే, తమ చేతులను (మీతో యుద్ధం చేయటం నుండి) ఆపు కోకపోతే! వారెక్కడ దొరికితే అక్కడ పట్టుకోండి మరియు సంహరించండి. మరియు ఇలా ప్రవర్తించటానికి మేము మీకు స్పష్టమైన అధికారం ఇస్తున్నాము.

Verse 92

وَمَا كَانَ لِمُؤْمِنٍ أَن يَقْتُلَ مُؤْمِنًا إِلَّا خَطَـًٔا ۚ وَمَن قَتَلَ مُؤْمِنًا خَطَـًٔا فَتَحْرِيرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ وَدِيَةٌ مُّسَلَّمَةٌ إِلَىٰٓ أَهْلِهِۦٓ إِلَّآ أَن يَصَّدَّقُوا۟ ۚ فَإِن كَانَ مِن قَوْمٍ عَدُوٍّ لَّكُمْ وَهُوَ مُؤْمِنٌ فَتَحْرِيرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ ۖ وَإِن كَانَ مِن قَوْمٍۭ بَيْنَكُمْ وَبَيْنَهُم مِّيثَـٰقٌ فَدِيَةٌ مُّسَلَّمَةٌ إِلَىٰٓ أَهْلِهِۦ وَتَحْرِيرُ رَقَبَةٍ مُّؤْمِنَةٍ ۖ فَمَن لَّمْ يَجِدْ فَصِيَامُ شَهْرَيْنِ مُتَتَابِعَيْنِ تَوْبَةً مِّنَ ٱللَّهِ ۗ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَكِيمًا

Transliteration wamā kāna limu'minin an yaqtula mu'minan illā khaṭa-an waman qatala mu'minan khaṭa-an fataḥrīru raqabatin mu'minatin wadiyatun musallamatun ilā ahlihi illā an yaṣṣaddaqū fa-in kāna min qawmin ʿaduwwin lakum wahuwa mu'minun fataḥrīru raqabatin mu'minatin wa-in kāna min qawmin baynakum wabaynahum mīthāqun fadiyatun musallamatun ilā ahlihi wataḥrīru raqabatin mu'minatin faman lam yajid faṣiyāmu shahrayni mutatābiʿayni tawbatan mina l-lahi wakāna l-lahu ʿalīman ḥakīman

Telugu మరియు - పొరపాటుగా తప్ప - ఒక విశ్వాసి మరొక విశ్వాసిని చంపటం తగని పని (నిషిద్ధం). మరియు ఒక విశ్వాసిని పొరపాటుగా చంపిన వాడు (దానికి పరిహారంగా) అతడు ఒక విశ్వాసి బానిసకు విముక్తి కలిగించాలి మరియు హతుని కుటుంబీకులకు (వారసులకు) రక్తపరిహారం (దియత్) కూడా చెల్లించాలి. వారు క్షమిస్తే అది వారికి దానం (సదఖ) అవుతుంది! కాని ఒకవేళ వధింపబడిన వాడు విశ్వాసి అయి, మీ శత్రువులలో చేరిన వాడై ఉంటే, ఒక విశ్వాస బానిసకు విముక్తి కలిగించాలి. ఒకవేళ (వధింప బడిన వాడు) - మీరు ఒడంబడిక చేసుకొని వున్న జనులకు చెందిన వాడైతే - రక్త పరిహారం అతని కుటుంబీకులకు (వారసులకు) ఇవ్వాలి. మరియు ఒక విశ్వాస (ముస్లిం) బానిసకు విముక్తి కలిగించాలి. (బానిసకు విముక్తి కలిగించే) శక్తిలేని వాడు, వరుసగా రెండు నెలలు ఉపవాసాలు ఉండాలి. అల్లాహ్ ముందు పశ్చాత్తాప పడటానికి (ఇదే సరైన పద్ధతి). అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

Verse 93

وَمَن يَقْتُلْ مُؤْمِنًا مُّتَعَمِّدًا فَجَزَآؤُهُۥ جَهَنَّمُ خَـٰلِدًا فِيهَا وَغَضِبَ ٱللَّهُ عَلَيْهِ وَلَعَنَهُۥ وَأَعَدَّ لَهُۥ عَذَابًا عَظِيمًا

Transliteration waman yaqtul mu'minan mutaʿammidan fajazāuhu jahannamu khālidan fīhā waghaḍiba l-lahu ʿalayhi walaʿanahu wa-aʿadda lahu ʿadhāban ʿaẓīman

Telugu మరియు ఎవడైతే ఒక విశ్వాసిని బుద్ధిపూర్వకంగా చంపుతాడో అతని ప్రతీకారం నరకమే! అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు మరియు అతనిపై అల్లాహ్ ఆగ్రహం మరియు శాపం (బహిష్కారం) ఉంటుంది మరియు ఆయన (అల్లాహ్) అతని కొరకు ఘోరమైన శిక్షను సిద్ధపరిచాడు.

Verse 94

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِذَا ضَرَبْتُمْ فِى سَبِيلِ ٱللَّهِ فَتَبَيَّنُوا۟ وَلَا تَقُولُوا۟ لِمَنْ أَلْقَىٰٓ إِلَيْكُمُ ٱلسَّلَـٰمَ لَسْتَ مُؤْمِنًا تَبْتَغُونَ عَرَضَ ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا فَعِندَ ٱللَّهِ مَغَانِمُ كَثِيرَةٌ ۚ كَذَٰلِكَ كُنتُم مِّن قَبْلُ فَمَنَّ ٱللَّهُ عَلَيْكُمْ فَتَبَيَّنُوٓا۟ ۚ إِنَّ ٱللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا

Transliteration yāayyuhā alladhīna āmanū idhā ḍarabtum fī sabīli l-lahi fatabayyanū walā taqūlū liman alqā ilaykumu l-salāma lasta mu'minan tabtaghūna ʿaraḍa l-ḥayati l-dun'yā faʿinda l-lahi maghānimu kathīratun kadhālika kuntum min qablu famanna l-lahu ʿalaykum fatabayyanū inna l-laha kāna bimā taʿmalūna khabīran

Telugu ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ మార్గంలో (జిహాద్ కు) బయలుదేరి నప్పుడు వివేచనతో వ్యవహరించండి. (శాంతిని ఆశించి మీ వైపునకు) సలాం చేస్తూ వచ్చే వానిని - ప్రాపంచిక ప్రయోజనాలను పొంద గోరి - "నీవు విశ్వాసివి (ముస్లింవు) కావు." అని (త్వరపడి) అనకండి. అల్లాహ్ దగ్గర మీ కొరకు విజయధనాలు అత్యధికంగా ఉన్నాయి. దీనికి పూర్వం మీరు కూడా ఇదే స్థితిలో ఉండేవారు కదా! ఆ తరువాత అల్లాహ్ మిమ్మల్ని అనుగ్రహించాడు, కావున సముచితమైన పరిశీలన చేయండి. నిశ్చయంగా, అల్లాహ్! మీరు చేసేదంతా బాగా ఎరుగును.

Verse 95

لَّا يَسْتَوِى ٱلْقَـٰعِدُونَ مِنَ ٱلْمُؤْمِنِينَ غَيْرُ أُو۟لِى ٱلضَّرَرِ وَٱلْمُجَـٰهِدُونَ فِى سَبِيلِ ٱللَّهِ بِأَمْوَٰلِهِمْ وَأَنفُسِهِمْ ۚ فَضَّلَ ٱللَّهُ ٱلْمُجَـٰهِدِينَ بِأَمْوَٰلِهِمْ وَأَنفُسِهِمْ عَلَى ٱلْقَـٰعِدِينَ دَرَجَةً ۚ وَكُلًّا وَعَدَ ٱللَّهُ ٱلْحُسْنَىٰ ۚ وَفَضَّلَ ٱللَّهُ ٱلْمُجَـٰهِدِينَ عَلَى ٱلْقَـٰعِدِينَ أَجْرًا عَظِيمًا

Transliteration lā yastawī l-qāʿidūna mina l-mu'minīna ghayru ulī l-ḍarari wal-mujāhidūna fī sabīli l-lahi bi-amwālihim wa-anfusihim faḍḍala l-lahu l-mujāhidīna bi-amwālihim wa-anfusihim ʿalā l-qāʿidīna darajatan wakullan waʿada l-lahu l-ḥus'nā wafaḍḍala l-lahu l-mujāhidīna ʿalā l-qāʿidīna ajran ʿaẓīman

Telugu ఎలాంటి కారణం లేకుండా, ఇంటి వద్ద కూర్చుండిపోయే విశ్వాసులు మరియు అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని మరియు తమ ప్రాణాన్ని వినియోగించి ధర్మయుద్ధం (జిహాద్) చేసే విశ్వాసులతో సరిసమానులు కాజాలరు. తమ ధనాన్ని, ప్రాణాన్ని వినియోగించి ధర్మయుద్ధం (జిహాద్) చేసేవారి స్థానాన్ని అల్లాహ్! ఇంట్లో కూర్చుండి పోయే వారి స్థానం కంటే, ఉన్నతం చేశాడు. మరియు అల్లాహ్ ప్రతి ఒక్కరికి ఉత్తమ ఫలితపు వాగ్దానం చేశాడు. కానీ అల్లాహ్ ధర్మయుద్ధం (జిహాద్) చేసిన వారికి ఇంట్లో కూర్చున్న వారి కంటే ఎంతో గొప్ప ప్రతిఫలమిచ్చి, ఆధిక్యత నిచ్చాడు.

Verse 96

دَرَجَـٰتٍ مِّنْهُ وَمَغْفِرَةً وَرَحْمَةً ۚ وَكَانَ ٱللَّهُ غَفُورًا رَّحِيمًا

Transliteration darajātin min'hu wamaghfiratan waraḥmatan wakāna l-lahu ghafūran raḥīman

Telugu వారి కొరకు, ఆయన తరఫు నుండి ఉన్నత స్థానాలు, క్షమాభిక్ష మరియు కారుణ్యాలు కూడా ఉంటాయి. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

Verse 97

إِنَّ ٱلَّذِينَ تَوَفَّىٰهُمُ ٱلْمَلَـٰٓئِكَةُ ظَالِمِىٓ أَنفُسِهِمْ قَالُوا۟ فِيمَ كُنتُمْ ۖ قَالُوا۟ كُنَّا مُسْتَضْعَفِينَ فِى ٱلْأَرْضِ ۚ قَالُوٓا۟ أَلَمْ تَكُنْ أَرْضُ ٱللَّهِ وَٰسِعَةً فَتُهَاجِرُوا۟ فِيهَا ۚ فَأُو۟لَـٰٓئِكَ مَأْوَىٰهُمْ جَهَنَّمُ ۖ وَسَآءَتْ مَصِيرًا

Transliteration inna alladhīna tawaffāhumu l-malāikatu ẓālimī anfusihim qālū fīma kuntum qālū kunnā mus'taḍʿafīna fī l-arḍi qālū alam takun arḍu l-lahi wāsiʿatan fatuhājirū fīhā fa-ulāika mawāhum jahannamu wasāat maṣīran

Telugu నిశ్చయంగా, తమకు తాము (తమ ఆత్మలకు) అన్యాయం చేసుకుంటూ ఉండే వారి ప్రాణాలను తీసే దేవదూతలు వారితో: "మీరు ఏ స్థితిలో ఉండేవారు?" అని అడిగితే, వారు: "మేము భూమిలో బలహీనులముగా, నిస్సహాయులముగా ఉండేవారము!" అని జవాబిస్తారు. దానికి (దేవదూతలు): "ఏమీ? మీరు వలస పోవటానికి అల్లాహ్ భూమి విశాలంగా లేకుండెనా?" అని అడుగుతారు. ఇలాంటి వారి శరణం నరకమే. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం!

Verse 98

إِلَّا ٱلْمُسْتَضْعَفِينَ مِنَ ٱلرِّجَالِ وَٱلنِّسَآءِ وَٱلْوِلْدَٰنِ لَا يَسْتَطِيعُونَ حِيلَةً وَلَا يَهْتَدُونَ سَبِيلًا

Transliteration illā l-mus'taḍʿafīna mina l-rijāli wal-nisāi wal-wil'dāni lā yastaṭīʿūna ḥīlatan walā yahtadūna sabīlan

Telugu కాని, నిజంగానే నిస్సహాయులై, వలస పోవటానికి ఏ సాధనా సంపత్తీ, ఎలాంటి మార్గం లేని పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు తప్ప!

Verse 99

فَأُو۟لَـٰٓئِكَ عَسَى ٱللَّهُ أَن يَعْفُوَ عَنْهُمْ ۚ وَكَانَ ٱللَّهُ عَفُوًّا غَفُورًا

Transliteration fa-ulāika ʿasā l-lahu an yaʿfuwa ʿanhum wakāna l-lahu ʿafuwwan ghafūran

Telugu కావున ఇటు వంటి వారిని, అల్లాహ్ మన్నించవచ్చు! ఎందుకంటే, అల్లాహ్ మన్నించే వాడు, క్షమాశీలుడు.

Verse 100

۞ وَمَن يُهَاجِرْ فِى سَبِيلِ ٱللَّهِ يَجِدْ فِى ٱلْأَرْضِ مُرَٰغَمًا كَثِيرًا وَسَعَةً ۚ وَمَن يَخْرُجْ مِنۢ بَيْتِهِۦ مُهَاجِرًا إِلَى ٱللَّهِ وَرَسُولِهِۦ ثُمَّ يُدْرِكْهُ ٱلْمَوْتُ فَقَدْ وَقَعَ أَجْرُهُۥ عَلَى ٱللَّهِ ۗ وَكَانَ ٱللَّهُ غَفُورًا رَّحِيمًا

Transliteration waman yuhājir fī sabīli l-lahi yajid fī l-arḍi murāghaman kathīran wasaʿatan waman yakhruj min baytihi muhājiran ilā l-lahi warasūlihi thumma yud'rik'hu l-mawtu faqad waqaʿa ajruhu ʿalā l-lahi wakāna l-lahu ghafūran raḥīman

Telugu మరియు అల్లాహ్ మార్గంలో వలస పోయేవాడు భూమిలో కావలసినంత స్థలాన్ని, సౌకర్యాలను పొందుతాడు. మరియు ఎవడు తన ఇంటిని వదలి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కొరకు, వలస పోవటానికి బయలుదేరిన తరువాత, అతనికి చావు వస్తే! నిశ్చయంగా, అతని ప్రతిఫలం అల్లాహ్ వద్ద స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

Verse 101

وَإِذَا ضَرَبْتُمْ فِى ٱلْأَرْضِ فَلَيْسَ عَلَيْكُمْ جُنَاحٌ أَن تَقْصُرُوا۟ مِنَ ٱلصَّلَوٰةِ إِنْ خِفْتُمْ أَن يَفْتِنَكُمُ ٱلَّذِينَ كَفَرُوٓا۟ ۚ إِنَّ ٱلْكَـٰفِرِينَ كَانُوا۟ لَكُمْ عَدُوًّا مُّبِينًا

Transliteration wa-idhā ḍarabtum fī l-arḍi falaysa ʿalaykum junāḥun an taqṣurū mina l-ṣalati in khif'tum an yaftinakumu alladhīna kafarū inna l-kāfirīna kānū lakum ʿaduwwan mubīnan

Telugu మరియు మీరు భూమిలో ప్రయాణం చేసేటపుడు నమాజులను సంక్షిప్తం (ఖస్ర్) చేస్తే, అది పాపం కాదు. (అంతే గాక) సత్యతిరస్కారులు మిమ్మల్ని వేధిస్తారు అనే భయం మీకు కలిగినపుడు కూడా! ఎందుకంటే సత్యతిరస్కారులు నిశ్చయంగా, మీకు బహిరంగ శత్రువులు.

Verse 102

وَإِذَا كُنتَ فِيهِمْ فَأَقَمْتَ لَهُمُ ٱلصَّلَوٰةَ فَلْتَقُمْ طَآئِفَةٌ مِّنْهُم مَّعَكَ وَلْيَأْخُذُوٓا۟ أَسْلِحَتَهُمْ فَإِذَا سَجَدُوا۟ فَلْيَكُونُوا۟ مِن وَرَآئِكُمْ وَلْتَأْتِ طَآئِفَةٌ أُخْرَىٰ لَمْ يُصَلُّوا۟ فَلْيُصَلُّوا۟ مَعَكَ وَلْيَأْخُذُوا۟ حِذْرَهُمْ وَأَسْلِحَتَهُمْ ۗ وَدَّ ٱلَّذِينَ كَفَرُوا۟ لَوْ تَغْفُلُونَ عَنْ أَسْلِحَتِكُمْ وَأَمْتِعَتِكُمْ فَيَمِيلُونَ عَلَيْكُم مَّيْلَةً وَٰحِدَةً ۚ وَلَا جُنَاحَ عَلَيْكُمْ إِن كَانَ بِكُمْ أَذًى مِّن مَّطَرٍ أَوْ كُنتُم مَّرْضَىٰٓ أَن تَضَعُوٓا۟ أَسْلِحَتَكُمْ ۖ وَخُذُوا۟ حِذْرَكُمْ ۗ إِنَّ ٱللَّهَ أَعَدَّ لِلْكَـٰفِرِينَ عَذَابًا مُّهِينًا

Transliteration wa-idhā kunta fīhim fa-aqamta lahumu l-ṣalata faltaqum ṭāifatun min'hum maʿaka walyakhudhū asliḥatahum fa-idhā sajadū falyakūnū min warāikum waltati ṭāifatun ukh'rā lam yuṣallū falyuṣallū maʿaka walyakhudhū ḥidh'rahum wa-asliḥatahum wadda alladhīna kafarū law taghfulūna ʿan asliḥatikum wa-amtiʿatikum fayamīlūna ʿalaykum maylatan wāḥidatan walā junāḥa ʿalaykum in kāna bikum adhan min maṭarin aw kuntum marḍā an taḍaʿū asliḥatakum wakhudhū ḥidh'rakum inna l-laha aʿadda lil'kāfirīna ʿadhāban muhīnan

Telugu మరియు నీవు (ఓ ప్రవక్తా!) వారి (ముస్లింల) మద్య ఉండి (పోరాటం జరుగుతూ ఉండగా) నమాజ్ చేయించటానికి వారితో నిలబడితే, వారిలోని ఒక వర్గం నీతో పాటు నిలబడాలి. మరియు వారు అస్త్రధారులై ఉండాలి. వారు తమ సజ్దాను పూర్తి చేసుకొని వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇంకా నమాజ్ చేయని రెండో వర్గం వచ్చి నీతో పాటు నమాజ్ చేయాలి. వారు కూడా జాగరూకులై ఉండి, తమ ఆయుధాలను ధరించి ఉండాలి. ఎందుకంటే, మీరు మీ ఆయుధాల పట్ల, మరియు మీ సామగ్రి పట్ల, ఏ కొద్ది అజాగ్రత్త వహించినా మీపై ఒక్కసారిగా విరుచుకు పడాలని సత్యతిరస్కారులు కాచుకొని ఉంటారు. అయితే, వర్షం వల్ల మీకు ఇబ్బందిగా ఉంటే! లేదా మీరు అస్వస్థులైతే, మీరు మీ ఆయుధాలను దించి పెట్టడం పాపం కాదు. అయినా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. నిశ్చయంగా, అల్లాహ్ సత్యతిరస్కారుల కొరకు అవమానకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచాడు.

Verse 103

فَإِذَا قَضَيْتُمُ ٱلصَّلَوٰةَ فَٱذْكُرُوا۟ ٱللَّهَ قِيَـٰمًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِكُمْ ۚ فَإِذَا ٱطْمَأْنَنتُمْ فَأَقِيمُوا۟ ٱلصَّلَوٰةَ ۚ إِنَّ ٱلصَّلَوٰةَ كَانَتْ عَلَى ٱلْمُؤْمِنِينَ كِتَـٰبًا مَّوْقُوتًا

Transliteration fa-idhā qaḍaytumu l-ṣalata fa-udh'kurū l-laha qiyāman waquʿūdan waʿalā junūbikum fa-idhā iṭ'manantum fa-aqīmū l-ṣalata inna l-ṣalata kānat ʿalā l-mu'minīna kitāban mawqūtan

Telugu ఇక నమాజ్ ను పూర్తి చేసిన తరువాత నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండండి. కాని శాంతిభద్రతలు నెలకొన్న తరువాత నమాజ్ ను స్థాపించండి. నిశ్చయంగా, నమాజ్ విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించడానికి విధిగా నియమించబడింది.

Verse 104

وَلَا تَهِنُوا۟ فِى ٱبْتِغَآءِ ٱلْقَوْمِ ۖ إِن تَكُونُوا۟ تَأْلَمُونَ فَإِنَّهُمْ يَأْلَمُونَ كَمَا تَأْلَمُونَ ۖ وَتَرْجُونَ مِنَ ٱللَّهِ مَا لَا يَرْجُونَ ۗ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَكِيمًا

Transliteration walā tahinū fī ib'tighāi l-qawmi in takūnū talamūna fa-innahum yalamūna kamā talamūna watarjūna mina l-lahi mā lā yarjūna wakāna l-lahu ʿalīman ḥakīman

Telugu మరియు శత్రువులను వెంబడించటంలో బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు బాధపడుతున్నట్లయితే, నిశ్చయంగా వారు కూడా - మీరు బాధపడుతున్నట్లే - బాధపడుతున్నారు. మరియు మీరు అల్లాహ్ నుండి వారు ఆశించలేని దానిని ఆశిస్తున్నారు. మరియు వాస్తవానికి, అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

Verse 105

إِنَّآ أَنزَلْنَآ إِلَيْكَ ٱلْكِتَـٰبَ بِٱلْحَقِّ لِتَحْكُمَ بَيْنَ ٱلنَّاسِ بِمَآ أَرَىٰكَ ٱللَّهُ ۚ وَلَا تَكُن لِّلْخَآئِنِينَ خَصِيمًا

Transliteration innā anzalnā ilayka l-kitāba bil-ḥaqi litaḥkuma bayna l-nāsi bimā arāka l-lahu walā takun lil'khāinīna khaṣīman

Telugu (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, మేము ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను), సత్యంతో, నీపై అవతరింపజేసాము - అల్లాహ్ నీకు తెలిపిన ప్రకారం - నీవు ప్రజల మధ్య తీర్పు చేయటానికి. మరియు నీవు విశ్వాసఘాతకుల పక్షమున వాదించేవాడవు కావద్దు.

Verse 106

وَٱسْتَغْفِرِ ٱللَّهَ ۖ إِنَّ ٱللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا

Transliteration wa-is'taghfiri l-laha inna l-laha kāna ghafūran raḥīman

Telugu మరియు అల్లాహ్ ను క్షమాభిక్ష కొరకు ప్రార్థించు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

Verse 107

وَلَا تُجَـٰدِلْ عَنِ ٱلَّذِينَ يَخْتَانُونَ أَنفُسَهُمْ ۚ إِنَّ ٱللَّهَ لَا يُحِبُّ مَن كَانَ خَوَّانًا أَثِيمًا

Transliteration walā tujādil ʿani alladhīna yakhtānūna anfusahum inna l-laha lā yuḥibbu man kāna khawwānan athīman

Telugu మరియు ఆత్మద్రోహం చేసుకునే వారి పక్షమున నీవు వాదించకు. నిశ్చయంగా, అల్లాహ్ విశ్వాసఘాతకుణ్ణి, పాపిని ప్రేమించడు.

Verse 108

يَسْتَخْفُونَ مِنَ ٱلنَّاسِ وَلَا يَسْتَخْفُونَ مِنَ ٱللَّهِ وَهُوَ مَعَهُمْ إِذْ يُبَيِّتُونَ مَا لَا يَرْضَىٰ مِنَ ٱلْقَوْلِ ۚ وَكَانَ ٱللَّهُ بِمَا يَعْمَلُونَ مُحِيطًا

Transliteration yastakhfūna mina l-nāsi walā yastakhfūna mina l-lahi wahuwa maʿahum idh yubayyitūna mā lā yarḍā mina l-qawli wakāna l-lahu bimā yaʿmalūna muḥīṭan

Telugu వారు (తమ దుష్కర్మలను) మానవుల నుండి దాచగలరు, కాని అల్లాహ్ నుండి దాచలేరు. ఎందుకంటే ఆయన (అల్లాహ్) కు సమ్మతం లేని విషయాలను గురించి వారు రాత్రులలో రహస్య సమాలోచనలను చేసేటపుడు కూడా ఆయన వారితో ఉంటాడు. మరియు వారి సకల చర్యలను అల్లాహ్ పరివేష్టించి ఉన్నాడు.

Verse 109

هَـٰٓأَنتُمْ هَـٰٓؤُلَآءِ جَـٰدَلْتُمْ عَنْهُمْ فِى ٱلْحَيَوٰةِ ٱلدُّنْيَا فَمَن يُجَـٰدِلُ ٱللَّهَ عَنْهُمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ أَم مَّن يَكُونُ عَلَيْهِمْ وَكِيلًا

Transliteration hāantum hāulāi jādaltum ʿanhum fī l-ḥayati l-dun'yā faman yujādilu l-laha ʿanhum yawma l-qiyāmati am man yakūnu ʿalayhim wakīlan

Telugu అవును, మీరే! వారి (ఈ అపరాధుల) పక్షమున ఇహలోక జీవితంలోనైతే వాదించారు. అయితే! తీర్పుదినమున వారి పక్షమున అల్లాహ్ తో ఎవడు వాదించగలడు? లేదా వారికి ఎవడు రక్షకుడు కాగలడు?

Verse 110

وَمَن يَعْمَلْ سُوٓءًا أَوْ يَظْلِمْ نَفْسَهُۥ ثُمَّ يَسْتَغْفِرِ ٱللَّهَ يَجِدِ ٱللَّهَ غَفُورًا رَّحِيمًا

Transliteration waman yaʿmal sūan aw yaẓlim nafsahu thumma yastaghfiri l-laha yajidi l-laha ghafūran raḥīman

Telugu మరియు పాపం చేసినవాడు, లేదా తనకు తాను అన్యాయం చేసుకున్నవాడు, తరువాత అల్లాహ్ ను క్షమాభిక్షకై వేడుకుంటే అలాంటి వాడు, అల్లాహ్ ను క్షమాశీలుడుగా, అపార కరుణా ప్రదాతగా పొందగలడు.!

Verse 111

وَمَن يَكْسِبْ إِثْمًا فَإِنَّمَا يَكْسِبُهُۥ عَلَىٰ نَفْسِهِۦ ۚ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَكِيمًا

Transliteration waman yaksib ith'man fa-innamā yaksibuhu ʿalā nafsihi wakāna l-lahu ʿalīman ḥakīman

Telugu కాని ఎవడైనా పాపాన్ని అర్జిస్తే, దాని (ఫలితం) అతడే స్వయంగా భరిస్తాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు.

Verse 112

وَمَن يَكْسِبْ خَطِيٓـَٔةً أَوْ إِثْمًا ثُمَّ يَرْمِ بِهِۦ بَرِيٓـًٔا فَقَدِ ٱحْتَمَلَ بُهْتَـٰنًا وَإِثْمًا مُّبِينًا

Transliteration waman yaksib khaṭīatan aw ith'man thumma yarmi bihi barīan faqadi iḥ'tamala buh'tānan wa-ith'man mubīnan

Telugu మరియు ఎవడు అపరాధం గానీ, లేదా పాపం గానీ చేసి, తరువాత దానిని ఒక అమాయకునిపై మోపుతాడో! వాస్తవానికి, అలాంటి వాడు తీవ్రమైన అపనిందను మరియు ఘోర పాపాన్ని తన మీద మోపుకున్నవాడే!

Verse 113

وَلَوْلَا فَضْلُ ٱللَّهِ عَلَيْكَ وَرَحْمَتُهُۥ لَهَمَّت طَّآئِفَةٌ مِّنْهُمْ أَن يُضِلُّوكَ وَمَا يُضِلُّونَ إِلَّآ أَنفُسَهُمْ ۖ وَمَا يَضُرُّونَكَ مِن شَىْءٍ ۚ وَأَنزَلَ ٱللَّهُ عَلَيْكَ ٱلْكِتَـٰبَ وَٱلْحِكْمَةَ وَعَلَّمَكَ مَا لَمْ تَكُن تَعْلَمُ ۚ وَكَانَ فَضْلُ ٱللَّهِ عَلَيْكَ عَظِيمًا

Transliteration walawlā faḍlu l-lahi ʿalayka waraḥmatuhu lahammat ṭāifatun min'hum an yuḍillūka wamā yuḍillūna illā anfusahum wamā yaḍurrūnaka min shayin wa-anzala l-lahu ʿalayka l-kitāba wal-ḥik'mata waʿallamaka mā lam takun taʿlamu wakāna faḍlu l-lahi ʿalayka ʿaẓīman

Telugu మరియు (ఓ ప్రవక్తా!) అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కారుణ్యమే నీపై లేకుంటే, వారిలోని ఒక వర్గం వారు నిన్ను మార్గభ్రష్టత్వానికి గురి చేయగోరారు. కాని వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మార్గభ్రష్టులుగా చేయలేరు. మరియు వారు నీ కెలాంటి హానీ చేయలేరు. మరియు అల్లాహ్ నీ పై ఈ గ్రంథాన్ని మరియు వివేకాన్ని అవతరింపజేశాడు. మరియు నీకు తెలియని విషయాలను నీకు నేర్పాడు. మరియు నీ పై ఉన్న అల్లాహ్ అనుగ్రహం చాలా గొప్పది.

Verse 114

۞ لَّا خَيْرَ فِى كَثِيرٍ مِّن نَّجْوَىٰهُمْ إِلَّا مَنْ أَمَرَ بِصَدَقَةٍ أَوْ مَعْرُوفٍ أَوْ إِصْلَـٰحٍۭ بَيْنَ ٱلنَّاسِ ۚ وَمَن يَفْعَلْ ذَٰلِكَ ٱبْتِغَآءَ مَرْضَاتِ ٱللَّهِ فَسَوْفَ نُؤْتِيهِ أَجْرًا عَظِيمًا

Transliteration lā khayra fī kathīrin min najwāhum illā man amara biṣadaqatin aw maʿrūfin aw iṣ'lāḥin bayna l-nāsi waman yafʿal dhālika ib'tighāa marḍāti l-lahi fasawfa nu'tīhi ajran ʿaẓīman

Telugu వారు చేసే రహస్య సమావేశాలలో చాలా మట్టుకు ఏ మేలు లేదు. కాని ఎవరైనా దానధర్మాలు చేయటానికి, సత్కార్యాలు (మ'అరూఫ్) చేయటానికి లేదా ప్రజల మధ్య సంధి చేకూర్చటానికి (సమాలోచనలు) చేస్తే తప్ప! ఎవడు అల్లాహ్ ప్రీతి కొరకు ఇలాంటి పనులు చేస్తాడో, అతనికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము.

Verse 115

وَمَن يُشَاقِقِ ٱلرَّسُولَ مِنۢ بَعْدِ مَا تَبَيَّنَ لَهُ ٱلْهُدَىٰ وَيَتَّبِعْ غَيْرَ سَبِيلِ ٱلْمُؤْمِنِينَ نُوَلِّهِۦ مَا تَوَلَّىٰ وَنُصْلِهِۦ جَهَنَّمَ ۖ وَسَآءَتْ مَصِيرًا

Transliteration waman yushāqiqi l-rasūla min baʿdi mā tabayyana lahu l-hudā wayattabiʿ ghayra sabīli l-mu'minīna nuwallihi mā tawallā wanuṣ'lihi jahannama wasāat maṣīran

Telugu మరియు తనకు సన్మార్గం స్పష్టంగా తెలిసిన పిదప కూడా, ఎవడు ప్రవక్తకు వ్యతిరేకంగా పోయి విశ్వాసుల మార్గం గాక వేరే మార్గాన్ని అనుసరిస్తాడో! అతడు అవలంబించిన త్రోవ వైపునకే, అతనిని మరల్చుతాము మరియు వానిని నరకంలో కాల్చుతాము. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం.

Verse 116

إِنَّ ٱللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِۦ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَآءُ ۚ وَمَن يُشْرِكْ بِٱللَّهِ فَقَدْ ضَلَّ ضَلَـٰلًۢا بَعِيدًا

Transliteration inna l-laha lā yaghfiru an yush'raka bihi wayaghfiru mā dūna dhālika liman yashāu waman yush'rik bil-lahi faqad ḍalla ḍalālan baʿīdan

Telugu నిశ్చయంగా, అల్లాహ్ తనకు సాటి కల్పించటాన్ని (షిర్క్ ను) ఏ మాత్రం క్షమించడు, కాని ఆయన దానిని విడిచి (ఇతర ఏ పాపాన్నైనా) తాను కోరిన వానికి క్షమిస్తాడు! అల్లాహ్ తో భాగస్వాములను కల్పించేవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే!

Verse 117

إِن يَدْعُونَ مِن دُونِهِۦٓ إِلَّآ إِنَـٰثًا وَإِن يَدْعُونَ إِلَّا شَيْطَـٰنًا مَّرِيدًا

Transliteration in yadʿūna min dūnihi illā ināthan wa-in yadʿūna illā shayṭānan marīdan

Telugu ఆయన (అల్లాహ్) ను వదలి, వారు స్త్రీ (దేవత) లను ప్రార్థిస్తున్నారు. మరియు వారు కేవలం తిరుగుబాటుదారుడైన షైతాన్ నే ప్రార్థిస్తున్నారు.

Verse 118

لَّعَنَهُ ٱللَّهُ ۘ وَقَالَ لَأَتَّخِذَنَّ مِنْ عِبَادِكَ نَصِيبًا مَّفْرُوضًا

Transliteration laʿanahu l-lahu waqāla la-attakhidhanna min ʿibādika naṣīban mafrūḍan

Telugu అల్లాహ్ అతన్ని శపించాడు (బహిష్కరించాడు). మరియు అతడు (షైతాన్) ఇలా అన్నాడు: "నేను నిశ్చయంగా, నీ దాసులలో నుండి ఒక నియమిత భాగాన్ని తీసుకుంటాను."

Verse 119

وَلَأُضِلَّنَّهُمْ وَلَأُمَنِّيَنَّهُمْ وَلَـَٔامُرَنَّهُمْ فَلَيُبَتِّكُنَّ ءَاذَانَ ٱلْأَنْعَـٰمِ وَلَـَٔامُرَنَّهُمْ فَلَيُغَيِّرُنَّ خَلْقَ ٱللَّهِ ۚ وَمَن يَتَّخِذِ ٱلشَّيْطَـٰنَ وَلِيًّا مِّن دُونِ ٱللَّهِ فَقَدْ خَسِرَ خُسْرَانًا مُّبِينًا

Transliteration wala-uḍillannahum wala-umanniyannahum walaāmurannahum falayubattikunna ādhāna l-anʿāmi walaāmurannahum falayughayyirunna khalqa l-lahi waman yattakhidhi l-shayṭāna waliyyan min dūni l-lahi faqad khasira khus'rānan mubīnan

Telugu "మరియు నిశ్చయంగా, నేను వారిని మార్గభ్రష్టులుగా చేస్తాను; మరియు వారికి తప్పక తప్పుడు ఆశలు కలిగిస్తాను; మరియు నేను వారిని ఆజ్ఞాపిస్తాను; దాని ప్రకారం వారు తప్పక పశువుల చెవులను చీల్చుతారు; మరియు నేను వారిని ఆజ్ఞాపిస్తాను; దాని ప్రకారం వారు తప్పక అల్లాహ్ సృష్టిలో మార్పులు చేస్తారు. మరియు ఎవడు అల్లాహ్ కు బదులుగా షైతాన్ ను తన రక్షకునిగా చేసుకుంటాడో! వాస్తవానికి వాడే స్పష్టమైన నష్టానికి గురి అయిన వాడు!

Verse 120

يَعِدُهُمْ وَيُمَنِّيهِمْ ۖ وَمَا يَعِدُهُمُ ٱلشَّيْطَـٰنُ إِلَّا غُرُورًا

Transliteration yaʿiduhum wayumannīhim wamā yaʿiduhumu l-shayṭānu illā ghurūran

Telugu అతడు (షైతాన్) వారికి వాగ్దానం చేస్తాడు మరియు వారిలో విపరీత కోరికలను రేపుతాడు. కాని, షైతాన్ వారికి చేసే వాగ్దానాలు మోసపుచ్చేవి మాత్రమే.

Verse 121

أُو۟لَـٰٓئِكَ مَأْوَىٰهُمْ جَهَنَّمُ وَلَا يَجِدُونَ عَنْهَا مَحِيصًا

Transliteration ulāika mawāhum jahannamu walā yajidūna ʿanhā maḥīṣan

Telugu అలాంటి వారి ఆశ్రయం నరకమే; మరియు వారికి దాని నుండి తప్పించుకునే మార్గమే ఉండదు.

Verse 122

وَٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ سَنُدْخِلُهُمْ جَنَّـٰتٍ تَجْرِى مِن تَحْتِهَا ٱلْأَنْهَـٰرُ خَـٰلِدِينَ فِيهَآ أَبَدًا ۖ وَعْدَ ٱللَّهِ حَقًّا ۚ وَمَنْ أَصْدَقُ مِنَ ٱللَّهِ قِيلًا

Transliteration wa-alladhīna āmanū waʿamilū l-ṣāliḥāti sanud'khiluhum jannātin tajrī min taḥtihā l-anhāru khālidīna fīhā abadan waʿda l-lahi ḥaqqan waman aṣdaqu mina l-lahi qīlan

Telugu మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! మేము వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాము; అందులో వారు శాశ్వతంగా కలకాల ముంటారు. అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. మరియు పలుకులలో అల్లాహ్ కంటే ఎక్కువ సత్యవంతుడెవడు?

Verse 123

لَّيْسَ بِأَمَانِيِّكُمْ وَلَآ أَمَانِىِّ أَهْلِ ٱلْكِتَـٰبِ ۗ مَن يَعْمَلْ سُوٓءًا يُجْزَ بِهِۦ وَلَا يَجِدْ لَهُۥ مِن دُونِ ٱللَّهِ وَلِيًّا وَلَا نَصِيرًا

Transliteration laysa bi-amāniyyikum walā amāniyyi ahli l-kitābi man yaʿmal sūan yuj'za bihi walā yajid lahu min dūni l-lahi waliyyan walā naṣīran

Telugu మీ కోరికల ప్రకారంగా గానీ, లేదా గ్రంథ ప్రజల కోరికల ప్రకారంగా గానీ (మోక్షం) లేదు! పాపం చేసిన వానికి దానికి తగిన శిక్ష ఇవ్వబడుతుంది; మరియు వాడు, అల్లాహ్ తప్ప మరొక రక్షకుడిని గానీ, సహాయకుడిని గానీ పొందలేడు!

Verse 124

وَمَن يَعْمَلْ مِنَ ٱلصَّـٰلِحَـٰتِ مِن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَأُو۟لَـٰٓئِكَ يَدْخُلُونَ ٱلْجَنَّةَ وَلَا يُظْلَمُونَ نَقِيرًا

Transliteration waman yaʿmal mina l-ṣāliḥāti min dhakarin aw unthā wahuwa mu'minun fa-ulāika yadkhulūna l-janata walā yuẓ'lamūna naqīran

Telugu మరియు సత్కార్యాలు చేసేవాడు పురుషుడైనా, లేక స్త్రీ అయినా, ఆ వ్యక్తి విశ్వాసి అయి ఉంటే, అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరియు వారికి ఖర్జూర బీజపు చీలిక (నఖీరా) అంత అన్యాయం కూడా జరుగదు.

Verse 125

وَمَنْ أَحْسَنُ دِينًا مِّمَّنْ أَسْلَمَ وَجْهَهُۥ لِلَّهِ وَهُوَ مُحْسِنٌ وَٱتَّبَعَ مِلَّةَ إِبْرَٰهِيمَ حَنِيفًا ۗ وَٱتَّخَذَ ٱللَّهُ إِبْرَٰهِيمَ خَلِيلًا

Transliteration waman aḥsanu dīnan mimman aslama wajhahu lillahi wahuwa muḥ'sinun wa-ittabaʿa millata ib'rāhīma ḥanīfan wa-ittakhadha l-lahu ib'rāhīma khalīlan

Telugu మరియు తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్ కు సమర్పించుకొని (ముస్లిం అయి), సజ్జనుడై, ఇబ్రాహీమ్ అనుసరించిన, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) అనుసరించే వాని కంటే ఉత్తముడైన విశ్వాసి (ధార్మికుడు) ఎవడు? మరియు అల్లాహ్ ! ఇబ్రాహీమ్ ను తన స్నేహితునిగా చేసుకున్నాడు.

Verse 126

وَلِلَّهِ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۚ وَكَانَ ٱللَّهُ بِكُلِّ شَىْءٍ مُّحِيطًا

Transliteration walillahi mā fī l-samāwāti wamā fī l-arḍi wakāna l-lahu bikulli shayin muḥīṭan

Telugu మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు చెందినదే. మరియు వాస్తవానికి అల్లాహ్ ప్రతి దానిని పరివేష్టించి ఉన్నాడు.

Verse 127

وَيَسْتَفْتُونَكَ فِى ٱلنِّسَآءِ ۖ قُلِ ٱللَّهُ يُفْتِيكُمْ فِيهِنَّ وَمَا يُتْلَىٰ عَلَيْكُمْ فِى ٱلْكِتَـٰبِ فِى يَتَـٰمَى ٱلنِّسَآءِ ٱلَّـٰتِى لَا تُؤْتُونَهُنَّ مَا كُتِبَ لَهُنَّ وَتَرْغَبُونَ أَن تَنكِحُوهُنَّ وَٱلْمُسْتَضْعَفِينَ مِنَ ٱلْوِلْدَٰنِ وَأَن تَقُومُوا۟ لِلْيَتَـٰمَىٰ بِٱلْقِسْطِ ۚ وَمَا تَفْعَلُوا۟ مِنْ خَيْرٍ فَإِنَّ ٱللَّهَ كَانَ بِهِۦ عَلِيمًا

Transliteration wayastaftūnaka fī l-nisāi quli l-lahu yuf'tīkum fīhinna wamā yut'lā ʿalaykum fī l-kitābi fī yatāmā l-nisāi allātī lā tu'tūnahunna mā kutiba lahunna watarghabūna an tankiḥūhunna wal-mus'taḍʿafīna mina l-wil'dāni wa-an taqūmū lil'yatāmā bil-qis'ṭi wamā tafʿalū min khayrin fa-inna l-laha kāna bihi ʿalīman

Telugu మరియు వారు నిన్ను స్త్రీల వ్యవహారంలో గల ధార్మిక తీర్పు (ఫత్వా)ను గురించి అడుగుతున్నారు. వారితో ఇలా అను: "అల్లాహ్ వారిని (స్త్రీలను) గురించి ధార్మిక తీర్పు ఇస్తున్నాడు: 'అనాథ స్త్రీలను, వారి కొరకు నిర్ణయించబడిన హక్కు (మహ్ర్) ను మీరు వారికివ్వక, వారిని పెండ్లాడ గోరుతున్న విషయాన్ని గురించీ మరియు బలహీనులైన బిడ్డలను గురించీ మరియు అనాథ పిల్లల విషయంలోనూ న్యాయంగా వ్యవహరించాలని, ఈ గ్రంథంలో మీకు తెలుపబడుతోంది.' మరియు మీరు ఏ మంచిపని చేసినా అది అల్లాహ్ కు తప్పకుండా తెలుస్తుంది."

Verse 128

وَإِنِ ٱمْرَأَةٌ خَافَتْ مِنۢ بَعْلِهَا نُشُوزًا أَوْ إِعْرَاضًا فَلَا جُنَاحَ عَلَيْهِمَآ أَن يُصْلِحَا بَيْنَهُمَا صُلْحًا ۚ وَٱلصُّلْحُ خَيْرٌ ۗ وَأُحْضِرَتِ ٱلْأَنفُسُ ٱلشُّحَّ ۚ وَإِن تُحْسِنُوا۟ وَتَتَّقُوا۟ فَإِنَّ ٱللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا

Transliteration wa-ini im'ra-atun khāfat min baʿlihā nushūzan aw iʿ'rāḍan falā junāḥa ʿalayhimā an yuṣ'liḥā baynahumā ṣul'ḥan wal-ṣul'ḥu khayrun wa-uḥ'ḍirati l-anfusu l-shuḥa wa-in tuḥ'sinū watattaqū fa-inna l-laha kāna bimā taʿmalūna khabīran

Telugu మరియు ఒకవేళ స్త్రీ తన భర్త, అనాదరణతో ప్రవర్తిస్తాడేమోనని, లేదా విముఖుడవుతాడేమోనని, భయపడితే! వారిద్దరూ తమ మధ్య రాజీ చేసుకుంటే! వారిపై ఎలాంటి దోషం లేదు. రాజీ పడటం ఎంతో ఉత్తమమైనది. మరియు మానవుల మనస్సులలో పేరాస ఇమిడి వున్నది. మీరు సజ్జనులై దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ మీ కర్మలన్నింటినీ బాగా ఎరుగును.

Verse 129

وَلَن تَسْتَطِيعُوٓا۟ أَن تَعْدِلُوا۟ بَيْنَ ٱلنِّسَآءِ وَلَوْ حَرَصْتُمْ ۖ فَلَا تَمِيلُوا۟ كُلَّ ٱلْمَيْلِ فَتَذَرُوهَا كَٱلْمُعَلَّقَةِ ۚ وَإِن تُصْلِحُوا۟ وَتَتَّقُوا۟ فَإِنَّ ٱللَّهَ كَانَ غَفُورًا رَّحِيمًا

Transliteration walan tastaṭīʿū an taʿdilū bayna l-nisāi walaw ḥaraṣtum falā tamīlū kulla l-mayli fatadharūhā kal-muʿalaqati wa-in tuṣ'liḥū watattaqū fa-inna l-laha kāna ghafūran raḥīman

Telugu మరియు మీరు ఎంత కోరినా, మీ భార్యల మధ్య పూర్తి న్యాయం చేయటం మీ చేతకాని పని. కనుక ఒక భార్య వైపునకు ఎక్కువగా మొగ్గి, మరొకామెను డోలాయమాన స్థితిలో వదలకండి. మీరు మీ ప్రవర్తనను సరి జేసుకొని దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

Verse 130

وَإِن يَتَفَرَّقَا يُغْنِ ٱللَّهُ كُلًّا مِّن سَعَتِهِۦ ۚ وَكَانَ ٱللَّهُ وَٰسِعًا حَكِيمًا

Transliteration wa-in yatafarraqā yugh'ni l-lahu kullan min saʿatihi wakāna l-lahu wāsiʿan ḥakīman

Telugu కాని ఒకవేళ వారు (దంపతులు) విడిపోతే! అల్లాహ్ తన దాతృత్వంతో వారిలో ప్రతి ఒక్కరినీ, స్వయం సమృద్ధులుగా చేయవచ్చు! మరియు అల్లాహ్! సర్వవ్యాప్తి (సర్వోపగతుడు), మహా వివేచనాపరుడు.

Verse 131

وَلِلَّهِ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۗ وَلَقَدْ وَصَّيْنَا ٱلَّذِينَ أُوتُوا۟ ٱلْكِتَـٰبَ مِن قَبْلِكُمْ وَإِيَّاكُمْ أَنِ ٱتَّقُوا۟ ٱللَّهَ ۚ وَإِن تَكْفُرُوا۟ فَإِنَّ لِلَّهِ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۚ وَكَانَ ٱللَّهُ غَنِيًّا حَمِيدًا

Transliteration walillahi mā fī l-samāwāti wamā fī l-arḍi walaqad waṣṣaynā alladhīna ūtū l-kitāba min qablikum wa-iyyākum ani ittaqū l-laha wa-in takfurū fa-inna lillahi mā fī l-samāwāti wamā fī l-arḍi wakāna l-lahu ghaniyyan ḥamīdan

Telugu మరియు ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు చెందినదే. మరియు వాస్తవానికి మేము అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండమని, పూర్వం గ్రంథం ఇచ్చిన వారికీ మరియు మీకూ ఆజ్ఞాపించాము. మరియు ఒకవేళ మీరు తిరస్కరిస్తే భూమ్యాకాశాలలో ఉన్నదంతా నిశ్చయంగా, అల్లాహ్ కే చెందినది. మరియు అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు.

Verse 132

وَلِلَّهِ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۚ وَكَفَىٰ بِٱللَّهِ وَكِيلًا

Transliteration walillahi mā fī l-samāwāti wamā fī l-arḍi wakafā bil-lahi wakīlan

Telugu మరియు ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. మరియు కార్యసాధకుడిగా అల్లాహ్ చాలు!

Verse 133

إِن يَشَأْ يُذْهِبْكُمْ أَيُّهَا ٱلنَّاسُ وَيَأْتِ بِـَٔاخَرِينَ ۚ وَكَانَ ٱللَّهُ عَلَىٰ ذَٰلِكَ قَدِيرًا

Transliteration in yasha yudh'hib'kum ayyuhā l-nāsu wayati biākharīna wakāna l-lahu ʿalā dhālika qadīran

Telugu ఓ మానవులారా! ఆయన కోరితే, మిమ్మల్ని అంతం చేసి ఇతరులను తేగలడు. మరియు వాస్తవానికి, అల్లాహ్ ఇలా చేయగల సమర్ధుడు.

Verse 134

مَّن كَانَ يُرِيدُ ثَوَابَ ٱلدُّنْيَا فَعِندَ ٱللَّهِ ثَوَابُ ٱلدُّنْيَا وَٱلْـَٔاخِرَةِ ۚ وَكَانَ ٱللَّهُ سَمِيعًۢا بَصِيرًا

Transliteration man kāna yurīdu thawāba l-dun'yā faʿinda l-lahi thawābu l-dun'yā wal-ākhirati wakāna l-lahu samīʿan baṣīran

Telugu ఎవడు ఇహలోక ఫలితాన్ని కోరుతాడో, (వానికదే దొరుకుతుంది). కాని (కేవలం) అల్లాహ్ వద్దనే ఇహలోక మరియు పరలోక ఫలితాలున్నాయి. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.

Verse 135

۞ يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ كُونُوا۟ قَوَّٰمِينَ بِٱلْقِسْطِ شُهَدَآءَ لِلَّهِ وَلَوْ عَلَىٰٓ أَنفُسِكُمْ أَوِ ٱلْوَٰلِدَيْنِ وَٱلْأَقْرَبِينَ ۚ إِن يَكُنْ غَنِيًّا أَوْ فَقِيرًا فَٱللَّهُ أَوْلَىٰ بِهِمَا ۖ فَلَا تَتَّبِعُوا۟ ٱلْهَوَىٰٓ أَن تَعْدِلُوا۟ ۚ وَإِن تَلْوُۥٓا۟ أَوْ تُعْرِضُوا۟ فَإِنَّ ٱللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا

Transliteration yāayyuhā alladhīna āmanū kūnū qawwāmīna bil-qis'ṭi shuhadāa lillahi walaw ʿalā anfusikum awi l-wālidayni wal-aqrabīna in yakun ghaniyyan aw faqīran fal-lahu awlā bihimā falā tattabiʿū l-hawā an taʿdilū wa-in talwū aw tuʿ'riḍū fa-inna l-laha kāna bimā taʿmalūna khabīran

Telugu ఓ విశ్వాసులారా! మీరు న్యాయం కొరకు స్థిరంగా నిలబడి, అల్లాహ్ కొరకే సాక్ష్యమివ్వండి. మరియు మీ సాక్ష్యం మీకు గానీ, మీ తల్లిదండ్రులకు గానీ, మీ బంధువులకు గానీ, విరుద్ధంగా ఉన్నా సరే. వాడు ధనవంతుడైనా లేక పేదవాడైనా సరే! (మీ కంటే ఎక్కువ) అల్లాహ్ వారిద్దరి మేలు కోరేవాడు. కావున మీరు మీ మనోవాంఛలను అనుసరిస్తే న్యాయం చేయకపోవచ్చు. మీరు మీ సాక్ష్యాన్ని వక్రీకరించినా, లేక దానిని నిరాకరించినా! నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును.

Verse 136

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ ءَامِنُوا۟ بِٱللَّهِ وَرَسُولِهِۦ وَٱلْكِتَـٰبِ ٱلَّذِى نَزَّلَ عَلَىٰ رَسُولِهِۦ وَٱلْكِتَـٰبِ ٱلَّذِىٓ أَنزَلَ مِن قَبْلُ ۚ وَمَن يَكْفُرْ بِٱللَّهِ وَمَلَـٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ فَقَدْ ضَلَّ ضَلَـٰلًۢا بَعِيدًا

Transliteration yāayyuhā alladhīna āmanū āminū bil-lahi warasūlihi wal-kitābi alladhī nazzala ʿalā rasūlihi wal-kitābi alladhī anzala min qablu waman yakfur bil-lahi wamalāikatihi wakutubihi warusulihi wal-yawmi l-ākhiri faqad ḍalla ḍalālan baʿīdan

Telugu ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరునిపై (ముహమ్మద్ పై) అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు ఆయన ఇంతకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి. అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంతాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే!

Verse 137

إِنَّ ٱلَّذِينَ ءَامَنُوا۟ ثُمَّ كَفَرُوا۟ ثُمَّ ءَامَنُوا۟ ثُمَّ كَفَرُوا۟ ثُمَّ ٱزْدَادُوا۟ كُفْرًا لَّمْ يَكُنِ ٱللَّهُ لِيَغْفِرَ لَهُمْ وَلَا لِيَهْدِيَهُمْ سَبِيلًۢا

Transliteration inna alladhīna āmanū thumma kafarū thumma āmanū thumma kafarū thumma iz'dādū kuf'ran lam yakuni l-lahu liyaghfira lahum walā liyahdiyahum sabīlan

Telugu నిశ్చయంగా, ఎవరైతే విశ్వసించిన తరువాత తిరస్కరించి, మళ్ళీ విశ్వసించి, ఆ తరువాత తిరస్కరించి; ఆ తిరస్కారంలోనే పురోగమిస్తారో! అలాంటి వారిని అల్లాహ్ ఎన్నటికీ క్షమించడు. మరియు వారికి సన్మార్గం వైపునకు దారి చూపడు!

Verse 138

بَشِّرِ ٱلْمُنَـٰفِقِينَ بِأَنَّ لَهُمْ عَذَابًا أَلِيمًا

Transliteration bashiri l-munāfiqīna bi-anna lahum ʿadhāban alīman

Telugu కపట విశ్వాసులకు, నిశ్చయంగా! బాధాకరమైన శిక్ష ఉందని తెలుపు.

Verse 139

ٱلَّذِينَ يَتَّخِذُونَ ٱلْكَـٰفِرِينَ أَوْلِيَآءَ مِن دُونِ ٱلْمُؤْمِنِينَ ۚ أَيَبْتَغُونَ عِندَهُمُ ٱلْعِزَّةَ فَإِنَّ ٱلْعِزَّةَ لِلَّهِ جَمِيعًا

Transliteration alladhīna yattakhidhūna l-kāfirīna awliyāa min dūni l-mu'minīna ayabtaghūna ʿindahumu l-ʿizata fa-inna l-ʿizata lillahi jamīʿan

Telugu ఎవరైతే విశ్వాసులను వదలి సత్యతిరస్కారులను తమ స్నేహితులుగా చేసుకుంటున్నారో! అలాంటి వారు, వారి (అవిశ్వాసుల) నుండి, గౌరవాన్ని పొందగోరు తున్నారా? కానీ నిశ్చయంగా, గౌరవమంతా కేవలం అల్లాహ్ కే చెందినది.

Verse 140

وَقَدْ نَزَّلَ عَلَيْكُمْ فِى ٱلْكِتَـٰبِ أَنْ إِذَا سَمِعْتُمْ ءَايَـٰتِ ٱللَّهِ يُكْفَرُ بِهَا وَيُسْتَهْزَأُ بِهَا فَلَا تَقْعُدُوا۟ مَعَهُمْ حَتَّىٰ يَخُوضُوا۟ فِى حَدِيثٍ غَيْرِهِۦٓ ۚ إِنَّكُمْ إِذًا مِّثْلُهُمْ ۗ إِنَّ ٱللَّهَ جَامِعُ ٱلْمُنَـٰفِقِينَ وَٱلْكَـٰفِرِينَ فِى جَهَنَّمَ جَمِيعًا

Transliteration waqad nazzala ʿalaykum fī l-kitābi an idhā samiʿ'tum āyāti l-lahi yuk'faru bihā wayus'tahza-u bihā falā taqʿudū maʿahum ḥattā yakhūḍū fī ḥadīthin ghayrihi innakum idhan mith'luhum inna l-laha jāmiʿu l-munāfiqīna wal-kāfirīna fī jahannama jamīʿan

Telugu మరియు వాస్తవానికి, (అల్లాహ్) మీ కొరకు ఈ గ్రంథంలో (ఈ విధమైన ఆజ్ఞ) అవతరింపజేశాడు: "ఒకవేళ మీరు అల్లాహ్ సూక్తులను గురించి తిరస్కారాన్ని మరియు పరిహాసాన్ని వింటే! అలా చేసేవారు, (ఆ సంభాషణ వదలి) ఇతర సంభాషణ ప్రారంభించనంత వరకు మీరు వారితో కలిసి కూర్చోకండి!" అలా చేస్తే నిశ్చయంగా, మీరు కూడా వారిలాంటి వారే! నిశ్చయంగా, అల్లాహ్ కపట విశ్వాసులను మరియు సత్యతిరస్కారులను అందరినీ నరకంలో జమ చేస్తాడు.

Verse 141

ٱلَّذِينَ يَتَرَبَّصُونَ بِكُمْ فَإِن كَانَ لَكُمْ فَتْحٌ مِّنَ ٱللَّهِ قَالُوٓا۟ أَلَمْ نَكُن مَّعَكُمْ وَإِن كَانَ لِلْكَـٰفِرِينَ نَصِيبٌ قَالُوٓا۟ أَلَمْ نَسْتَحْوِذْ عَلَيْكُمْ وَنَمْنَعْكُم مِّنَ ٱلْمُؤْمِنِينَ ۚ فَٱللَّهُ يَحْكُمُ بَيْنَكُمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ ۗ وَلَن يَجْعَلَ ٱللَّهُ لِلْكَـٰفِرِينَ عَلَى ٱلْمُؤْمِنِينَ سَبِيلًا

Transliteration alladhīna yatarabbaṣūna bikum fa-in kāna lakum fatḥun mina l-lahi qālū alam nakun maʿakum wa-in kāna lil'kāfirīna naṣībun qālū alam nastaḥwidh ʿalaykum wanamnaʿkum mina l-mu'minīna fal-lahu yaḥkumu baynakum yawma l-qiyāmati walan yajʿala l-lahu lil'kāfirīna ʿalā l-mu'minīna sabīlan

Telugu వారు (కపట విశ్వాసులు) మీ విషయంలో నిరీక్షిస్తున్నారు. ఒకవేళ మీకు అల్లాహ్ తరఫు నుండి విజయం లభిస్తే! వారు (మీతో) అంటారు: "ఏమీ? మేము మీతో కలిసి లేమా?" కాని ఒకవేళ సత్యతిరస్కారులదే పైచేయి అయితే (వారితో) అంటారు: "ఏమీ? మీతో గెలిచే శక్తి మాకు లేక పోయిందా? అయినా మేము మిమ్మల్ని విశ్వాసుల నుండి కాపాడలేదా?" కాని అల్లాహ్ పునరుత్థాన దినమున మీ మధ్య తీర్పు చేస్తాడు. మరియు అల్లాహ్! ఎన్నటికీ సత్యతిరస్కారులకు విశ్వాసులపై (విజయం పొందే) మార్గం చూపడు.

Verse 142

إِنَّ ٱلْمُنَـٰفِقِينَ يُخَـٰدِعُونَ ٱللَّهَ وَهُوَ خَـٰدِعُهُمْ وَإِذَا قَامُوٓا۟ إِلَى ٱلصَّلَوٰةِ قَامُوا۟ كُسَالَىٰ يُرَآءُونَ ٱلنَّاسَ وَلَا يَذْكُرُونَ ٱللَّهَ إِلَّا قَلِيلًا

Transliteration inna l-munāfiqīna yukhādiʿūna l-laha wahuwa khādiʿuhum wa-idhā qāmū ilā l-ṣalati qāmū kusālā yurāūna l-nāsa walā yadhkurūna l-laha illā qalīlan

Telugu నిశ్చయంగా, ఈ కపట విశ్వాసులు అల్లాహ్ ను మోసగించగోరుతున్నారు. కాని ఆయనే వారిని మోసంలో పడవేశాడు. మరియు ఒకవేళ వారు నమాజ్ కొరకు నిలిచినా శ్రద్ధాహీనులై కేవలం ప్రజలకు చూపటానికే నిలుస్తారు. మరియు వారు అల్లాహ్ ను స్మరించేది చాల తక్కువ!

Verse 143

مُّذَبْذَبِينَ بَيْنَ ذَٰلِكَ لَآ إِلَىٰ هَـٰٓؤُلَآءِ وَلَآ إِلَىٰ هَـٰٓؤُلَآءِ ۚ وَمَن يُضْلِلِ ٱللَّهُ فَلَن تَجِدَ لَهُۥ سَبِيلًا

Transliteration mudhabdhabīna bayna dhālika lā ilā hāulāi walā ilā hāulāi waman yuḍ'lili l-lahu falan tajida lahu sabīlan

Telugu వారు (విశ్వాస - అవిశ్వాసాల) మధ్య ఊగిసలాడుతున్నారు. వారు పూర్తిగా ఇటు (విశ్వాసులు) కాకుండా, పూర్తిగా అటు (సత్యతిరస్కారులు) కాకుండా ఉన్నారు. మరియు ఎవడినైతే అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడవేస్తాడో అలాంటి వాడికి నీవు (సరైన) మార్గం చూపలేవు.

Verse 144

يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوا۟ لَا تَتَّخِذُوا۟ ٱلْكَـٰفِرِينَ أَوْلِيَآءَ مِن دُونِ ٱلْمُؤْمِنِينَ ۚ أَتُرِيدُونَ أَن تَجْعَلُوا۟ لِلَّهِ عَلَيْكُمْ سُلْطَـٰنًا مُّبِينًا

Transliteration yāayyuhā alladhīna āmanū lā tattakhidhū l-kāfirīna awliyāa min dūni l-mu'minīna aturīdūna an tajʿalū lillahi ʿalaykum sul'ṭānan mubīnan

Telugu ఓ విశ్వాసులారా! మీరు విశ్వాసులను వదలి సత్యతిరస్కారులను, మీ స్నేహితులుగా చేసుకోకండి. ఏమీ? మీరు, మీకే వ్యతిరేకంగా, అల్లాహ్ కు స్పష్టమైన ప్రమాణం ఇవ్వదలచు కున్నారా?

Verse 145

إِنَّ ٱلْمُنَـٰفِقِينَ فِى ٱلدَّرْكِ ٱلْأَسْفَلِ مِنَ ٱلنَّارِ وَلَن تَجِدَ لَهُمْ نَصِيرًا

Transliteration inna l-munāfiqīna fī l-darki l-asfali mina l-nāri walan tajida lahum naṣīran

Telugu నిశ్చయంగా కపట విశ్వాసులు నరకంలో, అట్టడుగు అంతస్తులో పడి ఉంటారు. మరియు వారికి సహాయం చేయగల వాడిని ఎవ్వడినీ నీవు పొందజాలవు.

Verse 146

إِلَّا ٱلَّذِينَ تَابُوا۟ وَأَصْلَحُوا۟ وَٱعْتَصَمُوا۟ بِٱللَّهِ وَأَخْلَصُوا۟ دِينَهُمْ لِلَّهِ فَأُو۟لَـٰٓئِكَ مَعَ ٱلْمُؤْمِنِينَ ۖ وَسَوْفَ يُؤْتِ ٱللَّهُ ٱلْمُؤْمِنِينَ أَجْرًا عَظِيمًا

Transliteration illā alladhīna tābū wa-aṣlaḥū wa-iʿ'taṣamū bil-lahi wa-akhlaṣū dīnahum lillahi fa-ulāika maʿa l-mu'minīna wasawfa yu'ti l-lahu l-mu'minīna ajran ʿaẓīman

Telugu కాని ఎవరైతే, పశ్చాత్తాప పడి, తమను తాము సంస్కరించుకొని, అల్లాహ్ ను గట్టిగా నమ్ముకొని తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించు కుంటారో, అలాంటి వారే విశ్వాసులతో కలిసి మెలిసి ఉంటారు. మరియు త్వరలోనే అల్లాహ్ విశ్వాసులందరికీ గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించగలడు.

Verse 147

مَّا يَفْعَلُ ٱللَّهُ بِعَذَابِكُمْ إِن شَكَرْتُمْ وَءَامَنتُمْ ۚ وَكَانَ ٱللَّهُ شَاكِرًا عَلِيمًا

Transliteration mā yafʿalu l-lahu biʿadhābikum in shakartum waāmantum wakāna l-lahu shākiran ʿalīman

Telugu మీరు కృతజ్ఞులై, విశ్వాసులై ఉంటే అల్లాహ్ మిమ్మల్ని నిష్కారణంగా ఎందుకు శిక్షిస్తాడు? మరియు అల్లాహ్ కృతజ్ఞతలను ఆమోదించేవాడు, సర్వజ్ఞుడు.

Verse 148

۞ لَّا يُحِبُّ ٱللَّهُ ٱلْجَهْرَ بِٱلسُّوٓءِ مِنَ ٱلْقَوْلِ إِلَّا مَن ظُلِمَ ۚ وَكَانَ ٱللَّهُ سَمِيعًا عَلِيمًا

Transliteration lā yuḥibbu l-lahu l-jahra bil-sūi mina l-qawli illā man ẓulima wakāna l-lahu samīʿan ʿalīman

Telugu అన్యాయానికి గురి అయిన వాడు తప్ప! చెడును బహిరంగంగా పలుకటాన్ని అల్లాహ్ ఇష్టపడడు. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

Verse 149

إِن تُبْدُوا۟ خَيْرًا أَوْ تُخْفُوهُ أَوْ تَعْفُوا۟ عَن سُوٓءٍ فَإِنَّ ٱللَّهَ كَانَ عَفُوًّا قَدِيرًا

Transliteration in tub'dū khayran aw tukh'fūhu aw taʿfū ʿan sūin fa-inna l-laha kāna ʿafuwwan qadīran

Telugu మీరు మేలును బహిరంగంగా చెప్పినా లేక దానిని దాచినా! లేక చెడును క్షమించినా! నిశ్చయంగా, అల్లాహ్ మన్నించే వాడు, సర్వ సమర్ధుడు.

Verse 150

إِنَّ ٱلَّذِينَ يَكْفُرُونَ بِٱللَّهِ وَرُسُلِهِۦ وَيُرِيدُونَ أَن يُفَرِّقُوا۟ بَيْنَ ٱللَّهِ وَرُسُلِهِۦ وَيَقُولُونَ نُؤْمِنُ بِبَعْضٍ وَنَكْفُرُ بِبَعْضٍ وَيُرِيدُونَ أَن يَتَّخِذُوا۟ بَيْنَ ذَٰلِكَ سَبِيلًا

Transliteration inna alladhīna yakfurūna bil-lahi warusulihi wayurīdūna an yufarriqū bayna l-lahi warusulihi wayaqūlūna nu'minu bibaʿḍin wanakfuru bibaʿḍin wayurīdūna an yattakhidhū bayna dhālika sabīlan

Telugu నిశ్చయంగా, అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను తిరస్కరించే వారూ మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం చూపగోరే వారూ (అంటే అల్లాహ్ ను విశ్వసించి, ప్రవక్తలను తిరస్కరించే వారూ) మరియు: "మేము కొందరు ప్రవక్తలను విశ్వసిస్తాము, మరి కొందరిని తిరస్కరిస్తాము." అని అనే వారూ మరియు (విశ్వాస - అవిశ్వాసాలకు) మధ్య మార్గాన్ని కల్పించ గోరేవారూ -

Verse 151

أُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْكَـٰفِرُونَ حَقًّا ۚ وَأَعْتَدْنَا لِلْكَـٰفِرِينَ عَذَابًا مُّهِينًا

Transliteration ulāika humu l-kāfirūna ḥaqqan wa-aʿtadnā lil'kāfirīna ʿadhāban muhīnan

Telugu ఇలాంటి వారే - నిస్సందేహంగా సత్యతిరస్కారులు మరియు సత్యతిరస్కారుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము.

Verse 152

وَٱلَّذِينَ ءَامَنُوا۟ بِٱللَّهِ وَرُسُلِهِۦ وَلَمْ يُفَرِّقُوا۟ بَيْنَ أَحَدٍ مِّنْهُمْ أُو۟لَـٰٓئِكَ سَوْفَ يُؤْتِيهِمْ أُجُورَهُمْ ۗ وَكَانَ ٱللَّهُ غَفُورًا رَّحِيمًا

Transliteration wa-alladhīna āmanū bil-lahi warusulihi walam yufarriqū bayna aḥadin min'hum ulāika sawfa yu'tīhim ujūrahum wakāna l-lahu ghafūran raḥīman

Telugu మరియు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలందరినీ విశ్వసిస్తూ, వారి (ప్రవక్తల) మధ్య భేదభావాలు చూపని వారికి ఆయన (అల్లాహ్) వారి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదించగలడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.

Verse 153

يَسْـَٔلُكَ أَهْلُ ٱلْكِتَـٰبِ أَن تُنَزِّلَ عَلَيْهِمْ كِتَـٰبًا مِّنَ ٱلسَّمَآءِ ۚ فَقَدْ سَأَلُوا۟ مُوسَىٰٓ أَكْبَرَ مِن ذَٰلِكَ فَقَالُوٓا۟ أَرِنَا ٱللَّهَ جَهْرَةً فَأَخَذَتْهُمُ ٱلصَّـٰعِقَةُ بِظُلْمِهِمْ ۚ ثُمَّ ٱتَّخَذُوا۟ ٱلْعِجْلَ مِنۢ بَعْدِ مَا جَآءَتْهُمُ ٱلْبَيِّنَـٰتُ فَعَفَوْنَا عَن ذَٰلِكَ ۚ وَءَاتَيْنَا مُوسَىٰ سُلْطَـٰنًا مُّبِينًا

Transliteration yasaluka ahlu l-kitābi an tunazzila ʿalayhim kitāban mina l-samāi faqad sa-alū mūsā akbara min dhālika faqālū arinā l-laha jahratan fa-akhadhathumu l-ṣāʿiqatu biẓul'mihim thumma ittakhadhū l-ʿij'la min baʿdi mā jāathumu l-bayinātu faʿafawnā ʿan dhālika waātaynā mūsā sul'ṭānan mubīnan

Telugu (ఓ ప్రవక్తా!) గ్రంథ ప్రజలు నిన్ను ఆకాశం నుండి వారిపై ఒక గ్రంథాన్ని అవతరింపజేయమని, అడుగుతున్నారని (ఆశ్చర్య పడకు). వాస్తవానికి వారు మూసాను ఇంతకంటే దారుణమైన దానిని కోరుతూ: "అల్లాహ్ ను మాకు ప్రత్యక్ష్యంగా చూపించు!" అని అడిగారు. అప్పుడు వారి దుర్మార్గానికి ఫలితంగా వారిపై పిడుగు విరుచుకు పడింది. స్పష్టమైన సూచనలు లభించిన తరువాతనే వారు ఆవుదూడను (ఆరాధ్యదైవంగా) చేసుకున్నారు. అయినా దానికి మేము వారిని క్షమించాము. మరియు మూసాకు మేము స్పష్టమైన అధికార మిచ్చాము.

Verse 154

وَرَفَعْنَا فَوْقَهُمُ ٱلطُّورَ بِمِيثَـٰقِهِمْ وَقُلْنَا لَهُمُ ٱدْخُلُوا۟ ٱلْبَابَ سُجَّدًا وَقُلْنَا لَهُمْ لَا تَعْدُوا۟ فِى ٱلسَّبْتِ وَأَخَذْنَا مِنْهُم مِّيثَـٰقًا غَلِيظًا

Transliteration warafaʿnā fawqahumu l-ṭūra bimīthāqihim waqul'nā lahumu ud'khulū l-bāba sujjadan waqul'nā lahum lā taʿdū fī l-sabti wa-akhadhnā min'hum mīthāqan ghalīẓan

Telugu మరియు మేము వారిపై తూర్ పర్వతాన్ని ఎత్తి ప్రమాణం తీసుకున్నాము. మేము వారితో: "సాష్టాంగపడుతూ (వంగుతూ) ద్వారంలో ప్రవేశించండి." అని అన్నాము. మరియు: "శనివారపు (సబ్త్) శాసనాన్ని ఉల్లంఘించకండి." అని కూడా వారితో అన్నాము. మరియు మేము వారితో దృఢమైన ప్రమాణం కూడా తీసుకున్నాము.

Verse 155

فَبِمَا نَقْضِهِم مِّيثَـٰقَهُمْ وَكُفْرِهِم بِـَٔايَـٰتِ ٱللَّهِ وَقَتْلِهِمُ ٱلْأَنۢبِيَآءَ بِغَيْرِ حَقٍّ وَقَوْلِهِمْ قُلُوبُنَا غُلْفٌۢ ۚ بَلْ طَبَعَ ٱللَّهُ عَلَيْهَا بِكُفْرِهِمْ فَلَا يُؤْمِنُونَ إِلَّا قَلِيلًا

Transliteration fabimā naqḍihim mīthāqahum wakuf'rihim biāyāti l-lahi waqatlihimu l-anbiyāa bighayri ḥaqqin waqawlihim qulūbunā ghul'fun bal ṭabaʿa l-lahu ʿalayhā bikuf'rihim falā yu'minūna illā qalīlan

Telugu కాని వారు తాము చేసిన ప్రమాణాలను భంగం చేయటం వలన మరియు అల్లాహ్ సూక్తులను తిరస్కరించటం వలన మరియు ప్రవక్తలను అన్యాయంగా చంపటం వలన! మరియు: "మా హృదయాలు పొరలతో కప్పబడి ఉన్నాయి." అని అనటం వలన (మేము వారిని శిక్షించాము). అంతే కాదు, వారి సత్య తిరస్కారం వలన అల్లాహ్ వారి హృదయాలపై ముద్ర వేసి ఉన్నాడు; కాబట్టి వారు విశ్వసించినా కొంత మాత్రమే!

Verse 156

وَبِكُفْرِهِمْ وَقَوْلِهِمْ عَلَىٰ مَرْيَمَ بُهْتَـٰنًا عَظِيمًا

Transliteration wabikuf'rihim waqawlihim ʿalā maryama buh'tānan ʿaẓīman

Telugu మరియు వారి సత్యతిరస్కారం వలన మరియు వారు మర్యమ్ పై మోపిన మహా అపనింద వలన;

Verse 157

وَقَوْلِهِمْ إِنَّا قَتَلْنَا ٱلْمَسِيحَ عِيسَى ٱبْنَ مَرْيَمَ رَسُولَ ٱللَّهِ وَمَا قَتَلُوهُ وَمَا صَلَبُوهُ وَلَـٰكِن شُبِّهَ لَهُمْ ۚ وَإِنَّ ٱلَّذِينَ ٱخْتَلَفُوا۟ فِيهِ لَفِى شَكٍّ مِّنْهُ ۚ مَا لَهُم بِهِۦ مِنْ عِلْمٍ إِلَّا ٱتِّبَاعَ ٱلظَّنِّ ۚ وَمَا قَتَلُوهُ يَقِينًۢا

Transliteration waqawlihim innā qatalnā l-masīḥa ʿīsā ib'na maryama rasūla l-lahi wamā qatalūhu wamā ṣalabūhu walākin shubbiha lahum wa-inna alladhīna ikh'talafū fīhi lafī shakkin min'hu mā lahum bihi min ʿil'min illā ittibāʿa l-ẓani wamā qatalūhu yaqīnan

Telugu మరియు వారు: "నిశ్చయంగా, మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు, మర్యమ్ కుమారుడైన, ఈసా మసీహ్ ను (ఏసు క్రీస్తును) చంపాము." అని అన్నందుకు. మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు శిలువపై ఎక్కించనూ లేదు, కాని, వారు భ్రమకు గురి చేయబడ్డారు. నిశ్చయంగా, ఈ విషయాన్ని గురించి అభిప్రాయభేదం ఉన్నవారు దీనిని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు. ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. నిశ్చయంగా, వారు అతనిని చంపలేదు.

Verse 158

بَل رَّفَعَهُ ٱللَّهُ إِلَيْهِ ۚ وَكَانَ ٱللَّهُ عَزِيزًا حَكِيمًا

Transliteration bal rafaʿahu l-lahu ilayhi wakāna l-lahu ʿazīzan ḥakīman

Telugu వాస్తవానికి, అల్లాహ్ అతనిని (ఈసాను) తన వైపునకు ఎత్తుకున్నాడు మరియు అల్లాహ్ సర్వశక్తి సంపన్నుడు, మహా వివేకవంతుడు.

Verse 159

وَإِن مِّنْ أَهْلِ ٱلْكِتَـٰبِ إِلَّا لَيُؤْمِنَنَّ بِهِۦ قَبْلَ مَوْتِهِۦ ۖ وَيَوْمَ ٱلْقِيَـٰمَةِ يَكُونُ عَلَيْهِمْ شَهِيدًا

Transliteration wa-in min ahli l-kitābi illā layu'minanna bihi qabla mawtihi wayawma l-qiyāmati yakūnu ʿalayhim shahīdan

Telugu మరియు గ్రంథ ప్రజల్లో ఎవడు కూడా అతనిని (ఈసాను), అతని మరణానికి పూర్వం (అతను, అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని), విశ్వసించకుండా ఉండడు. మరియు పునరుత్థాన దినమున అతను (ఈసా) వారిపై సాక్షిగా ఉంటాడు.

Verse 160

فَبِظُلْمٍ مِّنَ ٱلَّذِينَ هَادُوا۟ حَرَّمْنَا عَلَيْهِمْ طَيِّبَـٰتٍ أُحِلَّتْ لَهُمْ وَبِصَدِّهِمْ عَن سَبِيلِ ٱللَّهِ كَثِيرًا

Transliteration fabiẓul'min mina alladhīna hādū ḥarramnā ʿalayhim ṭayyibātin uḥillat lahum wabiṣaddihim ʿan sabīli l-lahi kathīran

Telugu యూదులకు వారు చేసిన ఘోర దుర్మార్గాలకు ఫలితంగానూ మరియు వారు, అనేకులను అల్లాహ్ మార్గంపై నడువకుండా ఆటంక పరుస్తూ ఉన్నందు వలననూ, మేము ధర్మసమ్మతమైన అనేక పరిశుద్ధ వస్తువులను వారికి నిషేధించాము;

Verse 161

وَأَخْذِهِمُ ٱلرِّبَوٰا۟ وَقَدْ نُهُوا۟ عَنْهُ وَأَكْلِهِمْ أَمْوَٰلَ ٱلنَّاسِ بِٱلْبَـٰطِلِ ۚ وَأَعْتَدْنَا لِلْكَـٰفِرِينَ مِنْهُمْ عَذَابًا أَلِيمًا

Transliteration wa-akhdhihimu l-riba waqad nuhū ʿanhu wa-aklihim amwāla l-nāsi bil-bāṭili wa-aʿtadnā lil'kāfirīna min'hum ʿadhāban alīman

Telugu మరియు వాస్తవానికి, వారికి నిషేధింపబడినా; వారు వడ్డీ తీసుకోవటం వలననూ మరియు వారు అధర్మంగా ఇతరుల సొమ్మును తినటం వలననూ, మరియు వారిలో అవిశ్వాసులైన వారి కొరకు మేము బాధాకరమైన శిక్షను సిద్ధ పరచి ఉంచాము.

Verse 162

لَّـٰكِنِ ٱلرَّٰسِخُونَ فِى ٱلْعِلْمِ مِنْهُمْ وَٱلْمُؤْمِنُونَ يُؤْمِنُونَ بِمَآ أُنزِلَ إِلَيْكَ وَمَآ أُنزِلَ مِن قَبْلِكَ ۚ وَٱلْمُقِيمِينَ ٱلصَّلَوٰةَ ۚ وَٱلْمُؤْتُونَ ٱلزَّكَوٰةَ وَٱلْمُؤْمِنُونَ بِٱللَّهِ وَٱلْيَوْمِ ٱلْـَٔاخِرِ أُو۟لَـٰٓئِكَ سَنُؤْتِيهِمْ أَجْرًا عَظِيمًا

Transliteration lākini l-rāsikhūna fī l-ʿil'mi min'hum wal-mu'minūna yu'minūna bimā unzila ilayka wamā unzila min qablika wal-muqīmīna l-ṣalata wal-mu'tūna l-zakata wal-mu'minūna bil-lahi wal-yawmi l-ākhiri ulāika sanu'tīhim ajran ʿaẓīman

Telugu కాని వారిలో పరిపూర్ణమైన జ్ఞానం గలవారు మరియు విశ్వాసులైనవారు, నీపై అవతరింపజేయబడిన దానిని మరియు నీకు పూర్వం అవతరింపజేయబడిన వాటిని విశ్వసిస్తారు. వారు నమాజ్ విధిగా సలుపుతారు, విధిదానం (జకాత్) చెల్లిస్తారు మరియు అల్లాహ్ యందు మరియు అంతిమ దినము నందు విశ్వాసం కలిగి ఉంటారు; ఇలాంటి వారికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము.

Verse 163

۞ إِنَّآ أَوْحَيْنَآ إِلَيْكَ كَمَآ أَوْحَيْنَآ إِلَىٰ نُوحٍ وَٱلنَّبِيِّـۧنَ مِنۢ بَعْدِهِۦ ۚ وَأَوْحَيْنَآ إِلَىٰٓ إِبْرَٰهِيمَ وَإِسْمَـٰعِيلَ وَإِسْحَـٰقَ وَيَعْقُوبَ وَٱلْأَسْبَاطِ وَعِيسَىٰ وَأَيُّوبَ وَيُونُسَ وَهَـٰرُونَ وَسُلَيْمَـٰنَ ۚ وَءَاتَيْنَا دَاوُۥدَ زَبُورًا

Transliteration innā awḥaynā ilayka kamā awḥaynā ilā nūḥin wal-nabiyīna min baʿdihi wa-awḥaynā ilā ib'rāhīma wa-is'māʿīla wa-is'ḥāqa wayaʿqūba wal-asbāṭi waʿīsā wa-ayyūba wayūnusa wahārūna wasulaymāna waātaynā dāwūda zabūran

Telugu (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నూహ్ కు మరియు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలకు సందేశం (వహీ) పంపినట్లు, నీకు కూడా సందేశం పంపాము. మరియు మేము ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ లకు మరియు అతని సంతతి వారికి మరియు ఈసా, అయ్యూబ్, యూనుస్, హారూన్ మరియు సులైమాన్ లకు కూడా దివ్యజ్ఞానం (వహీ) పంపాము. మరియు మేము దావూద్ కు జబూర్ గ్రంథాన్ని ప్రసాదించాము.

Verse 164

وَرُسُلًا قَدْ قَصَصْنَـٰهُمْ عَلَيْكَ مِن قَبْلُ وَرُسُلًا لَّمْ نَقْصُصْهُمْ عَلَيْكَ ۚ وَكَلَّمَ ٱللَّهُ مُوسَىٰ تَكْلِيمًا

Transliteration warusulan qad qaṣaṣnāhum ʿalayka min qablu warusulan lam naqṣuṣ'hum ʿalayka wakallama l-lahu mūsā taklīman

Telugu మరియు వాస్తవంగా, మేము పంపిన ప్రవక్తలలో కొందరి గాథలను నీకు తెలిపాము మరియు ఇతర ప్రవక్తలను గురించి మేము నీకు తెలుపలేదు. మరియు అల్లాహ్ మూసాతో నేరుగా మాట్లాడాడు.

Verse 165

رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى ٱللَّهِ حُجَّةٌۢ بَعْدَ ٱلرُّسُلِ ۚ وَكَانَ ٱللَّهُ عَزِيزًا حَكِيمًا

Transliteration rusulan mubashirīna wamundhirīna li-allā yakūna lilnnāsi ʿalā l-lahi ḥujjatun baʿda l-rusuli wakāna l-lahu ʿazīzan ḥakīman

Telugu (మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము. ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగల కూడదని! మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.

Verse 166

لَّـٰكِنِ ٱللَّهُ يَشْهَدُ بِمَآ أَنزَلَ إِلَيْكَ ۖ أَنزَلَهُۥ بِعِلْمِهِۦ ۖ وَٱلْمَلَـٰٓئِكَةُ يَشْهَدُونَ ۚ وَكَفَىٰ بِٱللَّهِ شَهِيدًا

Transliteration lākini l-lahu yashhadu bimā anzala ilayka anzalahu biʿil'mihi wal-malāikatu yashhadūna wakafā bil-lahi shahīdan

Telugu కాని (ఓ ప్రవక్తా!) అల్లాహ్ నీపై అవతరింపజేసిన దానికి (ఖుర్ఆన్ కు) సాక్ష్యమిస్తున్నాడు. ఆయన దానిని తన జ్ఞానంతో అవతరింపజేశాడు. మరియు దేవదూతలు కూడా దీనికి సాక్ష్యమిస్తున్నారు. మరియు ఉత్తమ సాక్షిగా అల్లాహ్ యే చాలు.

Verse 167

إِنَّ ٱلَّذِينَ كَفَرُوا۟ وَصَدُّوا۟ عَن سَبِيلِ ٱللَّهِ قَدْ ضَلُّوا۟ ضَلَـٰلًۢا بَعِيدًا

Transliteration inna alladhīna kafarū waṣaddū ʿan sabīli l-lahi qad ḍallū ḍalālan baʿīdan

Telugu నిశ్చయంగా, ఎవరైతే సత్య తిరస్కారులై, ఇతరులను అల్లాహ్ మార్గం వైపుకు రాకుండా నిరోధిస్తున్నారో వాస్తవానికి వారు మార్గభ్రష్టులై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయారు!

Verse 168

إِنَّ ٱلَّذِينَ كَفَرُوا۟ وَظَلَمُوا۟ لَمْ يَكُنِ ٱللَّهُ لِيَغْفِرَ لَهُمْ وَلَا لِيَهْدِيَهُمْ طَرِيقًا

Transliteration inna alladhīna kafarū waẓalamū lam yakuni l-lahu liyaghfira lahum walā liyahdiyahum ṭarīqan

Telugu నిశ్చయంగా ఎవరైతే సత్య తిరస్కారులై, అక్రమానికి పాల్పడతారో, వారిని అల్లాహ్ ఏ మాత్రమూ క్షమించడూ మరియు వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వమూ చేయడు.

Verse 169

إِلَّا طَرِيقَ جَهَنَّمَ خَـٰلِدِينَ فِيهَآ أَبَدًا ۚ وَكَانَ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرًا

Transliteration illā ṭarīqa jahannama khālidīna fīhā abadan wakāna dhālika ʿalā l-lahi yasīran

Telugu వారికి కేవలం నరక మార్గం మాత్రమే చూపుతాడు. అందులో వారు శాశ్వతంగా కలకాలం ఉంటారు. మరియు ఇది అల్లాహ్ కు ఎంతో సులభం.

Verse 170

يَـٰٓأَيُّهَا ٱلنَّاسُ قَدْ جَآءَكُمُ ٱلرَّسُولُ بِٱلْحَقِّ مِن رَّبِّكُمْ فَـَٔامِنُوا۟ خَيْرًا لَّكُمْ ۚ وَإِن تَكْفُرُوا۟ فَإِنَّ لِلَّهِ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَكَانَ ٱللَّهُ عَلِيمًا حَكِيمًا

Transliteration yāayyuhā l-nāsu qad jāakumu l-rasūlu bil-ḥaqi min rabbikum faāminū khayran lakum wa-in takfurū fa-inna lillahi mā fī l-samāwāti wal-arḍi wakāna l-lahu ʿalīman ḥakīman

Telugu ఓ మానవులారా! వాస్తవంగా మీ ప్రభువు తరఫు నుండి, సత్యాన్ని తీసుకొని మీ వద్దకు ఈ సందేశహరుడు వచ్చి వున్నాడు, కావున అతని మీద విశ్వాసం కలిగి ఉండండి, ఇదే మీకు మేలైనది. మరియు మీరు గనక తిరస్కరిస్తే! నిశ్చయంగా భూమ్యాకాశాలలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందినదని తెలుసుకోండి. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనా పరుడు.

Verse 171

يَـٰٓأَهْلَ ٱلْكِتَـٰبِ لَا تَغْلُوا۟ فِى دِينِكُمْ وَلَا تَقُولُوا۟ عَلَى ٱللَّهِ إِلَّا ٱلْحَقَّ ۚ إِنَّمَا ٱلْمَسِيحُ عِيسَى ٱبْنُ مَرْيَمَ رَسُولُ ٱللَّهِ وَكَلِمَتُهُۥٓ أَلْقَىٰهَآ إِلَىٰ مَرْيَمَ وَرُوحٌ مِّنْهُ ۖ فَـَٔامِنُوا۟ بِٱللَّهِ وَرُسُلِهِۦ ۖ وَلَا تَقُولُوا۟ ثَلَـٰثَةٌ ۚ ٱنتَهُوا۟ خَيْرًا لَّكُمْ ۚ إِنَّمَا ٱللَّهُ إِلَـٰهٌ وَٰحِدٌ ۖ سُبْحَـٰنَهُۥٓ أَن يَكُونَ لَهُۥ وَلَدٌ ۘ لَّهُۥ مَا فِى ٱلسَّمَـٰوَٰتِ وَمَا فِى ٱلْأَرْضِ ۗ وَكَفَىٰ بِٱللَّهِ وَكِيلًا

Transliteration yāahla l-kitābi lā taghlū fī dīnikum walā taqūlū ʿalā l-lahi illā l-ḥaqa innamā l-masīḥu ʿīsā ub'nu maryama rasūlu l-lahi wakalimatuhu alqāhā ilā maryama warūḥun min'hu faāminū bil-lahi warusulihi walā taqūlū thalāthatun intahū khayran lakum innamā l-lahu ilāhun wāḥidun sub'ḥānahu an yakūna lahu waladun lahu mā fī l-samāwāti wamā fī l-arḍi wakafā bil-lahi wakīlan

Telugu ఓ గ్రంథప్రజలారా! మీరు మీ ధర్మ విషయంలో హద్దుమీరి ప్రవర్తించకండి. మరియు అల్లాహ్ ను గురించి సత్యం తప్ప వేరే మాట పలుకకండి. నిశ్చయంగా, మర్యమ్ కుమారుడైన ఈసా మసీహ్ (ఏసు క్రీస్తు), అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఆయన (అల్లాహ్) మర్యమ్ వైపునకు పంపిన, ఆయన (అల్లాహ్) యొక్క ఆజ్ఞ (కలిమ) మరియు ఆయన (అల్లాహ్) తరఫు నుండి వచ్చిన ఒక ఆత్మ (రూహ్). కావున మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించండి. మరియు (ఆరాధ్య దైవాలు): "ముగ్గురు!" అని అనకండి. అది మానుకోండి, మీకే మేలైనది! నిశ్చయంగా, అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవం. ఆయనకు కొడుకు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు. ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు కార్యకర్తగా అల్లాహ్ మాత్రమే చాలు.

Verse 172

لَّن يَسْتَنكِفَ ٱلْمَسِيحُ أَن يَكُونَ عَبْدًا لِّلَّهِ وَلَا ٱلْمَلَـٰٓئِكَةُ ٱلْمُقَرَّبُونَ ۚ وَمَن يَسْتَنكِفْ عَنْ عِبَادَتِهِۦ وَيَسْتَكْبِرْ فَسَيَحْشُرُهُمْ إِلَيْهِ جَمِيعًا

Transliteration lan yastankifa l-masīḥu an yakūna ʿabdan lillahi walā l-malāikatu l-muqarabūna waman yastankif ʿan ʿibādatihi wayastakbir fasayaḥshuruhum ilayhi jamīʿan

Telugu తాను, అల్లాహ్ కు దాసుడననే విషయాన్ని మసీహ్ (క్రీస్తు) ఎన్నడూ ఉపేక్షించలేదు. మరియు ఆయనకు (అల్లాహ్ కు) సన్నిహితంగా ఉండే దేవదూతలు కూడాను. మరియు ఎవరు ఆయన (అల్లాహ్) దాస్యాన్ని ఉపేక్షించి, గర్వం ప్రదర్శిస్తారో వారందరినీ ఆయన తన ముందు సమావేశపరుస్తాడు.

Verse 173

فَأَمَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّـٰلِحَـٰتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ وَيَزِيدُهُم مِّن فَضْلِهِۦ ۖ وَأَمَّا ٱلَّذِينَ ٱسْتَنكَفُوا۟ وَٱسْتَكْبَرُوا۟ فَيُعَذِّبُهُمْ عَذَابًا أَلِيمًا وَلَا يَجِدُونَ لَهُم مِّن دُونِ ٱللَّهِ وَلِيًّا وَلَا نَصِيرًا

Transliteration fa-ammā alladhīna āmanū waʿamilū l-ṣāliḥāti fayuwaffīhim ujūrahum wayazīduhum min faḍlihi wa-ammā alladhīna is'tankafū wa-is'takbarū fayuʿadhibuhum ʿadhāban alīman walā yajidūna lahum min dūni l-lahi waliyyan walā naṣīran

Telugu కానీ, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారికి ఆయన వారి ప్రతిఫలాన్ని పూర్తిగా ప్రసాదిస్తాడు మరియు తన అనుగ్రహంతో మరింత అధికంగా ఇస్తాడు. ఇక ఆయనను నిరాకరించి, గర్వం వహించేవారికి బాధాకరమైన శిక్ష విధిస్తాడు; మరియు వారు తమ కొరకు - అల్లాహ్ తప్ప ఇతర రక్షించే వాడిని గానీ, సహాయపడే వాడిని గానీ పొందలేరు.

Verse 174

يَـٰٓأَيُّهَا ٱلنَّاسُ قَدْ جَآءَكُم بُرْهَـٰنٌ مِّن رَّبِّكُمْ وَأَنزَلْنَآ إِلَيْكُمْ نُورًا مُّبِينًا

Transliteration yāayyuhā l-nāsu qad jāakum bur'hānun min rabbikum wa-anzalnā ilaykum nūran mubīnan

Telugu ఓ మానవులారా! మీ ప్రభువు నుండి మీకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది. మరియు మేము మీపై స్పష్టమైన జ్యోతిని (ఈ ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము.

Verse 175

فَأَمَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ بِٱللَّهِ وَٱعْتَصَمُوا۟ بِهِۦ فَسَيُدْخِلُهُمْ فِى رَحْمَةٍ مِّنْهُ وَفَضْلٍ وَيَهْدِيهِمْ إِلَيْهِ صِرَٰطًا مُّسْتَقِيمًا

Transliteration fa-ammā alladhīna āmanū bil-lahi wa-iʿ'taṣamū bihi fasayud'khiluhum fī raḥmatin min'hu wafaḍlin wayahdīhim ilayhi ṣirāṭan mus'taqīman

Telugu కావున ఎవరు అల్లాహ్ ను విశ్వసించి, ఆయననే దృఢంగా నమ్ముకుంటారో, వారిని ఆయన తన కారుణ్యానికి మరియు అనుగ్రహానికి పాత్రులుగా చేసుకొని తన వద్దకు చేరే ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు.

Verse 176

يَسْتَفْتُونَكَ قُلِ ٱللَّهُ يُفْتِيكُمْ فِى ٱلْكَلَـٰلَةِ ۚ إِنِ ٱمْرُؤٌا۟ هَلَكَ لَيْسَ لَهُۥ وَلَدٌ وَلَهُۥٓ أُخْتٌ فَلَهَا نِصْفُ مَا تَرَكَ ۚ وَهُوَ يَرِثُهَآ إِن لَّمْ يَكُن لَّهَا وَلَدٌ ۚ فَإِن كَانَتَا ٱثْنَتَيْنِ فَلَهُمَا ٱلثُّلُثَانِ مِمَّا تَرَكَ ۚ وَإِن كَانُوٓا۟ إِخْوَةً رِّجَالًا وَنِسَآءً فَلِلذَّكَرِ مِثْلُ حَظِّ ٱلْأُنثَيَيْنِ ۗ يُبَيِّنُ ٱللَّهُ لَكُمْ أَن تَضِلُّوا۟ ۗ وَٱللَّهُ بِكُلِّ شَىْءٍ عَلِيمٌۢ

Transliteration yastaftūnaka quli l-lahu yuf'tīkum fī l-kalālati ini im'ru-on halaka laysa lahu waladun walahu ukh'tun falahā niṣ'fu mā taraka wahuwa yarithuhā in lam yakun lahā waladun fa-in kānatā ith'natayni falahumā l-thuluthāni mimmā taraka wa-in kānū ikh'watan rijālan wanisāan falildhakari mith'lu ḥaẓẓi l-unthayayni yubayyinu l-lahu lakum an taḍillū wal-lahu bikulli shayin ʿalīmun

Telugu వారు నిన్ను, (కలాలను) గురించి ధార్మిక శాసనం (ఫత్వా) అడుగుతున్నారు. అల్లాహ్ మీకు, కలాలను గురించి, ఈ విధంగా ధార్మిక శాసనం ఇస్తున్నాడని చెప్పు: "ఒక పురుషుడు మరణించి, అతనికి సంతానం లేకుండా ఒక సోదరి మాత్రమే ఉంటే, అతడు విడిచిన ఆస్తిలో ఆమెకు సగం వాటా లభిస్తుంది. పిల్లలు లేక చనిపోయిన సోదరి మొత్తం ఆస్తికి, అతడు (ఆమె నిజ సోదరుడు) వారసుడవుతాడు. అతనికి (మృతునికి) ఇద్దరు సోదరీమణులు ఉంటే, వారిద్దరికీ అతడు వదలిన ఆస్తిలో మూడింట రెండు వంతుల భాగం లభిస్తుంది. ఒకవేళ సోదర సోదరీమణులు (అనేకులుంటే) ప్రతి పురుషునికి ఇద్దరు స్త్రీల భాగానికి సమానంగా వాటా లభిస్తుంది. మీరు దారి తప్పకుండా ఉండటానికి అల్లాహ్ మీకు అంతా స్పష్టంగా తెలుపుతున్నాడు. మరియు అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.

Read Surah An-Nisa in another language

All languages

All 114 surahs in Telugu: the Qur’an in Telugu.

Learn it in MyDugsi

Telugu translation: Maulana Abder-Rahim ibn Muhammad, from Quran.com. Transliteration: Quran.com. Recitation: Mishary Alafasy, from EveryAyah.com. MyDugsi is a learning aid, not a replacement for a qualified teacher.